Contract employees
-
తొలగింపు కుదరదు.. ఇకపై వద్దు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధమని, ఇకపై రెగ్యులరైజ్ చేయడం చెల్లదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం 1994లోని సెక్షన్ 10ఏ చెల్లదని.. చట్టవిరుద్ధమైన ఈ సెక్షన్‌ను రద్దు చేస్తున్నామని తేల్చిచెప్పింది. ఏళ్లుగా పని చేస్తున్న, ఇప్పటికే క్రమబద్ధీకరించిన కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చట్ట ప్రకారం జరగాలని, క్రమబద్ధీకరణ కుదరదని చెప్పింది. నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పాక్షికంగా అనుమతించినట్లు పేర్కొంది. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా వీరిని క్రమబద్ధీకరించారని, సెక్షన్ 10ఏను చేరుస్తూ తెచ్చిన జీవో 16 చట్టవిరుద్ధమంటూ పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన.. సెట్‌కు క్వాలిఫై అయిన పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో దాదాపు 5,544 మంది ఉద్యోగులకు ఊరట లభించింది. పిటిషనర్ల వాదన.. ‘జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులను 1993, డిసెంబర్ 30న జీవో 302తో ప్రవేశపెట్టిన సర్వీస్ రూల్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనల్లోని రూల్ 3.. జూనియర్ లెక్చరర్ల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి లేదా పదోన్నతితో భర్తీ చేయాలని చెబుతోంది. డిగ్రీ లెక్చరర్లకూ ఇలాంటి నిబంధనే వర్తిస్తుంది. మేమంతా జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులకు నిబంధనల మేరకు అర్హులం. జూనియర్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులను కాలేజ్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేలా ఆంధ్రప్రదేశ్ కాలేజ్ సర్వీస్ కమిషన్ చట్టం 1985ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ చట్టం 2001లో రద్దయింది. ఆ తర్వాత నుంచి పారదర్శక విధానం లేకుండా కాంట్రాక్టు విధానంలో ఎంపిక కమిటీ పోస్టులను భర్తీ చేయడం ప్రారంభించింది. 2002 తర్వాత నుంచి నేరుగా ఈ పోస్టులను భర్తీ చేయలేదు. ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ కోసం 2016, ఫిబ్రవరి 26న ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సెక్షన్ 10ఏను చేరుస్తూ ప్రభుత్వం జీవో16ను తెచ్చింది. దీంతో అర్హతలు లేని వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు’ అని పిటిషనర్లు వాదించారు. విద్యాశాఖ వాదన.. ‘పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 మేరకు.. నిర్ణీత వ్యవధిలో ఇప్పటికే ఉన్న చట్టాన్ని సవరణ చేసే, రద్దు చేసే వీలు సర్కార్‌కు ఉంది. 2014, జూన్ 2కు ముందున్న వారినే క్రమబద్దీకరణ, రిజర్వేషన్లు కూడా వర్తింపు.. ఇలా సెక్షన్ 10ఏలో ఆరు నిబంధనలు చేర్చి ఆ మేరకే క్రమబద్దీకరించాం. భవిష్యత్తులో మరిన్ని పోస్టులను భర్తీ చేయనున్నందున నిరుద్యోగ యువత అవకాశాలను జీవో 16 నిర్వీర్యం చేస్తుందన్న పిటిషనర్ల ఆందోళన సరికాదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా క్రమబద్దీకరణ జరిగిందనడం అర్థరహితం. జీవో 16 మేరకున్న పోస్టులను 2023, ఏప్రిల్ 30న జీవో 38 ద్వారా క్రమబద్దీకరించాం’ అని విద్యాశాఖ పేర్కొంది. 5,544 మందిని క్రమబద్దీకరిస్తే కొందరినే ప్రతివాదులుగా పేర్కొనడంపై అనధికారిక ప్రతివాదుల (క్రమబద్దీకరించిన వారు) తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని రిట్ పిటిషన్లను కొట్టివేయాలన్నారు. ధర్మాసనం ఏమందంటే.. ‘విద్యాసేవా నిబంధనలు చట్టబద్ధంగా ఉన్నందున వాటిని రద్దు చేయడం, సవరించడం ఒక్కపూటలో సాధ్యం కాదు. చట్టబద్ధమైన నియమాల అమలులో సెక్షన్ 10ఏ ప్రభావం ఉండకూడదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం ఇప్పటికే ఉన్న ఏదైనా చట్టాన్ని సవరించడానికి, రద్దు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అయితే సెక్షన్ 10ఏను చొప్పించడం పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101కు విరుద్ధం. అందువల్ల 10ఏను కొట్టివేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉమాదేవి కేసులో రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై ఇరుపక్షాలు ఆధారపడ్డాయి. తీర్పును జాగ్రత్తగా చదివితే కాంట్రాక్టు ఉద్యోగులతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను 2009లో నియమించి ఆ తర్వాత రెగ్యులరైజ్ చేశారు. ఇలా 15 ఏళ్లకు పైగా ఉద్యోగాల్లో ఉన్నారు. అటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని ఆదేశించాలా లేక ప్రస్తుత పిటిషనర్లకు పోస్టులను ప్రకటించాలని సర్కార్‌ను ఆదేశించాలా అనేది మా ముందున్న ప్రశ్న. అయితే అన్ని పిటిషన్లలో క్రమబద్ధీకరించిన వారిని తొలగించాలని కోరలేదు. పోస్టులు భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏళ్ల కింద నియమితులైన వారి అంశంలో జోక్యం కూడదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. అందుకే క్రమబద్దీకరణ అంశంలో జోక్యం చేసుకోవడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయనే కారణంతో గత నిర్ణయాలను రద్దు చేయడం లేదు’ అని ధర్మాసనం పేర్కొంది. -
