balapur laddu
-
మోదీకి బాలాపూర్ లడ్డు..
-
బాలాపూర్ లడ్డూ మోదీకి అంకితం: కొలను శంకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ గణపతి లడ్డూ వేలంలో మరోసారి రికార్డు స్ధాయి ధర పలికింది. చరిత్రను తిరగరాస్తూ ఈసారి రూ.30లక్షల ఒక వేయికి లడ్డూను దక్కించుకున్నారు బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి. ఈ సందర్భంగా లడ్డూను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. త్వరలో ఢిల్లీకి వెళ్లి పూర్తి లడ్డూను ఆయనకే అందిస్తానని చెప్పారు. వేలం పాట రూ.1116తో ప్రారంభమై.. క్రమంగా పెరుగుతూ.. రూ.30 లక్షల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత ఎవరూ వేలం పాట పాడేందుకు ముందుకు రాకపోవడంతో కొలను శంకర్ రెడ్డికే బాలాపూర్ లడ్డూ దక్కింది. గతేడాది కూడా లడ్డూ రూ.27లక్షల పలికిన విషయం తెలిసిందే. దీంతో, గతేదాడి కంటే మూడు లక్షల ఒక్క వేయి ఎక్కవ పలికింది. కాగా, బాలాపూర్ లడ్డూ వేలం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకమైంది. లడ్డూను దక్కించుకునేందుకు ఎంతో మంది ముందుకు వస్తుంటారు. ఇక, ఈ ఏదాడికి బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి అయ్యింది. 1994లో తొలిసారి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. తొలిసారి వేలంలో లడ్డూ రూ.450 పలికింది. ఇక, 30 ఏళ్ల నాటికి లడ్డూ ఏకంగా రూ.30లక్షలకు చేరుకుంది. ఇదే ఓ రికార్డుగా స్థానికులు చెప్పుకుంటున్నారు.30ఏళ్లుగా వేలం ఇలా..1994లో తొలిసారి రూ.450తో ప్రారంభం 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలు, 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు 2023లో రూ.27 లక్షలు 2024లో రూ.30,01,000(30లక్షల ఒక వేయి). ఇది కూడా చదవండి: వేలంలో రికార్డులు పటాపంచల్.. గణేశుడి లడ్డూ@ రూ.1.87 కోట్లు -
‘బాలాపూర్’.. బలాదూర్!
అల్వాల్: నగరశివారులో ఉన్న బాలాపూర్ గణపతి మండపంలోని లడ్డూ వేలంపాటలో ఈసారి రూ.24.60 లక్షలు పలుకగా, అల్వాల్ కానాజీగూడ లడ్డూ దానిని బ్రేక్ చేసింది. కానాజీగూడకు చెందిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ మండపంలో లడ్డూను నగరానికి చెందిన డాక్టర్ తాళ్లూరు వెంకట్రావు, గీతప్రియ దంపతులు రూ.45,99,999కి దక్కించుకున్నారు. వెంకట్రావు విదేశాలలో లార్డ్ ఇన్స్టిట్యూషన్స్, లోక్ప్రదీప్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఈ దంపతులు ఆ ఆలయానికి గత కొంతకాలంగా భక్తులుగా ఉన్నారు. గతేడాది కూడా వీరే రూ.17,81,999కు ఇక్కడి లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి కూడా పలువురు వేలంపాటలో పాల్గొనగా, చివరికి వెంకట్రావు దంపతులే రికార్డు స్థాయిలో పాటపాడి లడ్డూను సొంతం చేసుకున్నారు. మరకత గణపతిపై అచంచల విశ్వాసం ఉందని, ఈ లడ్డూను దక్కించుకోవడం వల్ల తమకు మరింత మేలు జరుగుతుందన్న విశ్వాసం ఉందని వారు అన్నారు. వేలం ద్వారా వచ్చిన లడ్డూ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, నిత్యాన్నదానానికి ఉపయోగిస్తామని ఆలయ నిర్వాహకులు మోత్కూరు సత్యనారాయణశాస్త్రి తెలిపారు. -
రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ వేలం
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ గణేష్ లడ్డూ శుక్రవారం జరిగిన వేలం పాటలో రికార్డు బ్రేక్ చేసింది. వేలంలో రూ. 24.60 లక్షలు పలికింది. లడ్డూను బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ. 18.90 లక్షలు పలకగా.. అప్పటి కంటే ఈసారి లడ్డూ ధర 5.70 లక్షలు అధికంగా పలికింది. కాగా ఈ సంవత్సరం బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాటల 13 మంది పాత సభ్యులు, 8 మంది కొత్తవారు పాల్గొన్నారు. రాజకీయ ప్రముఖులు లడ్డూ వేలంలో పాటకు హాజరయ్యారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం హాజరయ్యారు. వేలం పాట అనంతరం బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. మదీనా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్ మీదుగా శోభాయాత్ర సాగనుంది. -
బాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
-
ఆల్ టైం రికార్డ్,వేలంలో రూ.41లక్షలు పలికిన లడ్డూ..ఎక్కడంటే?
ప్రపంచ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల్లో ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా జరిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర రూ.18.90 లక్షలు పలకగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరో లడ్డు ధర రికార్డ్ స్థాయిలో రూ.41లక్షలు పలికింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ సన్ సిటీకి చెందిన కీర్తి రిచ్మాండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో 179విల్లాస్‌లో 82 మంది నివసిస్తున్నారు. అయితే స్థానికులు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా వినాయక చవితి ఉత్సవాల్ని నిర్వహించారు. పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని జరిపిన లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర ఆల్ టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. లడ్డూ వేలం పాటలో 5 కేజీల లడ్డూ రూ.41లక్షలు పలికినట్లు నిర్వాహకలు తెలిపారు. ఇక్కడ 2019లో జరిగిన వినాయక చవితి లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర 27లక్షలు పలికింది. కానీ ఈ సారి ఏకంగా రూ.41 లక్షలు పలకడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఏదాడి బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ ఈసారి వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. చివరిసారి 2019లో కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకోగా ఈ ఏడాది అంతకంటే ఎక్కవ ధర పలికింది. చదవండి: అమ్మ ఆరోగ్యం కోసం వినాయకుడి చేతిలోని లడ్డూ చోరీ -
సీఎం జగన్‌కు బాలాపూర్ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్
-
సీఎం జగన్‌కు బాలాపూర్ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్
సాక్షి, అమరావతి: హైదరాబాద్ బాలాపూర్ లడ్డూను వేలం పాటలో సొంతం చేసుకున్న వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ ఆ లడ్డూను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్‌లో నిర్వహించిన వేలంపాటలో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, నాదర్గుల్ నివాసి అబాకస్ విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అత్యధికంగా రూ.18.90 లక్షలకు వారిద్దరూ లడ్డూను దక్కించుకున్న విషయం తెలిసిందే. చదవండి: కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. రేవంత్‌కు కోర్టు ఆదేశం చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం -
బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్నిరేపు సీఎం జగన్ కు అందిస్తాం.
-
రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా విశిష్టమైన చరిత్ర కలిగి ఉన్న బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ ఈసారి వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. చివరిసారి 2019లో కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకోగా ఈ ఏడాది అంతకంటే ఎక్కవ ధర పలికింది. గత 26 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా బాలాపూర్ గణేష్ లడ్డూవేలం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డూకు పూజలు నిర్వహించిన అనంతరం వేలం పాట ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి, ఇతర రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఈసారి నిర్వహించిన వేలం పాటలో 35 మంది పాల్గొన్నారు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర బాలాపూర్ గణేషుడి లడ్డూ ప్రతి ఏడాది 21కిలోల బరువుతో తయారు చేస్తారు. బాలాపూర్ లడ్డూ సంప్రదాయం 1980లో ప్రారంభమవ్వగా.. వేలం మాత్రం 1994లో మొదలైంది. విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఈ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులతోపాలు ప్రముఖులు సైతం పోటీపడతారు. ప్రతియేటా ఎంతో ఉత్సాహంగా జరిగే ఈ లడ్డూ వేలం పాట గతేడాది కరోనా ప్రభావంతో రద్దు చేశారు. ఉత్సవసమితి సభ్యులు సీఎం కేసీఆర్‌కు ఆ లడ్డూను అందజేశారు. 2019లో బాలాపూర్ లడ్డూ రికార్డుస్థాయిలో 17లక్షల 60 వేల రూపాయలు పలికింది. నిమజ్జన వేడుకలు 41 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్ గణపతి నిమజ్జన వేడుకలు ఆదివారం తెల్లవారు జామునే ప్రారంభమయ్యాయి. ఉదయం అయిదున్నర గంటలకే ఉత్సవసమితి ఆధ్వర్యంలో చివరిపూజలందుకున్న గణేషుడు ఊరేగింపుకు బయల్దేరారు. బాలాపూర్పుర వీధులగుండా అత్యంత భక్తి శ్రద్ధలతో భజన చేస్తూ.. సన్నాయి మేళాల నడుమ ఊరేగింపు సాగుతోంది. ట్యాంక్‌బండ్ వరకు 17 కిలోమీటర్ల మేరకు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలు ► 1994లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 450 ► 1995లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 4,500 ►1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000 ►1997లో కొలను కృష్ణారెడ్డి... రూ. 28,000 ►1998లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 51,000 ►1999లో కల్లెం ప్రతాప్‌రెడ్డి.. రూ. 65,000 ►2000లో కల్లెం అంజిరెడ్డి.. రూ.66,000 ►2001లో రఘునందన్‌చారి.. రూ. 85,000 ►2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000 ►2003లో చిగిరింత బాల్‌రెడ్డి.. రూ.1,55,000 ►2004లో కొలను మోహన్‌రెడ్డి...రూ. 2,01,000 ►2005లో ఇబ్రహీం శేఖర్... రూ.2,80,000 ►2006లో చిగిరింత శేఖర్‌రెడ్డి..రూ.3,00,000 ►2007లో రఘునందర్‌చారి.. రూ.4,15,000 ►2008లో కొలను మోహన్‌రెడ్డి... రూ.5,07,000 ►2009లో సరిత రూ.5,15,000 ►2010లో కొడాలి శ్రీధర్‌బాబు..రూ.5,25,000 ►2011లో కొలను బ్రదర్స్... రూ. 5,45,000 ►2012లో పన్నాల గోవర్థన్‌రెడ్డి... రూ.7,50,000 ►2013లో తీగల కృష్ణారెడ్డి... రూ.9,26,000 ►2014లో సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి...రూ.9,50,000 ►2015లో కొలను మదన్ మోహన్‌రెడ్డి... రూ.10,32,000 ►2016లో స్కైలాబ్‌రెడ్డి... రూ.14,65,000 ►2017లో నాగం తిరుపతిరెడ్డి... రూ.15,60,000 ►2018లో శ్రీనివాస్‌గుప్తా.. రూ.16,60,000 ►2019లో కొలను రామిరెడ్డి... రూ.17,60,000 ►2020 ---- ---- ►2021లో మర్రి శశాంక్‌రెడ్డి... రూ. 18,90,000 -
15 ఏళ్లుగా బాలాపూర్ లడ్డు తయారు చేస్తున్న ఉమామహేశ్వరరావు
-
రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు
-
రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డు
-
రూ.వందలతో మొదలై లక్షలకు...
బడంగ్పేట్: వినాయక చవితి వచ్చిందంటే ఇటు ఖైరతాబాద్ మహాగణపతి, అటు బాలాపూర్ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. బాలాపూర్ గణనాథుడికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గణనాథుడి వెంటే నగరంలోని పెద్ద గణపతులు నిమజ్జనానికి బయలుదేరుతాయి. ఈ విఘ్నేశుడికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈయన లడ్డూకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. లడ్డూ దక్కించుకునేందుకు పోటీ పెద్ద ఎత్తున ఉంటుంది. రూ.వందలతో మొదలైన ఈ లడ్డూ ప్రస్థానం ఇప్పుడు రూ.లక్షలకు చేరింది. బాలాపూర్ గణేశుడి లడ్డూ భక్తులకు కొంగుబంగారమైంది. లక్కీ లడ్డూగా కీర్తినందుకొంది. తాము దక్కించుకున్న లడ్డూను పంటపొలాల్లో చల్లి అధిక దిగుబడులు సాధించామని, వ్యాపారంలోనూ లాభాలు ఆర్జించామని భక్తులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూపై భక్తులకు నమ్మకం, విశ్వాసం పెరిగిపోయాయి. దీనిని కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూగా బాలాపూర్ వాసులు పేర్కొంటారు. 1980లో ప్రస్థానం ప్రారంభం... బాలాపూర్ గణనాథుడి ప్రస్థానం 1980లో ప్రారంభమైంది. అయితే 1994 నుంచి లడ్డూ వేలంపాట మొదలైంది. 1994లో రూ.450 పలికిన తొలి లడ్డూ... 2017లో రూ.15.60 లక్షలకు చేరుకుంది. మరి ఈసారి ఎంత ధర పలుకుతుందోనని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో బాలాపూర్ వాసులు మద్యం, మాంసాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. గణేశుడి లడ్డూను కూడా ప్రతిరోజు ప్రత్యేకంగా పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో లడ్డూ వేలంపాట వేసే సంప్రదాయం బాలాపూర్ గణనాథుడి నుంచే ప్రారంభమైంది. ఇక ఈ గణనాథుడి నిమజ్జన శోభాయాత్రకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. లడ్డూ ఫ్రమ్ తాపేశ్వరం... బాలాపూర్ లడ్డూను తొలుత చార్మినార్‌లోని గుల్‌జల్ ఆగ్రా స్వీట్ హౌస్ వారు తయారు చేసేవారు. బరువు 21 కిలోలు ఉండేది. అయితే గత నాలుగేళ్లుగా అంతే బరువుతో తాపేశ్వరంలోని హనీ ఫుడ్స్ లడ్డూను తయారు చేస్తోంది. వేలంపాట విజేతకు లడ్డూను ఉంచే రెండు కిలోల వెండి గిన్నెను ఇస్తున్నట్లు హనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వర్ తెలిపారు. దేవాలయాల అభివృద్ధి... వేలంపాట డబ్బులతో గ్రామంలో నూతనంగా శ్రీఆంజనేయస్వామి సహిత వేంకటేశ్వరస్వామి, లక్ష్మీ గణపతి దేవాలయాన్ని సుందరంగా నిర్మించారు. అదే విధంగా గ్రామంలోని పురాతన వేణుగోపాలస్వామి, శివాలయం తదితర దేవాలయాల ఆధునికీకరణకు వేలంపాట నిధులు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నారు. -
బాలాపూర్ గణపయ్య లడ్డూ మనదే
తూర్పుగోదావరి, తాపేశ్వరం (మండపేట): రికార్డు స్థాయిలో వేలం జరిగే హైదరాబాద్‌లోని బాలాపూర్ గణపయ్య లడ్డూ తాపేశ్వరం నుంచే వెళుతోంది. ఎనిమిదేళ్లుగా తాపేశ్వరంలో హనీ ఫుడ్స్ అధినేత దేవు ఉమామహేశ్వరరావు స్వామివారికి కానుకగా అందజేస్తున్నారు. తేనెలొలికే మడత కాజాలకు పేరొందిన తాపేశ్వరం గ్రా మం గణేష్ లడ్డూల తయారీలోను గిన్నీస్ రికార్డుల ద్వారా విశ్వవిఖ్యాతమైన విషయం విదితమే. వినా యక చవితి సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించేందుకు ఉభయ రాష్ట్రాలకు చెందిన ఉత్సవ కమిటీలు తాపేశ్వరం నుంచి లడ్డూలు తీసుకువెళుతుంటారు. హైదరాబాద్‌లోని బాలాపూర్ గణపయ్య లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధరను దక్కించుకుంటూ ఖ్యాతి గాంచింది. బాలాపూర్ గణపయ్యకు తాపేశ్వరంలోని హనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వరరావు లడ్డూను కానుకగా అందజేస్తున్నారు. రెండు కిలోల వెండి గిన్నెలో 20 నుంచి 25 కిలోల లడ్డూను తయారు చేసి తమ సంస్థ తరుఫున స్వామివారికి అందజేస్తున్నామని,ఎనిమిదేళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. 22 కిలోల బరువు గల ఈ లడ్డూను దక్కించుకునేందుకు సంపన్న వర్గాల వారు వేలంలో పోటీ పడుతుంటారు. గతేడాది దాదాపు రూ. 14.7 లక్షలకు వేలంలో భక్తుడు దక్కించుకున్నారన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూను గురువారం స్వామివారికి సమర్పించనున్నట్టు ఉమామహేశ్వరరావు తెలిపారు. -
బాలాపూర్ లడ్డూ ప్రసాదం ప్రత్యేకత
-
రూ. 450తో మొదలైన బాలాపూర్ లడ్డూ
-
రూ. 450తో మొదలైన బాలాపూర్ లడ్డూ
రికార్డు స్థాయిలో ధర పలికి.. చరిత్ర సృష్టించిన బాలాపూర్ లడ్డూ ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా.. మొట్టమొదటి సారి 1994 సంవత్సరంలో కొలను మోహన్ రెడ్డి రూ. 450కి ఆ లడ్డూను వేలంలో పాడుకున్నారు. బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లోనే ప్రారంభమైనా లడ్డూ వేలం మాత్రం తొలిసారి 1994లోనే నిర్వహించారు. తొలి వేలం తర్వాత అది బాగా ప్రాచుర్యం పొందింది. దాంతో ఆ తర్వాతి సంవత్సరం ఏకంగా పది రెట్లు పెరిగి.. రూ. 4,500 వరకు వేలం వెళ్లింది. అప్పటి నుంచి బాలాపూర్ లడ్డూ వేలం ఎంతవరకు వెళ్లిందనే విషయం బాగా ఆసక్తికరంగా మారింది. వేలంలో పాడుకున్న వాళ్ల ఆ లడ్డూను తమ పొలంలో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకం ఉండటం వల్ల కూడా ఈ లడ్డూ వేలాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. మొదట్లో కేవలం స్థానికులకు మాత్రమే ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులు.. ఆ తర్వాతి నుంచి ఎక్కడివారైనా వేలంలో పాల్గొనచ్చని తెలిపారు. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు. ఏయే సంవత్సరంలో లడ్డూ వేలం ఎవరికి, ఎంతకు వెళ్లిందనే వివరాలు ఇలా ఉన్నాయి.... 1994లో కొలను మోహన్ రెడ్డి - రూ. 450 1995లో కలను మోహన్ రెడ్డి -రూ. 4,500 1996లో కొలను క్రిష్ణా రెడ్డి-రూ . 18,000 1997లో కొలను క్రిష్ణా రెడ్డి -రూ. 28,000 1998లో కొలను మోహన్ రెడ్డి -రూ. 51,000 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి -రూ. 65,000 2000లో కల్లెం అంజిరెడ్డి -రూ. 66,000 2001 జి. రఘునందన్ చారి -రూ. 85,000 2002లో కందాడ మాధవ రెడ్డి -రూ. 1,05,000 2003లో చిగిరింత బాల్ రెడ్డి -రూ. 1,55,000 2004లో కొలను మోహన్ రెడ్డి -రూ.2,01,000 2005లో ఇబ్రాం శేఖర్ -రూ.2,08,000 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి -రూ.3,00,000 2007లో జి. రఘునందన్ చారి -రూ.4.15,000 2008లో కొలను మోహన్ రెడ్డి -రూ.5,07,000 2009లో సరిత -రూ.5,10,000 2010లో కొడాలి శ్రీధర్ బాబు -రూ.5,35,000 2011లో కొలను బ్రదర్స్ -రూ.5,45,000 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి -రూ. 7,50,000 2013లో తీగల క్రిష్ణారెడ్డి -రూ. 9,26,000 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ. 9,50,000 2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి -రూ. 10,32,000 2016లో స్కైలాబ్ రెడ్డి -రూ. 14.65,000 -
రూ.14.65 లక్షలు పలికిన బాలాపూర్ లడ్దు
-
ఈసారి స్కైలాబ్ రెడ్డికి దక్కింది..
-
రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డు
హైదరాబాద్ : బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు సొంతం చేసుకుంది. లంబోధరుడి లడ్డూ ఈ ఏడాది ఏకంగా 14 లక్షల 65వేలు పలికింది. ఆది నుంచి హోరా హోరీగా సాగిన వేలం పాటలో స్కైలాబ్ రెడ్డి పెద్దమొత్తంలో వేలంపాట పాడి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. పదిలక్షలకు ప్రారంభమైన వేలం పాట ...చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 25మంది భక్తులు పోటీ పడ్డారు. గత ఏడాది వేలంలో పాల్గొన్న 16మందితో పాటు కొత్తగా మరో 9మంది లడ్డూను సొంతం చేసుకునేందుకు వేలంలో పాల్గొన్నారు. చివరకు గణేష్ లడ్డూ స్కైలాబ్ రెడ్డిని వరించింది. గత ఏడదాది రూ.10.32 లక్షల పలికిన ఈ లడ్డూ ఈసారి 4 లక్షల 33వేలు అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిసందే. బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. మరి ఈ లడ్డూకు అంత క్రేజెందుకంటారా...! ‘కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూ’గా పేర్కొంటుంటారు బాలాపూర్ వాసులు. లడ్డూ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేశారు. 1980లో మొదలై... గణేశునిపై బాలాపూర్‌వాసులకున్న భక్తి, సేవాతత్పరతను చాటిచెబుతూ 36 ఏళ్ల సుదీర్ఘ యానంతో చరిత్రను సృష్టించింది. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు. -
లడ్డూ వేలం పై అందరి చూపు
-
కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 10.32 లక్షలు లడ్డూ సొంతం
-
రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
-
బాలాపూర్ లడ్డూకి చాలా మహిమ ఉంది
-
విలువ తగ్గని బాలపూర్ లడ్డూ
-
మా ఊరి లడ్డూకు ‘మారాజు’ లెవరో...
-
మా ఊరి లడ్డూకు ‘మారాజు’ లెవరో...
హైదరాబాద్: బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. మరి ఈ లడ్డూకు అంత క్రేజెందుకంటారా...! ‘కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూ’గా పేర్కొంటుంటారు బాలాపూర్ వాసులు. చేతులు మారిన భారీ లడ్డూ తయారీ... ఏటా బాలాపూర్ లడ్డూను పాతబస్తీ చార్మినార్ గుల్‌జల్ ఆగ్రా స్వీట్ హౌస్ నిర్వాహకులు 21 కిలోల బరువుతో కట్టిస్తారు. దశాబ్దాలుగా ఈ లడ్డూను తయారు చేయడంలో గుల్‌జల్ యాజమాన్యం ప్రత్యేక ఆసక్తిని చూపుతారు. అయితే ఈమారు ఈ అదృష్టాన్ని ఆంధ్రా ప్రాంత తాపేశ్వరం మిఠాయి తయారీదార్లు దక్కించుకున్నారు. నాణ్యత, సైజు విషయాల్లో ఎలాంటి తేడాలు లేనప్పటికీ ఖైరతాబాద్ వినాయకుని లడ్డూను తయారు చేసే తాపేశ్వరం వారే బాలాపూర్ లడ్డూను కూడా కట్టేందుకు అర్హతను దక్కించుకున్నారు. 1980లో మొదలై... గణేశునిపై బాలాపూర్‌వాసులకున్న భక్తి, సేవాతత్పరతను చాటిచెబుతూ 33 ఏళ్ల సుదీర్ఘ యానంతో చరిత్రను సృష్టించింది. నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు. గతేడాది ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అండ్ సన్స్ రూ 9.26 లక్షలకు వేలంపాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. కుషాయిగూడ లడ్డూ రూ. 2.60 లక్షలు కుషాయిగూడ: కుషాయిగూడ కూరగాయల మార్కెట్ ఎదురుగా గాంధీ మోమెరియల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుని లడ్డూను కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డి రూ 2.60 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది రూ: 1.70 లక్షలు పలికిన ఈ లడ్డు ఈ ఏడాది తొంబై వేలు అధికంగా ధర పలికింది. బడంగ్పేట్ లడ్డూకు భలే క్రేజ్ దిల్సుఖ్నగర్: బడంగ్‌పేట గణపతి లడ్డూను దక్కించుకున్న వారికి అంతా శుభాలే జరుగుతుండటంతో ప్రతి ఏటా బడంగ్‌పేట లడ్డూకు క్రేజ్ పెరిగింది. 2014లో రూ, 4.05 లక్షలకు టీఆర్ఎస్ నాయకుడు కర్రె కృష్ణ దక్కించుకున్నాడు. రూ.1.50 లక్షలకు దక్కించుకున్న అవినాష్‌రెడ్డి నిజాంపేట: నిజాంపేట బస్టాప్ వద్ద అచెట్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడి లడ్డూ ఈసారి రూ.1,50,001 పలికింది. నిజాంపేటకు చెందిన గడ్డం అవినాష్‌రెడ్డి రూ. 1,50,001లకు వేలంలో సొంతం చేసుకున్నాడు. లడ్డూను దక్కించుకున్న వారి వివరాలు... 1994 కొలను మోహన్‌రెడ్డి రూ.450. 1995 కొలను మోహన్‌రెడ్డి రూ.4500 2010 శ్రీధర్‌బాబు రూ.5.30 లక్షలు 2011 కొలను ఫ్యామిలీ రూ.5.45 లక్షలు 2012 పన్నాల గోవర్థన్‌రెడ్డి రూ. 7.50లక్షలు 2013 టీకేఆర్ విద్యాసంస్థలు(తీగల కృష్ణారెడ్డి) మీర్‌పేట రూ. 9.26లక్షలు 2014 జైహింద్‌రెడ్డి బాలాపూర్ గ్రామం రూ,9.50 లక్షలు ఇక మహాగణపతి చేతిలో 6వేల కిలోల లడ్డూ ఖైరతాబాద్: ఐదు సంవత్సరాలుగా సురుచిఫుడ్స్ అధినేత మల్లిబాబు ఆధ్వర్యంలో ఖైరతాబాద్ మహాగణపతికి భారీ లడ్డూ సమర్పిస్తూ వస్తున్నారు. 2010లో 500కిలోల లడ్డూతో ప్రారంభమై 2011లో 2400కిలోలు, 2012లో 3500కిలోలు, 2013లో 4200కిలోలు, 2014లో5200కిలోలు సమర్పించారు. ఈ సారి 6000కిలోల మహాలడ్డూను సమర్పించారు. ఈ లడ్డూ 6నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈ లడ్డూను దాదాపు లక్షా 50వేల మందికి ప్రసాదంగా అందజేయవచ్చని తాపేశ్వరం సురుచిఫుడ్స అధినేత మల్లిబాబు తెలిపారు. -
9.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
-
రూ. 9.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
హైదరాబాద్ : ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది రూ.9.50 లక్షలు పలికింది. ఆది నుంచి పోటా పోటీగా సాగిన వేలం పాటలో బాలాపూర్ లంబోదరుడి లడ్డూను సింగిరెడ్డి జయేందర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. రూ.116 నుంచి ప్రారంభమైన వేలం పాట ...చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 24మంది భక్తులు పోటీ పడ్డారు. చివరకు గణేష్ లడ్డూ సింగిరెడ్డి జయేందర్ రెడ్డిని వరించింది. గత ఏడాది రూ.9.26 లక్షల పలికిన ఈ లడ్డూ ఈసారి మరో 24వేల అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోంది. కాగా బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ యానంలో ఏయేటికాయేడు చరిత్రను సృష్టిస్తోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో పలికిన లడ్డూ ఆ తరువాత లక్షలకు చేరటం విశేషం. -
అందరి దృష్టి బాలాపూర్ వైపే
*బాలాపూర్ లడ్డూ కోసం ఏటా పెరుగుతోన్న ఆదరణ * నేటి వేలంపై ఆసక్తి బడంగ్‌పేట లడ్డూ కూడా.. హైదరాబాద్ : సామూహిక గణేశ్ నిమజ్జనం వేళ అందరి దృష్టి బాలాపూర్ వైపు మళ్లింది. ఇక్కడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు తీవ్రంగా పోటీపడుతుంటారు. లడ్డూను దక్కించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. లక్షలు వెచ్చించి లడ్డూను సొంతం చేసుకునేందుకు ఆసక్తిచూపుతారు. సోమవారం నిమజ్జన ఊరేగింపు ప్రారంభానికి ముందు ఇక్కడ లడ్డూను వేలం వేస్తారు. ఈసారి అది ఎవరి సొంతం అవుతుందోనని నగరవాసులంతా ఎదురుచూస్తున్నారు. లడ్డూ ప్రస్థానం ఇలా.. ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ యానంలో ఏయేటికాయేడు చరిత్రను సృష్టిస్తోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో పలికిన లడ్డూ ఆ తరువాత లక్షలకు చేరింది. బాలాపూర్‌లో పదేళ్ల కాలంలో లడ్డూను సొంతం చేసుకున్న వారు.. సం. దక్కించుకున్న వారు మొత్తం రూ. లక్షల్లో 2004 కొలను మోహన్‌రెడ్డి రూ.2.01 2005 ఇబ్రాం శేఖర్ రూ.2.08 2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ.3.00 2007 జి.రఘునందనాచారి రూ.4.15 2008 కొలను మోహన్‌రెడ్డి రూ.5.07 2009 సరిత రూ.5.10 2010 శ్రీధర్‌బాబు రూ.5.30 2011 కొలను ఫ్యామిలీ రూ.5.45 2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ.7.50 2013 టీకేఆర్ విద్యాసంస్థలు మీర్‌పేట రూ.9.26 బడంగ్‌పేట లడ్డూకూ ఆదరణ.. బాలాపూర్ తరువాత బడంగ్‌పేట గణనాథుడి లడ్డూకు అంతటి డిమాండ్ ఉంది. ఇక్కడి లడ్డూను వేలంలో లక్షల రూపాయలకు సొంతం చేసుకుంటున్నారు భక్తులు. ఇక్కడ 1966 నుంచి మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకున్ని ప్రతిష్ఠిస్తున్నారు. 1995 నుంచి లడ్డూను వేలం వేస్తున్నారు. మొదటిసారి వేలం పాటలో అప్పటి గ్రామ సర్పంచ్ ఆశంగారి నిర్మలానర్సింహారెడ్డి రూ.7,200లకు అడ్డూను సొంతం చేసుకున్నారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆ యేడు వేలం పాట నిర్వహించలేదు. రూ.7,200తో మొదలైన లడ్డూ వేలం ఏటా పెరుగుతూ లక్షల్లోకి చేరింది. ఈసారి ఆ లడ్డూ ఎవరి సొంతం అవుతుందనే ఆసక్తి నెలకొంది. మీరాలం మండిలో 108 ఏళ్లుగా.. నిజాం కాలంలో కూరగాయల విక్రయానికి ప్రధాన కేంద్రంగా కొనసాగిన మీరాలం మండిలో 108 ఏళ్ల నుంచి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజుల్లో ఇక్కడ గాజుల వెంకయ్య, బోగం మల్లయ్య, ఆవులు దుర్గయ్య, కాట నర్సయ్య తదితరులు వినాయక ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మొదట్లో మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి తొమ్మిది రోజులపాటు పూజించి గులాబ్‌చంద్ బాడలోని బావిలో నిమజ్జనం చేసేవారు. 1986 నుంచి గాజుల అంజయ్య ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. -
లడ్డూ కావాలా నాయనా...?
బాలాపూర్ లంబోదరుడి లడ్డూ ఈ ఏడాది కూడా దుమ్ము దులిపింది. ఏకంగా తొమ్మిదిన్నర లక్షల రూపాయల వరకూ ధర పలికిన గణేశ్ లడ్డూ.. గత రికార్డులను బద్దలు చేసింది. బాలాపూర్ అంటే చాలు వినాయకుడు, లడ్డు ప్రసాదం గుర్తుకు వస్తాయి. బాలాపూర్ లడ్డూ వేలం రాష్ట్రవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈసారి రూ.9.26 లక్షల రూపాయల ధర పలికిన గణేశ్ లడ్డూ.. గత రికార్డులు తిరగరాసింది. గత ఏడాది రూ.7.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది మరో 1.76 లక్షలకు దాటడం విశేషం. బుధవారం ఉదయం హోరాహోరీగా సాగిన వేలంపాటలో టీకేఆర్ విద్యాసంస్థలు రూ.9 లక్షల 26వేలకు గణనాధుని లడ్డూని సొంతం చేసుకుంది. ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లడ్డూ లక్షల రూపాయలకు చేరుకుంది. లడ్డూను సొంతం చేసుకోవడానికి ఈ ఏడాది కొలను బాల్‌రెడ్డి 21వేల రూపాయలతో వేలం ప్రారంభించారు. 1994లో తొలిసారి నిర్వహించిన వేలంలో బాలాపూర్ లడ్డూ 450 రూపాయలు పలికింది. అప్పటి నుంచి ఏటా లడ్డూ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా బాలాపూర్ లడ్డూ వేలంపాటలో దూసుకుపోయింది. లంబోదరుడి లడ్డూ వేలం ఈసారి మొత్తం రికార్డులు బ్రేక్ అయ్యాయి. లంబోదరుడి లడ్డూ ప్రసాదం సొంతం చేసుకోవడం సంతోషకరంగా ఉందని టీకేఆర్ విద్యాసంస్థల అధినేత, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా 1994లో లడ్డూ వేలం వేయగా స్థానికుడైన రైతు కొలను మోహన్ రెడ్డి రూ.450లకు కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి కొలను కుటుంబ సభ్యులు ఆరుసార్లు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ ప్రాముఖ్యత పెరుగటంతో బాలాపుర్ గణేషుడి లడ్డూకు పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో లడ్డూ ధర ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతూ పోయింది. ఈ లడ్డూ వేలంలో కుల, మత, ప్రాంతీయ విభేదాలు లేకుండా వేలంపాటలో పాల్గొంటారు. అయితే 33 ఏళ్ల నుంచి బాలాపూర్‌లో గణేష్ ఉత్సవాలు నిర్వహించినప్పటికీ ఇంత స్థాయిలో ధర పలకడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాలాపూర్ లడ్డూను గెల్చుకోవడాన్ని స్థానికులు శుభప్రదంగా భావిస్తారు. లడ్డూను వేలం పాటలో దక్కించుకోవడం వల్ల బాధలు పోతాయని భక్తులు నమ్ముతారు. స్వామివారి లడ్డూను పొలంలో చల్లుకుంటే అధిక దిగుబడులు వస్తాయని, బావిలో వేస్తే నీళ్ళు ఎండిపోకుండా ఉంటాయని, వ్యాపారాలు సాఫీగా సాగుతాయని నమ్మకం. గణేష్ విగ్రహం గ్రామంలో ఉన్నంతవరకూ బాలాపూర్ వాసులు మద్యం, మాంసం ముట్టరు. అంతే కాకుండా లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బుతో గ్రామాభివృద్ధికి వెచ్చిస్తారు. ప్రతి ఏడాది లడ్డూ వేలం ధర పెరుగుతున్నా... లడ్డూ ధర కాస్ట్లీగా మారినా ... సొంతం చేసుకునేందుకు భక్తులు వెనకాడకపోవటం విశేషం. -
రూ.9.26 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
బాలాపూర్ : ప్రతిష్టాత్మక బాలాపూర్ గణేషుడి లడ్డూ ఈసారి 9లక్షల 26వేల రూపాయలు పలికింది. మాజీ మేయర్, టీకేఆర్ విద్యాసంస్థల అధినేత తీగల కృష్ణారెడ్డి కైవసం చేసుకున్నారు. లడ్డూ సొంతం చేసుకునేందుకు రేసు నరసింహారెడ్డి, టీకేఆర్ విద్యాసంస్థల మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. చివరకు రూ.9.26 లక్షలకు లడ్డూను టీకేఆర్ విద్యాసంస్థలు సొంతం చేసుకున్నాయి. గత ఏడాది రూ.7.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది మరో 1.76 లక్షలకు దాటడం విశేషం. 1994 సంవత్సరంలో రూ.450 లకు ప్రారంభమైన లడ్డూ వేలం ఏ ఏటికా ఏడాది పెరుగుతూనే ఉంది. బాలాపూర్ లడ్డూకి... రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్ని లక్షలు వెచ్చించి అయినా లడ్డూను దక్కించుకోవాలని భక్తులు పోటీపడుతున్నారు. 1984లో బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభం కాగా 1994 సంవత్సరంలో రూ.450, 2000 సంవత్సరంలో రూ.66వేలు 2010లో రూ.5.35లక్షలు, గతేడాది 7.50 లక్షలు పలికింది. -
లడ్డూను దక్కించుకున్న మాజీమేయర్ తీగల కృష్ణారెడ్డి