bc meeting
-
ప్చ్.. ఊరేదైనా మారని తీరు
సాక్షి, గుంటూరు: ఊరేదైనా తీరు మాత్రం మారడం లేదు. సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు.. ఆ కుర్చీల్లో వచ్చి కూర్చోవాలంటూ జనాలకు నేతలు మైకుల్లో విజ్ఞప్తి చేయడాలు.. రిపీట్ అవుతున్నాయి. టీడీపీ సభలకు జనం పల్చగా వస్తుండడంతో.. తెలివిగా జనసేనతో కలిసి ఉమ్మడి సభల ప్లాన్ వేశారు చంద్రబాబు. కానీ, అక్కడా అదే ఫలితం కనిపిస్తోంది. మొన్న తాడేపల్లిగూడెం.. ఇవాళ మంగళగిరిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభకు జనం కరువయ్యారు. మూడు గంటలకు మీటింగ్ ప్రారంభం కాగా.. జనం లేక ఆరు గంటల దాకా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎదురు చూశారు. ఈలోపు ఇరు పార్టీల నేతలు మైకుల్లో జనాలు వచ్చి కుర్చీల్లో కూర్చోవాలంటూ బతిమిలాడుకున్నారు. అయినా జనం తరలిరాకపోవడంతో హాజరైన జనంతోనే సభను ప్రారంభించాల్సి వచ్చింది ఆ ఇద్దరు. మంగళగిరి సభలో.. చంద్రబాబు బుద్ధి బయటపడింది. పేరుకే అది బీసీ మీటింగ్ తప్ప.. నిర్వహణ మొత్తం పెత్తందారులకే అప్పగించారు. అందుకే చంద్రబాబు బుద్ధిని ముందే పసిగట్టిన బీసీ నేతలు.. ఆయన మోసాలు నమ్మేదీ లేదంటూ ఆ మీటింగ్ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అట్టర్‌ఫ్లాప్ దిశగా మంగళగిరి టీడీపీ-జనసేన సభ పరుగులు తీస్తోంది. -
కాకినాడలో ఏపీ బీసీల ఆత్మగౌరవ సభ
-
14 ఏళ్లలో ఎంతమంది బీసీలకు పదవులిచ్చావు?: మంత్రి జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలు చూసి చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. అన్ని పదవుల్లో బలహీన వర్గాలకే సీఎం జగన్ ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. బలహీన వర్గాలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఏకైన లీడర్ వైఎస్ జగనేనని కొనియాడారు. మూడున్నరేళ్లలోనే సీఎం 85 వేల మందికి పదవులిచ్చారని.. దీనిపై చర్చకు చంద్రబాబు సిద్ధమా? అని సవాల్ విసిరారు. చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నారని మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. జయహో బీసీ సభ సక్సెస్ చూసి చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నారని విమర్శించారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏ రోజైనా బీసీలను పట్టించుకున్నారా.. కనీసం ఒక్కసారైనా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారా అని ప్రశ్నించారు. 14 ఏళ్లలో ఎంతమంది బీసీలకు పదవులు ఇచ్చావని నిలదీశారు. బీసీలకు చేసిందేమీ లేదని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క బీసీ వ్యక్తికైనా రాజ్యసభ పదవి ఇచ్చావా అంటూ దుయ్యబట్టారు.. ‘చంద్రబాబు భాషలో బీసీ అంటే బాబు క్యాస్ట్. అందుకే తన కులం వారికి తప్ప మరెవరికీ పదవులుండవు. పవన్ కల్యాణ్ ఒక పగటి వేషగాడు. పవన్ తన రథానికి వారాహి కాదు. నారాహి అని పెట్టుకుంటే మంచింది. ఇప్పుడున్న పథకాలు కొనసాగిస్తానని చెబుతున్నావు. అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉంటారు.’ అని మంత్రి వ్యాఖ్యానించారు. చదవండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు -
బీసీలకు సీఎం జగన్ ఏం చేశారో ఈ సభను చూస్తే తెలుస్తుంది : పార్థసారథి
-
బీసీల పక్షపాతి సీఎం వైఎస్ జగన్ : మంత్రి చెల్లుబోయిన
-
పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టిన ఘనత సీఎం జగన్ ది : ఆర్ కృష్ణయ్య
-
బీసీలంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు - మంత్రి కారుమూరి
-
బీసీ మహాసభ చరిత్రలో నిలిచిపోతుంది : మంత్రి జోగి రమేష్
-
జయహో బీసీ మహాసభలో నోరూరించే వంటకాలు
-
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో బీసీ మహాసభ
-
దోచుకో.. దాచుకో.. పంచుకో ఇదే చంద్రబాబు విధానం: మంత్రి కారుమూరి
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బీసీలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని విమర్శించారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయిందని, ఏం మాట్లాడుతున్నారో అయనకే తెలియడం లేదని దుయ్యబట్టారు. దోచుకో.. దాచుకో.. పంచుకో ఇదే చంద్రబాబు విధానమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలకంటే సీఎం జగన్ ఎక్కువే చేశారన్నారు. 56 కార్పొరేషన్లు ఇచ్చి బీసీల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. బీసీలంతా జగన్ వెంట ఉన్నారన్నారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు. సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చాకే బీసీలకు అనేక పదవులు దక్కాయన్నారు. వైఎస్ జగన్ బీసీలకు నాలుగు రాజ్యసభ పదవులు ఇస్తే.. టీడీపీ ఒక్క పదవి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చదవండి: దగుల్బాజీ రామోజీ తప్పు చేస్తే ప్రశ్నించకూడదా?: మంత్రి కాకాణి ‘గత ఎన్నికల్లో చంద్రబాబును చీకొట్టినా బుద్ధి రాలేదు. బాబును ప్రజలు నమ్మరు. ఐటీ తానే కనిపెట్టానని, సెల్ ఫోన్లు తానే కనిపెట్టానని చెప్పుకుంటున్నారు. ఈడీ దాడులు చేయగానే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లమీద పడ్డారు. నోటి దురదతో అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు పెద్ద స్కాం చేసి జైలుకి వెళ్లొచ్చాడు. బీసీలకు రావాల్సిన లబ్దిని రాకుండా చేశారు. బీసీల మీటింగుతో టీడీపీ వారికి భయం పట్టుకుంది. టీడీపీ నేతలకు సిగ్గుండాలి. బీసీల్లో ఆత్మగౌరవం పెరిగింది. మాకు పదవులు ఇవ్వడమే కాదు, పూర్తి స్వేచ్చ ఇచ్చారు. బీసీలపై చర్చకు మేము సిద్దం. టీడీపీ నేతలు సిద్దమా? ఎవరేమి చేశారో డిసెంబర్ 7న జరగనున్న బీసీ సభలో వెల్లడిస్తాం. బీసీల కోసం చంద్రబాబు ఒక్క సెంటు భూమినైనా కొన్నాడా?. అప్పు చేసిన డబ్బు చంద్రబాబు ఏం చేశాడో లెక్క తేల్చాలి. మేము చేసిన అప్పులన్నిటికీ లెక్కలు ఉంటాయి. జయహో బీసీ అనేది టీడీపీ రిజిస్ట్రేషన్ చేసుకుందా?అది అందరిదీ. ఓటు బ్యాంకుగానే మమ్మల్ని ఇంతకాలం వాడుకున్నారు. ఇకముందు అవేమీ చెల్లవు. వారి ఆట ముగిసింది. టీడీపీకి ఘోరీ కట్టబోతున్నాం. ’ అని మంత్రి కారుమూరి నిప్పులు చెరిగారు. -
‘బీసీల వెనుకబాటుకు కారణం చంద్రబాబే’
సాక్షి, అమరావతి: జయహో బీసీ మహాసభపై వైఎస్సార్సీపీ ముఖ్యనేతల సమావేశం శనివారం.. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఎంపీలు, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. సామాజిక న్యాయం జగన్‌కే సాధ్యం: జోగి రమేష్ ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, ఈ నెల 7న జయహో బీసీ మహా సభకు వివిధ హోదాలో ఉన్న బీసీ ప్రజా ప్రతినిధులు 80 వేలకు పైగా హాజరవుతారని తెలిపారు. సామాజిక న్యాయం జగన్‌కే సాధ్యమని, ఈ మూడున్నరేళ్లలోనే చాటి చెప్పారన్నారు. బీసీలంతా తలెత్తుకుని తిరిగేలా గౌరవం ఇచ్చారని అన్నారు. బీసీలకు అత్యంత ప్రాధాన్యత: ఆర్. కృష్ణయ్య ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, గతంలో ఏ సీఎం చేయని విధంగా వైఎస్ జగన్ బీసీలకు న్యాయం చేశారన్నారు. దేశానికి వెన్నెముక అయిన బీసీలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అభివృద్ధి అంటే అధికారంలో వాటా ఇవ్వడం, సంక్షేమ పథకాలు అమలు చేయడమే. బీసీల విషయంలో సీఎం ఇదే చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు. చంద్రబాబు అబద్దాలను నమ్మే పరిస్థితులు లేవు : మంత్రి వేణు గోపాలకృష్ణ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, వెనుక వరసలో ఉన్న బీసీలను సీఎం జగన్ ముందుకు తెచ్చారన్నారు. పేదరికం పెద్ద రోగం కాబట్టి విద్య అనే ఆయుధం అందించారన్నారు. బీసీల వెనకబాటుకు ప్రధాన కారణం చంద్రబాబు. బీసీలను విద్య కోసం విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీసీలను బాబు వాడుకున్నారు. ఈ నెల 7న 80 వేల మంది బీసీలు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. చంద్రబాబును చూస్తే మాకు ఇదేం ఖర్మ అని బీసీలు అనుకుంటున్నారు. చంద్రబాబు అబద్దాలను నమ్మే పరిస్థితులు రాష్ట్రంలో లేవు’’ అని మంత్రి వేణుగోపాలకష్ణ అన్నారు. -
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఈ నెల 7న విజయవాడలో ‘జయహో బీసీ.. వెనుకబడిన కులాలే వెన్నెముక’ పేరుతో మహాసభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీలు కృష్ణమూర్తి, సునీత, రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పదవుల్లో బీసీలకు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత దక్కిందన్నారు. ఈ మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశం అనంతరం జోనల్ సమావేశాలు జరుగుతాయని, బీసీ నేతలంతా హాజరవుతారని ఆయన తెలిపారు. ‘‘చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. తన జీవితంలో మళ్లీ సీఎం అవ్వలేడు. ఆయన కేవలం తన కులం, తన కుటుంబం, తన మనుషుల కోసమే పనిచేశాడు. మూడు సార్లు సీఎం చేసిన ప్రజలను మోసం చేశాడు. 25 ఏళ్లు వైఎస్ జగన్ సీఎంగా ఉంటారు. పేదల కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారు. లోకేష్ అవలక్షణాలున్న వ్యక్తి. అలాంటి లోకేష్ పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు యాత్ర చేసిన ప్రజలు నమ్మరు. లోకేష్, చంద్రబాబులకు వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్ ఉండదు. 2024 తర్వాత టీడీపీ కూడా ఉండదు’’ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బీసీలను తలెత్తుకుని తిరిగేలా చేశారు: మంత్రి వేణుగోపాలకృష్ణ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, బీసీలను దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆదరించని విధంగా సీఎం జగన్ ఆదరించారన్నారు. బీసీలు తలెత్తుకుని తిరిగేలా చేశారన్నారు. ‘‘బీసీ రిజర్వేషన్లు కోసం ప్రైవేట్ బిల్లు పెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి బీసీ ఇంటికి సంక్షేమాన్ని సీఎం జగన్ చేర్చారు. జయహో బీసీ సభను చరిత్రలో ఎన్నడు జరగని విధంగా నిర్వహిస్తాం’’ అని మంత్రి అన్నారు. చదవండి: సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్ లేదన్న నారా లోకేష్ -
పదవుల్లో బీసీలకు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత దక్కింది
-
‘ఆత్మీయ సమ్మేళనానికి సీఎం జగన్‌ను ఆహ్వానిస్తాం’
విజయవాడ: వచ్చేనెల 8వ తేదీన విజయవాడలో జరుగనున్న బీసీల ఆత్మీయ సమ్మేళనానికి సీఎం జగన్‌ను ఆహ్వానిస్తామని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈరోజు(శనివారం) నగరంలో బీసీ మంత్రుల, నేతల సమావేశం జరిగింది. దీనిలో భాగంగా మాట్లాడిన మంత్రి వేణుగోపాలకృష్ణ.. ‘ వచ్చే నెల8వ విజయవాడలో బీసీల ఆత్మీయ సమ్మేళనం. సమ్మేళనానికి సీఎం జగన్‌ను ఆహ్వానిస్తాం. చంద్రబాబు బీసీల ద్రోహి. మాది బీసీల ప్రభుత్వం. బీసీల ఆత్మరక్షకుడు సీఎం జగన్ మాత్రమే’ అని పేర్కొన్నారు. మంత్రి జయరాం మాట్లాడుతూ.. ‘56 కార్పోరేషన్లతో బీసీలకు సీఎం జగన్ ఎంతో మేలు చేశారు. బీసీల అభ్యున్నతికి సీఎం చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది. బీసీలకు రూ. 88 వేల కోట్ల సంక్షేమ పథకాలు అందాయి’ అని తెలిపారు ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ..బీసీలకు చంద్రబాబు చేసేందేమీ లేదు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు.బీసీలకు అన్ని విధాల సీఎం జగన్ అండగా నిలిచారు’ అని అన్నారు. ‘బీసీ డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 139 కులాలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి కులానికి ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌దే’ అని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. -
‘సీఎం జగన్ హయాంలోనే సామాజిక న్యాయం’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యకర్మంలో బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, అన్ని కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు హాజరయ్యారు. చదవండి: టీడీపీతో జట్టుకట్టి.. మా ఆశలను నిలువునా కూల్చేశారు ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో పెట్టామన్నారు. జనాభా లెక్కల్లో బీసీల గణన చేయాలని డిమాండ్ చేశామన్నారు. బీసీలకు సమన్యాయం జరగాలన్నదే సీఎం జగన్ ఉద్దేశమని విజయసాయిరెడ్డి అన్నారు. బీసీలంతా జగన్‌తోనే.. స్పీకర్ తమ్మినేని సీతారాం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, బీసీలను అక్కున చేర్చుకున్న నేత సీఎం జగన్ అని, అనేక సంక్షేమ పథకాలను ఆయన తెచ్చారని అన్నారు. డెహ్రాడూన్ ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లలో జరిగిన స్పీకర్ల మీటింగ్‌లోనూ సీఎం జగన్ గురించే చర్చ జరిగిందని స్పీకర్ గుర్తు చేశారు. బీసీల కోసం అన్ని పథకాలను ఎలా అమలు చేస్తున్నారని మిగతా రాష్ట్రాల వారు తనను అడిగారని తెలిపారు. దేశంలోనే ఒక ట్రెండ్‌ను సీఎం జగన్ సెట్ చేశారు. అలాంటి వ్యక్తికి మనం ఎప్పుడూ అండగా ఉండాలి. ఆయన వలనే మన పిల్లల భవిష్యత్తు తరాలు బాగుంటాయి. జగన్‌కి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. బీసీలంతా జగన్‌తోనే పొత్తు పెట్టుకున్నారు’’ అని స్పీకర్ అన్నారు. బీసీల జీవితాల్లో వెలుగులు నింపారు: ఆర్ కృష్ణయ్య బీసీల జీవితాల్లో వెలుగులు తెచ్చేలాంటి పథకాలను సీఎం జగన్ తెచ్చారని ఎంపీ, బీసీల సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో బీసీ ముఖ్యమంత్రులు సైతం బీసీల కోసం ఇన్ని పనులు చేయలేదు. 56 కార్పోరేషన్లు తెచ్చి అందరికీ గుర్తింపు ఇచ్చారు. జగన్.. బీసీల కోసం చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. జగన్ వలనే దేశ వ్యాప్తంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. జగన్ మాత్రమే బీసీల బిల్లు పెట్టించారు. బీసీల మీద జగన్‌కి ఉన్న నిజమైన చిత్తశుద్దికి నిదర్శనమని కృష్ణయ్య అన్నారు. జగన్‌కు అండగా నిలవాలి: మంత్రి సీదిరి చంద్రబాబుకి కుల అహంకారం ఉందని, కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాకే సామాజిక న్యాయం జరుగుతోందని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు కుల అహంకారంతో మాట్లాడతాడు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని లెటర్ రాశాడు. మత్స్య కారులను తోకలు కత్తిరిస్తానన్నాడు. ఎస్సీల కుటుంబంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు. ఇలా ప్రతి విషయంలోనూ కుల అహంకారంతో మాట్లాడతాడు. పరిశ్రమలు వస్తుంటే ఆపాలని చూశారు. బీసీల హాస్టళ్లు చంద్రబాబు హయాంలో ఎలా వున్నాయో చూశాం. మన పిల్లల భవిష్యత్తు గురించి ఏనాడూ ఆలోచించని వ్యక్తి చంద్రబాబు. కానీ జగన్ సీఎం అయ్యాకే సామాజిక న్యాయం జరుగుతోంది. కాబట్టి, జగన్ కి అండగా నిలవాల్సిన అవసరం ఉంది అని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. బీసీలంతా జగన్ వెంటే.. : మంత్రి ఉషశ్రీ సంక్షేమ పథకాలనేవి అధికంగా బీసీలకు ఉపయోగ పడుతున్నాయి. కానీ ఆ పథకాలను ఆపేయమని చంద్రబాబు అంటున్నారు. అలాంటి వ్యక్తి నైజాన్ని మనం ప్రజల దృష్టి కి తీసుకెళ్లాలి అని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బీసీల జిల్లా. ఇప్పుడు ఆ బీసీలంతా జగన్ వెంటే నడుస్తున్నారు. గతంలో ఎప్పుడూ, ఎవరూ చేయనన్ని సంక్షేమ పథకాలను జగన్ ఇచ్చారు. అన్ని కులాలకు పెద్దన్నగా జగన్ నిలిచారు. బీసీలకు చేయాల్సిందంతా చేశారు. ఐనాసరే జగన్ ఇంకా ఏమేమి చేయాలా అని ఆలోచిస్తున్నారని మంత్రి ఉషశ్రీ పేర్కొన్నారు. చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తా అన్నాడు మనందరి తల రాతలు మార్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తానంటూ గతంలో బెదిరించారు. కానీ, సీఎం జగన్ మాత్రం నా బీసీలు అంటూ ఆప్యాయంగా సంభోధిస్తారు. ఆయనకు మనపై ఉన్న ప్రేమకు అదే చిహ్నం అని ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాలి బీసీ సామాజిక వర్గాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, బీసీలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. 139 కులాలతో బీసీలు ఉన్నారు. అందరూ ఏకతాటి మీద నిలబడాలి. ఐకమత్యంతో ఉంటేనే ఏవైనా పనులు సాధించవచ్చు. కొన్ని కులాలు విడిపోయి ఇతర కులాల్లో చేర్చాలనే డిమాండ్ చేయటం వలన ప్రయోజనం ఉండదు. చట్టసభల్లో కూడా 50% మహిళకు అవకాశం కల్పించేలా బిల్లు తేవాలి అని విజయసాయిరెడ్డి మాట్లాడారు. బీసీల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. కార్పొరేషన్ పదవుల్లో బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఐకమత్యంతో ఉంటేనే ఏదైనా సాధించగలమని ఆయన అన్నారు. -
గొర్లు, బర్రెలకే బీసీలను పరిమితం చేసిన టీఆర్ఎస్: వైఎస్సార్టీపీ
మహబూబ్ నగర్: తెలంగాణలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో బీసీ గౌరవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు రామకోటి, శ్రీరాములు, శ్రీనివాస్, అమృతసాగర్, బాలరాజ్ మాట్లాడుతూ.. బీసీల ఐక్యతను చాటేందుకు అక్టోబర్ 3వ తేదీన వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోస్గి పట్టణంలో బీసీ గౌరవ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడేళ్ల తెలంగాణలో బీసీల అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ బీసీలకు పదవులు దక్కకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ వసతిగృహాల్లో వసతులు లేవని, అదనపు గదుల నిర్మాణాల ఊసేలేదని విమర్శించారు. బీసీలను గొర్లు, బర్రెలు, చెప్పులకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేద బీసీలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజురు చేయడానికి ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. కోస్గిలో నిర్వహించే బీసీ గౌరవ సభకు బీసీలతో పాటు అందరూ భారీగా తరలిరావాలని వైఎస్సార్టీపీ నాయకులు పిలుపునిచ్చారు. చదవండి: ‘లంచం ఇస్తే తీసుకోండి.. కానీ’.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు -
నెల్లూరులో బీసీల అభినందన సభ
-
చంద్రబాబుకు ఓటేయ్యవద్దని చెప్తా : తలసాని
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో బీసీ సభ నిర్వహిస్తానంటే చంద్రబాబు నాయుడు ఎందుకంత భయపడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మార్చి 3న గుంటూరులో నిర్వహించబోయే బీసీ గర్జన సభకు ఏపీ పోలీసులు అనుమతి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని మండి పడ్డారు. పోలీసులు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకుని సభ నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఏపీలో అన్ని సభలకు ఇలాంటి కండిషన్సే పెడతున్నారా అని ప్రశ్నించారు. యాదవ బహిరంగ సభలో చంద్రబాబును ఓడించమని బహిరంగంగానే కోరతానని తెలిపారు. గతంలో చంద్రబాబు తెలంగాణలో సభలు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. -
అబద్ధాలు అదరహో
వింటున్న జనాలు ఏమనుకుంటారో...చెప్పేవి నమ్మశక్యంగా ఉన్నాయో లేవో.... కురిపించిన హామీలను నమ్ముతారో లేదో... ఇవేవీ సీఎం చంద్రబాబునాయుడు పట్టించుకున్నట్టు లేదు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా నోటికొచ్చిన హామీలు మళ్లీ మళ్లీ ఇచ్చేశారు. జయహో బీసీ పేరుతో మరోసారి వెనుకబడిన వర్గాలను మోసగించేందుకు తయారయ్యారు. నాలుగున్నరేళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పుడు బీసీల సమస్యలేవీ గుర్తుకు రాలేదు. ఎన్నికలు సమీపిస్తుండగా వారి బాధలన్నీ గుర్తుకొచ్చేశాయి. వారిపై వల్లమాలిన ప్రేమను ఒలకబోశారు. అబద్ధాలను వల్లించారు. నోటికొచ్చిన హామీలను ఇచ్చేసి రాజమహేంద్రవరం వేదికగా మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, కాకినాడ : రాజమహేంద్రవరం వేదికగా ఆదివారం జరిగిన ‘జయహో బీసీ’ సభలో చంద్రబాబు ఆద్యంతం తనకు తాను భజన చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకని ఉదయం నుంచి జిల్లా నలుమూలలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జన సమీకరణ చేశారు. 3లక్షల మంది బీసీలతో భారీ సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ వేలల్లో రెండు పదులు కూడా దాటలేదు. వీరిలో కూడా అన్నీ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇక, సీఎం 4.36 గంటలకొచ్చాక ఆ జనం కూడా తిరుగుముఖం పట్టారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభించాక చాలా కుర్చీలు ఖాళీ అయిపోయాయి. చివరికొచ్చేసరికి ప్రాంగణం వెలవెలబోయింది. చంద్రబాబు ఈ సారి కూడా అవే మోసాలకు దిగారు. గత ఎన్నికల ముందు ఏరకమైన హామీలైతే ఇచ్చారో ఇప్పుడవే హామీలు మరోసారి ఇచ్చి బీసీలను బహిరంగంగా మోసగించారు. 2014 ఎన్నికల ముందు ఇదే రకంగా అనేక హామీలిచ్చారు. మేనిఫెస్టోలో 110కి పైగా హామీలను పొందుపరిచారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ అమలు చేయలేదు. రజకులు, నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులు, ఇతర వర్గాలను ఎస్సీ, ఎస్టీలుగా మార్చుతామన్నారు. గాండ్ల, నగర, పూసల, కురచి, బోయ, పద్మశాలి తదితర కులాను బీసీ డీ నుంచి బీసీ ఏకు మార్చుతామని ఎన్నికల్లో చెప్పుకొచ్చారు. ఇంతవరకు వాటిని అమలు చేయలేదు సరికదా హామీలు గుర్తు చేసిన నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు వారందరికీ అండగా ఉంటానని, వారడుగుతున్నట్టు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీలిచ్చేశారు. బీసీల్లో ఉన్న మెజార్టీ కులాలన్నింటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించారు. జనాలు నవ్వుకుంటారని కూడా చూడకుండా ఒకదాని తర్వాత ఒకటి చదివేశారు. చెప్పాలంటే సభలో ఉన్న వారంతా ‘ఇదేంటి నోటికొచ్చినట్టు హామీలిచ్చేస్తున్నారని...గతం గుర్తుకు రాలేదా’ అని విస్తుపోయారు. చెప్పాలంటే అబద్ధాలనే చెప్పుకొచ్చారు. తాను నాలుగున్నరేళ్లుగా రూ.40వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు ప్రసంగమిచ్చారు. వైఎస్సార్ పాలనతో పోల్చుతూ స్క్రిప్ట్ చదివారు. చెప్పినవన్నీ తప్పుడు లెక్కలే. వైఎస్సార్ హయాంలో బీసీలకు కేటాయించిన నిధులను తక్కువగా చూపించి, తన హయాంలో ఎక్కువ ఖర్చు పెట్టినట్టు అబద్ధాలు వల్లించారు. నాలుగున్నరేళ్లు గుర్తుకురాని బీసీల సమస్యలు అధికారంలో నాలుగున్నరేళ్లకు పైగా ఉన్నారు. ప్రస్తుతం అధికారాన్ని వెలగబెడుతున్నారు. కానీ బీసీల ఇబ్బందులు గుర్తుకు రాలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మళ్లీ వారికి సమస్యలు ఉన్నాయని చెప్పి...అండగా నిలుస్తానని నమ్మబలికి అనేక హామీలిచ్చారు. కొత్తగా 69 రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతానని, నియోజకవర్గానికొక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తానని, అత్యంత వెనకబడిన బీసీలకు రూ. 30వేల నుంచి రూ. 50వేలకు సబ్సిడీ పెంచుతానని, అత్యంత వెనకబడిన వర్గాలకు 100యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని, నాయీ బ్రాహ్మణుల షాపులకు 150యూనిట్లు, స్వర్ణకారులకు 100యూనిట్లు ,చేనేత కార్మికులకు 100నుంచి 150యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని హామీలిచ్చారు. విదేశీ విద్య కోసం వెనకబడిన వర్గాల విద్యార్థులకు రూ. 15లక్షలు సాయం చేస్తానని, గొర్రెలకు ఇన్సూరెన్స్‌తో పాటు ప్రీమియం చెల్లిస్తానని...ఇలా రకరకాలుగా మోసపూరిత హామీలిచ్చారు. ఇన్నాళ్లూ అధికారంలో ఉండగా ఏమీ చేయని వ్యక్తి ఎన్నికలు సమీపిస్తున్న వేళ హామీలిచ్చారంటే ఏమనాలని ఆ పార్టీ అభిమానులే పెదవి విరిచారు. ఇక, బీసీల సబ్ ప్లాన్ అంశాన్ని మరోసారి హామీ అస్త్రంగా చేసుకున్నారు. సబ్ ప్లాన్‌తో చాలావరకు చేసేశానని చెబుతూనే మరోవైపు సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత తీసుకొచ్చి అమలు చేస్తానంటూ మరోసారి బీసీలను మోసగించేందుకు యత్నించారు. జగన్ పాదయాత్ర హామీలు కాపీ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టడమే కాకుండా పాదయాత్రలో ఇచ్చిన హామీలను కూడా చాలావరకు కాపీ కొడుతూ జయహో బీసీ సభలో వరాలు జల్లు కురిపించారు. వివిధ వర్గాలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించగా వాటినే ఇక్కడ చంద్రబాబు చాలా వరకు ప్రకటించారు. బీసీ సంఘాలకు చోటేది? జయహో బీసీ సభను ఆ పార్టీకి చెందిన నాయకులతోనే మమ అన్పించేశారు. సాధారణంగా తటస్థులైన బీసీ సంఘాలను ఆహ్వానించి, వారి అభిప్రాయాన్ని తీసుకుని, వారికేం కావాలో తెలుసుకుని, ఆ మేరకు ప్రకటనలు చేయాలి. కానీ, ఇక్కడ తమ పార్టీ నేతలే ముందు మాట్లాడారు. తటస్థులైన బీసీ సంఘాలకు ఆహ్వానమే లేదు. వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించలేదు. చెప్పాలంటే దీన్ని జయహో బీసీ సభ అనేదాని కన్న సాధారణంగా జరిగే టీడీపీ బహిరంగ సభ అని అంటే సరిపోతుంది. -
బీసీ సభలో కాలేజీ గోడ దూకి వెళ్లిపోయిన జనం
తూర్పుగోదావరి,తాడితోట (రాజమహేంద్రవరం): నగరంలో ఆదివారం నిర్వహించిన జయహో బీసీ సభకు వచ్చిన పలువురు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు, సెల్ ఫోన్లు ఇస్తామంటూ.. మరి కొందరిని రూ.2 వందల చొప్పున ఇస్తామని ఈ సభకు ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల్లో మహిళలను తరలించారు. వాహనాలు పార్కింగ్ చేసిన ప్రాంతాల్లో టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. జమ్మలమడుగు, బద్వేల్, పుటపర్తి, కర్నూలు, తాడిపత్రి తదితర సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఉదయం 10 గంటలకే నగరానికి చేరుకున్నారు. శివారు ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేయడంతో ఐదు కిలోమీటర్లకు పైగా సభా ప్రాంగణానికి వారు నడుచుకుంటూ చేరుకున్నారు. వృద్ధులను తరలించడంతో వారు అంత దూరం నడవలేక ఎక్కడికక్కడ కూర్చుండి పోయారు. పార్టీ సభకు అధికారుల సేవ టీడీపీ ఏర్పాటు చేసిన ఈ సభకు అధికారులు సేవలు అందించాల్సి వచ్చింది. రెవెన్యూ, వైద్య, నగర పాలక సంస్థ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఉదయం నుంచి సభా ప్రాంగణం వద్ద ఉండి ఏర్పాట్లకు సహకరించారు. ఉద్యోగులకు భోజనాలు ఇతర సౌకర్యాలు లేకపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడ్డారు. మహిళా ఉద్యోగులకు తీవ్ర అవస్థలు తప్పలేదు. సభా ప్రాంగణంలో బారీకేడ్లు సక్రమంగా లేకపోవడంతో నం తాకిడికి కూలిపోయాయి. సభకు హాజరైన వారు తిరిగి ఎలా వెళ్లాలో తెలియక ప్రాంగణంలోని గోడలు దూకి రోడ్డుపైకి వచ్చారు.అల్లు రామలింగయ్య హోమియోపతి కాలేజీ గేట్లు తెరవకపోవడంతో సభ ప్రాంగణం నుంచి అటు వైపు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళాశాల గేట్లు తెరవకపోవడం వల్ల గోడలు దూకి బయటపడ్డారు. పోలీసులకూ ఇక్కట్లు పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నలుగురు ఏఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 70 మంది ఎస్సైలు, 1,500 మందికి పైగా పోలీసు కానిస్టేబుళ్లు జయహో బీసీ సభ ఏర్పాట్లలో మునిగితేలారు.అయితే వారికి టీడీపీ వర్గాలు భోజనం ఏర్పాట్లు చేయలేదు. దీంతో వారిలో కొంతమంది చెట్ల కింద, అరుగుల పైనా భోజనాలు చేసి విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, కొంతమంది పార్టీ నాయకులు.. పోలీసులపై సభా స్థలం వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌లు ఉన్నవారికే సభా ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లకు పోలీసులతో వాగ్వివాదం తప్పలేదు. ఎయిర్‌పోర్టులోనూ ఇంతే. మధురపూడి (రాజానగరం): షెడ్యూల్‌కు భిన్నంగా సీఎం చంద్రబాబు పర్యటన ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్టుకు వచ్చిన అధికారులు, పార్టీ వర్గాలు, అభిమానులు ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి పడిగాపులు కాయాల్సివచ్చింది. ఆహారంలో పడిన బల్లి పోలీసులు, అధికారులు, ఉద్యోగుల కోసం ఎయిర్‌పోర్టు క్యాంటిన్ నిర్వాహకులు తయారుచేసిన ఆహారంలో ఆదివారం బల్లిపడింది. దీంతో క్యాంటిన్ నిర్వాహకులు మళ్లీ వంట చేశారు. ఈ ఆహారం తిని ఉంటే ప్రమాదమే వచ్చేదని పోలీసులు, భద్రతా బలగాలు అన్నారు. వాహన చోదకులకు ఇబ్బందులు జయహో బీసీ సభ కారణంగా నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం, కోరుకొండ, గోకవరం నుంచి నగరం రావాల్సిన వాహనాలను దారి మళ్లించారు.దీంతో బూరుగుపూడి గేటు మీదుగా రాజానగరం హైవే, గామన్ రోడ్డు మీదుగా వాహనాలు వెళ్లడంతో 40 కిలోమీటర్ల దూరభారమైందని వాపోయారు. నగరంలోకి వచ్చే వాహనాలను మధ్యలోనే పోలీసులు నిలిపేశారు. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను సీఎం సభ కేటాయించారు. దీంతో ప్రయాణికులకు బస్సులు లేక అవస్థలు పడ్డారు. అధిక మొత్తం చెల్లించి ఆటోలను ఆశ్రయించారు. ట్రాఫిక్ మళ్లింపుతో నగరం దిగ్బంధం రాజమహేంద్రవరం క్రైం: జయహో బీసీ సభకు ట్రాఫిక్ దిగ్భంధనం చేయడం నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నగర శివారు ప్రాంతాల్లోనే బస్సులను నిలిపివేయడంతో సభకు వచ్చిన వారు సభా ప్రాంగణానికి నడిచి వెళ్లారు. లాలా చెరువు వైపు నుంచి వచ్చే వాహనాలను నారాయణపురం వద్ద నిలిపివేశారు. పేపర్ మిల్లు వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు, ధవళేశ్వరం వైపు నుంచి వచ్చే రోడ్లపై అడ్డుకుని రూట్ మళ్లించారు. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో రోడ్లు దిగ్బంధం చేయడంతో పనుల కోసం వెళ్లిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
చంద్రబాబు బీసీలను దారుణంగా మోసం చేశారు
-
అప్పుడే బీసీల తలరాతలు మారుతాయి: వైఎస్ జగన్
సాక్షి, పాపానాయుడుపేట : ‘‘మహానేత వైఎస్సార్ బతికున్నప్పుడు బీసీలందరికీ ఒక భరోసా ఉండేది. ఇంటికి ఒక్కరైనా డాక్టరో, ఇంజనీరో అయితే కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని ఆయన నమ్మారు. అందుకే ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని రూపొందించి పేదలకు ఉన్నతవిద్యను దగ్గరచేశారు. ఆయన చూపిన బాటలోనే నేను కూడా బీసీలకు తోడుంటా. బీసీల అభ్యున్నతి కోసం నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేశారు. నేను ఇంకో రెండు అడుగులు ముందుకు వేస్తాను’’ అని వైఎస్ జగన్ బీసీలకు మాటిచ్చారు. 64వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పాపానాయుడుపేటలో జరిగిన బీసీ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ గడిచిన నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు బీసీలను దారుణంగా మోసం చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే బీసీ జపం చేసే ఆయన.. నాలుగు ఇస్త్రీ పెట్టేలు, నాలుగు కత్తెర్లు ఇచ్చి బీసీలను బాగుచేశామని చెప్పుకుంటారు. మేనిఫేస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ పెట్టారు. గౌడ సోదరులు కనిపిస్తే వారి భుజాన ఉన్న ట్యూబ్ తన భుజంపై వేసుకొని ఫోజులు కొడతారు. చేనేత కార్మికుల ఇంట్లో దూరి పక్కనే కూర్చోని ఫొటోలు దిగుతారు. ఆ ఫొటోలతో ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని, కురువ, కురుభలను ఎస్టీలుగా గుర్తిస్తామని, బోయలను ఎస్టీల్లో చేరుస్తామని.. ఇలా ఇలా ప్రతి కులానికి హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసేమర్చిపోయారు. ఇటీవల మత్య్సకారులు కొందరు చంద్రబాబు దగ్గరికెళ్లి ఎన్నికల హామీలపై నిలదిస్తే ఆయన.. ‘ముఖ్యమంత్రినే అడుగుతావా? తాటతీస్తా..ఖబడ్దార్’ అని హెచ్చరించిన సంగతి మనందరం చూశాం. సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రతి కులాన్ని మోసం చేశాడు. మొన్న అసెంబ్లీలో బోయలను ఎస్టీలుగా చేర్చుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తద్వారా నా పనైపోయిందని చేతులు కడుక్కున్నారు. ఏమిటికి ఏమీ జరగకముందే కేక్‌లు కట్‌చేస్తారు. మరో వర్గానికి ఫోన్లు చేసి ధర్నాలు చేయమంటారు! చిత్తూరు జిల్లాలోనే పెరిక బలిజ కులస్తులు 40 సంవత్సరాలుగా బీసీలుగా ఉన్నవారు సర్టిఫికెట్ అడిగితే ఇవ్వడం లేదు. అగ్ని కుల క్షత్రియులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా దిక్కులేదు. ఇదీ.. చంద్రబాబు బీసీలను మోసగిస్తున్న తీరు. ప్రజా ప్రభుత్వంలోనే బీసీల తలరాతలు మారుతాయి : మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్నాయి. ఇన్నేళ్ల దుర్మార్గపాలనకు చరమగీతం పాడాల్సిన సమయం రానుంది. మీ అందరి దీవెనలతో మనదైన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బీసీల తలరాతలు మారుతాయి. మహానేత కలగన్నట్లు ప్రతి పేదింటి నుంచి ఒకరిని డాక్టర్ లేదా ఇంజనీర్ చదివించే బాధ్యత నాది. అందుకోసం ఎన్ని లక్షలు ఖర్చైనా వెనుకాడబోను. బీసీల అభ్యున్నతి కోసం నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేశారు. జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తాడు. పెద్ద చదువులు చదివించడమే కాదు.. హాస్టల్ ఖర్చుల కింద ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం. చిన్న పిల్లల్ని బడికి పంపే తల్లులకు సంవత్సరానికి రూ.15 వేలు ఖాతాలో జమ చేస్తాం. మనందరి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ రూ.2 వేలకు పెంచుతాం. బీసీ, ఎస్టీ, ఎస్సీల్లో శ్రామికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి పింఛన్ వయసు 45 ఏళ్లకే తగ్గిస్తాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. ప్రతి పేదవారికి పక్కా ఇల్లు కట్టించితీరుతాం. పేదలకు మంచి చేసేందుకు బీసీ అధ్యాయన కమిటీ ఏర్పాటుచేశాం. వారు ప్రతి జిల్లాలో అన్ని కులాలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. పాదయాత్ర ముగిసిన తరువాత బీసీ గర్జన నిర్వహిస్తాం. ఆ సభలో బీసీ డిక్లరేషన్ చేస్తాం. అందులో బీసీలకు ఏం చేస్తామన్నది మరింత స్పష్టంగా చెబుతాం. మీరంతా నాకు తోడుగా ఉంటే చాలా కొద్ది సమయంలోనే మార్పును చూడబోతున్నాం’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం
-
బీసీల కుటుంబాల్లో వెలుగులు నింపి తీరతా: వైఎస్ జగన్
సాక్షి, మైదుకూరు : ఏడో రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మైదుకూరు నియోజకవర్గంలోని కానగూడూరులో బీసీ సంఘాలతో జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారి విజ్ఞప్తులు, సలహాలు స్వీకరించారు. ఆయన అక్కడ హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దివంగత నేత వైఎస్సార్ సువర్ణ యుగాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అక్కడ హాజరైన జనవాహినికి విజ్ఞప్తి చేశారు. యాదవ సోదరులందరు ఒక్కటే అడుగుతున్నా... వైఎస్ఆర్ హయాంలో గోర్రెలు, మేకలు చనిపోతే ఇన్సూరెన్స్ ఉండేదని.. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? అనగానే.. లేదు అన్న సమాధానం ప్రజల నుంచి వినిపించింది. ఈ నాలుగేళ్లలో ఒక్క ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేకపోయారని.. జీవనోపాధి కోల్పోయిన వారి జీవితాల గురించి ప్రభుత్వం కనీస ఆలోచన కూడా చెయ్యట్లేదని జగన్ చెప్పారు. బీసీలు పేదకరికం నుంచి బయటపడాలంటే.. వారి కుటుంబంలోని పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని దివంగత నేత వైఎస్ఆర్ కలలు గన్నారని.. అందుకే ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలు చేశారన్నారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఫీజులు లక్షల్లో ఉంటే వేలలో ఫీజును అది కూడా ఏడాది తర్వాత చెల్లిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుందని జగన్ పేర్కొన్నారు. పైగా ఫీజులు చెల్లించేందుకు తల్లిదండ్రులు ఆస్తులు, భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే ఉన్నత చదువులు చదివే ప్రతీ విద్యార్థికి పూర్తి ఫీజును రీఎంబర్స్‌మెంట్‌గా చెల్లిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ఇంకా ఆయనేం చెప్పారంటే.. విద్యార్థుల ఖర్చుల కోసం ఏటా 20 వేల నగదు ఇస్తాం. అమ్మ ఒడి పథకం సమర్థవంతంగా అమలు చేసి తీరతాం. తమ పిల్లలను బడికి పంపించే ప్రతీ తల్లి అకౌంట్ లో 15 వేలు వేస్తామన్నారు. రెండు, మూడు రోజుల్లో బీసీ కమిటీని ఏర్పాటు చేసి, ప్రతీ నియోజకవర్గంలో పర్యటించి ప్రజల నుంచి సలహాలు స్వీకరించి నివేదిక సమర్పించాలని కోరతాం. పాదయాత్ర పూర్తయ్యాక ఆ నివేదిక ఆధారంగా బీసీ గర్జన ఏర్పాటు చేసి.. బీసీ డిక్లరేషన్ చేస్తానమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 45 ఏళ్లకే పెన్షన్ విధానం అమలు చేస్తామన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్, 45 ఏళ్లకే ఫించన్ పథకం, అమ్మ ఒడి పథకం ప్రస్తుతం నా ఆలోచనల్లో ఉన్నాయి. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే తన లక్ష్యమని ప్రకటించిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తామన్నారు. జన్మభూమి కమిటీల్లాగా కాకుండా లబ్దిదారులను స్థానికంగానే ఎంపిక చేసి అందరికి సభ్యత్వం కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత పలువురి సలహాలు, సూచనలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కె. వేణుమాధవ్ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం విద్యానగర్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.... ఏపీ ప్రత్యేక హోదా కోసం తెగించి పోరాటం చేస్తామని, ఢిల్లీలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి పార్లమెంట్‌ను ముట్టడిస్తామన్నారు. ఈ నెల 9వ తేదీన కాకినాడలో పవన్ కళ్యాణ్ నిర్వహించే ఆత్మగౌరవ సభకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్, నాయకులు గుజ్జ కృష్ణ, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు రాజ్యాధికారం వస్తేనే అభివృద్ధి
ఐక్యపోరాటాలతోనే సాధించుకోవాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పెద్దపల్లిరూరల్: బీసీలకు రాజ్యాధికారం వచ్చిననాడే అందరూ అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని, అందుకు ఐక్య పోరాటాలే మార్గమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. పెద్దపల్లిలో బుధవారం జరిగిన బీసీల చైతన్యసదస్సులో మాట్లాడారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలలో విభేదాలు సృష్టించి ఓట్లకోసమే అగ్రవర్ణాలు వాడుకుంటున్నాయని పేర్కొన్నారు. బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగితే రాజ్యాధికారం రావడం కష్టమేమీ కాదన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో సాగుతున్న కుల ఉద్యమాలే నిదర్శనమని గుర్తుచేశారు. చట్టసభలతోపాటు స్థానిక సంస్థలలోనూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు జీతాలు పెంచుకున్న పాలకులు బీసీ విద్యార్థులకిచ్చే ఉపకారవేతనాలను ఎందుకు పెంచడంలేదని ప్రశ్నించారు. దొరల పాలనకు చరమగీతం పాడాలని, అందుకు ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్, పెద్దపల్లి నుంచే నాంది కావాలన్నారు. బీసీలకు సంక్షేమపథకాల అమలులోనూ అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నితే ఆందోళనలు చేసి సాధించుకున్నామన్నారు. బీసీలకు కళ్యాణలక్ష్మిని కూడా వర్తింజేసేలా ప్రభుత్వంతో పోరాడామని గుర్తు చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్, నాయకులు అరుణ్‌కుమార్, చేతి ధర్మయ్య, శ్రీధర్‌రాజు, చాట్ల మల్లేశం, నోమూరి శ్రీధర్‌రావు, రాజేశ్వరి, రాజేందర్, రణధీర్‌సింగ్, రామగిరి ప్రవీణ్, శ్రీనివాస్, బుచ్చిబాబు పాల్గొన్నారు.