మద్యం డిపోల్లో ఉద్యోగులపై వేటు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల ఉసురుతీస్తోంది. ప్రధానంగా ఎక్సైజ్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని 15వేల మంది సూపర్వైజర్లు, సేల్స్‌మెన్‌ను చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీలు ద్వారా పారదర్శకంగా నియమితమైన తమను తొలగించవద్దన్న వారి విజ్ఞప్తిని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.తమను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్న వారి వినతిని తిరస్కరించింది. తాజాగా రాష్ట్రంలోని మద్యం డిపోల్లో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, స్కానర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో డిపోలో పది నుంచి 15మంది చొప్పున మొత్తం 400మందికిపైగా ఆపరేటర్లు, స్కానర్లు పదేళ్లుగా విధుల్లో కొనసాగుతున్నారు. వారిలో 50శాతం మందిని నవంబరు 1 నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎక్సైజ్ శాఖ 200మందిపై వేటు వేసింది. ఇక రెండో విడతలో మిగిలిన 200మందిని కూడా తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మద్యం డిస్టిలరీల్లో సీఐడీ సోదాలురాష్ట్రంలోని పలు మద్యం డిస్టిలరీల్లో సీఐడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. బీరు తయారీ కంపెనీలు, మొలాసిస్ యూనిట్లలోనూ తనిఖీలు నిర్వహించారు. గతేడాది కాలంలో ఆ కంపెనీల ఉత్పత్తులు, సరఫరా రికార్డులను పరిశీలించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జత్వానీ కేసు విచారణ చేపట్టిన సీఐడీహనీట్రాప్ కేసుల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. ఆ కేసును ఇప్పటివరకు విజయవాడ పోలీసులు దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం
సాక్షి,విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 4 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసివేసేందుకు విశాఖ స్టీల్ యాజమాన్యం సిద్ధమైంది. తొలగించే కాంట్రాక్టు ఉద్యోగుల్లో సగం మంది నిర్వాసితులే ఉన్నారు. రేపటి నుంచి ఆన్ లైన్ పంచ్ స్టీల్ యాజమాన్యం నిలిపివేయనుంది.ఉద్యోగుల తొలగింపుపై సమాచారం అందుకున్న కార్మిక సంఘాల నాయకులు వైజాగ్ స్టీల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలిసే ఉద్యోగుల తొలగింపు జరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే ఊరుకునేది లేదు. ఉద్యోగులు తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామన్న మాటను చంద్రబాబు, పవన్ నిల బెట్టుకోవాలి. నాయకులు చెప్పే మాటలకు స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదు’’ అని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎసరు పెడుతున్న కూటమి ప్రభుత్వం
-
కాంట్రాక్టుపై రామోజీ విషం
ఐదేళ్ల చంద్రబాబు పాలన అంతా వంచన మయం.. కుట్రపూరితం... కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పైనా మాట తప్పిన అబద్ధాల కోరు చంద్రబాబు. ఈ నిజం రాయడానికి రామోజీకి మనసొప్పదు. మంచి చేయాలనే మనసుంటే మార్గముంటుందని జగన్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో నిరూపించుకుంది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాతే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే పుణ్యం కట్టుకుంది. సుప్రీంకోర్టు తీర్పు సాకును వెతుక్కుని కాంట్రాక్టు ఉద్యోగులను చంద్రబాబు వంచిస్తే... పదివేల మంది నెత్తిన క్రమబద్ధీకరణ పాలు పోస్తున్న నేత సీఎం జగన్. తన శిషు్యడు బాబు చేసిన మోసం రాష్ట్రం మొత్తం తెలిసినా, రామోజీ ఒక్కరే తెలియనట్లు నటిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మంచి జరిగిపోతే ఆ ఖ్యాతి జగన్ ప్రభుత్వానికి దక్కడం రామోజీకి సుతరామూ ఇష్టం లేదు. ఈ దుగ్ధతోనే తప్పుడు రాతలు రాస్తూ ప్రభుత్వంపై అక్షర విషాన్ని విరజిమ్ముతూనే ఉన్నారు.. ఈ అక్షర మాయావి ఎంతగా బాబును మోయాలనుకున్నా బాబు చేసిన పాపాలు జనానికి ఐదేళ్ల కిందటే తేటతెల్లమయ్యాయి... టీడీపీని శంకరగిరి మాన్యాలు పట్టించాయి.. ఇదంతా తెలిసినా తన తప్పుడు రాతలతో రోజురోజుకూ రామోజీ దిగజారిపోతూనే ఉన్నారు.. సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించకుండా మోసం చేసింది మీ చంద్రబాబు నాయుడేనని తెలుసుకోవాలి రామోజీ..గత చరిత్రను వదిలేసి ఇప్పుడు ఈనాడు కళ్లు మూసుకుని ఇష్టానుసారం రాతలు రాస్తే చెల్లదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరిట కాలక్షేపానికి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమావేశాలతో కాలయాపన చేసి చివరికి సుప్రీం కోర్టు తీర్పు అడ్డొస్తోందని, అందువల్ల సాధ్యం కాదంటూ కాంట్రాక్టు ఉద్యోగులను నిలువునా వంచించింది చంద్రబాబు నాయుడే. ఇవేమీ ఈనాడు రామోజీకి అప్పట్లో కనిపించలేదు. దీనికి భిన్నంగా వైఎస్.జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంటే ఈనాడు రామోజీ తప్పుపట్టడాన్ని ఉద్యోగులే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈనాడు చెత్తరాతలంటూ వారు మండిపడుతున్నారు. నిబంధనల పేరుతో అర్హులను తగ్గిస్తున్నారంటూ మరో అవాస్తవ ప్రచారానికి రామోజీ దిగజారారు. ప్రభుత్వంలో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు వంటివి పాటిసూ్తనే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తారు. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు పాటించకపోవడానికి ఇదేమీ రామోజీ సొంత జాగీరు కాదు. ఈ మాత్రం కనీస అవగాహన లేకుండా ఈనాడు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. వాస్తవానికి ఐదేళ్లు నిద్రపోయి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ సాధ్యం కాదని చెప్పింది మీ చంద్రబాబు నాయుడే రామోజీ. మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండాలనే నిబంధన ఇప్పుడు వైఎస్.జగన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిందేమీ కాదు. టీడీపీ ఆవిర్భవించక ముందు నుంచే కాకుండా, బాబు ప్రభుత్వంలోనూ ఉంది. అయినా చంద్రబాబుకు చేతకాని పనిని జగన్ ప్రభుత్వం చేసి చూపించి, కాంట్రాక్టు ఉద్యోగుల నెత్తిన పాలు పోసింది. అందుకే బాబును నమ్మం గాక నమ్మం ... అని 2019లో టీడీపీని చిత్తుగా ఓడించి, ఉద్యోగులు ఇంటి బాట పట్టించారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి ఆర్థిక శాఖ చర్యలను చేపట్టింది. ఎన్నికల కోడ్ కన్నా ముందే క్రమబద్ధీకరణ ప్రారంభమైంది. తదనుగుణంగా మార్గదర్శకాలను 13–12–2023న సర్క్యులర్ మెమో ద్వారా విడుదల చేసింది. క్రమబద్ధీకరణ కోసం రూపొందించిన సాఫ్ట్ వేర్లో ఉద్యోగులు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలి్సందిగా స్పష్టం చేసింది. అర్హులైన సుమారు పది వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు జగన్ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 3000 మందిని క్రమబద్ధీకరించారు. మిగతా వారికి అవకాశవిుచ్చే క్రమంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మాట ఇస్తే మడమ తిప్పరనే నమ్మకం ఉన్నందునే మళ్లీ జగన్‌ను సీఎంను చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. బాబు సర్కారుకు – జగన్ సర్కారుకు తేడా.. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ కోసం ఆర్థిక, మానవ వనరులు, ఆరోగ్య, ఐటీ శాఖల మంత్రులతో 09–09–2014న జీవో 3080 ద్వారా ఒక బృందాన్ని బాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమ ఐదేళ్ల పాలనలో మంత్రుల బృందం సమావేశాలతో సాగదీయడమే కాకుండా చివరగా సుప్రీం కోర్టు తీర్పును బూచిగా చూపించి, క్రమబద్ధీకరణ సాధ్యం కాదంటూ చేతులెత్తేసి, ఇచ్చిన మాటను తప్పింది. ఇప్పుడు జగన్ సర్కారు 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులను అధిగమించి కాంట్రాక్టు ఉద్యోగులను వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వివిధ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం’ అని జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ మేరకు అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. మంత్రుల కమిటీతో పాటు సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ, వర్కింగ్ కమిటీలు పలు సార్లు న్యాయపరమైన, చట్టపరమైన సమస్యలపై చర్చించాయి. క్రమబద్ధీకరణపై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని ఈ కమిటీలు సూచించాయి. క్రమబద్ధీకరణకు ఎటువంటి చిక్కులు ఎదురుకాకుండా ఉండే విధంగా న్యాయపరంగా అన్ని అంశాలను జగన్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. సుప్రీం కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటూనే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే గత చంద్రబాబు సర్కారుకు – ఇప్పటి వైఎస్ జగన్ సర్కారుకు తేడా. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
-
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మరోసారి ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రియల్ ఒకటి నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులగా పనిచేస్తూ అర్హులైన 2146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు జీవో జారీ చేశారు. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో 2025 మంది వైద్య సిబ్బంది, డిఎంఈ పరిధిలో 62, కుంటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాలలో నలుగురిని క్రమబద్దీకరణ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ క్రమబద్దీకరణ పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: బాబు, పవన్ పేరు చెబితే గుర్తుకొచ్చేవి ఇవే..: సీఎం జగన్ -
కాంట్రాక్ట్..ఇక పర్మినెంట్
-
‘కాంట్రాక్టు’.. ఇక ‘పర్మినెంట్’
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సర్క్యులర్ మెమో ద్వారా బుధవారం విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఏకంగా చట్టంలో సవరణలు తీసుకువచ్చారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు మార్గం సుగమమైంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 10 వేల మందికి మేలు జరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రెగ్యులరైజేషన్ ఇలా.. 2014 జూన్ 2కి ముందు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమితులై అర్హులైన వారందరూ రెగ్యులరైజేషన్‌కు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా శాఖాధిపతులు, శాఖల్లో మంజూరు చేసిన పోస్టులో రిజర్వేషన్, రోస్టర్ విధానంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమితులైన అర్హులైన వారిని రెగ్యులరైజ్ చేయనున్నారు. అర్హులైన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి ఒక్కో విధానంలో కాకుండా ఆర్థిక శాఖ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. దీంతో వీలైనంత త్వరగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. ♦ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ దరఖాస్తులను ఆయా శాఖాధిపతులు తొలుత వెరిఫికేషన్ చేసి సర్టిఫై చేయాలి. ♦ ఆ తర్వాత సచివాలయ శాఖలు ఆయా దరఖాస్తులను ధ్రువీకరించి సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ♦ పిదప ట్రెజరీస్ డైరెక్టర్ దరఖాస్తులను ఆడిట్ చేసి సిఫార్సు చేయాలి. ♦ చివరగా ఆర్థిక శాఖ (హెచ్ఆర్) విభాగం అర్హులైన ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఆమోదం తెలుపుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులు పుట్టిన తేదీ, విద్యా అర్హతలు, కమ్యూనిటీ, మంజూరైన పోస్టులో నియమించారా, లేదా అనే విషయాలను ఆయా శాఖాధిపతులు ్ర«ధువీకరణ చేయాల్సి ఉంటుంది. సీఎం జగన్‌కు ఉద్యోగులుబాసటగా నిలవాలి.. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ఉద్యోగులందరూ బాసటగా నిలవాలి. దశాబ్దాల కాంట్రాక్టు ఉద్యోగుల కలను నెరవేర్చిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. కొన్ని పత్రికలు, చానళ్లు ప్రభుత్వంపై నిత్యం విష ప్రచారం చేస్తున్నాయి. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని అక్కసుతో దించేసే కుట్రను ఉద్యోగులు అడ్డుకోవాలి. ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి 100 మందిని లక్ష్యంగా పెట్టుకుని వాస్తవాలు వివరించాలి. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులు, బడుల రూపురేఖలు మార్చి, ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్న సీఎం జగన్‌ను మరోసారి గెలిపించుకోవాలి. – ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ జనరల్ అరవ పాల్ 20 ఏళ్ల కల సాకారం కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధికరణకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడం పట్ల ఆనందంగా ఉంది. 20 ఏళ్ల కలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్మీడియెట్ విభాగంలో 3 వేల మందికి, పాలిటెక్నిక్, డిగ్రీ స్థాయిల్లో మరో 1,000 మందికి మేలు జరుగుతుంది. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, కేశవరపు జాలిరెడ్డి, వైఎస్సార్‌టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వేలాది కుటుంబాల్లో సీఎం వెలుగులు నింపారు.. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. మేనిఫెస్టోలో చేర్చి మరీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మేలు చేశారు. తాజా నిర్ణయం ద్వారా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. మేమంతా ఆయనకు రుణపడి ఉంటాం. – వై.రామచంద్రారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సీఎం చిత్తశుద్ధికి నిదర్శనం.. కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసులను క్రమబద్ధికరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసులను క్రమబద్ధీకరించిన సీఎంకు మా కృతజ్ఞతలు. – కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ రాష్ట్ర చైర్మన్ కుమ్మరకుంట సురేష్, కో చైర్మన్ కల్లూరి శ్రీనివాస్ -
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం నల్ల గొండ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభు త్వం వస్తే ఇక కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని, అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అవుతారని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించడంలో విఫలం కావడం వల్ల అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొ న్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ నాణ్యతలేక కూలిపోతున్నాయని, వాటి మీద విచారణ జరిపించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంద ని కోమటిరెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద విచారణ జరిపిస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మిత్రపక్షాలు అయినందునే విచారణ చేపట్టడంలేదని ఆరోపించారు. రూ.9 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, దానిలో భాగమైన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. -
TCS Recruitment Scam: కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలపై టీసీఎస్ కీలక నిర్ణయం!
దేశంలో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ టీసీఎస్ (TCS)లో ఉద్యోగాలకు లంచాల కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వేతనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం సిబ్బంది సంస్థలకు చేసే చెల్లింపుల్లో మార్పులు చేసింది. ఇలా చేయడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. వచ్చే జనవరి నుంచే.. బిజినెస్ వార్తా సంస్థ ‘మింట్’ నివేదిక ప్రకారం.. టీసీఎస్ సవరించిన చెల్లింపు విధానం వచ్చే జనవరి నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న వెండర్ (సిబ్బంది సంస్థ) ఒప్పందాలు ఈ ఏడాది డిసెంబర్ వరకూ అమలులో ఉంటాయి. కొత్త ఒప్పందాలు 2024 జనవరి నుంచి వర్తిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు, వెండర్ ఖర్చులు, బీమా వంటివన్నీ కంపెనీ చెల్లింపుల్లోనే కలిసి ఉంటాయి. పారదర్శకతను పెంపొందించే ఉద్దేశంతో ఈ ధరల సర్దుబాటు చేసినట్లుగా తెలుస్తోంది. మంచి అర్హత కలిగిన అభ్యర్థులకు కంపెనీని చేరువ చేయడం ద్వారా అటు సిబ్బంది సంస్థలు, ఇటు టీసీఎస్.. రెండింటికీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. రేట్ కార్డులలో చేస్తున్న మార్పు కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. శాశ్వత ఉద్యోగుల విషయంలో ఎటువంటి మార్పు లేదు. టీసీఎస్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండటం గమనార్హం. లంచాల స్కామ్ ఎఫెక్ట్ టీసీఎస్ నియామక ప్రక్రియలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ధరల విధానాలలో ఈ సర్దుబాటు చేసింది. కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు గానూ నియామక సంస్థల నుంచి కొందరు ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు వెలుగులోకి రావడంతో గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో టీసీఎస్ విచారణ చేపట్టింది. ఫలితంగా కంపెనీ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ మాజీ హెడ్ ఈఎస్ చక్రవర్తితోపాటు ఇందులో ప్రమేయం ఉన్న మరో ఎనిమిది మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అలాగే ఆరు సిబ్బంది సంస్థలను బ్లాక్ లిస్ట్ చేసింది. -
రాష్ట్ర ఉద్యోగులకు డీఏ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మరో రెండు హామీలను నెరవేర్చారు. దసరా పండుగకు 3.64 శాతం డీఏను విడుదల చేయడంతోపాటు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులకు వారి బేసిక్ పేలో 22.75 శాతం నుంచి 26.39 శాతానికి పెంచిన కరువు భత్యాన్ని 2022 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన కరువు భత్యం నవంబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని, పెరిగిన డీఏను నగదు రూపంలో డిసెంబర్ జీతంలో అందుకుంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 జూలై1 నుంచి ఈ ఏడాది అక్టోబర్31 వరకు ఉన్న బకాయిలను మూడు దఫాలుగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేయనున్నట్టు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు బకాయిల్లో 10 శాతం ప్రాన్ అకౌంట్లో జమ చేసి మిగిలిన 90 శాతం మూడు దఫాలుగా అందజేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఈ బకాయిలను జమ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాల్టీలు, నగరపాలక సంస్థలు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితులు, రివైజ్డ్ పేస్కేల్ 2022 కింద రెగ్యులర్‌గా జీతాలు అందుకుంటున్న వారు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు అన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, భోధనేతర సిబ్బంది, యూనివర్సిటీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి ఈ డీఏ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ట్రెజరీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తేదీ 2–6–2014కు ముందు వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయా శాఖల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ శాఖల్లోని నియామకాలకే ఇది వర్తిస్తుందని వివిధ పథకాలు, ప్రాజెక్టులు కింద పనిచేసే వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా శాఖాధిపతులు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తూ డీఏతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా.. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రత్నాకర్‌బాబు, ప్రధాన కార్యదర్శి వీఎన్‌వీఆర్ కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల బానిసత్వానికి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
2014 జూన్ 2 నాటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నాం
-
బిల్లు ఆమోదం.. కాంట్రాక్టు ఉద్యోగుల సంబరాలు..
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త అసెంబ్లీలో బిల్ పాస్..
-
వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2018కి ముందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన శాంక్షన్ పోస్టుల్లో నియమితులైన సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, పారా మెడికల్ సిబ్బందికి వంద శాతం గ్రాస్ వేతనం (పే+హెచ్ఆర్ఏ+డీఏ) పునరుద్ధరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్ వేతనాన్ని రద్దు చేసి.. కన్సాలిడేట్ పేకి కుదించారు. ఈ నేపథ్యంలో వారంతా 2019కు ముందు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2018 తర్వాత నియమించబడి అర్హత ఉన్న ఉద్యోగులకు ఈ వేతనాలు వర్తింపజేసేలా ప్రతిపాదనలు పంపించాల్సిందిగా విభాగాధిపతులను ఆదేశించారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్ వేతనం రద్దు చేసి మాకు అన్యాయం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 3,914 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. కేడర్‌ను బట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ వేతనాలు పెరుగుతాయి. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటాం. – రత్నాకర్, ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ పారా మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ -
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
-
AP: కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరో శుభవార్త
సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. క్రమబద్దీకరణకు ఐదేళ్ల నిబంధన తొలగించనుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సీఎం జగన్ అంగీకరించారు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయనుంది. కొద్దిరోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన.. సీఎం నిర్ణయంతో అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ది కలగనుందని ఏపీజీఈఏ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. కాగా, విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో విద్యుత్ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: చంద్రబాబు కొత్త రాగం.. అదో దిక్కుమాలిన విజన్: పేర్ని నాని ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించింది. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్
-
కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన గూగుల్.. వాళ్లు చేసిన పాపం ఏంటంటే..
ప్రముఖ టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్.. గూగుల్ హెల్ప్ వర్కర్ల కాంట్రాక్ట్‌ను అర్ధాంతరంగా ముగించి నిర్ధాక్షణ్యంగా వారిని విధుల నుంచి తొలగించింది. ఇంతకీ వాళ్లు చేసిన పాపం ఏంటంటే యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నించడమే. ఈ మేరకు ఆరోపిస్తూ యూఎస్ లేబర్ బోర్డ్‌కి బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నించిన ఉద్యోగులపై కక్ష తీర్చుకునేందుకు గూగూల్ మాతృసంస్థ ఆల్ఫాబిట్ తీసుకున్న నిర్ణయం ఫెడెరల్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది. బాధిత ఉద్యోగుల్లో 70 శాతం మందికిపైగా తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని జులైలో చెప్పినట్లు నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ ఫైలింగ్‌ను ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బెర్గ్’ నివేదించింది. ఆస్టిన్, టెక్సాస్, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాతోపాటు యూఎస్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల తొలగింపు గురించి "టౌన్ హాల్" ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆల్ఫాబెట్ తెలియజేసింది. అలాగే ఉద్యోగులకూ ఈమెయిల్స్ పంపించింది. Lay off: ‘మేం పీకేశాం.. వారికి ఎవరైనా జాబ్ ఇవ్వండి ప్లీజ్’ బాధిత ఉద్యోగుల్లో 118 మంది రైటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ రూపొందించే లాంచ్ కోఆర్డినేటర్లు ఉన్నారు. వీరింతా గూగూల్ సెర్చ్ రిజల్ట్స్, ఏఐ చాట్‌బాట్ నాణ్యతను మెరుగుపరచడంలో కీలకంగా పనిచేశారు. యాక్సెంచర్ ద్వారా వీరిని నియమించుకున్నప్పటికీ, చట్టబద్ధంగా గూగుల్ సంస్థే తమకు తమ యజమాని అని ఉద్యోగులు పేర్కొంటున్నారు. యాక్సెంచర్తోపాటు గూగుల్‌ను తమకు ఉమ్మడి యజమానిగా గుర్తించాలని లేబర్ బోర్డ్‌ను కోరుతున్నారు. 2018లో ఆల్ఫాబెట్ కాంట్రాక్టు వర్కర్లలో చాలా మంది దాని గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో భాగమయ్యారని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. అదేవిధంగా కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఆల్ఫాబెట్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ చేయడానికి 2023 ఏప్రిల్‌లో ఆమోదం లభించింది. ఆ కార్మికుల ఉమ్మడి యజమాని ఆల్ఫాబెట్ అని నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ జులై నెలలో ఇచ్చిన తీర్పును సభ్యులందరూ సమర్థించారు. -
జీతాల్లేవ్... రెన్యువల్ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం అల్లాడుతున్నారు. మూడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాలు మాత్రం అందడం లేదు. అందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 3,650 మంది పనిచేస్తున్నారు. డాక్టరు స్థాయి మొదలు స్టాఫ్ నర్సులు, రేడియోగ్రాఫర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఎల్రక్టీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్స్ తదితర కేడర్ల లో కాంట్రాక్టు ప్రాతిపదికన, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో విధు లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసును ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తారు. ఏప్రిల్ నెల నుంచి మార్చి వరకు సర్విసు కాల పరిమితి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి రెన్యువల్ చేస్తేనే నిధులు విడుదల చేస్తారు. పెండింగ్.. పెండింగ్... ఈ ఏడాది ఏప్రిల్‌లో వైద్య విధాన పరిషత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్విసు రెన్యువల్ ప్రతిపాదనలను ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. సాధారణంగా ఈ ప్రక్రియ వారం నుంచి పది రోజుల్లోగా పూర్తి కావాలి. కానీ ఏప్రిల్ నెలలో సమర్పించిన ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం రాలేదు. ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ ఫైలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,650 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్విసు రెన్యువల్ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఏటా ఇదే తంతు... వైద్య విధాన పరిషత్‌లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో ప్రతి సంవత్సరం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో వేతనాలు అందడంలో ఆలస్యం అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం సర్విసు పునరుద్ధరణే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చొరవ తీసుకోవాలని ఉద్యోగులు మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రాలు సమర్పించారు. -
ఉరవకొండలో సంబరాలు జరుపుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు
-
థ్యాంక్యూ సీఎం సార్
తణుకు అర్బన్: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరణకు అనుకూలంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగులు సంబరాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన శనివారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ‘థ్యాంక్యూ సీఎం సార్..’ అంటూ కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలకు మేలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని, ఉద్యోగుల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తణుకు శాఖ అధ్యక్షుడు నరసరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ గుండెల్లో కొలువుదీరారని అన్నారు. సీఎంకు రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు కేశిరెడ్డి వెంకట సత్యనారాయణ (పండు), ఆర్వీఎస్ఎన్ మూర్తి, వైవీఎస్‌బీ రాయుడు, కె.కరుణాకరరావు, పీవీ నాగరాజు, పట్టపు రామకృష్ణ, పంజా రవి, సుభాషిణి, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కిషోర్, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, ఉద్యోగులు పాల్గొన్నారు. -
వేల కళ్లలో వెలుగులు
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: కాంట్రాక్టు ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తూ క్రమబద్ధీకరణ నిర్ణయంతో వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వంలో విలీనం చేసి 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తమవుతోంది. ♦ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, కార్వేటినగరం, పలమనేరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఉద్యోగులు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ♦ విజయనగరం జిల్లా కేంద్రంలో సీఎం జగన్ చిత్రపటానికి కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది క్షీరాభిషేకం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరులో సీఎం జగన్, మంత్రి దాడిశెట్టి రాజా ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ♦ సీఎం జగన్ మాట తప్పని, మడమ తిప్పని నేతగా మరోసారి రుజువు చేసుకున్నారని విజయనగరం జిల్లా వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.కనకరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీవైవీపీ కార్యాలయం వద్ద ఉద్యోగులతో కలిసి ఆయన సీఎం జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ♦ తమ జీతాలను ఏకంగా 23 శాతం పెంచిన ముఖ్యమంత్రి జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు శుక్రవారం గుంటూరులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని కలసి ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.అశోక్‌కుమార్, అధ్యక్షుడు ఎ.విజయ్‌భాస్కర్ తదితరులున్నారు. ♦ ఏపీ ఎన్జీవోలు కర్నూలు కలెక్టరేట్ వద్ద ప్లకార్డులతో ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి నివాసంలో గవర్నమెంట్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ♦ కడపలో కాంట్రాక్టు లెక్చరర్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ సురే‹Ùబాబు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మ శివప్రసాద్‌రెడ్డి, ఏపీఎన్జీవోస్ నేతలు పాల్గొన్నారు. ♦ క్రమబదీ్ధకరణ ద్వారా సీఎం జగన్ 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్విసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) అధ్యక్షుడు అరవా పాల్, జనరల్ సెక్రటరీ ఆర్.గోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీవీవీపీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 14 వేల మంది ఉద్యోగులకు భరోసా కల్పించారన్నారు. ♦ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరించి ముఖ్యమంత్రి జగన్ మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విజయవాడ వైఎస్సార్ పార్క్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. -
ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం
సాక్షి, అమరావతి: అడగకుండానే 12వ పీఆర్సీని ఏర్పాటు చేసినందుకు.. సీపీఎస్ ఉద్యోగులకు ఊరటనిస్తూ జీపీఎస్ విధానాన్ని తెచ్చి నందుకు.. పది వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినందుకు.. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు సీఎంతో సమావేశమైన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా సీఎం పాటుపడుతున్నారని ప్రశంసించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఉద్యోగుల కోసం పరితపిస్తున్న సీఎం జగన్ ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమానికీ పెద్దపీట వేస్తున్నారు. అడగకుండానే 12వ పీఆర్సీ ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 25 ఏళ్లుగా పనిచేసినా.. చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉంది. ఇప్పుడు ఒక్క నిర్ణయంతో వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించారు. ఏపీవీపీని ప్రభుత్వంలో విలీనం చేసి... ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఒకే హెచ్ఆర్ఏ ఇచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్ ద్వారా 50 శాతం ఫిట్మెంట్తో పెరిగే ధరలకు అనుగుణంగా డీఏలు ఇచ్చి పెన్షన్ ఇస్తామని చెప్పడం ద్వారా భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. మా కోసం ఇంతగా పరితపిస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. జగన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీ ఎత్తున పాలాభిషేకాలు చేస్తున్నారు. – బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం మానవతామూర్తి సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ 2008లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 ఎన్నికల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరిస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ ఇచ్చి న మాట మేరకు 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మానవతామూర్తి. గతంలో పీఆర్సీ కోసం రోడ్డెక్కితే టీడీపీ సర్కార్ గుర్రాలతో ఉద్యోగులను తొక్కించింది. ఇప్పుడు ఎవరూ అడగకుండానే సీఎం వైఎస్ జగన్ పీఆర్సీని ప్రకటించి.. ఉద్యోగుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. – శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీఎన్జీవో సంఘం ఎప్పటికీ రుణపడి ఉంటాం.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఎప్పటికీ రుణపడి ఉంటాం. – రత్నాకర్ బాబు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నేత జీపీఎస్‌తో మేలు జరుగుతుందని భావిస్తున్నాం జీపీఎస్‌లో పది శాతం ఉద్యోగి షేర్, ప్రభుత్వ షేర్ కొనసాగుతుందని సీఎం జగన్ చెప్పారు. ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్యారెంటీ పింఛన్ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. జీపీఎస్‌తో ఉద్యోగులకు 60 శాతం ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నాం. – మురళీ మోహన్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత 15 ఏళ్ల సమస్యకు సీఎం పరిష్కారం ఆస్పత్రుల్లో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు. రెగ్యులర్ ఉద్యోగులమైనా మాకు జీతాలు రావటం లేదు. కానీ సీఎం జగన్ దృష్టికి రాగానే ఒకే ఒక్క సంతకంతో సమస్య తీర్చారు. వైద్య విధాన పరిషత్ ద్వారా అత్యంత మెరుగైన సేవలు అందిస్తాం. – సురేష్ కుమార్, ఏపీవీపీ సంఘం నేత నా 23 ఏళ్ల సర్విసులో ఇది అద్భుతం నా 23 ఏళ్ల సర్విసులో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలకు సంబంధించి పరికరాలు ఏర్పాటు చేయడం అద్భుతం. కాంట్రాక్టు ఉద్యోగులమైన మమ్మల్ని రెగ్యులరైజ్ చేసినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – వీఏవీఆర్ కిశోర్, ఏపీ కాంట్రాక్టు ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి