శ్రీకాళహస్తి: చంద్రబాబు వస్తే..జాబ్ వస్తుంది.. అనే నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ వరుసగా జాబ్‌లు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాబ్‌లు ఇవ్వడం మాట దేవుడికెరుక..ఉన్న ఉద్యోగాలను ఇబ్బముబ్బడిగా తొలగిం చేస్తున్నారు. మొన్నటి వరకు ఆదర్శరైతులు, ఉపాధి పథకం క్షేత్ర సహాయకులు,స్కిట్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులను వందల సంఖ్యలో తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాళహస్తి దేవస్థానంలో పనిచేస్తున్న 105 మంది కాంట్రాక్ట్ కార్మికులను మంగళవారం తొలగించారు. బాధితులు ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ బిక్షాలగోపురం వద్ద రిలే దీక్షలు ప్రారంభిం చారు. వారికి వైఎస్సార్ సీపీ నాయకులు,సీఐటీయూ నాయుకులు మద్దతుగా నిలిచారు.
శ్రీకాళహస్తి దేవస్థానం పరిధిలో పదేళ్లుగా 105మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. రెండేళ్లకు ఒక కాం ట్రాక్టర్ ఆధ్వర్యంలో సిబ్బంది పనిచేస్తున్నారు. నాలుగు నెలల క్రితం యువశేఖర్ అనే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ గడువు ముగిసింది. ఆ తర్వాత వేసిన కాంట్రాక్ట్‌ర్ డాక్యుమెంట్స్ సక్రమంగా లేకపోవడంతో టెండర్ రద్దు చేశారు. అయినప్పటికీ 105 మంది సిబ్బందిని కొనసాగిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 1వతేదీ(సోమవారం) సాయంత్రం తొలగిం చినట్లు వారికి సమాచారం ఇచ్చారు. దాంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయంటూ బాధితులు ఆలయం వద్ద ఆందోళకు దిగారు.
సీఐటీయూ నాయకులు రఫి, పుల్లయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు మిద్దెల హరి, అంజూరు శ్రీనివాసులు, చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి,బాలాజీ,అంక య్య తదితరులు మద్దతివ్వడంతో బిక్షాలగోపురం వద్ద నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయుకులు మాట్లాడుతూ పదేళ్లుగా పనిచేస్తు న్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిం చడం సరికాదన్నారు. దేవాదాయశాఖ క మిషనర్ వారికి రోజుకు రూ.295 చెల్లిం చాలని జీవో విడుదల చేసినా ఆలయాధికారులు రోజుకు రూ.115 చెల్లిస్తున్నారని, అరుునా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూనే ఉన్నారని తెలిపారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సుబ్రమణ్యం,లక్ష్మి,శ్రీదేవి, అ మరావతి, నాగభూషణమ్మ, రేణుక, మల్లీశ్వరి, సుబ్బమ్మ, బత్తెమ్మ,గురవమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఆలయానికి కోటి ఆదాయం....
ఆలయానికి అవసరమైన మేరకు కాం ట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. అదనం గా ఉన్నవారిని మాత్రమే తొలగించారు. ఆలయానికి ఏడాదికి సుమారు రూ. కో టి ఆదాయం వస్తోంది. నాలుగు నెలల క్రితమే కాంట్రాక్ట్ గడువు ముగిసింది. నూతనంగా వేసిన టెండర్ రద్దు అయిం ది. అయినా నాలుగు నెలలుగా కొనసాగించాం.అదనపు సిబ్బంది అవసరం లేదు. ఉన్న సిబ్బందే సరిపోతారు. -శ్రీనివాసరావు,ఆలయ ఈవో.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో 105 మందికాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు
Published Wed, Sep 3 2014 2:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement