సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మరోసారి రుజువైంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్.. సీఎం చంద్రబాబును పైకెత్తబోయి బోల్తా పడ్డారు. వరదల సమయంలోనూ చంద్రబాబు భజన మానలేదు. వరద సహాయ చర్యలపై ఎక్స్‌లో పెట్టిన ట్వీట్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అవగాహన రాహిత్యం బయటపడింది.
సీఎం చంద్రబాబుని పొగిడేందుకు ఫేక్ ఫోటోలను పవన్ పోస్ట్ చేశారు. ఏఐ ఫోటోలను పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్.. విమర్శలు రావడంతో మళ్ళీ ఆ ఫోటో ఎక్స్ నుంచి తీసేశారు. ప్రచారం కోసం టీడీపీ తయారు చేసిన ఫేక్ ఫొటోను పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్ విమర్శల పాలయ్యాడు.
వరద బీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడ పవన్ కల్యాణ్ తీరిగ్గా స్పందించిన సంగతి తెలిసిందే. విమర్శలు రావడంతో కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన తర్వాత అధికారులతో కలిసి మానిటరింగ్ నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో తప్పులు కప్పి పుచ్చుకునేందుకు పవన్.. ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీ, అధికారులపై నెట్టేసే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment