Festive Atmospheres
-
సత్సంకల్పం.. సత్సంవత్సరం
సాధారణంగా కొత్తసంవత్సరం వస్తోంది అంటే పండుగ వాతావరణం నెలకొంటుంది. సంవత్సరంతోపాటు తమ జీవితాలలో కూడా మార్పు వస్తుందనే ఆశతో అందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఎవరి పద్ధతులలో వారు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కొత్తసంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. విందులు, వినోదాలు, శుభాకాంక్షలు తెలుపుకోటం. ఒకటే సంబరం. రాబోయే కాలం ఆనందదాయకంగా ఉండాలనే ఆకాంక్ష, ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేయటంతోపాటు ఇంతకాలం జీవితాన్ని ఆనందంగా గడిపినందుకు, ఆ విధంగా గడిపే అవకాశం ఇచ్చినందుకుభగవంతుడికి కృతజ్ఞతని ఆవిష్కరించటం వీటిలోని అసలు అర్థం. సంవత్సరంలో మొదటిరోజు ఏ విధంగా గడిపితే సంవత్సరం అంతా అదేవిధంగా ఉంటుందని అందరి విశ్వాసం. కనుక వీలైనంత ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాలాన్ని నారాయణ స్వరూపంగా భావించి పూజించటం, ఆరాధించటం భారతీయ సంప్రదాయం. అంటే, ఆయా సమయాలలో ప్రకృతిలో వచ్చే మార్పులకి తగినట్టుగా ప్రవర్తించటం అందులో ఒక భాగం. నిత్యవ్యవహారానికి ప్రధానంగా చాంద్రామానాన్నేపాటించినా సంక్రమణాలు, విషువులు మొదలయినవి సూర్యమానానికి సంబంధించినవి. ప్రస్తుతం ప్రపంచం చాలావరకు సౌరమానాన్ని అనుసరిస్తోంది. ఇందులో సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఒకరకంగా లెక్క తేలిక. కాలచక్ర భ్రమణం వర్తులాకారంలో ఉంటుంది. ఎక్కడి నుండి లెక్క పెట్టటం మొదలుపెట్టామో అక్కడికి వచ్చి ఆగి మరొక ఆవృతం ప్రారంభం అవుతుంది. అందుకని ఎక్కడి నుండి అయినా లెక్కించటం మొదలు పెట్టవచ్చు.రాజకీయమైన అనేక వత్తిడుల కారణంగా చాలా మార్పులు, సద్దుబాట్లు జరిగిన తరువాత తయారైన గ్రెగేరియన్ కాలెండర్ ప్రకారం జనవరి ఒకటవ తేదీని కొత్త సంవత్సరప్రారంభ దినంగా నిర్ణయించటం జరిగింది. భూగోళాన్ని ఒక కుగ్రామంగా పరిగణిస్తున్న ఈ రోజుల్లో అందరూ ఒకే కాలమానాన్నిపాటించటం సౌకర్యం. వ్యక్తిగత ఇష్టానిష్టాలని పక్కకిపెట్టి అందరూ ‘‘కామన్ ఎరా’’ అని ప్రపంచంలో ఎక్కువ దేశాలలో అమలులో ఉన్న ఈ కాలమానాన్ని అనుసరిస్తున్నారు. చాంద్రమానాన్నిపాటించే భారతీయులు కూడా లౌకిక వ్యవహారాలకి కామన్ ఎరానే అనుసరిస్తున్నారు. విద్యాలయాలలో ప్రవేశానికి, ఉద్యోగ దరఖాస్తుకి,పాస్‌పోర్ట్, వీసా మొదలయిన వాటికి తేదీనే ఇస్తున్నాం కాని, తిథి, మాసం మొదలయిన వివరాలు ఇవ్వటం లేదు కదా! తమ వ్యక్తిగత, ఆధ్యాత్మిక వ్యవహారాలకి చాంద్రమానాన్నిపాటిస్తున్నారు. ఉదాహరణకి పుట్టిన రోజులు,పెళ్లి, గృహప్రవేశం మొదలయిన శుభ కార్యాల ముహూర్తాలు, పితృకార్యాలు మొదలైన వాటిని చాంద్రమానాన్ని అనుసరించి నిర్ణయిస్తారు. కాలం ఎవరికోసం ఆగదు. కాలచక్రంలో మరొక ఆకు ముందుకి కదిలింది. కొత్త ఆవృతం మొదలవుతోంది. అంటే మరొక సంవత్సరం కాలగర్భంలో కలిసింది. కొత్త సంవత్సరంప్రారంభం కాబోతోంది. కాని, అనుభవజ్ఞులైన పెద్దలు చేసే సూచన ఏమంటే జరిగిపోయిన సంవత్సరంలో ఏం చేశాము అని సమీక్షించుకుని, తీపి,చేదు అనుభవాలని నెమరు వేసుకుని, గెలుపోటములని, మానావమానాలని, బేరీజు వేసుకుని, తమ లక్ష్యాలని, లక్ష్యసాధన మార్గాలని నిర్ధారించుకుని, పనికిరానివాటిని పక్కకిపెట్టి, అవసరమైనవాటిని చేపడతామని నిర్ణయించుకోవలసిన సమయం ఇది అని. తమ ఆయుర్దాయంలో మరొక సంవత్సరం గడిచిపోయింది, చేయవలసిన పనులు త్వరగా చేయాలి అని తమని తాము హెచ్చరించుకోవాలి. అందుకే ఎంతోమంది ఒక చెడు అలవాటుని మానుతామనో, కొత్తపని ఏదైనా మొదలు పెడతామనో అని నూతన సంవత్సర నిర్ణయాలని ప్రకటిస్తూ ఉంటారు. రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆనందాన్ని ఇతోధికంగా ఇవ్వాలని, యుద్ధవాతావరణం ఉపశమించి ప్రపంచంలో శాంతి నెలకొనాలని, చేసుకున్న తీర్మానాలు అమలు జరిపే శక్తిసామర్థ్యాలు ప్రసాదించాలని ఒకరికొకరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుందాం. – డా. ఎన్.అనంతలక్ష్మి -
జపాన్‌లో పుష్పవిలాసం.. హనామీ ఫెస్టివల్.. జపాన్ జాతీయ పండుగ
రుతువులు మారే వేళ.. ప్రకృతి వింత అందాలను సంతరించుకున్న వేళ.. నింగిలోని కోటి తారలే నేలపై పూలై విరబూసే సమయాన.. ఒక పండుగ శోభ మది మదిని ఆహ్లాదపరుస్తుంది. రాలేటి పూలు రాగాలు పలికిస్తుంటే, పూసేటి పూలు సుగంధాలు వెదజల్లుతూ ఉంటే తెలుగువారు ఆమని పాడవే హాయిగా అని పాటలు పాడుకుంటారు. అదే జపాన్‌లో అయితే చెర్రీ బ్లాసమ్ (సకుర) చెట్ల కింద కూర్చొని వేడుకలు చేసుకుంటారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది చెర్రీ బ్లాసమ్ సీజన్ జపాన్ను ముందుగానే పలకరించింది. జపాన్ దేశవ్యాప్తంగా చెర్రీ బ్లాసమ్ చెట్లు ఎక్కడంటే అక్కడే కనిపిస్తాయి. సాధారణంగా మార్చి చివరి వారంలో ఈ చెట్లు విరగబూస్తాయి. కానీ ఈ ఏడాది పది రోజుల ముందే చెర్రీ బ్లాసమ్స్ పూసాయి. రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు నిండా తెలుపు, గులాబీ రంగుల్లో పువ్వులు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. కొన్ని చెట్లకు పసుపు, ఆకుపచ్చ రంగుల్లో కూడా పూలు పూస్తాయి. ఈ పూలు కేవలం 15 నుంచి నెల రోజుల వరకు మాత్రమే ఉండి ఆ తర్వాత నేల రాలిపోతాయి. అందుకే ఈ సీజన్లో జపాన్‌లో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. చెర్రీ బ్లాసమ్‌ని మహోత్సవంలా నిర్వహిస్తారు. దీనినే హనామీ ఫెస్టివల్ అంటారు. ఇది జపాన్ జాతీయ పండుగ. వెయ్యేళ్ల క్రితం నుంచే హనామీ ఉత్సవాలు జపాన్ నేలపై జరుగుతున్నాయి. ఈ సీజన్ ఎందరో కవుల హృదయాలను తట్టి లేపి దేశానికి అమృతంలాంటి కవిత్వాన్ని పంచి ఇచ్చింది. ఈ సీజన్లో ప్రజలు తమ బాధలన్నీ మర్చిపోయి రోజంతా చెట్ల కింద ఆడుకుంటారు. పాడుకుంటారు. ముచ్చట్లు చెప్పుకుంటారు. తింటారు. తాగుతారు. అక్కడే సేద తీరుతారు. పార్కులు, రోడ్డుకిరువైపులా చెర్రీలు కనువిందు చేస్తుంటే ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి చీర్స్ చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తారు. చైనా, కొరియా, తైవాన్, యూరప్, అమెరికా దేశాల్లో కూడా చెర్రీ బ్లాసమ్ చెట్లు ఉన్నప్పటికీ జపాన్‌లో చేసినట్టుగా ఒక పండుగలా వైవిధ్యభరితంగా మరెవరూ చేయరు. ఆహ్లాదంతో ఆదాయం ఈ పండుగ జపాన్ వాసులకు ఆహ్లాదాన్ని పంచడమే కాదు ఆదాయాన్ని కూడా భారీగా సమకూరుస్తుంది. ఈ సీజన్లో జపాన్‌కి పర్యాటకులు పోటెత్తుతారు. గత రెండు మూడేళ్లుగా కరోనా మహమ్మారితో ఈ పండుగ కాస్త కళ తప్పింది. ఈ ఏడాది అన్ని భయాలు తొలగిపోవడంతో జపాన్ వాసులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. మార్చి నుంచి ఏప్రిల్ వరకు కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్లు పూస్తే, దేశానికి ఉత్తరాదివైపు ఉండే హిరోసాకి వంటి నగరాల్లో మేలో పూలు పూస్తాయి. ఈ సీజన్లో చెర్రీ చెట్లు దేశ ఖజానాకు 61,580 కోట్ల యెన్ల ఆదాయం తెచ్చిపెడతాయి. ఈ సమయంలో జపాన్‌కు ఏటా 23 లక్షల విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ఈ సారి జపాన్‌కు బుకింగ్స్ గతం కంటే 70 శాతం ఎక్కువయ్యాయని ట్రావెలింగ్ సంస్థల గణాంకాలు వెల్లడించాయి. హనామీ పండుగలో పాల్గొనడానికి ముందస్తు బుకింగ్‌లకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. టోక్యోలో ప్రధాన కంపెనీలు దేశ విదేశాల్లోని తమ ప్రతినిధుల్ని చెర్రీ పిలిచి చెట్ల కిందే పార్టీలు చేసుకుంటాయి. అయితే ఈ చెట్లను ముందుగానే ప్రభుత్వం దగ్గర బుక్ చేసుకోవాల్సి ఉంటుంది! అలాగాక అప్పటికప్పుడు చెట్ల కింద పార్టీ చేసుకుందామంటే దొరకడం కష్టమే!! ఈ సీజన్లో జపాన్‌లో ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీల ఆదాయం ఓ రేంజ్లో ఉంటుంది. అవును మరి.. చెర్రీ అంటే ఏమనుకున్నారు. ఫ్లవర్ కాదు పవర్....!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది
న్యూఢిల్లీ: దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దేశంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా సమున్నతంగా ఎగరాలన్న ఉద్దేశంతో 13వ తేదీ నుంచి 15 వరకు ప్రతీ ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాని ఆవిష్కరించాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకొని రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎంతో ఉత్సాహంగా జాతీయ జెండాని ఆవిష్కృతం చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్చర్స్ కింద జాతీయ జెండా ఇమేజ్‌లను ఉంచుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన సతీమణితో కలిసి ఢిల్లీలోని తన నివాసంపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం మంత్రులు నేతలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘జాతీయ జెండా మనకి గర్వకారణం. భారతీయులందరినీ సమైక్యంగా ఉంచుతూ స్ఫూర్తి నింపుతుంది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనుల్ని అందరం స్మరించుకుందాం’’ అని షా ట్వీట్ చేశారు. గత పది రోజుల్లోనే పోస్టాఫీసుల ద్వారా ఒక కోటి జాతీయ జెండాలను విక్రయించినట్టుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇక గ్రామాలు, పట్టణాల్లోనూ జాతీయ జెండాకు సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం 25 లక్షల జెండాలను విద్యార్థులకు పంపిణీ చేస్తోంది. గుజరాత్లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ విద్యార్థులకు జెండాలు పంచారు. ప్రొఫైల్ పిక్చర్‌ని మార్చిన ఆరెస్సెస్ ఎట్టకేలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సామాజిక మాధ్యమాల్లో తన అకౌంట్లలో ప్రొఫైల్ పిక్చర్లో జాతీయ జెండాను ఉంచింది. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల్లో భాగంగా అందరూ జాతీయ జెండాలను ప్రొఫైల్ పిక్‌లుగా ఆగస్టు 2 నుంచి 15వరకు జాతీయ జెండాని ఉంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చినప్పటికీ ఆరెస్సెస్ ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. కాషాయ రంగు జెండానే ఉంచింది. దీంతో ఆరెస్సెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంతో ఆర్సెసెస్ తన ప్రొఫైల్ పిక్‌లో జాతీయ జెండాను ఉంచింది. -
తివాచీలు.. బెలూన్లు: ఆహ్లాదకరంగా పోలింగ్ కేంద్రాలు
ముత్తుకూరు/వెంకటాచలం: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ బూత్‌లను శనివారం సర్వాంగ సుందరంగా అలంకరించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రధాన పోలింగ్ బూత్‌లను రంగురంగుల బెలూన్లు, పూలదండలతో అలంకరించారు. ఓటర్లు నడిచే చోట తివాచీలు పరిచారు. అహ్లాదకర వాతావరణంలో ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేయాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకొందని అధికారులు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులను బూత్‌ల వద్దకు తీసుకు వెళ్లేందుకు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలు అమలు చేశారు. వెంకటాచలం పోలింగ్ కేంద్రాన్ని పూలు, బెలూన్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన దృశ్యం.. చదవండి: పోలింగ్‌కు దూరంగా బీజీకేపాళెం రైతులకు భారం: నష్టాలు ‘కోకో’ల్లలు -
లోటస్ పాండ్ వద్ద పండుగ వాతావరణం
-
లోటస్ పాండ్ వద్ద పండుగ వాతావరణం
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరై....నేడు విడుదల కానున్న సందర్భంగా ఆయన నివాసం లోటస్ పాండ్‌లో సందడి వాతావరణం నెలకొంది. అభినందనలు తెలిపేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చినవారితో లోటస్ పాండ్ పరిసరాల్లో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. జగన్ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపేందుకు పార్టీ నాయకులు కూడా లోటస్ పాండ్‌కు తరలి వస్తున్నారు.