collectarate
-
బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తం!
సాక్షి, కామారెడ్డి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రాత్రి సంజయ్ పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ముట్టడికి రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో తీవ్ర తోపులాట, వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. తొలుత బండి సంజయ్ జిల్లాలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు పయ్యావుల రాములు కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై తేల్చుకునేందుకు కలెక్టరేట్‌కు వెళతానని అక్కడే ప్రకటించారు. కాసేపటికే పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్‌కు బయలుదేరారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కామారెడ్డి ప్రధాన రహదారిపై బారికేడ్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసినా.. బీజేపీ శ్రేణులు బారికేడ్లను తోసివేసి, బండి సంజయ్ కాన్వాయ్‌ను ముందుకు తీసుకువెళ్లాయి. కలెక్టరేట్ ముందు ఘర్షణ కామారెడ్డి పట్టణంలో కలెక్టరేట్ ప్రధాన గేటుకు కొంత ముందు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి సంజయ్, బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు. కానీ వందల సంఖ్యలో చేరిన బీజేపీ కార్యకర్తలు బలంగా తోయడంతో బారికేడ్లు కింద పడిపోయాయి. బండి సంజయ్, ఇతర నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేశారు. ప్రధాన గేటును మూసి ఉండటంతో అది సాధ్యపడలేదు. కొందరు కార్యకర్తలు గేటు ఎక్కి లోపలికి దూకాలని చూడగా పోలీసులు అడ్డుకున్నారు. ఇలా దాదాపు గంట పాటు బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చివరికి పోలీసులు సంజయ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ఎక్కించారు. కానీ పార్టీ శ్రేణులు పోలీసు వాహనం ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. కొందరు ఆ వాహనం అద్దాలన్నీ ధ్వంసం చేశారు. బానెట్‌పై, అన్ని వైపులా గట్టిగా బాదడంతో కారు దెబ్బతిన్నది. అయినా పోలీసులు బీజేపీ శ్రేణులను పక్కకు తప్పించి వాహనాన్ని ముందుకు తీసుకువెళ్లారు. బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనలో మరో వాహనం కూడా దెబ్బతిన్నట్టు చెప్తున్నారు. కానీ అంతా చీకటిగా ఉండటంతో స్పష్టత రాలేదు. ఇక పోలీసులపై, వాహనంపై దాడి చేసిన వారిలో కొందరిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనే ఒకే రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్
-
కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం
Errabelli Dayakar Rao.. సాక్షి, జనగామ: జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకునేందుకు వీఆర్ఏలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీఆర్ఏలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో తోపులాట చోటుచేసుకుంది. అయితే, అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి.. గ్రామపంచాయితీ అభివృద్ది పనులకు సంబంధించిన నిధుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాగి పడేసిన మద్యం సీసాలను గ్రామపంచాయతీ సిబ్బంది సేకరించి వాటిని అమ్మేసి.. వచ్చిన డబ్బులను అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇందుకు వ్యతిరేకంగానే నేడు మంత్రిని వీఆర్ఏలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కేటీఆర్ ట్వీట్‌కు బండి కౌంటర్ -
నాలుగు సెక్షన్లతో పాలన
శ్రీకాకుళం పాతబస్టాండ్: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉన్నతాధికారులను ప్రజలకు దగ్గర చేసే పనిని ప్రభుత్వం మొదలుపెట్టింది. నూతనంగా ఏర్పడిన జిల్లాలో జనాభా, విస్తీర్ణం తగ్గడంతో కలెక్టరేట్లో పాలన కోసం ఏర్పాటు చేసే సెక్షన్లను కుదించారు. ఇప్పటివరకు 8 సెక్షన్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 4కు తగ్గింది. ఈ మేరకు జీఓ కూడా విడుదలైంది. కలెక్టరేటే కీలకం.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం, పనులు త్వరగా జరిగేలా చూడడంలో కలెక్టరేట్ కీలక పాత్ర పోషిస్తుంది. కలెక్టర్ కార్యాలయంలో ఇదివరకు ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్ అనే 8 సెక్షన్లు ఉండేవి. వీటికి తోడుగా మీ సేవ, లీగల్ సెక్షన్లు కూడా సేవలు అందించేవి. పథకాలు, సేవలపై ప్రజలు కలెక్టర్‌కి విన్నవించినా, వాటిని కలెక్టర్ ఈ సెక్షన్లలోని అధికారుల ద్వారా పరిష్కరించేవారు. సెక్షన్ –1: ఇప్పటి వరకు ఉన్న ఎ, బి సెక్షన్లను కలిపి సెక్షన్–1గా మార్చారు. ఎ–సెక్షన్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంటు (పరిపాలన), ఆఫీస్ ప్రొసీడ్స్, ఎస్టాబ్లిష్మెంటు అండ్ సర్వీస్ మేటర్లు, డిసిప్లనరీ మేటర్లు అన్నీ క్యాడర్లకు సంబంధించినవి ఉంటాయి. బి–సెక్షన్లో అకౌంట్సు, ఆడిటింగ్, జీ తాలు, కోనుగోళ్లు, రికార్డుల నిర్వహణ ఉంటాయి. ఈ రెండు సెక్షన్లు ఒకటి చేశారు. సెక్షన్–2 : ఈ, జి, ఎఫ్ లను కలిసి ఒక సెక్షన్ చేశా రు. ఈ సెక్షన్లో ల్యాండ్ మేటర్లు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ ఎలిసేషన్, అసైన్మెంటు, హౌస్ సైట్స్, ప్రోహిబిటెడ్ ప్రోపర్టీ నిర్వహణ 22ఎ, ఫిషరీస్ అండ్ అదర్ ల్యాండ్ రికారŠుడ్స ఉంటాయి. జి సెక్షన్లో సెటిల్మెంట్లు, ఎస్టేట్ ఎ బోల్స్ యాక్టు, ఇనాం భూములు, కోర్టు సంబంధిత, ఫారెస్టు ల్యాండ్ వంటి అంశాలు ఉంటాయి. ఎఫ్‌లో భూ సేకరణ, ఆర్అండ్ఆర్ తదితర అంశాలు ఉంటాయి. ఈ మూడింటిని ఒక్కటి చేశారు. సెక్షన్–3 : సి, హెచ్ సెక్షన్లు కలిపారు. మెజిస్టీరియల్ సెక్షన్, కుల వెరిఫికేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ, ఎలక్షన్ అంశాలు, లా అండ్ ఆర్డర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఇతర అనుబంధ అంశాలు ఉంటాయి. హెచ్ సెక్షన్లో ప్రోటోకాల్, గ్రీవెన్సు, ఇతర రిలేటెడ్ అంశాలు ఉంటాయి. సెక్షన్–4 : ఇందులో డి సెక్షన్ ఉంటుంది. ఇందులో డిజాస్టర్ మేనేజ్మెంటు, విపత్తులు ఇతర అంశాలు ఉంటాయి. పై సెక్షన్లకు సూపరింటెండెంట్లను కూడా నియమించారు. ఇవి కాకుండా ఎప్పటిలాగానే లీగల్ సెక్షన్, మీ సేవ సెక్షన్లు నడుస్తున్నాయి. వీటికి సీనియర్ సూ పరింటెండెంట్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్ప టి వరకు ఉన్న సిబ్బందిని కుదించారు. కలెక్టరేట్ నుంచి సిబ్బంది విజయనగరం, మన్యం జిల్లాలకు వెళ్లారు. సమస్యలు లేవు.. జిల్లాల విభజన తర్వాత సెక్షన్లను కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ మేరకు సెక్షన్లను కుదించాం. సమస్యలేవీ లేవు. తగినంత మంది సిబ్బందిని సమకూరుస్తున్నాం. – ఎం.రాజ్యలక్ష్మి, డీఆర్ఓ -
మెదక్ ఏసీబీ కేసులో దర్యాప్తు ముమ్మరం...
సాక్షి, మెదక్ : మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు సంబంధించిన కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అయిదుగురు నిందితులను అరెస్టు చేసి వారిని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అయిదుగురు నిందితులను అధికారులు విచారిస్తున్నారు. ఉన్నతాధికారి పాత్రతో పాటు కింది స్థాయి ఉద్యోగుల పాత్రపై నిందితులను నుంచి వివరాలు సేకరిస్తున్నారు. (మరో 'కోటి'గారు దొరికారు!) స్టాంప్ అండ్ రీజిస్టేషన్‌కు రాసిన లేఖతో మాజీ కలెక్టర్ పాత్రపై ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ కలెక్టర్ రిటైర్మెంట్ రోజునే స్టాంప్ అండ్ రీజిస్టేషన్‌కు లేఖ రాయడంతో మాజీ కలెక్టర్ పై అనుమానాలు బలవపడుతున్నాయి. అరెస్ట్ చేసిన అయిదుగురు నిందితులను ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నారు. (మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అరెస్ట్) -
కలెక్టరేట్ ఏ– సెక్షన్లో అవినీతి బాగోతం..
జిల్లాలోని అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన కలెక్టరేట్లో అవినీతి దర్శన మిస్తోంది. కలెక్టరేట్లోని ఏ–సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ అవినీతి బాగోతం వాట్సాప్ మెసేజ్‌ల ఆధారాలతో బట్టబయలైంది. అసలే కుటుంబ యజమాని మృతి చెంది దీనస్థితిలో ఉంటూ..కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న బాధితులనే ఈ ఉద్యోగి లంచం డిమాండ్ చేయడం ఆ శాఖకే మచ్చ తెస్తోంది. కలెక్టర్ కార్యాలయంలో అతి ముఖ్యమైన ఏ–సెక్షన్లో అవినీతి వ్యవహారం బయటపడడం చర్చనీయాంశమైంది. చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్లో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అవినీతిరహిత పాలన అందజేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అవినీతికి పాల్పడే ఎంతటి అధికారినైనా, ఉద్యోగినైనా సహించేది లేదని కఠిన చర్యలుంటాయని పలు మార్లు హెచ్చస్తున్నారు. అయినా కలెక్టరేట్ కార్యాలయంలోనే అవి నీతి తంతు విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఆకస్మికంగా మృతిచెందితే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలివ్వాల్సి ఉంటుంది. జిల్లాలోని పలు శాఖల్లో ఆకస్మికంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబీకులకు ఉద్యోగాలిచ్చే నివేదికలు కలెక్టరేట్‌కు వచ్చాయి. ఈ నివేదికలను పర్యవేక్షించే ఏ–సెక్షన్‌లోని ఏ–7 జూనియర్ అసిస్టెంట్ అవినీతిని పాల్పడేందుకు స్కెచ్ వేశారు. వచ్చిన నివేదికల్లోని చిరునామాల ఆధారంగా గుట్టుచప్పుడు కాకుండా లంచం కోసం ప్రయత్నించారు. వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. కారుణ్య నియామకానికి అర్హత ఉన్న ఓ బాధితుడు సంవత్సరకాలంగా ఉద్యోగం కోసం కాళ్లరిగేలా కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షణ చేస్తున్నాడు. కరుణించని కలెక్టరేట్ ఏ–సెక్షన్ అధికారుల తీరుతో ఆ బాధితుడు విసిగిపోయాడు. చిట్టచివరిగా ఏ–7 సెక్షన్ చూసే సిబ్బందికి లంచం ఇచ్చేనా ఉద్యోగం పొందేందుకు సిద్ధమయ్యాడు. ఏ–7 ఉద్యోగి ఫోన్ నంబర్‌ను తీసుకుని వాట్సాప్ ద్వారా సంభాషణ జరిపాడు. దొరికాడు ఇలా.... ఆ ఉద్యోగికి లంచం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న బాధితుడు చివరికి ఇలా చేశాడు.. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల మెయిల్ ఐడీలను ఆ బాధితుడు తెలుసుకున్నాడు. ఏ7 ఉద్యోగితో జరిపిన వాట్సాప్ సంభాషణల ఆధారాలను ఆ మెయిల్ ఐడీలకు పంపాడు. ఈ విషయం సాక్షి దృష్టికి వచ్చింది. పూర్తిస్థాయి వివరాల కోసం సాక్షి మరింత సమా చారాన్ని సేకరించింది. సంవత్సరాల కొద్దీ పాతుకుపోయారు కలెక్టరేట్లోని పలు విభాగాల్లో కొంతమంది ఉద్యోగులు సంవత్సరాల కొద్దీ పాతుకుపోయారు. ఏళ్లు గడుస్తున్నా వారు మాత్రం మరో చోటకు బదిలీ అయిన దాఖలాలు లేవు. ముఖ్యంగా ఏ–సెక్షన్లో కొందరు ఏళ్ల తరబడి ఒకే సీటులో తిష్ట వేశారు. ఇలాంటి పరిస్థితుల వల్లే అవినీతికి తావిస్తోంది. కొందరు చేస్తున్న తప్పులకు ఆ శాఖ మొత్తానికి చెడ్డ పేరు వస్తోంది. కలెక్టర్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కలెక్టరేట్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాట్సాప్ సంభాషణ ఇలా.. బాధితుడు : సార్, చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం తిరుగుతున్నాను. ఏ7 ఉద్యోగి : ఒక సంవత్సరమా.. రెండు సంవత్సరాలా... బాధితుడు : ఒక సంవత్సరానికి పైగా సార్... ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారా సార్... ఏ7 ఉద్యోగి : ఎస్... నువ్వు అనుకుంటే త్వరగా అవుతుంది... మంచి డిపార్టుమెంట్ కూడా బాధితుడు : నేను ఏమీ చేయాలి సార్.. ఏ7 ఉద్యోగి : రూ.80వేలు బాధితుడు : సార్, నేను చాలా పేదవాణ్ణి... నా పరిస్థితిని, కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోండి ఏ7 ఉద్యోగి : రూ.65 వేలు బాధితుడు : సార్, ప్లీజ్ దండం పెడుతాను.. ప్రస్తుతం నా కుటుంబ పరిస్థితులకు ఉద్యోగం చాలా ముఖ్యం సార్, ఏ7 ఉద్యోగి : ఓకే, రూ.50 వేలు ఫైనల్ ఏ7 ఉద్యోగి : ప్రశ్న గుర్తును పెడుతూ... ఓకే.. ఇక నీఇష్టం... గుడ్‌లక్ చర్యలుంటాయ్ అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదు. ఏ–సెక్షన్‌లోని ఏ7 ఉద్యోగిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తాం. తప్పు తేలితే కఠినచర్యలు ఉంటాయ్. ఉద్యోగాల కోసం ఎవ్వరూ ఏ అధికారికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా లంచం అడిగితే నిర్భయంగా నాకు ఫిర్యాదు చేయవచ్చు. – నారాయణభరత్‌గుప్తా, కలెక్టర్ -
అ‘పరిష్కృతి’..!
సాక్షి, కొత్తగూడెం: సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం అనుకున్న మేర లక్ష్యం సాధించడం లేదు. ఇక్కడికొచ్చే సమస్యల్లో కొన్ని పరిష్కారం అవుతున్నా.. భూసంబంధ సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. ప్రతి గ్రీవెన్స్‌కు ఆయా విభాగాల ప్రధాన అధికారులను కలెక్టర్ పిలిపించి తక్షణమే సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నం అంతగా ఫలితాలనివ్వడం లేదు. సోమవారం ‘సాక్షి’ రెండు భూ ఆక్రమణల కేసులను పరిశీలించింది. ఇ.పుష్పకుమారి అనే ఓ మాజీ నక్సలైట్‌కు పునరావాసం కింద ఇచ్చిన మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారు. ఈ విషయమై ఆమె ప్రతి అధికారి చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. చివరకు సోమవారం.. ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని కలెక్టరేట్ ఏఓకు జాయింట్ కలెక్టర్ సూచించారు. కాగా సదరు ఏఓ బాధిత మహిళతో ‘నీకు ఈ స్థలం ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, తహసీల్దారుకు చెప్పి మరోచోట ఇప్పిస్తా’ అనడంతో పాటు భూముల ధరలు పెరుగుతండడంతో ఇలా ఆక్రమణలు జరగడం సహజమేనని సెలవిచ్చారు. చివరకు సమస్యను సశేషంగానే ఉంచారు. దీంతో బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాలనే ఆలోచన వస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక కొత్తగూడెం జిల్లాకేంద్రం నడిబొడ్డులో కొదురుపాక మీనాకు మారి అనే ఓ మహిళా న్యాయవాదికి వంశపారంపర్యంగా వచ్చిన ఇంటిని మున్సిపల్ అధికారులు ఆమెకు తెలియకుండానే మరొకరి పేరుపై మార్చారు. స్థానిక నాయకులు కొందరు ఆక్రమణదారులకు మద్దతు తెలుపుతుండడంతో వారు తనపై అట్రాసిటీ కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని న్యాయవాది వాపోయారు. పునరావాసం కింద ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారు జనశక్తి దళంలో పనిచేస్తూ 2000 సంవత్సరంలో పోలీసుల ఎదుట లొంగిపోయాను. 2004లో తిరిగి జనశక్తి దళంలో చేరాను. 2006లో మళ్లీ లొంగిపోయాను. ప్రభుత్వం ఇచ్చే పునరావాసం కింద నాకు 2010లో సమితి సింగారం పంచాయతీ రాజీవ్‌గాంధీ నగర్లో మూడు సెంట్ల స్థలాన్ని అధికారులు కేటాయించారు. అయితే ఆర్థిక స్తోమత లేక ఇప్పటికీ ఇల్లు నిర్మించుకోలేదు. స్థానికులైన కమ్మంపాటి శ్రీను, రేగళ్ల శంకర్, కె.సాయిపద్మ, ఎం.పద్మ, ఎస్.ఎ.కోటి, యెదరి రామకృష్ణ ఈ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని గత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి కూడా తీసుకెళ్లా. అదే సమయంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కూడా వివరించా. అయినా ఇప్పటికీ న్యాయం జరగలేదు. చివరికి హైదరాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్దకు కూడా వెళ్లి మొరపెట్టుకోగా ప్రస్తుత కలెక్టర్‌కు లేఖ పంపారు. దీనిని కూడా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఇచ్చిన వినతిపత్రంలో జతచేశా. భర్త మరణించి అనాథగా ఉన్న గిరిజనురాలినైన నాకు ఈ స్థలాన్ని న్యాయబద్ధంగా ఇప్పించాలని కోరుతున్నా. – పుష్పకుమారి, సమితి సింగారం, మణుగూరు మండలం. నాకు తెలియకుండా మ్యుటేషన్ చేశారు కొత్తగూడెం మున్సిపాలిటీలోని గాజులరాజం బస్తీలో 4–2–144 నంబర్లో నాకు ఇల్లు ఉంది. మా అమ్మ సముద్రాల భారతి ద్వారా వంశపారంపర్యంగా ఆ ఇల్లు లభించింది. నేను 2015 నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నా. ఈ ఇల్లు నివాసయోగ్యంగా లేక ఎవరికీ అద్దెకు కూడా ఇవ్వలేదు. ఇటీవల జీఓ రావడంతో పట్టా కోసం దరఖాస్తు చేసుకునేందుకు కొత్తగూడెం వచ్చాను. అయితే నా పేరుపై ఉన్న ఇంటిని 2013లో నాకు తెలియకుండా రెడ్డి కృష్ణకుమారి పేరుతో ముటేషన్ చేశారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఈ విషయమై మున్సిపల్ అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆక్రమించుకున్న వారిని అడిగితే..నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఎక్కువగా మాట్లాతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. 2009 నుంచి 2015 మొదటి అర్థసంవత్సరం వరకు ఇంటి పన్ను కూడా చెల్లించా. నా ఇంటిపై సర్వహక్కులు కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నాను. – కొదురుపాక మీనాకుమారి, కొత్తగూడెం మున్సిపాలిటీ -
విద్యార్థులు కలెక్టరేట్‌కు ర్యాలీ
సాక్షి, మహబూబ్‌నగర్: మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదు సార్.. ఎట్లబడితే అట్ల వండుతున్నరు.. అన్నంలో పురుగులు వస్తుంటయ్.. కూరగాయలు నీళ్ల చారుకంటే పలుసగ ఉంటయి.. ఇట్లుంటే ఎట్ల తినాలే సార్.. అంటూ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్ విద్యార్థులు సోమవారం కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో మొరపెట్టుకున్నారు. హాస్టల్ నుంచి నేరుగా ప్రజావాణి కేంద్రానికి చేరుకుని కలెక్టర్‌ను కలిశారు. జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్లలో వార్డెన్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని, నాణ్యమైన భోజనం, వసతులు కల్పించడం లేదని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. సమస్యలను జిల్లా అధికారులకు విన్నవించినా మార్పు రావడంలేదని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీరు, మెనూ ప్రకారం ఆహారం ఇవ్వడం లేదని, హాస్టల్ పరిసరాలు శుభ్రంగా లేవని ఈ సమస్యలను మీరే పరిష్కరించాలని విన్నవించారు. స్పందించిన కలెక్టర్ వీలైనంత త్వరగా విచారణ చేయించి మీ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతానని హామీనివ్వడంతో విద్యార్థులు శాంతించారు. అన్ని హాస్టళ్లలో ఇదే తంతూ.. జిల్లాలో మొత్తం 5 కళాశాల స్థాయి హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో రెండు జడ్చర్లలో ఉండగా, మిగతావి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాయి. రెండు బాలుర హాస్టళ్లు ఉండగా, మూడు బాలికల హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 1,650 మంది విద్యార్థులు చదువుతున్నారు. చాలా హాస్టళ్లలో విద్యార్థులు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ కూడా మెనూ, నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదు. మరుగుదొడ్లు, గదులు, కిచెన్లు, డైనింగ్‌హాళ్ల వంటి వాటిలో పూర్తిగా శుభ్రత లోపించింది. అన్ని హాస్టళ్లు పాతవి కావడంతో తలుపులు, కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ విషయం జిల్లా అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల నిరసన సమస్యల గురించి వార్డెన్‌కు చెప్పినా పట్టిం చుకోవడంలేదని ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు ఉదయం టిఫిన్‌ను బహిష్కరించి, జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్‌పల్లి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. దారిమధ్యలో ఎస్సీ సంక్షేమశాఖ అధికారి యాదయ్య విద్యార్థులను సముదాయించేందుకు ప్రయత్నించినా విద్యార్థులు వినలేదు. హాస్టల్లో సమస్య ఉందని చెప్పినా నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నారని, మెనూ విషయం అస్సలు పట్టించుకుకోవడంలేదని, బియ్యం బాలేదని, అన్నం వం డితే ముద్దలు ముద్దలుగా అవుతుందని, అది తిని పిల్లలు కడుపునొప్పితో బాధపడుతున్నారని అధికారితో వాగ్వాదం చేశారు. హాస్టల్లో కేవలం 250 మంది విద్యార్థులకు అడ్మీషన్లు ఇవ్వాల్సి ఉండగా 430 మంది విద్యార్థులు ఉంటున్నారని, మరుగుదొడ్లు, తాగునీరు, గదులు సరిపోవడం లేదని వార్డెన్ ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోక పోవడంతోనే కలెక్టర్‌ను కలవడానికి వెళ్తున్నామని తెలిపారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలే హాస్టల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, గదులు లేవు. తాగునీరు, స్నానానికి నీళ్లు లేక ఎక్కడెక్కడికో వెళ్లి చేసి వస్తున్నం. హాస్టల్ ఆవరణ అంతా పందులే ఉంటాయి. ఈ విషయాన్ని వార్డెన్‌కు, ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలే. – తిరుపతయ్య, ఎంవీఎస్ కళాశాల విద్యార్థి -
కలెక్టరేట్ ఖాళీ
సాక్షి, శ్రీకాకుళం : కలెక్టరేట్లో ఈనెలాఖరుకు పలు సీట్లు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే అరకొర సిబ్బందితో నడుస్తున్న కలెక్టరేట్‌కు ఆగస్టు ఒకటి నుంచి మరింత సమస్య ఎదురుకానుంది. ఇప్పటికే పలు సెక్షన్లలో సూపరింటెండెంట్లు లేరు. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్ల కొరత ఉంది. ఈనెలాఖరుతో ఈ సమస్య మరింత పెరగనుంది. జిల్లా కలెక్టరేట్లో పనులు చకచక జరిగితేనే డివిజన్, మండల స్థాయిలో పనులు వేగవంతం అవుతాయి. జిల్లా కేంద్రంలో ఉన్నత కార్యాలయంలోనే సిబ్బంది కొరత వేధిస్తుంటే.. ఇక దిగువస్థాయిలో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల జరిగిన బదిలీల ఫలితంగా కలెక్టరేట్లోని ఎనిమిది సెక్షన్లలో ఆరు ఖాళీ అయ్యాయి. తహసీల్దార్లు ఆర్.గోపాలరావు, కృష్ణప్రసాద్‌లు ఇన్చార్జిలతో ఈ సెక్షన్లను నడిపించారు. వారు కూడా ఈనెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో అన్ని సెక్షన్లు ఖాళీ కా నున్నాయి. వీరితోపాటుగా రెవెన్యూ విభాగంలో తహసీల్దారు కేడరులో ఉన్న మరో ఇద్దరు.. జె.గోపాలరావు, ఎన్.సరళలు కూడా పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో తహసీల్దారు కేడర్‌లో పది పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరమేర్పడింది. డీపీసీ అక్టోబర్ వరకు లేనట్టే.. జిల్లాలో తహసీల్దార్ల కొరత తీరాలంటే ఉన్న వారికి పదోన్నతులు ఇవ్వాలి. ప్రస్తుతం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) అమలు చేసే పరిస్థితి లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు మార్చి నెలలో డీపీసీ సూచన ప్రకా రం పదోన్నతులు ఇచ్చారు. దీంతో జిల్లాలో 9 మందికి ప్రమోషన్లు వచ్చాయి. కొత్తగా డీపీసీ నిర్వహించాలంటే ప్రస్తుతం ప్రో డీటీలు ఉన్నారు. సెప్టెంబర్ నెలలో వారి ప్రొబేషన్ పీరియడ్ పూర్తవుతుంది. ఆ తరవాత డీపీసీ ఇచ్చే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో గల సీనియారిటీ ప్రాప్తికి ఇప్పటికి ఉన్న డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతి కల్పించవలసివుంది. అయితే ఈ డీపీసీ అక్టోబర్ వరకు లేదని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. అడ్‌హక్ తప్పనిసరి రెగ్యులర్ విధానంలో తహసీల్దార్లు లేనప్పుడు పరి పాలనా సౌలభ్యం కోసం ఉన్న డిప్యూటీ తహసీల్దార్లలో సీనియర్లకు తాత్కాలిక పద్ధతిలో పదోన్నతులు ఇచ్చి తహసీల్దారు బాధ్యతలు నిర్వహించేందుకు అనుమతులు ఇస్తారు. ప్రస్తుతం మన జిల్లాలో ఈ పరిస్థితి ఏర్పడింది. జూలై 31 నాటికి పదవీ విరమణ చేయనున్న తహసీల్దార్ స్థానంతో కలిపి 10మంది తహసీల్దార్లు కావాలి. ఈ పోస్టులకు అడ్‌హక్ పదోన్నతులు ఇచ్చే అకాశం ఉంది. ‘ఎ’ సెక్షన్ సూపరింటెండెంట్ కీలకం కలెక్టట్లో ‘ఎ’ సెక్షన్ కీలకంగా ఉంటుంది. ఈ సెక్షన్ అధికారిని పరిపాలనాధికారి (ఏవో) అంటారు. జిల్లా రెవిన్యూ విభాగంలో ఉద్యోగులు, ఇతర అంశాలకు సంబంధించిన కీలక ఫైళ్లన్నీ ఈ విభాగం నుంచే కదులుతాయి. అందుకే ఈ సెక్షన్ సూపరింటెండెంట్‌కి అనుభవం ఉండాలి. సాధారణంగా జీవోలపై అవగాహన ఉన్న సీనియర్ తహసీల్దారుకు, పనులు వేగంగా నిర్వహించే వారికి ఈ సీటును కేటాయిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న సీనియర్ తహసీల్దార్లందరినీ వివిధ మండలాలకు కేటాయించారు. ఇక అడ్హక్లో భర్తీ అయిన అత్యంత జూనియర్ తహసీల్దారుకు ఈ పోస్టును కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సెక్షన్‌లోని సిబ్బందిలో ఒకరిద్దరిపై అవినీతి ఆరోపణలు, అధికారులను తప్పుతోవ పట్టిస్తారని అభియోగాలు ఉన్నాయి. ఈ తరుణంలో జూనియర్ అడహక్ తహసీల్దారును ఈ సీటులో కూర్చోబెడితే ఈ సెక్షన్ పరిస్థితి దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది. పదోన్నతులు ఇచ్చినా చేరేవారేరి? కలెక్టరేట్లో వివిధ సెక్షన్లకు అడ్‌హక్ విధానంలో తహసీల్దారుగా పదోన్నతులు కల్పించినా, ఆ పదో న్నతులు తీసుకొనే పరిస్థితి ప్రస్తుతం రెవిన్యూ విభా గంలో లేదు. ప్రస్తుతం పదోన్నతులు పొందిన వారు కలెక్టరేట్లో పనిచేయాల్సి ఉంటుంది. కలెక్టరేట్లో పని అంటే ఒత్తిడితోపాటు.. రాత్రి పగలు పనులు, ఉన్నతాధికారులకు ప్రతి విషయంలో సమాధానం చెప్పకో వాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువలన ఈ సెక్షన్ సూపరిం టెండెంట్ పోస్టులకు చాలా మం ది సుముఖంగా లేనట్టు తెలు స్తోంది. పదోన్నతి ఇస్తే, తహసీ ల్దారుగా పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నా, కలెక్టరేట్ సెక్షన్లో పనిచేసేందుకు ముం దుకు వచ్చిన పరిస్థితి లేదు. దీంతో ఈ అడ్‌హక్ పదోన్నతులపై సందేహలు చోటు చేసుకొంటున్నాయి. ఏది ఏమైనా పదోన్నతులు ఇస్తే తప్ప కలెక్టరేట్లో సెక్షన్ సూపరింటెండెంట్ల సమస్యకు పరిష్కారం లేనట్టే. -
ఉండేదెవరు...? వెళ్లేదెవరు...?
ప్రభుత్వం మారుతోంది. పాలనలో విధానాలు మారుతాయి. కొత్త పాలకులు పగ్గాలు చేపట్టాక సహజంగానే ప్రక్షాళన మొదలవుతుంది. ఇప్పుడదే జిల్లాలోని అధికారుల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనుకూలురన్న ముద్రపడినవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యమైన అధికారుల్లో ఎవరుంటారు.. ఎవరు వెళ్లిపోతారన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఇక వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు జిల్లాకు రావాలని ఆశపడుతున్నట్టు కూడా ప్రచారం సాగుతోంది. విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరుతున్న నేపథ్యంలో జిల్లాలో అధికారుల బదిలీలపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న జిల్లా అధికారుల్లో ఎంతమంది జిల్లాలో కొనసాగుతారు... ఎందరు జిల్లా నుంచి బయటకు వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే కొంతమంది అధికారులు జిల్లా నుంచి వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతుండగా,.. కొంతమంది మాత్రం ఇక్కడే కొనసాగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇతర జిల్లాలో పని చేసే అధికారులు సైతం ఇక్కడకు వచ్చేందుకు ఎదురు చూస్తున్నారని వినికిడి. ఈ మేరకు ఎవరికి వారే తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారని అధికార వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. పాలనపై దృష్టిపెట్టిన కొత్త నేత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు అఖండ మెజార్టీ కట్టబెట్టిన విషయం విదితమే. ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్రంలో పరిపాలనపై దృష్టిసారించగా ప్రమాణ స్వీకారం తర్వాత పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారని సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయిలో పని చేసే అధికారులతోపాటు జిల్లాలో పని చేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం కూడా ఉంది. అంతేగాదు. జిల్లా స్థాయిలో పని చేసే అధికారుల బదిలీలు కూడా కొన్ని వచ్చే నెలలో చేపట్టే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పని చేసే కీలక అధికారులతోపాటు ఇతర జిల్లా అధికారులు బదిలీలపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కలెక్టరేట్‌తోపాటు ఇతర కార్యాలయాలకు వెళితే జిల్లాలో అధికారులు ఎవరు కొనసాగుతారు... ఎవరి వెళ్లిపోతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బదిలీలు ఎందరికి? ప్రభుత్వం మారిన తర్వాత బదిలీలు సహజమే. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం నియమించిన అధికారులను పక్కనపెట్టి తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు కీలక పోస్టుల్లో వేసుకుంటుంది. జిల్లా స్థాయిలో నాయకులు కూడా తమకు నచ్చిన వారిని తెచ్చుకుని పని చేయించుకోవాలని చూస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో అధికారుల మార్పు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇందులో భాగంగా బదిలీలు ఎవరికి ఉంటాయన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యంగా కలెక్టర్ హరి జవహర్లాల్ బదిలీపై ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు జిల్లాకు వచ్చారు. అప్పట్లో ఆయన అధికారపార్టీకి పూర్తిగా విధేయుడిగా పని చేశారు. ఎన్నికల్లో మాత్రం కాస్తా నిష్పక్షపాతంగా పని చేశారు. కానీ ఆయన పోలింగు ముగిసిన తర్వాత జరిగిన విలేకర్ల సమావేశంలో తాను రెండువారాల్లో వెళిపోతానని చెప్పడం, తన సన్నిహిత అధికారుల వద్ద కూడా తనకు బదిలీ ఉంటుందని చెప్పడంతో ఆయన బదిలీపై ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విషయానికొస్తే ఆయన ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చారు. నాన్కేడరు ఎస్పీగా జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వంలో పెద్దలు కోరి ఆయనను వేసుకున్నారన్న ప్రచారం జరిగింది. ఆయనను బదిలీ చేయాలని జిల్లా వైఎస్సార్సీపీ నేతలు కూడా అప్పట్లో ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆయన బదిలీపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న ఆసక్తి ఉంది. జేసీ వెంకట రమణారెడ్డి జిల్లాకు వచ్చి ఏడాదైంది. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీలో పలువురు నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ఆయన బదిలీ ఉండకపోవచ్చు. కానీ ఆయన రాయలసీమలో ఏదైనా జిల్లాకు బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నించవచ్చునని చర్చ జరుగుతుంది. ఆయన కోరుకుంటే బదిలీ ఖాయమే. పార్వతీపురం ఐటీడీఏ పీవో లక్ష్మిశ, సబ్‌కలెక్టర్ చేతన్ వచ్చి రెండేళ్లు కాలేదు... ఇద్దరూ రాజకీయాలకు అతీతంగా పని చేస్తారన్న పేరున్నా బదిలీల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్న ఆసక్తి ఉంది. ఇక జిల్లా అధికారులంతా గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు వచ్చిన వారే. కానీ వీరిలో కొంతమంది మాత్రం అధికారపార్టీకి పూర్తి విధేయులుగా పని చేశారు. కొందరు మాత్రం ప్రభుత్వం ఏదైతే తమకెందుకు... తమ విధులు తాము చేసుకుపోతామన్న రీతిలో వెళ్లారు. ఈ నేపథ్యంలో వీరి విషయంలో అధికారపార్టీ నాయకులు ఎలా ఆలోచిస్తారని, వారిలో ఎందరిని ఇక్కడ కొనసాగిస్తారన్న ఆసక్తి నెలకొంది. కొనసాగేందుకు ప్రయత్నం ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న అధికారులు చాలామంది జిల్లాలో కొనసాగాలని ఆసక్తితో ఉ న్నారు. ఇందులో చాలామంది గతంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, చీపురుపల్లి ఎమ్మె ల్యే బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉండగా జిల్లాలో పని చేశారు. ఇదే చనువుతో మళ్లీ వారి ప్రభుత్వ హయాంలో పని చేయాలని కొందరు ఆసక్తి కనపరుస్తున్నారు. వీరే కాకుండా ప్రస్తు తం పని చేస్తున్న అధికారుల్లో చాలామంది ఇక్క డే ఉండాలని చూస్తున్నారు. మంత్రివర్గ ఏర్పా టు తర్వాత జిల్లాలో మంత్రి పదవి చేపట్టిన వారి వద్దకు వెళ్లి ప్రయత్నించాలని భావిస్తున్నా రు. మరికొందరు ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి తమ మనుసులో మాట చెబుతున్న ట్లు సమాచారం. ఇదిలాఉండగా ఇంతకుముం దు జిల్లాలో పని చేసి, వేరేప్రాంతంలో ఉన్న పలువురు అధికారులు మళ్లీ జిల్లాకు వచ్చేందు కు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈమేరకు వారు కూడా నాయకులను కలిసేందుకు సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలిసింది. -
కలెక్టరేట్.. ఓ అప్పుల కుప్ప
నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అని గొప్ప పేరు పొందింది విశాఖ నగరం.. కానీ నగరానికి, జిల్లాకు పరిపాలనా కేంద్రమైన కలెక్టర్ కార్యాలయం మాత్రం అప్పుల కుప్పలా మారిపోయింది.గత ఐదేళ్లలో అయిన దానికీ.. కానిదానికీ విశాఖను వేదికగా చేసుకొని హంగూ ఆర్భాటాలతో హడావుడి చేసిన టీడీపీ సర్కారు వాటి నిర్వహణకు అయిన ఖర్చులను మాత్రం విదల్చలేదు. ఉత్తుత్తి కేటాయింపులు, హామీలే తప్ప నిధుల విడదల ఊసు లేకపోవడంతో ఆ హంగూ ఆర్భాటాలకు అయిన ఖర్చుల భారం కలెక్టరేట్ నెత్తిన పడింది. బహిరంగ సభలు, సదస్సులు, ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన నిర్వాహక ఏజెన్సీలకు కోట్లలోనే బకాయి పడింది. అదిగో.. అలాంటి బకాయిలే జీవీఎంసీకి కలెక్టరేట్, సర్క్యూట్హౌస్ల తరఫున చెల్లించాల్సిన రూ.6కోట్లు. సర్కారు తరఫున నిర్వహించిన పలు కార్యక్రమాలకు షామియానాలు సరఫరా చేసిన వారికే అక్షరాల ఆరు కోట్ల రూపాయలు బకాయిపడ్డారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాక్షి, విశాఖపట్నం: నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ జిలాŠల్ కలెక్టరేట్ అప్పుల్లో కూరుకుపోయింది. కలెక్టరేట్ అప్పుల్లో ఉండడం ఏమిటనుకుంటున్నారా?.. కానీ ఇది పచ్చి నిజం. గడిచిన ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉత్సవాలు, సంబరాలు, సదస్సులు, సమ్మేళనాల పేరిట చేసిన హంగు, ఆర్భాటాలకు చేసిన అప్పులు ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ మెడకు చుట్టుకున్నాయి. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక జిల్లా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విశాఖ కలెక్టరేట్‌కు అక్షరాలా రూ.21.50 కోట్ల అప్పు ఉంది. వీటితో పాటు జీవీఎంసీకి కలెక్టరేట్ అప్పు పడింది రూ.5.19 కోట్లు. కలెక్టరేట్‌కు చెందిన సర్క్యూట్ హౌస్‌కు సంబంధించి మరో రూ.78.40 లక్షలున్నాయి. ఇలా ఇవన్నీ కలుపుకొంటే దాదాపు రూ.27.50 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విశాఖకు వారానికోసారి వస్తూ పోతుండేవారు. రాష్ట్ర చరిత్రలో మరే ఇతర ముఖ్యమంత్రి రానన్ని సార్లు విశాఖకు ఆయన వచ్చారు. అధికారికంగా 115 సార్లు విశాఖ జిల్లాలో పర్యటించారు. గ్రామీణ జిల్లాలోకంటే విశాఖ నగరంలోనే ఎక్కువ సార్లు పర్యటించారు. 2014 నుంచి ఆయన పర్యటనలకు చెల్లించాల్సిన రెగ్యులర్ ప్రోటోకాల్ నిధులే రూ.ఏడున్నర కోట్ల వరకు ఉన్నాయి. ఇక సదస్సులు, సమ్మేళనాల పేరిట ఇతర పర్యటనలకు సంబంధించి షామియానాలకే ఏకంగా రూ.6 కోట్లకు పైగా కలెక్టరేట్ చెల్లించాల్సి ఉంది. ఇక పట్టాల పండగ పేరిట మూడేళ్ల పాటు వరుసగా సిటీలో భారీ సభలు ఏర్పాటు చేశారు. 60 వేల మందికి క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కోసం ఏయూ, స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభల కోసం రూ.8.50కోట్లు పైగా ఖర్చు చేశారు. మిగిలిన బకాయిలెలా ఉన్నా.. పట్టాల పండగల పేరిట ఖర్చు చేసిన రూ.8.50 కోట్ల బకాయిల కోసం గడిచిన ఏడాదిలో రెండు మూడు సార్లు లేఖలు రాసినా జీఏడీ ససేమిరా అంది. మా అనుమతి లేకుండా మీ ఇష్టమొచ్చినట్టుగా హంగూ ఆర్భాటంగా ఖర్చుచేస్తే మేమెందుకు ఇస్తామంటూ జీఏడీ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆ సొమ్ములను ఏ విధంగా రాబట్టాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరో వైపు ఈ అప్పులోళ్లు రోజూ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని వడ్డీలు చెల్లించలేకపోతున్నామంటూ షామియానాలు అద్దెకు ఇచ్చిన టెంట్ హౌస్ యజమానులు, వాహనాలు సమకూర్చిన ట్రావెల్ ఏజెంట్లు, ఇలా ప్రతి ఒక్కరూ బకాయిల కోసం ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ బకాయిల కోసం మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నారు. -
అచ్చం ‘సర్కార్’ సినిమాలో లాగా.. కానీ..
సాక్షి, చెన్నై: ఇటీవల విజయ్ విడుదలైన ‘సర్కార్’ సినిమాలో ఓ వ్యక్తి కుటుంబంతో సహా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడతాడు. ఇద్దరు కూతుళ్లు, భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తాడు. అయితే అక్కడున్న అధికారులెవరూ గుర్తించకపోవడంతో ఒక్క బాలిక మినహా ముగ్గురు అగ్నికి ఆహుతి అవుతారు. సరిగ్గా ఇలాంటి ఘటనే కోయంబత్తూరు కలెక్టరేట్ ఎదుట జరిగింది. అయితే అదృష్టవశాత్తు మీడియా ప్రతినిధులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం నుంచి వారు బయటపడ్డారు. వివరాలు.. కోయంబత్తూరు కలెక్టరేట్లో సోమవారం ఓ కుటుంబం ఆత్మాహుతి యత్నం చేసింది. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే క్రమంలో మీడియా వర్గాలు గుర్తించి, వారిని రక్షించారు. పెట్రోల్ క్యాన్‌తో కలెక్టరేట్‌లోకి ఓ కుటుంబం వచ్చినా వారిని అడ్డుకునేందుకు అక్కడ ఏ ఒక్క పోలీసు లేకపోవడం శోచనీయం. కందు వడ్డి వేధింపులు తాళలేక తిరునల్వేలి కలెక్టరేట్లో ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు ఆత్మాహుతికి పాల్పడడం రాష్ట్రంలో కలకలం రేపింది. నలుగురు ఆహుతి అవుతున్నా రక్షించేందుకు, మంటల్ని ఆర్పేందుకు తగ్గ పరికరాలు లేకపోవడం వివాదానికి దారి తీసింది. దీంతో అన్ని కలెక్టరేట్ వద్ద అగ్ని నిరోధక పరికరాలు ప్రవేశ మార్గంలోనే ఉంచారు. అలాగే ప్రవేశమార్గంలో భద్రతా విధుల్లో ఉండే పోలీసులు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించాల్సి ఉంది. అయితే ఇవన్నీ మమా అనిపించే రీతిలోనే ఉన్నాయన్న విమర్శలు ఎక్కువే. ఈ విమర్శలకు బలం చేకూర్చే రీతిలో తాజా ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారి వేధింపులతో.. విచారణలో కోయంబత్తూరుకు చెందిన సెల్వరాజ్ కుటుంబంగా తేలిసింది. తన ఇద్దరు కుమార్తెల వివాహం కోసం దాచుకున్న సొమ్ముతో గతంలో సెల్వరాజ్ స్థలాన్ని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ స్థలాన్ని తనకు ఇవ్వాలని ఓ పోలీసు అధికారి వేధిస్తూ వచ్చినట్టు సమాచారం. పోలీసుస్టేషన్‌కు వెళ్లిన పక్షంలో న్యాయం లభించదని భావించి, కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడానికి గతంలో ప్రయత్నించారు. అక్కడ కూడా తమ ప్రయత్నం ఫలించకపోవడంతో చివరకు ఆత్మాహుతికి సిద్ధపడి వచ్చామని కలెక్టరేట్ వర్గాలకు సెల్వరాజ్ వివరించినట్లు తెలిసింది. దీంతో ఆ అధికారి ఎవరో, ఆ స్థలం ఎక్కడ ఉన్నదో తదితర అంశాల మీద సమగ్ర విచారణకు కలెక్టర్ రాజామణి ఆదేశించారు. -
సైరా.. రాజకీయ నాయకా
సాక్షి, అమరావతి బ్యూరో : ఎన్నికల నగారా మోగింది. సరిగ్గా 74 రోజుల్లో రాష్ట్ర రాజకీయం ఏంటో తేటతెల్లం కానుంది. మార్చి 18 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుండగా ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. గత వారంలో రోజులుగా నిన్నా.. నేడూ అంటూ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఉత్కంఠ ఉండగా ఆదివారం కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటనతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నేటి నుంచి జిల్లా రాజకీయం జెట్‌స్పీడ్‌ను అందుకోనుంది. అభ్యర్థుల ప్రకటన, ప్రచారం ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమవ్వగా.. రేపటి నుంచి ఇది మరింత ఊపందుకోనుంది. ఇక పల్లెపల్లెన ప్రచారం హోరెత్తనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లా అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నం కానున్నారు. 18 నుంచి నామినేషన్ల స్వీకరణ.. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినట్లుగా మార్చి 18న నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. 25 వరకు ఈప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 26న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. కలెక్టరేట్లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగం.. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగానికి సంబంధించిన అంశాలపై నేడు కలెక్టర్ స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసే పనుల్లో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. సీఎం, ప్రధాని ఫొటోలు తీసేయాల్సిందే.. ఎన్నికల నియమావళి(కోడ్) రాష్ట్రంలో ఆదివారం నుంచి సంపూర్ణంగా అమల్లోకి వచ్చింది. ఎన్నిక షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో రానుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల సంఘం ‘కోడ్’లోని ఏడో నిబంధనను అమల్లోకి తేవడంతో వీటన్నింటికీ బ్రేక్ పడింది. షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ అంతటా అమల్లోకి ఇక వచ్చినట్లే. దీంతో ప్రభుత్వ భవనాలపై ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు, గోడలపై రాతలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు అన్నింటినీ 24 గంటల్లో తొలగించాలి. ప్రభుత్వ వెబ్సైట్లలోనూ సీఎం, ప్రధాన మంత్రి ఫొటోలు తొలగించాల్సిందే. ప్రజా ఆస్తులైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలు, రహదారుల వెంట వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్‌లను 48 గంటల్లో తొలగించాలి. ఇక ప్రైవేటు ఆస్తులపై ఉన్న వాటిని 2 గంటల్లో తొలగించేయాలి. -
విశాఖపట్నం : మీ ఓటు ఉందా.. వెంటనే సరి చూసుకోండి..
సాక్షి, విశాఖపట్నం : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. - 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. - కలెక్టరేట్లోని కాల్ సెంటర్ ల్యాండ్ లైన్ నెం : 0891–2534426 - కాల్ సెంటర్ ఇన్చార్జి : కే.పద్మ, పీడీ, డ్వామా : 9490914671 - జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. - మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. - సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. - ఆర్డీవో ఆఫీసులో ఎన్నికల విధులు చూసే అధికారి (ఆర్డీఓ లేదా ఇతరులు) ఉంటారు. ఆయనను సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. సంప్రదించాల్సిన నంబర్: 9618827134, (ఆర్వో: జి.సూర్యనారాయణరెడ్డి) - తహసీల్దార్ కార్యాలయం ఎలక్షన్ సెల్, ఫోన్ నంబర్లు యలమంచిలి : 9100064953 అచ్యుతాపురం : 9100064943 రాంబిల్లి : 9100064952 మునగపాక : 9100064951 - మీ సమీపంలోని బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ) వద్ద ఆ బూత్ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఈ జాబితాను ప్రతి పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీనిని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. - ఒకవేళ మీ ఓటు లేదని తెలిస్తే.. పై మూడు స్థాయిల్లోనూ అక్కడికక్కడే తగిన ఆధారాలు చూపి, ఫారం–6 నింపి ఓటు నమోదు చేసుకోవచ్చు. - మీ–సేవ కేంద్రాల్లోనూ నిర్ణీత రుసుము తీసుకుని ఓటు ఉందో లేదో తెలియ చెబుతారు. అక్కడే ఓటు నమోదు చేస్తారు. - ఎన్నికల షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్ నుంచి బూత్ లెవల్ అధికారి వరకు అందరి వద్దా ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే.. ఓటు నమోదుకు గల అవకాశాల గురించి ఆర్డీఓ, ఎమ్మార్వో, బూత్ లెవల్ అధికారిని సంప్రదించాలి. ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
ఓటరన్నా.. జర భద్రం!
సాక్షి, వనపర్తి టౌన్ : మంచి నేతను ప్రతినిధిగా ఎన్నుకోవాలన్నా... సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ఓటర్లు తీర్పే కీలకం. నేతల తలరాతలను మార్చేది, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేది ఓటే. అయితే, ఆ ఓటును బాధ్యతగా గుర్తిచేలా, ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేలా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రలోభాలకు లొంగొద్దని కోరుతూ ఓటు హక్కును తప్పక వినియోగించుకునేలా అవగాహన కల్పించే చిత్రాలతో పాటు ఫిర్యాదు చేయాల్సిన నంబర్లతో పోస్టర్లు ముద్రించారు. ఈ పోస్టర్లను కలెక్టర్ ఆదేశాలతో వనపర్తి డీఎం దేవదానం ఆధ్వర్యాన సోమవారం బస్సులకు అంటించారు. -
గళమెత్తిన పారిశుద్ధ్య కార్మికులు
విజయనగరం మున్సిపాలిటీ : పట్టణ ప్రాంతాల్లో నూతన పారిశుద్ధ్య విధానం అమలును వ్యతిరేకిస్తూ శుక్రవారం మున్సిపల్ ఔట్సోర్సింగ్ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతల నడుమ ముగిసింది. జీఓ నంబర్ 279ను వ్యతిరేకిస్తూ సీఐటీయూ చేపట్టిన ఈ కార్యక్రమంలో విజయనగరం మున్సిపాలిటీ సహా సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అంతకుముందు విజయనగరం మున్సిపల్ పారిశుధ్ధ్య కార్మికులంతా మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం నాలుగు మున్సిపాలిటీల కార్మికులు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు నిరసన చేపట్టిన అనంతరం కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య స్వల్ప తోపులాటు చోటు చేసుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు వచ్చి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వటంతో కార్మికులు అక్కడి నుంచి వెనుదిరిగారు. మా పొట్టలు కొట్టద్దు ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలను జీఓ నంబర్ 279 పేరిట రోడ్డున పడేయొద్దని సీఐటీయూ నేతలు రెడ్డి శంకరరావు, టీవీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పారిశుద్ధ్య విధానాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా విజయనగరం మున్సిపాలిటీలో జీఓ నంబర్ 279 అమలుకు చర్యలు చేపట్టడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగకపోతే ప్రజారోగ్యానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తాజా విధానంతో ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయనున్నారన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు జగన్మోహనరావు, యు.శంకరరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లాలో దారుణం
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం పైనుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని ఆళ్లగడ్డలో శోభారాణి అనే మహిళ స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో సూపర్ వైజర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈరోజు డీఆర్సీ మీటింగ్ ఉండటంతో ఆమె కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. మీటింగ్ జరుగుతుండగానే శోభారాణి భవనంపైకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. సిబ్బంది అప్రమత్తమై ఆస్పత్రికి తరలించే లోపలే శోభారాణి మృతి చెందింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహ్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మనోవేదనకు గురి చేశారు తన భార్య శోభారాణి ఆత్మహత్యకు సంక్షేమ శాఖ సీపీడీఓ పద్మావతి కారకురాలని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. ఆరోగ్యం బాగలేకపోయినా.. మెమోలు ఇచ్చి మనోవేదనకు గురి చేశారన్నారు. వేధింపులు తట్టుకోలేక ఆమె బలవన్మరణం చెందిందన్నారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అతను డిమాండ్ చేశాడు. -
కొడుకులు హింసిస్తున్నారని..
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద కలకలం రేగింది. గౌరీ పట్నానికి చెందిన బి. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సోమవారం ఉదయం కలెక్టరేట్‌కు వచ్చాడు. తన ఇద్దరు కొడుకులు ఆస్తులు కోసం కొడుతూ హింసిస్తున్నారని మనస్థాపానికి గురైన అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతనిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
స్పీడందుకున్నాయ్..!
సాక్షి, కొత్తగూడెం: కలెక్టరేట్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. జిల్లా ఆవిర్భావం తర్వాత కొత్త కలెక్టరేట్ నిర్మాణం కోసం స్థలం ఎంపికలో జాప్యం జరిగింది. అయితే ఆ ప్రక్రియ పూర్తి కావడంతో పనులు వేగంగా నడుస్తున్నాయి. పాల్వంచ (నవభారత్) లోని వెంకటేశ్వరస్వామి ఆలయం – కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ మధ్య కలెక్టర్ కార్యాలయం నిర్మించనున్నారు. సర్వే నంబరు 405లో ఉన్న మైనింగ్ కళాశాలకు చెందిన 25 ఎకరాలను గత నవంబర్‌లో పాల్వంచ తహసీల్దారు ఆర్అండ్బీ శాఖకు అప్పగించారు. గుట్టలా ఉండే ఈ ప్రాంతాన్ని మూడు నెలల కాలంలో చదును చేశారు. కలెక్టరేట్ ప్రధాన కార్యాలయానికి సంబంధించి కాంక్రిట్ పుట్టింగ్ పనులు పూర్తి కాగా, కాలమ్స్(పిల్లర్లు) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కలెక్టరేట్ పక్కనే ఆడిటోరియం కూడా నిర్మించనున్నారు. 1.50 లక్షల చదరపు అడుగులతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ 17 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మొత్తం 36 శాఖల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. 14 నెలలకు స్పష్టత.. జిల్లా ఏర్పడి 14 నెలలు గడిచిన తరువాత కలెక్టరేట్ నిర్మాణంపై స్పష్టత వచ్చింది. రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రస్తుత స్థలంలో కలెక్టరేట్ నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే శ్రీరామనవమి రోజున సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని సమాచారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2016 అక్టోబర్ 11న ఏర్పాటు చేసింది. కొత్తగూడెంలో వివిధ శాఖల కార్యాలయాలను సింగరేణి భవనాలలో ఏర్పాటు చేశారు. అయితే నూతనంగా ఏర్పడిన జిల్లాలతో పాటు మరికొన్ని పాత జిల్లాలకు కలిపి మొత్తం 26 జిల్లాల్లో కలెక్టరేట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉంచాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణాల మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేసింది. 9 జిల్లాల్లో 1.50 లక్షల చదరపు అడుగులతో, 17 జిల్లాల్లో 1.20 లక్షల చదరపు అడుగులతో భవనాలు నిర్మించేలా మార్గదర్శకాలను సూచించింది. ఇందుకోసం 17 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ ప్రతిపాదనలు వచ్చిన ఏడాది తర్వాత కానీ కలెక్టరేట్ల నిర్మాణం పలు జిల్లాలో ప్రారంభం కాలేదు. నూతన జిల్లాల ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్, సిరిసిల్ల, సిద్దిపేటలో కలెక్టరేట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలు స్థలాల పరిశీలన.. చివరకు పాల్వంచలో జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పలు స్థలాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ప్రధానంగా కొత్తగూడెం నుంచి ఇల్లందు క్రాస్ రోడ్డుకు నడుమ ఉన్న స్థలం, ఆ తర్వాత కొత్తగూడెంలోని రామవరం వద్ద ఉన్న స్థలాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ స్థలాల ఎంపిక విషయంలో ఏడాది దాటినా సందిగ్ధం వీడకపోవడంతో మధ్యే మార్గంగా కొత్తగూడెం – భద్రాచలం రోడ్డులో ప్రభుత్వ మైనింగ్ కళాశాల, నవభారత్ వెంకటేశ్వర స్వామి దేవాలయం మధ్యలో ఉన్న 25 ఎకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించి కలెక్టరేట్ నిర్మాణానికి అనువుగా, జిల్లాలోని అన్ని మండలాల వారికి అందుబాటులో ఉంటుందని నివేదిక సమర్పించడంతో పనులు వేగవంతమయ్యాయి. 17 ఎకరాల్లో నిర్మాణం... ప్రభుత్వం ప్రతిపాదించినట్లు 1.50 లక్షల చదరపు అడుగులతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం 17 ఎకరాలలో జరగనుంది. అంతే కాకుండా 36 శాఖల కార్యాలయ భవనాలు అన్ని ఒకేచోట ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కలెక్టర్ కార్యాలయం, రెసిడెన్సీలను 6 వేల చదరపు అడుగులలో, జాయింట్ కలెక్టర్ రెసిడెన్సీని 3వేల చదరపు అడుగులలో, జిల్లా రెవెన్యూ అధికారి రెసిడెన్సీని 2,500 చదరపు అడుగులలో నిర్మించనున్నారు. 36 శాఖల కార్యాలయాలు, వాటికి కాన్ఫరెన్స్ హాళ్లు, ఇతర అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. 148 మంది అధికారులకు, సిబ్బందికి 1500 చదరపు గజాలలో క్వార్టర్లలను నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. పనులు వేగవంతమయ్యాయి పాల్వంచ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చదును చేసిన స్థలంలో కొత్త కలెక్టరేట్ పనులు వేగంగా నడుస్తున్నాయి. శంకుస్థాపనకు సంబంధించి ఖచ్చితమైన తేదీ ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. ఆ కార్యక్రమం ఎప్పుడు చేసేందుకైనా సరే సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. -రాంకిషన్, జాయింట్ కలెక్టర్ -
రిబ్బన్ కట్టారు..సిజర్ మరిచారు..
సాక్షి, కాన్పూర్ : అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాన్పూర్ కలెక్టరేట్లో సోలార్ లైట్ ప్యానెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రిబ్బన్‌ను కట్ చేసేందుకు సిజర్ లేకపోవడంతో విసుగెత్తిన ఎంపీ, సీనియర్ బీజేపీ నేత డాక్టర్ మురళీ మనోహర్ జోషీ చేత్తోనే చించివేసి మమ అనిపించారు. ఆ తర్వాత మరోసారి రిబ్బన్ కట్టి సిజర్‌ను సిద్దం చేస్తున్న అధికారులను ఎంపీ వారించారు. ప్రారంభోత్సవం అయిపోందని, మరోసారి హడావిడి అవసరం లేదని సదరు అధికారికి క్లాస్ తీసుకున్నారు. అధికారిని ఉద్దేశించి..‘ఈ కార్యక్రమం నిర్వాహకులు మీరేనా..? ప్రారంభోత్సవం నిర్వహించేది ఇలాగేనా..మీ ప్రవర్తన ఏమాత్రం సరిగ్గా లేదు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.మరోసారి లాంఛనంగా ప్రారంభించాలని కోరగా అవసరం లేదంటూ అక్కడి నుంచి ఆగ్రహంగా వెనుదిరిగారు. మొత్తం కార్యక్రమం వీడియోలో రికార్డయింది. -
మానవత్వం లేదా?
ఏలూరు (మెట్రో): అనేక సంవత్సరాలు సేవలందించిన ఉద్యోగి అనారోగ్యానికి గురైతే ఇబ్బంది పెట్టడం దేనికని, తోటి ఉద్యోగులకి మానవత్వం లేకుండా పోతోందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన ఒక ఫిర్యాదుపై భూగర్భ జల వనరుల శాఖ అధికారులను కలెక్టర్ తిట్లతో తలంటారు. ఆ శాఖలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి డీ.బలరాంప్రసాద్ మెడికల్ బిల్లులను నిలుపుదల చేయడాన్ని కలెక్టర్ ప్రశ్నించారు. మెడికల్ బిల్స్ చెల్లింపులో అనేకసార్లు కార్యాలయం చుట్టూ సంబంధిత అధికారులు తిప్పుకుంటున్నారని కలెక్టర్‌కు బాధితుడు విన్నవించారు. బిల్లులను తీసుకోవాలని ప్రాథేయపడినా కనీసం బిల్లుల స్వీకరణకు కూడా స్పందించలేదని ఆవేదన చెందగా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే బలరాం ప్రసాద్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. భీమవరం మండలం కొమరాడ దళితవాడకు చెందిన ఎస్.పోతురాజు, జీ.మేరీసుధ, టీ.రఘురాజు మరికొంత మంది డంపింగ్‌యార్డు నిర్మాణ ప్రదేశాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కోరారు. కలెక్టరు స్పందిస్తూ గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం ఉండాలంటే చెత్తను తొలగించి డంపింగ్‌యార్డులకు తరలించా లని అటువంటి నిర్మాణాలను వద్దనడం సరికాదన్నారు. కార్యక్రమంలో జేసీ పి.కోటేశ్వరరావు, ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, డ్వామా పీడీ గణేష్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావు, డీఈఓ సీవీ రేణుక, డీపీఓ ఎం.వెంకటరమణ, పంచాయతీరాజ్ ఎస్ఈ మాణిక్యం, ఇరిగేషన్ ఎస్ఈ రఘునాథ్, ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మల, డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీసీహెచ్ఎస్ కె.శంకరరావు పాల్గొన్నారు. ఆస్తుల ఆక్రమణలపై విచారణ దేవాదాయశాఖ ఆస్తుల అన్యాక్రాంతంపై సమగ్ర విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం ఉదయం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫోన్‌ద్వారా వచ్చిన పలు సమస్యలను, ఫిర్యాదులను కలెక్టర్ విని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీరవాసరం నుంచి మద్దాల రామకృష్ణ మాట్లాడుతూ వీరవాసరంలోని గ్రూపు దేవాలయాలకు సంబంధించి సుమారు పది ఎకరాల సంగీతమాన్యం భూమి అన్యాక్రాంతమయ్యిందని ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ నిర్వహించాలని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ను ఆదేశించారు. -
కలకలం!
శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టరేట్ సాక్షిగా కలకలం రేగింది. రెండేళ్లుగా తిరుగుతున్నా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయడం లేదని, అధికార టీడీపీ నాయకులు అడ్డుతగులుతున్నారనే ఆవేదనతో జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన యువ రైతు టంకాల మోహన్‌రంగ బలవన్మరణానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్నవారంతా అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. టంకాల మోహన్రంగకి బాతువ గ్రామంలోని సర్వే నంబర్ 279లో ఎకరాన్నర భూమి ఉంది. ఆ భూమి మెట్టు ప్రాంతంలో ఉండడంతో రెండేళ్ల క్రితం బోరుబావి వేయించాడు. దీనికి విద్యుత్ కనెక్షన్ అవసరం ఉండడంతో సంబంధిత శాఖకు డిపాజిట్‌ను కూడా చెల్లించాడు. అయితే విద్యుత్ కనెక్షన్ మంజూరు కానీయకుండా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ విద్యుత్ కనెక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రెండుసారు కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. మరో రెండు పర్యాయాలు గ్రామంలో జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో కూడా వినతి పత్రాలు అందజేశాడు. అలాగే ముఖ్యమంత్రికి తెలియజేసేలా 1100 నంబర్‌కి కూడా ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో చావే శరణ్యమని భావించాడు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ వచ్చిన మోహనరంగ.. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకున్నాడు. అయితే అక్కడ ఉన్న వారు వెంటనే మేల్కొని అడ్డుకోవడంతో ఆపాయం తప్పింది. విషయం జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. రైతు మోహనరంగతో మాట్లాడారు. రెండో రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జి.సిగడాం తహసీల్దారు, ఆర్ఐలకు ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. భూమిని అమ్మాలని పట్టుబడుతున్నారు తమ గ్రామానికి చెందిన అధికార్టీ నాయకుడు, రేషన్ డీలర్ కూర్మారావు రియల్ ఎస్టెట్ వ్యాపారం చేస్తుంటారు. దీంతో నా భూమిని అమ్మాలని పట్టుబడుతున్నారు. దీనికి అంగీకరించలేదు. దీంతో విద్యుత్ కనెక్షన్ మంజూరు కానీయకుండా పలుకుబడిని ఉపయోగించి అడ్డుకుంటున్నారు. దీంతో చచ్చిపోవాలనుకున్నాను.- మోహన్‌రంగ,బాధిత రైతు -
చిత్తూరు కలెక్టరేట్లో కలకలం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం కలకలం రేగింది. కలెక్టరేట్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు గమనించి అతనిని అడ్డుకున్నారు. దాంతో ప్రాణాపాయం తప్పింది. తన భూమిని తనకు కాకుండా చేశారని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ఆరోపిస్తున్నాడు. అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని, అందుకే ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిపాడు. -
డిమాండ్ కోట్లల్లో .. ఇచ్చేది లక్షలా ?
సాక్షి , ఖమ్మం రఘునాథపాలెం: కలెక్టరేట్ నిర్మాణానికి అవసరమైన భూములకు ఎకరానికి రూ.5 కోట్ల చొప్పన చెల్లిస్తేనే ఇస్తామని రైతులు.. ప్రభుత్వ ధర ప్రకారం రూ.25 లక్షలు మాత్రమే ఇస్తామని రెవెన్యూ అధికారుల వాదనలతో బుధవారం తొలిసారి జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. కలెక్టర్ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల భవన సముదాయ నిర్మాణానికి వి.వెంకటాయపాలెం వద్ద అవసరమైన భూమి 26.24 ఎకరాలు గుర్తించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన రైతులు, ప్లాట్ల యజమానుల పేర్లతో కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంట్లో 17 మంది రైతులకు చెందిన సుమారు 23 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భూసేకరణ చట్టం ప్రకారం ధరల విషయంపై ప్రాథమికంగా రఘునాథపాలెం తహసీల్దార్ తిరుమలాచారి రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి 10 మంది రైతులు హాజరైనట్లు తెలిసింది. తమది వ్యవసాయ భూమి అయినప్పటికీ ఖమ్మం నగరానికి సమీపంలో ఉందని, రియల్ ఎస్టేట్ పరంగా మంచి డిమాండ్ ఉంటుందని, తదనుగుణంగా ఎకరానికి రూ.5 కోట్ల చొప్పున పరిహారం ఇప్పించాలని ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అయితే మార్కెట్ ధర అధికారికంగా రూ.5 లక్షల వరకు ఉందని, దానికి మొత్తంగా రూ. 25 లక్షలు వస్తుందని తహశీల్దార్ చెప్పడంతో రైతులు వ్యతిరేకించినట్లు తెలిసింది. కనీసం రూ.2.50 నుంచి 3 కోట్ల వరకైనా ఇవ్వాలని కొందరు రైతులు తమ వాదన వినిపించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, డిమాండ్‌ను బట్టి రూ. 30 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారని కొందరు రైతులు చెప్పారు. తాము కోట్లలో అడుగుతుంటే అధికారులు లక్షల్లోనే ఇస్తామంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, మరోసారి ధరల విషయంపై రైతులతో చర్చించనున్నట్లు తెలిసింది. చివరిగా కలెక్టర్ సమక్షంలో మాట్లాడి ధర నిర్ణయించి సానుకూలంగా పరిష్కారమైతే రైతులకు వెంటనే పరిహారం చెల్లించి భూమి సేకరించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రైతులు ఇవ్వడానికి ముందుకు రాకున్నా భూ సేకరణ చట్టం ప్రకారం తీసుకుంటామని చెపుతున్నారు. రైతులకు చెల్లించాలని నిర్ణయించిన ధర మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తామని చెపుతున్నారు. వ్యవసాయ భూముల ధరపై ఓ నిర్ణయానికి వస్తే.. తర్వాత సుమారు 23 మందికి చెందిన 3 ఎకరాలకు పైగా ఉన్న ప్లాట్ల ధర నిర్ణయిస్తారని తెలిసింది. -
కలెక్టరేట్ వద్ద ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
విజయవాడ: మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం మధ్యాహ్నం ఒక ఉద్యోగి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. తన కుటుంబానికి న్యాయం చేయమని మీ కోసం కార్యక్రమంలో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో నూజివీడు ఉపాధి హామీ పనులు విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శివాజీ కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు అతనిని వారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శివాజీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు.