సాక్షి, తాడేపల్లి: బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలు చూసి చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. అన్ని పదవుల్లో బలహీన వర్గాలకే సీఎం జగన్ ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. బలహీన వర్గాలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఏకైన లీడర్ వైఎస్ జగనేనని కొనియాడారు. మూడున్నరేళ్లలోనే సీఎం 85 వేల మందికి పదవులిచ్చారని.. దీనిపై చర్చకు చంద్రబాబు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నారని మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. జయహో బీసీ సభ సక్సెస్ చూసి చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నారని విమర్శించారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏ రోజైనా బీసీలను పట్టించుకున్నారా.. కనీసం ఒక్కసారైనా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారా అని ప్రశ్నించారు. 14 ఏళ్లలో ఎంతమంది బీసీలకు పదవులు ఇచ్చావని నిలదీశారు. బీసీలకు చేసిందేమీ లేదని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క బీసీ వ్యక్తికైనా రాజ్యసభ పదవి ఇచ్చావా అంటూ దుయ్యబట్టారు..
‘చంద్రబాబు భాషలో బీసీ అంటే బాబు క్యాస్ట్. అందుకే తన కులం వారికి తప్ప మరెవరికీ పదవులుండవు. పవన్ కల్యాణ్ ఒక పగటి వేషగాడు. పవన్ తన రథానికి వారాహి కాదు. నారాహి అని పెట్టుకుంటే మంచింది. ఇప్పుడున్న పథకాలు కొనసాగిస్తానని చెబుతున్నావు. అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉంటారు.’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
చదవండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment