సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ గణపతి లడ్డూ వేలంలో మరోసారి రికార్డు స్ధాయి ధర పలికింది. చరిత్రను తిరగరాస్తూ ఈసారి రూ.30లక్షల ఒక వేయికి లడ్డూను దక్కించుకున్నారు బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి. ఈ సందర్భంగా లడ్డూను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. త్వరలో ఢిల్లీకి వెళ్లి పూర్తి లడ్డూను ఆయనకే అందిస్తానని చెప్పారు.
వేలం పాట రూ.1116తో ప్రారంభమై.. క్రమంగా పెరుగుతూ.. రూ.30 లక్షల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత ఎవరూ వేలం పాట పాడేందుకు ముందుకు రాకపోవడంతో కొలను శంకర్ రెడ్డికే బాలాపూర్ లడ్డూ దక్కింది. గతేడాది కూడా లడ్డూ రూ.27లక్షల పలికిన విషయం తెలిసిందే. దీంతో, గతేదాడి కంటే మూడు లక్షల ఒక్క వేయి ఎక్కవ పలికింది.
కాగా, బాలాపూర్ లడ్డూ వేలం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకమైంది. లడ్డూను దక్కించుకునేందుకు ఎంతో మంది ముందుకు వస్తుంటారు. ఇక, ఈ ఏదాడికి బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి అయ్యింది. 1994లో తొలిసారి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. తొలిసారి వేలంలో లడ్డూ రూ.450 పలికింది. ఇక, 30 ఏళ్ల నాటికి లడ్డూ ఏకంగా రూ.30లక్షలకు చేరుకుంది. ఇదే ఓ రికార్డుగా స్థానికులు చెప్పుకుంటున్నారు.
30ఏళ్లుగా వేలం ఇలా..
- 1994లో తొలిసారి రూ.450తో ప్రారంభం
- 2016లో రూ.14.65 లక్షలు,
- 2017లో రూ.15.60లక్షలు,
- 2018లో రూ.16.60 లక్షలు,
- 2019లో 17.60 లక్షలు,
- 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు
- 2021లో రూ.18.90 లక్షలు,
- 2022లో రూ.24.60 లక్షలు
- 2023లో రూ.27 లక్షలు
- 2024లో రూ.30,01,000(30లక్షల ఒక వేయి).
ఇది కూడా చదవండి: వేలంలో రికార్డులు పటాపంచల్.. గణేశుడి లడ్డూ@ రూ.1.87 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment