సాక్షి, గుంటూరు: ఊరేదైనా తీరు మాత్రం మారడం లేదు. సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు.. ఆ కుర్చీల్లో వచ్చి కూర్చోవాలంటూ జనాలకు నేతలు మైకుల్లో విజ్ఞప్తి చేయడాలు.. రిపీట్ అవుతున్నాయి. టీడీపీ సభలకు జనం పల్చగా వస్తుండడంతో.. తెలివిగా జనసేనతో కలిసి ఉమ్మడి సభల ప్లాన్ వేశారు చంద్రబాబు. కానీ, అక్కడా అదే ఫలితం కనిపిస్తోంది. మొన్న తాడేపల్లిగూడెం.. ఇవాళ మంగళగిరిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.
మంగళగిరిలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభకు జనం కరువయ్యారు. మూడు గంటలకు మీటింగ్ ప్రారంభం కాగా.. జనం లేక ఆరు గంటల దాకా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎదురు చూశారు. ఈలోపు ఇరు పార్టీల నేతలు మైకుల్లో జనాలు వచ్చి కుర్చీల్లో కూర్చోవాలంటూ బతిమిలాడుకున్నారు. అయినా జనం తరలిరాకపోవడంతో హాజరైన జనంతోనే సభను ప్రారంభించాల్సి వచ్చింది ఆ ఇద్దరు.
మంగళగిరి సభలో.. చంద్రబాబు బుద్ధి బయటపడింది. పేరుకే అది బీసీ మీటింగ్ తప్ప.. నిర్వహణ మొత్తం పెత్తందారులకే అప్పగించారు. అందుకే చంద్రబాబు బుద్ధిని ముందే పసిగట్టిన బీసీ నేతలు.. ఆయన మోసాలు నమ్మేదీ లేదంటూ ఆ మీటింగ్ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అట్టర్‌ఫ్లాప్ దిశగా మంగళగిరి టీడీపీ-జనసేన సభ పరుగులు తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment