
సాక్షి, హైదరాబాద్: పంచాయతీల్లో ప్రత్యక్ష ఎన్నిక విధానం మార్పుపై ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కోరారు. దీనిపై అన్ని రాజకీయపార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థలో సంస్కరణలకు అభ్యంతరం లేదని, ప్రత్యక్ష ఎన్నికలను మార్చవద్దని సీఎం కేసీఆర్‌కు మంగళవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. చట్టసవరణ కోసం ఏర్పాటు చేసిన ఉపసంఘం గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment