సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో లంబోదరుడి లడ్డూ ప్రసాదాలకు ఉన్న క్రేజ్ ఆ ‘ధర’హో అనిపిస్తోంది. లడ్డూ ప్రసాదమంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగే బాలాపూర్ లడ్డూ ధరను ఈసారి ఫిల్మ్‌నగర్ బస్తీ వినాయక్ నగర్ గణపతి లడ్డూ ధర దాటేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ కన్నా వినాయక్ నగర్ లడ్డూ ధర ఎక్కువ పలికింది. బీజీపీ నేత పల్లపు గోవర్ధన్ ఈ లడ్డూను రూ.17.75 లక్షలకు సొంతం చేసుకున్నారు. గత ఏడాది వినాయక్ నగర్ లడ్డూ రూ.15.1 లక్షలు పలికి నగరంలో రెండో స్థానం దక్కించుకుంది. ఇక ఈ ఏడాది బాలాపూర్ వినాయకుడి లడ్డూ 17.60 లక్షలు పలికింది. దీన్ని కొలను రాంరెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment