new records
-
మహీంద్రా ఈవీల రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా తయారీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఎక్స్ఈవీ–9ఈ, బీఈ–6 సరికొత్త రికార్డు సృష్టించాయి. తొలి రోజు 30,179 యూనిట్ల బుకింగ్స్‌తో ఈవీ రైడ్‌కు సిద్ధం అయ్యాయి. ఎక్స్‌షోరూం ధర వద్ద వీటి విలువ రూ.8,472 కోట్లు. బుకింగ్స్‌లో ఎక్స్ఈవీ–9ఈ వాటా 56 శాతం నమోదైంది. ఈ రెండు మోడళ్లలో కలిపి అధిక సామర్థ్యం ఉన్న వేరియంట్స్‌కు వినియోగదార్లు మొగ్గుచూపారు. 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచిన ప్యాక్–3ని 73 శాతం కస్టమర్లు ఎంచుకున్నారు. ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్కెట్ మళ్లుతోందనడానికి ఈ బుకింగ్స్ నిదర్శనంగా నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 99,068 యూనిట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో మహీంద్రా కొత్త ఈవీల రికార్డు స్థాయి బుకింగ్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎక్స్ఈవీ–9ఈ, బీఈ–6 డెలివరీలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు మోడళ్లూ 59 కిలోవాట్ అవర్, 79 కిలోవాట్ అవర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఆప్షన్స్‌తో తయారయ్యాయి. ఒకసారి చార్జ్ చేస్తే వేరియంట్‌ను బట్టి 535–682 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. -
ఈపీఎఫ్‌వో రూ.2 లక్షల కోట్ల క్లెయిమ్‌లు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యుల క్లెయిమ్‌ల పరిష్కారంలో కొత్త రికార్డులకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సభ్యులకు సంబంధించి రూ.2,05,932 కోట్ల విలువైన క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో ఆమోదించినట్టు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. మొత్తం పరిష్కరించిన క్లెయిమ్‌ల సంఖ్య 5.08 కోట్లను చేరుకున్నట్టు తెలిపింది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలు మిగిలి ఉండగా, అప్పుడే గతేడాది క్లెయిమ్ గణాంకాలను ఈ ఏడాది అధిగమించడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 4.45 కోట్ల క్లెయిమ్‌లకు గాను చేసిన చెల్లింపులు రూ.1,82,838 కోట్లుగా ఉన్నాయి. క్లెయిమ్ పరిష్కారాల ప్రక్రియ పురోగతికి, ఫిర్యాదుల పరిష్కారం దిశగా ఈపీఎఫ్‌వో చేపట్టిన సంస్కరణల వల్లే ఈ ఘనత సాధించినట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ తెలిపారు. క్లెయిమ్‌లను ఆటోమేటిగ్గా పరిష్కరించడం, సభ్యుల ప్రొఫైల్ మార్పులను సులభతరం చేయడం, పీఎఫ్ సాఫీ బదిలీకి వీలు కల్పించడం వంటి చర్యలను మంత్రి ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో క్లెయిమ్ పరిష్కారాలు రెట్టింపై 1.87 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆటో క్లెయిమ్ పరిష్కారాలు 89.52 లక్షలుగా ఉన్నాయి. -
బాక్సాఫీస్ వద్ద 'పుష్ప 2' జోరు.. 900 కోట్ల క్లబ్ లో పుష్ప రాజ్..
-
సుజుకీ యాక్సెస్ 125 రికార్డు
ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 మోడల్లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే. దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్‌కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్‌లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.మూడవ స్థానంలో కంపెనీ..దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్‌లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఇది రూపుదిద్దుకుంది. 5,500 ఆర్పీఎం వద్ద 10 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు. -
10,000 మార్కుకు బీఎండబ్ల్యూ–మినీ
ముంబై: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ గ్రూప్ భారత్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. 17 ఏళ్ల కంపెనీ చరిత్రలో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లు దేశీయంగా 10,000 యూనిట్ల మార్కును తొలిసారిగా దాటాయి. గతేడాదితో పోలిస్తే 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య 10 శాతం వృద్ధితో 10,556 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో 10,056 బీఎండబ్ల్యూ, 500 యూనిట్లు మినీ బ్రాండ్‌లో విక్రయించింది. 2023 జనవరి–సెపె్టంబర్ మధ్య రెండు బ్రాండ్లలో కలిపి మొత్తం 9,580 యూనిట్లు రోడ్డెక్కాయి. మోటరాడ్ బ్రాండ్‌లో 5,638 యూనిట్ల మోటార్‌సైకిల్స్ సైతం అమ్ముడయ్యాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో విక్రమ్ పావా తెలిపారు. బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లలో ఈ ఏడాది 725 ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై పరుగుతీస్తున్నాయని చెప్పారు. భారత్‌లో లగ్జరీ కార్ల రంగంలో 2,000 యూనిట్ల ఈవీల అమ్మకాల మార్కును దాటిన తొలి కంపెనీగా స్థానం సంపాదించామన్నారు. బీఎండబ్ల్యూ భారత్‌లో శుక్రవారం ఎం4 సీఎస్ లగ్జరీ స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.89 కోట్లు. -
బుల్.. కొత్త రికార్డుల్!
ముంబై: ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గింపు, అమెరికా, ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు కలిసిరావడంతో దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. సెన్సెక్స్ 1,360 పాయింట్లు ఎగసి తొలిసారి 84 వేల స్థాయిపైన 84,544 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 375 పాయింట్లు పెరిగి 25,750 ఎగువున 25,791 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది ఇది సరికొత్త రికార్డు ముగింపు. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,510 పాయింట్లు బలపడి 84,694 వద్ద, నిఫ్టీ 433 పాయింట్లు ఎగసి 25,849 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు, మెటల్, ఆటో, రియల్టీ రంగాలకు చిన్న, మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.37%, 1.16 శాతం చొప్పున పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ పది పైసలు పెరిగి 83.55 స్థాయి వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. యూరప్ మార్కెట్ల ఒకటిన్నర శాతం నష్టపోయాయి. రంగాల వారీగా రియల్టీ ఇండెక్స్ 3.21%, ప్రైవేటు రంగ బ్యాంక్ సూచీ 3%, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్సు 2.32% లాభపడ్డాయి. ఆటో, ఇండ్రస్టియల్, మెటల్, కన్జూమర్ సూచీలు 2% పెరిగాయి. → పసిడి రుణాల వ్యాపారంపై గతంలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేయడంతో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు భారీగా లాభపడింది. బీఎస్ఈలో 7% పెరిగి రూ.531 వద్ద స్థిరపడింది.→ ఐటీడీ సిమెంటేషన్ ఇండియా షేరు 20% లాభపడి రూ.566 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. ఈ కంపెనీలో అదానీ ఈ కంపెనీలో 46.64% వాటా కొనుగోలు చేయ నుందన్న వార్తలతో ఈ షేరుకుడిమాండ్ నెలకొంది. → సెన్సెక్స్ 1,330 పాయింట్లు ర్యాలీ చేయడంతో ఒక్కరోజులో రూ.6.24 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.472 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌లో 30కి గానూ 26 షేర్లు లాభపడ్డాయి. నాలుగు షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఈ ఏడాదిలో ఒక్క ట్రేడింగ్ సెషన్లోనే 1000కి పైగా పాయింట్లు లాభపడటం ఇది పదోసారి కావడం విశేషం. → ఐసీఐసీఐ(4%), హెచ్డీఎఫ్సీ బ్యాంకు(2%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం 1,360 పాయింట్లలో సగ భాగం ఈ షేర్ల నుంచి వచ్చాయి. ఇంట్రాడేలో ఐసీఐసీఐ బ్యాంకు అయిదున్నర శాతం ర్యాలీ చేసి రూ.1361 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. -
సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త శిఖరాలకు
ముంబై: ఫైనాన్స్, ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో దేశీ సూచీలు గురువారం ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. రిలయన్స్, టాటా మోటార్స్, ఐటీసీ వంటి అధిక వెయిటేజీ షేర్లూ రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 500 పాయింట్లు ఎగసి 82,283 వద్ద కొత్త రికార్డు నమోదు చేసింది. చివరికి 349 పాయింట్ల లాభంతో 82,135 రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ సూచీకిది ఎనిమిదో రోజు లాభాల ముగింపు. వరుసగా 11వ రోజూ లాభాలు కొనసాగించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 25,152 వద్ద స్థిరపడింది. ఒక దశలో 141 పాయింట్లు బలపడి 25,193 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.51% పెరిగి రూ.3,041 వద్ద స్థిరపడింది. ఏజీఎంలో ముకేశ్ అంబానీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించడంతో ఇంట్రాడేలో 2.63 శాతం ర్యాలీ చేసి రూ.3,075 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,390 కోట్లు పెరిగి రూ.20.57 లక్షల కోట్లకు చేరింది. తన అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సరీ్వసెస్‌లో ‘డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్’కు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించడంతో పేటీఎం షేరు 3% పెరిగి రూ.554 వద్ద ముగిసింది. -
నిఫ్టీ.. సిల్వర్ జూబ్లీ!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో గురువారం ఓ మరపురాని అద్భుతం చోటు చేసుకుంది. జాతీయ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ ఎన్ఎస్ఈ తొలిసారి 25,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. సెపె్టంబర్లో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలతో ఆయిల్‌అండ్‌గ్యాస్, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగి 81,868 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 25 వేల స్థాయిపైన 25,011 వద్ద నిలిచింది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 388 పాయింట్లు బలపడి 82,129 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు ఎగసి 25,078 వద్ద జీవితకాల గరిష్టాలు అందుకున్నాయి. పశి్చ మాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో మిడ్‌సెషన్ నుంచి గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ఎఫ్ఎంసీజీ, ఐటీ, యుటిలిటీ, టెక్ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో ముగిశాయి. కాగా అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.25,000 ప్రయాణం ఇలా.. → 1996, ఏప్రిల్ 22న 13 కంపెనీల లిస్టింగ్‌తో నిఫ్టీ సూచీ 1000 పాయింట్ల వద్ద ప్రయాణం ప్రారంభించింది. తొలినాళ్లలో దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత (1996–98), తర్వాత ఆసియా ఆర్థిక సంక్షోభం, డాట్‌కామ్ బబుల్, ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2007) ప్రతికూల ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ తొలిసారి 5,000 పాయింట్లను చేరేందుకు 11 ఏళ్లు పట్టింది.→ సత్యం కుంభకోణం, యూరోపియన్ రుణ సంక్షోభం, ట్యాపర్ తంత్రం, జీఎస్టీ అమలు సవాళ్ల ఆటుపోట్లను ఎదుర్కొని 25 జూలై 2017న 10,000 మైలురాయిని చేరింది.→ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, కార్పొరేట్ పన్ను, కోవిడ్ మహమ్మారి సూచీని పట్టి కుదిపాయి. కరోనా తొలి వేవ్ సమయంలో 7,600కు పడిపోయిన నిఫ్టీ కేవలం 220 రోజుల్లోనే రెండింతలకు కోలుకోవడం విశేషం. ఈ క్రమంలో 5 ఫిబ్రవరి 2021న 15,000 స్థాయిని అందుకుంది. → కరోనా వేళ పెంచిన వడ్డీరేట్లను తగ్గించేందుకు, పెరిగిన ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్‌తో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు ప్రారంభం ప్రక్రియ ప్రారంభించాయి. ఇదే సమయంలో ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్ధ భయాలు తెరపైకి వచ్చాయి. ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కొని గతేడాది (2023) సెపె్టంబర్ 11న 20,000 స్థాయికి చేరింది. → ఇక 20,000 స్థాయి నుండి 25000 పాయింట్లు చేరేందుకు 220 ట్రేడింగ్ సెషన్ల సమయం తీసుకుంది. సూచీకి ఇదే అత్యంత వేగవంతమైన 5,000 పాయింట్ల లాభం. -
మేలో ఈక్విటీ ఫండ్స్ హవా..!
న్యూఢిల్లీ: గత నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)కు ఇన్వెస్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ మే నెలలో రూ. 34,697 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 83 శాతం అధికంకాగా.. అప్పుడప్పుడూ మార్కెట్లో నమోదైన దిద్దుబాట్లు ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు అవకాశాలను కలి్పంచాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా థిమాటిక్ ఫండ్స్‌పట్ల ఆకర్షితులైనట్లు దేశీ ఎంఎఫ్ అసోసియేషన్(యాంఫీ) పేర్కొంది. ఈ బాటలో క్రమబద్ధ పెట్టుబడి పథకాల(సిప్)కు సైతం రూ. 20,904 కోట్ల పెట్టుబడులు లభించినట్లు వెల్లడించింది. ఇది కూడా సరికొత్త రికార్డ్‌కావడం గమనార్హం! హెచ్చుతగ్గుల్లోనూ ఇటీవల మార్కెట్లలో ఆటుపోట్లు కొనసాగినప్పటికీ ఇన్వెస్టర్లు ఈక్విటీలపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు భారీ పెట్టుబడులు తెలియజేస్తున్నాయి. వెరసి ఈక్విటీ ఫండ్స్‌లోకి వరుసగా 39వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు ప్రవేశించాయి. ఏప్రిల్‌లో సిప్ పెట్టుబడులు రూ. 20,371 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో వరుసగా రెండో నెలలోనూ సిప్‌లో రూ. 20,000 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు సిప్‌లో ఇన్వెస్ట్ చేసే సంగతి తెలిసిందే. ఇక మొత్తంగా ఎంఎఫ్ పరిశ్రమకు మే నెలలో రూ. 1.1 లక్ష కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌లో ఇవి రూ. 2.4 లక్షల కోట్లుకావడం గమనార్హం! ఫలితంగా ఎంఎఫ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) ఏప్రిల్‌లో నమోదైన రూ. 57.26 లక్షల కోట్ల నుంచి మే చివరికల్లా రూ. 58.91 లక్షల కోట్లకు బలపడింది. స్మాల్ క్యాప్స్ జోరు చిన్న షేర్ల(స్మాల్ క్యాప్స్) విభాగం మే నెలలో 23 శాతం వృద్ధితో రూ. 2,724 కోట్ల పెట్టుబడులను అందుకుంది. అయితే లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు రూ. 663 కోట్లు మాత్రమే లభించాయి. అంటే ప్రత్యేకించిన, అధిక రిటర్నులు అందించే అవకాశాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీర్ఘకాలంగా మార్కెట్లలో అప్‌ట్రెండ్ కొనసాగుతుండటంతో మధ్యమధ్యలో వస్తున్న దిద్దుబాట్లను ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు అవకాశాలుగా వినియోగించుకుంటున్నట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. కొటక్ మహీంద్రా ఏఎంసీ సేల్స్ నేషనల్ హెడ్ మనీష్ మెహతా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదన్న అంచనాలు సైతం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టనుందన్న అంచనాలు మార్కెట్లలో మరింత ర్యాలీకి కారణమవుతుందన్న ఆలోచన కొనుగోళ్లకు దారి చూపుతున్నట్లు వివరించారు. దేశ ఆర్థిక వృద్ధిపట్ల విశ్వాసంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు క్యూ కడుతున్నట్లు ఫైయర్స్ వైస్‌ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. ఇక ఈక్విటీలుకాకుండా రుణ పథకాల విభాగంలోనూ రూ. 42,495 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై ఆసక్తి చూపడం ప్రభావం చూపింది. అయితే ఏప్రిల్‌లో నమోదైన రూ. 1.9 లక్షల కోట్లతో పోలిస్తే పెట్టుబడులు 78 శాతం క్షీణించాయి. రుణ పథకాలలో లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా రూ. 25,873 కోట్లు ఆకట్టుకుని రికార్డ్ నెలకొల్పాయి. ఈఎల్ఎస్ఎస్ మినహా ఈక్విటీ ఆధారిత ఎంఎఫ్‌లలో నికర పెట్టుబడులు రూ. 25 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించి రూ. 25.39 లక్షల కోట్లకు చేరాయి. ఇది చరిత్రాత్మక గరిష్టమని యాంఫీ సీఈవో వెంకట్ చలసాని తెలియజేశారు. ఫోకస్డ్, ఈక్విటీ లింక్డ్ పొదుపు పథకాలు(ఈఎల్ఎస్ఎస్) విభాగాలను మినహాయించి చూస్తే ఇతర విభాగాలకు నికరంగా పెట్టుబడులు తరలి వచి్చనట్లు పేర్కొన్నారు. సెక్టార్, థిమాటిక్ ఫండ్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. దీంతో మే నెలలో రూ. 19,213 కోట్లు లభించాయి. ప్రధానంగా హెచ్డీఎఫ్సీ మ్యాన్యుఫాక్చరింగ్ ఫండ్ నుంచి వెలువడిన కొత్త ఆఫరింగ్(ఎన్ఎఫ్వో) రూ. 9,563 కోట్లు అందుకోవడం ఇందుకు సహకరించింది. -
సీపీఐ పుష్.. మార్కెట్ రికార్డ్స్
ముంబై: గత నెలలో సీపీఐ ఆర్బీఐ లక్ష్యం 6 శాతానికంటే తక్కువగా 4.75 శాతానికి దిగిరావడంతో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదిలాయి. వెరసి సెన్సెక్స్ 204 పాయింట్లు ఎగసి 76,811 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 539 పాయింట్లు జంప్‌చేసింది. ఇక నిఫ్టీ 76 పాయింట్లు పుంజుకుని 23,399 వద్ద స్థిరపడింది. తొలుత 158 పాయింట్లు ఎగసి 23,481ను తాకింది. ఇవి సరికొత్త రికార్డులుకావడం విశేషం! కాగా.. తాజా సమీక్షలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల యథాతథ కొనసాగింపునకే కట్టుబడింది. ద్రవ్యోల్బ ణం తక్కువగానే నమోదవుతున్నప్పటికీ ఈ ఏడాది వడ్డీ రేట్లలో ఒకసారి మాత్రమే కోత విధించవచ్చని పేర్కొనడం గమనార్హం! రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియలీ్ట, క న్జూమర్ డ్యురబుల్స్, ఐటీ 2.2–1% మధ్య బలపడగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ 1% స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్ ఫైనాన్స్ 5% జంప్‌చేయగా.. ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్, టైటన్, ఎల్టీఐఎం, ఇండస్ఇండ్, టెక్ఎం, టీసీఎస్, విప్రో, అ్రల్టాటెక్ 3–1 మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ 1.6–1% మధ్య క్షీణించాయి. మార్కెట్ క్యాప్ @ 431.67 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. గత రెండు రోజుల్లో రూ. 4.72 లక్షల కోట్లు జమకావడంతో రూ. 431.67 లక్షల కోట్లను(5.17 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంట్రాడేసహా ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 77,145 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 23,481కు చేరింది. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. -
డివిడెండ్ జోష్.. సూచీలు ఖుష్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)బోర్డు కేంద్ర ప్రభుత్వానికి రూ.2.1 లక్షల కోట్ల భారీ డివిడెండ్ ఇచ్చేందుకు ఆమోదం తెలపడంతో గురువారం స్టాక్ సూచీలు సరికొత్త రికార్డు్డలు నెలకొల్పాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో విశ్వాస్వాన్ని నింపాయి. అలాగే దేశంలో ఎగుమతులు పెరగడంతో పాటు మే నెలలో ఉద్యోగ కల్పన 18 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు వెల్లడైన గణాంకాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సూచీలు దాదాపు 2% ర్యాలీ చేసి ఈ జనవరి 29 తర్వాత అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,197 పాయింట్లు పెరిగి 75,418 ముగిసింది. నిఫ్టీ 370 పాయింట్లు బలపడి 22,968 వద్ద నిలిచింది.కొనుగోళ్ల జోరు – రికార్డు హోరు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం ఫ్లాటుగా మొదలయ్యాయి. మెటల్, ఫార్మా మినహా అన్ని రంగాల్లో కొనుగోళ్ల వెల్లువెత్తడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదలాడాయి. మిడ్‌సెషన్ నుంచి ఆర్బీఐ డివిడెండ్ ప్రకటనల బలపడటంతో ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. దశలో సెన్సెక్స్ 1,279 పాయింట్లు దూసుకెళ్లి 75వేల స్థాయిపైన 75,500 వద్ద, నిఫ్టీ 396 పాయింట్లు బలపడి 22,968 వద్ద జీవిత కాల గరిష్టాలను నమోదు చేశాయి. జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకుపోవచ్చని నిపుణులు భావించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆర్బీఐ భారీ డివిడెండ్ మరోసారి స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడొచ్చన్న అంచనాలు సూచీల పరుగుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.→ జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో రూ.4.28 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.420 లక్షల కోట్లకు చేరింది. → అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ అదానీ గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ బీఎస్ఈ సెన్సెక్స్‌లో చోటు దక్కనుండడంతో ఈ గ్రూప్‌లోని తక్కిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మొత్తం గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17.23 లక్షల కోట్లకు చేరింది. → మెప్పించిన గో డిజిట్ ఆన్లైన్ వేదికగా బీమా సేవలు అందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేరు లిస్టింగ్ మెప్పించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.272)తో పోలిస్తే 3% లాభంతో ప్రీమియంతో రూ.281 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 15% ఎగసి రూ.314 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 12% లాభంతో రూ.306 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.28,043 కోట్లుగా నమోదైంది. → ఎన్ఎస్ఈ రికార్డ్ఎన్ఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. గతేడాది డిసెంబర్లో 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని అందుకుంది. -
జీఎస్టీ రికార్డు వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక రికార్డు సృష్టించాయి. సమీక్షా నెల్లో 2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటి రికార్డు. అంటే సమీక్షా నెల్లో వార్షిక ప్రాతిపదికన 12.4 శాతం పురోగతి నమోదయ్యిందన్నమాట. ఆర్థిక క్రియాశీలత, దిగుమతుల పురోగతి వంటి అంశాలు జీఎస్టీ రికార్డుకు కారణమయ్యింది. విభాగాల వారీగా ఇలా... ⇒ మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.2,10,267 కోట్లు. ⇒ సెంట్రల్ జీఎస్టీ రూ.43,846 కోట్లు. ⇒ స్టేట్ జీఎస్టీ రూ.53,538 కోట్లు. ⇒ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.99,623 కోట్లు ⇒ సెస్ రూ.13,260 కోట్లు (దిగుమతులపై రూ.1,008 కోట్లుసహా) ఏపీలో 12%, తెలంగాణలో 11% వృద్ధి కాగా, జీఎస్టీ ఇంటర్ గవర్నమెంట్ సెటిల్మెంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి కేంద్ర జీఎస్టీకి రూ.50,307 కోట్లు, రాష్ట్ర జీఎస్టీకి రూ.41,600 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. దీంతో మొత్తంగా కేంద్ర జీఎస్టీగా రూ.94,153 కోట్లు, రాష్ట్ర జీఎస్టీగా రూ.95,138 కోట్ల ఆదాయం సమీక్షా నెల్లో సమకూరినట్లయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు వృద్ధిని కనబరిచాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 12% వృద్ధితో రూ.4,850 కోట్లు, తెలంగాణలో 11% వృద్ధితో రూ.6,236 కోట్లు నమోదయ్యాయి. అయితే దేశంలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వసూళ్లు 13 శాతం వృద్ధితో రూ.37,671 కోట్లకు ఎగశాయి. గత ఆర్థిక సంవత్సరంలో నుంచి (అంకెలు రూ. లక్షల కోట్లలో) ఏప్రిల్ 2023 1.87 మే 1.57 జూన్ 1.61 జూలై 1.60 ఆగస్టు 1.59 సెపె్టంబర్ 1.63 అక్టోబర్ 1.72 నవంబర్ 1.67 డిసెంబర్ 1.64 జనవరి 2024 1.74 ఫిబ్రవరి 1.68 మార్చి 1.78 ఏప్రిల్ 2.102017జూలైలో తాజా పరోక్ష పన్ను వ్యవస్థ జీఎస్టీ ప్రారంభమైన తర్వాత 2024 ఏప్రిల్, 2023 ఏప్రిల్, 2024 మార్చి, 2024 జనవరి, 2023 అక్టోబర్ ఇప్పటి వరకూ టాప్–5 జీఎస్టీ నెలవారీ వసూళ్లను నమోదుచేశాయి. -
పసిడి పరుగు ఎందాక?
పసిడి అందకుండా పరుగెడుతోంది. జీవితకాల గరిష్ట ధరల్లో ట్రేడ్ అవుతూ, ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటికే మూడు నెలల్లో సుమారు 20 శాతం బంగారం విలువ ప్రియంగా మారింది. కరోనా సంక్షోభం నుంచి చూస్తే 70 శాతం ఎగసింది. 10 గ్రాముల బంగారం ధర రూ.74,500 దాటింది. భారతీయులకు బంగారం అంటే సహజంగానే ఎంతో మక్కువ. పేద వారి నుంచి, ధనికుల వరకు ఎవరి స్థాయిలో వారు బంగారం కలిగి ఉంటారు. ధర ఇలా పెరిగిపోతుంటే, ఇక తాము కొనలేని స్థాయికి బంగారం చేరుకుంటుందా? అన్న గుబులు కొందరిలో మొదలైంది. ఈ తరుణంలో అసలు పసిడెందుకు ఇలా పరుగులు తీస్తోంది? ఇది ఎంత వరకు? దీనిపై మార్కెట్ అనలిస్టుల విశ్లేషణ చూద్దాం. ఆర్బీఐ దూకుడు గత ఏడాది 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి నాటికి ఆర్బీఐ 13 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆర్బీఐ నిర్వహణలోని బంగారం నిల్వలు 817 టన్నులకు చేరాయి. విదేశీ మారక నిల్వల్లో వైవిధ్యానికి వీలుగా, రిస్క్ తగ్గించుకునేందుకు బంగారం నిల్వలను ఆర్బీఐ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ 6 టన్నుల బంగారం నిల్వలు పెంచుకుంది. అంతకుముందు జనవరిలో 8.7 టన్నులను కొనుగోలు చేసింది. 2022 జూలై తర్వాత ఒక నెలలో గరిష్ట కొనుగోళ్లు ఇవి. ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ప్రకారం సెంట్రల్ బ్యాంక్‌లు అన్నీ కలసి ఫిబ్రవరిలో 19 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. అత్యధికంగా చైనా 12 టన్నులు కొంది. జనవరిలో టర్కీ 11.8 టన్నులు, చైనా 10 టన్నులు, కజకిస్థాన్ 6.2 టన్నుల చొప్పున బంగారం కొన్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యాంక్‌లు 64 టన్నుల బంగారం కొన్నాయి. 2023 మొదటి 2 నెలలతో పోలిస్తే 43% తక్కువ కాగా, 2022 మొదటి 2 నెలలతో పోల్చితే 4 రెట్లు అధికం. ఇక ముందూ సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి డిమాండ్ కొనసాగొచ్చన్నది అనలిస్టుల అంచనా. అదే సమయంలో మార్కెట్ అంచనా వేసినట్టు ఫెడ్ రేట్ల కోత జూన్ లేదా సమీప కాలంలో లేకపోతే, అది బంగారం ధరల ర్యాలీకి బ్రేక్ వేయవచ్చని టీడీ సెక్యూరిటీస్ కమోడిటీ స్ట్రాటజీస్ హెడ్ వార్ట్ మెలెక్ పేర్కొన్నారు. కాకపోతే మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పసిడిలో రాబడికే అవకాశాలు ఉంటాయన్నది అనలిస్టుల అభిప్రాయం. మన దగ్గర కొంచెం ఎక్కువే దేశీయ మార్కెట్ అనే కాదు, అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఔన్స్ బంగారం (31.10 గ్రాములకు సమానం) ధర 2,400 డాలర్లకు చేరింది. రూపాయల్లోకి మార్చి చూస్తే దేశీయ మార్కెట్లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.64,370గానే ఉండాలి. కానీ, ఇంతకంటే అధికంగా మన మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. బంగారం దిగుమతి చేసుకునే లోహం. కనుక డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ దిగుమతి ధరలను నిర్ణయిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. రూపాయి విలువ క్షీణిస్తున్న కొద్దీ, అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధర మధ్య అంతరం పెరుగుతూ వెళుతుంది. దీనికి తోడు బంగారం దిగుమతులపై కేంద్ర సర్కారు కస్టమ్స్ సుంకాన్ని కూడా వసూలు చేస్తుంటుంది. బంగారం, వెండిపై ప్రస్తుతం ఈ సుంకం 15 శాతంగా ఉంది. ఇవన్నీ కలిసి దేశీయ మార్కెట్లో బంగారం ధర అధికంగా ఉండేలా చేస్తున్నాయి. ఎందుకంటే..? బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా ర్యాలీ చేస్తుండడం వెనుక పలు కారణాలను మార్కెట్ నిపుణులు, అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికా సహా అన్ని ప్రముఖ దేశాల్లోనూ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లోనే చలిస్తున్నాయి. ఇక్కడి నుంచి తగ్గడమే కానీ, పెరగడానికి అవకాశాల్లేవు. సమీప కాలంలోనే వడ్డీ రేట్ల తగ్గింపు మొదలవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యూఎస్ ఫెడ్ జూన్ నుంచే రేట్ల కోతను మొదలు పెడుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. ‘‘పసిడి ధర మరో రికార్డు స్థాయికి చేరింది. డాలర్ ఇండెక్స్ బలంగానే ఉన్నప్పటికీ బంగారం ర్యాలీ కొనసాగుతోంది. యూఎస్ ఫెడ్ మానిటరీ పాలసీని సులభతరం చేస్తుందన్న అంచనాలు పెరిగాయి. మధ్య ప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు మరింత క్షీణించడం కూడా కారణమే. బంగారం, వెండి ధరలు ఇటీవల ర్యాలీకి చైనా దూకుడైన కొనుగోళ్లు సైతం మద్దతునిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకులు స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. ఈ ఏడాది ప్రముఖ దేశాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అనిశ్చితి కూడా ఒక కారణమే. ఈ పరిస్థితుల్లో బంగారం సురక్షిత సాధనంగా ఆకర్షిస్తోంది’’అని ఎస్ఎస్ వెల్త్ స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్దేవ తెలిపారు. ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపైకి విస్తరించింది. ఇది కూడా బంగారం ధరల ఆజ్యానికి కారణమైనందన్నది కొందరు విశ్లేషుకుల అంచనాగా ఉంది. ఎంత వరకు..? మొత్తం మీద బంగారం ధరల ధోరణి బుల్లిష్‌గా ఉన్నట్టు, మధ్యలో ధరలు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా చూడొచ్చని సుగంధ సచ్దేవ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, భౌగోళిక రాజకీయ అంశాలు ఏ విధంగా మారుతున్నాయనే దానిపై దృష్టి సారించాలన్నారు. ‘‘బంగారం ధర సాంకేతికంగా రూ.69,600ను ఛేదించి అంతకుపైన ముగిసింది. ఇది పసిడి ర్యాలీకి మద్దతునిచ్చేది. ఇక్కడి నుంచి పసిడి ధర తగ్గితే మధ్య కాలం నుంచి దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు అవకాశంగా చూడొచ్చు’’అని ప్రభుదాస్ లీలాదర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ షిజు కూత్తుపలక్కల్ సూచించారు. సురక్షిత సాధనం ఆర్థిక అనిశి్చతుల్లో, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో బంగారానికి డిమాండ్ సాధారణ రోజులతో పోలిస్తే అధికమవుతుంది. ఈక్విటీలు, డాలర్ తదితర సాధనాల నుంచి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బంగారంలోకి పెట్టుబడులు మళ్లిస్తుంటారు. చారిత్రకంగా చూస్తే ఇతర సాధనాల కంటే బంగారంలో అస్థిరతలు తక్కువ. అందుకే ఆ సమయంలో ఇన్వెస్టర్లు పసిడిని నమ్ముకుంటారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడల్లా బంగారం ర్యాలీ చేస్తుండడం సహజంగానే కనిపిస్తుంది. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల అది ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుంది. పైగా ముడి చమురు ధరలు మరోసారి పెరగడం మొదలైంది. ఇది కూడా ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం సమయలో పెట్టుబడుల విలువ కాపాడుకునేందుకు హెడ్జింగ్‌గా బంగారం మించిన సాధనం లేదు. చారిత్రకంగా చూస్తే ఎక్కువ సందర్భాల్లో ఈక్విటీలు ర్యాలీ చేసినప్పుడు బంగారం ధరలు తగ్గేవి. కానీ, ఈ విడత ఈక్విటీలతో పాటు బంగారం కూడా ర్యాలీ చేయడానికి ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు, డాలర్ విలువ స్థిరత్వం విషయంలో సెంట్రల్ బ్యాంకుల్లో నమ్మకం సడలడమే ఒక కారణంగా కనిపిస్తోంది. యూఎస్ ద్రవ్యలోటు 6.2 శాతానికి, రుణం జీడీపీలో 120 శాతానికి చేరడం కూడా బంగారం ధరల ఆజ్యానికి కారణాల్లో ఒకటి. అమెరికా జీడీపీలో రుణ వడ్డీ వ్యయాలు 2015–2020 కాలంలో సగటున 1.4 శాతంగా ఉంటే, ఇప్పుడు 2.4 శాతానికి చేరాయి. ఈ వడ్డీ వ్యయాలు తగ్గించుకునేందుకు, గడువు తీరిన రుణాలను తక్కువ రేటుపై రీఫైనాన్స్ చేసుకునేందుకు వీలుగా ఫెడ్ నుంచి రేట్ల కోత రూపంలో సాయాన్ని అమెరికా ప్రభుత్వం ఆశిస్తున్న విషయాన్ని విస్మరించరాదు. రేట్ల కోత ఫిబ్రవరి మధ్య నుంచి ర్యాలీ ఫలితంగా బంగారం సాంకేతికంగా రూ.70,000 మార్క్ (10 గ్రాములు), ఔన్స్ 2,300 డాలర్లను దాటింది. రేట్ల కోతపై యూఎస్ ఫెడ్ మిశ్రమ సంకేతాలే ఇచి్చనప్పటికీ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ధరల ఒత్తిళ్లను తగ్గించేందుకు జూన్‌లోనే రేట్ల కోతను చేపట్టొచ్చన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయిఅని సుగంధ సచ్దేవ తెలిపారు. ముఖ్యంగా ఇటీవలే వెలువడిన అమెరికా నాన్ ఫార్మ్ పేరోల్ డేటా అంచనాలకు మించి ఉందని (తగ్గిన నిరుద్యోగం), ఇదే బంగారం, వెండి ధరల తాజా ట్రిగ్గర్‌కు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనుజ్ గుప్తా వెల్లడించారు. అవసరమా–పెట్టుబడా? పెరిగే ధరలు చూసి పసిడి వెంట పరుగులు తీయడం కాకుండా, ఎందుకు కొనుగోలు చేయాలన్న ప్రశ్న వేసుకోవాలి. రాబడి కోసం అయితే అది పెట్టుబడి అవుతుంది. తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి చేసే కేటాయింపులు 5–10% మించకూడదన్నది నిపుణుల సూచన. పైగా పెట్టుబడులు భౌతిక బంగారంపై ఉండకూడదు. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ)లో ఇన్వెస్ట్ చేసుకుంటే, పెరిగే విలువకు అదనంగా ఏటా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రెండు సాధనాల్లోనూ క్రమానుగత పెట్టుబడులు చేసుకోవచ్చు. ఎస్జీబీలను ఆర్బీఐ ఏటా పలు విడతలుగా జారీ చేస్తుంటుంది. ఈటీఎఫ్‌లను రోజువారీ స్టాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఆభరణాల కోసం అయితే తమకు కావాల్సినంత మేర బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. వెండి సంగతి? చారిత్రకంగా బంగారంతోపాటే వెండి పయనం కూడా సాగుతుంది. కానీ, ఇటీవలి కాలంలో బంగారం స్థాయిలో వెండి ధరల పెరుగుదల లేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఏప్రిల్ 8 నాటికి వెండి ధరలు 11 శాతం ర్యాలీ చేశాయి. పెట్టుబడుల కోణంలోనే కాకుండా, పారిశ్రామికంగానూ వెండి వినియోగం ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ తదితర పునరుత్పాదక ఇంధన ఎక్విప్మెంట్, ఎల్రక్టానిక్స్‌లో వెండి వినియోగిస్తుంటారు. చైనా మార్కెట్ కోలుకుంటుందన్న అంచనాలు వెండి ర్యాలీకి జోష్‌నిస్తున్నాయి. వెండి విషయంలో తాము బలమైన సానుకూలతతో ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ప్రకటించింది. కిలో వెండి తగ్గితే రూ.75,000 వరకూ కొనుగోలు చేసుకోవచ్చని, మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.92,000–1,00,000 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు ఇటీవలే నోట్‌ను విడుదల చేసింది. కొనేది ఎవరు? సెంట్రల్ బ్యాంక్‌లతోపాటు, వడ్డీ రేట్ల కోతపై అంచనాలతో ఇనిస్టిట్యూషన్లు (ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లు, పెన్షన్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్) బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వ్యక్తులు, ప్రైవేటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కూడా డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్‌లు అంతర్జాతీయంగా కరెన్సీని పెద్ద ఎత్తున ప్రింట్ చేస్తున్నాయి. ఇది వాటి కరెన్సీ విలువలకు ప్రతికూలం. పైగా భౌగోళిక ఉద్రిక్తతల ఫలితంగా నాన్ డాలర్ వాణిజ్య చెల్లింపుల వైపు కొన్ని దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఇది డాలర్‌కు ప్రతికూలం. ఈ పరిస్థితుల్లో విదేశీ మారకం నిల్వల్లో ఎక్కువ భాగం కరెన్సీ రూపంలోనే కలిగి ఉండడం అంత శ్రేయస్కరం కాదని ఆర్బీఐ సహా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు భావిస్తున్నాయి. కరెన్సీలతో పోలిస్తే బంగారమే స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుండడం గమనించాలి. మన దేశంలో ఇప్పటికీ అధిక శాతం మంది బంగారాన్ని విలువైన, పొదుపు సాధనంగా చూస్తున్నారు. బంగారం విలువ ఎప్పటికీ పెరిగేదే కానీ, తరిగేది కాదని, కష్టాల్లో ఆదుకుంటుందని ఎక్కువ మంది నమ్ముతుంటారు. ఫలితంగా దేశీయంగా బంగారానికి బలమైన డిమాండ్ కొనసాగుతూనే ఉంది. -
Stock Market: 75,000 @ రూ. 400 లక్షల కోట్లు
ఒక్క రోజు గ్యాప్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దుమ్మురేపాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 75,000 పాయింట్లపైన నిలవగా.. నిఫ్టీ 22,754 వద్ద ముగిసింది. వెరసి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మళ్లీ రూ. 400 లక్షల కోట్లను అధిగమించింది. తాజా ట్రేడింగ్‌లో చిన్న షేర్లకు సైతం కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికాలో ద్రవ్యోల్బణం మరోసారి కట్టుతప్పడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆలోచనకు చెక్పడే వీలుంది. దీంతో యూఎస్ మార్కెట్లు 1.3 శాతం డీలాపడి ట్రేడవుతున్నాయి. ముంబై: ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో రెండోసారి సరికొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు జంప్‌చేసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 75,038 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 111 పాయింట్ల వృద్ధితో కొత్త గరిష్టం 22,754 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 75,105 వద్ద, నిఫ్టీ 22,776 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ప్రభావంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1–0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు రూ. 2,27,025 కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 402 లక్షల కోట్ల(4.83 ట్రిలియన్ డాలర్లు) ఎగువకు చేరింది. ఫార్మా మినహా.. ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ప్రభుత్వ బ్యాంక్స్, చమురు, ఎఫ్ఎంసీజీ, మెటల్ 1.5 శాతంస్థాయిలో పుంజుకోగా.. ఫార్మా 0.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, హిందాల్కో, ఎయిర్టెల్, ఎస్బీఐ, అదానీ ఎంటర్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, ఐషర్, టెక్ఎం, ఆర్ఐఎల్ 3.6–1% మధ్య లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, మారుతీ, దివీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–1% మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మొత్తం ట్రేడైన షేర్లలో 1,904 లాభపడితే.. 1,939 బలహీనపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 2,778 కోట్లు, దేశీ ఫండ్స్ సైతం రూ. 163 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. మూడోరోజూ మెరిసిన పసిడి, వెండి పసిడి, వెండి ధరలు న్యూఢిల్లీలో వరుసగా మూడవ రోజు బుధవారం కూడా రికార్డుల ర్యాలీ చేశాయి. పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర ఒక దశలో లైఫ్‌టైమ్ హై రూ.72,000 తాకింది. అటు తర్వాత క్రితం ముగింపుతో పోలి్చతే రూ.200 లాభంతో రికార్డు స్థాయి రూ.71,840 వద్ద ముగిసింది. వెండి కూడా కేజీకి రూ.200 ఎగసి రూ.84,700 వద్ద ముగిసింది. పసిడి ధర గడచిన మూడు రోజుల్లో రూ.690 పెరగ్గా, వెండి ధర ఇదే కాలంలో రూ.1,500 పెరిగింది. కాగా, అంతర్జాతీయ బులిష్ ధోరణులు ఈ రెండు మెటల్స్ తాజా పెరుగుదలకు కారణంకాగా, బుధవారం వెలువడిన అమెరికాలో తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్లు తగ్గకపోవచ్చని భయాలతో బంగారం, వెండి తక్షణ ర్యాలీకి బ్రేక్ పడవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా, జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లు క్రితం ముగింపుతో పోల్చితే మైనస్‌లో ట్రేడవుతుండడం ఇక్కడ గమనార్హం. నకిలీ వీడియోలతో తస్మాత్ జాగ్రత్త! ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ స్టాక్ రికమండేషన్లు ఇస్తున్నట్లు అవాస్తవ(డీప్‌ఫేక్) వీడియోల సృష్టి జరిగినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం తాజాగా పేర్కొంది. ఆధునిక సాంకేతికతను తప్పుడు మార్గంలో వినియోగించడం ద్వారా ఎన్ఎస్ఈ లోగోసహా.. ఆశిష్‌కుమార్ ముఖం లేదా గొంతుతో షేర్ల సిఫారసులు చేస్తున్న ఫేక్ వీడియోలను నమ్మొద్దని హెచ్చరించింది. -
రికార్డులు బద్దలు కొట్టాల్సిందే: మోదీ
లక్నో: దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఉత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని చూసి ప్రతిపక్షాలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాలని, పాత రికార్డులన్నింటినీ బద్ధలు కొట్టేలా కష్టపడి పని చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొత్త రికార్డులు సృష్టించడమే మన లక్ష్యం కావాలన్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లో 10 లోక్‌సభ స్థానాల పరిధిలోని 22,648 పోలింగ్ బూత్‌లకు చెందిన బీజేపీ శ్రేణుల డిజిటల్ ర్యాలీని ఉద్దేశించి ‘నమో’ యాప్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎన్నికల్లో విజయం పోలింగ్‌బూత్ స్థాయిలో సాధించే విజయంపై ఆధారపడి ఉంటుందన్నారు. పోలింగ్ బూత్‌లో నెగ్గకపోతే ఎన్నికల్లో నెగ్గలేమని స్పష్టం చేశారు. రాబోయే సార్వత్రి ఎన్నికల్లో పోలింగ్ బూత్ స్థాయిల్లో రికార్డులను బద్ధలు కొట్టేలా పని చేయడం అని కార్యకర్తలకు సూచించారు. -
సరికొత్త శిఖరంపై నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లో వరుసగా అయిదో రోజూ లాభాలు కొనసాగడంతో నిఫ్టీ సూచీ సోమవారం సరికొత్త రికార్డు సృష్టించింది. ఫైనాన్స్, ఇంధన, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో 146 పాయింట్లు ఎగసి 22,187 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 82 పాయింట్ల లాభంతో రికార్డు ముగింపు 22,122 వద్ద స్థిరపడింది. ఆసియా ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనై సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే దేశీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే తేరుకోని లాభాల బాటపట్టాయి. నిఫ్టీ ఆల్‌టైం హై(22,187)ని నమోదు చేయగా.. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,882 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో ప్రభుత్వరంగ బ్యాంకులు, ఐటీ, రియల్టీ షేర్లలో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 72,708 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం సరికొత్త శిఖరం(22,122) వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.52 %, 1.29% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.755 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.453 కోట్ల షేర్లు కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, జపాన్, ఇండోనేసియా స్టాక్ సూచీలు మాత్రమే నష్టపోయాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ ఎక్సే్చంజీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా ప్రెసిడెంట్స్ హాలిడే కావడంతో అమెరికా మార్కెట్లు సోమవారం పనిచేయలేదు. మార్కెట్లు మరిన్ని సంగతులు ► తమ నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చడంతో పేటీఎం షేరు 5% లాభపడి రూ.359 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. ► క్యూ3లో నికర లాభం 33% వృద్ధి నమోదుతో క్రిసిల్ షేరు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 9.50% ర్యాలీ చేసి రూ.5,039 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 13% ర్యాలీ చేసి రూ.5196 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► తన అనుబంధ సంస్థ పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్‌ను ఐఆర్డీఏఐ ‘డైరెక్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్’ నుంచి ‘కాంపోసైట్ ఇన్యూరెన్స్ బ్రోకర్’గా అప్‌గ్రేడ్ చేయడంతో పీబీ ఫిన్‌టెక్ షేరు 8% ఎగబాకి రూ.1,004 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్ల సంపద.. ఆల్‌టైమ్ గరిష్టం మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.20 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.391.69 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. -
యాపిల్ ఇండియాకు ఐఫోన్ల జోష్
న్యూఢిల్లీ: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇండియా అక్టోబర్–డిసెంబర్ కాలానికి టర్నోవర్‌లో సరికొత్త రికార్డ్ సాధించింది. 2 శాతం వృద్ధితో 119.6 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది. ఇందుకు ఐఫోన్ విక్రయాల జోరు దోహదపడింది. వెరసి దేశీ అమ్మకాలలో కంపెనీ సరికొత్త రికార్డును నమోదు చేసినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. యాక్టివ్ డివైస్ల సంఖ్య 2.2 బిలియన్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. ఇది అన్ని ప్రొడక్టులలోనూ ఇది అత్యధికంకాగా.. ఐఫోన్ల నుంచి ఆదాయం 6 శాతం ఎగసి 69.7 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. మలేసియా, మెక్సికో, టర్కీ తదితర వర్ధమాన మార్కెట్లలోనూ కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు అందుకున్నట్లు కుక్ పేర్కొన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వివరాల ప్రకారం తొలిసారి 2023లో యాపిల్ అత్యధిక ఆదాయం అందుకోగా.. అమ్మకాల పరిమాణంలో శామ్సంగ్ ముందుంది. కోటి యూనిట్ల షిప్మెంట్ల ద్వారా యాపిల్ ఆదాయంలో టాప్ ర్యాంకును కొల్లగొట్టింది. అయితే ప్రస్తుత సమీక్షా కాలంలో ఐప్యాడ్ అమ్మకాలు 25 శాతం క్షీణించి 7 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. వేరబుల్, హోమ్, యాక్సెసరీస్ విభాగం విక్రయాలు సైతం 11 శాతం నీరసించి 11.95 బిలియన్ డాలర్లను తాకాయి. ఇక మ్యాక్ పీసీ అమ్మకాలు ఫ్లాట్‌గా 7.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సర్వీసుల ఆదాయం 11 శాతంపైగా పుంజుకుని 23.11 బిలియన్ డాలర్లకు చేరింది. -
గుంటూరు కారం కలెక్షన్స్ ఊచకోత..
-
పెంట్ హౌస్ రూ.1,133కోట్లు!
వామ్మో అనుకుంటున్నారా? కానీ ఇది నిజంగా నిజం. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన పామ్ జుమెరియా ప్రాంతంలో కడుతున్న కోమో రెసిడెన్సెస్ అనే 71 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఈ పెంట్ హౌస్ రానుంది. ఓ అజ్ఞాత కుబేరుడు దీన్ని ఏకంగా రూ.1,133 కోట్లకు కొనుక్కున్నాడు! ఈ ఐదు పడకగదుల పెంట్ హౌస్ విస్తీర్ణం 22 వేల చదరపు అడుగులు. ప్రపంచ రియల్టీ మార్కెట్లో అత్యంత ఎక్కువ ధర పలికిన మూడో పెంట్ హౌస్‌గా ఇది కొత్త రికార్డు సృష్టించింది. దుబాయ్ వరకూ అయితే దీనిదే రికార్డు. 2027లో కోమో టవర్ నిర్మాణం పూర్తయ్యాక ఇది కొనుగోలుదారుకు అందుబాటులోకి రానుంది! అతని వివరాలను రహస్యంగా ఉంచినట్లు నిర్మాణ భాగస్వామి ప్రావిడెంట్ ఎస్టేట్ పేర్కొంది. అయితే ‘‘ఆ కుబేరుడు తూర్పు యూరప్ ప్రాంతానికి చెందిన వ్యక్తి’’ అని ప్రావిడెంట్ ఎస్టేట్‌కు అసోసియేట్ పార్ట్నర్ అయిన శామ్ హొరానీ వెల్లడించారు. రియల్టీ స్వర్గధామమైన దుబాయ్‌లో అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు, పెంట్ హౌస్‌ల ధరలు చుక్కలనంటడం ఇది తొలిసారేమీ కాదు. కొద్ది నెలల క్రితం మర్సా అల్ అరబ్ హోటల్ పెంట్ హౌస్ ఏకంగా రూ.956 కోట్లకు అమ్ముడైంది. ప్రత్యేకతలెన్నో... ఎన్నెన్నో ప్రత్యేకతలు కోమో రెసిడెన్స్ పెంట్ హౌస్ సొంతం ► ఇందులో 360 డిగ్రీల స్కై పూల్ ఉంటుంది. ►ఇది వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకమైన చోట రానుంది. ►దీనిపై నుంచి ఇటు చూస్తే ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా, అటు చూస్తే దానికి సాటి వచ్చే బుర్గ్ అల్ అరబ్, దుబాయ్ మరీనా వంటి ఆకాశాన్నంటే నిర్మాణాలెన్నో కను విందు చేస్తాయి. ►కోమో రెసిడెన్సెస్ టవర్ ఎత్తు 300 మీటర్ల (984 అడుగుల) పై చిలుకే. ►ఇంతా చేసి, ఈ అపార్ట్మెంట్లో ఒక్కో ఫ్లోర్లో కేవలం ఒకట్రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. ►రెండు నుంచి ఏడు పడకగదులతో కూడుకుని ఉండే ఈ ఫ్లాట్లకు ప్రైవేట్ లిఫ్టులు, ప్రైవేట్ శాండీ బీచ్‌లు, 25 మీటర్ల లాప్ పూల్స్, రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్ వంటి చాలా ప్రత్యేకతలుంటాయి. ►ఈ ఫ్లాట్ల ధర రూ.47.5 కోట్ల నుంచి మొదలవుతుంది. ప్రపంచ రికార్డు రూ.3,670 కోట్లు మొనాకోలోని ఓడియన్ టవర్ పెంట్ హౌస్ రూ.3,670 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్‌గా రికార్డు సృష్టించింది. లండన్‌లోని వన్ హైడ్ పార్క్ పెంట్ హౌస్ రూ.1,975 కోట్లతో రెండో స్థానంలో ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఫోన్ల విక్రయాలు కొత్త రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల విపణిలో యాపిల్ కొత్త రికార్డు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ కాలంలో 25 లక్షల యూనిట్లకుపైగా ఐఫోన్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 34 శాతం అధికంగా సాధించడం విశేషం. ఒక త్రైమాసికంలో భారత్‌లో కంపెనీ ఖాతాలో ఇదే ఇప్పటి వరకు రికార్డు. ఖరీదైన మోడళ్లకు మార్కెట్ మళ్లుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సెపె్టంబర్ త్రైమాసికంలో భారత్‌లో 17.2 శాతం వాటాతో శామ్సంగ్ తొలి స్థానంలో నిలిచింది. నాలుగు త్రైమాసికాలుగా శామ్సంగ్ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోందని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ బుధవారం వెల్లడించింది. ఏ, ఎం సిరీస్ ఫోన్లు ఇందుకు దోహదం చేసిందని తెలిపింది. ఇక 16.6 శాతం వాటాతో షావొమీ రెండవ స్థానం ఆక్రమించింది. రూ.30–45 వేల ధరల శ్రేణి విభాగంలో వన్‌ప్లస్ 29 శాతం వాటాతో సత్తా చాటుతోంది. ఫోల్డబుల్ మోడళ్లకు.. ప్రీమియం విభాగం, 5జీ లక్ష్యంగా కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. రూ.45,000 ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం మోడళ్లకు డిమాండ్ ప్రతి త్రైమాసికంలోనూ పెరుగుతూ వస్తోంది. సెప్టెంబర్ క్వార్టర్లో అల్ట్రా ప్రీమియం మోడళ్ల అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 44 శాతం దూసుకెళ్లాయి. సులభ వాయిదాలు, ఇతర ప్రోత్సాహకాలు, నూతన టెక్నాలజీవైపు కస్టమర్ల మొగ్గు ఇందుకు దోహదం చేశాయి. ఫోల్డబుల్ మోడళ్లకు డిమాండ్ దూసుకెళ్తోంది. ఈ విభాగంలోకి కంపెనీలు క్రమంగా ప్రవేశిస్తున్నాయి. అన్ని బ్రాండ్ల అమ్మకాల్లో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా ఏకంగా 53 శాతానికి ఎగబాకింది. 10–15 వేల ధరల శ్రేణిలో ఎక్కువ మోడళ్లను కంపెనీలు ప్రవేశపెట్టాయి. వీటిలో 5జీ మోడళ్ల వాటా ఏడాదిలో 7 నుంచి 35 శాతానికి చేరింది. ఆసక్తికర విషయం ఏమంటే 5జీ, అధిక ర్యామ్ (8జీబీ) వంటి కీలక ఫీచర్లు రూ.10,000లోపు సరసమైన స్మార్ట్ఫోన్లకు విస్తరించాయి. -
ICC World Cup 2023: 3.5 కోట్ల వీక్షకులు! డిస్నీ హాట్‌స్టార్ రికార్డు
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్ మొబైల్ స్ట్రీమింగ్‌లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకదశలో మ్యాచ్‌ను ఒకేసారి గరిష్టంగా 3.5 కోట్ల మంది వీక్షకులు చూసినట్లు డిస్నీ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ ఏడాది చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌ను 3.2 కోట్ల మంది ఏకసమయంలో చూడగా... ఇప్పుడు ఆ రికార్డును తాజా ప్రపంచకప్ మ్యాచ్ బద్దలు కొట్టింది. -
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఆస్తులు జూమ్
ముంబై: దేశంలోనే మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) పరంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త రికార్డు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ. 90 వేల కోట్ల మేర ఆస్తులను పెంచుకుంది. దీంతో సంస్థ నిర్వహణలోని మొత్తం ఏయూఎం మార్చి నాటికి ఉన్న రూ.7.10 లక్షల కోట్ల నుంచి, జూన్ చివరికి రూ.8 లక్షల కోట్లకు చేరుకుంది. వచ్చే 12 నుంచి 18 నెలల్లో మొత్తం నిర్వహణ ఆస్తులు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్టు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ ఎండీ, చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ డీపీ సింగ్ తెలిపారు. రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరుకోవాలనే లక్ష్యాన్ని అంతర్గతంగా విధించుకున్నట్టు చెప్పారు. మార్కెట్లో ఏదైనా తీవ్ర పతనాన్ని చూస్తే తప్పితే, తాము దీన్ని చేరుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఏయూఎం జూన్ చివరికి రూ.43.2 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 8 శాతం మార్కెట్ వాటా: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణ ఆస్తులు రూ.43.2 లక్షల కోట్ల ప్రకారం చూస్తే, ఎస్బీఐ ఫండ్ ఏయూఎం వాటా 18%. ఇందులో రూ.5.5 లక్షల కోట్ల ఆస్తులు ఈక్విటీలకు సంబంధించినవిగా సింగ్ వెల్లడించారు. ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో తమ పథకాల్లోకి రూ.2,200 కోట్లు వస్తున్నట్టు తెలిపారు. ఎక్కువ పెట్టుబడులు టాప్–30 పట్టణాల నుంచి ఉన్నాయన్నారు. ఎస్బీఐ నిర్వహణలోని ఫోలియోల్లో (పెట్టుబడి ఖాతా) 35% చిన్న పట్టణాలవేనని తెలిపారు. -
బెంగళూరు, ముంబైకి దీటుగా హైదరాబాద్.. తెలంగాణ కొత్త రికార్డులు
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఐటీ ఆధారిత సేవల రంగం ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయి. దీంతో ఐటీ రంగంలో భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతో తెలంగాణ పోటీ పడుతున్నట్టయింది. తెలంగాణ రాష్ట్ర రెండో ఐసీటీ పాలసీ (2021–26)లో రూ.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2022–23 ఐటీ శాఖ ప్రగతి నివేదిక ప్రకారం.. తెలంగాణ ఈ లక్ష్యాన్ని రెండేళ్లు ముందుగానే అంటే 2024 నాటికే చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సన్నద్ధమవుతోంది. దేశంలో ఏ ఇతర రాష్ట్రం సాధించని రీతిలో 2022–23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31.44 శాతం వార్షిక వృద్ధిరేటు, ఉద్యోగాల కల్పనలో 16.2 శాతం రికార్డు వృద్ధి రేటును సాధించింది. దీంతో ఏడాది కాలంలోనే కొత్తగా 1.26 లక్షల ఉద్యోగాలు, ఎగుమతుల్లో రూ.57 వేల కోట్లకు పైగా వృద్ధిని ఐటీ రంగం సాధించింది. 17.31% సీఏజీఆర్‌తో పురోగమనం తెలంగాణ రాష్ట్ర అవతరణ నుంచి 17.31 శాతం సీఏజీఆర్ (సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు)తో వృద్ధి చెందడంతోనే ఐటీ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. రాష్ట్ర అవతరణ నాటి పరిస్థితులతో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో నాలుగు రెట్లు, ఉద్యోగాల కల్పనలో మూడు రెట్లు పురోగతి సాధించగా, మరో మూడు రెట్లు పరోక్ష ఉద్యోగాలు వచ్చినట్లు అంచనా. 2022–23లో భారత్ ఐటీ ఎగుమతులు 9.36 శాతం ఉంటే, తెలంగాణలో మాత్రం 31.44 శాతం పెరిగాయి. 2014లో మొత్తం దేశ ఐటీ ఉద్యోగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 9.83% గా ఉంటే ప్రస్తుతం కొత్త ఉద్యోగాల కల్పనలో ఒక్క తెలంగాణ వాటా 27.6%గా ఉంది. భారత్ గణాంకాలతో పోలిస్తే దేశంలో ఐటీ రంగంలో వచ్చిన కొత్త ఉద్యోగాల్లో తెలంగాణ నుంచి 2021–22లో 33 శాతం వస్తే, 2022–23లో 44 శాతం వచ్చాయి. అంటే దేశంలో కొత్తగా వస్తున్న ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే వస్తున్నట్లు భావించవచ్చు. ఉద్యోగాల్లో బెంగళూరు తర్వాత .. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2021–22లో దేశం నుంచి రూ.3.95 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరగ్గా, ఇందులో మూడో వంతు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచే జరుగుతున్నాయి. భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో కర్ణాటక నుంచి 34.2 శాతం, మహారాష్ట్ర నుంచి 20.4 శాతం, తెలంగాణ నుంచి 15.6 శాతం చొప్పున జరిగాయి. దేశ వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలోనే 9.05 లక్షల మంది పని చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో బెంగళూరు తర్వాత రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఐటీ ఎగుమతుల్లోనూ రెండో స్థానంలో నిలిచే దిశగా దూసుకుపోతోంది. పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా బెంగళూరు, హైదరాబాద్ పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఐటీ రంగం వృద్ధిలో పోటీ పడుతున్నాయి. బెంగళూరుతో పోలిస్తే స్టార్టప్ వాతావరణం, ఐటీ రంగంలో మౌలిక వసతుల కల్పన హైదరాబాద్‌లో కొంత ఆలస్యంగా పుంజుకున్నా ప్రస్తుతం పెట్టుబడులకు హైదరాబాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశ ఐటీ రాజధానిగా బెంగళూరుకు పేరున్నా ఇటీవలి కాలంలో ఐటీ పార్కులు, ఎస్ఈజెడ్లు హైదరాబాద్‌లో శరవేగంగా ఏర్పాటవుతుండటంతో రెండు నగరాల మధ్య ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలను ఆకట్టుకోవడంలో పోటీ నెలకొంది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో ముంబయి, బెంగళూరు నగరాలకు మించి హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. 2021లో ఆఫీస్ స్పేస్ వినియోగం 129 శాతం పెరగ్గా, ఐదు మెట్రో నగరాలతో పోలిస్తే 6 శాతం సగటు వృద్ధిరేటు నమోదైంది. బెంగళూరుతో పోలిస్తే జీవన వ్యయం కూడా తక్కువ కావడంతో ఐటీ నిపుణులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక (2021–22) ప్రకారం భారత్‌లో ఐటీ ఉద్యోగుల సంఖ్య: సుమారు 50 లక్షలు బెంగళూరు 15 లక్షలు హైదరాబాద్ 7.78 లక్షలు తమిళనాడు 10 లక్షలు పుణె 4 లక్షలు -
రిలయన్స్ లాభాల రికార్డ్!
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో సరికొత్త రికార్డును సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 19,299 కోట్లను తాకింది. ఒక త్రైమాసికానికి కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 16,203 కోట్లు మాత్రమే ఆర్జించింది. రిటైల్, టెలికం విభాగాలతోపాటు చమురు, పెట్రోకెమికల్స్ బిజినెస్ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2.14 లక్షల కోట్ల నుంచి రూ. 2.19 లక్షల కోట్లకు బలపడింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 66,702 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది కూడా సరికొత్త రికార్డుకాగా.. 2021–22లో రూ. కేవలం 60,705 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరింది. 2021–22లో రూ. 7.36 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే అందుకుంది. పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ నిర్వహణ లాభం(ఇబిటా) తొలిసారి రూ. 1,54,691 కోట్లను తాకింది. ఇది 23 శాతం వృద్ధి. ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు రూ. 1,41,809 కోట్లుకాగా.. కంపెనీవద్దగల రూ. 1,93,282 కోట్ల నగదు బ్యాలెన్స్‌ను మినహాయిస్తే నికర రుణ భారం వార్షిక ఇబిటాకంటే తక్కువగా రూ. 1,10,218 కోట్లుగా నమోదైంది. అన్ని విభాగాల జోరు: క్యూ4లో ఆర్ఐఎల్ ఇబిటా 22 శాతం జంప్‌చేసి రూ. 41,389 కోట్లను తాకింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్(ఓటూసీ) ఇబిటా 14 శాతంపైగా ఎగసి రూ. 16,293 కోట్లకు, టెలికంసహా డిజిటల్ సర్వీసులు 17 శాతం మెరుగుపడి రూ. 12,767 కోట్లకు, రిటైల్ విభాగం 33 శాతం దూసుకెళ్లి రూ. 4,769 కోట్లకు, ఆయిల్, గ్యాస్ ఇబిటా రెట్టింపై రూ. 3,801 కోట్లకు చేరాయి. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ లాభాలపై రూ. 711 కోట్లమేర ప్రభావం చూపినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. అంతక్రితం క్యూ4లో రూ. 1,898 కోట్లమేర ప్రభావం పడినట్లు ప్రస్తావించింది. ఆర్ఐఎల్ షేరు స్వల్ప వృద్ధితో 2,351 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. రిలయన్స్ రిటైల్ భళా గతేడాది(2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో రిలయన్స్ రిటైల్ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ. 2,415 కోట్లను తాకింది. 2021–22 క్యూ4లో రూ. 2,139 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 21 శాతం ఎగసి రూ. 61,559 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 50,834 కోట్ల అమ్మకాలు సాధించింది. ఆదాయంలో డిజిటల్, న్యూ కామర్స్ బిజినెస్ వాటా 17 శాతానికి చేరింది. ఇక మొత్తం స్టోర్ల సంఖ్య 18,040కు చేరింది. క్యూ4లో 2,844 స్టోర్లను జత చేసుకుంది. సర్వీసులతో కలిపి క్యూ4లో ఆదాయం రూ. 69,267 కోట్లను తాకగా.. ఇబిటా 33 శాతం వృద్ధితో రూ. 4,914 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మొత్తం ఆదాయం 32 శాతం జంప్‌చేసి రూ. 2,30,931 కోట్లను తాకింది. నికర లాభం 30 శాతం ఎగసి రూ. 9,181 కోట్లయ్యింది. సర్వీసులతో కలిపి స్థూల ఆదాయం రూ. 2,60,364 కోట్లుగా నమోదైంది. దేశీయంగా రిటైల్ రంగంలో రిలయన్స్ అత్యుత్తమ వృద్ధిని చూపుతున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా ఎం.అంబానీ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిలో భాగం డిజిటల్ కనెక్టివిటీ, ఆర్గనైజ్డ్ రిటైల్ విభాగాలలో కంపెనీ కార్యకలాపాలు వ్యవస్థాగత సామర్థ్యాలకు బలాన్నిస్తున్నాయి. తద్వారా ప్రపంచంలోనే వేగవంత వృద్ధిని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని విడదీసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో లిస్ట్ చేయనున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఎంజే ఫీల్డ్, ఆర్క్లస్టర్ తదితరాలతో కలిపి కేజీ–డీ6 బ్లాకులో గ్యాస్ ఉత్పత్తి రోజుకి 3 కోట్ల ప్రామాణిక ఘనపుమీటర్లకు చేరే వీలుంది. –ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ -
మారుతీ కుటుంబం 2.5 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో భారత్‌లో అగ్రశేణి కంపెనీ మారుతీ సుజుకీ.. 2023 జనవరి 9 నాటికి దేశీయంగా 2.5 కోట్ల కార్లను విక్రయించి సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. అప్పటి మారుతీ ఉద్యోగ్ 1983 డిసెంబర్ నుంచి అమ్మకాలను ప్రారంభించింది. కంపెనీ 2012 ఫిబ్రవరి నాటికి 1 కోటి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. 2019 జూలై కల్లా 2 కోట్ల యూనిట్ల విక్రయాలను సాధించింది. జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ అనుబంధ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుతం దేశీయంగా 17 మోడళ్లను తయారు చేసి విక్రయిస్తోంది. ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విభాగంలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని సంస్థ కృతనిశ్చయంతో ఉంది. క్రమంగా ఎస్యూవీ మోడళ్లను ప్రవేశపెడుతోంది. మరోవైపు హైబ్రిడ్, సీఎన్జీ విభాగంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ భారత్‌లో 21 లక్షల యూనిట్ల హైబ్రిడ్, సీఎన్జీ వాహనాలను విక్రయించింది. -
కలెక్షన్ల సునామి సృష్టించనున్న సలార్
-
ప్యాసింజర్ వెహికిల్స్ దూసుకెళ్తున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం, సెమికండక్టర్ల సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం భారత వాహన పరిశ్రమకు కలిసి వచ్చింది. ప్యాసింజర్ వెహికిల్స్ తయారీ, విక్రయాలు వేగం పుంజుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 ఆగస్ట్‌లో కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు నమోదైంది. ఎస్‌యూవీల జోరుతో టాప్–7 కంపెనీల మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఏకంగా 30.2 శాతం వృద్ధితో 3,05,744 యూనిట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక వృద్ధి. ఆగస్ట్ నుంచి పండుగల సీజన్ ప్రారంభం అవుతుంది. జోరు మొదలైందని.. రాబోయే నెలల్లో ఇది కొనసాగుతుందని వాహన పరిశ్రమ ధీమాగా ఉంది. ఏడాది పొడవునా జరిగే మొత్తం విక్రయాల్లో పండుగల సీజన్ వాటా ఏకంగా 40 శాతం దాకా ఉంటోంది. 2018–19ని మించిన విక్రయాలు.. దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 30,69,499 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2018–19లో అత్యధికంగా 33,77,389 యూనిట్లు రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2018–19ని మించిన విక్రయాలు నమోదు కానున్నాయని భారత్‌లో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చెబుతోంది. 37 లక్షల యూనిట్లతో పరిశ్రమ నూతన రికార్డు సాధిస్తుందన్న అంచనా ఉందని మారుతీ సుజుకీ సేల్స్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. 2021–22తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని అన్నారు. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో మారుతీ సుజుకీ 30 శాతం, హ్యుండై 5.6, టాటా మోటార్స్ 68.3, మహీంద్రా అండ్ మహీంద్రా 87, కియా ఇండియా 33.3, టయోటా కిర్లోస్కర్ 17.12 శాతం వృద్ధి సాధించాయి. హోండా కార్స్ 30.5 శాతం తిరోగమన వృద్ధి చవిచూసింది. ద్విచక్ర వాహనాలు ఇలా.. : అంత క్రితం ఏడాది ఇదే కాలం, అలాగే ఈ ఏడాది జూలైతో పోలిస్తే ఆగస్ట్‌లో అన్ని ద్విచక్ర వాహన కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. సెమికండక్టర్ల సరఫరా మెరుగవడం డిమాండ్‌కు తగ్గట్టుగా కస్టమర్లకు వాహనాలను అందించేందుకు వీలైందని కంపెనీలు అంటున్నాయి. జీడీపీ వృద్ధి, రెండేళ్ల తర్వాత సాధారణ పండుగల సీజన్, మెరుగైన రుతుపవనాలతో అధిక దిగుబడి, కస్టమర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడం.. వెరిశి రాబోయే నెలల్లో టూ వీలర్ల అమ్మకాలు మరింత జోరుగా ఉంటాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో హీరో మోటోకార్ప్ 4.6 శాతం, హోండా 5.1, టీవీఎస్ 56.2, బజాజ్ 42.2, సుజుకీ 6.2, రాయల్ ఎన్ఫీల్డ్ 33.8 శాతం అధికంగా విక్రయాలను సాధించాయి. -
రిలయన్స్ లాభం.. భళా
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ గ్రూప్ ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్ క్యూ1లో రూ. 17,955 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 12,273 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధి. చమురు, టెలికం బిజినెస్‌లు ఇందుకు దోహదం చేశాయి. నిర్వహణ లాభం 46 శాతం ఎగసి రూ. 40,179 కోట్లయ్యింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. మొత్తం ఆదాయం రూ. 2,42,982 కోట్లను తాకింది. ప్రధానంగా పెట్రోకెమికల్ విభాగం కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 1.6 లక్షల కోట్ల ఆదాయం సాధించింది. ఇది 57 శాతం అధికం. గ్యాస్, రిటైల్ గుడ్.. చమురు, గ్యాస్ బిజినెస్ ఆదాయం 183 శాతం జంప్‌చేసి రూ. 3,625 కోట్లకు చేరింది. కేజీ డీ6లో 40.6 బిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ ఉత్పత్తయ్యింది. గత క్యూ1లో ఇది 33.1 బీసీఎఫ్గా నమోదైంది. ఒక్కో ఎంబీటీయూకి 9.72 డాలర్లు చొప్పున లభించింది. గతంలో ఇది 3.62 డాలర్లు మాత్రమే. ఇక రిలయన్స్ రిటైల్ అమ్మకాలు 54 శాతం ఎగసి రూ. 51,582 కోట్లను తాకాయి. నిర్వహణా లాభం 180 శాతం పురోగమించి రూ. 3,897 కోట్లకు చేరింది. మార్జిన్లు 7.6 శాతానికి మెరుగుపడ్డాయి. నికర లాభం 114 శాతం వృద్ధితో రూ. 2,061 కోట్లయ్యింది. కొత్తగా 792 స్టోర్లు తెరిచింది. వీటి మొత్తం సంఖ్య 15,866కు చేరాయి. కంపెనీ ప్రధానంగా ఓటూసీ, రిటైల్, ఈకామర్స్, టెలికంతోపాటు న్యూ ఎనర్జీ బిజినెస్‌లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 30కల్లా నగదు(రూ. 2,05,727 కోట్లు) కంటే రుణాలు(రూ. 2,63,382 కోట్లు) అధికంకావడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 2,503 వద్ద ముగిసింది. ఓటూసీ రికార్డ్... అధిక ఇంధన ధరలు, రవాణా వ్యయాల నేపథ్యంలోనూ ఓటూసీ (ఆయిల్ టూ కెమికల్స్) బిజినెస్ రికార్డ్ పనితీరు చూపింది. ఈ విభాగం నిర్వహణా లాభం 63 శాతం దూసుకెళ్లి రూ. 19,888 కోట్లను తాకింది. రిటైల్ విభాగంలో కస్టమర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. డిజిటల్ సర్వీసులు ఇందుకు వినియోగపడుతున్నాయి. దేశ ఇంధన భద్రతపై పెట్టుబడులు కొనసాగిస్తాం. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ -
22,850 అడుగుల ఎత్తులో యోగా
ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) జవాన్లు సరికొత్త రికార్దు నెలకొల్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అబీ గామిన్ పర్వతం సమీపంలో సముద్ర మట్టానికి 22,850 అడుగుల ఎత్తున యోగా సాధన చేశారు. ఈ వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఒకవైపు దట్టమైన మంచు, వణికించే చలి.. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో యోగాసనాలు సులువుగా పూర్తిచేశారు. ఐటీబీపీ బృందం ఈ నెల 2వ తేదీన అబీ గామిన్ పర్వత శిఖరానికి చేరుకుంది. ‘బద్రీ విశాల్‌కీ జై’ అని నినదిస్తూ యోగా సాధనకు శ్రీకారం చుట్టింది. ఈ పర్వతం భారత్–టిబెట్ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో ఇది రెండో అతిపెద్ద పర్వతం. బృందంలో మొత్తం 14 మంది ఉన్నారు. -
Kia India: కియా ఇండియా సంచలనం..! విదేశాలకు లక్షకుపైగా..అది కూడా ఏపీ నుంచే..!
Kia India News In Telugu: వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొత్త రికార్డు సాధించింది. భారత్ నుంచి ఒక లక్ష కార్ల ఎగుమతి మార్కును దాటింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో కంపెనీకి అత్యాధునిక ప్లాంటు ఉంది. 2019 సెప్టెంబర్ నుంచి ఈ కేంద్రం ద్వారా ఎగుమతులను కియా మొదలు పెట్టింది. 2022 జనవరి నాటికి 1,01,734 యూనిట్లు నమోదు చేసింది. రెండున్నరేళ్లలోపే ఈ ఘనతను సాధించామని కంపెనీ గురువారం తెలిపింది. భారత్‌ను తయారీ, ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తమ నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తోందని సంస్థ వివరించింది. సెల్టోస్, సోనెట్ కార్లను మధ్యప్రాచ్య, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా పసిఫిక్‌లోని 91 దేశాలకు కియా ఎగుమతులు చేస్తోంది. విదేశాలకు వెళ్తున్న మొత్తం కార్లలో సెల్టోస్ 77, సోనెట్ 23 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. క్లిష్టమైన ఉత్పత్తి కేంద్రాలలో.. అమ్మకాల పరంగా మాత్రమే కాకుండా తయారీ, ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేసే విషయంలో కూడా కియా కార్పొరేషన్‌కు భారత్ ఒక వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతం అని సంస్థ ఇండియా ఎండీ, సీఈవో టే జిన్ పార్క్ తెలిపారు. ‘ప్రపంచంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మా అనంతపూర్ ప్లాంట్ చిన్న, మధ్య తరహా ఎస్‌యూవీల కోసం అత్యంత క్లిష్టమైన ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా మారింది. భారతీయ ఉత్పత్తులు నిజంగా అంతర్జాతీయ స్థాయి అనే వాస్తవాన్ని ఇది స్పష్టం చేస్తోంది’ అని వివరించారు. -
పెట్రోల్ రూ.120 దాటేసింది
న్యూఢిల్లీ/భోపాల్: లీటర్‌కు రూ.120.. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరల్లో కొత్త రికార్డు ఇది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో లీటర్ ధర రూ.120 మార్కును దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు.. ఆదివారం సైతం 35 పైసల చొప్పున పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ రెండింటి ధరల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.34కు, డీజిల్ రేటు రూ.98.07కు చేరింది. మధ్యప్రదేశ్‌లో స్థానిక పన్నుల కారణంగా పెట్రోల్ ధర మోత మోగుతోంది. పన్నా, సాత్నా, రేవా, షాడోల్, చింద్వారా, బాలాఘాట్ తదితర ప్రాంతాల్లో లీటర్ రూ.120కి పైగానే పలుకుతోంది. రాజస్తాన్‌లోని గంగానగర్, హనుమాన్‌గఢ్‌లోనూ లీటర్ రేటు రూ.120 దాటింది. దేశంలోనే అత్యధిక ధర గంగానగర్‌లో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రేటు రూ.121.52కు, డీజిల్ రేటు రూ.112.44కు ఎగబాకింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి ఇప్పటిదాకా పెట్రోల్ ధర 25 సార్లు (లీటర్‌కు రూ.8.15) పెరిగింది. సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ రేటు 28 సార్లు(లీటర్‌కు రూ.9.45) పెరిగింది. రండి.. మా దగ్గర ధర తక్కువ మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో ఆదివారం వార్తాపత్రికలు తెరిచిన జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గోండియాలో పెట్రోల్, డీజిల్ రేటు లీటర్‌కు రూ.4 తక్కువ, అక్కడే పోయించుకోండంటూ ముద్రించిన కరపత్రాలు అందులో ఉండడమే ఇందుకు కారణం. బాలాఘాట్ నుంచి గోండియాకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నా పెట్రో ధరల్లో వ్యత్యాసం రూ.4 కు పైగా ఉంది. -
వ్యాక్సినేషన్లో మరో రికార్డ్
-
ఆకాశమే హద్దుగా డీమార్ట్ దూకుడు...!
ముంబై: రిటైల్ చైన్ సూపర్ మార్కెట్స్ డీ-మార్ట్స్ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ సోమవారం రోజున సరికొత్త రికార్డును నమోదుచేసింది. డీమార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఏకంగా రూ. 3 ట్రిలియన్లకు (3 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ అరుదైన ఘనతను సాధించిన 17 ఇండియన్ స్టాక్స్ లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. ఈ ఏడాదిలో డీమార్ట్ షేర్లు ఇప్పటివరకు సుమారు షేర్లు 70% పైగా పెరిగాయి. చదవండి: ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..! బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో సోమవారం రోజున డీమార్ట్ షేర్ విలువ రికార్డు స్థాయిలో గరిష్టంగా రూ. 4,837ను తాకింది. దీంతో డీ మార్ట్ మార్కెట్ క్యాప్ విలువ రూ. 3.11 ట్రిలియన్లకు చేరుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి డీ మార్ట్ షేర్ విలువ 7 శాతం వృద్ధి చెంది రూ. 4716.50 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇతర కంపెనీల సరసన..! రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒఎన్‌జిసి, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఏషియన్ పెయింట్స్ కంపెనీల మార్కెట్ క్యాప్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న క్లబ్లో ఇప్పుడు డీమార్ట్ కూడా చేరింది. క్యూ-2 లో భారీ లాభాలు..! ఈ ఏడాది రెండో త్రైమాసికంలో డీమార్ట్ తన స్వతంత్ర ఆదాయంలో 46శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి ₹ 7,649.64 కోట్లకు చేరుకుంది. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం..డీమార్ట్ వృద్ధి నివేదిక అంచనాల కంటే 5శాతం ఎక్కువ మేర లాభాలను గడించింది. చదవండి: తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...! -
మరో సంచలనం.. బాహుబుల్ 60000
ముంబై: స్టాక్ మార్కెట్లో శుక్రవారం మరో సంచలనం చోటుచేసుకుంది. సెన్సెక్స్ సూచీ తన 42 ఏళ్లలో సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి 60 వేల మైలురాయిని అధిగమించింది. కొంతకాలంగా దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాథమిక మార్కెట్లు ఐపీఓలతో కళకళలాడుతున్నాయి. ఆర్బీఐ సరళతర ద్రవ్య విధానానికి కట్టుబడింది. ప్రపంచ మార్కెట్ల నుంచీ సానుకూల సంకేతాలు అందుతున్నాయి. కోవిడ్‌తో కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం అన్ని రంగాలకు రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. దీంతో దలాల్ స్ట్రీట్ కొన్ని వారాలుగా కొనుగోళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో సెన్సెక్స్ కొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. మార్కెట్లో పండుగ వాతావరణం... దేశీయ మార్కెట్లోని సానుకూలతలతో స్టాక్ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 60 వేలపైన 60,159 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు ఎగసి 17,897 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలు ఆరంభంలోనే సరికొత్త చరిత్ర సృష్టించడంతో స్టాక్ మార్కెట్లలో పండుగ వాతావరణం కనిపించింది. ఆటో, ఆర్థిక, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ మిడ్‌సెషన్‌లో కొంతసేపు మినహా రోజంతా 60 వేల స్థాయిపైనే ఉంది. ఇంట్రాడేలో 448 పాయిం ట్లు పెరిగి వద్ద 60,315 జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. చివరికి 163 పాయింట్ల లాభంతో 60,048 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 వేల స్థాయిని అందుకునే ప్రయత్నం చేసినా... గరిష్టాల వద్ద నిరోధం ఎదురవడంతో ఈ స్థాయిని అందుకోవడంలో విఫలమైంది. ట్రేడింగ్‌లో 125 పాయింట్లు పెరిగి 17,948 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 30 పాయింట్ల లాభంతో 17,853 వద్ద స్థిరపడింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్ షేర్లలో అమ్మకాలు జరగడంతో సూచీలు ఆరంభలాభాల్ని కోల్పో యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.422 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.516 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. సూచీలకు ఐదోవారామూ లాభాలే... బుల్ రన్లో భాగంగా సూచీలు ఐదోవారమూ లాభాలను గడించాయి. ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు 1.5% చొప్పున ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1033 పాయింట్లు, నిఫ్టీ 268 పాయింట్లు ఎగిశాయి. సెన్సెక్స్ 60,000 స్థాయిని అందుకోవడమనేది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోంది. కోవిడ్ సమయంలో సంపన్న దేశాలు అనుసరించిన సరళీకృత ద్రవ్యపాలసీ విధాన వైఖరి, వడ్డీరేట్ల సడలింపు తదితర అవకాశాలను అందిపుచ్చుకున్న భారత్ ప్రపంచంలో ఆర్థిక అగ్రగామి రాజ్యంగా ఎదుగుతోంది. – అశిష్‌కుమార్ చౌహాన్, బీఎస్ఈ ఎండీ, సీఈవో -
ఒక్కరోజులో 2.26 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సినేషన్లో భారత్ కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం దేశవ్యాప్తంగా 2 కోట్లకుపైగా టీకా డోసులు ప్రజలకు వేశారు. కో–విన్ పోర్టల్ గణాంకాల ప్రకారం దేశంలో శుక్రవారం ఒక్కరోజే 2.26 కోట్లకుపైగా డోసులు ఇచ్చారు. అత్యధికంగా కర్ణాటకలో 26.9 లక్షల డోసులు, బిహార్‌లో 26.6 లక్షల డోసులు, ఉత్తరప్రదేశ్‌లో 24.8 లక్షల డోసులు, మద్యప్రదేశ్‌లో 23.7 లక్షల డోసులు, గుజరాత్లో 20.4 లక్షల డోసులు ఇచ్చారు. ఈ రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ ప్రధానమంత్రికి ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజల తరపున తాము అందజేసిన జన్మదిన కానుక అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 79.25 కోట్లకు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఒక్క రోజులో కోటికిపైగా డోసులు ఇవ్వడం గత నెల వ్యవధిలో ఇది 4వసారి కావడం విశేషం. ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ.. ప్రధానమంత్రి మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, టిబెట్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాలు శుభాకాంక్షలు తెలిపారు. సేవా ఔర్ సమర్పణ్.. ప్రధాని మోదీ జన్మదినంతోపాటు ఆయన గుజరాత్ సీఎంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా 20 రోజులపాటు సాగే ‘సేవా ఔర్ సమర్పణ్’ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 7 దాకా దేశవ్యాప్తంగా కొనసాగనుంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడతారు. 14 కోట్లకుపైగా రేషన్ కిట్లు పంపిణీ చేస్తారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లో జన్మించిన నరేంద్ర మోదీ తొలుత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరారు. అనంతరం బీజేపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రతి భారతీయుడికి గర్వకారణం: మోదీ దేశంలో ఒక్కరోజులో 2.26 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయడంలో పాల్గొన్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కృషి మరువలేనదని ప్రశంసించారు. -
మరింతగా ఫారెక్స్ మెరుపులు
ముంబై: భారత్ ఫారెక్స్ నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త చరిత్రాత్మక రికార్డులను నమోదుచేసుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆగస్టు 6వ తేదీతో ముగిసిన వారంలో (అంతక్రితం జూలై 30తో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్ నిల్వలు భారీగా 889 మిలియన్ డాలర్లు పెరిగి 621.464 బిలియన్ డాలర్లకు చేరాయి. భారత్ కరెన్సీలో ఇవి దాదాపు రూ.46 లక్షల కోట్లు. 2020 జూన్ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్ ఫారెక్స్ నిల్వలు అర ట్రిలియన్ స్థాయిని అధిగమించి 501.70 బిలియన్ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది తిరిగే సరికి నిల్వలు మరో 100 బిలియన్ డాలర్లపైగా పెరిగాయి. జూన్ 4వతేదీతో ముగిసిన వారంలో మొదటిసారి 600 బిలియన్ డాలర్లను దాటాయి. అటు తర్వాత కొంత తగ్గినా... పురోగమన బాట కొనసాగుతోంది. తాజా సమీక్షా వారంలో రికార్డుల దూకుడు కొనసాగింది. ప్రస్తుత నిల్వలు భారత్ 20 నెలల దిగుమతులకు దాదాపు సరిపోతాయన్నది అంచనా. అంతర్జాతీయంగా భారత్ ఎకానమీకి వచ్చే కష్టనష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ప్రస్తుత స్థాయి నిల్వలు దోహదపడతాయని ఇటీవలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ విశ్లేషించిన సంగతి తెలిసిందే. కాగా, భారీగా ఉన్న ఫారెక్స్ నిల్వలను దేశ మౌలిక రంగ పురోగతికి వినియోగించడానికి వీలయిన విధానాన్ని రూపొందించాలని కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ కొద్ది రోజుల క్రితం సూచించడం మరో విశేషం. ఈ విషయంలో ఆర్బీఐ గవర్నర్‌తో చర్చిస్తానని కూడా ఆయన సీఐఐ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ మౌలిక రంగం పురోగతికి తక్కువ రుణ రేటుకు నిధులు కావాలని ఆయన పేర్కొంటున్నారు. తాజా ఫారెక్స్ గణాంకాలను విభాగాల వారీగా పరిశీలిస్తే.. ► మొత్తం నిల్వల్లో డాలర్ల రూపంలో చూస్తే ప్రధానమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) విలువ తాజా సమీక్షా వారంలో 1.508 బిలియన్ డాలర్లు పెరిగి 577.732 బిలియన్ డాలర్లకు చేరింది. ► పసిడి నిల్వలు 588 మిలియన్ డాలర్లు తగ్గి 37.057 బిలియన్ డాలర్లకు చేరాయి. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్స్ రైట్స్ విలువ కూడా ఒక మిలియన్ డాలర్లు తగ్గి 1.551 డాలర్లకు దిగివచ్చింది. ► ఇక ఐఎంఎఫ్ వద్ద రిజరŠవ్స్ పరిమాణం కూడా 31 మిలియన్ డాలర్లు తగ్గి, 5.125 బిలియన్ డాలర్లకు పడింది. -
సూపర్ ఫెలిక్స్: ఏకంగా 10 ఒలింపిక్ పతకాలు.. ఈసారి కూతురితో
Allyson Felix 10th Olympic Medal: అమెరికా మహిళా స్టార్ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ క్రీడాంశంలో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా ఆమె రికార్డు నెలకొల్పింది. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మహిళల 400 మీటర్ల ఫైనల్ రేసులో 35 ఏళ్ల ఫెలిక్స్ 49.46 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. తద్వారా 10 ఒలింపిక్ మెడల్స్ (6 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం)తో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అత్యధిక పతకాలు సాధించిన మహిళగా ఘనతకెక్కింది. ‘టోక్యో’కు ముందు వరకు ఈ రికార్డు జమైకా అథ్లెట్ మెర్లిన్ ఒట్టి (9 పతకాలు) పేరిట ఉండేది. అంతేకాకుండా ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన అమెరికా అథ్లెట్‌గా పేరున్న కార్ల్ లూయిస్ (10 పతకాలు) రికార్డును కూడా ఫెలిక్స్ సమం చేసింది. నేడు జరిగే మహిళల 4్ఠ100 మీ. టీమ్ రిలేలో కూడా ఆమె పతకం సాధి స్తే... అమెరికా తరఫున అత్యధిక పతకాలు సాధించిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా ఫెలిక్స్ నిలుస్తుంది. ఓవరాల్ రికార్డు మాత్రం ఫిన్లాండ్ అథ్లెట్ పావో నుర్మీ (12 పతకాలు) పేరిట ఉంది. 400 మీ. పరుగులో ఫెలిక్స్ కంటే ముందుగా 48.36 సెకన్లలో గమ్యాన్ని చేరిన షానే మిల్లర్ విబో (బహామస్) స్వర్ణాన్ని... మెరిలిడీ పౌలినో (49.20 సెకన్లు–డొమినికన్ రిపబ్లిక్) రజతాన్ని దక్కించుకున్నారు. అమ్మతనం కోసం... ఈతరంలో ‘క్వీన్ ఆఫ్ ట్రాక్’గా అలీసన్ ఫెలిక్స్‌కు గుర్తింపు ఉంది. టోక్యోకు ముందే 6 స్వర్ణాలు సహా ఆమె ఖాతాలో 9 ఒలింపిక్ పతకాలు ఉన్నాయి. అద్భుత ఫలితాలు సాధి స్తుండటంతో ఆమెతో పలు పెద్ద కంపెనీలు బ్రాండింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో వరల్డ్ నంబర్‌వన్ స్పోర్ట్స్ కంపెనీ ‘నైకీ’ ఒకటి. నైకీతో ఫెలిక్స్ అనుబంధం పదేళ్లకు పైగా సాగింది. మరో అథ్లెట్ కెన్నెత్ ఫెర్గూసన్‌తో పెళ్లి తర్వాత 2018లో ఆమె తల్లి కావడానికి సిద్ధమైంది. అయితే ఈ వార్త తెలిసిన ‘నైకీ’ కాంట్రా క్ట్ పొడిగింపు సమయంలో గతంలో ఇచ్చిన దాంట్లో ఏకంగా 70 శాతం తక్కువగా ఇస్తామని చెప్పడంతో ఫెలిక్స్ షాక్‌కు గురైంది. పైగా ప్రసవానికి ముందు, తర్వాతి రోజుల్లో ఆమె ప్రదర్శన బాగా లేకపోతే డబ్బులు తగ్గిస్తామని కూడా స్పష్టం చేసింది. ‘ఇంత పెద్ద అథ్లెట్నైన నాతోనే నైకీ ఇలా చేస్తే మిగతావారి పరిస్థితి ఏమిటి’ అంటూ ప్రశ్నించిన ఫెలిక్స్ ఆ కంపెనీతో సంబంధాలు తెంచుకుంది. ‘గ్యాప్’ కు చెందిన ‘అథ్లెటా’తో ఒప్పందం చేసుకుంది. వారు ‘అథ్లెట్...అమ్మ’ అంటూ ఆమెను తమ ప్రచారంలో వాడుకున్నారు. ఫెలిక్స్ దెబ్బకు అంతటి ‘నైకీ’ కూడా దిగి వచ్చింది. జనంలో బాగా చెడ్డపేరు రావడంతో అథ్లెట్ల కోసం కొత్త మెటర్నిటీ పాలసీని ప్రకటించింది. ఇప్పుడు నైకీ అథ్లెట్లకు గ్యారంటీ మొత్తం లభించడంతో పాటు ప్రసవానికి ముందు, తర్వాత 18 నెలల బోనస్ కూడా లభిస్తుంది. మహిళా అథ్లెట్ల హక్కు కోసం 170 బిలియన్ డాలర్ల విలువ గల కంపెనీతో పోరాడేందుకు సన్నద్ధమైన ఫెలిక్స్... ఇప్పుడు తన కూతురు క్యామ్రిన్ తోడుగా పదో ఒలింపిక్ పతకంతో మురిసిపోతోంది! ఫెలిక్స్ పతకాల జాబితా సంవత్సరం ఒలింపిక్స్ వేదిక క్రీడాంశం పతకం 2004 ఏథెన్స్ 200 మీటర్లు రజతం 2008 బీజింగ్ 200 మీటర్లు రజతం 2008 బీజింగ్ 4X400 మీ.రిలే స్వర్ణం 2012 లండన్ 4X100 మీ.రిలే స్వర్ణం 2012 లండన్ 200 మీటర్లు స్వర్ణం 2012 లండన్ 4X400 మీ.రిలే స్వర్ణం 2016 రియో 400 మీటర్లు రజతం 2016 రియో 4X100 మీ.రిలే స్వర్ణం 2016 రియో 4X400 మీ.రిలే స్వర్ణం 2020 టోక్యో 400 మీటర్లు కాంస్యం చదవండి: Tokyo Olympics: భారత బృందం ఆసియా రికార్డు.. కానీ -
53000 శిఖరంపై సెన్సెక్స్
ముంబై: చివరి అరగంటలో మెటల్, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 194 పాయింట్ల లాభంతో తొలిసారి 53వేల పైన 53,055 వద్ద స్థిరపడింది. ఈ స్థాయి సెన్సెక్స్‌కు సరికొత్త రికార్డు ముగింపు. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 15880 వద్ద నిలిచింది. అయితే రూపాయి బలహీనత, ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు సూచీల లాభాలను పరిమితం చేశాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. భారత తయారీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో మెటల్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ముందస్తు ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరగడంతో రియల్టీ షేర్లు రాణించాయి. మరోవైపు ఆటో, మీడియా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో ఈ రెండు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ చిన్న, మధ్య తరహా షేర్లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. ఉదయం సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 52,920 వద్ద, నిఫ్టీ రెండు పాయింట్ల స్వల్ప లాభంతో 15,820 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఆఖర్లో అనూహ్య కొనుగోళ్లతో సెన్సెక్స్ 244 పాయింట్లు ర్యాలీ చేసి 53,105 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 15,894 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.533 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.232 కోట్ల షేర్లను అమ్మారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఏడు పైసలు బలహీనపడి 74.62 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ (బుధవారం రాత్రి) వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలైన బాండ్లు, డాలర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ‘‘మిడ్‌సెషన్ తర్వాత మెటల్ షేర్లు రాణించడంతో మార్కెట్ బౌన్స్‌బ్యాక్ అయ్యింది. దేశీయంగా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే పరిణామాలేవీ లేకపోవడంతో రానున్న రోజుల్లో సూచీల గమనానికి అంతర్జాతీయ పరిణామాలే కీలకం కానున్నాయి. మార్కెట్ పతనమైతే జాగ్రత్త వహిస్తూ కొనుగోళ్లు చేయడం మంచిందే’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. పరుగులు పెట్టిన పేపర్ షేర్లు... కొన్నిరోజుల నుంచి స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్న పేపర్, పేపర్ ఉత్పత్తుల షేర్లు ఇంట్రాడేలో పరుగులు పెట్టాయి. స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పేపర్, పేపర్ ఉత్పత్తుల డిమాండ్ 11–15% వృద్ధి చెందుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. చైనాలో కలప ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ కలప కంపెనీలకు కలిసొస్తుందని నిపుణులు తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► స్టీల్ ఉత్పత్తిని తగ్గించాలని చైనా యోచిస్తున్న తరుణంలో స్టీల్ షేర్లు రాణించాయి. ► తొలి క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగినట్లు రియల్టీ ఎస్టేట్ సంస్థ శోభ లిమిటెడ్ ప్రకటనతో ఈ కంపెనీ షేరు ఆరు శాతం లాభపడి రూ. 521 వద్ద ముగిసింది. ► క్యూ1 అమ్మకాలు రెండింతల వృద్ధిని సాధించినప్పటికీ.., లాభాల స్వీకరణతో టైటాన్ షేరు రెండు శాతం నష్టపోయి రూ.1,727 వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► స్టీల్ ఉత్పత్తిని తగ్గించాలని చైనా యోచిస్తున్న తరుణంలో స్టీల్ షేర్లు రాణించాయి. ► తొలి క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగినట్లు రియల్టీ ఎస్టేట్ సంస్థ శోభ లిమిటెడ్ ప్రకటనతో ఈ కంపెనీ షేరు ఆరు శాతం లాభపడి రూ. 521 వద్ద ముగిసింది. ► క్యూ1 అమ్మకాలు రెండింతల వృద్ధిని సాధించినప్పటికీ.., లాభాల స్వీకరణతో టైటాన్ షేరు రెండు శాతం నష్టపోయి రూ.1,727 వద్ద స్థిరపడింది. -
మళ్లీ రికార్డుల ర్యాలీ..!
ముంబై: ఒకరోజు విరామం తర్వాత స్టాక్ మార్కెట్లో మళ్లీ కొత్త రికార్డులు నమోదయ్యాయి. మిడ్‌సెషన్ నుంచి ఇంధన, ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారం సూచీలు సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు లాభపడి 52,328 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు సూచీకి జీవితకాల గరిష్టస్థాయి. అంతకు ముందు సెన్సెక్స్‌కు (జూన్ 03న) జీవితకాల గరిష్ట ముగింపు స్థాయి 52,232గా ఉంది. ఇక నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 15,752 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 103 పాయింట్లు ర్యాలీ చేసి 15,773 స్థాయిని అందుకుంది. ముగింపు, ఇంట్రాడే స్థాయిలు నిఫ్టీకి జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో మూడేళ్ల తర్వాత నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్‌టైం హైని నమోదు చేయగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మరోసారి జీవితకాల గరిష్టం వద్ద ముగిసింది. మెటల్, ఫార్మా, ఆర్థిక, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. సూచీల రికార్డు ర్యాలీ తిరిగి మొదలవడంతో సోమవారం ఒక్కరోజే రూ.1.81 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రికార్డు స్థాయి రూ.229 లక్షల కోట్లకు చేరింది. గత శుక్రవారం విడుదలైన అమెరికా నిరుద్యోగ గణాంకాలు మార్కెట్ వర్గాలను నిరుత్సాహపరచడంతో ప్రపంచ మార్కెట్లు పరిమిత శ్రేణిలో కదలాడుతున్నాయి. ‘‘దేశంలో కరోనా కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను సడలించడం కలిసొచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ర్యాలీ కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది. నిఫ్టీకి 15,500–15,600 స్థాయిలో బలమైన మద్దతు ఉంది. అందుకే ట్రేడింగ్ ప్రారంభంలో అమ్మకాల ఒత్తిడి కలిగినా తట్టుకోగలిగింది. మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉన్నందున నిఫ్టీ 16,000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు’’ అని దీన్ దయాళ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ నిపుణుడు మనీష్ హతీరమణి తెలిపారు. ఇంట్రాడేలో ట్రేడింగ్ జరిగిందిలా! ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 131 పాయింట్ల లాభంతో 52,231 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 15,725 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భారీ ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఉదయం లాభాలన్నీ కోల్పోయాయి. అయితే మిడ్ సెషన్లో యూరో మార్కెట్ల లాభాల ప్రారంభం సూచీలకు ఉత్సాహాన్నిచ్చింది. అలాగే సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని వార్తలు వెలువడటంతో తిరిగి కొనుగోళ్లు మొదలయ్యాయి. ద్వితీయార్థంలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో ఒక దశలో నిఫ్టీ 103 పాయింట్లు ర్యాలీ చేసి 15,773 స్థాయిని అందుకుంది. సెన్సెక్స్ 279 పాయింట్లు లాభపడి 52,379 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. -
Nifty: సరికొత్త శిఖరాలకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు రాణించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభంతో ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడటం కూడా కలిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 308 పాయింట్లు లాభపడి 51,423 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 51,259 – 51,529 పాయింట్ల మధ్యలో ట్రేడైంది. మరో ఇండెక్స్ నిఫ్టీ మూడు నెలల విరామం తర్వాత ఇంట్రాడేలో 15,469 వద్ద సరికొత్త రికార్డును లిఖించింది. చివరకు 97 పాయింట్ల లాభంతో 15,436 వద్ద ముగిసింది. ఈ ముగింపు స్థాయి కూడా నిఫ్టీకి రికార్డు గరిష్టం. అలాగే ఆరోరోజూ లాభాలను గడించినట్లైంది. దేశీయ ఇన్వెస్టర్లు రూ.914 కోట్ల షేర్లను, విదేశీ ఇన్వెస్టర్లు రూ.661 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 882 పాయింట్లు, నిఫ్టీ 260 పాయింట్లు పెరిగాయి. ‘‘దేశంలో కోవిడ్ వ్యాధి సంక్రమణ రేటు క్షీణించడంతో పాటు డాలర్ ఇండెక్స్ పతనం భారత ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడుతూ ర్యాలీకి మద్దతుగా నిలుస్తోంది. ఆర్థిక రికవరీ ఆశలు, మెరుగైన క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో మార్కెట్ మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ మోదీ తెలిపారు. సూచీలకు మద్దతుగా రిలయన్స్ ర్యాలీ... అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు చాలాకాలం తరువాత లాభాల బాట పట్టింది. జెఫ్పారీస్‌తో సహా బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుకు బుల్లిష్ రేటింగ్‌ను కేటాయించాయి. ఇన్వెస్టర్లు ఈ షేరును కొనేందుకు ఆసక్తి చూపారు. ఎన్ఎస్ఈలో 6% లాభంతో రూ. 2,095 వద్ద స్థిరపడింది. -
కంబళలో మెరుపు వీరుడు
యశవంతపుర: బురద మడిలో దున్నపోతులతో పరిగెత్తే కర్ణాటక గ్రామీణ క్రీడ కంబళలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కంబళ పోటీల్లో ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తాడన్న రికార్డు సొంతం చేసుకున్న కర్ణాటక మంగళూరువాసి శ్రీనివాసగౌడ మరో ఘనతను సృష్టించాడు. మంగళూరు సమీపంలోని బెళ్తంగడి తాలూకా వేణూరు పెర్ముడ సూర్య– చంద్ర జోడు చెరువులో శనివారం జరిగిన కంబళ పోటీలలో గతంలో నమోదైన అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. గతంలో కంబళ పోటీలో 100 మీటర్ల దూరాన్ని 11:21 సెకన్లలో, తర్వాత 9.37 సెకన్లలో అధిగమించినదే అత్యుత్తమ రికార్డులు కాగా, తాజా పోటీలలో ఏకంగా 8.96 సెకన్లలో చేరుకుని నభూతో అనిపించాడు. పాత రికార్డులను శ్రీనివాసగౌడ తుడిచిపెట్టాడు. తాజా పోటీలో సురేశ్ 9.37 సెకన్లు, ఆనంద 9.57 సెకన్లతో రెండు, మూడోస్థానంలో నిలిచారు. -
ఐపీఎల్ వేలంలో క్రిస్ మోరిస్ కొత్త రికార్డు
ఐపీఎల్–2021 వేలంలో విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ఇప్పటికే నాలుగు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడిన క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వేలంలో ఒక ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం. బెంగళూరు జట్టు ఇద్దరు ఆటగాళ్ల కోసం ఏకంగా రూ. 29.25 కోట్లు వెచ్చించడం మరో చెప్పుకోదగ్గ అంశం. ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ. 14.25 కోట్ల విలువ పలుకగా, న్యూజిలాండ్‌కు చెందిన పేస్ బౌలర్ కైల్ జేమీసన్ ఏకంగా రూ. 15 కోట్లు అందుకోనున్నాడు. ఆసీస్ పేసర్ జాయ్ రిచర్డ్సన్ను సొంతం చేసుకునేందుకు పంజాబ్ టీమ్ రూ.14 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో ఈ నలుగురు క్రికెటర్లే రూ. 10 కోట్లకంటే ఎక్కువ ధర పలికారు. చెన్నై: ఎప్పటిలాగే ఐపీఎల్ వేలం అంచనాలకు భిన్నంగా అనూహ్యంగా సాగింది. కచ్చితంగా భారీ ధర పలకగలరని భావించిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోకపోగా, అనామకులుగా కనిపించిన మరికొందరు మంచి విలువతో లీగ్‌లోకి దూసుకొచ్చారు. మరికొందరు ఆటగాళ్ల స్థాయి, సామర్థ్యం, గత రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే ఆశించిదానికంటే చాలా ఎక్కువ మొత్తం లభించింది. దాదాపు అన్ని జట్లు వారి వ్యూహాలకు తగినట్లుగా ఆటగాళ్లను కొనసాగించడంతో మిగిలిన ఖాళీల కోసం, ఒక్క ఐపీఎల్ – 2021 కోసం మాత్రమే వేలం జరిగింది. 2015లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డు ధర (రూ. 16 కోట్లు– ఢిల్లీ)ని ఇప్పుడు మోరిస్ బద్దలు చేయడం విశేషం. ఐపీఎల్–2021 వేలం విశేషాలు చూస్తే... ► గత ఏడాది క్రిస్ మోరిస్‌కు బెంగళూరు రూ. 10 కోట్లు చెల్లించింది. వేలానికి ముందు అతడిని విడుదల చేసిన జట్టు ఆశ్చర్యకరంగా తాజా వేలంలో ఒక దశలో మోరిస్‌కు రూ. 9.75 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్ధం కావడం విశేషం. రూ. 10 కోట్లు దాటిన తర్వాత కూడా ముంబై, పంజాబ్ మోరిస్ కోసం ప్రయత్నించగా, చివరకు రాజస్తాన్ అతడిని తీసుకుంది. 2020 ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 34 పరుగులు చేసిన మోరిస్... 6.63 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. ► 6.8 అడుగుల పొడగరి అయిన కివీస్ పేసర్ కైల్ జేమీసన్ అనూహ్యంగా భారీ ధర పలికాడు. గత ఏడాది భారత్‌పై కివీస్ టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతని కోసం ఆర్సీబీ మొదటినుంచీ పోటీ పడింది. చివరి క్షణంలో పంజాబ్ తప్పుకోవడంతో జేమీసన్ బెంగళూరు సొంతమయ్యాడు. ► మ్యాక్స్‌వెల్ కోసం చివరి వరకు చెన్నై, బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి. రూ.4.40 కోట్లనుంచి ఈ రెండు జట్లూ అతడిని సొంతం చేసుకునేందుకు విలువ పెంచుకుంటూ పోయాయి. చివరకు ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. గత ఏడాది పంజాబ్ అతనికి రూ. 10.75 కోట్లు చెల్లించగా... ఘోరంగా విఫలమైన తర్వాత కూడా మ్యాక్సీ విలువ పెరగడం విశేషం. గత ఐపీఎల్లో మ్యాక్స్‌వెల్ 11 ఇన్నింగ్స్‌లలో కలిపి 108 పరుగులే చేయగలిగాడు. అతని స్ట్రైక్‌రేట్ కూడా అతి పేలవంగా 101.88గా మాత్రమే ఉంది. ► బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాయ్ రిచర్డ్సన్ కోసం సాగిన వేలం అందరినీ ఆశ్చర్యపరచింది. 9 అంతర్జాతీయ టి20లే ఆడిన అతని రికార్డు గొప్పగా లేకపోయినా భారీ విలువ పలికాడు. రూ.13.25 కోట్ల వరకు పోటీ పడిన ఆర్సీబీ చివరకు తప్పుకుంది. ► ఆస్ట్రేలియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని పేస్ బౌలర్ రిలీ మెరిడిత్ కోసం పంజాబ్ ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ► వేలంకు ముందు ఒకే ఒక విదేశీ ఆటగాడి స్థానం ఖాళీగా ఉన్న చెన్నై, మొయిన్ అలీని ఎలాగైనా తీసుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్‌తో పోటీ పడి ఆ జట్టు ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను భారీ మొత్తానికి ఎంచుకుంది. ► వరల్డ్ నంబర్‌వన్ టి20 బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌ను పంజాబ్ కేవలం రూ.1.50 కోట్లకే దక్కించుకుంది. ► రూ. 12.50 కోట్ల విలువతో గత ఐపీఎల్ వరకు రాజస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌ను ఢిల్లీ కేవలం రూ. 2.20 కోట్లకే సొంతం చేసుకుంది. ► ఆస్ట్రేలియా వన్డే, టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను రూ. 1 కోటి కనీస ధరకు కూడా ఎవరూ పట్టించుకోలేదు. ► గత ఐపీఎల్లో రూ. 8.5 కోట్లు పలికిన విండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్‌ను ఎవరూ ఎంచుకోలేదు. ► వేలంలో అందరికంటే చివరగా వచ్చిన పేరు అర్జున్ టెండూల్కర్. కనీస ధర రూ. 20 లక్షలు ముంబై బిడ్డింగ్ చేయగా మరే జట్టూ స్పందించలేదు. దాంతో అతను తన తండ్రి మెంటార్‌గా ఉన్న జట్టులోకి వచ్చేశాడు. విహారికి నిరాశ... ఆసీస్ పర్యటనలో ఆకట్టుకున్న ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారికి ఈ సారి కూడా ఐపీఎల్ అవకాశం దక్కలేదు. రూ. 1 కోటి కనీస విలువతో అతను వేలంలోకి రాగా, ఏ జట్టూ తీసుకోలేదు. భారత సీనియర్ టీమ్ సభ్యులలో లీగ్ అవకాశం దక్కనిది ఒక్క విహారికే! రెండో సారి అతని పేరు వచ్చినప్పుడు కూడా ఫ్రాంచైజీలు స్పందించలేదు. మళ్లీ ఐపీఎల్లో పుజారా భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాకు ఎట్టకేలకు ఐపీఎల్ అవకాశం దక్కింది. అతని కనీస ధర రూ.50 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. 2014 తర్వాత పుజారా ఐపీఎల్‌లోకి రావడం ఇదే తొలిసారి. పుజారాను చెన్నై ఎంపిక చేసుకున్న సమయంలో వేలంలో పాల్గొంటున్న అన్ని ఫ్రాంచైజీల సభ్యులందరూ చప్పట్లతో తమ సంతోషాన్ని ప్రకటించడం విశేషం! ఉమేశ్‌కు రూ. 1 కోటి మాత్రమే... భారత సీనియర్ పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌పై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అతని బేస్ ప్రైస్‌కే చివరకు ఢిల్లీ తీసుకుంది. గౌతమ్‌కు రికార్డు మొత్తం భారత్‌కు ప్రాతినిధ్యం వహించని అన్క్యాప్డ్ ఆటగాళ్లలో కృష్ణప్ప గౌతమ్‌కు బంగారు అవకాశం లభించింది. భారత ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ అవసరం ఉన్న చెన్నై ఎలాగైనా సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడంతో పోటీ పెరిగింది. హైదరాబాద్ రూ. 9 కోట్ల వరకు తీసుకు రాగా, చివరకు అతను చెన్నై చేరడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా గౌతమ్ నిలిచాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో 37 బంతుల్లో సెంచరీ చేసిన మొహమ్మద్ అజహరుద్దీన్‌ను రూ. 20 లక్షలకే బెంగళూరు ఎంచుకుంది. షారుఖ్ ఖాన్‌ను కొన్న ప్రీతి జింటా! తమిళనాడు జట్టు ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్టర్ షారుఖ్ ఖాన్‌పై అందరి ఆసక్తి కనిపించింది. రూ. 20 లక్షల కనీస ధరనుంచి ఢిల్లీ బిడ్డింగ్ మొదలు పెట్టగా, ఆర్సీబీ దానిని రూ. 5 కోట్ల వరకు తీసుకెళ్లింది. చివరకు అతను రూ.5.25 కోట్లకు పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. ముగ్గురిని మాత్రమే... గురువారం జరిగిన వేలంలో సన్‌రైజర్స్ టీమ్ కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు), ముజీబ్ ఉర్ రహమాన్ (రూ.1.50 కోట్లు), జె.సుచిత్ (రూ. 30 లక్షలు)లను మాత్రమే తీసుకుంది. టీమ్‌లో ఈ సారి హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేడు. వేలంలో ఆంధ్ర జట్టుకు చెందిన కేఎల్ భరత్ (రూ.20 లక్షలు – బెంగళూరు), హరిశంకర్ రెడ్డి (రూ. 20 లక్షలు – చెన్నై), హైదరాబాద్ జట్టునుంచి కె. భగత్ వర్మ (రూ. 20 లక్షలు – చెన్నై) ఎంపికయ్యారు. ► కైల్ జేమీసన్ (రూ. 15 కోట్లు – బెంగళూరు) ► మ్యాక్స్‌వెల్ (రూ. 14.25 కోట్లు – బెంగళూరు) ► జాయ్ రిచర్డ్సన్ (రూ. 14 కోట్లు – పంజాబ్) ► కృష్ణప్ప గౌతమ్ (రూ. 9.25 కోట్లు – చెన్నై) ► రిలీ మెరిడిత్ (రూ. 8 కోట్లు – పంజాబ్) ► మొయిన్ అలీ (రూ. 7 కోట్లు – చెన్నై) -
రికార్డులు సృష్టిస్తున్న భారత పబ్జీ ‘ఫౌజీ’
చైనా యాప్ అని 'పబ్జీ’ని నిషేధించడంతో దానికి పోటీగా ‘ఫౌజీ’ (ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్) తీసుకొచ్చారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ గేమ్ రికార్డ్ సృష్టించింది. మల్టీప్లేయిర్ ప్లేయర్ యాక్షన్ గేమ్‌గా భారత సైనికుల వీరోచిత పోరాటాలు ప్రతిబింబించేలా బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ ‘ఫౌజీ’ రూపొందించారు. భారత పబ్జీగా పిలువబడే ఫౌజీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నేతృత్వంలో రూపొందింది. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26వ తేదీన అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజు 24 గంటల్లో 3 లక్షల డౌన్లోడ్లు సాధించగా.. మూడు రోజుల్లోనే ఫౌజీ గేమ్ 50 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. (చదవండి: రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే?) గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యంత ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న గేమ్‌గా ఫౌజీ నిలవనుంది. అందరికంటే ముందుగా ఫ్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల మొబైల్ లలో ఆటోమేటిక్ గేమ్ డౌన్లోడ్ అయ్యింది. ఈ గేమ్‌ను సుమారు 500ఎంబీ సైజ్‌లో తీసుకొచ్చారు. ఫౌజీ గేమ్‌ని ఓపెన్ చేశాక మొదటి దశలో మూడు రకాల మోడ్స్ (క్యాంపెయిన్, టీమ్ డెత్ మ్యాచ్, ఫ్రీ ఫర్ ఆల్) కనిపిస్తాయి. ప్రస్తుతం క్యాంపెయిన్ మోడ్ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత దశలో అప్డేట్స్ రూపంలో మిగిలిన మోడ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్ మీడియంలో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి అల్ట్రా వరకు పెంచుకోవచ్చు. (చదవండి: మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా? ) ప్రస్తుతం పబ్జీ గేమ్‌లో మాదిరి మల్టీ ప్లేయర్‌కి సపోర్ట్ చేయకపోయినా తర్వాత దశలో మల్టీ ప్లేయర్ సపోర్ట్ తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో ఆధారంగా పనిచేస్తుంది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన గల్వాన్ లోయ థీమ్‌తో ఈ గేమ్ రూపొందింది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్ట్‌కు వెళ్తుంది. -
10 కోట్ల మందికి ‘హీరో’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ గొప్ప రికార్డు సృష్టించింది. కంపెనీ ప్రారంభమైన 1984 నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 కోట్ల ద్విచక్ర వాహనాలను తయారు చేసి మరో మైలురాయిని అధిగమించింది. భారత్ నుంచి ఈ రికార్డు సాధించిన తొలి వాహన కంపెనీగా పేరు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్న సంస్థగా వరుసగా 20 ఏళ్లుగా తన అగ్రస్థానాన్ని హీరో మోటోకార్ప్ పదిలపరుచుకుంది. తొలి 10 లక్షల యూనిట్లు అమ్మడానికి సంస్థకు 10 ఏళ్ల సమయం పట్టింది. 2004 నాటికి 1 కోటి, 2013 నాటికి 5 కోట్ల యూనిట్ల మార్కును చేరుకుంది. ఇక గడిచిన ఏడేళ్లలోనే 5 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలను తయారు చేయడం విశేషం. సంస్థ పట్టుదల, కలల ఫలానికి ఈ మైలురాయి చిహ్నం అని హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల ఆదరణ, నమ్మకం, కంపెనీ సామర్థ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఏటా 10 మోడళ్లు..: వృద్ధి ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తామని పవన్ ముంజాల్ తెలిపారు. ‘నూతన మోడళ్ల పరిశోధన, అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు పెడతాం. మొబిలిటీ రంగంలో కొత్త, ప్రత్యామ్నాయ పరిష్కారాలపై దృష్టిసారిస్తాం. ప్రపంచ అవసరాల కోసం భారత్‌లో వాహనాలను తయారు చేస్తున్నాం. అంతర్జాతీయంగా మరిన్ని దేశాలకు విస్తరిస్తాం. రానున్న అయిదేళ్లపాటు కొత్త వేరియంట్లు, అప్‌గ్రేడ్స్‌తో కలిపి ఏటా 10 మోడళ్లను పరిచయం చేస్తాం’ అని తెలిపారు. సెలబ్రేషన్ ఎడిషన్ మోడల్స్.. కొత్త మైలురాయిని అందుకున్న శుభ సందర్భంగా హీరో మోటోకార్ప్ ఆరు సెలబ్రేషన్ ఎడిషన్ మోడల్స్‌ను ఆవిష్కరించింది. వీటిలో స్ప్లెండర్ ప్లస్, ఎక్స్ట్రీమ్ 160ఆర్, ప్యాషన్ ప్రో, గ్లామర్, డెస్టిని 125, మాయెస్ట్రో ఎడ్జ్ 110 ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఇవి షోరూముల్లో అందుబాటులో ఉంటాయి. -
రికార్డుల మోత, టెక్ మహీంద్ర ఘనత
సాక్షి, ముంబై: వరుస రెండురోజుల నష్టాలకు చెక్ చెప్పిన దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం తిరిగి జోష్‌లోకి వచ్చాయి. చివరిదాకా అదే రేంజ్‌ను కొనసాగించాయి. భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభంలోనే మరో ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేశాయి. ఐటీ, ఆటో, ఫార్మా స్టాక్స్‌కు కొనుగోళ్ళ మద్దతుతో కీలక సూచీలు రికార్డుల మోత మోగించాయి. సరికొత్త గరిష్టాల నమోదుతో పాటు వారాంతంలో రికార్డు స్థాయి వద్ద ఉత్సాహంగా ముగిశాయి. చివరికి సెన్సెక్స్ 689 పాయింట్లు ఎగిసి 48782 వద్ద, నిఫ్టీ 219 పాయింట్ల లాభంతో 14347 వద్ద ముగిసాయి. ముఖ్యంగా 5 శాతం లాభంతో టెక్ మహీంద్రా 30 షేర్ల ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది అంతేకాదు ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్లబ్‌లోకి ప్రవేశించి, ఈ ఘనతను సాధించిన ఐదవ ఐటీ సంస్థగా అవతరించింది. తాజా లాభాలతో టెక్ మహీంద్ర మార్కెట్ క్యాప్ 1.01 ట్రిలియన్ రూపాయలుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, యూపీఎల్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా నిలిచాయి. యూపీఎల్, బీపీసీఎల్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్ నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు నిఫ్టీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఖరారు కావడంతో గ్లోబల్ మార్కెట్లు కూడా లాభాలనార్జించాయి. -
కొనసాగిన బుల్ రన్
ముంబై: స్టాక్ మార్కెట్లో విస్తృతస్థాయి కొనుగోళ్లు జరగడంతో బుధవారమూ బుల్ జోరు కొనసాగింది. ఒక్క ప్రభుత్వరంగ షేర్లలో తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరి కొత్త రికార్డులను నమోదుచేశాయి. ఇటీవల విడుదలైన మెరుగైన ఆర్థిక గణాంకాలు వ్యవస్థలో రికవరీని ప్రతిబింబింప చేయడం ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభం నుంచే కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ 403 పాయింట్లు లాభపడి 46,666 వద్ద ముగిసింది. నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 13,683 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. అత్యధికంగా రియల్టీ, మెటల్ షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,704 – 46,263 పాయింట్ల రేంజ్లో కదలాడగా, నిఫ్టీ 13,568 వద్ద కనిష్టాన్ని, 13,692 వద్ద గరిష్టాన్ని తాకాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ చర్చలు సఫలవంతమవుతాయనే ఆశలతో పాటు కోవిడ్–19 వ్యాక్సిన్ పంపిణీకి వేగవంతమైన చర్యలతో దేశీయ ఈక్విటీలు ఇప్పటికీ బుల్స్ గుప్పెట్లో ఉన్నట్లు రిలయన్స్ సెక్యూరిటీస్ స్ట్రాటజీ హెడ్ బినోద్ మోదీ వివరించారు. భారత మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ బుల్లిష్ వైఖరిని కలిగి ఉండడంతో సూచీలు రోజుకో రికార్డు నమోదవుతుందని ఆయనన్నారు. ప్రభుత్వరంగ షేర్లలో అమ్మకాలు... ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ప్రభుత్వరంగ(పీఎస్‌యూ)బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.60 శాతం పతనమైంది. 10 నెలల గరిష్టానికి నిఫ్టీ రియల్టీ ... ప్రధాన నగరాల్లో నివాసయోగ్యమైన స్థలాల అమ్మకాలు పెరగినట్లు గణాంకాలు వెల్లడితో రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 5.1% ఎగసింది. బర్గర్ కింగ్ రయ్.. రయ్ బంపర్ లిస్టింగ్‌తో ఇన్వెస్టర్లకు భారీ లాభాలన్ని పంచిన బర్గర్ కింగ్ షేర్లు ట్రేడింగ్‌లోనూ రాణిస్తున్నాయి. వరుసగా రెండోరోజూ 20 % లాభపడి రూ.199.25 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఇష్యూ ధర రూ.60తో ఐపీఓను పూర్తి చేసుకొని ఈ వారం ఎక్సే్చంజ్‌ల్లో లిస్టై్టన షేర్లు కేవలం మూడు రోజుల్లో 232% లాభాల్ని పంచాయి. -
సెన్సెక్స్@ 43,000- ఫైజర్ రికార్డ్
ముంబై: వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దౌడు తీస్తున్నాయి. వెరసి స్టాక్ మార్కెట్ల చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 43,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం 418 పాయింట్లు జంప్ చేసి 43,015 వద్ద ట్రేడవుతోంది. సోమవారం సైతం ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ సరికొత్త రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా ఫలితాలనిచ్చినట్లు పేర్కొనడంతో ఫైజర్ లిమిటెడ్ కౌంటర్ జోరందుకుంది. అమెరికన్ పేరెంట్ కంపెనీ ఫైజర్ ఇంక్ షేరు సోమవారం 7.5 శాతం లాభపడటంతో ఈ కౌంటర్ కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. 20 శాతం ప్లస్ జర్మన్ కంపెనీ బయో ఎన్‌టెక్ తో సంయుక్తంగా రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు ఫైజర్ ఇంక్ పేర్కొంది. ఈ నెలాఖరుకల్లా ఎమెర్జీన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించే వీలున్నట్లు అభిప్రాయపడింది. దీంతో దేశీ అనుబంధ సంస్థ ఫైజర్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్ఎస్ఈలో తొలుత 20 శాతం దూసుకెళ్లింది. రూ. 977 ఎగసి రూ. 5,900ను తాకింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుుకుంది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 5,256 వద్ద ట్రేడవుతోంది. -
మూడో రోజూ రికార్డ్ లాభాలు
దలాల్ స్ట్రీట్ ఆల్‌టైమ్ హై రికార్డ్‌లతో దద్దరిల్లుతోంది. ఇంధన, ఐటీ, వాహన షేర్ల జోరుతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం సానుకూల ప్రభావం చూపించింది. వరుసగా మూడో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను సృష్టించాయి. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 41,719 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరకు 115 పాయింట్ల లాభంతో 41,674 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 12,268 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 38 పాయింట్ల లాభంతో 12,260 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడినా, ఎన్ఎస్ఈ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కారణంగా ఒడిదుడుకులు చోటు చేసుకున్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. త్వరలో యూటీఐ ఏఎమ్‌సీ ఐపీఓ ప్రముఖ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, యూటీఐ ఏఎమ్‌సీ త్వరలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. ఈ ఐపీఓ సైజు రూ.3,000 కోట్లుగా ఉండగలదని అంచనా. సెన్సెక్స్ @ 45,500 వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 45,500 పాయింట్లకు, నిఫ్టీ 13,400 పాయింట్లకు చేరతాయని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. ఫార్మా, ఆగ్రో కెమికల్స్, ఆయిల్, గ్యాస్, కార్పొరేట్ బ్యాంక్‌లు, పెద్ద ఎన్బీఎఫ్సీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మిడ్‌క్యాప్ సిమెంట్ కంపెనీలు, నిర్మాణ రంగ షేర్లు లాభపడతాయని పేర్కొంది. -
సెన్సెక్స్ మద్దతు శ్రేణి 40,000–40,600
అమెరికా–చైనాల ట్రేడ్‌డీల్‌పై పరస్పర విరుద్ధ సంకేతాలు వెలువడటంతో గతవారం అమెరికాతో సహా అన్ని ప్రపంచ ప్రధాన స్టాక్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, భారత్ మార్కెట్లో రికార్డుల హోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మన మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన జీడీపీ డేటా తీవ్ర నిరుత్సాహాన్ని కల్గించింది. అయినా, ఈ అంశాన్ని ఇప్పటికే మార్కెట్ చాలావరకూ డిస్కౌంట్ చేసుకున్నందున, సమీప భవిష్యత్‌లో అంతర్జాతీయ పరిణామాలే ఈక్విటీలను నడిపించవచ్చని అధికశాతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి..... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... నవంబర్ 29తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 41,163 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పిన తర్వాత వారాంతంలో చిన్నపాటి కరెక్షన్కు లోనయ్యింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 435 పాయింట్ల లాభంతో 40,794 పాయింట్ల వద్ద ముగిసింది. అక్టోబర్ తొలి మూడు వారాల్లోనూ గట్టిగా నిరోధించిన 40,000–40,600 పాయింట్ల శ్రేణి రానున్న రోజుల్లో మద్దతును అందించే అవకాశం వుంటుంది. ఈ వారంలో సెన్సెక్స్‌కు తొలుత 40,600 పాయింట్ల సమీపంలో మద్దతు లభిస్తున్నది. ఈ దిగువన 40,390 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 40,000 పాయింట్ల స్థాయికి దిగజారవచ్చు. ఈ వారం సెన్సెక్స్ రెండో మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే వేగంగా 40,990 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన మరోదఫా 41,160 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 41,450–41,500 పాయింట్ల శ్రేణిని అందుకునే ఛాన్సుంటుంది. నిఫ్టీ తక్షణ మద్దతు 12,005 కొత్త రికార్డును నెలకొల్పడంలో సెన్సెక్స్‌కంటే వెనుకబడి వున్న ఎన్ఎస్ఈ నిఫ్టీ చిట్టచివరకు గతవారం ఈ ఫీట్ సాధించింది. 12,158 పాయింట్ల వద్ద రికార్డుగరిష్టస్థాయిని నమోదుచేసి, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 142 పాయింట్ల లాభంతో 12,056 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే నిఫ్టీ 12,005 పాయింట్ల సమీపంలో తొలి మద్దతును పొందవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 11,920 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 12,800 పాయింట్ల వద్ద గట్టి మద్దతు లభిస్తున్నది. ఈ వారం రెండో మద్దతుస్థాయిని నిఫ్టీ పరిరక్షించుకుంటే 12,100 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన ముగిస్తే తిరిగి 12,160 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన క్రమేపీ 12,250 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే అవకాశాలుంటాయి. -
రికార్డుల హోరు
స్టాక్ మార్కెట్లో రికార్డుల మోత మోగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను నెలకొల్పింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన స్థాయి, 11,900 పాయింట్ల ఎగువకు ఎగబాకింది. కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించి పోతుండటం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు....వీటన్నింటి ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లోనే ముగిశాయి. మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పుంజుకొని 70.77 కు చేరడం సానుకూల ప్రభావం చూపించింది. అయితే సెన్సెక్స్ రికార్డ్ లాభాల కారణంగా పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఇంట్రాడే లాభాలు తగ్గాయి. లోహ, టెలికం, ఐటీ షేర్లు లాభపడగా, వాహన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. రికార్డ్ బ్రేక్... బీఎస్ఈ సెన్సెక్స్ 137 పాయింట్ల లాభంతో 40,302 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్‌కు జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపు దీంతో ఈ ఏడాది జూన్ 3 నాటి ఆల్‌టైమ్ క్లోజింగ్ రికార్డ్, 40,268 పాయింట్ల రికార్డ్ బద్దలైంది. ఇక ఇంట్రాడేలో కూడా సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 40,483 పాయింట్లను తాకింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 11,941 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్‌టైమ్ హై (12,103 పాయింట్లు)కు 162 పాయింట్ల దూరంలో నిఫ్టీ ఉంది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. లాభాల స్వీకరణ కారణంగా ఆరంభ లాభాలు ఆవిరైనా, చివరకు లాభాల్లోనే ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అన్నీ శుభ శకునములే... విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ రిస్క్‌లు తగ్గుముఖం పట్టటం, వృద్ధి జోరు పెంచడం లక్ష్యంగా మరిన్ని సంస్కరణలకు కేంద్రం తెరతీయనున్నదన్న వార్తలు... ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిస్తున్నాయి. ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్లో రూ.16,464 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోళ్లు జరపడం ఇది వరుసగా రెండో నెల. చైనా–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు దశకు రావడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ► అవకతవకలు చోటు చేసుకున్నాయనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని కంపెనీ స్పష్టతనివ్వడంతో ఇన్ఫోసిస్ షేర్ 3 శాతం లాభంతో రూ.709 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ► ఈ క్యూ2లో రూ.629 కోట్ల నికర నష్టాలు రావడంతో యెస్ బ్యాంక్ షేర్ ఇంట్రాడేలో 10 శాతం మేర పతనమై రూ.60ను తాకింది. ఆ తర్వాత రికవరీ అయి 0.75 శాతం నష్టంతో రూ.66 వద్ద ముగిసింది. ఒక దశలో ఈ షేర్ 8 శాతానికి పైగా లాభంతో రూ.71ను తాకడం విశేషం. ► సెన్సెక్స్‌తో పాటు పలు షేర్లు కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్, అబాట్ ఇండియా, అదానీ గ్రీన్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ బ్యాంక్, ఐనాక్స్ లీజర్, మణప్పురం ఫైనాన్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, మిధాని, ఎమ్‌ఎస్‌టీసీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
రూ.17.75 లక్షలు పలికిన ఫిల్మ్ నగర్ లడ్డూ
-
ఫిల్మ్ నగర్ గణపతి లడ్డూ సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో లంబోదరుడి లడ్డూ ప్రసాదాలకు ఉన్న క్రేజ్ ఆ ‘ధర’హో అనిపిస్తోంది. లడ్డూ ప్రసాదమంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగే బాలాపూర్ లడ్డూ ధరను ఈసారి ఫిల్మ్‌నగర్ బస్తీ వినాయక్ నగర్ గణపతి లడ్డూ ధర దాటేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ కన్నా వినాయక్ నగర్ లడ్డూ ధర ఎక్కువ పలికింది. బీజీపీ నేత పల్లపు గోవర్ధన్ ఈ లడ్డూను రూ.17.75 లక్షలకు సొంతం చేసుకున్నారు. గత ఏడాది వినాయక్ నగర్ లడ్డూ రూ.15.1 లక్షలు పలికి నగరంలో రెండో స్థానం దక్కించుకుంది. ఇక ఈ ఏడాది బాలాపూర్ వినాయకుడి లడ్డూ 17.60 లక్షలు పలికింది. దీన్ని కొలను రాంరెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నాడు. -
కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీలు
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక వృద్ధిరేటు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. మే నెల వాహన విక్రయాలు నిరాశపరిచాయి. కంపెనీల క్యూ4 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య మన స్టాక్ మార్కెట్ కూడా పడిపోవాలి. కానీ దీనికి భిన్నంగా సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల సునామీ వెల్లువెత్తింది. కీలక రేట్లను ఆర్బీఐ తగ్గించగలదన్న అంచనాలకు సంస్కరణలు కొనసాగుతాయనే ఆశలు కూడా జత కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను నెలకొల్పాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 12 వేల పాయింట్లపైకి ఎగబాకాయి. ప్రపంచ మార్కెట్లు నష్టపోయినా, ముడి చమురు ధరలు భారీగా పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, రూపాయి బలపడటం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 553 పాయింట్ల లాభంతో 40,268 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 166 పాయింట్లు పెరిగి 12,089 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్ల ఎగువున ముగియడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,309 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,103 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. మార్కెట్ పరుగు సంబరాల్లో బీఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ తదితరులు రూ.1.76 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.76 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1,76,402 కోట్ల నుంచి రూ.1,56,14,417 కోట్లకు ఎగసింది. లాభాలు ఎందుకంటే..! 1. రేట్ల కోత అంచనాలు గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి, 5.8 శాతానికి చేరిందని కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్ఓ) శుక్రవారం వెల్లడించింది. మార్చి క్వార్టర్లో జీడీపీ తగ్గడంతో ఈ వారంలో జరిగే మోనేటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)సమావేశంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బలం పుంజుకున్నాయి. దీంతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయని నిపుణులంటున్నారు. 2. ప్యాకేజీ, సంస్కరణలపై ఆశలు.... గత క్యూ4 జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి పడిపోవడంతో వినియోగం జోరును పెంచే సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తెస్తుందనే ఆశలు పెరిగాయి. శుక్రవారం జరిగిన తొలి కేబినెట్ భేటీలో రైతులు, చిన్న వ్యాపారులకు కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవడం కలిసి వచ్చింది. 3. భారీగా చమురు ధరల పతనం ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి చూస్తే, ముడి చమురు ధరలు 15 శాతం మేర పతనమయ్యాయి. గత శుక్రవారం నాడే 2 శాతం క్షీణించగా, సోమవారం 1 శాతం పతనమయ్యాయి. 4. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు గత నెల మొదటి మూడు వారాల వరకూ నికర అమ్మకందారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు ఎన్నికల ఫలితాల కారణంగా నికర కొనుగోలుదారులుగా మారారు. మొత్తం మే నెలలో రూ.9,031 కోట్లు నికర పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు ఒక్క సోమవారం రోజే రూ.3,069 కోట్ల మేర మ న స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం విశేషం. 5. పుంజుకున్న రూపాయి డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు పుంజుకుని 69.26కు చేరింది. 6. జూన్ రోల్ ఓవర్ల జోరు జూన్ సిరీస్ నిఫ్టీ ఫ్యూచర్స్ రోల్ ఓవర్స్ 72 శాతంగా ఉన్నాయి. ఈ రోల్ ఓవర్స్ మూడు నెలల సగటు 69 శాతమే. మూడు నెలల సగటు కన్నా అధికంగా ఉండటం మార్కెట్ షార్ట్‌టర్మ్ ట్రెండింగ్ పీరియడ్‌లోకి ప్రవేశించడాన్ని సూచిస్తోందని టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. 7. హెవీ వెయిట్స్ ర్యాలీ సూచీలో హెవీ వెయిట్స్‌ను చూస్తే, సెన్సెక్స్ మొత్తం 553 పాయంట్ల లాభంలో ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాయే 91 పాయింట్లుగా ఉంది. హెచ్డీఎఫ్సీ వాటా 76 పాయింట్లుగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 63 పాయింట్లుగా, టీసీఎస్ వాటా 45 పాయింట్లు, హెచ్‌యూఎల్ వాటా 36 పాయింట్లుగా ఉంది. మొత్తం మీద ఈ ఐదు షేర్ల వాటాయే 311 పాయింట్లుగా ఉంది. మరిన్ని విశేషాలు... ► 31 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు –ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీలు నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి. ► బీఎస్ఈలో 19 రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ► నిఫ్టీ 50లో 44 షేర్లు లాభపడగా, ఆరు షేర్లు నష్టపోయాయి. ► మే నెలలో వాహన విక్రయాలు 13 శాతం పెరగడంతో హీరో మోటొకార్ప్ షేర్ 6 శాతం లాభంతో రూ.2,843 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► గత వారం ముడి చమురు ధరలు బాగా పతనం కావడంతో పెయింట్, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, టైర్, విమానయాన సంస్థల షేర్లు లాభపడ్డాయి. ► విమానయాన ఇంధనం ధరలు తగ్గడంతో విమానయాన రంగ షేర్లు జోరుగా పెరిగాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హై, రూ.157ను తాకిన స్పైస్‌జెట్ చివరకు 4 శాతం లాభంతో రూ.152 వద్ద ముగిసింది. ► నికర లాభం దాదాపు రెట్టింపు కావడంతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ షేర్ 10 శాతం పెరిగి రూ.1,360 వద్ద ముగిసింది. ► గత క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతోఅదానీ గ్యాస్‌సహా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. ► స్టాక్ మార్కెట్ దుమ్మురేపుతున్నా, హెరిటేజ్ ఫుడ్స్ షేర్ సోమవారం 5 శాతం పతనమై, 30 నెలల కనిష్ట స్థాయి, రూ.388ని తాకింది. చివరకు 5.3 శాతం నష్టంతో రూ.391 వద్ద ముగిసింది. కంపెనీ ప్రమోటరైన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయం పాలవడంతో గత ఏడు రోజుల్లో ఈ షేర్ 20 శాతం మేర పతనమైంది. ► ముడి చమురు ధరలు తగ్గడం, రేట్ల కోత అంచనాలు బలం పుంజుకోవడంతో ప్రభుత్వ బాండ్ల రాబడులు పడిపోయాయి. పదేళ్ల బాండ్ల రాబడులు 6.998 శాతానికి చేరాయి. 2017, నవంబర్ తర్వాత బాండ్ల రాబడులు 7 శాతం దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. ► సెన్సెక్స్, నిఫ్టీలతో పాటే ఇంట్రాడేలో పలు షేర్లు ఆల్‌టైమ్ హైలను తాకాయి. బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ, అదానీ గ్యాస్, గుజరాత్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి -
టైటానిక్‌ను ముంచేశారు
... అవును ‘అవెంజర్స్’ సూపర్ హీరోస్ ‘టైటానిక్’ (1997)ను ముంచేశారు. ఈ విషయాన్ని టైటానిక్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌నే స్వయంగా చెప్పారు. ‘అవెంజర్స్’ ఫ్రాంౖచైజీలో ఇటీవల విడుదలైన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమా బాక్సాఫీస్‌ను దుమ్ము రేగ్గొట్టి కొత్త రికార్డులను సృష్టిస్తోంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘టైటానిక్’ సినిమా రికార్డులను ఈ చిత్రం దాటేసింది. ఈ విషయంపై జేమ్స్ కామెరూన్ స్పందిస్తూ... ‘‘కెవిన్ ఫీజ్ (నిర్మాత, మార్వెల్ సంస్థ అధినేత) అండ్ అవెంజర్స్ టీమ్.. వాస్తవంలో ఓ మంచుకొండ నిజమైన టైటానిక్ షిప్‌ను ముంచేసింది. కానీ నా ‘టైటానిక్’ను మీ అవెంజర్స్ టీమ్ ముంచేశారు. లైట్స్ట్రామ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో భాగస్వాములైన మేమంతా మీ విజయానికి సెల్యూట్ చేస్తున్నాం. సినిమా పరిశ్రమ మరింత ప్రగతిపథంలో ముందుకు వెళ్తోందని మీరు నిరూపించారు’’ అని అన్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ (2009) కలెక్షన్స్‌ని కూడా ‘అవేంజర్స్: ఎండ్‌గేమ్’ దాటేస్తుందని కొందరు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్ ‘అవతార్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు జేమ్స్ కామెరూన్. ఈ చిత్రం 17 డిసెంబరు 2021న విడుదల కానుంది. -
ఐరోపా అగ్నిగుండం
ఐరోపాలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. స్వీడన్, గ్రీస్‌లలో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. బ్రిటన్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా యూరోపియన్ దేశాలు భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నాయి. 2018 సంవత్సరం ఎండల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎందుకీ ఎండలు? ఈ ఏడాదే ఎందుకిలా మంటలు? ఒకటా రెండా.. దీనికి బోలెడన్ని కారణాలున్నాయి. రీడింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లెన్ షాఫ్రే అంచనా ప్రకారం వాతావరణంలో గాలి పీడనం ఎక్కువైతే ఉష్ణోగ్రతలు పెరగడం సహజం. అయితే బలమైన గాలులు వీస్తే పీడనం తగ్గిపోయి వాతావరణం చల్లబడుతుంది. కానీ ఈ ఏడాది అంత బలమైన గాలులు లేకపోవడంతో వేసవి పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగాయి. గాలులు ఎంత వేగంతో వీస్తాయన్నది ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాల్లోని ఉష్ణోగ్రతల మధ్య ఉన్న తేడాపై ఆధారపడి ఉం టుంది. వేగం తక్కువగా ఉండటంతో ఈ ఏడాది దక్షిణార్ధ గోళం నుంచి బయలుదేరిన గాలులు యూరోపియన్ దేశాలకు చేరేందుకు ఎక్కువ కాలం పడుతోంది. అంతేకాకుండా దిశ కూడా మార్చుకోవడంతో పరిస్థితి దిగజారుతోంది. భూతాపోన్నతీ కారణమే... పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల భూమి క్రమేపీ వేడెక్కుతోందని మనకు తెలుసు. కొన్ని దేశాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేందుకు ఈ భూతాపోన్నతి కూడా కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉత్తర అట్లాంటిక్ సముద్ర ఉపరితలంపై వస్తున్న అనూహ్య మార్పుల కారణంగా బ్రిటన్, ఐర్లాండ్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఏర్పడే ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి లానినో పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ వచ్చే సరికి లానినో బలహీనమై ఎల్‌నినో పరిస్థితులు వచ్చేశాయి. దీంతో బ్రిటన్‌లో పొడి వాతావరణం నెలకొని ఉక్కబోత భరించలేని స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు ప్రపంచంలో 1976 సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా రికార్డులకెక్కింది. ఈ ఏడాది వివిధ దేశాల్లో ఇదే పరిస్థితి కొనసాగితే ఆ నాటి పరిస్థితే మళ్లీ పునరావృతమవుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూకేలో రికార్డులు బద్దలు... ఇంగ్లండ్‌లో ఎండలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే గత 400 ఏళ్ల రికార్డులు బద్దలైపోయాయి. 1600 సంవత్సరం తర్వాత ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు చేరుకోవడం ఈ ఏడాదే. ఎప్పుడూ 20 నుంచి 25 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఇంగ్లండ్‌లో ఈ వారం ఏకంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై జనాల్ని బెంబేలెత్తిస్తోంది. స్వీడన్, గ్రీస్‌లలో ఈ శతాబ్దంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. గత కొన్ని రోజు లుగా స్వీడన్లో ఉత్తరాన ఉన్న లాప్‌ల్యాండ్ నుంచి దక్షిణాదిన ఉన్న గోటాల్యాండ్ వరకు 44 ప్రాంతాల్లో అడవులు దగ్ధమవుతున్నాయి. అమెరికా, ఆసియాలోనూ... అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో రికార్డు స్థాయిలో 38 డిగ్రీల సెల్సియస్ నమోదైతే సౌదీ అరేబియాలో 46 డిగ్రీలు దాటిపోయాయి. జపాన్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోవడంతో ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గత వారంలోనే 65 మంది మరణించగా మరో 22 వేల మంది వడదెబ్బ తగిలి ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో ఆ దేశం ఎండల్ని ఒక ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించింది. ప్రపంచ దేశాల్లో ఎండల తీవ్రత ఆగస్టు నెలాఖరువరకు కొనసాగే అవకాశాలున్నాయని గ్లోబల్ ఫోర్కాస్ట్ సిస్టమ్, నేషనల్ ఓషన్ అట్మా స్ఫియర్ అడ్మినిస్ట్రేషన్లు అంచనా వేస్తున్నాయి. -
ట్విట్టర్లో పవన్ ఫ్యాన్స్ దండయాత్ర
సాక్షి, హైదరాబాద్: పవన్ కల్యాణ్‌కు అభిమానులు ప్రపంచం నలుమూలలా ఉంటారనేది టాలీవుడ్ సత్యం. ఆయన పుట్టిన రోజున వచ్చిందంటే చాలు అభిమానులకు పండుగే. అన్నదానాలు, రక్తదానాలు, సేవా కార్యక్రమాలతో ఘనంగా జరుపుతారు. పవన్‌కల్యాణ్‌కు రికార్డులు సృష్టించడం కొత్తేం కాదు. ఆయన లాగే ఆయన అభిమానులు అంతే, బర్త్‌డే వచ్చింది అంటే చాలు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తారు. నేడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు ట్విట్టర్‌పై దండయాత్ర చేశారు. తమ అభిమాన నాయకుడి పేరు మీద రికార్డులు నమోదు చేశారు. నేడు పవన్ పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ 25గంటల్లో దాదాపు 30లక్షల పైగా ట్వీట్లు చేశారు. ఇప్పుడు ఇది ఒక రికార్డు. ఇందుకోసం అభిమానులందరూ ఒకే ట్వీట్ హాష్ టాగ్ తీసుకొని ట్వీట్లు చేశారు. ట్విట్లర్లో ఒక సెలబ్రిటీ, సినీ నటుడి పుట్టిన రోజున అత్యధిక ట్వీట్లు చేయడం ఓ రికార్డు. గతంలో తారక్, మహేష్ బాబుల పుట్టిన రోజున అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్లు చేసి రికార్డు సృష్టించారు. -
సిటీలో కబాలి రికార్డులు
సాక్షి, సిటీబ్యూరో: సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన చిత్రం కబాలి. మేనియా ఇప్పుడు సిటీకి పట్టుకొంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా నగరంలోని 360 థియేటర్లలో 1440 ప్రదర్శనలతో శుక్రవారం రికార్డులు బద్దలు కొడుతూ విడుదలవుతోంది. నగరంలోని రికార్డులు వరుసగా.. ♦ నగరంలో సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు అత్యధికంగా 200 థియేటర్లలో విడుదల అవుతాయి. ‘బాహుబలి’ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 250 థియేటర్లలో విడుదలైంది. ♦ ఇప్పుడు ‘కబాలి’ ఏకంగా 360 థియేటర్లలో విడుదలవుతోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, దిల్సుఖ్నగర్, అబిడ్స్, ఉప్పల్, సికింద్రాబాద్, మెహదీపట్నం, కూకట్పల్లి, ఈసీఐఎల్, పంజగుట్ట తదితర అన్ని ప్రాంతాల్లోని థియేటర్లు అడ్వాన్స్ బుకింగ్‌లతో హోరెత్తిపోతున్నాయి. మల్టీప్లెక్స్‌లలో 180 ప్రదర్శనలు.... ♦నగరంలోని మల్టీప్లెక్స్‌లలో బుధవారం రాత్రి 10 గంటలకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన పావుగంటలోనే ఏకంగా 3 రోజుల టిక్కెట్లు బుక్ అయ్యాయి. ♦ శుక్రవారం సినిమా విడుదల రోజున నగరంలోని అన్ని మల్టీప్లెక్స్‌లలో కలిసి 180 షోలు ప్రదర్శిస్తున్నారు. ♦చాలాచోట్ల మల్టీఫె్లక్స్లలో ఉదయం నుంచి రాత్రిదాకా అన్ని స్క్రీన్లపైన కబాలి ఆడబోతున్నది. ♦ మరోవైపు అనేక కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు కబాలి సినిమా టిక్కెట్లను గిఫ్ట్‌గా ఇవ్వడానికి పెద్ద మొత్తంలో బల్క్బుకింగ్లు చేశాయి. ♦ చాలావరకు మల్టీప్లెక్స్ థియేటర్లు కార్పొరేట్ సంస్థల బుకింగ్‌లతోనే నిండిపోయాయి. మూడు, నాలుగు రోజుల వరకు కార్పొరేట్ సంస్థలే కబాలి షోలను కొనుగోలు చేసినట్లు థియేటర్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ♦ఇక టిక్కెట్ల కోసం మల్టీప్లెక్స్‌ల వద్ద నానా తిప్పలుపడ్డ అభిమానులు పలువురు తమకు తెలిసిన రాజకీయ నేతలు, పోలీసులు, ఇతర అధికారులను ఆశ్రయించారు. టిక్కెట్ల కోసం పైరవీలు చేస్తున్నారు. ♦కెపిహెచ్బి కాలనీలోని సినీపోలీస్, పీవీఆర్ సినిమా మాల్స్ తదితర థియేటర్లు వచ్చే ఆదివారం వరకు అడ్వాన్స్ బుకింగ్‌లతో నిండిపోయాయి. గత రెండు రోజులుగా జనం ఈ థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం పడిగాపులు కాశారు. ♦జనం రద్దీని గమనించిన నిర్వాహకులు గురువారం ఏకంగా టికెట్లు అయిపోయాయని మైకుల్లో ప్రచారం చేయాల్సి వచ్చింది.