పవన్ కల్యాణ్‌కు అభిమానులు ప్రపంచం నలుమూలలా ఉంటారనేది టాలీవుడ్ సత్యం.
సాక్షి, హైదరాబాద్: పవన్ కల్యాణ్‌కు అభిమానులు ప్రపంచం నలుమూలలా ఉంటారనేది టాలీవుడ్ సత్యం. ఆయన పుట్టిన రోజున వచ్చిందంటే చాలు అభిమానులకు పండుగే. అన్నదానాలు, రక్తదానాలు, సేవా కార్యక్రమాలతో ఘనంగా జరుపుతారు.
పవన్‌కల్యాణ్‌కు రికార్డులు సృష్టించడం కొత్తేం కాదు. ఆయన లాగే ఆయన అభిమానులు అంతే, బర్త్‌డే వచ్చింది అంటే చాలు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తారు. నేడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు ట్విట్టర్‌పై దండయాత్ర చేశారు.
తమ అభిమాన నాయకుడి పేరు మీద రికార్డులు నమోదు చేశారు. నేడు పవన్ పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ 25గంటల్లో దాదాపు 30లక్షల పైగా ట్వీట్లు చేశారు. ఇప్పుడు ఇది ఒక రికార్డు. ఇందుకోసం అభిమానులందరూ ఒకే ట్వీట్ హాష్ టాగ్ తీసుకొని ట్వీట్లు చేశారు. ట్విట్లర్‌లో ఒక సెలబ్రిటీ, సినీ నటుడి పుట్టిన రోజున అత్యధిక ట్వీట్లు చేయడం ఓ రికార్డు. గతంలో తారక్, మహేష్ బాబుల పుట్టిన రోజున అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్లు చేసి రికార్డు సృష్టించారు.