'కేసీఆర్ గారూ మా నిధులివ్వండి'
Published Wed, Jan 25 2017 2:32 PM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM
హైదరాబాద్: ఎంతో కాలంగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. బీసీ సంఘం నాయకుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం పెద్దఎత్తున హైదరాబాద్ లోని సంక్షేమ భవన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ లో ఉన్న 1600 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు, పేరుకు పోయిన స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు నిలిపివేయడం వల్ల నిరుపేద విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలు ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం తక్షణం నిధులను విడుదల చేయని పక్షంలో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Advertisement
Advertisement