
లయబద్ధంగా మోగుతున్న గంట
శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిత్రమైన ఘటన మంగళవారంచోటు చేసుకుంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమ్మవారి సన్నిధి సమీపంలో ఉన్న కాలభైరవ మూర్తికి మంగళవారం రాత్రి ఏకాంతసేవకు మునుపు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వరకు తీసుకెళ్లారు.
చదవండి: త్వరలో ఐదు రూట్లలో టెంపుల్ టూరిజం
అక్కడ భక్తులు, మోతగాళ్లు ఊరేగిస్తుండగా అమ్మవారి ధ్వజస్తంభం పక్కనే ఉన్న విజయస్తంభంలోని నాలుగు గంటల్లో ఓ గంట లయబద్ధంగా ఊగుతూ తిరగడం భక్తులకు ఆశ్చర్యం కలిగించింది. ఆ సమయంలో గాలికేమైనా అలా ఊగుతూ మోగిందా అనుకోవడానికి పెద్దగా గాలి కూడా లేదు. ఒకవేళ గాలికే ఊగితే నాలుగు గంటలూ మోగాలి కదా!? పరమశివుడే అలా ఆనందపారవశ్యంతో నాట్యం చేస్తున్నాడన్నట్లుగా ఉందని భక్తులు ఎవరికి తోచినట్లు వారు భావించారు. దీనిని కొందరు వీడియో తీయడంతో బుధవారం సామాజిక మాధ్యమాల్లో బాగావైరల్ అయింది.