#JusticeforPunjabiGirl ట్రెండింగ్‌ | Justice For Punjabi Girl Hashtag Trending on Twitter After Posani Krishna Murali Pressmeet | Sakshi
Sakshi News home page

#JusticeforPunjabiGirl ట్రెండింగ్‌

Published Tue, Sep 28 2021 2:04 PM | Last Updated on Tue, Sep 28 2021 2:20 PM

Justice For Punjabi Girl Hashtag Trending on Twitter After Posani Krishna Murali Pressmeet - Sakshi

#JusticeforPunjabiGirl ఈ హ్యాష్‌టాగ్‌ ఇప్పుడు ట్విటర్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. పంజాబ్‌ యువతికి న్యాయం చేయాలని నెటిజన్లు ట్విటర్‌ వేదికగా నినదిస్తున్నారు. పంజాబ్ అమ్మాయిని మోసం చేసిన వాడిని జైలు ఊచలు లెక్కించేలా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌పై రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ డిమాండ్‌ తెరపైకి వచ్చింది. 

‘రిప్లబిక్‌’ సినిమా ప్రిరిలీజ్‌ ఫంక్షన్‌లో జనసేన పార్టీ నాయకుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి సోమవారం స్పందించారు. టాలీవుడ్‌లో సినిమా అవకాశాల కోసం వచ్చిన పంజాబ్‌ యువతిని ప్రముఖ వ్యక్తి ఒకరు మోసం చేశాడని పోసాని వెల్లడించారు. అంతేకాకుండా ఈ విషయం బయటపెడితే చంపేస్తానని ఆమెను బెదిరించాడని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేస్తే పవన్‌కల్యాణ్‌కు గుడి కడతానని పోసాని మీడియా ముఖంగా ప్రకటించారు. 

పంజాబ్‌ యువతికి న్యాయం చేయించండి.. పవన్‌కల్యాణ్‌కు గుడి కడతా


పోసాని ప్రకటన తర్వాత సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలయింది. పంజాబ్‌ యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు పెట్టాలని, బాధితురాలికి న్యాయం చేయాలని నెటిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. కొంతమంది అయితే సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. దీంతో #JusticeforPunjabiGirl హ్యాష్‌టాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ వార్త రాసే సమయానికి 42 వేలకు పైగా ట్వీట్లు నమోదయ్యాయి.

రెండు సార్లు అబార్షన్‌.. చాలా డిప్రెషన్‌కు లోనయ్యా: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement