ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.... ఏపీ ప్రత్యేక హోదా కోసం తెగించి పోరాటం చేస్తామని, ఢిల్లీలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి పార్లమెంట్‌ను ముట్టడిస్తామన్నారు. ఈ నెల 9వ తేదీన కాకినాడలో పవన్ కళ్యాణ్ నిర్వహించే ఆత్మగౌరవ సభకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్, నాయకులు గుజ్జ కృష్ణ, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.