బాలాపూర్ గణేష్ నిమజ్జనం..
👉బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా లడ్డూ రికార్డు స్థాయిలో వేలం జరిగింది. రూ.30లక్షల ఒక వేయ్యి పలికిన లడ్డూ. కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు.
👉 మరికాసేపట్లో ప్రారంభం కానున్న బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట
👉బాలాపూర్ బడా గణపతి నిమజ్జన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. నేడు నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ వినాయకుడు ఉద్వాసన పూజలు అందుకున్నాడు. అనంతరం, వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైంది.
👉బాలాపూర్ వీధుల్లో గణపతిని ఊరిగేస్తుండగా వీధులన్నీ భక్తుల జన సందోహంతో నిండిపోయాయి.
👉బాలాపూర్ నిమజ్జనం నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
👉ఇక, ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియలో ఆరుగురు భక్తులు పాల్గొననున్నారు.
👉ఇప్పటికే గత సంవత్సరం వేలంపాటలో పలికిన 27 లక్షల రూపాయలను ఆరుగురు భక్తులు డిపాజిట్ చేశారు.
బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాటకు 30 ఏళ్లు పూర్తి
- వేలంపాట ప్రక్రియలో ఉత్సవ కమిటీ తాజాగా కొత్త నిబంధన
- పోటీదారులు ముందస్తుగా డబ్బులు డిపాజిట్ చేయాలని నిర్ణయం
- గ్రామస్తుల నుంచి వేలంపాటకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిబంధన
- 1994లో తొలిసారి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట
- మొదట రూ.450తో ప్రారంభం
- 2016లో రూ.14.65 లక్షలు,
- 2017లో రూ.15.60లక్షలు,
- 2018లో రూ.16.60 లక్షలు,
- 2019లో 17.60 లక్షలు,
- 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు
- 2021లో రూ.18.90 లక్షలు,
- 2022లో రూ.24.60 లక్షలు
- 2023లో బాలాపుర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు
- 2023లో లడ్డూను దక్కించుకున్న స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి
- ఈ ఏడాది రూ.30 లక్షలు పలుకుతుందని అంచనా
- బాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితీ
Comments
Please login to add a commentAdd a comment