రూ. 450తో మొదలైన బాలాపూర్ లడ్డూ | Balapur laddu auction history starts with rs 450 only | Sakshi
Sakshi News home page

రూ. 450తో మొదలైన బాలాపూర్ లడ్డూ

Published Thu, Sep 15 2016 3:07 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

రూ. 450తో మొదలైన బాలాపూర్ లడ్డూ

రూ. 450తో మొదలైన బాలాపూర్ లడ్డూ

రికార్డు స్థాయిలో ధర పలికి.. చరిత్ర సృష్టించిన బాలాపూర్ లడ్డూ ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా.. మొట్టమొదటి సారి 1994 సంవత్సరంలో కొలను మోహన్ రెడ్డి రూ. 450కి ఆ లడ్డూను వేలంలో పాడుకున్నారు. బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లోనే ప్రారంభమైనా లడ్డూ వేలం మాత్రం తొలిసారి 1994లోనే నిర్వహించారు. తొలి వేలం తర్వాత అది బాగా ప్రాచుర్యం పొందింది. దాంతో ఆ తర్వాతి సంవత్సరం ఏకంగా పది రెట్లు పెరిగి.. రూ. 4,500 వరకు వేలం వెళ్లింది.

అప్పటి నుంచి బాలాపూర్ లడ్డూ వేలం ఎంతవరకు వెళ్లిందనే విషయం బాగా ఆసక్తికరంగా మారింది. వేలంలో పాడుకున్న వాళ్ల ఆ లడ్డూను తమ పొలంలో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకం ఉండటం వల్ల కూడా ఈ లడ్డూ వేలాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. మొదట్లో కేవలం స్థానికులకు మాత్రమే ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులు.. ఆ తర్వాతి నుంచి ఎక్కడివారైనా వేలంలో పాల్గొనచ్చని తెలిపారు.

గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు.

ఏయే సంవత్సరంలో లడ్డూ వేలం ఎవరికి, ఎంతకు వెళ్లిందనే వివరాలు ఇలా ఉన్నాయి....

1994లో కొలను మోహన్ రెడ్డి - రూ. 450
1995లో కలను మోహన్ రెడ్డి -రూ. 4,500
1996లో కొలను క్రిష్ణా రెడ్డి-రూ . 18,000
1997లో కొలను క్రిష్ణా రెడ్డి -రూ. 28,000
1998లో కొలను మోహన్ రెడ్డి -రూ. 51,000
1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి -రూ. 65,000
2000లో కల్లెం అంజిరెడ్డి -రూ. 66,000
2001 జి. రఘునందన్ చారి -రూ. 85,000
2002లో కందాడ మాధవ రెడ్డి -రూ. 1,05,000
2003లో చిగిరింత బాల్ రెడ్డి -రూ. 1,55,000
2004లో కొలను మోహన్ రెడ్డి -రూ.2,01,000
2005లో ఇబ్రాం శేఖర్ -రూ.2,08,000
2006లో చిగిరింత తిరుపతి రెడ్డి -రూ.3,00,000
2007లో జి. రఘునందన్ చారి -రూ.4.15,000
2008లో కొలను మోహన్ రెడ్డి -రూ.5,07,000
2009లో సరిత -రూ.5,10,000
2010లో కొడాలి శ్రీధర్ బాబు -రూ.5,35,000
2011లో కొలను బ్రదర్స్ -రూ.5,45,000
2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి -రూ. 7,50,000
2013లో తీగల క్రిష్ణారెడ్డి -రూ. 9,26,000
2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ. 9,50,000
2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి -రూ. 10,32,000
2016లో స్కైలాబ్ రెడ్డి -రూ. 14.65,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement