ముంబై: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ గ్రూప్ భారత్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. 17 ఏళ్ల కంపెనీ చరిత్రలో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లు దేశీయంగా 10,000 యూనిట్ల మార్కును తొలిసారిగా దాటాయి. గతేడాదితో పోలిస్తే 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య 10 శాతం వృద్ధితో 10,556 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో 10,056 బీఎండబ్ల్యూ, 500 యూనిట్లు మినీ బ్రాండ్‌లో విక్రయించింది.
2023 జనవరి–సెపె్టంబర్ మధ్య రెండు బ్రాండ్లలో కలిపి మొత్తం 9,580 యూనిట్లు రోడ్డెక్కాయి. మోటరాడ్ బ్రాండ్‌లో 5,638 యూనిట్ల మోటార్‌సైకిల్స్ సైతం అమ్ముడయ్యాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో విక్రమ్ పావా తెలిపారు. బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లలో ఈ ఏడాది 725 ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై పరుగుతీస్తున్నాయని చెప్పారు. భారత్‌లో లగ్జరీ కార్ల రంగంలో 2,000 యూనిట్ల ఈవీల అమ్మకాల మార్కును దాటిన తొలి కంపెనీగా స్థానం సంపాదించామన్నారు. బీఎండబ్ల్యూ భారత్‌లో శుక్రవారం ఎం4 సీఎస్ లగ్జరీ స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.89 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment