
పోలింగ్ బూత్‌లు ఉన్న ముత్తుకూరు జెడ్పీ హైస్కూల్ ప్రధాన ద్వారాన్ని అలంకరించిన దృశ్యం
ముత్తుకూరు/వెంకటాచలం: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ బూత్‌లను శనివారం సర్వాంగ సుందరంగా అలంకరించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రధాన పోలింగ్ బూత్‌లను రంగురంగుల బెలూన్లు, పూలదండలతో అలంకరించారు. ఓటర్లు నడిచే చోట తివాచీలు పరిచారు. అహ్లాదకర వాతావరణంలో ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేయాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకొందని అధికారులు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులను బూత్‌ల వద్దకు తీసుకు వెళ్లేందుకు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలు అమలు చేశారు.
వెంకటాచలం పోలింగ్ కేంద్రాన్ని పూలు, బెలూన్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన దృశ్యం..
చదవండి:
పోలింగ్‌కు దూరంగా బీజీకేపాళెం
రైతులకు భారం: నష్టాలు ‘కోకో’ల్లలు
Comments
Please login to add a commentAdd a comment