బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు సొంతం చేసుకుంది. లంబోధరుడి లడ్డూ ఈ ఏడాది ఏకంగా 14 లక్షల 65వేలు పలికింది. ఆది నుంచి హోరా హోరీగా సాగిన వేలం పాటలో స్కైలాబ్ రెడ్డి పెద్దమొత్తంలో వేలంపాట పాడి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. పదిలక్షలకు ప్రారంభమైన వేలం పాట ...చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 25మంది భక్తులు పోటీ పడ్డారు. గత ఏడాది వేలంలో పాల్గొన్న 16మందితో పాటు కొత్తగా మరో 9మంది లడ్డూను సొంతం చేసుకునేందుకు వేలంలో పాల్గొన్నారు. చివరకు గణేష్ లడ్డూ స్కైలాబ్ రెడ్డిని వరించింది. గత ఏడదాది రూ.10.32 లక్షల పలికిన ఈ లడ్డూ ఈసారి 4 లక్షల 33వేలు అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిసందే.