వినాయక విగ్రహాలతో నిండిపోయిన ట్యాంక్‌ బండ్‌.. ఫుల్‌ ట్రాఫిక్‌ జామ్‌ | Ganesh Idols Immersion Continue At Tank Bund Updates | Sakshi
Sakshi News home page

వినాయక విగ్రహాలతో నిండిపోయిన ట్యాంక్‌ బండ్‌.. ఫుల్‌ ట్రాఫిక్‌ జామ్‌

Published Wed, Sep 18 2024 7:07 AM | Last Updated on Wed, Sep 18 2024 9:36 AM

Ganesh Idols Immersion Continue At Tank Bund Updates

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో గణేష్‌ విగ​గ్రహాల నిమజ్జనం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్‌ వద్దకు వేలాదిగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలోనే ఉన్నాయి. పెద్ద విగ్రహాలు సైతం ఇంకా నిమజ్జనం కాలేదు.

ఇక, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో విగ్రహాలను తరలిస్తున్న వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. కాగా, సోమవారం అర్ధరాత్రి వరకు లక్షకు పైగా నిమజ్జనాలు జరిగాయి. నేడు రోజు కూడా నిమజ్జనాల ప్రక్రియకు మరింత సమయం పట్టనుంది.

 

నిన్నటి నుంచి నిమజ్జనం కోసం గణపతి విగ్రహాలు వస్తూనే ఉ‍న్నాయి. దీంతో, ఖైరతాబాద్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో కొంత మేర ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అధికారులు.. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నేడు పనిదినం కావడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ.. పోలీసుల అధికారులను ఆదేశించారు. 

ఎన్టీఆర్ మార్గ్‌లో ఒక వైపు రోడ్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గణపతి విగ్రహాలను జలవిహార్‌, పీపుల్స్‌ ప్లాజా వైపు మళ్లిస్తున్నారు. అలాగే, విగ్రహాలను నిమజ్జనం కోసం పీపుల్స్‌ ప్లాజా రోడ్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌లోని మరో రోడ్‌లోకి మళ్లిస్తున్నారు. సాధారణ వాహనాల రాకపోకల కోసం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ఇక, ట్యాంక్‌ బండ్‌పై నిమజ్జనం కోసం ఇంకా ఐదువేల వరకు విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

 ఇది కూడా చదవండి: లంబో‘ధర’ లడ్డూ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement