రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న 3 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు , రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాప్రభుత్వం పట్టించుకోవడం లేదని..
విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న 3 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు , రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాప్రభుత్వం పట్టించుకోవడం లేదని విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ధర్నాకు దిగారు. 10 వ పీఆర్‌సీ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగుల కనీస వేతనానికి సమానంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు పెంచి, రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
మహిళలకు 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నటీ లీవు సౌకర్యం కల్పించాలని, డీఏ, హెల్త్‌కార్డులు, బస్‌పాస్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా మొదటి తేదీన వేతనాలు చెల్లించి, పీఎఫ్, ఇఎస్‌ఐలు సక్రమంగా అమలు చేయాలన్నారు.