కన్నుల పండువగా శోభాయాత్ర | shoba yatra | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా శోభాయాత్ర

Published Fri, Apr 28 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

shoba yatra

భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా, గురువారం శ్రీరంగధామం ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భగవద్రామానుజుల విగ్రహాలతో ఉన్న రథాలను గౌతమఘాట్‌లోని శ్రీరంగధామం నుంచి మేళతాళాలతో, కోలాటం ప్రదర్శనలతో మెయి¯ŒS రోడ్డు మీదుగా నగర ప్రధాన రహదారుల్లో వైభవంగా ఊరేగించారు. ముందుగా స్థానాచార్యులు రఘునాథ పరాశర భట్టర్‌ రథంలోని రామానుజుల విగ్రహాలకు హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్‌ కర్రి రామారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి ఎంపీ ఆర్‌.విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.          
 – రాజమహేంద్రవరం కల్చరల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement