
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తోన్న ఆదరణ చూసి తట్టుకోలేకనే పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండి పడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘బీజేపీ, జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. సీఎం జగన్‌ని ఎదుర్కొలేకనే తెర వెనక రాజకీయాలు నడుపుతున్నారు. పవన్ కల్యాణ్‌కు సొంత అభిప్రాయం అంటూ ఏమి లేదు. ఆయన రాత్రి ఓ పార్టీతో.. పగలు ఓపార్టీతో తిరుగుతుంటారు’’ అని సజ్జల విమర్శించారు.
‘‘ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు సీఎం జగన్‌కు అండగా నిలిచారు. ఓట్ల రూపంలో తమ ఆశీర్వాదాన్ని తెలుపుతున్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను మెచ్చి జనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం కట్టబెట్టారు. తిరుపతి ఉప ఎన్నికలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి పోయారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇచ్చినా హామీలన్నింటిని అమలు చేశాం’’ అని సజ్జల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment