srikalahasti temple
-
Sai Dharam Tej Photos: శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించిన సాయిధరమ్ తేజ్ (ఫోటోలు)
-
వివాదంలో మెగా హీరో.. అసలేం జరిగిందంటే?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా ఇటీవలే విరూపాక్షతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. అయితే శ్రీకాళహస్తి ఆలయంలో సాయి ధరమ్ తేజ్ చేసిన పనికి వివాదం మొదలైంది. (ఇది చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!) శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. అక్కడ సుబ్రమణ్యస్వామివారికి తానే స్వయంగా హారతి ఇచ్చారు. ఇదే హీరోకు తలనొప్పిగా మారింది. అయితే నియమాల ప్రకారం స్వామివారికి ఆలయ అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలని భక్తులు అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ హారతి ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!) -
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు శుక్రవారం కలిశారు. శ్రీకాళహస్తీశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వనించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి స్వామివారి తీర్ధ ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసిన వేద పడింతులు.. వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 26 వరకు శ్రీ కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. చదవండి: గొప్ప చదువులతోనే పేదల తలరాతలు మారుతాయి: సీఎం జగన్ -
రాహుకేతు పూజల్లో 22 మంది బ్రెజిల్ దేశస్తులు.. అందుకోసమే ఇక్కడికి!
సాక్షి, శ్రీకాళహస్తి(తిరుపతి): శ్రీకాళహస్తీశ్వరాలయానికి బ్రెజిల్ దేశస్తులు 22 మంది యువతీ, యువకులు సోమవారం విచ్చేశారు. రూ.500 టికెట్ తీసుకుని రాహుకేతు పూజలు చేయించుకున్నారు. గతంలో తమ దేశానికి చెందిన వారు ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకున్నారని, వారికి మంచి జరగడంతోనే తాము వచ్చామని తెలిపారు. ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉందన్నారు. చదవండి: (AP: 66 డిప్యూటీ కలెక్టర్ పోస్టులపై కసరత్తు!) -
శ్రీకాళహస్తీశ్వరాలయంలో వింత ఘటన.. ఆశ్చర్యంలో భక్తులు
శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిత్రమైన ఘటన మంగళవారంచోటు చేసుకుంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమ్మవారి సన్నిధి సమీపంలో ఉన్న కాలభైరవ మూర్తికి మంగళవారం రాత్రి ఏకాంతసేవకు మునుపు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వరకు తీసుకెళ్లారు. చదవండి: త్వరలో ఐదు రూట్లలో టెంపుల్ టూరిజం అక్కడ భక్తులు, మోతగాళ్లు ఊరేగిస్తుండగా అమ్మవారి ధ్వజస్తంభం పక్కనే ఉన్న విజయస్తంభంలోని నాలుగు గంటల్లో ఓ గంట లయబద్ధంగా ఊగుతూ తిరగడం భక్తులకు ఆశ్చర్యం కలిగించింది. ఆ సమయంలో గాలికేమైనా అలా ఊగుతూ మోగిందా అనుకోవడానికి పెద్దగా గాలి కూడా లేదు. ఒకవేళ గాలికే ఊగితే నాలుగు గంటలూ మోగాలి కదా!? పరమశివుడే అలా ఆనందపారవశ్యంతో నాట్యం చేస్తున్నాడన్నట్లుగా ఉందని భక్తులు ఎవరికి తోచినట్లు వారు భావించారు. దీనిని కొందరు వీడియో తీయడంతో బుధవారం సామాజిక మాధ్యమాల్లో బాగావైరల్ అయింది. -
శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో పీవీ సింధు (ఫొటోలు)
-
విగ్రహాల ప్రతిష్ఠ కేసు: ముగ్గురి అరెస్ట్
సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తి ఆలయంలో కలకలం రేపిన కొత్త విగ్రహాల ప్రతిష్ఠ ఘటన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరుకు చెందిన సుధాకర్, తిరుమలయ్య,సూలవర్థన్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి మీడియాకు మంగళవారం వెల్లడించారు. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆలయంలో విగ్రహాలు పెట్టారని, సీసీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించామని తెలిపారు. అన్ని ఆధారాలతో నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. దోష నివారణ కోసం విగ్రహాలు ప్రతిష్టించినట్లుగా విచారణలో వెల్లడైందని తెలిపారు. ఈ నెల 2న విగ్రహాలు చేయించి, 6న ఆలయంలో పెట్టినట్లు విచారణలో తేలిందని తెలిపారు. సీసీ టీవీ విజువల్స్, ద్విచక్రవాహనాల నెంబర్లు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు రమేష్‌రెడ్డి తెలిపారు. -
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముక్కంటి దర్శనానికి అనుమతి
సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తీశ్వరాలయంలో రేపటి నుంచి ముక్కంటి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆలయ పరిపాలనా భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు(బుధవారం) ఆలయంలో స్వామి, అమ్మవార్లకు శాంతి అభిషేకాల తర్వాత ఉద్యోగులు, మీడియా ప్రతినిధులతో ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. 11 నుంచి స్థానికులు దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. 12 నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయ ప్రవేశం కల్పిస్తామన్నారు. ఆధార్ కార్డు తీసుకురావడంతో పాటు మాస్కు ధరించిన వారికే ఆలయ ప్రవేశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భక్తుల మధ్య క్యూలైన్లలో ఆరడగుల భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే దర్శనాలు ఉంటాయన్నారు. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు అన్ని రకాల టికెట్లతో కలిపి మొత్తం గంటకు 300 మందికి మాత్రమే అనుమతిస్తామన్నారు. అర్జీత సేవలు, అభిషేకాలు, కల్యాణోత్సవం, హోమ పూజలు చేసుకోవడానికి భక్తులకు అనుమతి లేదని చెప్పారు. నిత్యాన్న ప్రసాదం, ఉచిత ప్రసాదం పంపిణీ నిలిపివేశామని వెల్లడించారు. తీర్థం, అర్చనలు రద్దు చేశామని తెలిపారు. వృద్ధులు, పది సంవత్సరాల లోపు పిల్లలకు ఆలయ ప్రవేశం లేదని ఈవో చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
పురాణపండ శ్రీనివాస్‌కు ఆర్కే రోజా ప్రశంసలు
శ్రీకాళహస్తి: శ్రీశైలం దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘శివోహమ్’ గ్రంథాన్ని మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరునికి బహూకరించారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేతుల మీదుగా ‘శివోహామ్’ గ్రంథం స్వామివారికి సమర్పించడం పట్ల శ్రీకాళహస్తి పండిత అధికార బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఆలయ పండితులు ఈ గ్రంథాన్ని రచించిన పురాణపుండ శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. తొలి ప్రతిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఆర్కె రోజా అందజేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధానంలో దివ్య మంగళకరమైన గ్రంథాన్ని ఆవిష్కరించి, భక్తులకు అందజేయడం తన పురాకృత జన్మసుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ గ్రంథాన్ని రచించిన పురాణపండ శ్రీనివాస్‌కు ఆర్కే రోజా ప్రశంసలు తెలిపారు. శివరాత్రి శుభవేళని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ‘శివోహమ్’ గ్రంధాలను అర్చక, వేదపండిత, భక్తులకు ఉచితంగా వితరణ చేశారు. రాజకీయాలలోనే కాకుండా భక్తి కార్యక్రమాల్లో కూడా ఎంతో శ్రద్ధగా ఎమ్మెల్యే రోజా పాల్గొనడం తమకు ఆనందం కలిగించిందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి ఆమెను అభినందించారు. ‘శివోహమ్’ గ్రంథాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, విశాఖపట్నం, నగరి, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాలలో కూడా వేలకొలది భక్తులకు గ్రంథ రచయిత పురాణపుండ శ్రీనివాస్ పంపిణీ చేశారు. -
నిమ్మకాయల కోసం వారు పోటీ పడ్డారు..
చిత్తూరు, శ్రీకాళహస్తి: పట్టణంలోని ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అర్జున తపస్సు కార్యక్రమం వేడుకగా జరిగింది. వేలాది మంది భక్తులు హాజరుకావడంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. కౌరవులతో యుద్ధం చేసేందుకు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసే ఘట్టం ఆధారంగా ఈ ఉత్సవం చేపట్టారు. అర్జునుడి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి,ఊరేగింపుగా తపస్సు మాను వద్దకు తీసుకువచ్చి అర్చకులు పూజలు నిర్వహించారు. అర్జున వేషధారి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ పద్యాలు పాడుతూ ఒక్కో మెట్టు ఎక్కారు. మాను పైకెక్కిన అనంతరం వెంట తీసుకెళ్లిన నిమ్మకాయలు, విబూది పండ్లను కిందికి విసిరారు. ఈ నిమ్మకాయలను ఇంటి పూజా మందిరంలో ఉంచుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో నిమ్మకాయల కోసం వారు పోటీ పడ్డారు. చుట్టు పక్కల మం డలాల నుంచి వేలాదిగా విచ్చేసిన భక్తజ నంతో ఆలయ పరిసరా లు కిక్కిరిశాయి. ఆలయంలోనూ ఉదయం నుంచి రద్దీ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
చేసేపని మంచిదైతే..అవాంతరాలన్నీ చిన్నబోతాయ్..
దైవక్షేత్రాల్లో ఈఓ స్థాయి ఉద్యోగం చేయడమంటే కత్తిమీద సామే. అయితే తండ్రి అడుగుజాడలు, భర్త ప్రోత్సాహంతోనే సుదీర్ఘకాలం ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతున్నా. చిన్నతనం నుంచి నాకు ఓ ప్రగాఢ విశ్వాసం ఉంది. అదేంటంటే.. ‘మనం చేసే పని మంచిదైతే అవాంతరాలన్నీ చిన్నబోతాయని’. ఈ సిద్ధాంతాన్ని నమ్మి వృత్తిలో సేవే పరమావధిగా త్రికరణశుద్ధితో పనిచేస్తున్నాను.. అంటూ శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దర్బముళ్ల భ్రమరాంబ ‘సాక్షి’తో తన భావాలను పంచుకున్నారు. మాది సంప్రదాయ కుటుంబం. నలుగురు అక్కచెల్లెళ్లం. సొంతూరు విజయనగరం జిల్లా అయినా మా తండ్రి సుబ్బారావు ఉద్యోగరీత్యా విశాఖలో స్థిరపడ్డారు. మా కుటుంబంలో కట్టుబాట్లు ఎక్కువే. చదువులకు బయటకు పంపడానికి నాన్న ఒప్పుకునేవారు కాదు. అయితే బలవంతంగా ఒప్పించి మెట్రిక్యులేష న్ పూర్తి చేశాను. మా తండ్రి దేవా దాయశాఖలో పనిచేస్తూ 1982లో మృతి చెందారు. మా అక్కచెల్లెళ్లలో ఏ ఒక్కరూ ఆయన స్థానంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకురాకపోవడంతో నేను 18 ఏట ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి దేవాదాయశాఖలో వివిధ కేడర్లలో ఉద్యోగం చేసి, ప్రస్తుతం శ్రీకాళహస్తి పవిత్ర పుణ్యక్షేత్రం కార్యనిర్వాహణాధికారిగా విధులు నిర్వహిస్తున్నా ను. నా భర్త ప్రసాద్ విశాఖపట్నంలో ఎల్ఐసీ హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగ పరంగా ఆయన నాకు ఎంతో అండ. లింగవివక్షతో ఉద్యోగ విరమణకు పూనుకున్నా.. స్వతహాగా మహిళను కావడంతో ఉద్యోగరీత్యా అనేక సందర్భాల్లో నేను లింగవివక్షను ఎదుర్కొన్నాను. ఒకానొ క దశలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం 2013లో రాష్ట్ర దేవాదాయ శాఖకు విన్నవించాను. అయితే వారు నా పనితనాన్ని మెచ్చి నా ఉద్యోగ విరమణ దరఖాస్తును తిరస్కరించారు. అప్పటి నుంచి ఉద్యోగరీత్యా చొరవ తీసుకుని పనిచేసే భావన నాలో పెరిగింది. బాధ్యతల్లో ఆత్మసంతృప్తి.. విజయనగరం జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో అనేక ఒత్తిళ్లు చవి చూశా. అయితే ఉద్యోగ ధర్మమే నన్ను నడిపించింది. విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాను. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మూడుసార్లు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించే అదృష్టం నాకు దక్కింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మద్దతుగా ఉండడంతో పాటు శ్రీకాళహస్తి పాలక మండలి, అధికారుల సహకారంతో మహాకుంభాభిషేకంతో పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి చేయగలిగా. ఇక ఆలయ మాస్టర్‌ప్లాన్ పూర్తిచేస్తే ముక్కంటీశునికి నా సేవ పరిపూర్ణమైనట్లు భావిస్తా. -
కరుగుతున్న వెండి కొండలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో వెండి నిల్వలు కొండల్లా పేరుకుపోతున్నాయి. శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల ఇలా ప్రముఖ దేవాలయాల్లో వేల కిలోల వెండి నిల్వలు ఉన్నాయి. వీటిని భద్రపరచడం ఆయా దేవస్థానాలకు భారంగా మారింది. బ్యాంకుల్లో వెండిని డిపాజిట్ చేస్తే వడ్డీ ఇచ్చే విధానం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని బ్యాంకుల్లో బాండ్ల రూపంలో దాచుకునే పథకాన్ని ప్రకటించి వడ్డీ కూడా చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేవాలయాలు తమ వద్ద ఉన్న వెండి నిల్వలను అమ్మి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏకంగా 21 వేల కిలోల వెండి నిల్వలు ఉన్నాయి. శని దోష నివారణకు భక్తులు శ్రీకాళహస్తిలో రాహు–కేతు పూజలు నిర్వహించి వెండి నాగ పడగలను సమర్పిస్తుంటారు. ఇక్కడే కాకుండా.. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల ఆలయాల్లో కూడా ప్రతి చోటా వెయ్యి కిలోలకు పైగా వెండి నిల్వలు పేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని బాండ్ల రూపంలో దాచుకునే పథకాన్ని ప్రకటించడంతో.. దేవుడి బంగారు ఆభరణాలను డిపాజిట్ చేస్తే బ్యాంకులు వాటి విలువ ఆధారంగా ఆలయానికి వడ్డీ చెల్లించే వెసులుబాటు ఏర్పడింది. వెండి నిల్వలను డిపాజిట్ చేస్తే వడ్డీ చెల్లించే విధానం లేకపోవడంతో వాటిని అమ్మేందుకు జేఎస్వీ ప్రసాద్ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వెండిని అమ్మి బంగారంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికనుగుణంగా డిసెంబర్లో శ్రీకాళహస్తి ఆలయం తమ దగ్గర ఉన్న వెండి నిల్వల్లో 14,935 కిలోల అమ్మకానికి ఈ – వేలం నిర్వహించింది. 10,282 కిలోల వెండితో 100 కిలోల బంగారం శ్రీకాళహస్తిలో 14,935 కిలోల వెండి ఆభరణాలను కరిగించగా.. కడ్డీల రూపంలో స్వచ్ఛమైన వెండి 10,282 కిలోలు వచ్చింది. ఈ వెండి కడ్డీలను ప్రభుత్వ రంగ సంస్థ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ)కి అమ్మగా రూ.33.29 కోట్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తంతో ఎంఎంటీసీ ద్వారా తిరిగి వంద కిలోల బంగారాన్ని కొనుగోలు చేశారు. ఈ బంగారాన్ని బాండ్ల రూపంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నట్టు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలంలో 2,400 కిలోల వెండి ఆభరణాలు ఉండగా, అందులో 500 కిలోలను కరిగించగా కడ్డీల రూపంలో స్వచ్ఛమైన వెండి 375 కిలోలు వచ్చినట్టు శ్రీశైల ఆలయ అధికారులు చెప్పారు. ఈ 375 కిలోల వెండిని ఎంఎంటీసీ ద్వారా అమ్మగా రూ.1.36 కోట్లు వచ్చాయి. ఈ మొత్తంతో 4.353 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. -
లోకేష్ సీఎం కావాలనే క్షుద్రపూజలు: అంబటి
సాక్షి, హైదరాబాద్: నారా లోకేశ్‌కు వెంటనే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కోసమే ఆయన తల్లి భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో క్షుద్రపూజలు జరిపించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. లోకేశ్ కోసం చంద్రబాబు కుటుంబం దేవాలయాల్లో తాంత్రిక పూజలు చేసినట్లు లోకమంతా కోడైకూస్తోందన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 26వ తేదీన విజయవాడ దుర్గగుడిలో, డిసెంబర్ 18వ తేదీన శ్రీకాళహస్తి కాలభైరవ ఆలయంలో మద్యం సమర్పించి జంతువులను బలిచేసి తాంత్రిక పూజలు నిర్వహించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. తాంత్రిక పూజలపై నిజనిర్ధారణ కమిటీ వల్ల ఉపయోగం లేదని, ఆ నివేదిక ప్రభుత్వానికే అనుకూలంగా ఉంటుందన్నారు. -
క్షుద్ర పూజలపై విచారణ జరిపించండి
-
మన ఆలయాలు వెండి కొండలు
ఏడు ప్రధాన దేవాలయాల్లో 31,467 కిలోల వెండి ఆభరణాల నిల్వలు - శ్రీకాళహస్తి ఆలయంలో అత్యధికంగా 21 వేల కిలోల వెండి - ప్రతి ఆలయంలో 100 కిలోలకు తక్కువ కాకుండా వెండి ఆభరణాలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో బంగారానికి పోటీగా వెండి ఆభరణాల నిల్వలు పేరుకుపోతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం కాకుండానే రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో 31,467 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తీశ్వరస్వామి వారికి భక్తులు 20,966.585 కిలోల వెండిని కానుకల రూపంలో సమర్పించారు. శని దోష నివారణకు శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో రాహు–కేతు పూజలకు భక్తులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. శనిదోష పూజలో ఉపయోగించిన వెండి నాగ పడగలను ఆలయ హుండీలో సమర్పించడం ఆనాదిగా ఆచరిస్తున్న సంప్రదాయం. దశాబ్దాలుగా ఈ పూజలు చేయించుకున్న ప్రతి భక్తుడు వెండి నాగ పడగల ఆభరణాలను స్వామి వారికి సమర్పించుకోవడంతో ఆలయంలో వెండి నిల్వలు భారీగా పేరుకుపోయాయి. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 2,033 కిలోలు, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి ఆలయ ఖజానాలో 2,442 కిలోల వెండి ఆభరణాలున్నాయి. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయ ఖజానాలో 1,815 కిలోలు, సింహాచలం వరలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ఖజానాలో 1,996 కిలోల వెండి నగలున్నాయి. రాష్ట్రంలో ఏటా రూ.5 కోట్లకుపైగా ఆదాయం వచ్చే ఆలయాలు 16 ఉండగా, వీటిలో ప్రతి ఆలయంలో కనీసం 100 కిలోలకు తక్కువ కాకుండా వెండి ఆభరణాలుండడం విశేషం. శ్రీకాళహస్తి ఆభరణాలు కడ్డీల రూపంలోకి... శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో వెండి ఆభరణాల స్వీకరణ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ఆలయంలో వెండి 2012 నాటికే దాదాపు 21,000 కిలోలకు చేరింది. ఏటా పెరిగిపోతున్న వెండి నిల్వలను భద్రపరచడం కష్టసాధ్యంగా మారడంతో 2013 నుంచి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానం వద్ద నిల్వ ఉన్న వెండి ఆభరణాలను కరిగించి, కొత్తగా పూజకు ఉపయోగించే నాగ పడగలను చేయిస్తున్నారు. వాటినే పూజా సమయంలో భక్తులకు విక్రయిస్తున్నారు. వెండి ఆభరణం ఖర్చును కూడా పూజ టికెట్ ధరలోనే కలిపి వసూలు చేస్తున్నారు. ఇలా భక్తులు సమర్పించే ఆభరణాలను కరిగించి, కొత్త భక్తులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఆలయంలో ఉన్న 21,000 కిలోల వెండిలో 2,300 కిలోలను ప్రత్యేకంగా కరిగించి, రీసైక్లింగ్ పద్ధతిన రాహు–కేతు పూజకు ఉపయోగించే నాగ పడగలు తయారీకి కేటాయించారు. మిగిలిన 18,000 కిలోలకు పైగా వెండి ఆభరణాలను కరిగించి, కడ్డీల రూపంలోకి మార్చి, ఆలయ స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. రోజువారీ అవసరాలకు ఉపయోగించే ఆభరణాలు మినహా మిగిలిన బంగారు నగలను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, వాటిపై ఆలయానికి వడ్డీ జమ అవుతుంది. అయితే, వెండి ఆభరణాల విషయంలో ఇలాంటి వెసులుబాటు లేదు. అందుకే నిల్వ ఉన్న వెండిని బంగారం రూపంలోకి మార్చాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. -
ముక్కంటి సేవలో నటి శ్రీదేవి
శ్రీకాళహస్తి: సినీ నటి శ్రీదేవి తమ కుటుంబ సభ్యులతో బుధవారం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేశారు. వారికి ఆలయాధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించి అర్చన చేయించుకొని తీర్థప్రసాదాలు పుచ్చుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. వారితోపాటు ఆలయ చైర్మన్ సీసీ సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. ఆలయ అర్చకులతోపాటు పలుపురు పోటీలు పడి ఆమెతో ఫోటోలు తీసుకున్నారు. -
శ్రీకాళహస్తి ఆలయంలో తప్పిన పెనుప్రమాదం
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఆలయం ప్రాంగణంలోని అన్నదానం మండపంలో బాయిలర్ పేలింది. దీంతో అక్కడున్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలం సమీపంలో 40 సిలిండర్లు ఉన్నాయి. వంట చేయడం కోసం వీటిని అక్కడ ఉంచారు. బాయిలర్ పేలిన ఘటనలో మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
సంతానం కోసం వచ్చా : సినీనటి అనిత
శ్రీకాళహస్తిః సంతానం కోసం శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహుకేతు పూజలు చేయించుకుంటే తప్పకుండా సంతానం లభిస్తోందని మా మిత్రులు చెప్పారు.దాంతో కుటుంబసభ్యులతో కలసి విచ్చేసినట్లు సినీనటి అనిత అన్నారు.సోమవారం ఆమె కుటుంబసభ్యులతో కలసి రాహుకేతు పూజలు చేయించుకున్నారు.అనంతరం స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణంలోని పొగడ చెట్టు వద్ద సంతానం కోసం ప్రదక్షణలు చేశారు.సంతానంతో పాటు మనలో ఒకడు అనే చిత్రంలో తాను నటించానని...ఆ చిత్రం విజయవంతం కావాలని శివపార్వతులను కోరుకున్నట్లు చెప్పారు.ఆలయ శిల్పసౌందర్యం అద్భుతంగా ఉందని కొనియాడారు.వారితోపాటు ఆలయు ధర్మకర్తల మండలి సభ్యులు లోకనాధంనాయిడు,నారాయణయాదవ్ ఉన్నారు. -
గది కోసం గన్‌తో బెదిరింపులు
ఆలయ ఉద్యోగిపై రిటైర్డ ఉన్నతాధికారి దౌర్జన్యం! పోలీసుల విచారణ శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయంలోని అతిథి భవనాల్లో అద్దె గది ఇవ్వలేదని ఓ రిటైర్డ్ ఉన్నతాధికారి గన్‌తో ఉద్యోగిని గురువారం అర్ధరాత్రి బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలో వారి వుధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు చర్చసాగుతోంది. వురోవైపు పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో డీఎస్పీ వెంకటకిశోర్ శుక్రవారం ఆలయు ఈవో భ్రవురాంబతో కలిసి విచారణ చేపట్టారు. ఆలయు అద్దె గదులు ఇస్తున్న ఉద్యోగులను విచారించారు. అంతేకాకుండా సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్‌ను పరిశీలించారు. ఆ అధికారికి లెసైన్స్ ఉన్న తూపాకీ ఉండడంతో గతంలో కూడా అనేక సార్లు ఆలయూనికి దర్శనానికి వచ్చే సవుయుంలో తూపాకీని తీసుకువచ్చారని ఆలయూధికారులు అంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలా గన్‌తో బెదిరించలేదని పేర్కొంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయంలో రాత్రి సవుయుంలోను ఆలయు భద్రత పెంచాల్సి ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. గన్మెన్లు ఉన్నారని చెప్పారు అద్దె గది ఇవ్వాలని కడప జిల్లాకు చెందిన ఓ వూజీ ఉన్నతాధికారి గురువారం రాత్రి ఆలయు ఉద్యోగిని కోరారని డీఎస్పీ వెంకటకిశోర్ తెలిపారు. ఆయున నిర్లక్ష్యంగా సవూధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వా దం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ మా జీ ఉన్నతాధికారి తనకు గన్‌తోపాటు గన్మెన్లు ఉన్నారని, తాను ప్రొటోకాల్ ఉన్న వ్యక్తిగా చెప్పారని, గన్‌తో ఆలయు ఉద్యోగిని బెదరించలేదని తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆలయ ఈవో భ్రమరాంబతో కలిసి ఆలయుంలో విచారణ చేశామన్నారు. -
'అమ్మ' మొక్కు చెల్లించిన మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో అన్నాడీఎంకే పార్టీ నార్త్-సౌత్ తిరువాతినాగర్ దిగాల్ మాజీ ఎమ్మెల్యే వడివేలు నీలకంఠం మొక్కు తీర్చుకున్నారు. జయలలిత తమిళనాడు సీఎం కావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు శనివారం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 'అమ్మ' మొక్కును చెల్లించుకున్నారు. 66 కేజీల 543 గ్రాముల 860 మిల్లీల బరువు గల వెండి పూజా సామాగ్రిని స్వామివారి మూలమట్టం వెండి హారతి పళ్లెంలు, వెండి తాంబూలం తట్టలు, వెండి బిందెను ఆలయ కార్యనిర్వహణాధికారికి అందజేశారు. గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధినేత జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని వడివేలు నీలకంఠం శ్రీకాళహస్తి ఆలయంలో మొక్కుకున్నారు. అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ.. సుమారు వీటి విలువ రూ. 32 లక్షల 66వేల 439 ఉంటుందని వెల్లడించారు. అనంతరం ఆయనకు శ్రీకాళహస్తి ఆలయ ఈవో.. స్వామి, అమ్మవార్ల దర్శనం ఏర్పాటు చేసి దక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ఆశీర్వాదం ఇప్పించి వారికి తీర్ధప్రసాదాలు ఇచ్చారు. -
నేనూ వీఐపీనే
► శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోతో ధర్మకర్తల మండలి సభ్యుడి వాగ్వాదం ► చివరకు సహచర సభ్యుల జోక్యంతో సహస్రలింగేశ్వరస్వామి వద్దే పూజలు శ్రీకాళహస్తి : ఆలయు ధర్మకర్తల వుండలి సభ్యుడైన నేను వీఐపీనే. సహస్రలింగేశ్వరస్వామి వద్ద పూజలు చేసుకోవడానికి అర్హత లేదా ? అంటూ సీతారావుయ్యు ఈవో భ్రమరాంబను ప్రశ్నించారు. దాంతో వారి వుధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.శుక్రవారం శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల వుండ లి సభ్యుడు సీతారావుయ్యు, ఆయన కువూర్తెతో కలిసి స్వా మివారి సమీపంలోని సహస్రలింగేశ్వరస్వామి వద్ద రూ. 2500 టికెట్ ద్వారా రాహుకేతు పూజలు చేసుకోవడానికి వె ళ్లారు. అరుుతే ఆలయు పీఆర్వో వి.బాబు వీఐపీలకు వూ త్రమే సహస్రలింగేశ్వరస్వామి వద్ద పూజలు చేరుుంచాలని ఈవో ఆదేశించారని, వీఐపీలు కానివారిని రూ.2500 టికెట్ తీసుకున్నా....వినాయుకస్వామి ఆలయుం ఉన్న వుండలంలో పూజలు చేరుుంచాలని ఈవో ఆదేశించారని చెప్పారు. ఆమె అనువుతి ఇస్తేనే సహస్రలింగేశ్వరస్వామి వద్ద పూజలు చేరుుస్తావుని స్పష్టం చేశారు. దాంతో సీతారావుయ్యు ఫోన్లో ఈవోతో వూట్లాడారు. ఆమె ధర్మకర్తల వుండలి సభ్యులకు సహస్రలింగేశ్వరస్వామి వద్ద రాహుకేత పూజలు చేసుకునే అర్హత ఉంది. కానీ కుటుంబసభ్యులకు అవకాశం లేదని చెప్పారు. దాంతో ఆయున వాగ్వాదానికి దిగారు. చివరకు సీతారావుయ్యు కువూర్తెతో కలిసి తిరిగి వెళ్లిపోతుండగా తోటి ధర్మకర్తల వుండలి సభ్యులు చిట్టివేలు జయుగోపాల్, గుర్రప్పశెట్టి,కండ్రిగ ఉవు జోక్యం చేసుకుని సహస్రలింగేశ్వరస్వామి సన్నిధిలోనే వారికి రాహుకేతు పూజలు చేరుుంచారు. -
శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో అగ్ని ప్రమాదం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఆలయ ప్రధా న ద్వారం భిక్షాల గోపురం సమీపంలో గురువారం రాత్రి 11.16 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 20 దుకాణాలు పూర్తిగాను, 15 దుకాణాలు పాక్షికం గా కాలిపోయాయి. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. పది నిమిషాలకే యంత్రంలో నీరు అయిపోయింది. అగ్నిమాపక యంత్రం నీటి కోసం భరద్వాజతీర్థం వద్దకు వెళ్లింది. ఇంతలో మంటలు తారస్థాయికి చేరుకున్నాయి. కొంతమేరకు అదుపు చేసినప్పటికీ ఇంకా మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. దుకాణాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను వెంటనే పక్కకు తరలించారు. విద్యుత్ సరఫరా ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆలయ ఆవరణలో అగ్ని ప్రమాదం జరగడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయు చైర్మన్ గురవయ్యనాయుడు, పలువురు సభ్యులు, డీఎస్పీ వెంకటకిశోర్ అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయుత్నం చేస్తున్నారు. నీటి కొరతతో ఇబ్బందులు తప్పడంలేదు. రాత్రి 12.30 గంటలకు మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. పలువురు దుకాణదారులు ఏళ్ల తరబడి ఆలయానికి చెందిన విద్యుత్‌నే వినియోగిస్తున్న విషయుం తెలిసిందే. ఇటీవల తప్పనిసరిగా ప్రైవేటుగా మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆలయ అధికారులు ఆదేశించారు. దీంతో కొందరు అడ్డదిడ్డంగా విద్యుత్ వైర్లు లాక్కున్నారు. ఈ క్రమంలోనే షార్ట్‌సర్క్యూట్ అయిందని స్థానికులు అంటున్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలోనే ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఉండడంతో ఖాతాదారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. -
మాస్కో టు శ్రీకాళహస్తి
-
మాస్కో టు శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి (చిత్తూరు): ఇప్పటికే ఖండాంతరాలకు పాకిన శ్రీకాళహస్తీశ్వర మహత్యానికి సోమవారం మరో రుజువు లభించింది. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేస్తే శుభం జరుగుతుందనే విశ్వాసంతో రష్యాకు చెందిన 16 మంది భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస్కో నగరం నుంచి వచ్చిన వీరు రూ.2,500 టిక్కెట్ కొనుగోలు చేసి రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం ఆలయుంలోని స్వామి, అవ్మువార్లతోపాటు పరివార దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఆలయు ఆవరణలో 30 నిమిషాలపాటు ధ్యానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహుకేతు పూజలు చేసుకుంటే వివాహం కాని వారికి పెళ్లవుతుందనీ, సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుందని మాస్కోలో ఉంటున్న చెన్నైకి చెందిన వారు చెప్పారని, అందుకే ఇక్కడికి వచ్చామని, ఆలయు శిల్పసౌందర్యం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. -
శ్రీకాళహస్తిలో నిలిచిన పూజలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి, వాయులింగేశ్వర స్వామి దేవాలయంలో రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. శనివారం ఆలయంలో పువ్వులు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాహుకేతు పూజలతోపాటు ఆలయంలో పూజలు కూడా ఆగిపోయాయి. అయితే శనివారం కావడంతో శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తారు. పూజలు నిలిచిపోవడంతో భక్తులు ఆలయం వెలుపలకు బారులు తీరారు. పూజల కోసం పువ్వుల తీసుకువచ్చేందుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. -
దేవస్థానమా..మున్సిపాలిటీనా ?
- శ్రీకాళహస్తి గుడిని సందర్శించిన దేవాదాయశాఖ కమిషనర్ - శుభ్రత పాటించలేదనిఅధికారులపై ఆగ్రహం - ఆలయ ఉద్యోగులు పీఆర్వో కార్యాలయంలో ఏంచేస్తారని నిలదీత - గోపురబాధితుల భయంతో బిక్షాలగోపురాన్ని పరిశీలించని వైనం శ్రీకాళహస్తి ఆలయంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని దేవాదాయ శాఖ కమిషనర్ అధికారులపై మండిపడ్డారు. దేవస్థానమా.. మున్సిపాలిటీనా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి: ‘శ్రీకాళహస్తి దేవస్థానం ఏడాదికి వందకోట్లకు పైగా ఆదాయం వస్తున్న ఆలయాల జాబితాల్లో ఉంది.. అయినా శుభ్రత పాటించడంలేదు.. దేవస్థానమా..మున్సిపాలిటీనా’ అంటూ దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ ఆలయాధికారులపై మండిపడ్డారు. సోమవారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ఆమె ఆలయాన్ని పరిశీలించారు. దేవస్థానంలో తడి ప్రదేశం ఉండకూడదని.. అయినా పలుచోట్ల నీటి తడి ఎందుకు ఉందని ప్రశ్నించారు. పారిశుద్ధ్యం కోసం లక్షలు ఖర్చుచేస్తున్నట్లు రికార్డులు చూపుతున్నారు... శుభ్రత మాటేంటి ? అని ప్రశ్నించారు. దేవస్థానంలో ప్రధానంగా క్యూ పద్ధతి పాటించడంలేదని పలువురు ఫిర్యాదు చేశారని, క్యూ పద్ధతిని కచ్చితంగా పాటించాలని ఈవో రామిరెడ్డిని హెచ్చరించారు. ఇప్పుడున్న రెండు క్యూలుకాకుండా మరొకటి ఏర్పాటు చేయాలని సూచించారు. పీఆర్వో కార్యాలయంలో ఎవరి కోసం ఏడుగురిని నియమించారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానం లోపల భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలు వేగవంతంగా ముందుకు సాగేలా చూడడానికి సిబ్బంది అవసరమని, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఏడుగురిని ఇక్కడ నియమించడం సరికాదని చెప్పారు. పీఆర్వో కార్యాలయంలో గుంపులు గుంపులుగా కూర్చొని కాలక్షేపం చేయడం తగదని మందలించారు. ఈవో రూ.1500 రాహుకేతు పూజలను ఆలయం లోపల నుంచి బయటకు మార్పుచేస్తున్నట్లు తెలిపారు. ఆమె ఆ మండపాన్ని, అన్నదాన మండపాన్ని పరిశీలించారు. ఆమె చివరగా బిక్షాలగోపురాన్ని పరిశీలించడానికి వెళ్లారు. అయితే అదే ప్రాంతంలో గాలిగోపురం బాధితులు తమకు న్యాయం చేయాలంటూ నిలదీయాలని వేచి ఉండటంతో ఆమె కారులో నుంచే బిక్షాలగోపురాన్ని చూస్తూ వెళ్లిపోయారు. -
మంత్రిగారి భార్యా మజాకా
చిత్తూరు: అసలే మంత్రిగారు. అటు ప్రభుత్వం, ఇటు ప్రవేటుగా అనేక కార్యక్రమాలతో నిత్యం మహాబిజీగా ఉంటారు. ఇక అలాంటి వారికి ఆసుపత్రులు, దేవాలయాలు... వాటిని తనిఖీలు నిర్వహించాలంటే సమయం ఉండదు. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ మంత్రిగారి భార్య తనిఖీలను తమ భుజానికి ఎత్తుకున్నారు. మంత్రిగారి సొంత నియోజకవర్గంలోని అత్యంత ప్రముఖ దేవాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన కాళహస్తి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ గురువారం రాహు - కేతు దేవాలయంలో తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా రాహు కేతు మండపం, ప్రసాదాల పోటు, వివిధ విభాగాలను తనిఖీలు నిర్వహించారు. దాంతో ఆలయ అధికారులు, సిబ్బంది హడలిపోయి... ఆమె వెంట పరుగులు తీశారు. అయితే బృందమ్మ తీరుపై స్థానికంగా, భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఏ హోదాలో బృందమ్మ తనిఖీలు నిర్వహించరని భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
శ్రీకాళహస్తి ఆలయ దర్శన వేళలు, రేట్లు
సేవ సమయం రుసుము గోపూజ ఉ. 4-30 గం. రూ. 50 సుప్రభాతం ఉ. 5 గం. రూ. 50 సహస్రనామార్చన అభిషేక వేళలలో రూ. 200 త్రిశతి అర్చన అభిషేక వేళలలో రూ. 125 క్షీరాభిషేకం అభిషేక వేళలలో రూ. 100 పచ్చకర్పూరాభిషేకం అభిషేక వేళలలో రూ. 100 (స్వామి వారికి) రుద్రాభిషేకం అభిషేక వేళలలో రూ. 600 పంచామతాభిషేకం అభిషేక వేళలలో రూ. 300 నిత్య దిట్ట అభిషేకం అభిషేక వేళలలో రూ. 100 శనేశ్వరాభిషేకం ఉ’ 10, సా. 5గం రూ. 150 అఖండ దీపారాధన సా. 6 గం రూ. 100 ప్రత్యేక ప్రవేశము అన్ని వేళలలో రూ. 50 కుంకుమార్చన అన్ని వేళలలో రూ. 25 శనేశ్వరార్చన అన్ని వేళలలో రూ. 5 నిత్య కళ్యాణోత్సవం ఉ.11 గం రూ. 501 రుద్రహోమము ఉ.11 గం. రూ. 1116 చండీ హోమం ఉ.11 గం రూ. 1116 స్వర్ణ కమలార్చన సా. 5 గం రూ. 1000 (శుక్రవారం మాత్రమే) ఆశీర్వచన దర్శనము అన్ని వేళలు రూ. 500 రాహుకేతు పూజ ఉ. 6 నుండి రూ. 300 రాత్రి 8 వరకు రాహుకేతుపూజలు రూ. 750 రాహుకేతు పూజలు రూ. 1500 ప్రత్యేక రాహుకేతుపూజ రూ. 2500 ఏకాంత సేవ రాత్రి 9-30 గం. ఉచితం వాహనపూజలు అన్ని వేళలు రూ. 25 -
ఆలయంలో మంత్రి బొజ్జల భార్య హల్చల్
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భార్య బృందమ్మ హల్చల్ చేశారు. శనివారం ఆలయంలోని అన్ని విభాగాలను తనిఖీలు చేసిన బృందమ్మ, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చేయిస్తానని ఆలయ అధికారులకు హెచ్చరికలు జారీచేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి, ఆలయ ఈవో రామ్‌రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగి 24 గంటలు గడవక ముందే మంత్రి భార్య తనిఖీలు అంటూ హల్చల్ చేయడం తీవ్ర దుమారమైంది. మహాశివరాత్రి ఉత్సవాల టెండర్ల వ్యవహారంలో రాధారెడ్డి, రామ్‌రెడ్డిల మధ్య శుక్రవారం నాడు విభేదాలు తలెత్తడంతో గొడవ జరిగిన విషయం తెలిసిందే. -
అష్టోత్తరలింగ మండపాన్ని తొలగించాల్సిందే
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయంలో కుంగిన అష్టోత్తరలింగ మండపాన్ని తొలగించాల్సిందేనని ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ), చెన్నై రిటైర్డ్ ప్రొఫెసర్ నరసింహారావు సూచించారు. ఆరు రోజుల క్రితం శ్రీకాళహస్తి ఆలయంలోని కంచుగడప సమీపంలో ఉన్న అష్టోత్తరలింగ మండపం కుంగిన విషయం తెలిసిందే. దీన్ని పరిశీలించడానికి చెన్నైకి చెందిన ఐఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్, గోపురాల ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యుడు నరసింహారావును ఆలయ అధికారులు పిలిపించారు. మరో నిపుణుడు జీఎస్ రెడ్డితో కలసి ఆయన అష్టోత్తరలింగ మండపాన్ని, ఆలయంలోని నాలుగు గోపురాలను, చిన్న చిన్న మండపాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ అష్ఠోత్తరలింగ మండపాన్ని మరమ్మతులు చేస్తే సరిపోదు. పూర్తిగా తొలగించి నూతన మండపాన్ని నిర్మించాల్సిందే. మండప బీమ్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఏక్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మండప బీమ్‌కు ఆధారంగా చెక్కలు ఒక్కచోట పెడితే సరిపోదు. పదిచోట్ల చెక్కలు ఏర్పాటు చేయాలి. ఈ మార్గంలో భక్తుల రాకపోకలను పూర్తిగా నిలిపివేయండి. ఆలయంపైన పిచ్చిమొక్కలు, కొబ్బరి చిప్పలు నూనె డబ్బాలు ఉంచవద్దు అని సూచించారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులు మండపం మొత్తం బీమ్‌కు ఆధారంగా చెక్కలను పెట్టారు. ఆమేరకు నూతన మండపం నిర్మాణానికి ఆలయ ఈఈ రామిరెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. మండపం తొలగింపునకు రూ.1.5 లక్షలు, నూతన మండప నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. -
శ్రీకాళహస్తీశ్వరాలయంలో 105 మందికాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు
శ్రీకాళహస్తి: చంద్రబాబు వస్తే..జాబ్ వస్తుంది.. అనే నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ వరుసగా జాబ్‌లు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాబ్‌లు ఇవ్వడం మాట దేవుడికెరుక..ఉన్న ఉద్యోగాలను ఇబ్బముబ్బడిగా తొలగిం చేస్తున్నారు. మొన్నటి వరకు ఆదర్శరైతులు, ఉపాధి పథకం క్షేత్ర సహాయకులు,స్కిట్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులను వందల సంఖ్యలో తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాళహస్తి దేవస్థానంలో పనిచేస్తున్న 105 మంది కాంట్రాక్ట్ కార్మికులను మంగళవారం తొలగించారు. బాధితులు ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ బిక్షాలగోపురం వద్ద రిలే దీక్షలు ప్రారంభిం చారు. వారికి వైఎస్సార్ సీపీ నాయకులు,సీఐటీయూ నాయుకులు మద్దతుగా నిలిచారు. శ్రీకాళహస్తి దేవస్థానం పరిధిలో పదేళ్లుగా 105మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. రెండేళ్లకు ఒక కాం ట్రాక్టర్ ఆధ్వర్యంలో సిబ్బంది పనిచేస్తున్నారు. నాలుగు నెలల క్రితం యువశేఖర్ అనే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ గడువు ముగిసింది. ఆ తర్వాత వేసిన కాంట్రాక్ట్ర్ డాక్యుమెంట్స్ సక్రమంగా లేకపోవడంతో టెండర్ రద్దు చేశారు. అయినప్పటికీ 105 మంది సిబ్బందిని కొనసాగిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 1వతేదీ(సోమవారం) సాయంత్రం తొలగిం చినట్లు వారికి సమాచారం ఇచ్చారు. దాంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయంటూ బాధితులు ఆలయం వద్ద ఆందోళకు దిగారు. సీఐటీయూ నాయకులు రఫి, పుల్లయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు మిద్దెల హరి, అంజూరు శ్రీనివాసులు, చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి,బాలాజీ,అంక య్య తదితరులు మద్దతివ్వడంతో బిక్షాలగోపురం వద్ద నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయుకులు మాట్లాడుతూ పదేళ్లుగా పనిచేస్తు న్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిం చడం సరికాదన్నారు. దేవాదాయశాఖ క మిషనర్ వారికి రోజుకు రూ.295 చెల్లిం చాలని జీవో విడుదల చేసినా ఆలయాధికారులు రోజుకు రూ.115 చెల్లిస్తున్నారని, అరుునా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూనే ఉన్నారని తెలిపారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సుబ్రమణ్యం,లక్ష్మి,శ్రీదేవి, అ మరావతి, నాగభూషణమ్మ, రేణుక, మల్లీశ్వరి, సుబ్బమ్మ, బత్తెమ్మ,గురవమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి కోటి ఆదాయం.... ఆలయానికి అవసరమైన మేరకు కాం ట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. అదనం గా ఉన్నవారిని మాత్రమే తొలగించారు. ఆలయానికి ఏడాదికి సుమారు రూ. కో టి ఆదాయం వస్తోంది. నాలుగు నెలల క్రితమే కాంట్రాక్ట్ గడువు ముగిసింది. నూతనంగా వేసిన టెండర్ రద్దు అయిం ది. అయినా నాలుగు నెలలుగా కొనసాగించాం.అదనపు సిబ్బంది అవసరం లేదు. ఉన్న సిబ్బందే సరిపోతారు. -శ్రీనివాసరావు,ఆలయ ఈవో. -
శివ శివా ఎంత నిర్లక్ష్యం
నాడు గాలిగోపురం కూలింది నేడు మండపం కుంగింది కొబ్బరిచిప్పలు, నూనెడబ్బాలు పిచ్చిమొక్కలతో దెబ్బతిన్న ఆలయం స్తపతుల ఆదేశాలు సరే.. ఆచరణ మాటేంటో? శ్రీకాళహస్తి: గోపురం కూలినా, ఆలయపైకప్పు పెచ్చులూడి పడుతున్నా కాళహస్తీశ్వరాలయూధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్ల కిందట ఆలయగోపురమే కూలిపోగా, శుక్రవారం ఆల యంలో ఒకమండపం కుంగిపోయింది. ఆలయం పైభాగంలో పిచ్చిమొక్కలు మొలిచినా పట్టించుకోకపోవడం, నూనె డబ్బాలు, కొబ్బరిచిప్పలు ఎండబెట్టడం కారణంగా ఆలయగోడలు దెబ్బతింటున్నాయి. శ్రీకాళహస్తి దేవస్థానంతో పాటు పలు మండపాలు, గోపురాలు మరమ్మతులు చేయించాలని రెండేళ్ల క్రితమే అప్పటి రాష్ట్ర దేవాదాయశాఖ స్తపత్తులు వేలు, సుందరాజన్ పలుసార్లు ఆల యాన్ని పరిశీలించి ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. చిన్నపాటి వర్షాలకే ఆలయగోడలు తడి సి ముద్దవుతున్నాయి. పిచ్చిమొక్కల కారణంగా ఆలయ గోడలు పగుళ్లు వస్తున్నాయి. ఆలయ గాలిగోపురం 2010 మే 26వ తేదీ కుప్పకూలిపోయింది. నాలుగేళ్లు గడుస్తున్నా గోపురం పనులు పునాదులకే పరిమితమయ్యూయి. ఆ తరువాత ఆరు నెలల వ్యవధిలోనే కైలాసగిరి కొండల్లో వేయిలింగాల కోనలోని సహస్రలింగేశ్వరస్వామి ముఖద్వార గాలిగోపురం కుప్పకూలే దిశలో ఉందని స్థానికులు గుర్తించడంతో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజుల వ్యవధిలోనే జ్ఞానప్రసూనాంబ, భిక్షాలగోపురం పైభాగం నుంచి కలశరాళ్లు, ఆలయంలోపల దక్షిణామూర్తి పైభాగం నుంచి రాళ్లు, గురుదక్షిణామూర్తి వద్ద ఆలయ పైకప్పు పెచ్చులు ఊడిపడిన విషయం తెలిసిందే. అయినా అధికారులు ఆ సమయం లో మాత్రమే స్పందించడం.. .హంగామా చేయడం ఆ తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. తాజాగా అష్టోత్తరలింగం మండపం కుంగడం..కూలడానికి సిద్ధంగా ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. కుంభాభిషేకం చేయాలని భావిస్తున్నాం... ఆలయంలో త్వరలో కుంభాభిషేకం చేయాలని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయించాలని రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులకు తెలియజేశాం. వారు సానుకూలంగా స్పందిం చారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. -శ్రీనివాసరావు, ఆలయ ఈవో -
అగ్నిగుండంలో పడిపోయిన బాలుడు
-
కాంట్రాక్ట్ అధ్యాపకుడి ఆత్మహత్యాయత్నం
ఉద్యోగం నుంచి తొలగిస్తామన్న ప్రకటనతో ఆందోళన.. శ్రీకాళహస్తి: కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తామని ప్రభ్తుత్వం ప్రకటించడంతో మనస్తాపానికి గురైన ఓ అధ్యాపకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోమవారం చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న స్కిట్ (శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ) కళాశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కిట్ కళాశాలను శ్రీకాళహస్తి దేవస్థానం నిర్వహిస్తోంది. ఆరేళ్లుగా ఇక్కడ 63 మంది కాంట్రాక్ట్ కింద అధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రతి పదకొండు నెలలకు ఒకసారి తొలగించి మరలా వారినే కాంట్రాక్ట్ విధానంలో కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రస్తుతం వారందరినీ తొలగించి నైపుణ్యం ఉన్నవారిని అవసరమైన (10శాతం) మేరకు తీసుకుంటామని కళాశాల ప్రిన్సిపాల్ ప్రకటించారు. దీంతో శ్రీకాళహస్తికి చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకుడు తులసీకృష్ణ ఆందోళనకు గురై సోమవారం కళాశాలలోనే విషపుగుళికలు మింగి స్పృహతప్పి పడిపోయాడు. ఆయనను విద్యార్థులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గించే పనిలో భాగంగానే ఇంటర్వ్యూల ద్వారా అవసరమైన మేరకు నైపుణ్యం కలిగినవారిని మాత్రమే తీసుకుంటున్నామని తెలిపారు.