Laddu auction
-
మణికొండలో విషాదం.. గుండెపోటుతో టెక్కీ మృతి
సాక్షి, హైదరాబాద: మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అల్కాపూరి టౌన్ షిప్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్.. అనంతరం ఆకస్మికంగా మృతిచెందాడు. ఆదివారం రాత్రి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన లడ్డు వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు. 15 లక్షల వరకు లడ్డు వేలంలో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితుడు లడ్డూ కైవసం చేసుకోవడంతో గణనాథుడి వద్ద ఉత్సాహంగా డాన్స్‌లు చేశాడు. స్నేహితులతో కలిసి తీన్మార్ స్టెప్పులేశాడు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు.చదవండి: Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు! -
రూ.1.25 కోట్లు పలికిన గణేశ్ లడ్డు
బండ్లగూడ(హైదరాబాద్): వేలం పాటలో గణేశ్ లడ్డుకు అత్యధికంగా రూ.1.25 కోట్లు పలికింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీరు కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ రిచ్మండ్ విల్లాలోని గణనాథుడి లడ్డుకు గురువారం వేలంపాట నిర్వహించగా, ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రూ. 1.25 కోట్లకు దక్కించుకున్నారు. ఆర్వీ దియా ట్రస్ట్ ఆధ్వర్యంలో 150కిపైగా వ్యక్తిగతదాతలు కలిసి ఈ లడ్డును కొనుగోలు చేశారు. గతేడాది ఇక్కడి లడ్డు కు వేలంపాటలో పలికిన ధర రూ.6.28 లక్షలే. బాలాపూర్ లడ్డు రూ. 27 లక్షలు బాలాపూర్ గణనాథుని లడ్డును ఈసారి తుర్క యాంజాల్ పరిధిలోని పాటిగూడ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, రైతు దాసరి దయానంద్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. వేలంపాటలో రూ.27 లక్షలకు ఆయన సొంతమైంది. ► రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన రచ్చ బండ వినాయక లడ్డును వేలం పాటలో రూ.22. 11 లక్షలకు కేటీఆర్ గ్రూప్ సభ్యులు దక్కించుకున్నారు. గతేడాది రూ.20.20 లక్షలు పలికింది. ► బడంగ్‌పేట వీరాంజనేయ భక్త సమాజం లడ్డును మాజీ ఉప సర్పంచ్ పెద్దబావి వెంకట్‌రెడ్డి రూ.17 లక్షలకు సొంతం చేసుకున్నారు. ► షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మధురపురం రెడ్డిసేవా సమితి వినాయక లడ్డును అదే గ్రామానికి చెందిన శేరి పర్వతరెడ్డి రూ. 11,11,116లకు దక్కించుకున్నాడు బాలాపూర్ గణేశుడి లడ్డును దక్కించుకున్న దాసరి దయానంద్ లడ్లు దక్కించుకున్న ముస్లింలు ► ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్జనతా గణేశ్‌మండలి వద్ద లడ్డుకు వేలం పాట నిర్వహించగా, స్థానిక ముస్లిం యువకుడు షేక్ ఆసిఫ్ రూ.1.02లక్షలకు దక్కించుకున్నాడు. ► రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలోని సాయినగర్ కాలనీలో లడ్డు వేలం పాట నిర్వహించగా, మండలంలోని మహాలింగపురం గ్రామానికి చెందిన మహారాజ్‌పేట్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం తాహేర్ అలీ రూ. 23,100కు దక్కించుకున్నాడు. -
రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు
-
వేలం పాటలో రూ.1.26 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ
-
బాలాపూర్ లడ్డు ప్రత్యేకత..పోటా పోటీ..
-
బాలాపూర్ లడ్డు వేలం 2023
-
‘బాలాపూర్’.. బలాదూర్!
అల్వాల్: నగరశివారులో ఉన్న బాలాపూర్ గణపతి మండపంలోని లడ్డూ వేలంపాటలో ఈసారి రూ.24.60 లక్షలు పలుకగా, అల్వాల్ కానాజీగూడ లడ్డూ దానిని బ్రేక్ చేసింది. కానాజీగూడకు చెందిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ మండపంలో లడ్డూను నగరానికి చెందిన డాక్టర్ తాళ్లూరు వెంకట్రావు, గీతప్రియ దంపతులు రూ.45,99,999కి దక్కించుకున్నారు. వెంకట్రావు విదేశాలలో లార్డ్ ఇన్స్టిట్యూషన్స్, లోక్ప్రదీప్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఈ దంపతులు ఆ ఆలయానికి గత కొంతకాలంగా భక్తులుగా ఉన్నారు. గతేడాది కూడా వీరే రూ.17,81,999కు ఇక్కడి లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి కూడా పలువురు వేలంపాటలో పాల్గొనగా, చివరికి వెంకట్రావు దంపతులే రికార్డు స్థాయిలో పాటపాడి లడ్డూను సొంతం చేసుకున్నారు. మరకత గణపతిపై అచంచల విశ్వాసం ఉందని, ఈ లడ్డూను దక్కించుకోవడం వల్ల తమకు మరింత మేలు జరుగుతుందన్న విశ్వాసం ఉందని వారు అన్నారు. వేలం ద్వారా వచ్చిన లడ్డూ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, నిత్యాన్నదానానికి ఉపయోగిస్తామని ఆలయ నిర్వాహకులు మోత్కూరు సత్యనారాయణశాస్త్రి తెలిపారు. -
24 లక్షల 60 వేలు పలికిన బాలాపూర్ లడ్డూ వేలం
-
వాట్సాప్ గ్రూప్‌లో రూ.లక్ష పలికిన లడ్డూ పాట
సాక్షి, శ్రీకాకుళం : నగరంలో మొండేటివీధి శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో వినాయకచవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీగణపతి ఆలయ వాట్సాప్ గ్రూప్ ద్వారా లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ పాటలో నగరానికి చెందిన ఎన్.కిరణ్, కె.గోవింద్, అమరావతి శ్రీను, ఎస్.శ్రీను, జె.నవీన్‌లు సంయుక్తంగా రూ.1.03 లక్షలకు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఆలయం వద్ద స్వామివారి లడ్డూ ప్రసాదానికి అర్చకులు బద్రం కోదండరామాచార్యులు, బద్రం మాధవాచార్యులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి సమక్షంలో మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. -
రూ.17.75 లక్షలు పలికిన ఫిల్మ్ నగర్ లడ్డూ
-
రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు
-
ఫిల్మ్ నగర్ గణపతి లడ్డూ సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో లంబోదరుడి లడ్డూ ప్రసాదాలకు ఉన్న క్రేజ్ ఆ ‘ధర’హో అనిపిస్తోంది. లడ్డూ ప్రసాదమంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగే బాలాపూర్ లడ్డూ ధరను ఈసారి ఫిల్మ్‌నగర్ బస్తీ వినాయక్ నగర్ గణపతి లడ్డూ ధర దాటేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ కన్నా వినాయక్ నగర్ లడ్డూ ధర ఎక్కువ పలికింది. బీజీపీ నేత పల్లపు గోవర్ధన్ ఈ లడ్డూను రూ.17.75 లక్షలకు సొంతం చేసుకున్నారు. గత ఏడాది వినాయక్ నగర్ లడ్డూ రూ.15.1 లక్షలు పలికి నగరంలో రెండో స్థానం దక్కించుకుంది. ఇక ఈ ఏడాది బాలాపూర్ వినాయకుడి లడ్డూ 17.60 లక్షలు పలికింది. దీన్ని కొలను రాంరెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నాడు. -
భోలక్‌పూర్‌లో బంగారు లడ్డూ వేలం..
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో లంబోదరుడి లడ్డూ ప్రసాదాలకు ఉన్న క్రేజ్ అ‘ధర’హో అనిపిస్తోంది. లడ్డూ ప్రసాదమంటేనే రెండు తెలుగురాష్ట్రాల్లో మార్మోగే బాలాపూర్ లడ్డూ గత ఏడాది అత్యధికంగా రూ.16.60 లక్షలకు స్థానిక ఆర్యవైశ్యసంఘం ప్రతినిధులు దక్కించుకోవడం విశేషం. ఏటా ఇంతింతై.. అన్నచందంగా ఈ లడ్డూ ధర ఏడాదికి రూ.50 వేల నుంచి రూ.75 వేల మేర అధికంగా పలుకుతోంది. బాలాపూర్ లడ్డూ వేలంపాట 1994 నుంచి మొదలైంది. ప్రారంభంలో రూ.500 నుంచి మొదలైన వేలంపాట.. ఇప్పుడు లక్షల రూపాయల మార్కును చేరుకొంది. ప్రతిఏటా రాష్ట్రవ్యాప్తంగా లడ్డూ వేలంపాటలో ఆల్‌టైమ్ రికార్డు ధర పలుకుతుండడం ఈ లడ్డూ ప్రత్యేకత. ఇక ఏటా ఈ ప్రసాదాన్ని దక్కించుకున్న వారు రాజకీయ, నిర్మాణరంగం, ఇతర రంగాల్లో గణనీయంగా అభివృద్ధి సాధింస్తుండడంతో దీనికి క్రేజ్ మరింత పెరుగుతూనే ఉంది. ఈసారి కూడా ఈ మహిమాన్విత లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు నగరంలోని పలువురు రాజకీయ, వ్యాపార, వాణిజ్య, రియల్టర్లు, బిల్డర్లు తమ పేర్లు నమోదుచేసుకొని పోటీ పడనున్నారు. ఇదే తరహాలో నగరంలో రియల్ ఎస్టేట్, నిర్మాణరంగం, ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగుబంగారంగా ఉన్న శివారు ప్రాంతాల్లో నవరాత్రి పూజలందుకున్న గణనాథుల మండపాల్లో నేడు నిర్వహించనున్న లడ్డూ వేలంపాటలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లక్షల్లో ధర పలికే ఈ వేలంపాటలు ఆద్యంతం భక్తుల జయజయధ్వానాలు, కోలాహలం మధ్యన వేడుకగా జరగనున్నాయి. ఈ ప్రసాదాన్ని తమ అదృష్టానికి చిరునామా అని భావిస్తోన్న వారంతా వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతుండడం విశేషం. ఏటా లడ్డూ వేలంపాటలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రధానంగా నగరంలో బాలాపూర్, బడంగ్పేట్, సాహెబ్‌నగర్, మంచిరేవుల, కూకట్పల్లి, బోరంపేట్, కొత్తగూడ, మీరాలం మండి, ముషీరాబాద్, ఫిల్మ్‌నగర్, నార్సింగి, కోకాపేట్ తదితర ప్రాంతాలు లడ్డూ వేలంపాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. గురువారం నగరవ్యాప్తంగా అంగరంగవైభవంగా జరగనున్న వేలంపాటల్లో మరోసారి లడ్డూ ప్రసాదాలకు రూ.లక్షల్లో ధర పలకనున్నాయి. మీరాలంమండిలో.. రూ.11.51 లక్షలు.. చార్మినార్: మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డూలు ఈసారి గతంలో కన్నా ఎక్కువ ధర పలికాయి. మీరాలంమండి బొజ్జ గణపయ్య భక్త మండలి సభ్యులు రూ.11.51లక్షలకు లడ్డూను దక్కించుకున్నారని శ్రీ మహంకాళేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య పేర్కొన్నారు. భోలక్‌పూర్‌లో రూ.7.56 లక్షలు కవాడిగూడ: ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ హౌస్ వద్ద శ్రీసిద్ధి వినాయక భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు బంగారు లడ్డూను ఏర్పాటు చేశారు. అసోసియేషన్ నిర్వాహకుడు జి.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 12 తులాల, 3 గ్రాముల బంగారం లడ్డూను ప్రత్యేకంగా తయారుచేయించారు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా బుధవారం బంగారు లడ్డూకు వేలం పాట నిర్వహించారు. భక్తులు పోటీపోటీగా వేలం పాడారు. స్థానిక చేపల విక్రయాల వ్యాపారి బైరు విష్ణుప్రసాద్ రూ.7.56 లక్షలకు ప్రసాదం, బంగారు లడ్డూనుకైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేతులమీదుగా విష్ణుప్రసాద్‌కు ప్రసాదంతో పాటు బంగారు లడ్డూను అందజేశారు. -
రూ.8.1 లక్షలు పలికిన బంగారు లడ్డూ
కవాడిగూడ: ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ హౌస్ శ్రీసిద్ధి వినాయక భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 తులాల బంగారంతో తయారైన గణపతి లడ్డూ వేలంలో రూ.8.1 లక్షలు పలికింది. భోలక్‌పూర్‌కు చెందిన చేపల వ్యాపారి కాడబోయిన భాస్కర్ 11 కేజీల సాధారణ లడ్డూతో పాటు బంగారు లడ్డూను దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా గణపతి వద్ద బంగారు లడ్డూను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు జి.అనిల్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు ఎం.ఎన్.శ్రీనివాస్‌రావు, భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు నవీన్‌కుమార్, బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గ కో–కన్వీనర్ ఎం.నవీన్‌గౌడ్, నాయకులు శ్రీధర్‌చారి, రవిచారి, ముప్పిడి నర్సింగ్‌రావు, బబ్లూ, భాను, కిశోర్‌యాదవ్, పరమేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.వందలతో మొదలై లక్షలకు...
బడంగ్పేట్: వినాయక చవితి వచ్చిందంటే ఇటు ఖైరతాబాద్ మహాగణపతి, అటు బాలాపూర్ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. బాలాపూర్ గణనాథుడికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గణనాథుడి వెంటే నగరంలోని పెద్ద గణపతులు నిమజ్జనానికి బయలుదేరుతాయి. ఈ విఘ్నేశుడికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈయన లడ్డూకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. లడ్డూ దక్కించుకునేందుకు పోటీ పెద్ద ఎత్తున ఉంటుంది. రూ.వందలతో మొదలైన ఈ లడ్డూ ప్రస్థానం ఇప్పుడు రూ.లక్షలకు చేరింది. బాలాపూర్ గణేశుడి లడ్డూ భక్తులకు కొంగుబంగారమైంది. లక్కీ లడ్డూగా కీర్తినందుకొంది. తాము దక్కించుకున్న లడ్డూను పంటపొలాల్లో చల్లి అధిక దిగుబడులు సాధించామని, వ్యాపారంలోనూ లాభాలు ఆర్జించామని భక్తులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూపై భక్తులకు నమ్మకం, విశ్వాసం పెరిగిపోయాయి. దీనిని కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూగా బాలాపూర్ వాసులు పేర్కొంటారు. 1980లో ప్రస్థానం ప్రారంభం... బాలాపూర్ గణనాథుడి ప్రస్థానం 1980లో ప్రారంభమైంది. అయితే 1994 నుంచి లడ్డూ వేలంపాట మొదలైంది. 1994లో రూ.450 పలికిన తొలి లడ్డూ... 2017లో రూ.15.60 లక్షలకు చేరుకుంది. మరి ఈసారి ఎంత ధర పలుకుతుందోనని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో బాలాపూర్ వాసులు మద్యం, మాంసాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. గణేశుడి లడ్డూను కూడా ప్రతిరోజు ప్రత్యేకంగా పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో లడ్డూ వేలంపాట వేసే సంప్రదాయం బాలాపూర్ గణనాథుడి నుంచే ప్రారంభమైంది. ఇక ఈ గణనాథుడి నిమజ్జన శోభాయాత్రకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. లడ్డూ ఫ్రమ్ తాపేశ్వరం... బాలాపూర్ లడ్డూను తొలుత చార్మినార్‌లోని గుల్‌జల్ ఆగ్రా స్వీట్ హౌస్ వారు తయారు చేసేవారు. బరువు 21 కిలోలు ఉండేది. అయితే గత నాలుగేళ్లుగా అంతే బరువుతో తాపేశ్వరంలోని హనీ ఫుడ్స్ లడ్డూను తయారు చేస్తోంది. వేలంపాట విజేతకు లడ్డూను ఉంచే రెండు కిలోల వెండి గిన్నెను ఇస్తున్నట్లు హనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వర్ తెలిపారు. దేవాలయాల అభివృద్ధి... వేలంపాట డబ్బులతో గ్రామంలో నూతనంగా శ్రీఆంజనేయస్వామి సహిత వేంకటేశ్వరస్వామి, లక్ష్మీ గణపతి దేవాలయాన్ని సుందరంగా నిర్మించారు. అదే విధంగా గ్రామంలోని పురాతన వేణుగోపాలస్వామి, శివాలయం తదితర దేవాలయాల ఆధునికీకరణకు వేలంపాట నిధులు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నారు. -
లడ్డూతినే పోటీలు నిర్వహిస్తున్నారా జాగ్రత్త..!
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో వినాయకుడికి నైవేధ్యంగా పెట్టిన లడ్డూల వేలం పాటతో పాటు ఎవరు ఎక్కువ లడ్డూలు తింటారనే పోటీలు జరగడం పరిపాటి. ఆఖరి నాలుగు రోజులు ఇవి జోరుగా సాగుతాయి. లడ్డూ వేలం పాటల వరకు ఓకే అయినా అవి తినే పోటీలు మాత్రం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని సరదా కోసం ఓ ఎఫ్ఎం రేడియో సంస్థ ఏర్పాటు చేసిన లడ్డూ తినే పోటీ తార్నాకలో జోషి అనే వ్యక్తి ప్రాణాలు తీసిందని గుర్తు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో కొందరు మండపాల నిర్వాహకులతో పాటు వివిధ ప్రైవేట్ సంస్థలు ప్రచారం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటు, టోపీలు, టీ–షర్టుల పంపిణీ, లడ్డూలు తినే పోటీటూ నిర్వహిస్తారు. ఆయా పోటీల్లో అందరికంటే ఎక్కువ లడ్డూలు తిన్న వారిని విజేతగా ప్రకటించి, బంగారు నాణాలు, నగదు బహుమతులు అందజేస్తారు. ఇలాంటి పోటీలు ప్రాణాలు తీస్తాయని, ఎవరికి వారు ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని పేర్కొంటున్నారు. గొంతులో ఇరుక్కుంటే ప్రాణాంతకమే... ఇలాంటి పోటీల్లో పాల్గొనే వారు విజేతలుగా నిలవాలనే ఉద్దేశంతో తక్కువ సమయంలో ఎక్కువ లడ్డూలు తినే ప్రయత్నం చేస్తారు. దీనికోసం లడ్డూను పూర్తిగా నమలకుండా మింగేయడం, విరామం లేకుండా ఒకదాని తర్వాత మరోటి తినాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో లడ్డూలు గొంతులో ఇరుక్కుంటాయని, కొన్ని సందర్భాల్లో బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తరలించినా.. ఫలితాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అలాంటి సమయంలో కనీసం మంచినీళ్లు సైతం తాగలేని పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు. చివరకు గొంతులో ఇరుక్కున్న లడ్డూ కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారి, బాధితుడు మృత్యు ఒడికి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ట్రేకియా దెబ్బతినడం వల్లే... ఇలాంటి పోటీ నేపథ్యంలో లడ్డూను కంగారుగా తినడంతో అది శ్వాసనాళంలోకి వెళ్లి, ఊపిరాడక బాధితులు మరణిస్తూ ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠంలో ముందు భాగంలో ఉండే శ్వాసనాళం (ట్రేకియా) ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. దీని ద్వారానే మనిషి శ్వాస తీసుకుంటాడు. దానికి వెనుక వైపు వెన్నుపూసల మధ్య అన్నవాహిక ఉంటుంది. ఆహారం తీసుకునేప్పుడు గొంతులో కొండనాలిక పని తీరు వల్ల ఆ పదార్థం శ్వాసనాళంలోకి కాకుండా అన్నవాహికలోకి వెళ్తుంది. ఈ కొండనాలిక సరిగ్గా పని చేయనప్పుడే పొలమారుతూ మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు. లడ్డూ పోటీల నేపథ్యంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో, కంగారుగా లడ్డూలు తినడంతో కొండనాలిక సరిగ్గా పని చేయకపోవచ్చు. ఫలితంగా ఆ ఆహారపదార్థాలు ట్రేకియాలోకి వెళ్లి ఇరుక్కుపోతుంటాయి. ఫలితంగా బాధితుడికి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారి కన్ను మూస్తుంటాడు. ఒక్కోసారి స్వరపేటిక పైన ఉండే వేగస్ నర్వ్‌పై ఒత్తిడి పెరగడంతో వేగ ఇగ్విబిషన్ అనేది ఏర్పడుతుందని ఫలితంగానూ గుండె ఆగిపోతుందని వివరిస్తున్నారు. లడ్డూలపై కన్నేసి ఉంచండి: పోలీసులు గణేష్ మండపాల నిర్వాహకులు వినాయకుడి విగ్రహానికి ప్రసాదంగా పెట్టే లడ్డూపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి లడ్డూలకు ఓ విశిష్టత ఉంటుంది. విభిన్న తరహాలో ఏర్పాటు చేయడం, వేలంలో భారీ రేటు పలకడం, ఉచితంగా పంపిణీ చేయడం... తదితర చర్యలతో నిర్వాహకులు భక్తులను ఆకర్షిస్తుంటారు. అయితే ఇలాంటి లడ్డూలు తస్కరిస్తే ‘శుభం’ అనే సెంటిమెంట్ సైతం కొందరికి ఉంటుందని సూచిస్తున్నారు. గతంలో ఇలాంటి నేరం చేసే ఐదుగురు యువకులు కటకటాల్లోకి చేరినట్లు తెలిపారు. అయితే సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని లడ్డూలు తస్కరణకు గురైతే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు దాటే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండపాల నిర్వాహకులు పక్కాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో తమ ప్రసాదాలపై ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు. -
లడ్డూ అధరహో...!
♦ నగర వ్యాప్తంగా గణేశ్ లడ్డూ వేలం పాటలు ♦ బాలాపూర్‌లో ఉత్కంఠ.. ♦ రూ.15.6 లక్షలకు దక్కించుకొన ్న నాగం తిరుపతిరెడ్డి ♦ రూ. 5.70 లక్షలు పలికిన బడంగ్పేట్ లడ్డూ సాక్షి, సిటీబ్యూరో: గణపతి నిమజ్జనం సందర్భంగా గ్రేటర్ నలుచెరుగులా మంగళవారం లడ్డూ వేలం పాటలు హోరాహోరీగా జరిగాయి. భక్త సమాజాలకు రూ.లక్షల మేర కాసుల వర్షం కురిపించాయి. కోరిన కోర్కెలు తీర్చే లంబోదరుడి లడ్డూలను రూ. లక్షలు వెచ్చించి సొంతం చేసుకొనేందుకు సిటీజన్లు మక్కువ చూపారు. రూ.50 వేల నుంచి రూ.15.60 లక్షల వరకు లడ్డూ ప్రసాదాలను దక్కించుకునేందుకు రియల్టర్లు, బిల్డర్లు, వ్యాపారులు ఎవరి స్థాయిలో వారు పోటీ పడ్డారు. వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను వినియోగించనున్నట్లు ఆయా భక్తమండళ్ల ప్రతినిధులు తెలిపారు. బాలాపూర్ లడ్డూ.. రూ. 15.6 లక్షలు భక్తుల కొంగు బంగారంగా విశేష ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ వేలాన్ని ఉదయం 10 గంటలకు ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మొత్తం 20 మంది వేలం పాటలో పాల్గొన్నారు. రూ.1116 నుంచి మొదలైన పాట..నిమిషాల వ్యవధిలో వేలు..లక్షలు దాటి.. రూ. పది లక్షలకు చేరింది. బాలాపూర్ గ్రామానికి చెందిన మహేందర్‌రెడ్డి (నాగార్జున స్టీల్), నాగం తిరుపతిరెడ్డిల మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలో రూ.15.60 లక్షలకు లడ్డూను నాగం తిరుపతి రెడ్డి దక్కించుకున్నారు. ఆయనను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. శిరస్సున లడ్డూ ప్రసాదం ధరించిన తిరుపతిరెడ్డిని డప్పుదరువు, మేళతాళాలతో స్థానిక వేంకటేశ్వర ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. గతేడాది లడ్డూను దక్కించుకున్న స్కైలాబ్‌రెడ్డిని కూడా ఉత్సవ కమిటీ ప్రతినిధులు సన్మానించారు. అరగంట పాటు ఉత్కంఠగా సాగిన ఈ వేలంపాటను తిలకించేందుకు అశేషభక్తవాహిని బాలాపూర్ గ్రామానికి చేరుకోవడంతో గ్రామానికి దారితీసే దారులన్నీ కిక్కిరిశాయి. ఘనంగా గణనాథుని ఊరేగింపు... అంతకు ముందు ఉదయం 5 గంటలకే బాలాపూర్ గణనాథున్ని గ్రామంలో ముఖ్యవీథుల్లో ఊరేగించారు. బ్యాండు మేళాలు, డప్పుకళాకారుల నృత్యాలు, భజనబృందాల ఆటపాటలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, దైవజ్ఙశర్మ తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా.. బాలాపూర్ లడ్డూ ప్రసాదం దక్కించుకునేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా. 2013 ఈ లడ్డూను దక్కించుకున్న తీగల కృష్ణారెడ్డి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికవడం నన్ను విశేషంగా ఆకర్షించింది. నేను కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నా. గతంలో ఈ లడ్డూ దక్కించుకున్న వారిని ఎన్నో విజయాలు వరించాయి. అదే స్ఫూర్తితో ఈ సారి ఎలాగైనా ఈ ప్రసాదాన్ని దక్కించుకోవాలని వేలం పాటలో పాల్గొన్నా. ఈ లడ్డూ ద్వారా వచ్చిన ఆదాయా న్ని గ్రామస్తులు సేవా కార్యక్రమాలు, ఆలయం అభివృద్ధికి వినియోగిస్తుండటం గొప్ప విషయం. – నాగం తిరుపతిరెడ్డి, బాలాపూర్ లడ్డూ విజేత కూలీ స్థాయి నుంచి ఎదిగా... దినసరి కూలీ స్థాయినుంచి గణపతి ఆశీస్సులతో అభివృద్ధి చెందా. వీరాంజనేయ భక్తసమాజం లడ్డూను దక్కించుకోవడంతో కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తున్నాయి. ఈ సారితో కలిపి మొత్తం ఐదుసార్లు బడంగ్‌పేట లడ్డూను దక్కించుకున్నా. మళ్లీ లడ్డూను వేలంలో కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాకారమైనపుడు ఈ లడ్డూను వేలం పాటలో దక్కించుకొని కేటీఆర్‌కు కానుకగా ఇచ్చా. ఈసారి కూడా మంత్రి కేటీఆర్‌కు కానుకగా ఇస్తా. – కర్రె కృష్ణ ,బడంగ్పేట్ లడ్డూ ప్రసాద విజేత బడంగ్పేట్ @ రూ.5.70 లక్షలు బడంగ్‌పేట గణపయ్య లడ్డును ఈ సారి రూ.5.70 లక్షలకు టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కర్రె కృష్ణ దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన రాములమ్మ నందు, పెద్దబావి పార్వతమ్మ అండ్ సన్స్, కర్రె కృష్ణల మధ్య వేలం పాట ఉత్కంఠగా సాగింది. చివరకు కర్రె కృష్ణ రూ.5.70 లక్షలకు లడ్డూ ప్రసాదాన్ని దక్షించుకున్నారు. ఆయనను ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. గతంలో కర్రె కృష్ణ ఇదే లడ్డూ ప్రసాదాన్ని తొలిసారి 55 వేలకు, రెండోసారి రూ.70 వేలకు, మూడోసారి రూ.4 లక్షలకు, నాలుగోసారి రూ.5.15 లక్షలకు, ఈసారి రూ.5.70 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఈ లడ్డూ రూ.5.40 లక్షలు పలికిది. ఈ సారి రూ.30 వేలు ఎక్కువకు పాడుకున్నారు. అనంతరం డప్పు వాయిద్యాలు, కోలాటాలు, కోయ నృత్యాల మధ్య బడంగ్‌పేట గణనాథుడ్ని గ్రామంలో ఊరేగించి నిమజ్జనానికి తరలించారు. -
బాలాపూర్ లడ్డూ అ’ధర’హో...!
-
రూ. 450తో మొదలైన బాలాపూర్ లడ్డూ
-
రూ. 450తో మొదలైన బాలాపూర్ లడ్డూ
రికార్డు స్థాయిలో ధర పలికి.. చరిత్ర సృష్టించిన బాలాపూర్ లడ్డూ ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా.. మొట్టమొదటి సారి 1994 సంవత్సరంలో కొలను మోహన్ రెడ్డి రూ. 450కి ఆ లడ్డూను వేలంలో పాడుకున్నారు. బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లోనే ప్రారంభమైనా లడ్డూ వేలం మాత్రం తొలిసారి 1994లోనే నిర్వహించారు. తొలి వేలం తర్వాత అది బాగా ప్రాచుర్యం పొందింది. దాంతో ఆ తర్వాతి సంవత్సరం ఏకంగా పది రెట్లు పెరిగి.. రూ. 4,500 వరకు వేలం వెళ్లింది. అప్పటి నుంచి బాలాపూర్ లడ్డూ వేలం ఎంతవరకు వెళ్లిందనే విషయం బాగా ఆసక్తికరంగా మారింది. వేలంలో పాడుకున్న వాళ్ల ఆ లడ్డూను తమ పొలంలో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకం ఉండటం వల్ల కూడా ఈ లడ్డూ వేలాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. మొదట్లో కేవలం స్థానికులకు మాత్రమే ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులు.. ఆ తర్వాతి నుంచి ఎక్కడివారైనా వేలంలో పాల్గొనచ్చని తెలిపారు. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు. ఏయే సంవత్సరంలో లడ్డూ వేలం ఎవరికి, ఎంతకు వెళ్లిందనే వివరాలు ఇలా ఉన్నాయి.... 1994లో కొలను మోహన్ రెడ్డి - రూ. 450 1995లో కలను మోహన్ రెడ్డి -రూ. 4,500 1996లో కొలను క్రిష్ణా రెడ్డి-రూ . 18,000 1997లో కొలను క్రిష్ణా రెడ్డి -రూ. 28,000 1998లో కొలను మోహన్ రెడ్డి -రూ. 51,000 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి -రూ. 65,000 2000లో కల్లెం అంజిరెడ్డి -రూ. 66,000 2001 జి. రఘునందన్ చారి -రూ. 85,000 2002లో కందాడ మాధవ రెడ్డి -రూ. 1,05,000 2003లో చిగిరింత బాల్ రెడ్డి -రూ. 1,55,000 2004లో కొలను మోహన్ రెడ్డి -రూ.2,01,000 2005లో ఇబ్రాం శేఖర్ -రూ.2,08,000 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి -రూ.3,00,000 2007లో జి. రఘునందన్ చారి -రూ.4.15,000 2008లో కొలను మోహన్ రెడ్డి -రూ.5,07,000 2009లో సరిత -రూ.5,10,000 2010లో కొడాలి శ్రీధర్ బాబు -రూ.5,35,000 2011లో కొలను బ్రదర్స్ -రూ.5,45,000 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి -రూ. 7,50,000 2013లో తీగల క్రిష్ణారెడ్డి -రూ. 9,26,000 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ. 9,50,000 2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి -రూ. 10,32,000 2016లో స్కైలాబ్ రెడ్డి -రూ. 14.65,000 -
ఈసారి స్కైలాబ్ రెడ్డికి దక్కింది..
-
రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డు
హైదరాబాద్ : బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు సొంతం చేసుకుంది. లంబోధరుడి లడ్డూ ఈ ఏడాది ఏకంగా 14 లక్షల 65వేలు పలికింది. ఆది నుంచి హోరా హోరీగా సాగిన వేలం పాటలో స్కైలాబ్ రెడ్డి పెద్దమొత్తంలో వేలంపాట పాడి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. పదిలక్షలకు ప్రారంభమైన వేలం పాట ...చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 25మంది భక్తులు పోటీ పడ్డారు. గత ఏడాది వేలంలో పాల్గొన్న 16మందితో పాటు కొత్తగా మరో 9మంది లడ్డూను సొంతం చేసుకునేందుకు వేలంలో పాల్గొన్నారు. చివరకు గణేష్ లడ్డూ స్కైలాబ్ రెడ్డిని వరించింది. గత ఏడదాది రూ.10.32 లక్షల పలికిన ఈ లడ్డూ ఈసారి 4 లక్షల 33వేలు అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిసందే. బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. మరి ఈ లడ్డూకు అంత క్రేజెందుకంటారా...! ‘కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూ’గా పేర్కొంటుంటారు బాలాపూర్ వాసులు. లడ్డూ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేశారు. 1980లో మొదలై... గణేశునిపై బాలాపూర్‌వాసులకున్న భక్తి, సేవాతత్పరతను చాటిచెబుతూ 36 ఏళ్ల సుదీర్ఘ యానంతో చరిత్రను సృష్టించింది. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు. -
గణేషుడి లడ్డూలకు భలే డిమాండ్
శామీర్‌పేట్: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద శనివారం రాత్రి లడ్డూ వేలం నిర్వహించారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు పవన్‌గౌడ్ రూ.42,000 స్వామివారి లడ్డూను కైవసం చేసుకున్నారు. శామీర్‌పేట్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి చేతిలోని లడ్డూను జేఎల్ఎం ప్రశాంత్‌రెడ్డి రూ.20,100 వేలంలో దక్కించుకున్నాడు. -
మా ఊరి లడ్డూకు ‘మారాజు’ లెవరో...
హైదరాబాద్: బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. మరి ఈ లడ్డూకు అంత క్రేజెందుకంటారా...! ‘కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూ’గా పేర్కొంటుంటారు బాలాపూర్ వాసులు. చేతులు మారిన భారీ లడ్డూ తయారీ... ఏటా బాలాపూర్ లడ్డూను పాతబస్తీ చార్మినార్ గుల్‌జల్ ఆగ్రా స్వీట్ హౌస్ నిర్వాహకులు 21 కిలోల బరువుతో కట్టిస్తారు. దశాబ్దాలుగా ఈ లడ్డూను తయారు చేయడంలో గుల్‌జల్ యాజమాన్యం ప్రత్యేక ఆసక్తిని చూపుతారు. అయితే ఈమారు ఈ అదృష్టాన్ని ఆంధ్రా ప్రాంత తాపేశ్వరం మిఠాయి తయారీదార్లు దక్కించుకున్నారు. నాణ్యత, సైజు విషయాల్లో ఎలాంటి తేడాలు లేనప్పటికీ ఖైరతాబాద్ వినాయకుని లడ్డూను తయారు చేసే తాపేశ్వరం వారే బాలాపూర్ లడ్డూను కూడా కట్టేందుకు అర్హతను దక్కించుకున్నారు. 1980లో మొదలై... గణేశునిపై బాలాపూర్‌వాసులకున్న భక్తి, సేవాతత్పరతను చాటిచెబుతూ 33 ఏళ్ల సుదీర్ఘ యానంతో చరిత్రను సృష్టించింది. నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు. గతేడాది ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అండ్ సన్స్ రూ 9.26 లక్షలకు వేలంపాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. కుషాయిగూడ లడ్డూ రూ. 2.60 లక్షలు కుషాయిగూడ: కుషాయిగూడ కూరగాయల మార్కెట్ ఎదురుగా గాంధీ మోమెరియల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుని లడ్డూను కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డి రూ 2.60 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది రూ: 1.70 లక్షలు పలికిన ఈ లడ్డు ఈ ఏడాది తొంబై వేలు అధికంగా ధర పలికింది. బడంగ్పేట్ లడ్డూకు భలే క్రేజ్ దిల్సుఖ్నగర్: బడంగ్‌పేట గణపతి లడ్డూను దక్కించుకున్న వారికి అంతా శుభాలే జరుగుతుండటంతో ప్రతి ఏటా బడంగ్‌పేట లడ్డూకు క్రేజ్ పెరిగింది. 2014లో రూ, 4.05 లక్షలకు టీఆర్ఎస్ నాయకుడు కర్రె కృష్ణ దక్కించుకున్నాడు. రూ.1.50 లక్షలకు దక్కించుకున్న అవినాష్‌రెడ్డి నిజాంపేట: నిజాంపేట బస్టాప్ వద్ద అచెట్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడి లడ్డూ ఈసారి రూ.1,50,001 పలికింది. నిజాంపేటకు చెందిన గడ్డం అవినాష్‌రెడ్డి రూ. 1,50,001లకు వేలంలో సొంతం చేసుకున్నాడు. లడ్డూను దక్కించుకున్న వారి వివరాలు... 1994 కొలను మోహన్‌రెడ్డి రూ.450. 1995 కొలను మోహన్‌రెడ్డి రూ.4500 2010 శ్రీధర్‌బాబు రూ.5.30 లక్షలు 2011 కొలను ఫ్యామిలీ రూ.5.45 లక్షలు 2012 పన్నాల గోవర్థన్‌రెడ్డి రూ. 7.50లక్షలు 2013 టీకేఆర్ విద్యాసంస్థలు(తీగల కృష్ణారెడ్డి) మీర్‌పేట రూ. 9.26లక్షలు 2014 జైహింద్‌రెడ్డి బాలాపూర్ గ్రామం రూ,9.50 లక్షలు ఇక మహాగణపతి చేతిలో 6వేల కిలోల లడ్డూ ఖైరతాబాద్: ఐదు సంవత్సరాలుగా సురుచిఫుడ్స్ అధినేత మల్లిబాబు ఆధ్వర్యంలో ఖైరతాబాద్ మహాగణపతికి భారీ లడ్డూ సమర్పిస్తూ వస్తున్నారు. 2010లో 500కిలోల లడ్డూతో ప్రారంభమై 2011లో 2400కిలోలు, 2012లో 3500కిలోలు, 2013లో 4200కిలోలు, 2014లో5200కిలోలు సమర్పించారు. ఈ సారి 6000కిలోల మహాలడ్డూను సమర్పించారు. ఈ లడ్డూ 6నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈ లడ్డూను దాదాపు లక్షా 50వేల మందికి ప్రసాదంగా అందజేయవచ్చని తాపేశ్వరం సురుచిఫుడ్స అధినేత మల్లిబాబు తెలిపారు. -
రూ. 39 లక్షలు పలికిన పుట్టలమ్మ తల్లి లడ్డూ
గుంటూరు సమీప గ్రామాల ప్రజలు పవిత్రంగా నిర్వహించే శ్రీ ఘంటాలమ్మతల్లి- పుట్టలమ్మతల్లి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. మూడు రోజులపాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారి ప్రసాదం 9 కిలోల ప్రసాదం లడ్డూను వేలం వేశారు. ఆలయ కమిటీ పాటను రూ. 9 వేలతో ప్రారంభించగా అది రూ. 39 లక్షలకు వెళ్లింది. నల్లపాడు మాజీ సర్పంచ్ చల్లా సాంబిరెడ్డి ఈ లడ్డూను రూ. 39 లక్షలకు పాడుకున్నారు. గత ఏడాది ఇదే లడ్డూను వేలంలో తానే రూ 20.9 లక్షలకు పాడుకున్నానని, ఈసారి కూడా అమ్మ దయతో లడ్డూ తనకే దక్కిందని సాంబిరెడ్డి చెప్పారు. ఏటా అమ్మవారికి అలంకారాలు పాదుకలు, వెండిరథం ఆభరణాలు చేయిస్తున్నామని, రానున్న ఏడాది అమ్మవారికి 2కిలోల బంగారు చీరను తయారు చేయించనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ ఇంటూరి అంజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గణేశా.. చూడయ్యా తమాషా!
మహేశ్వరం, న్యూస్‌లైన్: నాడు ఆకాశానికి ఎగిసి నేడు అవనికి పడిపోయిన రియల్ ఎస్టేట్ రంగం.. గణేశ్ లడ్డూల వేలంపై ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు రూ.లక్షలు వెచ్చించి లడ్డూలను దక్కించుకునేందుకు ఆరాటపడిన వారంతా ప్రస్తుతం రూ. వేలకే పరిమితమవుతున్నారు. దీనికి తాజా తార్కాణం బుధవారం మండంలోని సర్దార్‌నగర్ గణేశ్ లడ్డూ రూ.6,500కే ఇదే గ్రామానికి చెందిన తాళ్ల పాండు వేలంలో దక్కించుకోవడం. 2007లో రూ.17 లక్షల 2వేలకు సర్దార్‌నగర్ వినాయకుడి లడ్డూను ఇదే గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారంటే.. రియల్ ఎస్టేట్ రంగం ఎంత దిగాలు పడిందో అవగతమవుతోంది. మండలంలోని యేటికేడాది రియల్ ఎస్టేట్ వ్యాపారం చల్లబడుతుండడంతో లడ్డూల వేలానికి ఎవరూ ఆసక్తి చూపడంలేదు. మండలంలో రియల్ రంగం కుదేల్ అయ్యాక వ్యాపారులు, నాయకులు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఏడాది మండలంలోని తుక్కుగూడ బొడ్రాయి వద్ద నెలకొల్పిన గణేశ్ లడ్డూ రూ.1.04 లక్షలకు ఇదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. ఈసారి ఇంత పెద్ద మొత్తంలో లడ్డూ ధర పలకడం విశేషం. అప్పట్లో లక్షలు పలికిన వినాయక లడ్డూలు ప్రస్తుతం ఇంత తక్కువకు పడిపోవడానికి రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడమేనని ప్రధాన కారణం. ఈ ప్రాంతానికి చెందిన నాయకులు, రియల్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొని, కొందరు విచ్చలవిడిగా ఖర్చు చేసి తీవ్రంగా నష్టపోయారు. కొందరైతే అప్పుల్లో కూరుకుపోయి కొలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ కారణంగానే లడ్డూలకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.