రిలే నిరాహార దీక్షలలో పాల్గొని నిరసన తెలియజేస్తున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు
తాడికొండ: రాష్ట్రంలో బహుజనుల హక్కులను కాలరాసి వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వారిని అడుగడుగునా అణగదొక్కుతూ కులోన్మాదాన్ని ప్రోత్సహించి లాభపడాలని చూసిన చంద్రబాబుకు ఇక రాజకీయ సన్యాసమే మిగిలిందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 215వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
తిరుపతి ఉప ఎన్నికలో కులమతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబును అక్కడి ఓటర్లు, బహుజనులు ఏకమై బుద్ధి చెప్పారన్నారు. త్వరలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడు రాజధానులు రావడం ఖాయమనేది స్పష్టమైందన్నారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి కోసం ప్రభుత్వం ఇక మూడు రాజధానుల ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాధం, నత్తా యోనారాజు, ఈపూరి ఆదాం పలువురు దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
చదవండి: నిన్ను నమ్మం బాబూ..
జననేత వైపే జనం
Comments
Please login to add a commentAdd a comment