మంచిర్యాల సిటీ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులకు ఉపకార వేతనాలతోపాటు భోధన రుసుములను సకాలంలో మంజూరు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దె దిగాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం మంచిర్యాలలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు తరగతులు బహిష్కరించి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేసీఆర్ విద్యావ్యవస్థను పట్టించుకోకుండా కేవలం హైదరాబాద్ అభివృద్ధి పేరిట జపం చేస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల్లోగా నిధులు మంజూరు చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఇసారపు రాకేశ్ అశ్విని రెడ్డి, వెంకటేశ్, మల్లేశ్, శ్రావణ్, శ్రీకాంత్, కుమార్, రాజేశ్, రాకేశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
తరగతులు బహిష్కరణ..
మంచిర్యాలలోని జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు తరగతులు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు పెరుగు దాస్ మాట్లాడారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని వాగ్దానం చేసిన కేసీఆర్ ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకే న్యాయం చేయలేకపోతున్నారని పేర్కొన్నారు.
ఒంటికాలిపై నిరసన
మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద పీడీఎస్‌యూ (చంద్రన్న) నాయకులు ఎండీ ఆసీఫ్, మహేశ్, జనార్దన్, సురేశ్, సత్యం తదితరులు కళ్లకు గంతలు కట్టుకుని ఒంటికాలిపై ఉండి నిరసన తెలిపారు.
కేసీఆర్ గద్దె దిగాలి
Published Fri, Jan 9 2015 9:50 AM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM
Advertisement
Advertisement