shoba yatra
-
బాలాపూర్ లడ్డూ వేలం.. మరోసారి రికార్డు ధర
బాలాపూర్ గణేష్ నిమజ్జనం.. 👉బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా లడ్డూ రికార్డు స్థాయిలో వేలం జరిగింది. రూ.30లక్షల ఒక వేయ్యి పలికిన లడ్డూ. కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. 👉 మరికాసేపట్లో ప్రారంభం కానున్న బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట👉బాలాపూర్ బడా గణపతి నిమజ్జన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. నేడు నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ వినాయకుడు ఉద్వాసన పూజలు అందుకున్నాడు. అనంతరం, వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైంది. 👉బాలాపూర్ వీధుల్లో గణపతిని ఊరిగేస్తుండగా వీధులన్నీ భక్తుల జన సందోహంతో నిండిపోయాయి. 👉బాలాపూర్ నిమజ్జనం నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.👉ఇక, ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియలో ఆరుగురు భక్తులు పాల్గొననున్నారు.👉ఇప్పటికే గత సంవత్సరం వేలంపాటలో పలికిన 27 లక్షల రూపాయలను ఆరుగురు భక్తులు డిపాజిట్ చేశారు. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాటకు 30 ఏళ్లు పూర్తివేలంపాట ప్రక్రియలో ఉత్సవ కమిటీ తాజాగా కొత్త నిబంధన పోటీదారులు ముందస్తుగా డబ్బులు డిపాజిట్ చేయాలని నిర్ణయంగ్రామస్తుల నుంచి వేలంపాటకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిబంధన1994లో తొలిసారి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాటమొదట రూ.450తో ప్రారంభం 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలు, 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు 2023లో బాలాపుర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు2023లో లడ్డూను దక్కించుకున్న స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి ఈ ఏడాది రూ.30 లక్షలు పలుకుతుందని అంచనాబాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితీ -
శోభా యాత్రలో ఘర్షణ.. బీజేపీ ఎమ్మెల్యేకి గాయాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు చల్లారడం లేదు. శ్రీరామ నవమి వేడుకల కోసం తాజాగా నిర్వహించిన శోభా యాత్రలోనూ హింస చెలరేగింది. ఆదివారం హూగ్లీలో బీజేపీ నిర్వహించిన శోభా యాత్రలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బీజేపీ ఎమ్మెల్యే బీమన్ ఘోష్ గాయపడగా, ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన పోలీసులు.. 24 గంటలపాటు జనాలు గుమిగూడడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రారంభించిన ఈ యాత్రలో.. ఒకవైపు నుంచి ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో అంతా తలోపక్క పారిపోవడం సీసీటీవీలో రికార్డు అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ నవమి ఊరేగింపులో భాగంగా భారీగా డీజే సౌండ్‌తో కొందరు కత్తులు దూస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ఓ మసీదు వద్దకు రాగానే.. చాలాసేపు అక్కడే డీజే నడిపించారు. అయితే అప్పటికే చాలా ఆలస్యంగా శోభా యాత్రను ప్రారంభించి.. సమయం ముగిశాక కూడా కొనసాగించారు. ఆ సమయంలో మసీదును లక్ష్యంగా చేసుకుని యాత్ర ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కొందరు గట్టిగట్టిగా అరవడంతో.. ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఈ క్రమంలో చెరోవైపు నిల్చుని ఇరు వర్గాలు కవ్వింపు చర్యలకు దిగాయి. ఈలోపు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే భద్రతా బలగాలతో స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసే యత్నం చేశాయి. అంతలోనే రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఎమ్మెల్యే బీమన్ గాయపడడంతో.. అనుచరులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ పరిస్థితికి అధికార టీఎంసీ పనేనని బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజూందార్ ఆరోపిస్తున్నారు. హూగ్లీ బీజేపీ శోభా యాత్రపై దాడి జరిగింది. కారణం స్పష్టంగా తెలుస్తోంది. మమతా బెనర్జీకి హిందువులంటే ద్వేషం అంటూ మజూందార్ ట్వీట్ చేశారు. బెంగాల్లో పరిస్థితిపై జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది బెంగాల్ బీజేపీ. ఇక ఈ రాళ్లదాడిలో పలువురు పోలీస్ సిబ్బంది సైతం గాయపడ్డారు. మరోవైపు అక్కడి పరిస్థితిపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. కారకులు ఎవరైనా 24 గంటల్లో అరెస్ట్ అవుతారంటూ మీడియాకు తెలిపారాయన. . @abhishekaitc, who are these stone pelters? Remove your lenses and watch. You will get clearer picture. Public knows everything. pic.twitter.com/yEr8j3zoGA — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) April 2, 2023 Bengal is going out of control. Mamata Banerjee is unable to control the riots. She is protecting a particular community and targeting Hindus. Wrote to Union Minister @AmitShah ji for immediate help in West Bengal. pic.twitter.com/pVnwh6mAaL — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) April 2, 2023 ఇదిలా ఉండగా.. హూగ్లీకి 40 కిలోమీటర్ల దూరంలోని హౌరాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. దీంతో ఆంక్షలు ఎత్తేసి.. అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు పోలీసులు. గురువారం హౌరాలో కాజిపారా ప్రాంతంలో నవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. హింసకు బీజేపీ, హిందూ సంఘాలే కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించగా.. ఎన్ఐఏ ద్వారా దర్యాప్తు చేయిస్తే అసలు కారకులు ఎవరో బయటపడుతుందని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. మరోవైపు బీహార్‌లోనూ శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా చెలరేగిన హింసలో ఒకరు చనిపోగా, వంద మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలందలో 144 సెక్షన్ విధించడంతో పాటు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు స్కూల్స్‌కు బంద్ ప్రకటించారు. ఇదీ చదవండి: అల్లర్లకు పాల్పడ్డవారిని తలకిందులుగా ఉరి తీస్తాం-అమిత్ షా -
మొదలైన ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర
-
వైభవంగా కొనసాగుతున్న శ్రీరాముని శోభాయాత్ర
-
కన్నుల పండువగా శోభాయాత్ర
భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా, గురువారం శ్రీరంగధామం ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భగవద్రామానుజుల విగ్రహాలతో ఉన్న రథాలను గౌతమఘాట్‌లోని శ్రీరంగధామం నుంచి మేళతాళాలతో, కోలాటం ప్రదర్శనలతో మెయి¯ŒS రోడ్డు మీదుగా నగర ప్రధాన రహదారుల్లో వైభవంగా ఊరేగించారు. ముందుగా స్థానాచార్యులు రఘునాథ పరాశర భట్టర్ రథంలోని రామానుజుల విగ్రహాలకు హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ కర్రి రామారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి ఎంపీ ఆర్.విఠల్ తదితరులు పాల్గొన్నారు. – రాజమహేంద్రవరం కల్చరల్ -
హైదారాబాద్ లో శోభాయాత్ర
-
ప్రారంభమైన శోభా యాత్ర
హైదరాబాద్: శ్రీ రామ నవమి శోభా యాత్ర ధూల్ పేట్ గంగా బౌలి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్లొథ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్ర నగరంలోని మంగళ్ హాట్, పురానాపూల్, ఛత్రీ, బేగంబజార్, సిద్ది అంబర్ బజార్, గౌలిగూడల మీదుగా సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామ శాల వరకు కొనసాగనుంది. అంతేకాకుండా ఈ ఏడాది నుంచే సీతారాంబాగ్ ఆలయం నుంచి కూడా భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి నాయకులు మరో యాత్ర ప్రారంభించారు. ఈ రెండు శోభా యాత్రలు మంగళ్ హాట్ అనిత టవర్ దగ్గర కలవనున్నాయి. -
గంగమ్మ ఒడికి ఇలా..
18 గంటల 44 నిమిషాలు.. ఖైరతాబాద్ కైలాస విశ్వరూప మహా గణపతి గంగమ్మ ఒడికి చేరడానికి పట్టిన సమయమిది. సోమవారం రాత్రి 11:59కి భక్తుల జయజయధ్వానాలతో కదిలిన గణనాథుడు మంగళవారం సాయంత్రం 6.44కి నిమజ్జనమయ్యాడు. దీంతో మహా ఘట్టానికి తెరపడింది. మునుపటితో పోలిస్తే నిమజ్జన యాత్ర ఈసారి సుదీర్ఘంగా సాగింది. ఎన్టీఆర్ మార్గ్‌లో మొత్తం 9 క్రేన్ల సాయంతో 6580 విగ్రహాలు నిమజ్జనమైనట్టు పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి షష్టిపూర్తి (ఉత్సవాలకు 60 ఏళ్లు) మహోత్సవం ఓ అద్భుత ఘట్టం. కైలాస విశ్వరూప మహాగణపతి విగ్రహ పనులు ప్రారంభమైన క్షణం నుంచి నిమజ్జనం వరకూ ప్రతి ఘట్టం అపురూపమే. ముఖ్యంగా మహాగణపతి నిమజ్జనోత్సవం దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాగణపతి నిష్ర్కమణ ప్రక్రియ ఏకబిగిన 18.44 గంటలపాటు సాగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం 6.44 గంటల వరకు యాత్ర కొనసాగింది. వేలాదిగా భక్తజనం వెంటరాగా గణేషుడు గంగమ్మ ఒడిలోకి జారుకున్నాడు. - ఖైరతాబాద్ శోభాయాత్ర ఇలా.. సోమవారం రాత్రి 11.59 గంటలకు ముహూర్తం కోసం మహాగణపతి రథాన్ని కదిలించారు. అర్ధరాత్రి 1.35: గంటలకు వాహనం కేవలం వందగజాల దూరం కదిలింది. మంగళవారం ఉదయం 10.15 వరకు మహారథం అక్కడే ఉంది. మధ్యాహ్నం: 12.05: రాజ్‌దూత్ చౌరస్తాకు చేరుకుంది. టెలిఫోన్ భవన్: 12.20 సచివాలయం పాత గేటు: 12.55 మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 50 నిమిషాలు పాటు తెలుగుతల్లి ప్లై ఓవర్ వద్ద ఆగింది. మధ్నాహ్నం 2.05 నిమిషాలకు కీలకమైన మలుపు తెలుగుతల్లి చౌరస్తాను దాటింది. తెలుగు తల్లి చౌరస్తా నుంచి సెంట్రల్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో మహాగణపతి వాహనం ముందుకు సాగింది. 3.30 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం 4 వద్దకు మహాగణపతి చేరుకున్నాడు. 4 గంటలకు పక్కనే ఉన్న మరో క్రేన్ సాయంతో దుర్గామాత విగ్రహాన్ని పైకి లేపారు. 4.10కి మహాగణపతికి కలశ పూజ నిర్వహించారు. 5.20 భారీక్రేన్ వైర్లను వాహనంపై ఉన్న మహాగణపతికి తగిలించి సిద్ధం చేశారు. 6.15 విశ్వరూపుడికి మహాహారతి సమర్పించారు. 6.20 వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. 6.30 కైలాస విశ్వరూప మహాగణపతిని పైకి లేపారు. 6.44 జలప్రవేశం. 2012: రాత్రి 7 గంటలకి బయల్దేరి మరుసటి రోజు మధ్నాహం 2.22 గంటలకు జలప్రవేశం చేశాడు. ఎన్నిగంటలు: సుమారు 7.30 గంటలు 2013: అర్ధరాత్రి 2.30కి బయల్దేరిన గణపయ్య మధ్నాహ్నం 1.53కు గంగఒడికి చేరాడు. ఎన్నిగంటలు: సుమారు 11.30 గంటలు 2014: అర్ధరాత్రి 11:59 కదిలి సాయంత్రం 6.44 గంటలకు గంగఒడికి చేరాడు. ఎన్నిగంటలు: సుమారు 18.45 గంటలు తొలిసారి నిమజ్జన పూజల్లో రాజేంద్రన్... అధ్భుత సృజనతో గణనాథుడి ఆకృతికి రూపమిచ్చిన ప్రధాన శిల్పి రాజేంద్రన్ ఈ ఏడాది నిమజ్జన పూజల్లో పాల్గొనడం విశేషం. విగ్రహం తయారీ మొదలైన నాటి నుంచి ఎప్పుడూ కూడా ఆయన నిమజ్జనయాత్రలో పాల్గొనలేదు. విగ్రహాన్ని రథంపై ఉంచిన మరుక్షణం ఆయన ఇంటికెళ్లిపోతారు. కానీ ఈ ఏడాది మాత్రం తెలుగుతల్లి చౌరస్తా నుంచి నిమజ్జన యాత్రలో పాల్గొన్నారు. గణపయ్యకు మహాహరతి సమర్పించిన వెంటనే ఒంటరిగా ఇంటి బాటపట్టారు. భారీగా భక్తజనం సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు మహాగణపతి శోభా యాత్రను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఖైరతాబాద్ వీధుల్లో బారులు తీరారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఐమాక్స్ చౌరస్తా, మింట్ కాంపౌండ్, సచివాలయం ప్రాంతాలన్నీ జనసంద్రమయ్యాయి.