
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త అందింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. 2016లో జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖను కోరింది. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 పోస్టులను భర్తీ చేస్తామని, ఇందులో 80,039 ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని.. మిగతా 11,103 పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మార్చి 9న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment