
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల నిర్వాహణపై ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ప్రభాకర్, డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల నుంచి కరోనా వలన గణేష్ ఉత్సవాలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని అన్నారు.
అయితే, ఈసారి దేవుని ఆశీస్సులతో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నాం... గణేష్ ఉత్సవాలను కూడా ఇలానే జాగ్రత్తగా నిర్వహించుకోవాలని తెలిపారు. వినాయక నిమజ్జన కోసం.. ప్రత్యేకంగా క్రేన్స్‌లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈసారి ట్యాంక్ బండ్ నిండుకుండలాగా ఉందని అన్నారు. కాగా, విగ్రహల ఎత్తు గురించి ప్రభుత్వం ఎప్పుడూ నిబంధనలు పెట్టలేదని అన్నారు. మూడు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వారు గణేష్ విగ్రహల ఏర్పాటుకి అనుమతి ఇస్తారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment