
సాక్షి, శ్రీకాకుళం : నగరంలో మొండేటివీధి శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో వినాయకచవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీగణపతి ఆలయ వాట్సాప్ గ్రూప్ ద్వారా లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ పాటలో నగరానికి చెందిన ఎన్.కిరణ్, కె.గోవింద్, అమరావతి శ్రీను, ఎస్.శ్రీను, జె.నవీన్‌లు సంయుక్తంగా రూ.1.03 లక్షలకు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఆలయం వద్ద స్వామివారి లడ్డూ ప్రసాదానికి అర్చకులు బద్రం కోదండరామాచార్యులు, బద్రం మాధవాచార్యులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి సమక్షంలో మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.