MLA R Krishnaiah
-
బీసీ బిల్లుకు రాహుల్‌గాంధీ సానుకూలం: కృష్ణయ్య
హైదరాబాద్: చట్ట సభల్లో బీసీలకు రిజ ర్వేషన్లు కల్పించేందుకు 2019లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వెల్లడిం చారు. పార్లమెంటులో బీసీ బిల్లును ఆమోదిం చేందుకు రాహుల్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరు లతో మాట్లాడారు. ఈ విషయంపై మంగళ వారం రాహుల్‌గాంధీతో ప్రత్యేకంగా చర్చించా మని అందుకు ఆయన తనకు స్పష్టమై న హామీ ఇచ్చారని తెలిపారు. రాహుల్‌ను కలసిన విషయంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ప్రధానంగా బీసీ బిల్లుపైనే ఇరువురం చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. -
2019 ఎన్నికల నాటికి కొత్త పార్టీ: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీలకు రాజ్యాధికారం కోసం 2019 శాసనసభ ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. శుక్రవారం వినాయక నగర్లో నిర్వహించిన గ్రేటర్ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలను విస్మరిస్తే అన్ని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలవుతాయని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 50 శాతం సీట్ల కేటాయింపుతోపాటు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ నాయకులు నరేశ్‌బాబు, భూపేష్ సాగర్, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు వెంటనే సబ్సిడీ రుణాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్, బీసీ కుల ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న 5.77 లక్షల మందికి సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని 16 బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. మంగళవారం బీసీ భవన్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా సబ్సిడీ రుణాలివ్వలేదని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్లకు రూ.5వేల కోట్లు కేటాయించినా అందులో కేవలం రూ.210 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారన్నారు. గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి రుణాలిస్తామని మంత్రి పేర్కొనడం అన్యాయమన్నారు. ఇలా చేస్తే అధికార పార్టీ నేతలు, అధికారుల చుట్టూ తిరుగుతూ లంచాలివ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇటీవల సబ్సిడీ ట్రాక్టర్లను టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని, బీసీ రుణాలు కూడా అలాగే ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో 60 లక్షల బీసీ కుటుంబాలుంటే కేవలం దరఖాస్తు చేసుకున్న 5 లక్షల మందికి రుణాలు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. అర్హులైన బీసీలందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని సంఘం నేత ఎర్ర సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నేతలు గుజ్జ కృష్ణ, భిక్షపతి, మల్లేశ్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లు, సబ్‌ప్లాన్ సాధించే దాకా పోరాటం చేస్తాం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో బీసీ బిల్లు, రూ.20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టే వరకు పోరాటం ఆగదని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. శుక్రవారం జరిగిన బీసీ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ..200లకు పైగా డిమాండ్లతో బీసీ డిక్లరేషన్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించామని, ఇప్పటి వరకూ దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రకారం బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అర్హత కలిగిన ప్రతి బీసీకి రూ.రెండు లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 22న హైదరాబాద్‌లో జరగనున్న బీసీ విస్తృత స్థాయి సమావేశానికి అన్ని జిల్లాల ముఖ్య నేతలు, వివిధ కుల సంఘాల రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. -
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా ఏళ్లుగా భర్తీ చేయకుండా ఉన్న గ్రూప్–1, 3, 4 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో తెలంగాణ నిరుద్యోగ జాక్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సచివాలయం డైరెక్టరేట్లు, జిల్లా కార్యాలయాల్లో వేల సంఖ్యల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు. పారామెడికల్, ఇంజనీరింగ్, ఇతర టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శాఖల వారీగా సమీక్షలు జరిపి రిటైర్మెంట్ వల్ల ఏర్పడ్డ ఖాళీలు, పెరిగిన పని భారం, అవసరాలకు తగ్గట్లు ఉద్యోగాల భర్తీ చేపట్టాలన్నారు. టీచర్ల సంఖ్యను విద్యార్థులు– ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా కాకుండా రిటైర్మెంట్ వల్ల ఏర్పడ్డ ఖాళీల ఆధారంగా లెక్కించాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేశ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీరడి భూపేశ్, సాగర్, రావులకోలు నరేశ్, యస్.రామలింగం, జి.కృష్ణ, గజేందర్, రాంబాబు ,అనిల్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేయాలి’
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మంగళవారం సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనచారిని కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో బీసీ సమస్యలపై చర్చించడానికి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సీఎం ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సమస్యలు, డిక్లరేషన్‌పై అసెంబ్లీలో చర్చించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కలిసిన వారిలో గుజ్జ కృష్ణ, భూపేశ్ సాగర్ ఉన్నారు. -
కుమ్మరులను బీసీ–ఏ లో చేర్చాలి
హైదరాబాద్: కుమ్మర కులస్తులను బీసీ–బి నుంచి ఏ లోకి మార్చాలని, ఇందుకు చట్టసభల్లో ఏకగ్రీవ తీర్మానం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ భవన్లో శుక్రవారం జరిగిన రాష్ట్ర కుమ్మర సంఘం సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొని మాట్లాడారు. కుమ్మరులను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కులవృత్తిని కాపాడటంలో భాగంగా వారు చేసిన కుండలు, పూల కుండీలను ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు కొనుగోలు చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కాకతీయ పనుల్లో వెలువడిన మట్టిని వారికి ఉచితంగా కేటాయించాలని, సహకార సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని కోరారు. 50 ఏళ్లు పైబడిన వారికి రూ. 2 వేల పింఛను ఇవ్వాలని, నామినేటెడ్ పదవుల్లో వారికి ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ: కుమ్మరుల డిమాండ్లపై శనివారం ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్లో సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సభకు మంత్రులు ఈటల, జోగు రామన్న, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ రాములుతో పాటుగా కమిషన్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌రావు, బీసీ సంఘం నాయకులు గుజ్జకృష్ణ, భూపేశ్‌సాగర్ పాల్గొన్నారు. -
అఖిలపక్షం ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీల్లో ప్రత్యక్ష ఎన్నిక విధానం మార్పుపై ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కోరారు. దీనిపై అన్ని రాజకీయపార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో సంస్కరణలకు అభ్యంతరం లేదని, ప్రత్యక్ష ఎన్నికలను మార్చవద్దని సీఎం కేసీఆర్‌కు మంగళవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. చట్టసవరణ కోసం ఏర్పాటు చేసిన ఉపసంఘం గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
బీసీ విద్యార్థులకూ పూర్తి ఫీజు చెల్లించాలి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులు నష్టపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా పూర్తిస్థాయిలో ఫీజులు మంజూరు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఆ సంఘం నేతలు బీసీ లెజిస్లేచర్ కమిటీని సోమవారం కలసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, రావల్కోల్ నరేశ్, కె.నర్సింహా పాల్గొన్నారు. -
'కేసీఆర్ గారూ మా నిధులివ్వండి'
హైదరాబాద్: ఎంతో కాలంగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. బీసీ సంఘం నాయకుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం పెద్దఎత్తున హైదరాబాద్ లోని సంక్షేమ భవన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 1600 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు, పేరుకు పోయిన స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు నిలిపివేయడం వల్ల నిరుపేద విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలు ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం తక్షణం నిధులను విడుదల చేయని పక్షంలో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
6న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి
బీసీ సంక్షేమ సంఘం పిలుపు సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 6న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఈమేరకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండేళ్లుగా విద్యార్థుల కు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయడం లేదని, కాలేజీ యాజమాన్యాలు సైతం ఒత్తిడి పెంచడంతో విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. -
నయీం కేసులో ఆయనకు ఏదైనా జరిగితే...
► ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను ఇరికించే కుట్ర ► సీఎం అభ్యర్థిని బాబు కనీసం పట్టించుకోవడంలేదని మండిపాటు ► బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు శివనాగేశ్వరరావు గౌడ్ తెనాలి : బీసీల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను నయీం కేసులో ఇరికించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయనకు ఏదైనా జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీసీ నేత పేరం శివనాగేశ్వరరావు గౌడ్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం స్థానానికి అర్హుడని ఆయన్ను ఎన్నికల్లో పోటీచేయించి, తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న చంద్రబాబు, కనీసం ఆయన్ను ప్రతిపక్ష నేతగా చేయలేదని గుర్తుకు చేశారు. తాజాగా కృష్ణయ్యను నయీంకేసులో ‘సిట్’ విచారించిందన్నారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలిచిన చంద్రబాబు.. విలువలకు కట్టుబడిన ఆర్.కృష్ణయ్య సమస్యను పట్టించుకోవాలన్నారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కల్పనకు తగిన మద్దతును కూడగట్టేందుకు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఈ నెల 16న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్ణయించినట్టు చెప్పారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి మద్దతును కోరనున్నట్టు తెలిపారు. తద్వారా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కల్పన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు వీలుగా తగిన కార్యక్రమాన్ని రూపొందించుకోనున్నామని వివరించారు. దేశంలో 2600 కులాలంటే ఎస్సీలు 16 శాతం, ఎస్టీలు ఏడు శాతం, ఓసీలు ఏడు శాతం ఉన్నట్టు ఆయన గుర్తుచేశారు. జనాభాలో బీసీలు 58 శాతంగా ఉంటే, ఏడు శాతమున్న ఓసీలు 60 శాతం లబ్ధిని పొందుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిశ వెంకటేశ్వరరావు, స్థానిక బీసీ నేతలు పాల్గొన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కె. వేణుమాధవ్ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం విద్యానగర్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.... ఏపీ ప్రత్యేక హోదా కోసం తెగించి పోరాటం చేస్తామని, ఢిల్లీలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి పార్లమెంట్‌ను ముట్టడిస్తామన్నారు. ఈ నెల 9వ తేదీన కాకినాడలో పవన్ కళ్యాణ్ నిర్వహించే ఆత్మగౌరవ సభకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్, నాయకులు గుజ్జ కృష్ణ, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘పూలే’ పోస్టర్ విడుదల చేసిన జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే 109వ జయంతి ఉత్సవాల పోస్టర్‌ను బీసీ సంక్షేమ మంత్రి జోగురామన్న, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ చక్రహరి రామరాజులతో కలసి సచివాలయంలో శనివారం విడుదల చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో పూలే జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండు పడక గదుల కేటాయింపులో బీసీలకు 50 శాతం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడే స్చేచ్ఛ, సమానత్వాలు లభించిన ట్లని ఆర్.కృష్ణయ్య అన్నారు. వన్యప్రాణి సంరక్షణకు పటిష్టమైన చర్యలు వన్యప్రాణి సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్లో శనివారం ఆయన వన్యప్రాణి సంరక్షణపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్ వైడ్ ఫండ్ సహకారంతో వన్యప్రాణి సంరక్షణ, ఇతర అంశాలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నల్లమలలోని అమ్రాబాద్ అడవుల్లోని వాతావరణంపై అధ్యయనం చేసి కొత్తగా అడవిదున్నలు, గేదె, మూషిక జింకలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అలాగే టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తామన్నారు. ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు స్థానిక గిరిజనులకు హైదరాబాద్ శివార్లలోని దూలపల్లి అటవీశాఖ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. గిరిజనులకు ఉపాధి కల్పించే కార్యాచరణను రూపొందించాలని మంత్రి రామన్న అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ మాజీ స్పీకర్, పర్యావరణ వేత్త కె. సురేశ్‌రెడ్డి, అటవీశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, అదనపు పీసీసీఎఫ్‌లు ఏకే శ్రీవాస్తవ, పృథ్వీరాజ్, వరల్డ్ వైడ్ ఫండ్ ప్రతినిధులు అనిల్‌కుమార్, ఫరీదా టంపాల్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్స్ నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలి
టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1,2,3,4 సర్వీసులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలసి వినతిపత్రం సమర్పించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నాగ్రూప్స్ నోటిఫికేషన్ జారీ చేయలేదని తెలిపారు. విభజన జరిగి ఏపీలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అయితే నిరుద్యోగులు మాత్రం లక్షల సంఖ్యలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.