
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో బీసీ సభ నిర్వహిస్తానంటే చంద్రబాబు నాయుడు ఎందుకంత భయపడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మార్చి 3న గుంటూరులో నిర్వహించబోయే బీసీ గర్జన సభకు ఏపీ పోలీసులు అనుమతి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని మండి పడ్డారు. పోలీసులు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకుని సభ నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
ఏపీలో అన్ని సభలకు ఇలాంటి కండిషన్సే పెడతున్నారా అని ప్రశ్నించారు. యాదవ బహిరంగ సభలో చంద్రబాబును ఓడించమని బహిరంగంగానే కోరతానని తెలిపారు. గతంలో చంద్రబాబు తెలంగాణలో సభలు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment