సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా ఏళ్లుగా భర్తీ చేయకుండా ఉన్న గ్రూప్–1, 3, 4 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో తెలంగాణ నిరుద్యోగ జాక్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సచివాలయం డైరెక్టరేట్లు, జిల్లా కార్యాలయాల్లో వేల సంఖ్యల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు.
పారామెడికల్, ఇంజనీరింగ్, ఇతర టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శాఖల వారీగా సమీక్షలు జరిపి రిటైర్మెంట్ వల్ల ఏర్పడ్డ ఖాళీలు, పెరిగిన పని భారం, అవసరాలకు తగ్గట్లు ఉద్యోగాల భర్తీ చేపట్టాలన్నారు. టీచర్ల సంఖ్యను విద్యార్థులు– ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా కాకుండా రిటైర్మెంట్ వల్ల ఏర్పడ్డ ఖాళీల ఆధారంగా లెక్కించాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేశ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీరడి భూపేశ్, సాగర్, రావులకోలు నరేశ్, యస్.రామలింగం, జి.కృష్ణ, గజేందర్, రాంబాబు ,అనిల్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాలి: ఆర్.కృష్ణయ్య
Published Sun, Apr 1 2018 1:40 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment