ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ను ముట్టడించారు.
కరీంనగర్: ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ను ముట్టడించారు. ఉదయం నుంచే కలెక్టరేట్ వద్దకు భారీగా చేరుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. కలెక్టరేట్‌లోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు పలువురు ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేశారు.
పంచాయితి కార్యాలయంలో..
మరోవైపు పెంచిన ఇంటి పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీపీఎం, వైఎస్సార్సీపీ, బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని జమ్మికుంట నగరపంచాయతి కార్యలయాన్ని ముట్టడించాయి. ఈ క్రమంలో లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ తోపులాటలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.