Ganesh Nimajjanam 2024
-
గణనాథుల భారీ క్యూ.. ట్యాంక్ బండ్‌పై కొనసాగుతున్న నిమజ్జనం (ఫొటోలు)
-
వినాయక విగ్రహాలతో నిండిపోయిన ట్యాంక్ బండ్.. ఫుల్ ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గణేష్ విగగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ వద్దకు వేలాదిగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలోనే ఉన్నాయి. పెద్ద విగ్రహాలు సైతం ఇంకా నిమజ్జనం కాలేదు.ఇక, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్‌లో విగ్రహాలను తరలిస్తున్న వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. కాగా, సోమవారం అర్ధరాత్రి వరకు లక్షకు పైగా నిమజ్జనాలు జరిగాయి. నేడు రోజు కూడా నిమజ్జనాల ప్రక్రియకు మరింత సమయం పట్టనుంది. నిన్నటి నుంచి నిమజ్జనం కోసం గణపతి విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. దీంతో, ఖైరతాబాద్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో కొంత మేర ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అధికారులు.. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నేడు పనిదినం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ.. పోలీసుల అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఒక వైపు రోడ్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గణపతి విగ్రహాలను జలవిహార్, పీపుల్స్ ప్లాజా వైపు మళ్లిస్తున్నారు. అలాగే, విగ్రహాలను నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోని మరో రోడ్లోకి మళ్లిస్తున్నారు. సాధారణ వాహనాల రాకపోకల కోసం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇక, ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం కోసం ఇంకా ఐదువేల వరకు విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: లంబో‘ధర’ లడ్డూ! -
మహా గణపతి నిమజ్జనానికి కదలిన భక్తజన సందోహం (ఫొటోలు)
-
గణేష్ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అరుదైన ఫీట్ సాధించారు. నగరంలో ఇవాళ జరిగిన గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న తొలి సీఎంగా నిలిచారు. ఇవాళ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అటు నుంచి నేరుగా ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్ నెంబర్ 4 వద్ద పరిశీలన జరిపారు. అక్కడి నుంచే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారాయన.క్లిక్ చేయండి: ఖైరతాబాద్ శోభాయాత్ర.. నెవర్ భిపోర్ -
ట్యాంక్‌బండ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి.. గణేష్ నిమజ్జనం సమీక్ష (ఫొటోలు)
-
బాలాపూర్ లడ్డూ మోదీకి అంకితం: కొలను శంకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ గణపతి లడ్డూ వేలంలో మరోసారి రికార్డు స్ధాయి ధర పలికింది. చరిత్రను తిరగరాస్తూ ఈసారి రూ.30లక్షల ఒక వేయికి లడ్డూను దక్కించుకున్నారు బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి. ఈ సందర్భంగా లడ్డూను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. త్వరలో ఢిల్లీకి వెళ్లి పూర్తి లడ్డూను ఆయనకే అందిస్తానని చెప్పారు. వేలం పాట రూ.1116తో ప్రారంభమై.. క్రమంగా పెరుగుతూ.. రూ.30 లక్షల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత ఎవరూ వేలం పాట పాడేందుకు ముందుకు రాకపోవడంతో కొలను శంకర్ రెడ్డికే బాలాపూర్ లడ్డూ దక్కింది. గతేడాది కూడా లడ్డూ రూ.27లక్షల పలికిన విషయం తెలిసిందే. దీంతో, గతేదాడి కంటే మూడు లక్షల ఒక్క వేయి ఎక్కవ పలికింది. కాగా, బాలాపూర్ లడ్డూ వేలం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకమైంది. లడ్డూను దక్కించుకునేందుకు ఎంతో మంది ముందుకు వస్తుంటారు. ఇక, ఈ ఏదాడికి బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి అయ్యింది. 1994లో తొలిసారి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. తొలిసారి వేలంలో లడ్డూ రూ.450 పలికింది. ఇక, 30 ఏళ్ల నాటికి లడ్డూ ఏకంగా రూ.30లక్షలకు చేరుకుంది. ఇదే ఓ రికార్డుగా స్థానికులు చెప్పుకుంటున్నారు.30ఏళ్లుగా వేలం ఇలా..1994లో తొలిసారి రూ.450తో ప్రారంభం 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలు, 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు 2023లో రూ.27 లక్షలు 2024లో రూ.30,01,000(30లక్షల ఒక వేయి). ఇది కూడా చదవండి: వేలంలో రికార్డులు పటాపంచల్.. గణేశుడి లడ్డూ@ రూ.1.87 కోట్లు -
HYD: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఘనంగా గణనాథుల నిమజ్జనం..ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సందడి (ఫొటోలు)
-
బాలాపూర్ లడ్డూ వేలం.. మరోసారి రికార్డు ధర
బాలాపూర్ గణేష్ నిమజ్జనం.. 👉బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా లడ్డూ రికార్డు స్థాయిలో వేలం జరిగింది. రూ.30లక్షల ఒక వేయ్యి పలికిన లడ్డూ. కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. 👉 మరికాసేపట్లో ప్రారంభం కానున్న బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట👉బాలాపూర్ బడా గణపతి నిమజ్జన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. నేడు నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ వినాయకుడు ఉద్వాసన పూజలు అందుకున్నాడు. అనంతరం, వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైంది. 👉బాలాపూర్ వీధుల్లో గణపతిని ఊరిగేస్తుండగా వీధులన్నీ భక్తుల జన సందోహంతో నిండిపోయాయి. 👉బాలాపూర్ నిమజ్జనం నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.👉ఇక, ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియలో ఆరుగురు భక్తులు పాల్గొననున్నారు.👉ఇప్పటికే గత సంవత్సరం వేలంపాటలో పలికిన 27 లక్షల రూపాయలను ఆరుగురు భక్తులు డిపాజిట్ చేశారు. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాటకు 30 ఏళ్లు పూర్తివేలంపాట ప్రక్రియలో ఉత్సవ కమిటీ తాజాగా కొత్త నిబంధన పోటీదారులు ముందస్తుగా డబ్బులు డిపాజిట్ చేయాలని నిర్ణయంగ్రామస్తుల నుంచి వేలంపాటకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిబంధన1994లో తొలిసారి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాటమొదట రూ.450తో ప్రారంభం 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలు, 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు 2023లో బాలాపుర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు2023లో లడ్డూను దక్కించుకున్న స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి ఈ ఏడాది రూ.30 లక్షలు పలుకుతుందని అంచనాబాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితీ -
Watch: గంగమ్మ ఒడికి మహా గణపయ్య
హైదరాబాద్, సాక్షి: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. వేలమంది భక్తుల ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల నడుమ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు గణపతినాథుడు. అనుకున్న టైం కంటే ముందే శోభాయాత్ర మొదలుకాగా.. అంతే త్వరగతిన ట్యాంక్‌బండ్‌కి విగ్రహాన్ని చేర్చేందుకు పోలీసులు యత్నించారు. అయితే మధ్యలో అరగంటపాటు శోభా యాత్ర నిలిచిపోయింది. తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నిమజ్జనంలో పాల్గొని అరుదైన ఫీట్ సాధించారు.స్పెషల్ క్రేన్‌తో70 అడుగుల ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం కోసం సూపర్ క్రేన్‌ను శంషాబాద్ నుంచి తెప్పించారు. దాదాపు 350 టన్నుల బరువుల్ని మోయగలిగే ఆ క్రేన్ సాయంతోనే నిమజ్జనాన్ని ఎలాంటి అవాంతరం లేకుండా పూర్తి చేశారు.జనసంద్రంగా ఎన్టీఆర్ మార్గ్అనుకున్న టైం కంటే అరగంట ముందే ఖైరతాబాద్ గణేషుడు కదిలాడు. రెండంచెల రోప్ వ్యవస్థతో త్వరగతిన తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. మహా గణపతి నిమజ్జన నేపథ్యంలో.. ఎన్టీఆర్ మార్గ్‌లో మిగతా విగ్రహాలను ఆపేశారు. అందుకు భక్త జనం కూడా సపోర్ట్ చేశారు. ఒకానొక టైంలో త్వరగానే నిమజ్జనం పూర్తవుతుంది భావించారంతా. అయితే సచివాలయం వద్ద అరగంట సేపు విగ్రహాం ఆగిపోయింది. దీంతో అనుకున్న టైంకే విగ్రహ నిమజ్జనం పూర్తైంది. ఇంకోవైపు వాతావరణం చల్లబడడంతో జనం ఒక్కసారిగా ఎక్కువగా వచ్చారు.స్వల్ప లాఠీ ఛార్జ్ఖైరతాబాద్ విగ్రహా నిమజ్జనం అనంతరం.. భారీగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న గణపయ్యలకు పోలీసులు అనుమతించారు. దీంతో ఒక్కసారిగా రద్దీ నెలకొంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు అక్కడి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కిన యువతకు పోలీసులు సూచించారు. అయినా వాళ్లు వినకపోవడంతో స్వల్ప లాఠీ ఛార్జి చేశారు.సీఎం రేవంత్ పర్యవేక్షణమునుపెన్నడూ లేని విధంగా గణేష్ నిమజ్జనానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర మహా గణపతి నిమజ్జన ఏర్పాట్లతో పాటు మిగతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. క్రేన్ల డ్రైవర్లతో పాటు ఇతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, షిఫ్ట్‌లవారీగా పని చేయించుకోవాలని, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిమజ్జనం పూర్తయ్యే చూడాలని అధికారుల్ని ఆదేశించారు. Khairtabad #badaganesh ji Shobayatra slowly moving towards telugu thalli flyover #ganeshnimmajjnam #ganeshimmersion2024#GanpatiBappaMorya pic.twitter.com/vSuVZHeorS— Hyderabad City Police (@hydcitypolice) September 17, 2024 ఈసారి సరికొత్త రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ లంబోదరుడుఈసారి కోటి రూ.10 లక్షల ఆదాయంహుండీ ద్వారా రూ.70 లక్షలుప్రకటనలు, హోర్డింగ్‌లతో మరో రూ.40 లక్షలు తొలిసారిగా ఖైరతాబాద్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు గత పదిరోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు కమిటీ వెల్లడిరికార్డు స్థాయిలో భక్తుల దర్శనంఏటా పెరుగుతున్న భక్తుల తాకిడిసెప్టెంబర్ 6వ తేదీన మహాగణపతి ఆగమన వేడుక11 రోజులపాటు నిర్విఘ్నంగా సాగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలుమహాగణపతిని దర్శించుకున్న లక్షల మంది భక్తులు, సందర్శకులు 70 అడుగుల మహా గణపతిభాగ్యనగరమే కాదు తెలుగు రాష్ట్రాల్లో.. దేశవ్యాప్తంగానూ ఖైరతాబాద్ గణేషుడికి గుర్తింపుఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తిఅందుకే ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహంశిల్పి చిన్న స్వామి రాజేందర్ గణేషుడికి ఒకటిన్నర రోజుల్లో అలంకరణ.. 200 మంది కార్మికుల శ్రమశ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా కొలువుదీరిన విష్నేషుడుఈ ఏడాది శ్రీ సప్త ముఖ మహాశక్తి గణపతి గా భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణపతి.కుడి వైపు శ్రీ నివాస కళ్యాణం ఎడమ వైపు పార్వతి కళ్యాణం..భారీ విగ్రహం కింద వైపు అయోధ్య బాలరాముడి విగ్రహం ఏర్పాటు..పర్యావరణ హితంగా ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం ఏర్పాటు..ఈఏడాది కొలువు తీరిన ఖైరతాబాద్ గణేష్ బరువు సుమారు 40 నుంచి 50 టన్నులుపెద్ద ఎత్తున ఐరన్, పిచూ.. మట్టి వినియోగం.. -
నగరంపై పోలీసుల నజర్
సాక్షి, హైదరాబాద్: సాధారణ పరిస్థితుల్లోనే గణేశ్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక ఊరేగింపు, నిమజ్జనాలను సజావుగా పూర్తి చేయడం నగర పోలీసులకు పెద్ద సవాలు. అలాంటిది ఈసారి మంగళవారం ఒకేరోజు.. హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు కీలక చెరువుల్లో నిమజ్జనాలు, తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం జరగనుండటంతో పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్థాయిలో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ప్రతి ఏడాదీ సామూహిక ఊరేగింపు, నిమజ్జనం నేపథ్యంలో ఉత్తరాది సహా వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది ప్రముఖులు నగరానికి వస్తుంటారు. వీరిలో ఆర్ఎస్ఎస్ సహా వివిధ సంస్థలకు చెందిన వారు ఉంటారు. చార్మినార్, ఎంజే మార్కెట్ సహా మరికొన్ని ప్రాంతాల్లో వీరి ప్రసంగాలు ఉంటాయి. దీంతో పోలీసులు ఆయాచోట్ల అదనంగా జాగ్రత్తలు తీసుకుని బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పాతబస్తీ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ప్రధాన రహదారి కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయి. దీనికి తోడు ఈసారి సెపె్టంబర్ 17 పురస్కరించుకుని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. దీనికి ముందు ఆయన అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే అవకాశం ఉంది. ఈ రెండు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ చిక్కులు మరింత పెరుగుతాయని భావిస్తున్న పోలీసు అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆయనతో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి కూడా హాజరుకానున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన బీజేపీ క్యాడర్ పరేడ్ గ్రౌండ్స్‌కు తరలిరానుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. సిబ్బందికి సెలవులు రద్దు చేసిన పోలీసు అధికారులు..ఆయా కార్యక్రమాల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. సోమవారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో అధికారులు విధుల్లో ఉండనున్నారు. అవసరమైన స్థాయిలో అదనపు బలగాలను రంగంలోకి దింపి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు. సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, టీజీఎస్ఎస్పీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లతో పాటు కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. వీరికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సివిల్, సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. సున్నిత, అనుమానిత ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులతో ప్రత్యేక గస్తీ, నిఘా ఏర్పాటు చేస్తున్నారు. పాతబస్తీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం అర్ధరాత్రి అనేక ప్రాంతాల్లో పర్యటించారు. నిమజ్జనం బుధవారం ఉదయం వరకు జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తుండగా, గురువారం నగరంలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉండటంతో దానికీ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టారు. -
Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు!
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: నగరంలో గణేశ్ సామూహిక నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా గత ఏడాది ఎదురైన అనుభవాలను పాఠాలుగా తీసుకొని ఈసారి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా కసరత్తు చేస్తున్నారు. బందోబస్తు కోణంలో సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు ఫైనల్స్ వంటివి. గత కొన్నేళ్లతో పోలిస్తే గత ఏడాది ఈ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. 2023 సెప్టెంబర్ 28 తెల్లవారుజాము నుంచి 29 రాత్రి 10 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగింది. ఈ ఆలస్యానికి కారణాలను ఉన్నతాధికారులు విశ్లేషించి ఈసారి ఏ ఒక్కటీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఈ లోపాలను ప్రస్తావించారు. వీటిని జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాల దృష్టికీ తీసుకువెళ్లారు. రెండు క్రేన్ల మధ్య వంద అడుగుల దూరం... కొన్ని క్రేన్లలో ఇనుపతాళ్లకు బదులుగా బెల్ట్‌లు వాడారు. నిమజ్జనం సందర్భంలో ఇవి ఊడిపోవడంతో మరింత ఆలస్యమైంది. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేయాల్సి వస్తే... ప్రతి రెండు క్రేన్ల మధ్య కనీసం 100 నుంచి 150 అడుగుల దూరం ఉండాలి. అలా చేస్తేనే నిమజ్జనానికి విగ్రహాలను తెచ్చిన లారీలు, ఖాళీ అయినవి తేలిగ్గా ముందుకు వెళ్తాయి. అయితే సరైన పర్యవేక్షణ లేని కారణంగా గత ఏడాది ప్రతి క్రేన్ మధ్య 30 నుంచి 40 అడుగుల దూరమే ఉంచారు. దీంతో విగ్రహాలను తీసుకొచ్చిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఫలితంగా నిమజ్జనానికి వచ్చే విగ్రహాల కోసం క్రేన్లు ఖాళీగా వేచి ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా ట్యాంక్‌బండ్‌పై బయటి ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులకు ఎక్కువగా డ్యూటీలు వేశారు. సరైన అవగాహన లేని వీళ్ళు సక్రమంగా తమ విధులను నిర్వర్తించలేకపోయారు. ఇదీ చదవండి: కీలక ఘట్టానికి వేళాయేపటిష్టంగా బారికేడింగ్ నిమజ్జనం చూడటానికి వచ్చే సందర్భకులు లారీల మధ్యలోకి, రోడ్డుపైకి రాకుండా ఇరువైపులా పటిష్ట బారికేడింగ్ ప్రతి ఏడాదీ ఏర్పాటు చేస్తుంటారు. ఇది గత ఏడాది సక్రమంగా జరగలేదు. దీంతో అనేకమంది లారీల మధ్యకు వస్తుండటంతో అవి చాలా ఆలస్యంగా కదిలాయి. మరోపక్క బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ వైపు వాహనాలను అనుమతించడం మరో ఇబ్బందికి కారణమైంది. విగ్రహాలు తీసుకువచ్చే లారీల వెనుక వచ్చే ద్విచక్ర వాహనాలు, ఇతరాలను గత ఏడాది పూర్తిస్థాయిలో అడ్డుకోలేదు. ఇది కూడా నిమజ్జనం ఆలస్యానికి కారణంగా మారింది. ఇవన్నీ విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు ఈసారి అవి పునరావృతం కాకుండా, గతం కంటే మెరుగైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవీ లోపాలు... ముందుగా వచ్చే విగ్రహాలు నిమజ్జనం కాగానే బండ్ నుంచి 20 అడుగుల దూరం మేర నీటిలో పేరుకుపోయే వ్యర్థాలు, వస్తువులను వెంట వెంటనే తొలగించాలి. అలా జరగకపోవడంతో ఆ వెంటనే నిమజ్జనం చేసే విగ్రహాలు మునగడానికి చాలా సమయం పట్టింది. నిమజ్జనం సందర్భంగా సాగర్‌లో కనీసం నాలుగు, ఐదు ఫ్లోటింగ్ జేసీబీలను ఏర్పాటు చేయాలి. ఓ పక్క విగ్రహాలు నీటిలో పడుతుంటే, మరోపక్క వాటి వ్యర్థాలను తొలగించాలి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు గత ఏడాది కేవలం ఒక్క ఫ్లోటింగ్ జేసీబీ మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ కారణాల వల్ల నిమజ్జనం ప్రక్రియ వేగంగా జరగడానికి తీసుకువచ్చిన అత్యాధునిక క్యూఆర్డీ హుక్స్ సరిగ్గా పనిచేయలేదు. క్రేన్ ప్లాట్‌ఫామ్‌కు ఉన్న నాలుగు మూలలు సమానంగా నీటిలోకి దిగితేనే ఇవి సక్రమంగా పని చేస్తాయి. అయితే సాగర్‌లో ఉన్న వ్యర్థాలు, విగ్రహాలు, ఇనుప సీకులకు తట్టుకుని నాలుగు వైపులా నీటిలో దిగక హుక్స్ వెంటనే రిలీజ్ కాలేదు. దీంతో కొన్ని విగ్రహాల నిమజ్జనానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది. -
#GaneshNimajjanam2024 : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందడి (ఫొటోలు)
-
ఖైరతాబాద్ గణేష్ వద్దకు భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
-
ట్రాఫిక్ వలయంలో సాగర్ పరిసర ప్రాంతాలు.. వాహనదారులకు అలర్ట్
హైదరాబాద్, సాక్షి: గణేష్ నిమజ్జనం తో హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. నిమజ్జనానికి గణపయ్యలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్యాంక్ బండ్‌వైపు రావొద్దని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు నగర పోలీసులు సూచిస్తున్నారు.రేపు ‘మహా’ నిమజ్జనం ఉండడం, నిన్న ఆదివారం కావడంతో నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్‌బంక్‌కు చేరుకున్నాయి. అయితే విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నిన్న రాత్రి నుంచి నియంత్రించేందుకు సిబ్బంది లేకపోవడం, పైగా వాటిల్లో భారీ వాహనాలు ఉండడంతో.. నిమజ్జనానికి గంటల తరబడి టైం పడుతోంది. ఇక.. సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు లేరన్న మీడియా కథనాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాహనాలను త్వరగతిన పంపించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. ఈలోపు వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఖైరతాబాద్, టెలిఫోన్ భవన్, నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్యాంక్ బండ్ వైపుగా వెళ్లకపోవడం మంచిదని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్న వాళ్లకు సైతం నరకం కనిపిస్తోంది.రేపు ఖైరతాబాద్ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. శోభాయాత్ర భద్రత కోసం పాతికవేల మంది సిబ్బందిని మోహరించినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇక.. ఖైరతాబాద్ గణేషుడికి ఇవాళ పూజలు నిర్వహించి.. షెడ్డు తొలగింపు పనులు చేపట్టారు. రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర మొదలుపెడతారు. మధ్యాహ్నాం లోపు నిమజ్జనం చేస్తారు. ఎల్లుండి సాయంత్రంకల్లా నగరంలోని అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. క్లిక్ చేయండి: భారీ గణపయ్య దగ్గర కోలాహలం చూశారా?