talasani Srinivas Yadav
-
కేటీఆర్ సీఎం కావడానికి మోదీ అనుమతి ఎందుకు: తలసాని
-
‘కొడిపాయే లచ్చమ్మది’ అంటోన్న హెబ్బా పటేల్.. !
యంగ్ హీరో దినేష్ తేజ్, హీరోయిన్ హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'అలా నిన్ను చేరి'. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'కొడిపాయే లచ్చమ్మది' అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను మంగ్లీ పాడగా.. కుర్రకారుని కట్టిపడేసేలా మరో జానపదంగా నిలవబోతోంది. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య రిలీజ్ చేసిన అలా నిన్ను చేరి టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండింగ్‌లో నిలిచిన తెలిసిందే. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘యంగ్ టీం అంతా కలిసి ఈ సినిమాను నిర్మించారు. యంగ్ టాలెంట్‌ను ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. కొత్త సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. యంగ్ టాలెంట్ టీం తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ మూవీపెద్ద విజయం సాధించాలి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. Mass Folk Fest Begins!! Put Your dance shoes to groove 💃 🕺 Honourable Minister Sri @YadavTalasani launched the Folk Number #KodiBhayeLachammadi from #AlaNinnuCheri and wished the team all the luck@iamMangli sensational singing Watch the Lyrical Here:https://t.co/J2LUBtDhpd pic.twitter.com/c1ivLs3kti — Dinesh Tej (@idineshtej) September 27, 2023 -
TS Election 2023: సమైక్య పాలనలో గోసపడ్డాం..!
మెదక్: నాడు సమైక్య రాష్ట్రంలో బడ్జెట్లో నిధులు కేటాయించే వారు లేక ఇబ్బందులు పడ్డామని, రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ ముందుకు చూపుతో రాష్ట్రం సుబీక్షంగా మారిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ సమైక్యతా వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జిల్లా పురోగతిపై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం వైద్యం అందని పరిస్థితి ఉండేదని, నేడు జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామన్నారు. మెదక్ మెడికల్ కళాశాలకు రూ.180 కోట్లు మంజూరయ్యాయయని, వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. వనదుర్గ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు రూ.125 కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. మెదక్ చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి త్వరలోనే నిధులు విడుదల చేసేందుకు సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమంలో నంబర్‌వన్.. బీసీ సంక్షేమ శాఖ ద్వారా చేతి, కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో గతంలో 1,33,314 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, నేడు 3,09,189 మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. రైతుబంధు కింది 2018 నుంచి నేటి వరకు 2,43,380 మంది రైతులకు రూ.1,909 కోట్లు అందించామని, రైతు బీమా కింద 5,137 మృతుల కుటుంబాలకు రూ.256.85 కోట్లు పంపిణీ చేశామన్నారు. రూ.378.23 కోట్లు రుణమాఫీ చేసినట్లు వివరించారు. టీఎస్ ఐపాస్‌తో జిల్లాకు 871 పరిశ్రమలకు సంబంధించి 1869 అనుమతులు వచ్చాయని, 27,900 మందికి ఉపాధి లభించిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ కింద రూ.1.11కోట్లు, ఎస్టీలకు రూ.2.24కోట్ల రుణాలు అందించామన్నారు. మొదటి విడత గొర్రెల పంపిణీలో రూ.128కోట్లు చెల్లించామని, రెండో విడతకు 2,579 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందించామన్నారు. పాడి పశువుల పథకం కింద రూ.5.44 కోట్లు సబ్సిడీగా పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని మూడు రిజర్వాయర్లతో సహా 1,617 చెరువుల్లో చేపలు పెంచుతున్నామని, 16,200 మంది సభ్యులకు వీటిని అందించామన్నారు. 31 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టామని, దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,016కు పింఛన్ పెంచామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, జెడ్పీ చైర్పర్సన్ హేమలత, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ తదతరులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో.. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జాతీయ సమైక్యత వేడుకలు నిర్వహించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని జాతీ య జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా పోలీస్ ఏ.ఆర్ హెడ్ క్వార్టర్లో అదనపు ఎస్పీ మహేందర్ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ఫణింద్ర, ఆర్ఐలు అచ్యుతరావు, నాగేశ్వర్రావు, ఎస్బీ సీఐ సందీప్‌రెడ్డి, సీఐ దిలీప్‌కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో.. సమైక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్ పర్సన్ హేమలత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట శైలేష్, వెల్దుర్తి జెడ్పీటీసీ రమేష్ గౌడ్, కార్యాలయ పర్యవేక్షకులు మాణయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. చేపపిల్లలను వదులుతున్న మంత్రి, ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్ద పీటవేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పట్టణంలోని గోసముద్రం చెరువులో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డితో కలిసి ఆదివారం చేపపిల్లలను వదిలారు. అనంతరం మత్స్యకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యరంగాన్ని నాటి ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పెద్ద ఎత్తున మత్స్య రంగ అభివృద్ది నిధులు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాదిమంది మత్స్యకారుల కుటుంబాలు ఆర్ధిక ంగా, సామాజికంగా అభివృద్ది చెందాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లలను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నీటి వనరులను అభివృద్ది చేసుకొని ప్రతి నీటి వనరులో చేప పిల్లలను విడుదల చేస్తున్న ఫలితంగా మత్స్య సంపద మూడింతలు పెరిగిందన్నారు. అర్హులైన మత్స్యకారులకు ప్రభుత్వ లబ్ది అందాలనే ఉద్దేశం తో నూతనంగా లక్షమంది మత్స్యకారులకు సొసైటీలలో సభ్యత్వాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ వత్తి గౌరవాన్ని మరింత పెంచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ హేమలత,కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, మత్స్య శాఖ ఏడీ రజని తదితరులు పాల్గొన్నారు. -
పిసుకుడు పాలిటిక్స్
-
మాది అవినీతి ప్రభుత్వమైతే అవార్డులు ఎందుకు ఇస్తున్నారు?..మీడియాతో మంత్రి తలసాని
-
కంటోన్మెంట్ బీఆర్ఎస్లో గందరగోళం.. ఎమ్మెల్యే రేసులో అరడజను ఆశావహులు!
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు రోజురోజుకీ తీవ్రమవుతోంది. పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఎమ్మెల్యే సాయన్న మరణంతో నేతలందరినీ ఒక్కతాటిపై నడిపించే వారు కరువయ్యారు.ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారు ఎవరికి వారే తమ ఉనికి చాటేందుకు ఆరాటపడుతున్నారు. అంతేకాక ఇద్దరు మంత్రులు సైతం నియోజకవర్గంలో పార్టీకి తామే పెద్దదిక్కు అనేలా క్యాడర్‌ను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో తాము ఎవరి వెంట నడవాలో అర్థం నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. భౌగోళికంగా హైదరాబాద్ జిల్లాలో ఉండే కంటోన్మెంట్ నియోజకవర్గం పార్లమెంట్ విషయానికొస్తే మల్కాజ్గిరి పరిధిలో ఉంటుంది. ఆది నుంచీ మల్కాజ్గిరి ఎంపీ లేదా ఎంపీ అభ్యర్థులే ఇక్కడ ఆధిపత్యం చేలాయిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మల్కాజ్గిరి ఎంపీ అయిన ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి సహజంగానే పార్టీ నేతలకు పెద్ద దిక్కుగా ఉంటున్నారు. 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా అదే ధోరణిలో బోర్డు సభ్యులంతా తనవైపే ఉండేలా జాగ్రత్త లు పడుతూ వచ్చారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న సైతం మర్రి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ క్రమంలో నే బోర్డు ఎన్నికల ప్రకటన వెలువడటంతో సహజంగానే మర్రి తన వర్గంలోని బోర్డు మాజీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజుల అనంతరం ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో ఒక్కసారిగా పరిస్థితుల్లో తారుమారు అయ్యాయి. కీలకంగా మారిన మంత్రి.. ఎమ్మెల్యే సాయన్న దశదిన కర్మ ముగిసిన మరుసటి రోజే మంత్రి తలసాని, సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదితలతో పాటు బోర్డు మాజీ సభ్యుల్లో జక్కుల మహేశ్వర్ రెడ్డి (జేఎమ్మార్)ను తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. అక్కడికక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బోర్డు ఎన్నికల్లో పార్టీ కార్యాచరణ ప్రకటించడంతో పాటు, సర్వసభ్య సమావేశానికి పిలుపునిచ్చారు. అనివార్య కారణాల వల్ల సర్వసభ్య సమావేశం రెండు సార్లూ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మరోసారి ఎమ్మెల్యే కూతుర్లు, జేఎమ్మార్‌తో పాటు మర్రి వర్గంలోని మరో ముఖ్య నేత బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్‌ను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. తదనంతరం తెలంగాణ భవన్లో తన ఆధ్వర్యంలోనే ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సైతం మర్రిని ఆహ్వానించలేదు. బోర్డు మాజీ సభ్యులు సైతం మర్రి రాజశేఖర్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండానే ఈ భేటీలకు వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీ టికెట్ ఆశిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్లు మన్నె కృశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నాగేశ్‌లను కూడా ఈ భేటీకి పిలవకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. దిద్దుబాటులోనూ.. గత నెల 25 బొల్లారంలో నిర్వహించిన తొలి ఆత్మీయ సమ్మేళనం పార్టీలోని అసమ్మతిని బహిర్గతం చేసింది. మాజీ బోర్డు సభ్యులే వార్డుల అనధికారిక ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తూ ఉండటాన్ని పలువురు నేతలు తప్పుబట్టారు. మన్నె కృశాంక్, గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న శ్రీగణేశ్‌ను సైతం పార్టీ నేతలు దూరంగానే పెట్టారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్లు తమ అసంతృప్తిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా మంత్రి తలసాని మరోసారి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మర్రితో పాటు ముఖ్య నేతలంతా హాజరైన ఈ సమావేశంలోనూ ఇన్చార్జ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి నేతలంతా ఎవరికి వారే అన్నట్లుగా ప్రజాక్షేత్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. ఇక త్వరలో జరగబోయే ఎన్నికల్లో సాయన్న కుమార్తెల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సాయన్న ప్రధాన అనుచరుల్లో ఒకరైన ముప్పిడి మధుకర్‌ను కొందరు నేతలు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా మారుతుందోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించని భవ నాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రుల బృందం ఉన్నతాఅధికారులను ఆదేశించింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర అ న్ని ప్రధాన నగరాల్లోని బహుళ అంతస్తుల భవ నాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసు కునే చర్యలకు సంబంధించి ‘ఫైర్ సేఫ్టీ ఆడిట్’ నిర్వహించాలని నిర్దేశించింది. అగ్నిమాపక శాఖకు ఆధునిక సామగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం శాఖకు అవసరమైన అత్యవసర సా మగ్రికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని సూచించింది. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని మాపక చర్యలపై సందేహాలు తలెత్తిన నేప థ్యంలో బుధవారం మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్‌కుమార్, సునీల్‌శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి విపత్తులు సంభవించకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. సికింద్రాబాద్‌లోని డెక్కన్ మాల్లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు బలైన నేపథ్యంలో ప్రభుత్వం ఈమేరకు చర్యలు చేపట్టింది. డెక్కన్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ముగ్గురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని నిర్ణయించింది. డ్రోన్ సాంకేతికతను వినియోగించండి మునిసిపల్ నిబంధనల ప్రకారం ఐదంతస్తులు, ఆపై నిర్మించే భవనాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జర పడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతు న్నాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాలలోని వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్ట్మెంట్లలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే ప్రస్తుతమున్న ఫైర్‌సేఫ్టీ చట్టాలను సవరించాలని చెప్పారు. హైదరాబాద్‌లో భారీగా నిర్మాణమవుతున్న బహుళ అంతస్తుల భవనాల ఫైర్ సేఫ్టీకి సంబంధించి డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు. ఈ మేరకు పాశ్చాత్య దేశాలతోపాటు దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మెరుగైన పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అగ్నిమాపక సిబ్బందికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, వారిని నిష్ణాతులను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా భవనాల యజమానులను కూడా భాగస్వాములను చేసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో ఇంకా జలమండలి ఎండీ దాన కిషోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర , రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ అమేయ్ కుమార్ పాల్గొన్నారు. -
‘హుజురాబాద్, దుబ్బాక మాదిరిగా మునుగోడులోనూ డ్రామాలు షురూ’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ రోజు నుంచి డ్రామాలు మొదలయ్యాయని బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజగోపాల్ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశానని, హుజురాబాద్, దుబ్బాకలో అభ్యర్థులకు జరిగినట్లే ఇక్కడా జరుగుతోందని ఎద్దేవా చేశారు. తాము ముందు నుంచే ఇలా జరుగుతుందని ఊహించామని, మునుగోడు ప్రజలు దీనిని గమనించాలని సూచించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి తలసాని. ‘మునుగోడులో జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ్టి నుంచి డ్రామాలు స్టార్ట్ అయ్యాయి. రాజగోపాల్ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశాను. హుజురాబాద్, దుబ్బాక లో అభ్యర్థులకు జరిగినట్టే జరుగుతుంది. ఇవాళ జ్వరం వచ్చింది, రేపు గుండె నొప్పి రావొచ్చు. ఇలాగే కుటుంబం రోడ్డు మీదికి వచ్చి నిరసనలు చేసి సింపతి క్రెయేట్ చేసే ఏడుపులు మొదలవుతాయి. మేము ముందు నుంచి ఇదే చూస్తున్నాం. మేము ఊహించిందే జరిగింది. మునుగోడు ప్రజలు గమనించాలి. మునుగోడు అభివృద్ధి ఏ మేరకు చేసామో గమనించండి. మనకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ డ్రామాలను మునుగోడు ప్రజలు నమ్మకండి. జ్వరం ఒక్కటే కాదు, రేపు తన పైన దాడి చేయించుకొని చేతులు కాళ్ళు విరగొట్టుకుంటాడు. మేము స్పష్టమైన మెజారిటీతో గెలుస్తున్నాం’ అని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇదీ చదవండి: Munugode Bypoll 2022: ఎల్బీ నగర్లో ఏం జరుగుతోంది?.. మునుగోడు ఎన్నికకు సంబంధమేంటీ? -
రాబోయే కాలంలో దేశ వ్యాప్తంగా పోటీ చేస్తాం : తలసాని శ్రీనివాస్ యాదవ్
-
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ " స్ట్రెయిట్ టాక్ "
-
ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు.. అసోం సీఎంకు తలసాని కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంజే మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. గణేష్ శోభాయాత్ర సందర్బంగా నగరానికి విచ్చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఎంజే మార్కెట్లో సభా వేదికపై ఆయన ప్రసంగిస్తూ టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు అసోం సీఎం స్పీచ్‌ను అడ్డుకున్నారు. మైక్ లాక్కున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టడానికే అసోం సీఎంను ఇక్కడికి రప్పించారు. అసోం సీఎం భాష సరిగా లేదు. అందుకే స్థానికులు అడ్డుకున్నారు. ఆయన గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇక్కడికి వచ్చారు. అలాంటప్పుడు గణేషుడి గురించి లేదా శోభాయాత్ర గురించి మాట్లాడాలి కానీ.. రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. బీజేపీ నేతలు హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ మంత్రి తలసాని ప్రశ్నించారు. అనంతరం హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. -
HYD: గణేష్ శోభాయాత్రలో తలసాని ఫ్లెక్సీ వివాదం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా నేడు గణనాథుల శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. అటు భాగ్యనగరంలో సైతం గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఈ క్రమంలో వివిధ మార్గాల ద్వారా గణనాథులు ట్యాంక్ వైపు కదులుతున్నారు. కాగా, నిమజ్జనం సందర్భంగా నగరంలోని ఎంజే మార్కెట్ వద్ద ఫ్లెక్సీల గొడవ చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులతో ఉత్సవ సమితి సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి తలసాని ఫ్లెక్సీని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో, అక్కడి నుంచి ఫ్లెక్సీని తొలగించినట్టు సమాచారం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నట్టు పోలీసు అధికారులు స్పష్టంచేశారు. -
దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు: మంత్రి తలసాని
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): పండుగలు, దేవుళ్లను రాజకీయాలకు వాడుకోవడం తగదని, ఈ నెల 9న గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లూ ప్రభుత్వమే ఘనంగా చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలేదని, చేతకాకపోతే తామే నిర్వహిస్తామని.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవసమితి నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోమవారం ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వేలసంఖ్యలో పోలీసులు, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, రవా ణా, ఆర్అండ్బీ తదితర ప్రభుత్వ విభాగాలన్నీ కలసి చేసే కార్యక్రమం వారి వల్ల సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఉత్సవసమితి నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరించడం తగదన్నారు. నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ జరుగుతాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనం చేయనివ్వకపోతే ప్రగతిభవన్‌లో నిమజ్జనం చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ‘ఇటువంటి వ్యాఖ్యలు నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి వింటున్నా’ అని (నవ్వుతూ) అన్నారు. కాగా, ఒకరి పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నారని, హిందువుల పండుగలు జరిపించడంలేదనే పిచ్చి మాటల నుంచి కొందరు వ్యక్తులు బయటకు రావాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి అన్ని పండుగలూ సమానమేనన్నారు. ఇదీ చదవండి: 2024: ఢిల్లీ ‘పవర్’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే! -
మీ ఇంటి ముందే నిమజ్జనం.. ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ప్రత్యేక వాహనాలు
సనత్‌నగర్: వాహనం ఎక్కి వినాయకుడు నిమజ్జనానికి తరలడం కాదు.. నిమజ్జన వాహనమే గణేషుడి చెంతకు వచ్చే సరికొత్త విధానానికి ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ నాంది పలికింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఆ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు ‘ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. తొలిసారిగా ప్రయోగాత్మకంగా కమ్యూనిటీ అపార్ట్మెంట్ల నివాసితులకు ఈ సేవలను అందించనున్నారు. వీటిని శుక్రవారం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాహనాలపై ఏర్పాటుచేసిన నీటి తొట్టెలో వినాయకుడి విగ్రహాన్ని మంత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంటి ముందే వినాయకుడి నిమజ్జనం చేసేవిధంగా వాహనాలను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ వాహనాలను అవసరాలను బట్టి వచ్చే ఏడాది మరిన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ ఫుడ్ చైర్మన్ రాజీవ్‌సాగర్, ఫ్రీడమ్ ఆయిల్ మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ సురేష్ పాల్గొన్నారు. చదవండి: BJP Telangana: గ్రేటర్‌పై కమలం కన్ను -
పోతరాజులతో కలిసి సరదాగా చిందులు వేసిన మంత్రి తలసాని
-
కందికొండ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం సాయం: తలసాని
ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ సాయం ఉంటుందని సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న కందికొండ శనివారం(మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలించాంబర్‌లో ఉంచారు. తాజాగా ఆయన భౌతికకాయాన్ని మంత్రి తలసాని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కందికొండ అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం సాయం అందిస్తూనే ఉందన్నారు. చదవండి: హైకోర్టులో హీరో విశాల్‌కు చుక్కెదురు, రూ. 15 కోట్ల డిపాజిట్‌కు ఆదేశం మంత్రి కేటీఆర్ ఆయన ఆసుపత్రి ఖర్చుల విషయంలో చొరవ చూపించారన్నారు. కానీ అనుకొని పరిస్థితుల్లో ఆయన మృతి చెందడం బాధాకరం అన్నారు. కందికొండ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటు అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే గతంలో ఆయన, తన కుటుంబం ఓసారి మంత్రి కేటీఆర్‌ను కలిసి తన కళ, ఆశయంతో పాటు ఉండటానికి నీడ కావాలని కోరారు. ఇక ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చోరవ తీసుకుని వారికి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. చెప్పినట్టుగానే కందికొండ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం సాయం చేస్తుందని, ఈ విషయంలో ఆయన అభిమానులు అధైర్య పాడాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని పేర్కొన్నారు. చదవండి: ‘కందికొండ ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి సిద్దం’ -
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
ముషీరాబాద్: నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)తో వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీఎస్టీ రోడ్డులోని నాగమయ్యకుంట వద్ద, నల్లకుంట కూరగాయల మార్కెట్ రోడ్డులో హెరిటేజ్ బిల్డింగ్ వద్ద రూ.12 కోట్ల వ్యయంతో బ్రిడ్జిల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా రెండు బ్రిడ్జిల నిర్మాణ పనులను హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్ సి.సునిత ప్రకాష్‌గౌడ్‌లతో కలిసి మంత్రి తలసాని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఏటా వర్షాకాలంలో నాగమయ్యకుంట, సాయిచరణ్ కాలనీ, పద్మాకాలనీ, అచ్చయ్యనగర్ తదితర కాలనీలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. సమస్యకు ప్రధాన కారణమైన ఇరుకు బ్రిడ్జిలను తొలగించి ఆ స్థానంలో విశాలమైన బ్రిడ్జిలు నిరి్మస్తున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 8వేల కుటుంబాలకు ఉపశమనం లభిస్తుందన్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రూ.6వేల 700 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. స్టీల్ బ్రిడ్జితో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. హుస్సేన్‌సాగర్ నుంచి అంబర్‌పేట మీదుగా మూసీ వరకు ఉన్న హుస్సేన్‌సాగర్ నాలాకు 2020లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని మంత్రి తలసాని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిరి్మంచడానికి పూనుకున్నట్లు తెలిపారు. ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు రూ.426 కోట్లతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సీఈ కిషన్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్, డీఎంసీ హరికృష్ణ, వాటర్ వర్క్స్ జీఎం సుబ్బారాయుడు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస్‌రావు, ముఠా జైసింహా, మాజీ కార్పొరేటర్ బి.హేమలత, బి.శ్రీనివాస్‌రెడ్డి, కె.మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జి పనులను ప్రారంభిస్తున్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ సునీత తదితరులు -
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్నికీలలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. సెల్లార్‌లోని విద్యుత్ ప్యానల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్ కావడంతో కేబుళ్లకు మంటలు అంటుకుని క్షణాల్లో అయిదో అంతస్తుకు వరకూ విస్తరించాయి. దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర భయాందోళనతో హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అధికారులతో పాటు ఆస్పత్రి ప్రాంగణంలోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. బయటపడి.. ఊపిరి పీల్చుకుని.. ► బుధవారం ఉదయం 7.30 గంటల సమయం. ఆస్పత్రి సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ విభాగంలోని విద్యుత్ ప్యానల్‌బోర్డులో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ప్రతి అంతస్తుకు అనుసంధానం చేసిన విద్యుత్ తీగలు, కేబుళ్లకు మంటలు అంటుకుని నిలువుగా అయిదో అంతస్తు వరకు వ్యాపించాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చిమ్మచీకట్లు అలముకున్నాయి. ► దట్టమైన పొగలను గమనించిన రోగులు, సిబ్బంది భయాందోళనతో మెట్లు, ర్యాంపు మార్గాల ద్వారా బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కొంతమంది రోగులు కిందపడి స్వల్ప గాయాల పాలయ్యారు. గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి అంతస్తులోని గైనకాలజీ, చిన్నపిల్లల (పీడియాట్రిక్) వార్డుల్లో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, పీఐసీయూ, ఎన్ఐసీయూల్లోని శిశువులను తీసుకుని వార్డుల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. ► అగ్నిమాపక, పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది సుమారు 40 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. డీఎంఈ రమేష్‌రెడ్డి గాంధీ ఆస్పత్రిని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. చేపట్టాల్సిన చర్యలపై సూపరింటెండెంట్ రాజారావు, వైద్యులతో కలిసి సమీక్షించారు. విద్యుత్ అంతరాయంతో వైద్యసేవల్లో జాప్యం ఏర్పడింది. పలు శస్త్రచికిత్సలను వాయిదా వేశారు. పురాతన కేబుళ్లతో ప్రమాదాలు.. గాంధీఆస్పత్రి నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కేబుళ్ల వ్యవస్థ శిధిలావస్థకు చేరుకోవడంతో తరచూ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. వైర్లు, కేబుళ్లను ఎలుకలు, పందికొక్కులు కొరికివేయడంతో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అగ్నిప్రమాదాల కారణంగా లక్షలాది రూపాయల విలువైన వైద్యపరికరాలు దగ్ధమవు తున్నా ఆస్పత్రి పాలనా యంత్రాంగం సరైన రీతిలో స్పందించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కరకురాని అగ్నిమాపక పరికరాలు.. గాంధీఆస్పత్రిలో ఫైర్ ఫైటింగ్ సిస్టం పూర్తిగా నిరుపయోగంగా మారింది. ఆస్పత్రి ప్రారంభినప్పుడు ఏర్పాటు చేసిన పరికరాలు తుప్పుపట్టి మూలనపడ్డాయి. ఫైర్ ఎంగ్విస్టర్లు పనిచేయడంలేదు. నూతన ఫైర్ సిస్టం ఏర్పాటు చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఆస్పత్రి పాలనా యంత్రాంగం పలుమార్లు ఈ విషయమై వైద్య ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోవడం గమనార్హం. ఘటనపై మంత్రి తలసాని ఆరా గాంధీఆస్పత్రిలో అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే గాంధీ సూపరింటెండెంట్ రాజారావుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరానికి చేరుకున్న వెంటనే గాంధీఆస్పత్రిని సందర్శిస్తానన్నారు. వైద్యసేవలు యథాతథం.. నార్త్‌బ్లాక్‌లోని ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులను సౌత్ బ్లాక్‌కు తరలించి వైద్యసేవలు అందిస్తున్నాం. అగ్ని ప్రమాదాన్ని గుర్తించి 20 నిమిషాల్లో మంటలను అదుపు చేయించాం. వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతాయి. – రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ అంధకారంలోనే పరిపాలనా విభాగం, వార్డులు.. ► అగ్ని ప్రమాదంతో గాంధీ ఆస్పత్రిలో చిమ్మచీకట్లు అలముకున్నాయి. సుమారు గంటన్నర సమయం తర్వాత కొన్ని బ్లాకుల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నార్త్‌బ్లాక్ మొత్తం చీకట్లోనే ఉంది. విద్యుత్ అంతరాయంతో నార్త్‌బ్లాక్‌లోని ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ► సూపరింటెండెంట్ పేషీ, ఆరోగ్యశ్రీ, మెడికల్ రికార్డు సెక్షన్, ఆర్ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్, శానిటేషన్, ఎస్టాబ్లిష్మెంట్, పరిపాలన, బయోమెట్రిక్ విభాగాల పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడనుంది. -
విజయ మెగా డెయిరీ లక్ష్యం.. 8 లక్షల లీటర్లు
తుక్కుగూడ: పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. కులవృత్తులకు చేయూత ఇచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన విజయ తెలంగాణ మెగా డెయిరీ నిర్మాణ పనులకు మంత్రి సబితారెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నామని తలసాని చెప్పారు. దీన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. గతంలో ఈ డెయిరీ ద్వారా రోజూ లక్ష లీటర్ల పాలను మాత్రమే సేకరించేవారని, ప్రస్తుతం 4 లక్షల లీటర్లకు పెరిగిందని చెప్పారు. మెగా డెయిరీ పూర్తయితే రోజుకు 8 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విజయ డెయిరీకి 2014లో రూ.300 కోట్ల ఆదాయం ఉండగా.. ఇప్పుడు రూ.750 కోట్లకు పెరిగిందన్నారు. విజయ డెయిరీ దేశంలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. 15 రోజుల్లో బీమా పరిహారం చెల్లిస్తాం పాడి రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రతి లీటర్‌పై రూ.4 బోనస్ ప్రకటించారని తలసాని గుర్తు చేశారు. బోనస్‌రాని రైతులకు తమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో చెల్లిస్తామన్నారు. మంత్రి సబితారెడ్డి సూచన మేరకు రంగారెడ్డి జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టి రైతులకు సబ్సిడీపై పశువులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. బీమా ఉండి మరణించిన పశువులు, గేదెలకు 15 రోజుల్లో పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ‘విజయ డెయిరీ కేవలం పాల ఉత్పత్తులే కాకుండా నెయ్యి, పెరుగు, బటర్ మిల్క్, లస్సీ, ఫ్లేవర్డ్ మిల్క్ ఇలా 28 రకాలను ఉత్పత్తి చేస్తోంది. ఇవి తెలంగాణలోనే కాకుండా ఏపీ, ఢిల్లీ, ముంబైలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఏడాది పొడవునా రైతుల నుంచి పాలను సేకరిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 200 అవుట్లెట్లు, 600 పార్లర్లు ఉన్నాయి. రాష్ట్రంలో 2 లక్షల 13 వేల మంది రైతులు సహకార సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గొల్లకుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రూ.11 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేశాం’అని తలసాని చెప్పారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. రావిర్యాలలో మెగా డెయిరీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీని ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుం దని చెప్పారు. ప్రైవేట్ రంగానికి దీటుగా విజయ డెయిరీ పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘గణేష్ ఉత్సవాలను బాగా జరుపుకోవాలి’
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల నిర్వాహణపై ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ప్రభాకర్, డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల నుంచి కరోనా వలన గణేష్ ఉత్సవాలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని అన్నారు. అయితే, ఈసారి దేవుని ఆశీస్సులతో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నాం... గణేష్ ఉత్సవాలను కూడా ఇలానే జాగ్రత్తగా నిర్వహించుకోవాలని తెలిపారు. వినాయక నిమజ్జన కోసం.. ప్రత్యేకంగా క్రేన్స్‌లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈసారి ట్యాంక్ బండ్ నిండుకుండలాగా ఉందని అన్నారు. కాగా, విగ్రహల ఎత్తు గురించి ప్రభుత్వం ఎప్పుడూ నిబంధనలు పెట్టలేదని అన్నారు. మూడు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వారు గణేష్ విగ్రహల ఏర్పాటుకి అనుమతి ఇస్తారని అన్నారు. చదవండి: Hyderabad: రెండు కేజీ బంగారు నగల బ్యాగు మిస్సింగ్ -
అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
-
త్వరలోనే సినిమా థియేటర్లు ఓపెన్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. టాకీస్‌లను తెరవాలన్న దిశగా సినిమా ఎగ్జిబిటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏడాది నుంచి థియేటర్లు మూసి ఉంచిన నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతిన్నామని, ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఫిలిం చాంబర్, సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సునీల్ నారంగ్, అనుపమ్‌రెడ్డి, అభిషేక్ నామా, సదానంద్‌గౌడ్, బాలగోవింద్, రాజ్‌తాడ్ల తదితరులు శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. థియేటర్లు మూసి ఉంచిన కాలానికి సంబంధించి ఆస్తిపన్ను మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని, ఎస్జీఎస్టీని రద్దు చేయాలని, షూటింగ్ అనుమతుల చార్జీలను తగ్గించాలని కోరారు. దీనిపై స్పందించిన తలసాని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆదివారం నుంచి సినిమా థియేటర్లను తెరవచ్చని ఫిలిం చాంబర్ తీర్మానించిందంటూ వార్తలు వచ్చాయి. కానీ థియేటర్లు తెరవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అంతా ఏకాభిప్రాయానికి వచ్చాక అధికారికంగా ప్రకటిస్తామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ఫిలిం చాంబర్ నేతలు ప్రకటించారు. త్వరలోనే తెరిచే అవకాశం ఉందని వెల్లడించారు. -
ఈటల మాట ఎత్తకుండానే టీఆర్ఎస్ ప్రెస్‌మీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రమంతా మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై చర్చ నడుస్తోంది. తాజాగా ఈటల మంత్రిత్వ శాఖను ప్రభుత్వం లాగేసుకోంది. దీనిపై విస్తృత చర్చ నడుస్తున్న సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఈటల వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించారు. ఈటల పేరు ఎత్తకుండానే సమావేశం ముగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఏవో వ్యాఖ్యలు చేశారని వాటికి కౌంటర్ ఇచ్చేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు.. ‘బండి సంజయ్ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు. కొన్నింటికి హద్దూఅదుపులు ఉంటాయి. కరోనా కట్టడి విషయంలో కేంద్రం ఏం చేస్తుందో బండి సంజయ్ చెప్పాలి. కేంద్రం చేస్తున్న పనులను ప్రపంచ మీడియా ఏం చేస్తుందో సంజయ్ చూడాలి. బండి సంజయ్ చిల్లరగా, చీప్‌గా మాట్లాడటం ఎందుకు..? గతేడాది ప్రధాని చెప్పిన పనులు అన్ని చేశాం. బండి సంజయ్ బాధ్యతగా మాట్లాడాలి. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు సంజయ్. ఈటల విషయం సీఎం పరిధిలో ఉంది’. అనంతరం ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని తెలిపారు. మీడియా వ్యక్తులపైన కూడా విరుచుకుపడ్డారని చెప్పారు. ఏది పడితే అది మాట్లాడటం సంజయ్‌కి తగదని హితవు పలికారు. కోవిడ్‌పైన రోజు సీఎం సమీక్ష చేస్తుంన్నాడని తెలిపారు. బండి సంజయ్‌ది నోరా? మోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ సీఎం కేసీఆర్ సీఎస్‌తో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బట్టేబజ్ మాటలు మాట్లాడొద్దని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్‌కి కర్రు కాల్చి వాత పెట్టారని చెప్పారు. వాక్సిన్, రిమిడిసివర్ ఇంజెక్షన్లపై కేంద్రంపై మాట్లాడవెందుకు అని సంజయ్‌ని ప్రశ్నించారు. కరోనా విషయంలో ప్రజల్లో తిరుగుతుంది మా టీఆర్ఎస్ నేతలు అని.. మీరు తిరుగుతున్నారా? అని ప్రశ్నించారు. ఈ విధంగా విలేకరుల సమావేశం మమ అని ముగించారు. ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నా ఏం మాట్లాడకుండా కూర్చుండిపోయారు. విలేకరులు ఈటల విషయమై ప్రశ్నలు వేస్తుండగా అది తర్వాత వ్యవహారం అని చెబుతూ వెళ్లిపోయారు. చదవండి: ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి చదవండి: కరోనాను మరిపించేందుకే ఈటల భూకబ్జా డ్రామాలు -
నాగార్జునసాగర్ లో జానారెడ్డి ఓటమి ఖాయం : మంత్రి తలసాని
-
దళిత యువతకు మినీ డెయిరీలు!
సాక్షి, హైదరాబాద్: దళిత నిరుద్యోగ యువతకు మినీ డెయిరీల ద్వారా ఉపాధి కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలో పాల ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండడం.. డిమాండ్‌కు తగిన విధంగా పాల దిగుబడి లేకపోవడంతో పాడిపరిశ్రమకు మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి పశుసంవర్థక శాఖ అధికారులతో సమాలోచనలు చేసిన ఎస్సీ కార్పొరేషన్.. ఔత్సాహికులతో మినీ డెయిరీలు ఏర్పాటు చేయించాలని భావిస్తోంది. వాస్తవానికి గత ఏడాదే ఈ అంశంపై దృష్టిసారించిన ఎస్సీ కార్పొరేషన్, కరోనా నేపథ్యంలో ఆ ప్రయత్నాలను వాయిదా వే సింది. తాజాగా పరిస్థితులు సద్దుమణుగుతుండ డంతో మళ్లీ మినీ డెయిరీల ఏర్పాటుపై దృష్టి సారించింది. 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పొందుపరిచే అవకాశం ఉందని చెబుతున్నారు. గరిష్టంగా రూ.4 లక్షలతో.. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న రెండు, మూడు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును తొలుత ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ఎస్సీ కార్పొరేషన్ యోచిస్తోంది. జిల్లాకు సగటున 100 యూనిట్లు మంజూరు చేయా లని భావిస్తోంది. ఒక్కో యూనిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య బ్యాంకు అనుసంధానంతో రుణం ఇచ్చి ఇందులో 60 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ప్రతి డెయిరీ యూనిట్‌కు 3 గేదెలు పంపిణీ చేస్తారు. అదేవిధంగా గేదెలకు షెల్టర్ కోసం ప్రత్యేక షెడ్ ఏర్పాటు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాజెక్టు యూనిట్ కాస్ట్లో కొంత మొత్తాన్ని కేటాయిస్తారు. దీంతోపాటు ఆరునెలలకు సరిపడా పశుగ్రాసం కోసం అవసరమైన నిధులకు కూడా ప్రత్యేక మొత్తాన్ని నిర్దేశిస్తారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటున్న అధికారులు.. యూనిట్ విలువ కనీసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండేలా అంచనాలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నారు. త్వరలోనే సబ్సిడీ పాడిగేదెల పంపిణీ పాడిపరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు త్వరలోనే సబ్సిడీపై పాడిగేదెలను అందించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలి పారు. గురువారం మంత్రి కార్యాలయంలో విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ సబ్సిడీ పాడిగేదెల కోసం 3,834 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించారని, గేదెల పంపిణీకి సంబం ధించి విజయ డెయిరీ సంస్థ నోడల్ ఏజెన్సీగా ఉం టుందని వెల్లడించారు. కాగా, గతంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన పాడిగేదెల్లో 2,691 గేదెలు చనిపోయాయని, వాటికి సంబంధించి పరిహారం కింద కొత్తగా పాడి గేదెలను కొనుగోలు చేసి వెంటనే పంపిణీ ప్రక్రియ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక నుంచి లీటర్ పాలకు ప్రభుత్వం రూ.3, ఆయా డెయిరీ సంస్థలు రూ.1 చొప్పున కలిపి రైతులకు ప్రోత్సాహకం కింద చెల్లిస్తామ న్నారు. ఇందులో భాగంగా కరీంనగర్, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలకు పాలుపోసే రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహకం బకాయిలలో రూ.8 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. విజయ ఐస్క్రీంల విక్రయాలకు సైకిల్ రిక్షాలు.. విజయ ఐస్క్రీంల విక్రయాల కోసం ప్రత్యేక పుష్ కార్ట్ (సైకిల్ రిక్షా)లను వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ముందుగా 250 పుష్‌కార్ట్‌ల ద్వారా ఐస్ క్రీంల విక్రయాలు ప్రారంభించాలన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, శిల్పారామం, గోల్కొండ కోట, దుర్గంచెరువు వంటి ప్రాంతాల్లో విక్రయాలు చేప ట్టాలన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో అనువైన ప్రాంతాలను గుర్తించి నూతన ఔట్లెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి మార్చిలో వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్ రాంచందర్ పాల్గొన్నారు.