birth day
-
Kalpana Chawla: రెండు పుట్టిన రోజుల వ్యోమగామి
కల్పనా చావ్లా(Kalpana Chawla).. అంతరిక్షానికి వెళ్లిన తొలి భారతీయ మూలాలు కలిగిన మహిళగా పేరొందారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆమె పుట్టిన రోజు విషయంలో విరుద్ధ వాదన వినిపిస్తుంది. ఆమె పుట్టిన తేదీ 1962 మార్చి 17 అని కొందరు.. కాదు కాదు 1961, జూలై ఒకటి అని కొందరు చెబుతుంటారు. ఇంతకీ దీనిలో ఏది సరైనది?కల్పనా చావ్లా హర్యానా(Haryana)లోని కర్నాల్‌లో 1962, మార్చి 17న జన్మించారు. బాల్యంలో ఆమె విమానాలన్నా, విమాన ప్రయాణాలన్నా ఎంతో ఆసక్తి చూపేది. ఈ ఆసక్తితోనే ఆమె తన తండ్రితో పాటు స్థానిక ఫ్లయింగ్ క్లబ్‌కు తరచూ వెళుతుండేది. అక్కడి విమానాలను చూసి మురిసిపోతుండేది. తరువాత ఆమె అమెరికా చేరుకుని, 1991లో అమెరికా పౌరసత్వం పొందింది.మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఆమె 1962, మార్చి 17న జన్మించింది. అయితే కల్పనా మెట్రిక్ పరీక్షకు హాజరయ్యే సమయానికి ఆమె వయస్సు సరిపోకపోవడంతో ఆమె తండ్రి ఆమె పుట్టిన తేదీని 1961, జూలై ఒకటిగా అధికారికంగా మార్పించారు. దీంతో ఆమె మెట్రిక్ పరీక్ష(Matriculation examination)కు హాజరు కాగలిగింది. అమెరికాలోని రికార్డులలో ఆమె పుట్టిన తేదీ 1961 జూలై ఒకటిగానే ఉంటుంది. నాసా అధికారిక రికార్టులలోనూ ఆమె పుట్టినరోజు జూలై ఒకటి అని కనిపిస్తుంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు, పరిచయస్తులు ఆమె పుట్టినరోజును మార్చి 17నే నిర్వహించుకుంటారు.కల్పనా చావ్లా పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీ(Punjab Engineering College) నుంచి ఎయిరోనాటిక్ ఇంజినీరింగ్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం 1982లో అమెరికా చేరుకుని, అక్కడి యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎయిరోస్సేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1986లో ఆమె మరో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. తరువాత పీహెచ్డీ చేశారు. 2023, జనవరి 16న కల్పనా చావ్లా.. నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ నుంచి అంతరిక్షానికి చేరుకున్నారు. తరువాత ఆమె భూమికి తిరిగి రాలేకపోయారు. కల్పనా ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక 2023 ఫిబ్రవరి ఒకటిన భూమికి తిరిగి వస్తుండగా, కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కల్పనా చావ్లాతో పాటు మొత్తం ఏడుగురు వ్యోమగాములు మృతి చెందారు. ఇది కూడా చదవండి: అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు ఘోర అవమానం -
IND VS AUS 2nd Test: పుట్టిన రోజున బుమ్రాకు చేదు అనుభవం
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇవాళ (డిసెంబర్ 6) 31వ పడిలోకి అడుగుపెట్టాడు. తన పుట్టిన రోజు నాడు బుమ్రాకు చేదు అనుభవం ఎదురైంది. ఈ పుట్టిన రోజున బుమ్రా డకౌటయ్యాడు. భారత క్రికెట్ చరిత్రలో బుమ్రాకు ముందు కేవలం ముగ్గురు మాత్రమే తమ పుట్టిన రోజున డకౌటయ్యారు (టెస్ట్ మ్యాచ్‌ల్లో). 1978లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సయ్యద్ కిర్మాణి.. 1996లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంకటపతి రాజు.. 2018లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ తమ పుట్టిన రోజున డకౌటయ్యారు. తాజాగా జస్ప్రీత్ బుమ్రా పై ముగ్గురి సరసన చేరాడు.అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా డకౌటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రా 8 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. కమిన్స్ బౌలింగ్ ఉస్మాన్ ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చి బుమ్రా ఔటయ్యాడు.ఇదిలా ఉంటే, రెండో టెస్ట్ తొలి రోజు టీమిండియాపై ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మిచెల్ స్టార్క్ (6/48) ధాటికి 180 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఆసీస్.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 94 పరుగులు వెనుకపడి ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (13) ఔట్ కాగా.. మార్నస్ లబుషేన్ (20), నాథన్ మెక్‌స్వీని (38) క్రీజ్‌లో ఉన్నారు. -
యూట్యూబర్, నటి విరాజిత బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ప్రధాని మోదీ పుట్టినరోజు.. శుభాకాంక్షల వెల్లువ
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (మంగళవారం) 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌మీడియాలో పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.Warm birthday wishes to the visionary leader & great son of Maa Bharati, Hon'ble Prime Minister Shri @narendramodi Ji. Your vision for a stronger, prosperous India resonates in every heart.May your dynamic leadership & unwavering dedication continue to transform India and… pic.twitter.com/PlzFdoIoGY— Prof.(Dr.) Manik Saha (@DrManikSaha2) September 16, 2024మోదీకి త్రిపుర సీఎం మాణిక్ సాహా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తన జన్మదినం సందర్భంగా ఒడిశాలో 26 లక్షల పీఎం ఆవాస్ ఇళ్లను ప్రారంభించన్నారు.On the occasion of Hon’ble PM @narendramodi ji's birthday, my SandArt with installation of 2500 Diyas in New Delhi. Jai Jagannath! 🙏 pic.twitter.com/Rs0y3BPeah— Sudarsan Pattnaik (@sudarsansand) September 17, 2024 On the occasion of PM Modi's birthday, Maharashtra CM Eknath Shinde says, "My birthday wishes to Prime Minister Narendra Modi. I wish him good health and long life. Under the leadership of Prime Minister Modi, India is moving towards becoming an economic superpower, I wish him… pic.twitter.com/rXPBgTjrXX— ANI (@ANI) September 16, 2024మోదీకి ఉత్తరాఖండ్ సీఎం జన్మదిన శుభాకాంక్షలుఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్స్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.‘ రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది నివాసితుల తరపున, మీ ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, విజయవంతమైన జీవితం కోసం నేను మహాదేవ్‌ను ప్రార్థిస్తున్నాను. మీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కొనసాగించాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.Uttarakhand CM Pushkar Singh Dhami extends birthday greetings to Prime Minister Narendra Modi."...On behalf of 1.25 crore residents of the state, I pray to the Lord Mahadev for your healthy, prosperous and successful life. I pray to the Lord that under your leadership, the… pic.twitter.com/a6BRUb1RnO— ANI (@ANI) September 17, 2024మోదీకి ఒడిశా సీఎం జన్మదిన శుభాకాంక్షలుమోదీకి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అసమానమైన నాయకత్వంలో, దేశం విక్షిత్ భారత్ వైపు అధిక వృద్ధి పథంలో పయనిస్తోంది. మీరు దేశ సేవలో దీర్ఘకాలం, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.Odisha CM Mohan Charan Majhi extends birthday greetings to Prime Minister Narendra Modi. "...Under your unparalleled leadership, the Nation is moving on a high growth trajectory towards a Viksit Bharat. I wish you a long and healthy life in the service of the Nation..," his… pic.twitter.com/PHgcItiF9r— ANI (@ANI) September 17, 2024చదవండి: ఏడుపదుల వయసులోనూ కుర్రాడిలా ప్రధాని మోదీ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! -
ఇదేం వింత చట్టం! భార్య పుట్టినరోజు మర్చిపోవడమే నేరమా..!
పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన రోజు. ఎంతలా అంటే వాళ్ళకి ఉన్నంతలో బాగా జరుపుకోవాలి అనుకుంటారు. అయితే భార్యలకు బయటవాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ కంటే మనసుకి నచ్చిన వాళ్ళు ఇచ్చే కామెంట్ ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. తాను పుట్టినరోజుని తన భర్త గుర్తుపెట్టుకుని విష్ చేస్తే వచ్చే ఆనందమే వేరు. ఎవరు ఎన్ని ఖరీదైన బహుమతులు ఇచ్చిన భర్త ఇచ్చే బహుమతి కోసం ఎదురు చూస్తుంటుంది. భార్య ఎప్పుడు భర్త ఇచ్చే బహుమతిలో ఖరీదు చూడదు. అందులోని ప్రేమనే చూస్తుంది. అయితే భార్యలకి ఉన్న అదృష్టం ప్రతేకత ఉన్న రోజులని గుర్తు పెట్టుకోవడం. అందుకే భార్యలు భర్త పుట్టినరోజుని, పిల్లల పుట్టిన రోజుని, పెళ్లి రోజుని, అనుకుంటే ఇరుగు పొరుగు వాళ్ళ పుట్టినరోజులు కూడా గుర్తుపెట్టుకోగలదు. కానీ భర్త తన భార్య పుట్టిన రోజుని గుర్తు పెట్టుకోవాలి అనుకున్నా.. పని హడావిడిలో మరిచిపోతుంటాడు.ఇలా భార్య పుటిన రోజుని మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది అని మీకు తెలుసా..? అది కూడా ఏకంగా ఐదేళ్లు. అవును ఇది నిజం. పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలో సమోవా అనే అందమైన ద్వీపం ఉంది. ఇక్కడ ఎవరైన పెళ్ళైన వ్యక్తి తన భార్య పుట్టిన రోజుని పొరపాటున మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది. తన భర్త తన పుట్టిన రోజుని మర్చిపోయారని భార్య గనుక ఫిర్యాదు చేస్తే.. తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ఇక్కడ భార్య పుట్టిన రోజును మరిచిపోతే మాత్రం.. తప్పకుడా అది నేరం కింద లెక్క.ఇక్కడి రూల్ ప్రకారం.. అనుకుని మరిచిపోయాడా.. లేదంటే.. అనుకోకుండా మరిచిపోయాడా అనేది చూడరు. మరిచిపోయాడు అంతే.. దీనితో న్యాయపరమైన చిక్కుల్లో పడతాడు భర్త. అయితే ఈ చట్టంలో కాస్త వెసులుబాటు ఉంది. మెుదటిసారి భార్య పుట్టినరోజును మరిచిపోతే.. కాస్త చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారు. మరోసారి అలా చేయోద్దని.. పోలీసులు హెచ్చరిస్తారు. మళ్లీ అదే రిపీట్ చేశారనుకో.. తప్పు అవుతుంది. జైలు రూపంలో శిక్ష పడుతుంది. మన దేశంలో ఇలాంటి చట్టాలు అమలులో ఉంటే.. చాలా మంది భర్తలు జైలుకే వెళ్తారేమో.(చదవండి: పచ్చి జామకాయ కంటే కాల్చిందే బెటర్! ఎన్ని ప్రయోజనాలంటే..!) -
ఆర్కిటెక్ట్ నిత్య ఆన్ సెట్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శర్వా 37’ (వర్కింగ్ టైటిల్). ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో హీరోయిన్గా సాక్షీ వైద్యని ఖరారు చేసినట్లు ప్రకటించారు మేకర్స్. ‘ఏజెంట్, గాండీవధారి అర్జున’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సాక్షీ వైద్య సుపరిచితురాలే. తాజాగా శర్వానంద్‌కి జోడీగా నటిస్తున్నారామె. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా బుధవారం(జూన్ 19) సాక్షీ వైద్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ సెట్లోకి స్వాగతించింది యూనిట్. ‘శర్వా 37’లో ఆర్కిటెక్ట్ నిత్య పాత్రలో సాక్షీ వైద్య నటిస్తున్నారు. ‘‘పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్. -
CM Yogi Adityanath Birthday: యోగి ఆదిత్యనాథ్‌కు ఆ పేరెలా వచ్చిందంటే..
జూన్ 5.. అంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు. నేటితో ఆయనకు 52 ఏళ్లు నిండాయి. దేశంలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా యోగి ఆదిత్యనాథ్‌కు పేరుంది. అభిమానులు ఆయనను యోగి బాబా, బుల్డోజర్ బాబా అని కూడా పిలుస్తారు. యోగి ఆదిత్యనాథ్ రెండుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీంతో పాటు ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా కూడా ఉన్నారు.ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలో జన్మించారు. యోగి అసలు పేరు అజయ్ సింగ్ బిష్త్. యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ ఫారెస్ట్ రేంజర్. సీఎం యోగి గణితంలో బీఎస్సీ పట్టా పొందారు. 1990లో ఏబీవీపీలో చేరారు. 1993లో గోరఖ్‌నాథ్ పీఠానికి చెందిన మహంత్ అద్వైత్నాథ్తో పరిచయం ఏర్పడింది. 1994లో అజయ్ సింగ్ బిష్త్ సన్యాసం స్వీకరించారు. నాథ్ శాఖకు చెందిన సాధువుగా మారారు. ఆ తర్వాత ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్‌గా మారింది. 1994లో అద్వైత నాథ్ తన వారసునిగా యోగి ఆదిత్యనాథ్‌ను ప్రకటించారు.యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా 1998లో గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ టికెట్‌పై తన 26 ఏళ్ల వయసులో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014లలో గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. మహంత్ అద్వైత్నాథ్ 2014లో కన్నుమూశారు. అనంతరం యోగి గోరఖ్‌నాథ్ పీఠానికి అధ్యక్షులయ్యారు.2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫలితాలు వెలువడే సమయంలో యోగి ఆదిత్యనాథ్ విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. అయితే బీజేపీ నేతలు ఎన్నికల ఫలితాల విడుదల వరకూ ఆగాలని ఆయనను కోరారు. ఆ సమయంలో మనోజ్ సిన్హా, కేశవ్ మౌర్య సహా పలువురు బీజేపీ నేతలు సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం యోగి ఆదిత్యనాథ్‌ను ఢిల్లీకి పిలిపించి, యూపీలో అధికారం చేపట్టాలని కోరింది.యోగి సీఎం పదవి చేపట్టగానే ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న శాంతిభద్రతలు. దీనికి పరిష్కారం దిశగా ముందడుగు వేసిన ఆయన పోలీసు అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. యోగి నాయకత్వంలో 2022లో కూడా యూపీలో బీజేపీ విజయం సాధించింది. సీఎం యోగి బుల్డోజర్లతో నేరస్తుల ఇళ్లపై దండెత్తాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. అందుకే ఆయనకు బుల్డోజర్ బాబా అనే పేరు వచ్చిందంటారు. -
లీప్ ఇయర్లో జన్మించిన నాటి ప్రధాని జీవితం సాగిందిలా..
‘మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్’.. గాంధేయ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న రాజకీయ నేత. ఆయన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఇందిరతో విభేదాల కారణంగా ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. మొరార్జీ దేశాయ్ తన కళాశాల జీవితంలోనే మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్.. తదితర కాంగ్రెస్ నేతల ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు. ఇవి అతని జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. ప్రారంభ జీవితం మొరార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్‌లోని భడేలిలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంచోడ్జీ దేశాయ్, తల్లి పేరు మణిబెన్. తన తండ్రి తనకు జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పించారని, తండ్రి నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని మొరార్జీ దేశాయ్ అనేవారు. తనకు మతంపై విశ్వాసం ఉందని చెప్పేవారు. మనిషి అన్ని పరిస్థితులలోనూ ఓర్పుగా ఉండాలని బోధించేవారు. రాజకీయ జీవితం 1930లో మొరార్జీ దేశాయ్ బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. 1931లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సర్దార్ పటేల్ సూచనల మేరకు అఖిల భారత యువజన కాంగ్రెస్ శాఖను స్థాపించి, దానికి అధ్యక్షుడయ్యాడు. 1932లో మొరార్జీ రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 1952లో మొరార్జీ.. బొంబాయి (ప్రస్తుతం ముంబై) ముఖ్యమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అయినప్పుడు, అంటే 1967లో మొరార్జీ దేశాయ్ ఉపప్రధానిగా, హోంమంత్రిగా పని చేశారు. 1977లో ప్రధానిగా.. నవంబర్ 1969లో కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడటంతో మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ)ని విడిచిపెట్టి కాంగ్రెస్ (ఓ)లో చేరారు. 1975లో జనతా పార్టీలో చేరారు. 1977 మార్చిలో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ సమయంలో ప్రధానమంత్రి పదవికి చౌదరి చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్ పోటీదారులుగా నిలిచారు. అయితే జయప్రకాష్ నారాయణ్ ‘కింగ్ మేకర్’ పాత్రను సద్వినియోగం చేసుకుని మొరార్జీ దేశాయ్‌కి మద్దతుగా నిలిచారు. 1977, మార్చి 24న తన 81 ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. 1979, జూలై 28 వరకు ఈ పదవిలో కొనసాగారు. అవార్డులు, గౌరవ పురస్కారాలు మొరార్జీ దేశాయ్ భారత ప్రభుత్వం నుండి ‘భారతరత్న’, పాకిస్తాన్ నుండి ఉత్తమ పౌర పురస్కారం ‘తెహ్రీక్ ఈ పాకిస్తాన్’ను అందుకున్నారు. మొరార్జీ దేశాయ్ గాంధేయవాదానికి మద్దతుదారుగా నిలిచారు. అయితే దీనిలోకి క్షమాపణ స్ఫూర్తిని ఎప్పుడూ అంగీకరించలేదు. మొరార్జీ దేశాయ్ ఆధ్యాత్మిక భావజాలం కలిగిన వ్యక్తిగా పేరొందారు. -
అక్కడ కవి పుట్టిన రోజు ఓ పండుగలా జరుపుకుంటారు!
మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతులు తప్పనిసరి తతంగాలుగా జరుగుతాయి. ఈ తప్పనిసరి తతంగాల్లో ఉత్సాహభరితమైన కార్యక్రమాలు ఉండవు. విందు వినోదాలు ఉండవు. కళా ప్రదర్శనలు ఉండవు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతుల కార్యక్రమాల్లో వక్తల ఊకదంపుడు ఉపన్యాసాలకు మించిన విశేషాలేవీ ఉండవు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇంగ్లండ్, స్కాట్లండ్లలోనైతే, రాబర్ట్ బర్న్స్ పుట్టినరోజు కవితాభిమానులకు పండుగరోజు. ఆయన పుట్టినరోజు అయిన జనవరి 25న ఏటా ఇంగ్లండ్, స్కాట్లండ్లలోని ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. ‘బర్న్స్ నైట్’ పేరుతో విందు వినోదాలు, కవితా గోష్ఠులు, సంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. బర్న్స్ కవిత్వాన్ని చదువుతూ అభిమానులు ఉర్రూతలూగిపోతారు. గాయనీ గాయకులు ఆయన గీతాలను ఆలపిస్తారు. వేడుకలు జరిగే వేదికలకు చేరువలోనే బర్న్స్ జ్ఞాపకాలను తలపోసుకుంటూ భారీస్థాయిలో విందు భోజనాలను ‘బర్న్స్ నైట్ సప్పర్’ పేరుతో నిర్వహిస్తారు. ఈ వేడుకలకు విచ్చేసే అతిథులను సంప్రదాయ బ్యాగ్‌పైపర్ వాయిద్యాలను మోగిస్తూ స్వాగతం పలుకుతారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా బర్న్స్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇంగ్లండ్, స్కాట్లండ్లలోని వివిధ నగరాల్లోని అభిమానులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన స్కాటిష్ కవి రాబర్ట్ బర్న్స్ 1759 జనవరి 25న పుట్టాడు. తన కవిత్వంతో స్కాటిష్ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. ఆయన 1796 జూలై 21న మరణించాడు. స్కాట్స్ భాషను, స్కాటిష్ కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవిదిగ్గజం రాబర్ట్ బర్న్స్ జ్ఞాపకార్థం నిర్వహించే ‘బర్న్స్ నైట్ సప్పర్’ కార్యక్రమాన్ని స్కాటిష్ పార్లమెంటు ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమంగా పరిగణిస్తుంది. స్కాటిష్ పార్లమెంటు కూడా ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేస్తుంది. ఈ విందులో స్కాటిష్ బ్రోత్, పొటాటో సూప్, కల్లెన్ స్కింక్, కాక్–ఏ–లీకీ వంటి సూప్స్, గొర్రెమాంసంతో తయారుచేసే హ్యాగిస్ వంటి సంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. ఒక కవి పుట్టినరోజును మరే దేశంలోనూ ఇలా ఒక పండుగలా జరుపుకోవడం కనిపించదు. (చదవండి: ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు! ఎలా చేస్తారంటే..) -
North Koria : కిమ్ 40వ బర్త్ డే వేడుకలు ఎందుకు చేసుకోలేదు..?
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్కి 40 ఏళ్లు వచ్చాయి. ఆయన తన 40వ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా జరుపుకోలేదు. దీనికి పలు కారణలున్నాయని తెలుస్తోంది. ఇందులో ముఖ్య కారణం మాత్రం కిమ్ జాంగ్ ఉన్ తల్లేనట. ఎందుకంటే కిమ్ తల్లి జపాన్‌కు చెందిన మహిళ అవడంతో బర్త్‌డే వేడుకలు జరుపుకుంటే ఆమె ఉత్తర కొరియాకు చెందినది కాదనే చర్చ జరుగుతుందని కిమ్ భావిస్తున్నారని చెబుతున్నారు. ఇది ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదని, అందుకే బర్త్‌డే వేడుకలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. అయితే తన తండ్రి, తాత తరహాలో బర్త్‌డే రోజు ప్రభుత్వ సెలవు ఇవ్వడంతో పాటు మిలిటరీ పరేడ్ నిర్వహించేత వయసు తనకు ఇంకా రాలేదని, తాను ఇంకా చిన్నవాడినని ఆయన అనుకుంటుంటారని సమాచారం. ఈ కారణాలతోనే కిమ్ తన బర్త్‌డే వేడుకలను జరుపుకోలేదని తెలుస్తోంది. అయితే బర్త్‌డే రోజు కిమ్ తన కూతురుతో కలిసి ఓ కోళ్ల ఫామ్‌ను సందర్శించినట్లు వార్తలొచ్చాయి. ఇదీచదవండి..ఎన్నికల్లో విజయం..బంగ్లా ప్రధాని కీలక వ్యాఖ్యలు -
చరిత్ర సృష్టించిన కుల్దీప్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి జట్టును కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్‌లో 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్.. 17 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో కుల్దీప్కు ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం గమనార్హం. టీ20ల్లో కుల్దీప్కు రెండో ఫైవ్ వికెట్ల హాల్. అంతేకాకుండా గురువారం(డిసెంబర్ 14) కుల్దీప్ యాదవ్ 29వ వసంతంలోకి అడుగుపెట్టాడు. తద్వారా కుల్దీప్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టీ20 క్రికెట్లో పుట్టిన రోజున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అదే విధంగా టీ20ల్లో సేనా దేశాల్లో(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా) రెండు సార్లు ఐదు వికెట్లు ఘనత సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా కూడా కుల్దీప్ నిలిచాడు. చదవండి: Who Is Satheesh Shubha: అరంగేట్ర మ్యాచ్‌లోనే అదుర్స్.. ఆర్సీబీ జట్టుతో! ఎవరీ శుభా సతీష్? -
మహేష్ బాబు బర్త్ డే సప్రైజ్ ఫిక్స్.. ఇక ఫాన్స్ కి పూనకాలు లోడింగ్..!
-
నిఖిల్ స్వయంభూ
నిఖిల్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘స్వయంభూ’ అనే టైటిల్ ఖరారు చేశారు. గురువారం (జూన్ 1) నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించనున్నారు. ‘‘నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఆగస్టులో షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస. ఇంకా.. నిఖిల్ బర్త్ డే సందర్భంగా వేరే చిత్రాల అప్డేట్స్ కూడా వచ్చాయి. నిఖిల్‌తో ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాల తర్వాత దర్శకుడు సుధీర్ వర్మ మరో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. అలాగే ‘ది ఇండియా హౌస్’ అనే మరో సినిమా కమిటయ్యారు నిఖిల్. ఇక నిఖిల్ హీరోగా నటించిన ‘స్పై’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. -
విషాదం.. కొడుకు పుట్టినరోజే.. తండ్రి ఆత్మహత్య..
ఉండవెల్లి: కొడుకు జన్మించిన రోజే ఓ తండ్రి బలవన్మర ణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో చోటు చేసు కుంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న రాజు (29)కు కొన్నేళ్ల క్రితం గీతతో వివాహమైంది. వారిద్దరికి పాప, కుమారుడు ఉండగా.. ఆదివారం మూడో సంతానంగా మగ బిడ్డ అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించాడు. కుమారుడిని చూసి వచ్చిన రాజు.. మధ్యాహ్నం వేళ ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని అతని తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: జైలు నుంచి బయటకొచ్చిన నిహారిక -
ఈసారి బర్త్‌డేకి అలా కోరుకున్నా!
‘నిన్ను నిన్నుగా నువ్వు ప్రేమించుకోవడాన్ని మర్చి΄ోకు’’ అంటున్నారు శ్రుతీహాసన్. శనివారం (జనవరి 28) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు శ్రుతి. ‘‘నా జీవితం ఎంత గొప్పగా సాగుతోందో, మాటల్లో వర్ణించలేని ప్రేమను ఎంతగా ΄÷ందగలుగుతున్నానో (కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్‌ని ఉద్దేశించి) అనే ఆనందమైన ఆలోచనలతో నిద్ర లేచాను. ప్రతి ఏడాదీ నా బర్త్ డే కేక్‌పై ఉన్న కొవ్వొత్తులను ఆర్పిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. కానీ ఈ ఏడాది మాత్రం నా కోసమే కాదు.. అందరి కోసం కోరుకున్నాను. అందరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపాలని, వారు కోరుకున్నది వారికి దక్కేలా పరిస్థితులు అనుకూలించాలని కోరుకుంటున్నాను. నిజం చె΄్పాలంటే... ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతూనే ఉంటుంది. ప్రతి బర్త్ డేకి వయసు సంఖ్య పెరగడం సహజం. ఆ అనుభవం రీత్యా కాస్త తెలివైనవాళ్ళం కూడా అవుతుంటాము (సరదాగా..). అలాగే ఈ ప్రపంచమనే యుద్ధంలో ప్రతిసారీ ఒంటరి సైనికుడిలా నెగ్గుకు రాలేమని కూడా అర్థం అవుతోంది. అయితే నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతో తెలివైనవారు, సానుకూల దృక్పథంతో ఉన్నవారు ఉన్నందుకు నేనే వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ ప్రపంచంలో నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. సో.. నీ ప్రత్యేకతను నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి’’ అని రాసుకొచ్చారు శ్రుతీహాసన్. కాగా ఈ బర్త్ డేని శ్రుతీహాసన్ చాలా సందడిగా జరుపుకున్నట్లుగా ఫొటోలు చెబుతున్నాయి. ఈ వేడుకల్లో శ్రుతీ తల్లి సారిక, చెల్లి అక్షరాహాసన్లతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ శంతను హజారికా, బాలీవుడ్ నటి కాజోల్ కూడా పాల్గొన్నారు. ఇక సినిమాల విషయాని వస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ‘ది ఐ’ అనే ఇంగ్లిష్ ఫిల్మ్‌లో శ్రుతి ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. -
టీమిండియా కప్ కొడితే ఆ పని చేస్తా.. మనసులో మాట చెప్పిన కింగ్ కోహ్లీ
క్రికెట్లో రన్ మెషీన్, రికార్డుల రారాజు కింగ్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు(నవంబర్ 5). కింగ్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు విరాట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా ప్లేయర్స్ కూడా కోహ్లీకి బర్త్‌డే విషెస్ చెబుతూ డ్రెస్సింగ్ రూమ్‌లో కేక్ కటింగ్ చేయించారు. కాగా, ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా రేపు(ఆదివారం) జింబాబ్వేతో జరగబోయే టీ20 మ్యాచ్ కోసం మెల్బోర్న్(ఎంసీజీ) క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన పలువురు జర్నలిస్టులు విరాట్ కోహ్లీని కలిశారు. అనంతరం, గ్రౌండ్‌లోనే విరాట్‌తో కేక్ కటింగ్ చేయించారు. ఈ క్రమంలో జర్నలిస్టులు విరాట్‌కు శుభాకాంక్షలు చెబుతూ కోహ్లీతో కాసేపు సరదాగా ముచ్చటించారు. విరాట్ కూడా ఎంతో సరదాగా నవ్వుతూ వారికి సమాధానాలు ఇస్తూ హ్యాపీ మూడ్‌లో కనిపించాడు. అయితే, జర్నలిస్టులతో మాట్లాడుతున్న సందర్భంగా పుట్టినరోజు నాడు తన మనసులోని మాట బయటపెట్టాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు మీతో(జర్నలిస్టులతో) చిన్న కేక్ కట్ చేస్తున్నాను. కానీ.. నవంబర్ 13వ తేదీన టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిస్తే పెద్ద కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకుంటాను. కేక్ కట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని ఎంతో సంతోషంతో కామెంట్స్ చేశాడు. ఇక, తనతో కేక్ కట్ చేయించిన జర్నలిస్టులకు కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Virat Kohli celebrate his birthday with journalist . and BTW There were also those journalists who talked about removing him from the team#HappyBirthdayViratKohli pic.twitter.com/Rj9YaJHNfD — Rahul♦️ Virat (@mani_muzic) November 5, 2022 మరోవైపు.. విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) కూడా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక, కోహ్లీ బెస్ట్ దోస్త్ ఏబీ డివిలియర్స్ కూడా విరాట్‌కు వీడియో ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఏబీ డివిలియర్స్.. ‘హలో వి.. మై బిస్కట్.. ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలి. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నా.. నేను ఇక్కడ కూర్చొని బర్త్ డే విషెస్ పంపడం సరదాగా ఉంది. కోహ్లీ.. నువ్వు ఒక స్పెషల్ పర్సన్. అత్యుత్తమ క్రికెటర్‌వి. నీ స్నేహాన్ని నాకు అందించినందుకు ధన్యవాదాలు. వరల్డ్ కప్‌లో నీకు..టీమిండియాకు ఆల్ ది బెస్ట్. టీమిండియా ఫైనల్ చేరాలి. ప్రపంచకప్ ఫైనల్లో ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఎదుర్కోవాలని ఆశిస్తున్నాను అని నవ్వుతూ డివిలియర్స్ విషెస్ తెలిపాడు. ఇక, టీ20 ప్రపంచకప్‌లో కింగ్ కోహ్లీ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. టీమిండియా ఆడిన 4 మ్యాచ్‌లో కోహ్లీ మూడు అర్ధ సెంచరీలు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో 220 పరుగులు చేసి ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌లో టాప్ రన్స్ సోర్కర్గా నిలిచాడు. కోహ్లీ ఇదే ఫామ్‌లో కొనసాగుతూ భారత్‌కు వరల్డ్‌కప్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. Dear @imVkohli, Here is a very special wish from a very special friend. 🥳🥹#PlayBold #HappyBirthdayViratKohli @abdevilliers17 pic.twitter.com/UT7wEdnde2 — Royal Challengers Bangalore (@RCBTweets) November 5, 2022 ఇది కూడా చదవండి: కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు.. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం...
షోపూర్: కునో నేషనల్ పార్కు. శనివారం ఉదయం 11.30 గంటలు. బోను తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఓ చీతా హుందాగా, నెమ్మదిగా బయటికొచ్చింది. తనకు బొత్తిగా అలవాటు లేని కొత్త వాతావరణం పలకరించడంతో తొలుత కాస్త అయోమయానికి లోనైంది. మెల్లిగా పరిసరాలను 360 డిగ్రీలూ స్కాన్ చేసింది. తర్వాత ఎదురుగా పరుచుకున్న తనకెంతో ఇష్టమైన గడ్డి మైదానంలోకి ఒక్కో అడుగే వేసింది. చూస్తుండగానే మెరుపు వేగంతో పరుగందుకుంది. కాస్త దూరం వెళ్లగానే ఓ చెట్టు దగ్గర ఆగింది. తలను చుట్టూ తిప్పుతూ పరిసరాలను మరోసారి నింపాదిగా పరికించి చూసింది. తర్వాత స్వేచ్ఛా సంచారం మొదలు పెట్టింది. అలా... 70 ఏళ్ల కింద భారత్‌లో అంతరించిన చీతా జాతి మళ్లీ దేశంలోకి అడుగు పెట్టింది. ఈ అపురూప క్షణాలను మీడియాతో పాటు బోన్ మీదుగా ఏర్పాటు చేసిన ఎత్తైన వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అత్యాధునిక డీఎస్ఎల్ఆర్ కెమెరాలో బంధించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయనే వాటిని కునో పార్కులోకి వదిలిపెట్టారు. ‘‘అవి మన అతిథులు. కొద్ది నెలల్లో కునో పార్కును తమ నివాసంగా మార్చుకుంటాయి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ‘మిషన్ చీతా’ పేరిట ఆఫ్రికాలోని నమీబియా నుంచి కేంద్రం రప్పించిన 8 చీతాలు ప్రత్యేక విమానంలో 10 గంటలు సుదీర్ఘ ప్రయాణం చేసి శనివారం ఉదయం గ్వాలియర్ చేరుకున్నాయి. అక్కడినుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లలో కునోకు తరలాయి. ప్రభుత్వాలు పట్టించుకోలేదు ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో చీతాల ఉనికిని పునరుద్ధరించేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించలేదని విమర్శించారు. ‘‘ఇన్ని దశాబ్దాల తర్వాత మిత్రదేశమైన నమీబియా మద్దతుతో వాటిని రప్పించగలిగాం. ఇకనుంచి కునో పార్కు గడ్డి మైదానాల్లో చీతాలు పరుగులు తీస్తూ కనువిందు చేస్తాయి’’ అన్నారు. ‘‘కేంద్రం నిరంతర కృషి ఫలితంగా పులులు, ఏనుగులు, సింహాలు, ఒంటి కొమ్ము ఖడ్గమృగాల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ కూడా ప్రగతి సాధ్యమేనని ప్రపంచానికి మనం సందేశమిస్తున్నాం’’ అని చెప్పారు. ఇలా తరలించారు... నమీబియా నుంచి వచ్చిన 8 చీతాల్లో 3 మగవి కాగా 5 ఆడవి. వీటి వయసు 30 నుంచి 66 నెలలు. వాటికి మత్తు ఇంజక్షన్లిచ్చి ప్రత్యేక చెక్క బోన్లలో విమానంలో తరలించారు. 8,000 కిలోమీటర్ల సుదీర్ఘ ఖండాంతర ప్రయాణం కావడంతో వాంతులు చేసుకోకుండా ఖాళీ కడుపుతో తీసుకొచ్చారు. కునో పార్కులో ఎన్క్లోజర్లలోకి వదిలాక ఆహారమిచ్చారు. నెల రోజుల క్వారెంటైన్ అనంతరం మరో రెండు నుంచి నాలుగు నెలల పాటు చీతాలను పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. తర్వాత స్వేచ్ఛగా వదిలేస్తారు. చీతాల ఉనికిని నిరంతరం ట్రాక్ చేసేందుకు వాటికి రేడియో ట్యాగింగ్ చేశారు. చివరిసారిగా 1947లో నేటి ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోస్థానిక రాజు మూడు చీతాలను వేటాడాడు. అంతటితో భారత్‌లో వాటి కథ ముగిసిపోయింది. ఇవేం తమాషాలు: కాంగ్రెస్ మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. సమస్యల నుంచి, భారత్ జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు చీతాల విడుదల పేరిట తమాషాకు తెర తీశారంటూ దుయ్యబట్టింది. చౌకబారు ట్రిక్స్‌లో బీజేపీ నేతలకు భారతరత్న ఇవ్వొచ్చంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. చీతాలను రప్పించే ప్రాజెక్టుకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం 2009లో తెర తీసిందంటూ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాంల్లో ప్రత్యేకంగా జోడో యాత్ర చేస్తామన్నారు. నన్ను కూడా రానివ్వొద్దు! తర్వాత ‘చీతా మిత్ర’ సిబ్బందితో ప్రధాని సరదాగా ముచ్చటించారు. ‘‘చీతాలను జాగ్రత్తగా చూసుకోండి. మనుషులకు, వాటికి అనవసర సంఘర్షణ తలెత్తకుండా చూడండి. కొత్త వాతావరణానికి అవి అలవాటు పడేదాకా ఎవరినీ వాటి దగ్గరికి పోనివ్వకండి. నాయకులు, బ్రేకింగ్ న్యూస్ కోసం వచ్చే మీడియా, అధికారులు, నా బంధువులు ఎవరినీ కునో నేషనల్ పార్కులోకి అనుమతించొద్దు. స్వయంగా నేనే వచ్చినా సరే, అడ్డుకోండి’’ అని సూచించారు! చీతాల పరిరక్షణకు, వాటిని గురించి పరిసర గ్రామాల వారికి అవగాహన కల్పించేందుకు 400 మంది యువకులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. గుజరాత్ సీఎంగా ఉండగా సింహాల సంఖ్య పెంచే చర్యల్లో భాగంగా ఇలాగే 300 మంది వన్యప్రాణి మిత్రులను నియమించినట్టు మోదీ గుర్తు తెచ్చుకున్నారు. -
అఫీషియల్: బాలకృష్ణ-అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్
బాలకృష్ణ మంచి జోరు మీదున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్న ఆయన తాజాగా 108వ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. శుక్రవారం బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా 108వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డబుల్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్లో ఎన్బీకే 108 సినిమా రూపొందనుంది. వినూత్న కథనంతో భారీ ఎత్తున ఈ చిత్రం తెరకెక్కనుంది. మాస్ పల్స్ తెలిసిన అనిల్ రావిపూడి.. మునుపెన్నడూ చూడని పాత్రలో బాలకృష్ణను చూపించేందుకు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రక్తంతో తడిసిన హృతిక్ రోషన్.. బర్త్‌డే స్పెషల్ ట్రీట్
Hrithik Roshan First Look As Vedha Out From Vikram Vedha: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన చిత్రం సూపర్ హిట్ చిత్రం 'విక్రమ్ వేద'. ఈ సినిమాకు అశేష ప్రేక్షధారణ లభించిన సంగతి తెలిసిందే. అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈచిత్రాన్ని హిందీలో రీమెక్ చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి నటించిన వేద పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గాడ్‌గా పేరొందిన హృతిక్ రోషన్ అలరించనున్నాడని సమాచారం. జనవరి 10న హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. 'విక్రమ్ వేద' హీందీ రీమెక్ నుంచి హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్‌లో హృతిక్ రఫ్ లుక్‌లో అట్రాక్టీవ్‌గా కనిపిస్తున్నాడు. నల్లని కళ్లద్దాలు, గడ్డం, నల్లటి కుర్తాలో రక్తంతో తడిసిన 'వేద' పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను తమిళలో రూపొందించిన దర్శకుడు పుష్కర్ గాయత్రి ఈ హిందీ రీమెక్కు డైరెక్షన్ చేయనున్నాడు. ఈ సినిమాలో మాధవన్ నటించిన విక్రమ్ రోల్లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటివరకు సైఫ్ ఫస్ట్ లుక్ ఇంకా రాలేదు. అయితే ఇవాళ హృతిక్ బర్త్‌డే స్పెషల్ ట్రీట్‌గా వెద ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో మెరవనుంది. वेधा . VEDHA#vikramvedha pic.twitter.com/4GDkb7BXpl — Hrithik Roshan (@iHrithik) January 10, 2022 ఇదీ చదవండి: నోట్లో థర్మామీటర్‌తో జాన్వీ.. కరోనాగా అనుమానం -
బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ బర్త్‌డే.. జాన్ అబ్రహం స్టార్ కాకముందు
John Abraham Birthday Special On His Career: బాలీవుడ్ యాక్టర్, కండల వీరుడు జాన్ అబ్రహం పుట్టినరోజు నేడు. 1972 డిసెంబర్ 17న కేరళలో జన్మించిన జాన్ అబ్రహం తల్లి పార్సీ, తండ్రి మలయాళీ. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన జాన్ అబ్రహంకు సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జాన్‌కు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. జాన్ నేటికి (డిసెంబర్ 17) 48 ఏళ్లు. మోడలింగ్ సమయంలో డబ్బు లేకపోవడంతో అతడు కొన్ని రోజులు మీడియా ప్లానర్‌గా పనిచేశాడు. ఈ విషయం అతి తక్కువ మందికి తెలుసు. జాన్ అనేక మ్యూజిక్ వీడియోలు, అడ్వర్టైజ్మెంట్స్ చేశాడు. అనంతరం 2003లో 'జిస్మ్' సినిమాతో బాలీవుడ్లో అరంగ్రేటం చేశాడు. తర్వాత 'సాయా', 'పాప్' సినిమాల్లో కనిపించాడు. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) 2004లో వచ్చిన 'ధూమ్' సినిమా జాన్ అబ్రహం సినీ కెరీర్‌ను మలుపుతిప్పింది. అభిషేక్ బచ్చన్ పోలీసు పాత్రలో నటించగా, జాన్ అబ్రహం దొంగ పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. తర్వాత పలు సినిమాల్లో విలన్ రోల్స్ చేశాడు. గరం మసాలా, దోస్తానా, వెల్కమ్ బ్యాక్, ఫోర్స్-2, అటామిక్, సత్యమేవ జయతే చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఎన్నారై ప్రియా రుంచల్ను 2014లో వివాహం చేసుకున్నాడు జాన్ అబ్రహం. అయితే ప్రియా ఒక బ్యాంకర్, సినిమాలను పట్టించుకోదని ఓ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహం చెప్పాడు. ఇద్దరూ పూర్తిగా విభిన్న రంగాలకు చెందిన వారైన జాన్ అలవాట్లంటే తనకు చాలా ఇష్టమని ప్రియా చెప్పుకొచ్చేది. జాన్ అబ్రహం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడని మెచ్చుకునేది ప్రియా. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) జాన్ అబ్రహంకు బైక్‌లంటే చాలా ఇష్టం. అతని దగ్గర రూ. లక్షల విలువైన ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వాటిలో బీఎండబ్ల్యూ, హోండా సీబీఆర్, అప్రిలియా, యమహా, ఎంవీ అగస్టా, డుకాటీ ఉన్నాయి. జాన్ 48 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ 'ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్' అని నిరూపించాడు. జాన్ ఎలాంటి ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లు లేవు. అంతేకాకుండా అలాంటి ఏ పార్టీల్లో పాల్గొనడట. జాన్ అబ్రహం జంతు ప్రేమికుడు కూడా. వివిధ సామాజిక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ బీటౌన్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు ఈ హ్యాండ్సమ్ హంక్. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) -
‘ఎఫ్ 3’ అంతకుమించి ఉంటుంది
‘‘ఎఫ్ 2’ వల్ల వచ్చిన కిక్ వల్లో, ఎనర్జీ వల్లో వెంకటేశ్, వరుణ్ తేజ్గార్లు ‘ఎఫ్ 3’లో ఇరగదీశారు. ప్రేక్షకుల అంచనాలకు మించి ‘ఎఫ్ 3’ వారికి వినోదాన్ని పంచుతుంది’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. 2015లో వచ్చిన ‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి ఆ తర్వాత ‘సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు’ వంటి విజయాలతో హిట్ చిత్రాల దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నారు. మంగళవారం అనిల్ రావిపూడి బర్త్ డే (నవంబరు 23). ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు. ► దర్శకుడిగా ఇది నా ఆరో బర్త్ డే. ఈసారి ‘ఎఫ్3’ సెట్స్‌లోనే నా పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. నా దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ముందుగా అనుకున్నట్లు ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 3’ రిలీజ్ అయితే హ్యాట్రిక్ అయ్యేది. సంక్రాంతి రిలీజ్ మిస్సయిందని బాధ ఉన్నప్పటికీ సోలో రిలీజ్ అయితే ఎక్కువమంది ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించి ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకుంటున్నాం. ఇప్పటికి ‘ఎఫ్ 3’ 80 శాతం షూటింగ్ పూర్తయింది. కొంత టాకీ, రెండు పాటలు చిత్రీకరించాలి. ► ‘ఎఫ్ 2’ సినిమా భార్యాభర్తల ఫ్రస్ట్రేషన్ నేపథ్యంలో ఉంటుంది. కానీ ‘ఎఫ్ 3’ కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఇందులో వెంకటేశ్‌గారు రేచీకటి ఉన్న వ్యక్తిగా, వరుణ్ నత్తి ఉన్న వ్యక్తి పాత్రల్లో కనిపిస్తారు. హీరోల క్యారెక్టర్స్‌కు ఉన్న ఈ ప్రాబ్లమ్స్ కథను డిస్ట్రబ్ చేయవు. ‘ఎఫ్ 2’లో ఉన్న అందరూ ‘ఎఫ్ 3’లో ఉన్నారు. కొత్తగా సునీల్‌గారు, మురళీశర్మగారు కనిపిస్తారు. ‘ఎఫ్ 2’ సినిమా ఎండింగ్లో ‘ఎఫ్ 3’ అని వేశాం. కానీ అప్పుడు ‘ఎఫ్ 3’ కథ నా దగ్గర లేదు. కానీ మనకంటూ ఓ ఎంటర్టైన్మైంట్ ఫ్రాంచైజీ ఉంటే బాగుంటుందనుకుని ‘ఎఫ్ 3’ చేస్తున్నాం. ‘ఎఫ్ 4’ కూడా ఉండొచ్చేమో. ► చిన్న పిల్లలతో నేను మా ఇంట్లో చూసిన ఎలిమెంట్స్ అన్నీ ‘ఎఫ్ 3’లో ఉన్నాయి. థియేటర్లో ఫ్యామిలీ ఆడియ¯Œ ్స చూస్తే.. అరే మా ప్రాబ్లమ్స్ కూడా ఇవే కదా అనుకుంటారు. ‘ఎఫ్ 2’ అనేది నా బయోపిక్. ఆ మాటకొస్తే.. మగాళ్లందరి బయోపిక్ కూడా. ప్రతి ఒక్కరూ పని చేసే చోట, ఇంట్లో.. ఇలా ఎక్కడో చోట అలా ఫ్రస్టేట్ అవుతుంటారు. ► ‘ఎఫ్ 2’ సినిమా చేయడం వల్ల కావొచ్చు వెంకీ, వరుణ్‌ల మధ్య మంచి అండర్స్టాండింగ్ కుదిరింది. వెంకీ, వరుణ్‌ల వల్ల కాదు కానీ హీరోయిన్లు (తమన్నా, మెహరీన్)ల వల్లే ఎక్కువ సమస్యలు వచ్చాయి (నవ్వుతూ). ‘ఎఫ్ 2’లో కన్నా ‘ఎఫ్ 3’లో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. దాదాపు 35మంది ఉన్నారు. రీసెంట్గా క్లైమాక్స్‌ను షూట్ చేశాం. అప్పట్లో ఈవీవీగారు సినిమాలో ఎక్కువమంది ఆర్టిస్టులను ఎలా మ్యానేజ్ చేసేవారా అని కొన్నిసార్లు అనిపించింది. ► ఇటీవల వెంకీగారు ఫస్టాఫ్ చూసి, ‘నేను ఒక్కడినే బాగా చేశాననుకున్నాను.. ఇదేంటమ్మా అందరూ ఇరగ్గొట్టేశారు’ అన్నారు. ‘ఎఫ్ 2’ చివర్లో కనిపించిన నేను ‘ఎఫ్ 3’లో ఓ సాంగ్‌లో కనిపిస్తా. ► ప్యాన్ ఇండియా అంటే ఆ స్థాయిలో కథ రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ (టాలీవుడ్) కుర్చీలో బాగున్నాను. ఒక ఏడాది అక్కడికి (బాలీవుడ్) వెళ్తే ఇక్కడున్న కుర్చీ సంగతి ఏంటి? ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు (నవ్వుతూ..). ‘ఎఫ్ 3’ చిత్రంలో పాన్ ఇండియన్ కంటెంట్ ఉంటుంది. ► ‘గాలి సంపత్’ నా జానర్ కాదు. కానీ స్క్రీన్‌ప్లే ఇచ్చాను. అయితే ఈసారి అలా చేయాలనుకోవడం లేదు. ప్రేక్షకులు నా నుంచి ఏం ఆశిస్తున్నారో అదే చేయాలనుకుంటాను. కానీ స్నేహితులకు నేను చేయాల్సింది చేస్తాను. అలాగే నా కథను ఎవరికీ ఇవ్వను. అన్ని కథలు నా దగ్గర లేవు. ► ‘దిల్’ రాజుగారికి ‘ఎఫ్ 3’ కథ పూర్తిగా వినిపించలేదు.. రెండు మూడు సీన్లు వినిపించాను. ఆయన బేనర్లో వరుసగా చేస్తున్నాను. ‘దిల్’ రాజుగారు నా రెమ్యూనరేషన్ పెంచారు. రీసెంట్గా కొత్త ఇల్లు కొనుక్కున్నాను. ఎంతిస్తారు? అని ఎప్పుడూ అడగను. ఎంతిస్తే అంతే (నవ్వుతూ). ► బాలకృష్ణగారితో సినిమా ఉంది. ఆయనతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయలేం. జనవరి నుంచి ఆ కథ వర్కౌట్ చేస్తాను. జూన్, జూలైలో సెట్స్ మీదకు వెళ్తాం. -
టీకా పంపిణీ చూసి కొన్ని పార్టీలకు జ్వరం పట్టుకుంది : మోదీ
-
ఒక్కరోజులో 2.26 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సినేషన్లో భారత్ కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం దేశవ్యాప్తంగా 2 కోట్లకుపైగా టీకా డోసులు ప్రజలకు వేశారు. కో–విన్ పోర్టల్ గణాంకాల ప్రకారం దేశంలో శుక్రవారం ఒక్కరోజే 2.26 కోట్లకుపైగా డోసులు ఇచ్చారు. అత్యధికంగా కర్ణాటకలో 26.9 లక్షల డోసులు, బిహార్‌లో 26.6 లక్షల డోసులు, ఉత్తరప్రదేశ్‌లో 24.8 లక్షల డోసులు, మద్యప్రదేశ్‌లో 23.7 లక్షల డోసులు, గుజరాత్లో 20.4 లక్షల డోసులు ఇచ్చారు. ఈ రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ ప్రధానమంత్రికి ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజల తరపున తాము అందజేసిన జన్మదిన కానుక అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 79.25 కోట్లకు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఒక్క రోజులో కోటికిపైగా డోసులు ఇవ్వడం గత నెల వ్యవధిలో ఇది 4వసారి కావడం విశేషం. ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ.. ప్రధానమంత్రి మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, టిబెట్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాలు శుభాకాంక్షలు తెలిపారు. సేవా ఔర్ సమర్పణ్.. ప్రధాని మోదీ జన్మదినంతోపాటు ఆయన గుజరాత్ సీఎంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా 20 రోజులపాటు సాగే ‘సేవా ఔర్ సమర్పణ్’ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 7 దాకా దేశవ్యాప్తంగా కొనసాగనుంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడతారు. 14 కోట్లకుపైగా రేషన్ కిట్లు పంపిణీ చేస్తారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లో జన్మించిన నరేంద్ర మోదీ తొలుత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరారు. అనంతరం బీజేపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రతి భారతీయుడికి గర్వకారణం: మోదీ దేశంలో ఒక్కరోజులో 2.26 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయడంలో పాల్గొన్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కృషి మరువలేనదని ప్రశంసించారు. -
కోడె దూడ ‘చింటూ’కు బర్త్‌డే
వెల్దుర్తి: సాధారణంగా చిన్న పిల్లల పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా కోడె దూడకు జన్మదిన వేడుకలు నిర్వహించారు సిద్ధినగట్టు గ్రామ రైతు పెద్ద పుల్లయ్య. ఈయన వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో ఉండే ఎద్దులు, ఆవులను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. ఏడాది క్రితం ఆవు కోడెదూడకు జన్మనిచ్చింది. దానికి చింటూ అని నామకరణం చేసి ఇంటిల్లపాది మురిపెంగా చూసుకునే వారు. జూలై 4 దాని జన్మదినం కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులు కోడె దూడను అలంకరించారు. చుట్టు పక్కల వారిని పిలిచి..కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు. -
‘పక్కా కమర్షియల్’..పోస్టర్ రిలీజ్
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రంలోని స్టైలిష్ పోస్టర్‌ను గోపీచంద్ బర్త్‌డే (జూన్ 12) సందర్భంగా విడుదల చేశారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ నలభై శాతం పూర్తయింది. కొత్త షెడ్యూల్‌ను వచ్చే నెల మొదటివారంలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: జేకేఎస్ బిజాయ్, సహనిర్మాత: ఎస్కేఎన్. -
సాయం కోసం డబ్బు తీసుకోవడం లేదు!
‘‘కోవిడ్ బాధితుల అవసరార్థం ఆక్సిజన్ సిలిండర్లు, రెమెడెసివిర్ ఇంజెక్షన్లు, ఆస్పత్రిలో బెడ్లు.. ఇలా నెల రోజుల నుంచి నా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నో రిక్వెస్ట్‌లు వచ్చాయి. సోషల్ మీడియాలో వాలంటీర్లు, నా ఫ్రెండ్స్, నా అభిమానులు నాకు సాయంగా ఉంటున్నారు’’ అని నిఖిల్ అన్నారు. నిఖిల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు చేసుకోవాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం షూటింగ్‌లు ఆగిపోయాయి.. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం? అందుకే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రస్తుతానికి ఎవరి వద్దా డబ్బు సహాయంగా తీసుకోవడం లేదు. నా సొంత డబ్బులతోనే సాయం అందిస్తున్నాను. చాలా మంది డబ్బులు పంపుతామని సంప్రదించారు. అయితే ఆ డబ్బుతో మీ ప్రాంతాల్లో అవసరమైన వారికి సాయపడండి అని చెబుతున్నాను’’ అన్నారు. వైవాహిక జీవితం గురించి నిఖిల్ మాట్లాడుతూ – ‘‘గత ఏడాది మే 14న కోవిడ్ సమయంలోనే పల్లవితో నా పెళ్లి అయింది. హనీమూన్‌కి విదేశాలకు వెళ్లే పరిస్థితి అప్పుడు లేకపోవడంతో సిమ్లా, గోవాలకు వెళ్లాం. పల్లవి డాక్టర్ కావడంతో రోగులకు అవసరమైన మందులను ఫోనులో చెబుతుంటుంది. నేను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తను కూడా ఓ వాలంటీర్’’ అన్నారు. చేస్తున్న సినిమాల గురించి చెబుతూ – ‘‘ప్రస్తుతం ‘18 పేజెస్’, ‘కార్తికేయ 2’ చిత్రాలు చేస్తున్నాను. మరో మూడు సినిమాలకు సంతకం చేశాను’’ అన్నారు. -
నా తర్వాతి సినిమాలో తెలుగమ్మాయే హీరోయిన్
‘‘1990 వరకూ తెలుగు నుంచి చాలామంది హీరోయిన్లు వచ్చి స్టార్లు అయ్యారు. ఆ తర్వాత కాలంలో ప్రతిభావంతమైన తెలుగమ్మాయిలు వచ్చినా మంచి అరంగేట్రం దొరక్క, అనుకున్నంత స్థాయిలో మెరవలేక మరుగున పడిపోతున్నారు. నా తర్వాతి చిత్రానికి తెలుగమ్మాయినే కథానాయికగా పరిచయం చేస్తా. తను స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటే హ్యాపీ’’ అని దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి అన్నారు. ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్కమగాడు, సలీం, నిప్పు, రేయ్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు వైవీఎస్ చౌదరి. ఆదివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా వైవీఎస్ మాట్లాడుతూ – ‘‘చదువులో నేను ఫస్ట్ ర్యాంకర్‌ని. నందమూరి తారక రామారావుగారి స్ఫూర్తితో చదువును వదిలి చిత్రపరిశ్రమలోకి వచ్చాను.. సంతృప్తిగా ఉన్నాను. సినిమా ఓ అనిర్వచనీయమైన వ్యామోహం. ఈ రంగంలో ప్రతి శుక్రవారం సబ్జెక్టు మారుతుంది.. దానికి తగ్గట్లు సినిమాలు నిర్మించడం అన్నది పెద్ద ఛాలెంజ్. దర్శకునిగా నా కెరీర్ మొదలైన 23 ఏళ్లలో 10 సినిమాలే చేశా. రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఒత్తిడి లేకుండా సినిమాలు చేయాలనుకుంటాను. అందుకే సినిమా సినిమాకి గ్యాప్ వస్తుంటుంది. ఎన్టీఆర్, మహేశ్‌బాబు వంటి స్టార్లతో సినిమా చేయాలని ఎవరికి ఉండదు? అన్నీ కలిసిరావాలి. నా తర్వాతి సినిమాకి కథ రెడీ. కోవిడ్ ఉధృతి తగ్గాక ప్రారంభిస్తా’ అన్నారు. -
ఇప్పుడు నాకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు!
నాయకుడు.. ప్రతినాయకుడు... హాస్యనటుడు.. సహాయనటుడు... ఇలా నటుడిగా చంద్రమోహన్ గుర్తుండిపోయే పాత్రల్లో జీవించారు. ఐదున్నర దశాబ్దాల కెరీర్లో నాలుగు భాషల్లో, నాలుగు తరాల నటులతో సినిమాలు చేసిన ఘనత చంద్రమోహన్‌ది. హీరోగా 175 సినిమాలు చేశారు. కెరీర్ మొత్తంలో 932 సినిమాలు చేశారు. ఈ విలక్షణ నటుడి పుట్టినరోజు నేడు (మే 23). 80 ఏళ్లు పూర్తి చేసుకుని, 81లోకి అడుగుపెడుతున్న చంద్రమోహన్ చెప్పిన విశేషాలు. ► కెరీర్లో స్థిరపడటం, ఆర్థిక స్థిరత్వం.. కెరీర్ తొలినాళ్లల్లో వీటిపైనే నా దృష్టి. ఈ రెండూ నెరవేరాక నేను కావాలని కోరుకున్న దర్శకుల కోసం సినిమాలు చేశాను. ►వినోదం పండించడం చాలా కష్టం. కమెడియన్‌కి గుర్తింపు రావాలంటే డైలాగుల్లో పంచ్ ఉండాలి. ప్రేక్షకుల నాడి తెలుసుకుని నటించాలి. అలాగే మరో సవాల్ ఏంటంటే.. వ్యక్తిగతంగా ఎలాంటి మూడ్‌లో ఉన్నా అది కెమెరా ముందు కనిపించనివ్వకూడదు. మరో కష్టం ఏంటంటే.. చేసినట్లే చేస్తే స్టేల్ అయ్యే ప్రమాదం ఉంది. కొత్తగా ప్రయత్నించాల్సి ఉంటుంది. కష్టమైన హాస్య పాత్రలను కూడా నేను పండించడానికి కారణం నా ఫ్యామిలీ. మా నాన్న, అక్కయ్యలు, తమ్ముడు, నేను.. మాకు మేం నవ్వకుండా ఇతరులను నవ్వించే అలవాటు ఉంది. ►నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుని, ‘గంగ మంగ’, ‘లక్ష్మణ రేఖ’, ఇంకో సినిమాలో నెగటివ్ పాత్రలు చేశాను. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆల్ రౌండర్ అనిపించుకోవాలని గ్రహించాక అన్ని రకాల పాత్రలు చేయడం మొదలుపెట్టాను. హీరోగానే అనుకుని ఉంటే సినిమాల్లో 50 ఏళ్లకు పైగా ఉండగలిగేవాడిని కాదు. ►ఓ 50 ఏళ్లు నిర్విరామంగా సినిమాలు చేసిన నేను ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. ఎవరైనా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో అంటే, ‘ఇనుముకు చెదలు పడుతుందా?’ అనేవాణ్ణి. ఆ నిర్లక్ష్యమే నా ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసింది. ‘రాఖీ’లో ఎమోషనల్ సీన్ చేసి, బైపాస్ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరాను. ‘దువ్వాడ జగన్నాథమ్’ అప్పుడు ఆరోగ్యం బాగాలేకపోవడంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాను. అయితే టీవీలోనో, యూ ట్యూబ్‌లోనో నా సినిమాలు వస్తున్నాయి.æగతంలో కన్నా ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ కావడం ఆశ్చర్యంగా అనిపించినా ఆనందంగా ఉంది. ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది. అయితే సినీజీవితం చాలా నేర్పించింది. పేరు, డబ్బు, బంధాలు శాశ్వతం కాదని నేర్పింది. నమ్మకద్రోహులకు దూరంగా ఉండాలని, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమని నేర్పింది. చెప్పుకోలేని చేదు నిజాల్ని ఎలా గుండెల్లో దాచుకోవాలో చెప్పింది. వృత్తి జీవితంలో ఎలాంటి లోటు లేదు. వ్యక్తిగత జీవితం కూడా అంతే. నా భార్య జలంధర మంచి రచయిత్రి అని అందరికీ తెలిసిందే. నాకు కోపం ఎక్కువ, ఆమెకు సహనం ఎక్కువ. దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చింది నా కోపాన్ని తగ్గించడానికేనేమో అనిపిస్తుంటుంది. మా ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్ట్. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మాసిస్ట్. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలో ఉంటున్నారు. చంద్రమోహన్ సినిమాల్లో ఆయనకు నచ్చిన 30 పాటలు. 1. ఝుమ్మంది నాదం – సిరి సిరి మువ్వ 2. మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి 3. మేడంటే మేడా కాదు – సుఖ దుఃఖాలు 4. కలనైనా క్షణమైనా – రాధా కళ్యాణం 5. మల్లెకన్న తెల్లన – ఓ సీత కథ 6. లేత చలిగాలులు– మూడు ముళ్లు 7. దాసోహం దాసోహం – పెళ్లి చూపులు 8. సామజవరాగమనా – శంకరాభరణం 9. ఈ తరుణము – ఇంటింటి రామాయణం 10. ఇది నా జీవితాలాపన – సువర్ణ సుందరి 11. పంట చేలో పాలకంకి – 16 ఏళ్ల వయసు 12. నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి 13. పక్కింటి అమ్మాయి పరువాల – పక్కింటి అమ్మాయి 14. కంచికి పోతావ కృష్ణమ్మా – శుభోదయం 15. ఏమంటుంది ఈ గాలి – మేము మనుషులమే 16. బాబా... సాయిబాబా – షిర్డీసాయి బాబా మహత్యం 17. నీ పల్లె వ్రేపల్లె గా – అమ్మాయి మనసు 18. చిలిపి నవ్వుల నిన్ను – ఆత్మీయులు 19. నీలి మేఘమా జాలి – అమ్మాయిల శపధం 20. వెన్నెల రేయి చందమామా – రంగుల రాట్నం 21. అటు గంటల మోతల – బాంధవ్యాలు 22. ఏదో ఏదో ఎంతో చెప్పాలని – సూర్యచంద్రులు 23. ఏది కోరినదేదీ – రారా కృష్ణయ్య 24. ఏ గాజుల సవ్వడి – స్త్రీ గౌరవం 25. ఏమని పిలవాలి – భువనేశ్వరి 26. మిడిసిపడే దీపాలివి– ఆస్తులు– అంతస్తులు 27. పాలరాతి బొమ్మకు– అమ్మాయి పెళ్లి 28. ఐ లవ్ యు సుజాత– గోపాల్ రావ్ గారి అమ్మాయి 29. నీ తీయని పెదవులు– కాంచనగంగ 30. నీ చూపులు గారడీ– అమాయకురాలు. -
పాజిటివ్‌గా ఉండండి.. పాజిటివ్ తెచ్చుకోకండి
కరోనా కష్టకాలంలో తన స్నేహితులు, అభిమానుల ప్రోత్సాహంతో పాతికవేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. మే 20న (గురువారం) హీరో మనోజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన. ఆ విషయం గురించి మనోజ్ మాట్లాడుతూ – ‘‘కోవిడ్ బాధితులు మెరుగైన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలు పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో పాటు కోవిడ్ కట్టడిలో భాగస్వాములైనవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాస్కులు ధరించడం, ప్రతిరోజూ శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం.. ఇలా కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడుతుంది. ఈ లాక్డౌన్లో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందిపడుతున్న పాతికవేల కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్‌లోనూ ఇలాంటి సహాయాలను కొనసాగిస్తాం. అందరూ కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించండి. పాజిటివ్‌గా ఉండంyì... కానీ కోవిడ్ పాజిటివ్ తెచ్చుకోకండి’’ అన్నారు. -
Gully Rowdy: దుమ్మురేపుతున్న రామ్ మిర్యాల పాట
‘పుట్టినే ప్రేమ పడగొట్టెనే ప్రేమ.. ఏం చేశావో ఏమో కదమ్మా, ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలాకుతలం అవుతున్నానమ్మా..’ అంటూ ప్రేయసిని చూసి పాడేస్తున్నాడు గల్లీరౌడీ. ఈ రౌడీ ప్రేమ కహానీ తెలుసుకోవాలంటే మా ‘గల్లీరౌడీ’ సినిమా చూడాల్సిందే అంటున్నారు ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాలోని ‘పుట్టినే ప్రేమ..’ పాటను సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. రామ్ మిర్యాల సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న మా సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్. -
Sundeep Kishan: ప్రయోగాత్మక సినిమాలో...
హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘టైగర్’ సినిమా విడుదలై ఆరేళ్లు అయింది. తాజాగా వీరి కాంబినేషన్లో మరో సినిమాని ప్రకటించారు. ఇది సందీప్‌కి 28వ సినిమా. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శుక్రవారం సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కథ, కథనాల ప్రకారం ఇది సందీప్ కెరీర్లో ఓ ప్రయోగాత్మక చిత్రంలా నిలుస్తుంది. సందీప్ నుంచి ప్రేక్షకులు ఆశించే కొత్తదనం, వైవిధ్యమైన అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుట్ట. -
అందాల తార జయప్రద గురించి ఈ విషయాలు తెలుసా..?
ఆమె ఆరేసుకుంటే ప్రేక్షకుడు మనసు పారేసుకున్నాడు. ఈమెతోనే రజనీకాంత్ ‘ఇంక ఊరేల.. సొంత ఇల్లేల ఓ చెల్లెలా’ అన్నది. కమలహాసన్ కళ మద్యపు మురుక్కాలవలో పారుతుంటే ఈమె కదూ దానిని ‘సాగర సంగమం’ చేయించింది. ‘భారతీయ వెండితెర మీద అంత అందమైన ముఖం మరొకటి లేదు’ అని సత్యజిత్ రే పొగిడిన ఏకైక తెలుగు అందం జయప్రదది. ఆమె రాజకీయ ప్రస్థానం ఒకదారి. ఆమె నటనదే ప్రేక్షకుల గుండెదారి. జయప్రద... జయసుధ.. శ్రీదేవి తెలుగు సినీ జగత్తును ఏలిన ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాల తేడాతో స్టార్లు అయ్యారు. తెలుగు మాట, తెలుగు ఆట, తెలుగు సౌందర్యం తెర మీద చూపారు. శ్రీదేవి గ్లామర్‌లో బెస్ట్. జయసుధ యాక్టింగ్‌లో బెస్ట్. జయప్రద ఇటు గ్లామర్, అటు యాక్టింగ్ రెంటిలోనూ బెస్ట్ అనిపించుకున్నారు. రాజమండ్రికి చెందిన లలిత రాణి ‘భూమి కోసం’ (1974)లో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించారు. ఒక పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది. ఆ వితంతువు జయప్రద. మొట్టమొదటి వేషం అలాంటిది ఎవరూ వేయరు. కాని జయప్రద చేశారు. ఆ సినిమాలోనే పేరు మార్చుకుని అప్పట్లో ‘జయ’ ట్రెండ్ నడుస్తున్నందున జయప్రదగా మారారు. ఆమె పెదవి మీద పుట్టుమచ్చ ఉంటుంది. వెండితెర మీద ఒక అందమైన పుట్టుమచ్చగా ఆమె ప్రేక్షకులకు నచ్చింది. తరం మారుతున్నప్పుడు కొత్త తరం వస్తుంది. వాణిశ్రీ, లక్ష్మి, మంజుల, లత... వీరు సీనియర్లు అవుతున్న కొద్దీ కొత్తవాళ్లు కావాల్సి వచ్చారు. జయప్రద ఆ సమయంలోనే మద్రాసులో అడుగుపెట్టారు. ఏకంగా కె.బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆమె తమిళంలో తీసిన ‘అవల్ ఒరు తోడర్ కథై’లో సుజాత చేసిన పాత్రను జయప్రదకు ఆఫర్ చేశారాయన. సుజాతకు అప్పటికి తెలుగు రాదు. అచ్చతెలుగు అమ్మాయి ఉంటేనే బాగుంటుందని బాలచందర్ ఆలోచన. అందుకు జయప్రద సరైనది అని ఆయన భావించారు. ఒక మధ్యతరగతి గంపెడు సంసారాన్ని తన భుజాల మీద మోసే, తన కలలను చిదిమేసుకుని కుటుంబం కోసం బతికే ఒక సగటు ఆడపిల్ల కథ అది. దాని బరువు ఎక్కువ. జయప్రదది ఆ సమయానికి చిన్న వయసు. కాని ఆమె ఆ పాత్రను అర్థం చేసుకొని పోషించడంతో... ఒక్క కేరెక్టర్లోనే ప్రేమ, కోపం, ఆర్తి, అసహనం చూపడంతో జయప్రద స్టార్ అయ్యారు. ఆ సినిమాయే తెలుగులో రజనీకాంత్‌కు కూడా తొలి సినిమా. ఆ సినిమాలో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట’... ఏసుదాస్‌కు, జయప్రదకు, రజనీకాంత్‌కు నేటికీ మిగిలిపోయింది. కె.బాలచందర్ దర్శకత్వంలో ఆమె ‘47 రోజులు’, ‘అందమైన అనుభవం’ చేశారు. కేన్సర్ పేషెంట్‌గా చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? జయప్రద తప్ప. ‘అడవి రాముడు’తో కె.రాఘవేంద్రరావు జయప్రదను కమర్షియల్ హీరోయిన్ను చేశారు. అప్పటికే జయప్రద కుటుంబం ఎన్.టి.ఆర్కు పరిచయం ఉంది. కొన్నాళ్ల క్రితం సెలవుల్లో వచ్చి ఆయన దగ్గర కూచుని కబుర్లు చెప్పిన స్కూల్ గర్ల్ ఇప్పుడు ఆయన పక్కనే హీరోయిన్ అయ్యింది. వేటూరి రాయగా కె.వి.మహదేవన్ స్వరపర్చగా బాలూ, సుశీల పాడిన ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట జయప్రదను సకల ప్రేక్షకులకు పరిచయం చేసేసింది. జయప్రద అంటే ఒక సుందరమైన సౌందర్యవంతమైన రూపం. ప్రేక్షకులు అలానే కోరుకున్నారు. ఆమె నేటికీ అలానే ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా లో నటిస్తున్నారు. మరోసారి జయప్రద జయప్రదంగా మన ముందుకు రావాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
నితిన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
సినిమా అవకాశాల కోసం తిరగకుండానే తేజ లాంటి పెద్ద దర్శకుడి రూపంలో ఆ యువకుడికి హీరోగా అవకాశం వచ్చింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రయత్నాలు చేయకుండా వినాయక్, రాజమౌళి, రాఘవేంద్రరావు, కృష్ణవంశి లాంటి బడా డైరెక్టర్లు తనని హీరోగా సెలక్ట్ చేసుకున్నారు. ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. అతి చిన్న వయసులోనే స్టార్ అయిపోయాడు. కాలం అడ్డం తిరిగింది. వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. స్టార్ హోదా పోయింది. దగ్గరి వాళ్లు దూరమయ్యారు. అయినా ‘ధైర్యం’గా నిలబడ్డాడు. తప్పిదాలు తెలుసుకున్నాడు. ఆచి తూచి కథలు ఎంచుకున్నాడు. ‘ఇష్క్’తో పనిచేశాడు. పుష్కరకాలం తర్వాత మళ్లీ వి‘జయం’ వరించింది. తనదైన నటనతో ప్రేక్షకుల ‘దిల్’లో స్థానం సంపాదించుకొని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అతనే యంగ్ హీరో నితిన్. ఈ ‘అల్లరి బుల్లోడి’ 38వ పుట్టిన రోజు నేడు (మార్చి 30). ఈ సందర్భంగా నితిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. ► నితిన్ పూర్తి పేరు నితిన్ కుమార్ రెడ్డి.1983 మార్చి 30న సుధాకర్‌రెడ్డి, విద్యారెడ్డి దంపతులకు నిజామాబాద్‌లో జన్మించాడు. ► నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పాపులర్ డిస్ట్రిబ్యూటర్. ► నువ్వు-నేను సినిమా సమయంలో డైరెక్టర్ తేజ.. నితిన్ ని చూసి నా తర్వాత సినిమా హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. ► 2002లో 'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడ నితన్ ► తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును గూడ అందుకున్నాడు ► దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘సై’ సినిమా నితిన్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది ► ఒకానొక దశలో ఏకంగా దశాబ్దానికి పైగా వరసగా 14 సినిమాలు ప్లాపులు వచ్చాయి నితిన్‌కి. ► 2012లో వచ్చిన 'ఇష్క్' సినిమాతో మళ్లీ సక్సెస్ బాటపట్టాడు ► 2020లో వెంకి కుడుముల రూపొందించిన ‘భీష్మ’తో మరో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు ► ఈ ఏడాది చెక్‌తో ఎంట్రీ ఇచ్చి.. తాజాగా రంగ్‌దే మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు ► హీరోగానే కాకుండా.. నిర్మాతగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యే గుర్తింపు తెచ్చుకున్నాడు ► పవన్ కల్యాణ్ నటించిన తొలి ప్రేమను 28సార్లు చూసి పవర్ స్టార్‌కు వీరాభిమానిగా మారాడు. ► జూలై 16, 2020న షాలిని కందుకూరితో నితిన్ వివాహం జరిగింది. ఈ వేడుకకి పవన్ కల్యాణ్ హాజరయ్యాడు ► నితిన్ ప్రస్తుతం 'అందాధూన్' రీమేక్ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు. -
స్నేహం.. యాక్షన్.. థ్రిల్
‘‘అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధా రంగా ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని రూపొందించాం. ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. మా నాన్న (మంచు మోహన్‌బాబు) పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని మంచు విష్ణు అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. ఇందులో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ నటించారు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ చిన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు పది నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను శుక్రవారం వైజాగ్ మెలోడి థియేటర్లో ప్రేక్షకులకు చూపించారు. అనంతరం విలేకరులతో మంచు విష్ణు మాట్లాడుతూ – ‘‘విశాఖలో అభిమానులతో ఈ ప్రీమియర్ షో చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అన్నీ ఉంటాయి’’ అన్నారు. నవదీప్ కూడా పాల్గొన్నారు. -
శర్వానంద్‌కి సర్ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో..
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. శనివారం 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్న బర్త్ డే బాయ్ శర్వాకి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, స్నేహితులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బర్త్‌డే సందర్భంగా శర్వానంద్‌కి ఊహించని సర్ప్రైజ్ ఎదురయ్యింది. తన బెస్ట్ ఫ్రెండ్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్‌కు మర్చిపోలేని పుట్టిన రోజు కానుక ఇచ్చారు. అర్థరాత్రి బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసి శర్వానంద్ చేత కేక్ కట్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిలో శర్వానంద్.. రామ్ చరణ్, మరో స్నేహితుడితో కలిసి బర్త్ డే కేక్ కట్ చేయడం చూడవచ్చు. ఆచార్య సినిమాకు సంబంధించి తన షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్, రెండు రోజుల క్రితం భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్నేహితుడు శర్వానంద్ కోసం సర్ప్రైజ్ బర్త్ డే పార్టీ అరెంజ్ చేశారు. రామ్ చరణ్, శర్వానంద్‌తో పాటు మరో స్నేహితుడు విక్కి కూడా ఈ బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు. Thank you @AlwaysRamCharan for hosting a great party ❤️❤️❤️ pic.twitter.com/jJf03cRMp0 — Sharwanand (@ImSharwanand) March 6, 2021 శ్రీకారం మూవీని పూర్తి చేసిన శర్వానంద్ ప్రస్తుతం తరువాత సముద్రం సినిమాతో బిజీగా ఉన్నాడు.అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్దార్థ్, అను ఇమ్యానుయేల్, అదితి రావ్ హైదరీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో చిత్రం బృందం శర్వానంద్ బర్త్ డే సందర్భంగా మహా సముద్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసింది. పోస్టర్ని బట్టి ఈ సినిమా సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో శర్వానంద్ చేతిలో ఆయుధంతో.. చాలా కోపంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీకారం సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. వ్యవసాయం ప్రాముఖ్యత, అవసరాన్ని తెలియజేస్తూ సాగే ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా ప్రియాంకా అరుళ్ మోహన్ నటించారు. గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. -
కేసీఆర్‌కు సీఎం జగన్ బర్త్ డే విషెష్
సాక్షి, అమరావతి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో చిరకాలం కొనసాగేలా దీవించాలని ప్రార్ధిస్తున్నాను’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా భారీ సంఖ్యలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాజికవేత్తలు, హరిత ప్రేమికులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ తమిళిసై, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్ కుమార్ తదితరులు ట్విట్టర్ ద్వారా సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. సినీ ప్రముఖులు చిరంజీవి, మహేశ్ బాబుతో పాటు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నేడు కోటి వృక్షార్చన -
బర్త్ డే: కేసీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు
అరవై ఏళ్ల కల.. కోట్ల మంది ఆశయం.. ఎంతో ప్రాణత్యాగాల ఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. సుదీర్ఘ కాలం పాటు సాగుతున్న ఉద్యమానికి ఊపిరి పోసి ఎట్టకేలకు మలిదశలో స్వరాష్ట్ర కల సాధ్యమైంది. దానికి మార్గం వేసినది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. రాష్ట్రం కోసం పోరాడి దాన్ని సాధించి అదే రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం కేసీఆర్‌కే చెల్లింది. ఫిబ్రవరి 17వ తేదీ ఆయన జన్మదినం. ఈ సందర్భంగా కేసీఆర్ జీవితంలోని కొన్ని ప్రధాన ఘట్టాలు తెలుసుకోండి. జననం 17 ఫిబ్రవరి, 1954. స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకగా పేర్కొంటారు. కానీ వారి పూర్వీకులది చింతమడక కాదు. ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో వారి భూమి కోల్పోవడంతో చింతమడకకు వలస వచ్చారు. అందుకే జలాశయాల కోసం భూ సేకరణ జరిగినప్పుడుల్లా తాము భూ నిర్వాసితులమేనని కేసీఆర్ చాలాసార్లు గుర్తు చేశారు. కేసీఆర్‌కు ఒక అన్న, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ డిగ్రీ పట్టా పొందారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రవేశం. మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్‌లో కీలక నేతగా మారారు. పదిహేన్నేళ్ల వయసులో.. 1969, ఏప్రిల్ 23న శోభతో వివాహం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు సాహిత్యం పూర్తి చేశారు. అయితే అదే విశ్వవిద్యాలయ శత వసంతాల వేడుకలను పూర్వ విద్యార్థి అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించడం విశేషం. కేసీఆర్‌కు దైవభక్తి ఎక్కువ. తరచూ యాగాలు చేస్తుంటారు. అందుకే దేవాలయాల అభివృద్ధికి నడుం బిగించారు. యాదాద్రిని అద్భుత రీతిలో తీర్చిదిద్దుతున్నారు. దాదాపు రూ.1,800 కోట్ల వ్యయంతో ఈ ఆలయ పునఃనిర్మాణం చేస్తున్నారు. తిరుమల వేంకటేశ్వరుడికి బంగారు ఆభరణాలు, విజయవాడ కనకదుర్గకు ముక్కు పుడక, కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు బహూకరించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించినట్లు కేసీఆర్ తెలిపారు. కేసీఆర్‌కు ఎన్టీఆర్, అమితాబ్ సినిమాలంటే చాలా ఇష్టం. పౌరాణిక చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తారు. ఘంటసాల పాటలంటే ప్రాణం, ఆ పాటలు విని మంచిమూడ్‌లో వాటిని ఎదుటివారికి వినిపించడమంటే ఆయనకు ఇష్టం. పుస్తక ప్రియుడు. సాహిత్య పుస్తకాలు విపరీతంగా చదువుతారు. పుస్తక ప్రియులతో గంటల తరబడి చర్చల్లో గడుపుతారు. ఓల్గా నుంచి గంగ వరకు ఎన్నెన్నో పుస్తకాలను చదివినట్టు ఆయన పలు సందర్భాల్లో తెలిపారు. దూర ప్రయాణాల్లో కారు డ్రైవింగ్ చేయడం ఆయనకో సరదా. నిత్యం అన్ని పత్రికలు చదివాకే పనిలోకి వెళ్తారు. గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాలు ఆసక్తిగా తెలుసుకుంటారు. రాజకీయ తొలి గురువు మదన్ మోహన్. గురువుపైనే పోటీ చేసి కేసీఆర్ గెలిచారు. కూతురు కవిత అంటే కేసీఆర్‌కు ఎంతో ఇష్టం. కవిత పుట్టాకే రాజకీయాల్లో కలిసొచ్చిందని గట్టి నమ్మకం. అందుకే విదేశాల్లో ఉన్న కవితను పిలిపించారు. ఆమెను నిజామాబాద్ ఎంపీగా పోటీలో నిలిపి గెలిపించేలా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీని చేశారు. 1975లో రాజకీయాల్లో బిజీ అయి కుమారుడు కేటీఆర్ తొట్టెల వేడకకు కేసీఆర్ ఇంటికి కూడా వెళ్లలేదు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టినా చిన్నపిల్లలకు ఇచ్చే కిట్‌కు మాత్రమే కేసీఆర్ తన పేరు పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన పిల్లలకు ‘కేసీఆర్ కిట్’ ఇస్తున్నారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా నవంబర్ 29న నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు పది రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. ‘ఆ పది రోజులు మానేసిన అన్నం బువ్వ ప్రజలకు బోనంకుండలో బెల్లం బువ్వ అయ్యింది’ అని కవులు పాటలు పాడారు. కేసీఆర్‌కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్లంలో మంచి పట్టు ఉంది. అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడి ప్రజలను ఆకట్టుకోవడం కేసీఆర్ స్టైల్. కేసీఆర్ ఆయా సందర్భాల్లో మాట్లాడుతున్న సమయంలో పాడిన పద్యాలు.. కవితలు.. పాటలు, డైలాగ్స్ ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆసరాతో ఆప్తుడయ్యాడు.. రైతుబంధుతో బంధువయ్యాడు.. రైతుబీమాతో భోజుడయ్యాడు.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో మేనమామయ్యాడు.. కేసీఆర్ కిట్ తో తాతయ్యాడు.. మిషన్ భగీరథ, కాకతీయతో జలాధీశుడయ్యాడు నిరంతర విద్యుత్తుతో వెలుగులు వెదజల్లుతున్నాడు.. కాళేశ్వరంతో జలసిరులు కురిపించాడు.. స్వరాష్ట్రం తెచ్చాడు.. స్వర్ణకాంతులు వెలిగిస్తున్నాడు.. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ యోధుడా అందుకో ఈ శుభాకాంక్షలు (సోషల్ మీడియాలో వచ్చిన కవిత) రాజకీయం జీవితంలో ప్రధాన ఘట్టాలు సిద్ధిపేటలోని రాఘవపూర్ ప్రధాన వ్యవసాయ కో-ఆపరేటిప్ సొసైటీకి చైర్మన్‌గా కేసీఆర్ బాధ్యతలు నిర్వర్తించారు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించడంతో కాంగ్రెస్‌ను వదిలి వచ్చేశారు. 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా సిద్దిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1989, 1994, 1999, 2001లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక. తొలిసారిగా 1987-88లో మంత్రి అయ్యారు. 1989-1993 వరకు తెలుగుదేశం పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 1999లో ఆంధ్రప్రదేశ్ ఉప శాసన సభాపతిగా ఉన్నారు. 1999లో చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. ఈ అసంతృప్తి టీఆర్ఎస్ పార్టీ స్థాపనకు దారి తీసింది. చంద్రబాబు తీరుకు నిరసనగా 2001 ఏప్రిల్ 21న డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఏప్రిల్ 27న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2003లో న్యూ స్టేట్స్ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. 2004 ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభకు పోటీ చేశారు. కరీంనగర్ నుంచి ఎంపీగా విజయం. యూపీఏ-1 హయాంలో 2004-06 కాలంలో తొలిసారి కేంద్ర మంత్రి. తెలంగాణపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ 2006లో యూపీఏ నుంచి బయటకు వచ్చారు. కేంద్ర మంత్రిగా, కరీంనగర్ ఎంపీగా రాజీనామా చేశారు. అనంతరం జరిగిన కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ రెండు లక్షల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. 2009లో మహబూబ్‌నగర్ నుంచి కేసీఆర్ పోటీ చేసి ఎంపీగా గెలిచారు. పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ బిల్లుపై పార్లమెంట్లో కొట్లాడారు. 2009 నవంబర్ 29న ఆమరణ దీక్ష చేసి పది రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నారు. డిసెంబర్ 9న కేంద్రం ప్రకటనతో దీక్ష విరమించారు. జూన్ 2, 2014న ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ (గజ్వేల్ ఎమ్మెల్యే) బాధ్యతలు చేపట్టారు. 2018 సెప్టెంబర్ 6వ తేదీన అకస్మాత్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. రెండోసారి టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. రెండో దఫా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. -
కెజీఎఫ్ హీరో యశ్ బర్త్‌డే లుక్స్
-
తల్లి సైకిల్ యాత్ర: ఉపాసన భావోద్వేగం
బంజారాహిల్స్ : అపోలో ఆస్పత్రుల వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని తన 60వ పుట్టినరోజు వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు. ఈ నెల 25న ఉదయం తన భర్త అనిల్ కామినేనితో కలసి చాలెంజ్ టు సైకిల్ టు చెన్నై ఫ్రం హైదరాబాద్ అనే నినాదాన్ని ఎంచుకొని బయల్దేరారు. రోజుకు వంద కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ఆరు రోజుల్లో 600 కిలోమీటర్లు వెళ్ళి చెన్నైలో తన తండ్రి ప్రతాప్.సి.రెడ్డిని బుధవారం కలుసుకొని సంతోషం పంచుకున్నారు. సైక్లింగ్‌తో తన భర్త, కూతురుతో కలసి ఔటింగ్‌కు వెళ్లిన ఆనందం కలిగించిందని ఆమె తెలియజేశారు. సైకిల్ రైడింగ్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఒక మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదనే నమ్మకానికి పునాది వేసిందని పేర్కొన్నారు. తన తల్లి శోభనా కామినేని తన 60వ పుట్టినరోజున హైదరాబాద్ నుంచి చెన్నైకి 600 కిలోమీటర్లు సైకిల్ రైడింగ్ చేస్తూ వెళ్లడం తనకెంతో గర్వంగా ఉందని ఆమె కూతురు, సినీహీరో రామ్‌చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల బుధవారం ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. -
దిల్‌రాజు 50వ జన్మదిన వేడుక గ్రాండ్ పార్టీ
-
అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ పోస్టర్..!
26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్షన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అడవి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ రోజు తన బర్త్‌డే సందర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధైర్య సాహసాలు ప్రతిబింబించేలా `మేజర్` ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించింది చిత్ర యూనిట్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లుక్‌లో అడివి శేష్‌ను ప్రదర్శిస్తూ ఈ రోజు ఉదయం 10 గంటలకు `మేజర్` ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్. Happy to present the first look of #Major!! Wishing you a very happy birthday @AdiviSesh. I'm sure Major will go down as one of your best performances. Good luck and happiness always! 😊 pic.twitter.com/q5BLRj8ewn — Mahesh Babu (@urstrulyMahesh) December 17, 2020 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జర్నీని ప్రేక్షకులకుకి అందించడమే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం అని తెలిపారు దర్శకుడు. అతడు వీర మరణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది చిత్ర యూనిట్. 27/11న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వర్ధంతి సందర్భంగా హీరో అడివి శేష్ లుక్ టెస్ట్ పోస్టర్‌తో పాటు, అమరవీరుల జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ సినిమా తీసే ప్రయాణాన్ని గురించి వెల్లడించే వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.(ఆయన కళ్లల్లో ప్యాషన్ కనిపించింది– అడివి శేష్) మేజర్ టీమ్ ఆగష్టులో కోవిడ్ సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటి వరకు 70శాతం షూట్ పూర్తి చేసింది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ సినిమాకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయనున్నారు. -
‘అందాల రాక్షసి’ బర్త్‌డే.. చీర కట్టులో..
సాక్షి, హైదరాబాద్: ‘అందాల రాక్షసి’.. బ్యూటీ లావణ్య త్రిపాఠి నేడు 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. డిసెంబర్ 15 ఆమె బర్త్‌డే సందర్భంగా హీరో అల్లు శీరిష్‌తో పాటు ప్రముఖ నటీనటులు ఆమెకు బర్త్‌డే విషెష్ తెలుపుతున్నారు. అంతేగాక అభిమానుల నుంచి కూడా లావణ్యకు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ వెల్లువెత్తున్నాయి. కాగా అందాల రాక్షసితో టాలీవుడ్ వెండితెరపై మెరిసిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత స్టార్హీరోయిన్గా ఎదిగారు. Happy birthday Lavanya! Keep making faces and dont become normal. Have a great year ahead. All the best for A1 Express & CKC! @Itslavanya pic.twitter.com/YT1cjGsOdq — Allu Sirish (@AlluSirish) December 15, 2020 హీరో నాని, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన ‘భలే భలే మాగాడివోయ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మన్మధుడు’ నాగార్జున అక్కినేని సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’లో నటించి టాలీవుడ్లో అగ్రనటిగా రాణిస్తున్నారు. ఇక ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా లావణ్య చీర కట్టులో మెరిసిపోతున్న కొన్ని హాట్ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) -
ఒక్కరు కాదు.. వందమంది రజనీలు
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్‌కు 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. శనివారం పదుల సంఖ్యలో అభిమానులు రజనీ వేషధారణలో పోయస్ గార్డెన్‌లోని ఆయన ఇంటిముందుకు చేరి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రోబో, భాషా, నరసింహ ఇలా హిట్ సినిమాలలోని రజనీ వేషాలను వారు ధరించారు. కొందరు పోస్టర్లు పట్టుకుని తమదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నారు. సూపర్ స్టార్ రాజకీయరంగ ప్రవేశం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా జరుకుంటున్నారు. కాగా, డిసెంబర్ 31న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నట్లు తలైవర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
హ్యాపీ బర్త్‌డే బంగారం
తంగమే... నయనతారను విఘ్నేష్ శివన్ అలానే పిలుస్తారు. అంటే బంగారమే అని అర్థం. ‘హ్యాపీ బర్త్‌డే తంగమే’ అని బుధవారం తన గర్ల్ ఫ్రెండ్‌కి శుభాకాంక్షలు చెప్పారు విఘ్నేష్. ‘‘నువ్వెప్పుడూ ఇలానే స్ఫూర్తినిస్తూ ఉండాలి. ఇంతే అంకితభావంతో, క్రమశిక్షణతో, ఇలానే నిజాయతీగా కొనసాగాలి. ఎప్పటికీ ఇలానే ఎదుగుతూ ఉండాలి. ఆ దేవుడు నీకెప్పుడూ ఆనందాన్ని, విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతో పాజిటివిటీతో మరో సంవత్సరం ఆరంభం అయింది’’ అని కూడా విఘ్నేష్ పేర్కొన్నారు. కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్, నయన ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక పుట్టినరోజు సందర్భంగా నయనతార రెండు లుక్స్‌తో అభిమానులను ఖుషీ చేశారు. ఒకటి తమిళ చిత్రం ‘నెట్రిక్కన్’, ఇంకోటి మలయాళ చిత్రం ‘నిళల్’. ‘నెట్రిక్కన్’ అంటే శివుడి మూడో కన్ను అని అర్థం. ఇందులో నయన అంధురాలిగా నటిస్తున్నారు. నగరంలో వరుస హత్యలకు గురయ్యే యువతుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఓ సీరియల్ కిల్లర్ నయనను అంతం చేయడానికి ప్రయత్నించడం చిత్రం ప్రధానాంశం. ఈ చిత్రాన్ని విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు. ‘నిళల్’ మలయాళ సినిమా. నీడ అని అర్థం. ఇందులో హీరోకి దీటుగా ఉండే పాత్రను నయనతార చేస్తున్నారు. -
ఆమె స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి : రోజా
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ ఆర్కే రోజా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆమె జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక సినీ పరిశ్రమలోనూ సుధీర్ఘ కాలం కొనసాగిన రోజుకు పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు అందాయి. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా 1972 నవంబర్ 17న జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లోనూ విజయం సాధించి వరుసగా రెండోసారి చట్టసభకు ఎన్నికయ్యారు. అగ్ర కథానాయకుల సరసన రాజకీయాల్లోకి రాకముందు రోజా తెలుగు చిత్రాలతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. డాక్టర్ శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తరువాత, సినీ నిర్మాతగా కూడా మారారు. తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్.కే.సెల్వమణిని వివాహం చేసుకున్నారు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా జబర్దస్త్, బతుకు జట్కబండి, రంగస్థలం వంటి షోలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ దూసుకెల్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా.. ఈ సందర్భంగా మంగళవారం సాక్షి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రోజా మాట్లాడారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వైఎస్సార్సీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమలో ఎంతో కాలం కొనసాగాను. తొలినాళ్లలో హీరోయిన్గా రాణించడం చాలా కష్టమని ఎంతో మంది ఎగతాలి చేశారు. అయినప్పటికీ.. ఎంతో కష్టపడి నటన, డాన్స్ నేర్చుకున్నాను. పరిశ్రమలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించాను. కొత్తలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను. విమర్శలను పాజిటివ్‌గా తీసుకున్నాను. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేయడం ఆనందంగా ఉంది.’ అని సంతోషం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహేశ్ అన్నట్లు ఇవ్వకపోతే లావైపోతాం
ఏదైనా కొత్త ప్రయత్నం మొదలుపెట్టాలంటే ఓ మంచిరోజు చూడాలి. ‘పుట్టినరోజుకి మించిన మంచి రోజు లేదు’ అంటున్నారు మంజుల. దానికి కారణం కూడా చెప్పారు. ఆ విషయంతో పాటు మరెన్నో విశేషాలు పంచుకున్నారు. నేడు తన బర్త్‌డే సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు మంజుల. ► పుట్టినరోజు విశేషాలు చెబుతారా? ఎవరికైనా పుట్టినరోజు అనేది చాలా చాలా మంచిరోజు. ఆ రోజు స్టార్స్ అన్నీ అందరికీ అలైన్మెంట్ (అమరిక)లో ఉన్నట్లుగా ఉంటాయి. అందుకే ఆ రోజు ఏం చేసినా అది సజావుగా జరుగుతుందని నమ్ముతాను. పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా నేను రెండు నిర్ణయాలు తీసుకున్నాను. ఒకటేంటే.. నా యూ ట్యూబ్ చానల్లో ‘వెయిట్ లాస్’కి సంబంధించిన సిరీస్ చేయాలనుకుంటున్నాను. ఇంకోటి హెల్త్ ప్రొడెక్ట్స్. మనకొచ్చే ఆరోగ్య సమస్యలన్నీ చాలావరకు మనం వాడే నూనెలతోనే వస్తాయి. అందుకే ఆర్గానిక్ ఉత్పత్తులతో కొబ్బరినూనె, శనగనూనె, ఆవనూనె, నెయ్యి.. వంటివన్నీ తయారు చేస్తున్నాం. మా ఉత్పత్తులు 100శాతం యుఎస్‌డిఏ సర్టిఫికెట్తో మార్కెట్లోకి వస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన మంచి విషయాలు మనకు తెలిసినప్పుడు అందరితోనూ పంచుకోవాలి. అవన్నీ మన దగ్గరే పెట్టుకుంటే లావైపోతాం. ‘శ్రీమంతుడు’లో మహేశ్ చెప్పాడుగా. నేను ఒకప్పుడు చాలా బరువు పెరిగాను. మళ్లీ మామూలుగా ఎలా అయ్యానో కూడా యూ ట్యూబ్‌లో షేర్ చేసుకున్నాను. ► పుట్టినరోజున స్టార్స్ అన్నీ అనుకూలంగా ఉంటాయనే విషయం ఎలా తెలిసింది? భారతీయ జాతక చక్రం లాగానే ‘కబాలా’ అని ఒకటుంది. చైనీస్, ఫిలిప్పీన్స్ వాళ్లు కబాలాను నమ్ముతారంటారు. ‘సన్ పీరియడ్’ అని ఒకటుంటుందని వాళ్లు చెబుతారు. మనం పుట్టినరోజు నుంచి 52 రోజులపాటు ఆ శక్తి ఉంటుందట. ఆ 52 రోజుల సమయంలో మనం ఏం పట్టుకున్నా బంగారం అవుతుందంటారు. అలాగని మనం కష్టపడకుండా కూర్చుంటే కుదరదు. మన కృషికి స్టార్ పవర్ తోడవుతుంది. ► మీ గత పుట్టినరోజులకు ఇది పాటించి, చేసినవి మీకు కలిసొచ్చాయా? నిజానికి ఈ విషయం నాకు ఏడాది క్రితమే తెలిసింది. నా గత బర్త్‌డేకి వెబ్సైట్, యూట్యూబ్ చానల్, ఆర్గానిక్ ఫుడ్స్.. ఇవన్నీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అవన్నీ ఆచరణలో పెట్టగలిగాను. ► మీ నాన్నగారికోసం ప్రత్యేకమైన డైట్ ఏమైనా చెప్పారా? నాన్నగారే నాకు చాలా విషయాలు చెప్పారు. ఆయన ఇంట్లో వండిన ఆహారమే తీసుకుంటారు. మొన్నీ మధ్య నాకు కొంచెం ఎలర్జీ అయితే ఆయనతో చెప్పాను. ‘అమ్మూ.. పసుపునీళ్లతో ఆవిరి పట్టు’ అన్నారు. రోజూ పదకొండు గంటలకు ఫోన్ చేసి, ‘ఈరోజు ఆవిరి పట్టావా, లేదా’ అని అడిగేవారు. నాన్న చెప్పిన చిట్కా వర్కవుట్ అయింది. ► ఇప్పుడు కృష్ణగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఆ మధ్య కొంచెం డల్‌గా కనబడ్డారు.. ఆయన చాలా బాగున్నారు. ఒక్కోసారి ఎవరికైనా డల్‌గా ఉంటుంది. అది సహజం. అయితే ఇదివరకటిలా నాన్న స్పీడ్‌గా నడవటం లేదు. అది అనారోగ్యం వల్ల కాదు. జాగ్రత్తగా ఉంటున్నారు.. అంతే. మిగతాదంతా మామూలే. రోజూ వాక్ చేస్తారు, యోగా చేస్తారు. నాన్న ఫుల్ ఎనర్జీగా ఉన్నారు. ► విజయనిర్మలగారు చనిపోయాక ఆయన జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఆ బాధ నుంచి బయటపడగలిగారా? నాన్న కచ్చితంగా ఆవిడ్ని మిస్సవుతున్నారు. వాళ్లిద్దరిదీ 50 ఏళ్ల అనుబంధం. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చాలా స్ట్రాంగ్. కానీ ఆవిడ పక్కన లేకపోయినా నాన్నగారు ఆ బాధ నుంచి బయటకు రాగలిగారు. బేసిక్‌గా నాన్న కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. ► నిజానికి విజయనిర్మలగారు దూరం అయ్యాక కృష్ణగారు మీలో ఎవరి దగ్గరికన్నా వస్తారేమో అనుకున్నాం? ఎప్పటినుంచో ఉంటున్న ఇంట్లో ఆయనకంటూ ఒక సెటప్ తయారు చేసుకున్నారు. ఆ ఇంట్లో అందరూ ఉన్నారు. మా ఇంటికి, నాన్నగారింటికి దూరం రెండు నిమిషాలే. ఓ రకంగా చెప్పాలంటే మేం కలిసి ఉంటున్నట్లే. అలాగే రోజూ మనవళ్లు, మనవరాళ్లను కలుస్తారు. -
ఆమె అన్ని పాత్రలకి సూ‘టబు’ల్..
సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి స్టార్స్ అయిన వారిలో చాలా మంది ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైలో జెండా పాతినవారిలో శ్రీదేవి, జయప్రద మొదటి వరుసలో వస్తారు. కాని అంతే స్టార్‌డమ్‌ను, రెస్పెక్ట్ను సృష్టించుకున్న ఇంకో హీరోయిన్ను మన సౌత్ ఖాతాలో ఎవరూ వేయరు. ఆమె టబూ.. అసలు సిసలు తెలుగు అమ్మాయి. అందులోనూ హైదరాబాదీ అమ్మాయి. టబు బాలీవుడ్లో తన టాలెంట్‌ను చూపారు. ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో ఒక వర్సటైల్ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ తన బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు.. అసలు పేరు తబస్సుమ్... టబు అని అందరూ పిలుస్తారు గాని ఆమె అసలు పేరు తబస్సుమ్. పిలిస్తే తబు అని పిలవాలి. కాని టబు అని అలవాటైంది. ఆమె మదర్, ప్రసిద్ధ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ మదర్ దగ్గరి బంధువులు. షబానా ఆజ్మీకి టబూ మేనకోడలి వరుస. టెన్త్ వరకూ హైదరాబాద్‌లో చదువుకున్న టబు ఇంటర్ నుంచి చదువు కోసం ముంబై వెళ్లింది. షబానా ఆజ్మీ వల్ల సినిమా వాతావరణం ఉండటంతో ముందు టబు అక్క పర్హా ఖాన్ హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత టబు కూడా సినిమా రంగ ప్రవేశం చేసింది. షబానా ఇంట్లో టబును చూసిన ప్రసిద్ధ నటుడు దేవ్ ఆనంద్ ఆమెకు హమ్ నౌజవాన్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కాని కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉండే మన నిర్మాత రామానాయుడు టబును కూలీ నంబర్ ఒన్ సినిమాతో తెలుగులోకి తీసుకు వచ్చారు. ఆ సినిమా సూపర్‌హిట్. టబు కూడా సూపర్ హిట్. బాలీవుడ్లో కూడా విజయపథమే.. కూలీ నంబర్ ఒన్ తర్వాత టబు రేంజ్ పెరిగిపోయింది. అందరు హీరోలకు అందుబాటులో లేనంత స్థాయికి వెళ్లింది. ఆ టైమ్‌లోనే హిందీలో అజయ్ దేవ్‌గణ్‌తో చేసిన విజయ్‌పథ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అజయ్ దేవగణ్ ముంబైకు వచ్చినప్పటి నుంచి టబుకు క్లోజ్ ఫ్రెండ్. వాళ్లు ముంబైలో ఇరుగు పొరుగు ఉండేవారు. ఆ పరిచయం వల్లే విజయపథ్లో కలిసి నటించారు. హిట్ కొట్టారు. (చదవండి: మళ్లీ జంటగా...) టబు-నాగ్ల స్నేహానికి నాంది.. ఈ లోపు తెలుగులో మాస్టర్ అఖిల్ హీరోగా సిసింద్రీ మొదలయ్యింది. నాగార్జున సొంత సినిమా కావడం వల్ల ఇందులో స్పెషల్ సాంగ్‌లో నటించింది టబు. నాగార్జున టబుల సుదీర్ఘ స్నేహానికి ఈ సినిమా మొదటి మెట్టుగా నిలిచింది. పండు అలియాస్ మహాలక్ష్మి.. కాని అసలు సిసలు మాయాజాలం, టబూజాలం తెలియజేసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. హిందీలో కొత్త ఫ్యామిలీ స్టోరీ ట్రెండ్‌ను తీసుకొచ్చిన హమ్ ఆప్ కే హై కౌన్ స్ఫూర్తితో రాసుకున్న ఈ కథలో మహాలక్ష్మి అలియాస్ పండుగా టబు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నాగార్జునను గ్రీకువీరుడిగా మోహించే అందాలరాశిగా ఆకర్షించారు. (చదవండి: ముచ్చటగా మూడోసారి) ప్రేమదేశంతో సౌత్‌లో టాప్ కాని అదే సమయంలో దర్శకుడు కదిర్ తమిళంలో తీసిన కాదల్ దేశం టబును మొత్తం సౌత్‌కు పరిచయం చేసింది. ఆ సినిమా తెలుగులో ప్రేమదేశం పేరుతో విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. టబులోని గ్రేస్ ఈ సినిమాలో కుర్రకారు వెర్రెత్తి చూశారు. మేచిస్, అస్తిత్వతో మరో మెట్టు పైకి.. కాని టబు అంటే ఇలాంటి కేరెక్టర్లేనా? ఆమెలో నటిగా టాలెంట్ లేదా? ఉంది అని కనిపెట్టినవాడు దర్శకుడు గుల్జార్. అతడు తీసిన హిందీ సినిమా మేచిస్ టబులోని కొత్త నటిని లోకానికి వెల్లడి చేశారు. ఆమెను దృష్టిలో పెట్టుకుని మంచి కథలు రాయవచ్చని ఆ సినిమా రుజువు చేసింది. ఉగ్రవాదం నేపథ్యంలో నలిగే ఒక అమ్మాయి పాత్రలో టబు అద్భుత నటన ప్రదర్శించి ఎన్నో అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు సంజయ్ మంజ్రేకర్ తీసిన అస్తిత్వ సినిమా టబును నటనను మరో స్థాయికి తీసుకెళ్లారు. భర్త ఉండగా మరో పురుషుడితో సంబంధంలోకి వెళ్లే గృహిణి పాత్రలో టబు ఈ సినిమాలో నటించారు. స్త్రీల మానసిక ప్రపంచం గురించి భావోద్వేగాల గురించి ఈ సినిమాలో టబు చేసిన స్టేట్మెంట్ ఆ సమయంలో గొప్ప ఫెమినిస్టిక్ స్టేట్మెంట్గా విమర్శకులు వ్యాఖ్యానించారు. ఉత్తమ నటిగా నిలబెట్టిన చాందిని బార్ ఆ తర్వాత ఫైనల్ టచ్‌గా మధుర్ భండార్కర్ తీసిన చాందిని బార్ టబును జాతీయ ఉత్తమ నటిగా నిలబెట్టింది. ముంబైలో పని చేసే బార్ డాన్సర్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అటు ప్రేక్షకుల ఇటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత టబు గొప్ప కథలకు ఒక ముఖ్యమైన ఎంపికగా నిలిచింది. హిందీలో సీరియస్ సినిమాలు చేస్తూనే తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పక్కన సినిమాలలో నటించింది టబు. చిరంజీవితో అందరివాడులో ఆమె చేసిన పాట ఎవరు మర్చిపోతారు. (చదవండి: హార్ట్ బీట్‌ని ఆపగలరు!) అంధాదున్కి క్రిటిక్స్ కితాబు.. టబు ఇటీవల బాలీవుడ్లో అంధాధున్ సినిమాలో కీలకమైన పాత్ర చేసి బాలీవుడ్‌ను మరోసారి సర్ప్రైజ్ చేశారు. ఆమె చేయడం వల్లే ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని క్రిటిక్స్ కితాబు. మొన్నటి అల వైకుంఠపురములో టబు తాజా తెలుగు సినిమా. ఇక టబు పర్సనల్ లైఫ్‌లోకి వస్తే తను సింగిల్ ఉమన్‌గా ఉన్నారు. ఇంకా వివాహ బంధంలోకి వెళ్లలేదు. ఖాళీ దొరికితే సోలో ట్రావెలర్‌గా దేశాలు తిరగడం ఆమెకు ఇష్టం. గొప్ప నటిగా గొప్ప సినిమాలు మరెన్ని చేస్తూ తను హ్యాపీగా ఉంటూ మనల్ని హ్యాపీగా ఉంచాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే టుయూ వన్స్ అగైన్ టబు. -
రుద్రన్గా వస్తోన్న లారెన్స్..
ఒక డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకుని.. దర్శకుడిగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు రాఘవ లారెన్స్. సినిమాలతోనే కాక సమాజ సేవతో కూడా అభిమానులకు సంపాదించుకున్నారు. గురువారం లారెన్స్ పుట్టిన రోజు. సందర్భంగా రుద్రన్ అనే తన కొత్త సినిమా పోస్టర్ని విడుదల చేశారు. ఇది చూస్తుంటే ఈ సారి మరో మ్యాజిక్ ఏదో క్రియేట్ చేయబోతున్నాడని అర్ధమవుతోంది. మూనీ సీక్వెల్స్‌తో ఇన్నాళ్లు ఊహించని విధంగా బయపెట్టిస్తూనే నవ్వించిన లారెన్స్ నెక్స్ట్ మరో డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్‌తో రానున్నట్లు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. కేవలం బయపెట్టడమే కాకుండా మంచి సందేశాలను ఇచ్చేలా సినిమాలను తేరకెక్కించే లారెన్స్ ఇప్పుడు కూడా అదే తరహాలో కొత్త కథను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అంధించనున్నారు. తెలుగులోనే కాకుండా ఈ సినిమాను మిగతా భాషల్లో కూడా భారీగా రిలీజ్ చేయాలని కుదిరితే పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. (చదవండి: హాట్ టాపిక్‌గా మారిన లారెన్స్ ట్వీట్) Hi friends and fans, Here is my next film title look. Happy to release it on my birthday. I need all your blessings 🙏🏼🙏🏼 @gvprakash @5starcreationss pic.twitter.com/2EmwYmNiUO — Raghava Lawrence (@offl_Lawrence) October 29, 2020 కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా దర్శకుడిగా సక్సెస్ అవుతూనే హీరోగా కూడా కనిపించారు లారెన్స్. ఇక ఇప్పుడు హిందీలో కూడా లక్ష్మీ బాంబ్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఆ సినిమా కాంచన సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లారెన్స్ చంద్రముఖి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని కరోనా వైరస్ సహాయక చర్యల కోసం వినియోగించిన సంగతి తెలిసిందే. -
‘రాధేశ్యామ్’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా?
డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తోన్న 'బీట్ ఆఫ్ రాధేశ్యామ్'ని మోషన్ పోస్టర్ని రిలీజ్ చేశారు. విజువల్ వండర్‌గా వచ్చిన ఈ పోస్టర్ అభిమానులను ఎంతో అలరిస్తుంది. 1.16 నిమిషాల నిడివి ఉన్న ఈ పోస్టర్లో ముందుగా అర చేయి కనిపిస్తుంది. దాంట్లో అడవి.. అందులో రైలు. ఒపెన్ చేస్తే ఫస్ట్ రోమియో-జులియేట్, తర్వాత సలీం-అనార్కలీ, తర్వాత దేవదాసు-పార్వతీల బొమ్మలు కనిపిస్తాయి. ఆ తర్వాత పూజా హెగ్డే రైలు బోగి డోర్ వద్ద నిల్చుని బయటకు చూస్తుంది. తర్వాత డార్లింగ్ ఆమెను చూస్తూ నిల్చుంటాడు. ఇదంతా చూస్తుంటే ఓ ట్రైన్లో వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ కథగా రాధేశ్యామ్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. అలానే ముందు వచ్చిన అమర ప్రేమికుల బొమ్మలను చూస్తే.. ఈ చిత్రం కూడా గొప్ప అమర ప్రేమ కావ్యంగా ఉంటుందా లేక ఆ కథల్లనే రాధేశ్యామ్ కూడా విషాదంగా ముగుస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ ఈ మోషన్ పోస్టర్ మాత్రం సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. (చదవండి: ‘రాధేశ్యామ్’ సర్ప్రైజ్.. ప్రభాస్ లుక్ అదుర్స్) ఇక ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనుండగా.. పూజా ప్రేరణగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న రాధే శ్యామ్‌ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. -
ప్రేమ కోసం షారుఖ్ ఎన్ని కష్టాలు పడ్డాడో!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ గురువారం తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. గౌరీ, షారుఖ్లది ప్రేమ వివాహం అని అందరికి తెలుసు. చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్న వీరు వారి ప్రేమను దక్కించుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. సినిమా హీరో అయిన షారుఖ్ కూడా నిజ జీవితంలో చాలానే కష్టాలు పడ్డారు. అయితే వారి ప్రేమ కథ ఏమిటో గౌరీ పుట్టిన రోజు సందర్భంగా ఒకసారి తెలుసుకుందాం. జర్నలిస్ట్ అనుపమ చోప్రా రాసిన కింగ్ ఆఫ్ బాలీవుడ్: షారుఖ్ ఖాన్ అండ్ సెడక్టివ్ వరల్డ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే పుస్తకంలో వీరి ప్రేమ పెండ్లి పీటలు ఎక్కడానికి పడిన కష్టాలను వివరించారు. గౌరీని పెళ్లి చేసుకునే సమయానికే కింగ్ ఖాన్ టీవీ సీరియల్లో నటిస్తూ ఉన్నాడు. అయితే ఆయనను గౌరీ వాళ్ల ఇంట్లో ఎవరు అంగీకరించలేదు. గౌరీ తండ్రి, రమేష్ చిబ్బా, తన మతం కంటే షారుఖ్ నటనా వృత్తి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్, భారత మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ వద్ద పనిచేస్తున్నప్పుడు సినీ తారల జీవితాలను దగ్గరుండి చూడటంతో ఆయన ఆ వృత్తిని ద్వేషించారు. ఇక గౌరీ తల్లి సవితా, షారుఖ్‌ను తెరపై చూడటానికి ఇష్టపడిన గౌరీ తల్లి అల్లుడిగా మాత్రం అంగీకరించలేదు. ఇక గౌరీ వాళ్ల సోదరుడికి రౌడీ అన్న పేరు కూడా ఉండేది. అతను ఏకంగా షారుఖ్ తలపై గన్‌పెట్టి మరీ బెదిరించాడు. అయినా షారుఖ్ బయటపడకుండా తన ప్రేమను దక్కించుకున్నాడు. షారుఖ్, గౌరీ అక్టోబర్ 25, 1991 న వివాహం చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వారి బంధం బలంగా కొనసాగుతుంది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారి పేర్లు ఆర్యన్, సుహానా, అబ్రామ్. చదవండి: 'కెప్టెన్‌గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు' -
చిరంజీవిగారి నుంచి అవార్డు అందుకోవాలి
‘‘చిరంజీవిగారంటే చిన్నప్పటి నుంచి భక్తి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలోకి వచ్చా. ఇంజనీరింగ్ తర్వాత కొన్ని రోజులు ఉద్యోగం చేశా. ఆ తర్వాత నాన్నగారికి తెలియకుండానే సత్యానంద్‌గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆడిష¯Œ ్సలో ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చిత్రంలో హీరోగా ఎంపికయ్యా’’ అని హాస్యటుడు గౌతంరాజు కుమారుడు, హీరో కృష్ణంరాజు అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘తొలి ప్రయత్నం ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. నాకు మాస్ అంటే చాలా ఇష్టం. చిరంజీవిగారి నుంచి ఎక్కువగా స్ఫూర్తి పొందేది ఫైట్స్, డ్యా¯Œ ్స. నా తొలి సినిమా ఇంకా ఆయన వద్దకి చేరలేదని బాధపడుతున్నా. ఏదో ఒక రోజు ఆయన చేతుల మీదగా ఒక చిన్న అవార్డు అయినా తీసుకోవాలన్నది నా పెద్ద కల. అందుకోసం ఎంతైనా కష్టపడతా. దర్శకుల్లో సుకుమార్‌గారు అంటే చాలా ఇష్టం. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, రాజమౌళి, హరీష్ శంకర్గార్ల కూడాæ ఇష్టం. నటుడిగా నిరూపించుకునే పాత్రలు చేయాలనుకుంటున్నాను ’’ అన్నారు. -
పెద్ద బడ్జెట్ సినిమా తీయను
‘‘జీవితంలో ఎప్పుడూ పెద్ద బడ్జెట్ సినిమా తీసే ఆలోచన లేదు. నా తుది శ్వాస వరకు చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తూనే ఉంటాను’’ అని నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అన్నారు. నేడు ఆయన 63వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘2004లో నేను మొదటి సినిమా తీశాను. ఇప్పటికి 98 సినిమాలు పూర్తి చేశాను. 99వ చిత్రం రామ్‌గోపాల్ వర్మతో ఉంటుంది. నూరవ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఒక శతాధిక దర్శకుడు మాట ఇచ్చారు. 101వ సినిమాగా ‘అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి’ అనే సినిమా స్టార్ట్ చేస్తాను. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుగారి శిష్యుడు ఉదయభాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి జేకే భారవి స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ కరోనా ప్రభావం తగ్గాక 102వ చిత్రం ఉంటుంది. దీనికి సాయి ప్రకాష్‌గారు దర్శకుడు. చిన్న సినిమాలకు ఓటీటీ/ఏటీటీలే మార్గం. పెద్ద సినిమాలు థియేటర్లో చూస్తే ఆ థ్రిల్, ఆ అనుభూతి బాగుంటుంది’’ అన్నారు. -
'వకీల్ సాబ్' మోషన్ పోస్టర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నడు(బుధవారం) 49వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి' సినిమాతో టాలీవుడ్లో హీరోగా రంగప్రవేశం చేసిన ఆయన ఎందరో అభిమానులకు దేవుడిగా మారే స్థాయికి ఎదిగిపోయారు. అయితే అనూహ్యంగా అన్న చిరంజీవి బాటలోనే ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు విరామం ఇవ్వడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత "వకీల్ సాబ్"తో తిరిగి సందడి చేయనున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా 'వకీల్ సాబ్' చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ పోస్టర్ విడుదలైంది. (ఆ రోజు పవన్ అభిమానులకు డబుల్ ధమాకా) ఇందులో మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి మహోన్నత వ్యక్తులను మొదట చూపించారు. ఆ తర్వాత పవన్ సూటు వేసుకుని లాయర్ గెటప్‌లో దర్శనమిచ్చారు. ఒక చేత క్రిమినల్ లా పుస్తకం పట్టుకుని, మరో చేత కర్ర పట్టుకుని ఏ దారిలోనైనా నేరస్థులను వదిలేదే లేదని చెప్పకనే చెప్తున్నారు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో "సత్యమేవ జయతే" అంటూ వస్తుండటం మోషన్ పోస్టర్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా శ్రీరామ్ వేను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'వకీల్ సాబ్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ క్రియేషన్స్‌పై దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. ఇది బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే (నిహారిక నిశ్చితార్థం: పవన్ అందుకే వెళ్లలేదు) -
ఎప్పటికీ ఆనందంగా...
భర్త ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా తమ కుమార్తె ఆద్యంత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు స్నేహ. 2012లో తమిళ నటుడు ప్రసన్న, హీరోయిన్ స్నేహ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో స్నేహ ఓ బాబుకి జన్మనిచ్చారు. బాబు పేరు విహాన్. ఈ ఏడాది జనవరిలో పాపకు జన్మనిచ్చారు స్నేహ. శుక్రవారం ప్రసన్న పుట్టినరోజుని పురస్కరించుకుని పాప ఆద్యంత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు స్నేహ. అలాగే ‘‘నా సోల్‌మేట్ (ప్రసన్నని ఉద్దేశించి)కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా లవర్ బాయ్, నా గార్డియన్ ఏంజిల్ తను. మేం ఆనందంగా ఉండాలని దీవిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా జీవితం ఎప్పటికీ ఇలా ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు స్నేహ. -
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
చిరు బర్త్‌డే : మోహన్‌బాబు ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు(ఆగస్ట్ 22). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్’ అని డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ట్వీట్ చేశారు. చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్. @KChiruTweets pic.twitter.com/TQ4CqAkGgc — Mohan Babu M (@themohanbabu) August 22, 2020 మన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్‌కి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పట్ల నాకు ఎల్లప్పుడూ గౌరవం, కృతజ్ఞత ఉంటాయి. ఆయనే నా నిజమైన ఆచార్యుడు' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. Many many happy returns to the biggest INSPIRATION of mine and many, @KChiruTweets garu🤗 #HBDMegastarChiranjeevi pic.twitter.com/6Ex0MzlMjS — Ravi Teja (@RaviTeja_offl) August 22, 2020 Wishing you a very Happy Birthday @KChiruTweets garu! You've been an inspiration to an entire generation and will continue to be! Great health and happiness to you always sir😊🙏 pic.twitter.com/S7XpdFRWoM — Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2020 Many many Happy returns of the day to our one & only MEGA STAR . My heart is always filled with respect , love & gratitude . My true Acharya is many ways . #HBDMegastarChiranjeevi pic.twitter.com/2TD9juEAJg — Allu Arjun (@alluarjun) August 22, 2020 తన 'ఆచార్య' చిరంజీవేనంటూ వరుణ్ తేజ్ కూడా ట్వీట్ చేశాడు. 'హ్యాపీబర్త్ డే చిరంజీవి గారు' అంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే చిరంజీవిగారు. నేటి తరానికి మీరు ఆదర్శం. మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. చిరు నా బెస్ట్ ఫ్రెండ్.. ఆయన ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటాను. హ్యాపీ బర్త్ డే చిరంజీవి' అని సీనియర్ నటి రాధిక పేర్కొన్నారు. ‘వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ సినీనటుడు సునీల్ ట్వీట్ చేశాడు. Happy birthday Megastar!🤗🤗🤗 I feel so lucky and blessed to have you by my side.. Thank you so much for inspiring me and a lot more.🙏🏽 Love you to the moon and back!❤️ My Acharya!!!🙌🏽🙌🏽🙌🏽@KChiruTweets #HBDMegastarChiranjeevi pic.twitter.com/zYcH4S2b3m — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) August 22, 2020 'మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అద్భుతమైన నటనా కౌశలంతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆశిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడానికి మీకు ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీ కెరీర్లో మరిన్ని గొప్ప మైలురాళ్లు అందుకోవాలని ఆశిస్తున్నాను' అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. బాబాయ్... @KChiruTweets... పుట్టిన రోజు శుభాకాంక్షలు... ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ‘చిరంజీవి’ లా ప్రకాశించాలని, ఆ శ్రీవారి ఆశీస్సులతో ఇంకెన్నో శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. #HBDMegastarChiranjeevi pic.twitter.com/l4V8sDvZjE — Raghavendra Rao K (@Ragavendraraoba) August 21, 2020 Your birthday is been celebrated like a festival and as a fan since many years this day is an event full of joy n happiness .. To our one and only mega star @KChiruTweets Happy birthday to u Cheers #HBDMegastarChiranjeevi pic.twitter.com/MgHKdPht69 — PURIJAGAN (@purijagan) August 22, 2020 -
రాక్షసుడుని హిందీలో రీమేక్ చేయబోతున్నా
‘‘గత ఏడాది నా పుట్టినరోజుకి ‘రాక్షసుడు’ సినిమా హిట్‌తో ఉన్నా.. ఈ ఏడాది ఏం లేదు. కరోనా పరిస్థితులు లేకపోయుంటే కచ్చితంగా మరో హిట్‌తో ఉండేవాణ్ణి’’ అని దర్శకుడు రమేశ్ వర్మ పెన్మెత్స అన్నారు. ‘ఒక ఊరిలో, రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయి, రాక్షసుడు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రమేశ్ వర్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు. ►ఈ లాక్డౌన్లో ఇంట్లో కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాను. అయితే పని అనేది తప్పని సరి కావడంతో 10 రోజులుగా ఆఫీసుకు వెళుతున్నా. మళ్లీ షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్లాన్ చేయాలి కదా. ‘రాక్షసుడు’ సినిమా విడుదల తర్వాత నాకు నాలుగైదు అవకాశాలు వచ్చాయి. కానీ రవితేజగారితో చేయాలనుకోవడంతో ఆగాను. నిర్మాత కోనేరు సత్యనారాయణగారు కూడా తొందరేం లేదు కంఫర్టబుల్‌గా చేద్దామన్నారు. తమిళ్లో హిట్ అయిన ఓ సినిమా రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ ఆ కథ కంటే ఇప్పుడు చేయబోయే సినిమా కథ రవితేజగారికి చాలా బాగుందని దీంతో ముందుకు వెళుతున్నాం. సెట్స్‌పైకి వెళ్లేందుకు బౌండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసిపెట్టుకున్నాం. ఇంతలో కరోనా వచ్చేసింది. ప్రస్తుతం చిన్న సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. కానీ పెద్ద చిత్రాలేవీ షూటింగ్స్ ప్రారంభించలేదు. అందరూ మొదలు పెడితే మేం కూడా సిద్ధమే. ►‘రాక్షసుడు’ హిందీ రీమేక్ హక్కులను కోనేరు సత్యనారాయణగారే తీసుకున్నారు. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహించాలన్నారాయన. రీమేక్‌లో నటించేందుకు చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు. కానీ మేం ఎవర్నీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. రవితేజగారి సినిమా పూర్తయ్యాక బాలీవుడ్లో ‘రాక్షసుడు’ రీమేక్ చేస్తా. ►నిర్మాతగా ‘7’ నా తొలి సినిమా. చిన్న చిత్రంగా తీద్దామనుకున్నాం. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరడంతో పెద్ద సినిమా అయింది.. బడ్జెట్ కూడా పెరిగింది. దీంతో నా స్నేహితులు కూడా ప్రొడక్షన్లో భాగమయ్యారు. ఈ చిత్రం వల్ల నష్టంలేదు.. సేఫ్ ప్రాజెక్ట్.. నెట్ ఫ్లిక్స్‌లో ఇప్పటికీ ఆదరణ బాగుంది. ఆ సినిమా హిందీలో చేస్తే బాగుంటుందని నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఓ ప్రతిపాదన కూడా పెట్టారు. భవిష్యత్‌లో సినిమాలు నిర్మించాలా? వద్దా అన్నది నిర్ణయించుకోలేదు.. అవకాశాల్ని బట్టి వెళతా. -
మంచి రోజులు ముందున్నాయి
స్టార్ హీరోల పుట్టినరోజంటే హంగామా, సందడి అంతా వేరు. సామాజిక సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ వేడుకలు సర్వసాధారణం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సామూహికంగా పాల్గొనే కార్యక్రమాలు నిర్వహించడం కరెక్ట్ కాదని వాయిదా వేస్తున్నారు. అయితే అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా చూపిస్తున్నారు. సంబరాలన్నీ ఇంటర్నెట్ సాక్షిగా జరుపుకుంటున్నారు. ఓ స్టార్ హీరో బర్త్‌డే అంటే ప్రత్యేకంగా డిజైన్ చేసిన సీడీపీ (కామన్ డిస్ప్లే పిక్చర్), మరియు హ్యాష్‌ట్యాగ్ విడుదల చేసి, ఆ సీడీపీనే తమ అకౌంట్స్ పిక్చర్స్‌గా మార్చుకుని ఆ ట్యాగ్‌ను ఉపయోగించి తమ ప్రేమను సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తుంటారు. ఈ ఏడాది చిరంజీవి బర్త్‌డే కామన్ డీపీను సుమారు వందమంది సెలబ్రీటీలతో విడుదల చేయిస్తున్నారు. వంద మందికి పైగా సెలబ్రీటీలు కామన్ డీపీను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ సీడీపీ విడుదల చేసే వారిలో చిరుతో నటించినవారి దగ్గర నుంచి యంగ్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. ఇది తాత్కాలిక కష్టమే ‘‘సినిమా షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు.. ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. పని లేక, చేతిలో డబ్బు లేక సినీ కార్మికుల పరిస్థితి కష్టంగా ఉంది. అందుకే ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సీసీసీ) తరపున మూడోసారి కూడా కార్మికులకు నిత్యావసర వస్తువులు ఇవ్వాలని నిర్ణయించుకుని, ఇప్పటికే పంపిణీ మొదలుపెట్టాం’’ అని హీరో చిరంజీవి అన్నారు. సీసీసీ మూడో విడత నిత్యావసర సరుకుల పంపిణీ సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి చిరంజీవి ఓ వీడియో షేర్ చేశారు. ‘‘హైదరాబాద్‌లోని అన్ని అసోసియేషన్లు , యూనియన్లు, సినీ జర్నలిస్టులతో పాటు ఆంధ్రాలో ఉన్న సినీ వర్కర్స్‌కి ఎప్పటిలాగా ఇస్తాం. అలాగే రెండు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లోని రెప్రజంటేటివ్లకు, పోస్టర్ అతికించే కార్మికులకు కూడా అందివ్వాలని నిర్ణయించాం. ఇప్పుడున్న ఈ పరిస్థితి శాశ్వతం కాదు.. తాత్కాలిక కష్టమే. మంచి రోజులు ముందున్నాయి. పని చేసుకొంటూ సంతోషంగా గడిపే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కి, మామూలు పరిస్థితులు నెలకొనాలని ఆ వినాయకుడికి మొక్కుదాం’’ అన్నారు. ఈ సమావేశంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, దర్శకుడు మెహర్ రమేశ్, నటుడు బెనర్జీ తదితరులు మాట్లాడారు. -
బర్త్‌డే లుక్
నటుడు కృష్ణ మనవడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా సోమవారం నిధీ అగర్వాల్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ఈ సినిమా కోసం చేసిన కృష్ణగారి ‘యమలీల’ చిత్రంలోని ‘జుంబారే..’ సాంగ్ రీమిక్స్ వీడియోకు మంచి స్పందన వచ్చింది.. ఇప్పటి వరకూ 60 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపూటి. -
నా విజయం వాయిదా పడిందనుకున్నా!
‘‘నా చిన్నప్పుడు దూరదర్శన్ రోజుల్లో మా ఊర్లో మాకు టీవీ ఉండేది. ఆ టీవీ ముందు మా ఊరు మొత్తం ఉండేది. వీసీఆర్లో సినిమాలు వేసుకొని చూసే వాళ్లం. వీసీఆర్‌ని నేనే ఆపరేట్ చేసేవాడ్ని. దాంతో అక్కడ నన్ను అందరూ స్పెషల్‌గా చూసేవారు. అలా సినిమా మీద ఆసక్తి, ఇష్టం, పిచ్చి మొదలైంది’’ అన్నారు దర్శకుడు సుబ్బు. సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నేడు సుబ్బు పుట్టినరోజు. ఈ సందర్భంగా సుబ్బు చెప్పిన విశేషాలు.. ► ‘‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఫిలాసఫీని నమ్మే ఓ కుర్రాడి కథే ఈ సినిమా. దానివల్ల అతను ఎదుర్కొన్న సంఘటనలు, సమస్యలు ఈ సినిమాలో ఉంటాయి. సాయి ధరమ్ తేజ్ పాత్ర, స్టోరీ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. స్నేహితులకు, తెలిసినవాళ్లకు ఇలాంటి సందర్భం ఎదురయినట్టు ఉండే సీన్స్ చాలా ఉంటాయి. పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యాము. ఈలోగా లాక్ డౌన్ వచ్చింది. దాంతో మా సినిమా విడుదల వాయిదా పడింది. నా సక్సెస్ కాస్త పోస్ట్ పోన్ అయిందనుకున్నాను. ఈ సినిమాను మరింత మెరుగుపరచుకునే అవకాశం వచ్చిందని భావించి సినిమా మీద ఇంకా వర్క్ చేశా. ► ఈ లాక్డౌన్లో కథలు వర్కవుట్ చేశాను. ఆల్రెడీ 3 కథలకు ఆలోచనలు ఉన్నాయి. ఒకదాన్ని పూర్తి చేశా. ‘బొమ్మరిల్లు’ భాస్కర్, విరించి వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాను. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ‘ఊసరవెల్లి, ఒంగోలు గిత్త’ సినిమాలు చేశాను. ఇదే బ్యానర్ లో దర్శకుడిగా నా మొదటి సినిమా చేయడం సంతోషంగా ఉంది. నా రెండో సినిమా ఈ బ్యానర్ లోనే ఉంటుంది. మొదటి సినిమా పట్టాలెక్కాలంటే చాలా కష్టం అంటారు. కానీ అదష్టవశాత్తు నా ప్రయాణం చాలా సాఫీగా జరిగినట్లే. మంచి నిర్మాత, అర్థం చేసుకునే హీరో దొరికారు. ► మాది తుని. పూరి జగన్నాథ్ గారు, గుణశేఖర్ గారు మా పక్కన ఊరే. వాళ్లు సినిమాల్లో సక్సెస్ అయ్యారు మనం కూడా అవొచ్చనే బూస్ట్ వచ్చింది. మనం చెప్పే కథలతో కేవలం వినోదం పంచాం అన్నట్టు కాకుండా మన కథలకు కనెక్ట్ అయి ప్రేక్షకులు ఆలోచించేలా, వాళ్లకు ఓ నమ్మకం కలిగించేలా నా సినిమాలు ఉండాలనుకుంటాను. చిరంజీవిగారితో ఓ సినిమా చేయాలని నా డ్రీమ్. -
ఆ మాట ఆస్కార్‌తో సమానం
‘‘ప్రతి రచయితకూ ఓ విజన్ ఉంటుంది. ఆ విజన్‌ని తెరపైకి ఎక్కించడంలో ఓ కిక్ ఉంటుంది. రచయితలు రాసిన కొన్ని కథలు ఒక్కోసారి దర్శకులకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు నిర్మాతలను ఒప్పించి మేమే దర్శకత్వం చేయాలి. మా విజన్‌ని అప్పుడే తెరపై చూపించగలం.. అందుకే నేను రచయిత నుంచి డైరెక్టర్‌గా మారాను’’ అన్నారు శ్రీధర్ సీపాన. ‘నమో వెంకటేశ, అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం, డిక్టేటర్’ వంటి పలు చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీధర్ సీపాన ‘బృందావనమది అందరిది’ చిత్రంతో దర్శకునిగా మారారు. బుధవారం ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ‘బృందావనమది అందరిది’ నా తొలి సినిమా. ఆ చిత్రానికి నా స్నేహితులు శ్రీనివాస్ వంగాల, ప్రభాకర్ నిర్మాతలు. వారికి ఇండస్ట్రీ కొత్త కావడంతో ప్రొడక్షన్ పనులూ నేనే చూసుకున్నాను. దర్శకుడిగా నా రెండో సినిమా చిరంజీవిగారి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఉంటుంది. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుంది. జీఏ 2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మిస్తారు. కల్యాణ్ దేవ్ సినిమా విడుదల తర్వాతే ‘బృందావనమది అందరిది’ చిత్రం విడుదలవుతుంది. కరోనాకి ముందు ‘ఆచార్య’ కోసం కొరటాల శివగారితో కలిసి చిరంజీవిగారితో స్క్రిప్ట్ వర్క్‌లో పాల్గొన్నాను. అప్పుడు కల్యాణ్ దేవ్‌తో తీసే కథని చిరంజీవిగారు, కొరటాలగారు విని బాగా ఎంజాయ్ చేశారు. ‘కథ విన్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను’ అని చిరంజీవిగారు చెప్పారు. ఆ మాటతో ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందం దక్కింది. డైరెక్టర్‌గానే కాదు.. రచయితగానూ కొనసాగుతాను. ప్రస్తుతం డైరెక్టర్ కె.రాఘవేంద్రరావుగారి సినిమాకి, అనిల్ సుంకరగారి ప్రొడక్షన్లో ఓ సినిమాకి డైలాగులు రాస్తున్నాను. మరో రెండు మూడు సినిమాలకు చర్చలు జరిగాయి. ఓ వెబ్ సిరీస్ రెండు మూడు రోజుల్లో ఫైనల్ అవుతుంది’’ అన్నారు. -
బిచ్చగాడు 2
‘బిచ్చగాడు’ సినిమాతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. జాతీయ అవార్డుగ్రహీత ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా, మరోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్ ఆంటోని పుట్టినరోజు జూలై 24 (శుక్రవారం). ఈ సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ‘బిచ్చగాడు 2’ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను విడుదల చే శారు. -
హ్యాపీ బర్త్‌డే డియర్ తారక్ : చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యడు జోగినపల్లి సంతోష్ ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే అన్నయ్య. మరెన్నో ఏండ్లు ప్రజాసేవలో కొనసాగాలి. మరిన్ని పెద్ద పదవులను చేపట్టాలి. మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉండాలి. మీరొక ఐకాన్. సమకాలీన రాజకీయాల్లో రెండో స్థానానికి నా సోదరుడు తప్ప మరెవరూ సాటిరారని చెప్పడానికి గర్వంగా ఉంది. చిన్నప్పుడు నీతో గడిపిన రోజులు మధురమైన జ్ఞాపకాలు’ అని సంతోష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో దిగిన చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాతో పంచుకున్నారు. అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం ‘జన్మదిన శుభాకాంక్షలు డియర్ తారక్. ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తితో ముందుకు సాగాలి’ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా కేటీఆర్ ఈరోజుతో 44వ ఏట అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అభిమానుల ట్వీట్లతో సామాజిక మాధ్యమాలు మారుమోగుతున్నాయి. -
మంచి సంగీతం ఇవ్వడమే నా లక్ష్యం
‘‘ఆర్ఎక్స్ 100’ సినిమా పాటలు విన్న నాగార్జునగారు ఫోన్ చేసి నన్ను మెచ్చుకోవడమే కాదు, ఏకంగా తాను నటిస్తున్న ఓ సినిమాకు నన్ను సంగీత దర్శకునిగా తీసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయంలో ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను’’ అని సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అన్నారు. తక్కువ కాలంలోనే పలు హిట్ సినిమాలకి, స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందించే స్థాయికి చేరుకున్న చైతన్య పుట్టినరోజు బుధవారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సంగీతంపై ఇష్టంతో సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. శ్రేయాస్ మీడియా వారు తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా నా మ్యూజికల్ టాలెంట్ ఇండస్ట్రీకి తెలిసింది. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన డైరెక్టర్ రమేశ్ వర్మ ‘7’ అనే సినిమాకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా వర్క్స్‌లో ఉండగానే ‘ఆర్ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి నుంచి పిలుపు వచ్చింది. అయితే ‘7’ సినిమా కంటే ‘ఆర్ఎక్స్ 100’ చిత్రమే ముందుగా విడుదలయింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నాకు అవకాశాలు ఇచ్చిన దర్శకులు అందరూ ఛాలెజింగ్ వర్క్స్ ఇచ్చారు. ఎవ్వరూ కూడా ఆ సినిమాలాంటి పాటలు కావాలని అడగలేదు.. దీంతో కొత్త ట్యూ¯Œ ్స చేసే వీలు కుదిరింది. నాకు అవకాశాలు ఇస్తున్న దర్శకులు, నిర్మాతలకు, నా పాటల్ని ఆదిరిస్తున్న శ్రోతలకి ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ శ్రోతలకి మంచి సంగీతం ఇవ్వడమే నా లక్ష్యం’’ అన్నారు. -
బ్యూటీ బ్యాటర్‌కు బర్త్‌డే విషెస్
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధనా జన్మదినం (శనివారం) సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. తన అందమైన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న మంధాన నేడు 24వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్ పలువురు క్రికెటర్లు ఆమెకు ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మంధనా స్మృతి. ఆటలో ఇలాగే రాణించడం కొనసాగించాలి. భారత జట్టులో ఎడమచేతి వాటం గల బ్యాట్స్‌మెన్ చాలా ఖ్యాతిని కలిగి ఉంది. ఇదే స్ఫూర్తిని కొనసాగించండి’ అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. ‘ఎంతో ప్రతిభావంతులైన మంధనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఎక్కువ పరుగులు, ఎక్కువ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా. మీకు ఈ ఏడాది చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేసర్ భువనేశ్వర్ కుమార్ ట్విటర్ ద్వారా విషెస్ తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా బ్యాట్ వింత్ టాలెంట్ ప్లేయర్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా ఇప్పటివరకు 51 వన్డే మ్యాచ్‌లు ఆడిన మంధాన 43.1 సగటుతో 4 సెంచరీలు చేసి 2025 పరుగులు సాధించారు. వన్డేల్లో వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పారు. 75 టీ20 మ్యాచ్‌లు ఆడి 25.2 సగటుతో 1716 పరుగులు రాబట్టారు. అంతేకాకుండా 2018లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రధానం చేసింది. ఇదే సమయంలో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికయ్యారు. -
ముఖ్యమంత్రి పాత్రలో...
ప్రముఖ క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు జూలై 10న. ఆయన నటిస్తోన్న నూతన చిత్రం ‘రొరి’లోని లుక్‌ను ఈ సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. సీటీఎస్ స్టూడియోస్, ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా చరణ్ రొరి నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో కోట అనేకసార్లు ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్ పాత్రల్లో నటించారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన నటించలేదు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్. రామన్నచౌదరి పాత్ర చేస్తున్నారు. -
ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవద్దు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ అభిమానులకు ఆనందాన్నిచ్చే వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడమే తనకు మొట్టమొదటి ప్రాధాన్యతాంశమని అన్నాడు. ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవడం ఏమాత్రం ఇష్టం లేదన్న ‘దాదా’... ఏమాత్రం అవకాశం దొరికినా సరైన భద్రతా చర్యలు తీసుకుంటూ లీగ్‌ను నిర్వహిస్తామని హామీ ఇచ్చాడు. ఐపీఎల్‌కు సంబంధించి తాము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు ఐసీసీ టి20 వరల్డ్‌కప్ భవితవ్యంపై ప్రకటన చేయాల్సి ఉంటుందని అన్నాడు. బుధవారం తన 48వ పుట్టినరోజు జరుపుకున్న ‘దాదా’ ఇంకా ఏమన్నాడంటే... ► మా తొలి ప్రాధాన్యత భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడమే. 35–40 రోజులు దొరికినా చాలు టోర్నీ జరుపుతాం. కానీ వేదిక గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. ► మొదట ఐపీఎల్ విండో దొరుకుతుందో లేదో చూడాలి. ఆ తర్వాత భారత్‌లో పరిస్థితులు అనకూలించకపోతే ఏ దేశానికి లీగ్‌ను తరలించాలో ఆలోచించాలి. విదేశాల్లో అయితే ఫ్రాంచైజీలకు, బోర్డులకు వ్యయభారం ఎక్కువవుతుంది. ► పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో తటస్థ వేదిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్ రద్దయింది. ► టి20 ప్రపంచకప్‌పై మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. కానీ ఐసీసీ అధికారికంగా చెప్పేవరకు అసలేం జరుగనుందనే దానిపై ఒక నిర్ణయానికి రాలేం. నా వ్యక్తిగత అంచనా ప్రకారమైతే ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరిగేది అనుమానమే. ► ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలలో కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో అక్కడ లీగ్ జరుగుతుందని చెప్పలేను. అహ్మదాబాద్‌పై ప్రస్తుతం మా దృష్టి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడే నిర్వహిస్తామని కచ్చితంగా అయితే చెప్పలేను. ► కరోనా విరామం తర్వాత భారత్ ఆడబోయే తొలి అంతర్జాతీయ సిరీస్ ఏదో చెప్పలేను. భారత క్రికెటర్ల ఆరోగ్యమే మా తొలి ప్రాధాన్యత. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది లేదు. -
ప్యాన్ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నా
‘‘గతంలోలా సినిమాలను నిర్మిస్తే ప్రేక్షకులు వాటిని ఆదరించే పరిస్థితిలో లేరు. కథ కొత్తగా ఉంటేనే ఆదరిస్తారు. అందుకే నేను ఇక నుంచి తీసే సినిమాల కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించాలనుకుంటున్నాను’’ అని నిర్మాత అడ్డాల చంటి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని విలేకరులతో మాట్లాడుతూ– ‘‘1982లో ప్రముఖ కళా దర్శకుడు భాస్కరరాజుగారి దగ్గర, ఆయన కుమారుడు ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజుగారి దగ్గర అసిస్టెంట్‌గా జీవితాన్ని ప్రారంభించాను. తక్కువ కాలంలోనే ఆర్ట్ అసిస్టెంట్ నుండి ఆర్ట్ డైరెక్టర్‌గా మారాను. కళా దర్శకునిగా నాకు జీవితం ఇచ్చింది నిర్మాత రామానాయుడుగారు. ఆర్ట్ డైరెక్టర్‌గా నా మొదటి చిత్రం ‘ప్రేమ’. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున.. ఇలా దాదాపు అందరి హీరోల సినిమాలకు పనిచేసి, ‘చంటి మనవాడే’ అనే పేరు త్వరగా తెచ్చుకున్నాను. కెమెరామేన్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఫ్రెండ్లీ మూవీస్ అనే సంస్థను ప్రారంభించి బాలకృష్ణతో ‘పవిత్ర ప్రేమ’, ‘కృష్ణబాబు’ నిర్మించాము. ఆ తర్వాత నేను సోలో నిర్మాతగా మారి ఎన్టీఆర్‌తో ‘అల్లరి రాముడు’’, ప్రభాస్‌తో ‘అడవి రాముడు’ తరుణ్‌తో ‘ఒక ఊరిలో’ చిత్రాలను నిర్మించాను. ఈ ఏడాది ప్యాన్ ఇండియా ఫిల్మ్ నిర్మించబోతున్నాను. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అనే ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఓటీటీలో చిన్న బడ్జెట్ సినిమాలను, వెబ్‌సిరీస్‌లను నిర్మించేందుకు కథలు సిద్ధం చేస్తున్నాను’’ అన్నారు. -
బర్త్‌డే లుక్
‘ఈ మాయ పేరేమిటో’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో హీరోగా నటించిన రాహుల్ విజయ్ తాజాగా మరో సినిమా అంగీకరించారు. ఎస్కెఎల్ఎస్ గేలాక్సీ మాల్ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై బృందా రవీందర్ దర్శకత్వంలో ఇ.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం (జూన్ 7) రాహుల్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని అతని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, పాటలు: అనంత్ శ్రీరామ్, కెమెరా: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, స్టంట్స్: విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుడిమిట్ల శివ ప్రసాద్. -
సుందరమ్మ.. కామ్రేడ్ భారతక్క
ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు కమిట్ కాని ప్రియమణి ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు ఒప్పుకున్నారు. ఒకటి ‘నారప్ప’, మరోటి ‘విరాట పర్వం’. గురువారం ఈ బ్యూటీ బర్త్‌డే సందర్భంగా రెండు చిత్రాల్లోని ప్రియమణి ఫస్ట్ లుక్స్‌ను విడుదల చేశారు. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నారప్ప’. తమిళ హిట్ ‘అసురన్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇందులో హీరోయిన్గా సుందరమ్మ అనే పాత్రలో నటిస్తున్నారు ప్రియమణి. డి. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీదేవి సతీష్ ఈ చిత్రానికి సహ–నిర్మాత. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘విరాటపర్వం’ విషయానికి వస్తే...రానా, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ ప్రధాన తారాగణంగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కామ్రేడ్ భారతక్క పాత్రలో నటిస్తున్నారు ప్రియమణి. ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ చాగంటి. -
సినిమాకి సినిమా కష్టాలు వచ్చాయి
‘‘సాధారణంగా ఎవరికైనా ఊహించని కష్టమొస్తే ‘సినిమా కష్టాలొచ్చాయి’ అంటారు. ప్రసుత్తం కరోనా వల్ల సినిమాకి, సినిమావాళ్లకి నిజంగానే సినిమా కష్టాలు వచ్చాయి’’ అన్నారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. ‘సీతయ్య, దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వైవీఎస్ మాట్లాడుతూ– ‘‘సినిమాకు కష్టాలు రావడం కొత్తేం కాదు. కేబుల్ టీవీ, సీడీ, డీవీడీ ప్లేయర్స్, సీరియల్స్, గేమ్ షోస్, క్రికెట్, ఐపీఎల్, యూట్యూబ్, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్. వీటన్నింటినీ తట్టుకొని సినిమా థియేటర్లో నిలబడుతూనే ఉంది. నిశ్చింతగా, నిశ్చలంగా ఉండటం సినిమాకి చేతకాదు. సముద్రపు అలలాగా పడినా పైకి లేవడం సినిమాకి తెలుసు. కోవిడ్ కాదు దానికంటే ప్రమాదకరమైనది వచ్చినా థియేటర్లో సినిమా చూడాలనే ప్రేక్షకుడి కాంక్షను ఆపలేదు. థియేటర్లో సినిమా చూసే అనుభూతికి మరేదీ సాటిరాదు. కోవిడ్ వల్ల ఒంటరితనాన్ని అనుభవిస్తున్న థియేటర్లు త్వరలోనే జన సమూహాలతో ప్రకాశవంతం చెందాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
నాలుగు పాత్రల కథ
బుల్లితెర యాంకర్, ‘బిగ్ బాస్ 3’ ఫేమ్ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’. ఈ చిత్రంతో గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దితీప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎయి¯Œ ్స మోషన్ పిక్చర్స్, కాక్టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మించారు. ఆదివారం (మే 10) శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ ఇ.వి.ఎస్ మాట్లాడుతూ– ‘‘ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పాత్రలో శ్రీముఖి నటించలేదు. ఆమె అభిమానులకు, ప్రేక్షకులకు ఈ క్యారెక్టర్ సర్ప్రైజ్ ఇస్తుంది. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దిలీప్ కుమార్ ఎంఎస్, సంగీతం: శేఖర్ మోపూరి, సహ నిర్మాత: సిహెచ్ వేణు మాధవ్. -
Taapsee Pannu Birthday : తాప్సీ పన్ను బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
మూడో సినిమా
సందీప్ కిషన్ హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘బీరువా’ వంటి చిత్రాలు అందించిన నిర్మాత పి. కిరణ్ సందీప్‌తోనే మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. గురువారం సందీప్ కిషన్ పుట్టినరోజుని పురస్కరించుకుని తమ కాంబినేషన్లో రూపొందనున్న మూడో సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించనున్నారు. ఆనంది ఆర్ట్స్ క్రియేష¯Œ ్స పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 15గా రూపొందనున్న ఈ చిత్రానికి భాను బోగవరపు కథ అందిస్తున్నారు. అందమైన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సినిమా షూటింగ్ ఆరంభమవుతుంది. -
‘నీలో ఏమాత్రం మార్పు లేదు’
హీరోయిన్ త్రిష తనదైన నటనతో దక్షిణాదిలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశారు త్రిష. ఇక పలు అగ్రహీరోల సరసన నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటి త్రిష నేడు (మే4) 37 వసతంలోకి ఆడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ట్వీటర్ వేదికగా త్రిషకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. (టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్’ పాటకు స్టెప్పులు) ‘హ్యాపి బర్త్‌డే డియర్. ఎల్లప్పుడు నువ్వు బలంగా, సానుకూలంగా ఉండాలి’ అని సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్రిష, కీర్తి సురేష్‌లతో దిగిన ఫొటోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. మరో నటి కుష్బూ కూడా త్రిషకు.. బర్త్ డే విషెస్ చెప్పారు. ‘ఇప్పటికీ నీలో ఏ మాత్రం మార్పు లేదు. అదే సంతోషం, మంచి మనసు కలిగి ఉన్నావు. నీకు సంతోషం, ప్రేమ, ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది రజినీకాంత్ పేట చిత్రంలో కనిపించారు. అంతకు ముందు తమిళ చిత్రం ‘96’లో జానకి దేవి పాత్రలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచారు. ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. Happy birthday dear @trishtrashers be strong and positive as always . Love to you hope to catch up with you soon ❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/IAnaNwPGce — Radikaa Sarathkumar (@realradikaa) May 4, 2020 Hey Pretty woman. The best part about you is you haven’t changed a bit.. you are still the same old chirpy, happy, a beautiful soul. May you be showered with love, happiness, health n wealth in abundance.. Happy birthday dear @trishtrashers ❤️❤️❤️🎂🎂🎂🎂💖💖💖💖🤗 pic.twitter.com/RResLCP0Vt — KhushbuSundar ❤️ (@khushsundar) May 3, 2020 -
కటారి క్రాక్
‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘క్రాక్’. ఇందులో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరస్వతీ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహనిర్మాత. లాక్డౌన్ తర్వాత జరిపే చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ముగుస్తుంది. ఆదివారం (ఏప్రిల్ 26) సముద్రఖని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కటారి పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో సముద్రఖని ఓ కీలక పాత్ర చేస్తున్నారు. -
బిగ్ స్క్రీన్ అనుభూతే వేరు
‘‘ప్రస్తుతం అందరూ ఓటీటీ వేదికల్లో సినిమాలు చూస్తున్నారు. కానీ ఈ ప్రభావం థియేటర్స్ మీద ఉండదనుకుంటున్నాను. ఎందుకంటే థియేటర్‌కి ప్రత్యామ్నాయం థియేటరే. బిగ్ స్క్రీన్ అనుభూతే వేరు’’ అన్నారు నిర్మాత బెక్కం వేణు గోపాల్. ‘టాటా బిర్లా మధ్యలో లైలా, ప్రేమ ఇష్క్ కాదల్, హుషారు’ వంటి సినిమాలు నిర్మించారాయన. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోవాలని కోరుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. కరోనా ప్రభావం అన్ని ఇండస్ట్రీలపై ఉంది. దీన్ని అందరూ బాధ్యతగా భావించి పోరాడాలి. ఓటీటీ ప్రభావం థియేటర్స్ మీద ఉండదు. ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో సినిమాలకు రారు అన్నారు. కానీ అలా ఏం జరగలేదు. ప్రస్తుతం విశ్వక్ సేన్‌తో ‘పాగల్’ అనే సినిమా చేస్తున్నాను. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెడతాం. ఆ తర్వాత శ్రీ విష్ణుతో కూడా ఓ సినిమా ప్లాన్ చేశాం. ‘రోటీ– కపడా– రొమాన్స్’ అనే మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ‘దిల్’ రాజుగారితో కొన్ని సినిమాలు కలసి చేయబోతున్నాను’’ అని తెలిపారు. -
చంద్రబాబుకు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి : ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు దేవుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు నేడు 70వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. Best wishes to @ncbn garu on his birthday. May he be blessed with happiness and good health. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2020 -
డ్రైవర్ పుష్పరాజ్
పుష్పరాజ్‌గా మారిపోయారు అల్లు అర్జున్. ఎందుకంటే తన కొత్త చిత్రం కోసం. ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ముత్తం శెట్టి మీడియా సహ–నిర్మాత. బుధవారం (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘పుష్ప’ టైటిల్‌ను, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పూర్తిగా చిత్తూరు యాస మాట్లాడే పుష్పరాజ్ పాత్రలో కనిపిస్తారు అల్లు అర్జున్. పుష్పరాజ్ లారీ డ్రైవర్ అట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కేవీవీ, సీఈఓ: చెర్రీ. -
కేజ్రీవాల్‌కు డబుల్ ధమాకా
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు డబుల్ ధమాకాలా ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ పుట్టినరోజు కూడా మంగళవారం రావడం కలిసివచ్చింది. భార్య బర్త్‌డే వేడుకలతో పాటు ఢిల్లీ ప్రజలు తన సర్కార్‌కు మరోసారి పట్టం కట్టడంతో కేజ్రీ ఉత్సాహం రెట్టింపైంది. తన భర్త కోసం విస్తృతంగా ప్రచారం చేసిన సునీతా కేజ్రీవాల్ (54)కు ట్విటర్లో నెటిజన్ల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కేజ్రీవాల్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వకముందు ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేసిన విషయం తెలిసిందే. హ్యాపీబర్త్‌డే సునీతా మేడమ్..మా హీరోకు మీరే బలం..మిమ్మల్ని చూసి గర్విస్తున్నామని ఓ ట్విటర్ యూజర్ పేర్కొనగా, ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వచ్చిన రోజే పుట్టినరోజు జరుపుకోవడం సంతోషకరమని, కేజ్రీవాల్ వెనుకున్న శక్తి మీరేనంటూ మరో ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఓటింగ్ రోజున పోలింగ్ బూత్ వెలుపల కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన సునీత తమ కుమారుడు తొలిసారిగా ఎన్నికల్లో ఓటు వేస్తున్నాడని పేర్కొన్నారు. తన భర్త కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలను దీటుగా తిప్పికొడుతూ ఆప్ శ్రేణులతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. చదవండి : ఆప్ సంబరాలు.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం -
అమాయకత్వం ఏమాత్రం తగ్గలేదు: బిగ్‌బీ
బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ నేడు 44వ వడిలోకి అడుగుపెట్టాడు. తల్లిదండ్రులు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, భార్య ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్యల సమక్షంలో అభిషేక్ తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. ఇక అభిషేక్‌కు ఇష్టమైన వాటి నమూనాతో ప్రత్యేక కేక్‌ను తయారు చేయించింది అందాల సుందరి ఐశ్వర్య. ‘హ్యాపీ బర్త్‌డే బేబీ.. ప్రేమతో’ అంటూ నవ్వులు చిందిస్తున్న ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. అతని సోదరి శ్వేతా బచ్చన్ గత స్మృతులను గుర్తు చేసుకుంటూ వాళ్లిద్దరూ కలిసి చిన్నప్పుడు సైకిల్‌తో ఆడుకున్న ఫొటోలను పంచుకుంటూ బర్త్‌డే గ్రీటింగ్స్ తెలిపింది. ఇది అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. (అమితాబ్‌కు బిగ్ ఫ్యాన్‌ని) ఇక అమితాబ్ బచ్చన్ పుట్టినరోజును పురస్కరించుకుని భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ‘ఆరోజు ఫిబ్రవరి 5. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆ రోజంతా వాడి రాకకోసం ఎంతో ఆదుర్దాగా ఎదురు చూశాను. ఎట్టకేలకు వాడు జన్మించాడు. అభిషేక్ ఈ లోకంలోకి అడుగుపెట్టడంతో అందరం ఆనందంలో తేలియాడుతూ సంబరాలు జరుపుకున్నాం’ అని ఎమోషనల్ అయ్యాడు. పిల్లలు ఎంత ఎదిగినా కన్నవాళ్ల కంటికి ఇంకా చిన్నపిల్లల్లాగే కనబడుతారనేది అమితాబ్ విషయంలో మరోసారి నిరూపితమైంది. ‘నేటితో అతనికి 44 సంవత్సరాలు. కానీ నా కంటికి ఇంకా చిన్నపిల్లోడే. చిన్ననాటి అమాయకత్వం అభిషేక్‌కు ఇప్పటికీ పోలేదు. బహుశా పోదేమో కూడా’ అని రాసుకొచ్చాడు. చదవండి: ముద్దు మురిపాలు -
కత్తుల్ని దించే చూపులతో బెల్లంకొండ లుక్
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడూ వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటాడు. తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ‘అల్లుడు శ్రీను’తో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు చేసింది ఏడు సినిమాలే అయినా కావాల్సినంత గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ అతన్ని ఎక్కువగా పరాజయాలే పలకరించినా మొక్కవోని దీక్షతో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆయన నటించిన ‘రాక్షసుడు’ సూపర్ హిట్‌ను అందుకుంది. విమర్శకులు సైతం ఈ చిత్రానికి ప్రశంసలు కురిపించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నేడు బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం బెల్లంకొండ శ్రీనివాస్ లుక్‌ను విడుదల చేసింది. ఇందులో బెల్లంకొండ కత్తుల్ని దించుతున్న చూపులతో వేడి పుట్టిస్తున్నాడు. ‘కందిరీగ’, ‘హైపర్’ వంటి హిట్ సినిమాలు అందించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్‌పై జి. సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీప్రసాద్. చదవండి: సవాళ్లంటే ఇష్టం -
స్పెషల్ బర్త్‌డేను షేర్ చేసుకోనున్న సల్మాన్!
ముంబై: బాలీవుడ్ దబాంగ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ 54వ పుట్టినరోజు వేడుకలు జోరందుకున్నాయి. తన చెల్లెలు అర్పిత, తన భర్త ఆయుష్ శర్మలు సల్మాన్ పుట్టినరోజుకు ఇవ్వబోయే బెస్ట్ గిఫ్ట్ (అపూరుపమైన బహుమతి) కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే.. ఇప్పటికే నిండు గర్భవతైన అర్పితా, సల్మాన్ బర్త్‌డే రోజునే రెండో పిల్లాడికి జన్మనివ్వనుంది. దీంతో సల్మాన్ ఖాన్ ఖాందన్లో ఇప్పటికే డబుల్ సెలెబ్రెషన్స్ ప్రారంభమయ్యాయి. ఇక సల్మాన్ ఖాన్ ఇప్పటినుంచి తన పుట్టినరోజును స్పెషల్ పర్సన్‌తో షేర్ చేసుకోనున్నాడు. ప్రతి ఏడాది బర్త్‌డే పార్టీని గ్రాండ్‌గా నిర్వహించినట్లుగానే.. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. సల్మాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ ఇంట్లో పార్టీ జరుగనుండడంతో.. బాలీవుడ్ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున బర్త్‌డే వేడుకలకు హాజరుకానున్నారు. ఇక అర్పితాను డెలివరీ కోసం ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్‌కు ఈరోజు సాయంత్రం తరలించనున్నట్లు సమాచారం. చదవండి: ఎట్టకేలకు వంద కోట్లు దాటింది -
ఆర్మీ ఆఫీసర్.. మిడిల్ క్లాస్ కుర్రాడు
‘‘నా మేనల్లుడి లవ్‌స్టోరీ టైటానిక్ రేంజ్లో ఉంటుంది అనుకుంటే మన ఊర్లో పడవ రేంజ్లో కూడా లేదు కదా?’’ అని బాధపడుతున్నారు వెంకీ మామ. మరి ఆయన అల్లుడు అంతలా మామని ఎందుకు నిరుత్సాహపరిచాడో తెలియాలంటే ‘వెంకీ మామ’ సినిమా చూడాలి. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్ రవీందర్(బాబీ) తెరకెక్కించిన చిత్రం ‘వెంకీ మామ’. సురేశ్‌బాబు, వివేక్ కూచిభొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శనివారం నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆర్మీ ఆఫీసర్ శివరామకృష్ణ కార్తీక్ పాత్రలో నాగచైతన్య నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ కానుందట. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమాలో నటిస్తున్నారు. చైతన్య బర్త్‌డే స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది ఈ చిత్రబృందం. ఇందులో మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో కనిపించనున్నారు చైతన్య. ఇదిగో ఇక్కడ ఊడుస్తూ కనిపిస్తున్న ఫొటో చూశారుగా. వచ్చే ఏడాది వేసవిలో సినిమా రిలీజ్ కానుంది. -
మహేశ్‌బాబు రఫ్ ఆడేశారు
హిట్ ట్రాక్‌లో దూసుకెళుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. మంచి దూకుడు మీద ఉన్న హీరో మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు అనిల్ చేసింది నాలుగు సినిమాలే. ఐదో సినిమాకే సూపర్ స్టార్ మహేశ్ కాంబినేషన్ కుదరడం అంటే చిన్న విషయం కాదు. ‘ఇంత పెద్ద స్టార్‌ని ఎలా డీల్ చేస్తాం?’ అనే కన్ఫ్యూజన్ లేకుండా తాను నమ్మిన ఫార్ములాతో ‘సరిలేరు నీకెవ్వరు’ని తెరకెక్కిస్తున్నారు. నేడు అనిల్ రావిపూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు. ► ఐదేళ్లలో నాలుగు సక్సెస్ఫుల్ సినిమాలు (పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2) అందించారు. మీ సక్సెస్ ఫార్ములా ఏంటి? ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక సినిమా చేస్తున్నప్పుడు నా గత సినిమాలను మర్చిపోతాను. ప్రస్తుతం ఏం చేస్తున్నాం అన్నదే ముఖ్యం. గత సినిమా తాలూకు ప్రభావం ప్రస్తుత సినిమా మీద పడకూడదు. అది హిట్ అయినా ఫ్లాఫ్ అయినా.. మనం ఏం చేస్తున్నాం? అనే ఆలోచన, విశ్లేషణ ఉన్నప్పుడు మనకి మనం బోర్ కొట్టం. ఆడియన్స్‌కి కూడా బోర్ కొట్టం అని నేను నమ్ముతాను. అది నా ఫిలాసఫీ అనుకోవచ్చు.. స్ట్రాటజీ అనుకోవచ్చు. ► ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఎలా స్టార్ట్ అయింది? ఈ సినిమా ‘ఎఫ్ 2’ తర్వాత స్టార్ట్ అయిందని అందరూ అనుకుంటున్నారు. కాదు. ‘ఎఫ్ 2’ పూర్తయ్యేసరికే మహేశ్‌గారు ఈ కథను ఓకే చేశారు. ‘ఎఫ్ 2’ సమయంలో నిర్మాత అనిల్ సుంకరగారు మహేశ్‌గారికి నన్ను రిఫర్ చేశారు. నా దగ్గర ఉన్న పాయింట్‌ను 45 నిమిషాలు మహేశ్‌గారితో చెప్పాను. సినిమా ఓకే అయింది. సుకుమార్‌గారితో చేయబోయే సినిమా తర్వాత స్టార్ట్ చేయాలనుకున్నాం. అనుకోకుండా నా సినిమా ముందుకు రావడం జరిగింది. ► ఈ మధ్య మహేశ్ సినిమాలు సోషల్ మెసేజ్ చుట్టూ తిరిగాయి. మరి ఈ సినిమాలో? మహేశ్ లాంటి సూపర్ స్టార్ చేసే సినిమాలో ఎక్కడో ఒక చోట బాధ్యతాయుతమైన పాయింట్‌ను కచ్చితంగా చెప్పాలి. అలాగే ఆయన మాస్ లుక్‌లో కనబడి, పూర్తి స్థాయిలో కామెడీ చేసి చాలా రోజులైంది. ప్రేక్షకులు మహేశ్‌గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమా ఉంటుంది. మహేశ్‌బాబుగారు వెరైటీగా కనిపించబోతున్నారు, బాధ్యతాయుతంగా ఉంటారు. విపరీతంగా ఎంటర్టైన్ చేస్తారు. కథకు అవసరమైన యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మిలటరీ ఆఫీసర్ ‘అజయ్ కృష్ణ’ పాత్రలో మహేశ్‌గారు కనిపిస్తారు. ఆయన పాత్ర గురించి కచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు. ఇది కచ్చితంగా స్పెషల్ సినిమా అవుతుంది. ► కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ కాన్ఫిడెన్స్ అంచనాలను మరింత పెంచుతుంది కదా? పూర్తయినంతవరకు సినిమా చూశాం. ఈ సినిమా చూసిన ఏ ఒక్కరూ నిరుత్సాహపడరు అని చెప్పగలను. మహేశ్‌బాబుగారు ఉన్నారు కదా అని ఆడుతూపాడుతూ సినిమా చేసేయలేదు. ఇప్పటివరకూ ఏ సినిమాకీ నేనలా చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్‌బాబుగారు రఫ్ ఆడేశారు. కేవలం ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడటం లేదు. ఫ్యాన్స్‌కి కావాల్సినవన్నీ ఉన్నాయి. అది వాళ్లకు కిక్ ఇస్తుంది. అలాగే పండక్కి ఫ్యామిలీతో కలసి సినిమా చూడాలనుకునేవాళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు. ► విజయశాంతిగారిని మళ్లీ స్క్రీన్ మీదకు తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు? నా చిన్నప్పుడు చూసిన ‘కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ’ లాంటి సినిమాల్లో విజయశాంతిగారి డైనమిజమ్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాంటి యాక్టర్‌తో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. కమ్‌బ్యాక్‌కి తగ్గ పాత్ర కూడా ఉండాలి. అలాంటి పాత్ర ఉంటే కచ్చితంగా చేస్తాను అని ఆవిడ అన్నారు. ‘రాజా ది గ్రేట్’ సినిమాను మొదట రామ్‌తో అనుకున్నప్పుడు రామ్ తల్లి పాత్రలో విజయశాంతిగారిని తీసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత అది రవితేజగారితో చేశాను. ఆమెని అడగలేదు. ఈ సినిమాలో ప్రొఫెసర్ భారతి పాత్ర రాసుకున్నాక ఆమెని తప్ప మరెవ్వరినీ ఊహించలేదు. కథ విని, పాత్రతో పాటు కథ కూడా నచ్చి ఆమె ఒప్పుకున్నారు. ► దర్శకుడిగా మీ ప్లస్ పాయింట్ కామెడీ. దాన్ని ఈ సినిమాలో ఎంతవర కూ ఉపయోగించారు? నా సినిమాలో ఏం ఉంటాయో అవి కోరుకొని ఆడియన్స్ థియేటర్‌కి వస్తారు. అవి కచ్చితంగా అందించాలి. ప్రస్తుతం కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ సినిమాలు చేస్తున్న దర్శకులం కొందరే ఉన్నాం. నేను శేఖర్ కమ్ముల స్టయిల్లో సినిమా చేయలేను. నేను నమ్ముకున్నదాన్ని ఎంత కొత్తగా చేస్తాను అన్నది ముఖ్యం. అన్ని జానర్లలో సినిమాలు చేయాలని ఉంది. ► బర్త్‌డే ప్లాన్స్ ఏంటి? ప్రతీసారి కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఉండేవాణ్ణి. ఈసారి మహేశ్‌గారితో ఉండబోతున్నా. అదో కిక్కు. ఆయనతో సరదాగా టైమ్ స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. మంచి కిక్ ఇచ్చే బర్త్‌డే ఇది. ► నెక్ట్స్ సినిమా? ఇంకా ఏం ఆలోచించలేదు. కానీ ఏం చేయాలనే ఐడియా మాత్రం ఉంది. ► ‘అల.. వెకుంఠపురములో.., సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో విడుదలవుతున్నాయి. అదేమైనా వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుందా? ఈ రెండూ డిఫరెంట్ సినిమాలు. పండగ సమయాల్లో మూడు సినిమాలు రిలీజ్ అయినా ప్రాబ్లమ్ ఉండదు. ఇవాళ ఓ సినిమా చూస్తే రేపు మరో సినిమా చూస్తారు. ► ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎఫ్2’ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. తెలుగు నుంచి ఎంపికైన సినిమా అదొక్కటే. ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. షూటింగ్ ఉండి ఆ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లలేకపోయాను. మా టీమ్ తరఫున ‘దిల్’రాజుగారు హాజరయ్యారు. ► ప్రస్తుతం ఉన్న యంగ్ కమర్షియల్ డైరెక్టర్స్‌లో ఫ్లాప్స్‌ని చూడని దర్శకుడు మీరు. హిట్ స్ట్రీక్‌ని ఎలా కంటిన్యూ చేస్తున్నారు? రాజమౌళిగారు అంత సక్సెస్ఫుల్ దర్శకుడు ఎలా అయ్యారు? ఒక్క సినిమా కూడా మిస్ అవ్వకుండా ఎలా హిట్ కొడుతున్నారు? అని గమనిస్తే, తెలిసింది ఏంటంటే ఆయన తన బలాన్ని వదిలి ఎప్పుడూ సినిమా చేయలేదు. ఆయన బలం ఎమోషన్. ‘ఈగ’ లాంటి ప్రయోగం అయినా, ‘బాహుబలి’ లాంటి ఫ్యాంటసీ అయినా ఆ బలాన్ని వదల్లేదు. ఆయనలా మన బలాన్ని మనం వదలకూడదు. అప్పుడు సినిమా మిస్‌ఫైర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుందనుకుంటున్నాను. కథ రాసుకునే దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాను. బేరాల్లేవ్! ‘భయపడే వాడే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాల్లేవమ్మా!’ అంటున్నారు మహేశ్‌బాబు. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ శుక్రవారం రిలీజ్ అయింది. ‘మీరెవరో మాకు తెలియదు. మీకు, మాకూ ఏ రక్తసంబంధం లేదు. కానీ, మీ పిల్లల కోసం పగలు, రాత్రి తేడా లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత. గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్, సంక్రాంతికి అల్లుళ్లు వస్తారనుకుంటే మొగుడు వచ్చాడేంట్రా’ అనే డైలాగ్స్‌తో ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే జనవరి 11న రిలీజ్ కానుంది. -
సర్ప్రైజ్ సర్ప్రైజ్
నాగచైతన్య బర్త్‌డేకు (నవంబర్ 23) స్పెషల్ బర్త్‌డే సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ‘వెంకీమామ’ చిత్రబృందం. ఈ నెల 23న నాగచైతన్య పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్ రవీందర్(బాబీ) తెరకెక్కించిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లు. ‘కెప్టెన్ కార్తీక్’ పాత్రలో ఆర్మీ ఆఫీసర్‌గా చైతన్య ఈ సినిమాలో నటించారు. ఈ టీజర్లోనే ‘వెంకీమామ’ రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారని తెలిసింది. లవ్‌స్టోరీ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి ఓ ప్రేమకథాచిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. చైతన్య బర్త్‌డేకి ‘లవ్ స్టోరీ’ టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. చైతన్య అభిమానులకు డబుల్ ధమాకా. -
హ్యాపీ బర్త్‌డే టబు.. వైరలవుతున్న ఫోటో
ముంబై: బాలీవుడ్ నటి టబు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో టబు సోదరి ఫరా నాజ్ తన ఇస్టాగ్రామ్ ఖాతాలో..టబుతో దిగిన చిన్ననాటి పాత ఫోటోను షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే..మై డియర్ సిస్టర్’ అని కమెంట్ పెట్టారు. దీంతో ముద్దుల మూట కడుతున్న బుల్లి టబు ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా టబు తన 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమె 1994లో బాలీవుడ్లో ‘పెహలా పెహలా ప్యార్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అదే ఏడాది ఆమె నటించిన ‘విజయ్‌పథ్’ సినిమా విడుదలై బాక్సీఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇక అప్పటి నుంచి తను వెనుదిరిగి చూడలేదు. పలు విజయవంతమైన చిత్రాలు ఆమె ఖాతాలో చేరాయి. టబు..హకీఖత్, జీత్, మాచిస్ (ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది), విరాసాట్, చాచి 420, బీవీ నెం.1 వంటి సినిమాల్లో నటించారు. 2001లో తాను నటించిన ‘చాందిని బార్’ సినిమాకు రెండోసారి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. తను చివరిగా భారత్, డీ దే ప్యార్ దే, అంధాధున్ వంటి చిత్రాల్లో నటించారు. తాజాగా తాను నటించిన ‘జవానీ జానెమాన్’ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలొ టబు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. యంగ్ హీరో రానా, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న డిఫరెంట్ మూవీ విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో టబును అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాత్రలో నటించేందుకు ముందుగా అంగీకరించిన టబు, తాజాగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్పారట. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉండటంతో విరాటపర్వంలో నటించలేనని చెప్పేశారట. అయితే టబు సోదరి ఫరానాజ్ కూడా బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించారు. 1985లో వచ్చిన ‘ఫాస్లే ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఆమె యతీమ్, వో ఫిర్ ఆయేగి, బెగునా వంటి చిత్రాల్లో నటించారు. ఆమె చివరగా నటించిన చిత్రాలు శిఖర్ (2005), హల్చల్ (2004). కాగా ప్రముఖ నటి షబానా అజ్మీకి టబు మేనకోడలు అన్ని విషయం తెలిసిందే. టబు రేర్ ఫోటోలు: సోదరి వివాహంలో టబు.. తల్లితో టబు.. -
బాబీ కుమార్తె పుట్టినరోజు వేడుక
-
ఇంకా నెలరోజులు; అప్పుడే సందడి మొదలైంది!
ముంబై : స్టార్ హీరోల బర్త్ డే వస్తుందంటే చాలు వారి అభిమానులంతా వారం రోజుల ముందునుంచే తెగ హడావుడి చేస్తూంటారు. ఇంకా బర్త్ డే రోజైతే వారి హంగామా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పెద్ద పెద్ద కేకులు కట్ చేయడం, రక్తాదానాలు చేయడం, పండ్లు పంచడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ బర్త్ డే ఇంకా నెలరోజులు ఉండగానే అభిమానుల హంగామా మొదలైంది. కింగ్ ఖాన్ చిన్నప్పటి ఫోటోలకు ‘షారుక్ డేకు ఇంకా నెలరోజు ఉందని, మరో 30 రోజుల్లో బిగ్ డే రానుంది’ అనే హాష్ ట్యాగ్‌తో షేర్ చేస్తున్న ఫోటోలు ట్విటర్లో, బ్లాగింగ్ సైట్లలో ట్రెండ్ అవుతున్నాయి. ఇలా నెలరోజుల ముందే షారుక్ ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులు చేస్తున్న హడావుడి చూస్తుంటే.. ఈ సారి తమ అభిమాన హీరోను ట్విటర్ ట్రేండింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలబెట్టేలా కనిపిస్తున్నారు. కాగా బాద్షా చిన్ననాటి ఫోటోలకు ‘లిటిల్, క్యూట్ స్వీట్ నైస్ లుకింగ్ కింగ్ ఖాన్, వన్ మంత్ టూ షారుక్ డే.. లవ్ యూ కింగ్ ఖాన్’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అలాగే ‘ స్టార్ డమ్ అంటే ఎంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నవంబర్ 2న మన్నత్‌కు రండి! అంటూ షారుక్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా ఆహ్వనిస్తున్నారు. ఇందులో భాగంగా.. భాగీ ఫేం టైగర్ ష్రాఫ్ ఓ చాట్‌షోలో మాట్లాడుతూ... ‘నాకు అందరు ఖాన్లు ఇష్టమే కానీ.. ఎందుకో తెలియదు నేను ఎప్పుడు షారుఖ్ ఖాన్ సార్నే ఎక్కువగా ఇష్టపడతా’ అని చెప్పుకొచ్చిన వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అది చూసి నెటిజన్లంతా షారుక్‌కు సినిమా పరంగానే కాకుండా ఇంకా చాలా విషయాలు తమను అతడి పిచ్చి అభిమానులుగా మార్చివేశాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. Little cute sweet beautiful nice looking king👑 khan.... #1MonthForSRKDay #1MonthToSRKDay Love❤😘 you king👑 khan pic.twitter.com/NvmilG0N56 — Kazi raees roy(Srkian) (@roy_kazi) October 1, 2019 Apart from movies , there are lots of things which inspire us to be his fans . pic.twitter.com/JeohqW3LwF #1MonthForSRKDay — तूफान का देवता ᵀʰᵒʳ 🚩 (@iStormbreaker_) October 1, 2019 -
ఈ మూడూ ఒకేరోజు రావడం శుభకరం : కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : దేశ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో స్వచ్ఛ భారత్ చేసి రోగులకు బ్రెడ్, పండ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇల్లు, కుటుంబం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోదీనే అని అభినందించారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ గ్రిడ్లతో పాటు వన్ నేషన్ వన్ రాజ్యాంగాన్ని అమలు చేసి దేశ గతినే మార్చారని ప్రశంసించారు. 18 వేల గ్రామాల్లో కరెంటు, 80 శాతం స్టంట్ల ధరల తగ్గింపు వంటి చర్యలను మోదీ చేపట్టారని పేర్కొన్నారు. ఈ రోజు మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణకు స్వేచ్చా స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఇలా మూడూ కలిసి ఒకే రోజు రావడం శుభకరమన్నారు. ప్రస్తుతం వైరల్ ఫీవర్ ప్రబలుతున్న దృష్ట్యా జిహెచ్ఎమ్సి వ్యర్థాలను తొలగించాలని కోరారు. డెంగీ జ్వరాల మీద రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ బ్రాండ్‌ను మనం కాపాడుకోవాలని కిషన్ రెడ్డి ప్రజలకు సూచించారు. -
బర్త్‌డే రోజు గుజరాత్లో ప్రధాని బిజీబిజీ..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం 69వ ఏట అడుగుపెట్టారు. తన జన్మదినం సందర్భంగా ప్రధాని తొలుత గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆమె ఆశీస్సులు పొందారు. 98 సంవత్సరాల హీరాబెన్ తన చిన్న కుమారుడు పంకజ్ మోదీతో కలిసి రైసిన్ గ్రామంలో నివసిస్తున్నారు. తల్లి ఆశీస్సులు తీసుకున్న అనంతరం గాంధీనగర్ నుంచి ఆయన నర్మదా జిల్లాలోని కెవదియా చేరుకుని అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షిస్తారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా నర్మదా నదీ తీరంలో మా నర్మద పూజ నిర్వహించడంతో పాటు సర్ధార్ సరోవర్ డ్యామ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శిస్తారు. గరుడేశ్వర్లో దత్తాత్రేయ మందిరాన్ని సందర్శించిన అనంతరం కెవదియాలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. -
బేటీ, జల్ ఔర్ వన్..
పట్నా: ‘అన్నిటి కంటే పెద్ద ఆస్తులు– కూతురు, నీరు, అడవి’(సబ్సే బడా ధన్..బేటీ, జల్ ఔర్ వన్)..ఇది బీజేపీ కొత్త నినాదం. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దేశ మంతటా బీజేపీ దీనిని వారం పాటు అమలు చేయనుంది. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమం బీజేపీ జాతీయ కన్వీనర్ రాజేంద్ర ఫడ్కే పట్నాలో మాట్లాడుతూ..ప్రభుత్వం చేపట్టిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’కార్యక్రమానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దీనిని అమలు చేయనున్నామన్నారు. ప్రధాని జన్మదినం ఈ నెల 17వ తేదీ కాగా, ఈ కార్యక్రమం ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు సేవా సప్తాహంగా చేపడతామన్నారు. ‘ఇందులో భాగంగా ఆడపిల్ల పుట్టిన ప్రాంతంలో, ముఖ్యంగా నిరుపేదలుండే చోట బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచి, ఒక మొక్కను నాటుతారు. నీటి సంరక్షణ ప్రాధాన్యం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించరాదని అవగాహన కల్పిస్తారు. ఈ ప్రచార కార్యక్రమం దేశంలోని అన్ని జిల్లాలు, అన్ని బ్లాకుల్లోనూ జరుగుతుంది’ అని వివరించారు. గత ఐదేళ్లలో ‘బేటీ బచావో, బేటీ పఢావో’కార్యక్రమం వల్ల బిహార్ వంటి రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి మెరుగైందన్నారు. -
ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83
‘‘మహాభారతం, గాంధీ’ సినిమాలను ఒకే భాగంలో పూర్తి చేశారు. వాటిలాగా యన్టీఆర్ బయోపిక్‌ని ఒకే భాగంలో చెప్పి ఉంటే బాగుండేది. 60 శాతం షూటింగ్ పూర్తయ్యాక ‘యన్.టి.ఆర్. కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు’ అంటూ రెండు భాగాలుగా చెప్పడం, పైగా అప్పటి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మా సినిమా పరాజయానికి కారణాలు. ఏదేమైనా యన్టీఆర్ బయోపిక్ తీసినందుకు గర్వంగానే ఉంది’’ అని నిర్మాత విష్ణువర్థన్ ఇందూరి అన్నారు. గురువారం తన పుట్టినరోజుని పురస్కరించుకుని హైదరాబాద్‌లో విష్ణువర్థన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా సినిమాలు దాదాపు నా ఆలోచన నుంచే వస్తుంటాయి. నేను సీసీఎల్‌కి పని చేస్తున్నప్పుడు క్రికెట్ గురించి ఓ మంచి కథ చెప్పాలనిపించింది. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ‘83’ సినిమా. 1983లో క్రికెట్లో భారతదేశం ప్రపంచకప్ సాధించిన క్షణాలను ఎవరూ సులభంగా మరచిపోరు. అప్పట్లో క్రికెటర్లకు రోజుకు 200 పారితోషికం ఉండేది. ఎన్నో కష్టాలు, బాధల్లోనూ అప్పటి క్రీడాకారులు ఇండియాకి ఏ విధంగా గర్వకారణంగా నిలిచారు? ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన అనుభవాలు, అవరోధాలు ఏంటి? వంటి స్ఫూర్తివంతమైన అంశాలతో ‘83’ సినిమా సాగుతుంది. హిందీలో నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ చేస్తాం. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో 20 శాతం పూర్తి చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. అదే విధంగా కంగనా రనౌత్ లీడ్ రోల్లో ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందించనున్నాం. విజయేంద్రప్రసాద్‌గారు కథ అందిస్తున్నారు. జయలలిత బాల్యం నుంచి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయం వరకూ ఈ బయోపిక్‌లో చూపించనున్నాం. జయలలితగా కంగనా మేకోవర్ కోసం హాలీవుడ్ నుంచి సాంకేతిక నిపుణులను తీసుకొస్తున్నాం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. అక్టోబర్ 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. -
బర్త్‌డే రోజూ షూటింగ్లో బిజీబిజీ..
ముంబై : కేదార్నాథ్ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టిన స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ రెండో సినిమా సింబాతో రూ 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టి క్రేజీ హీరోయిన్గా మారింది. సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా 24వ పుట్టినరోజు కావడంతో ఈరోజంతా ఆమె పార్టీల్లో మునిగితేలుతుంది అనుకుంటే పొరపడినట్టే. బర్త్‌డే రోజూ ఈ భామ షూటింగ్తోన బిజీబిజీగా గడపనున్నారు. వరుణ్ ధావన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న కూలీ నెంబర్ 1 రీమేక్ షూటింగ్ కోసం సారా ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉన్నారు. బర్త్‌డే రోజు పనికి విరామం ఇచ్చేందుకు మూవీ రూపకర్తలు ముందుకొచ్చినా సారా సున్నితంగా తోసిపుచ్చినట్టు తెలిసింది. గత ఏడాది సైతం బర్త్‌డే రోజు ఆమె తన తొలి మూవీ కోసం సన్నద్ధమయ్యేందుకు రోజంతా డ్యాన్స్ ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఇక ఈసారి బ్యాంకాక్‌లో షూటింగ్లో ఉండటంతో సెట్లోనే బర్త్‌డేను జరుపుకోనున్నారు. -
ప్రతిదీ డ్రీమ్ ప్రాజెక్టే
‘‘అభిమానిగా మొదలైన నా ప్రయాణం జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా ప్రస్తుతం నిర్మాత వరకూ వచ్చింది. ఈ ప్రయాణంలో నన్ను నిలబెట్టినవాళ్లు, నాతో నిలబడ్డవాళ్లకు కృతజ్ఞతలు’’ అన్నారు యస్.కె.ఎన్. ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు’ సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ‘ఈ రోజుల్లో, టాక్సీ వాలా’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు యస్.కె.యన్. ఇవాళ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని గురించి యస్.కె.యన్. మాట్లాడుతూ– ‘‘ఇంటర్నెట్ ఇంకా ఊపు అందుకోని సమయంలో ఏలూరులో ఎర్లీ మార్నింగ్ షో చూసి సినిమా మీద నా అభిప్రాయాన్ని ఆన్లైన్లో షేర్ చేసేవాణ్ణి. ఆన్లైన్లో మెగాఫ్యాన్స్ క్లబ్ రన్ చేసేవాళ్లం. అల్లు శిరీష్‌గారితో పరిచయం అయింది. ఆయన నన్ను బన్నీ (అల్లు అర్జున్)గారికి పరిచయం చేశారు. బన్నీగారు హీరో అయ్యే సమయం నుంచి ఆయనతో ట్రావెల్ అవుతూ వచ్చాను. ఏం చేస్తావు? అని అడిగారు బన్నీ. మీ ఫ్యామిలీతో ట్రావెల్ అవుతాను అని చెప్పాను. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో అనుబంధం ఏర్పడింది. టీవీ9లో కొంత కాలం పని చేశాను. ఆ తర్వాత పీఆర్వోగా సినిమాలు చేశాను. యూవీ క్రియేషన్స్ వంశీ, దర్శకుడు మారుతీ, నేను కలసి కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాం. మారుతితో ఏర్పడ్డ అసోసియేషన్ వల్ల తన ప్రతీ సినిమాలో భాగమవుతూ వస్తున్నాను. జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు సినిమాను విశ్లేషిస్తూ, ఎలా ఉండాలో అని విమర్శించాం. ఇప్పుడు ఆ విమర్శలు రాకుండా స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకుంటున్నాం. ప్రస్తుతం తెలుగు సినిమా మంచి ఫేజ్‌లో ఉంది. దేశంలో బెస్ట్ కమర్షియల్ సినిమాలు మనమే తీయగలం అని నా అభిప్రాయం. మమ్మల్ని గైడ్ చేస్తున్న అరవింద్‌గారికి, చిరంజీవిగారికి థాంక్స్. మొదటి సినిమాకే విజయ్ దేవరకొండ లాంటి అప్‌కమింగ్ స్టార్ హీరోతో సినిమా నిర్మించడం మంచి ఎక్స్పీరియన్స్. ప్రస్తుతం ఇద్దరు డైరెక్టర్స్ కథల్ని ఓకే చేశాం. సాయి తేజ్‌తో మారుతి తీస్తున్న ‘ప్రతి రోజూ పండగ’ భిన్నంగా ఉంటుంది. ప్రతీ ప్రాజెక్ట్ నాకు డ్రీమ్ ప్రాజెక్టే’’ అన్నారు. -
సినిమా అనేది అద్దంలా ఉండాలి
‘‘గతంలో సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేసేవి.. కానీ, ఇప్పుడు సమాజం సినిమాలను ప్రభావితం చేస్తోంది. ఇండస్ట్రీ కంటే ముందుగా సొసైటీ చాలా ఫాస్ట్‌గా ఉంది. అందుకే సొసైటీని చూసి చిత్రాలు చేసే పరిస్థితి. సినిమా అన్నది అబద్ధంలా కాకుండా అద్దంలా నిజాలను చూపాలి.. అప్పుడే హిట్ అవుతుంది’’ అని దర్శక–నిర్మాత అల్లాణి శ్రీధర్ అన్నారు. నేడు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని చెప్పిన విశేషాలు. ► ‘చిలుకూరు బాలాజి’ సినిమా తర్వాత ‘బిచ్చగాడు’ సినిమా నిర్మాత చదలవాడ శ్రీనివాస్‌గారి బ్యానర్లో ఓ ప్రేమకథా చిత్రం చేస్తున్నా. క్లైమాక్స్ ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంతో డైరెక్టర్ కె.ఎస్. నాగేశ్వరరావుగారి అబ్బాయి పవన్ హీరోగా పరిచయమవుతున్నాడు. సీనియర్ నటుడు సురేశ్, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఆగస్టులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ► నేటి తరం పిల్లలు డిజిటల్ మాధ్యమాలకు ఎలా బానిసలవుతున్నారనే కథాంశంతో ‘డూడు.. డీడీ’ అనే చిన్నపిల్లల సినిమా తీశా. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో, కలకత్తా చిల్డ్రన్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. త్వరలో విడుదల చేయనున్నాం. ∙‘కొమరం భీమ్’ సినిమాని నా దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నేటి ట్రెండ్‌కి తగ్గట్టు డిజిటలైజ్ చేసి మళ్లీ తెలుగులోనూ విడుదల చేయాలనుకుంటున్నా. ► నా దర్శకత్వంలో థ్రిల్లర్ జోనర్లో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నా. వ్యవసాయం, ఆరోగ్యంపై చైతన్యం వచ్చేలా నేను తీసిన షార్ట్స్ ఫిల్మ్స్‌కి మంచి పేరొచ్చింది. ఇటీవల వచ్చిన ‘మల్లేశం’ సినిమా బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వాలి. ► ప్రస్తుతం సమాజంలో 9 నెలల పసికందు నుంచి 90ఏళ్ల మహిళలపై ఎందుకు లైంగిక దాడులు జరుగుతున్నాయి? అనే అంశంపై ఓ టీనేజ్ గర్ల్ పరిశోధన చేశారు. నా దర్శకత్వంలో దాన్ని సినిమాగా చేస్తున్నాం. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం చేయనున్నాం. -
రాహుల్‌కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు రాహుల్. మీరు మంచి ఆరోగ్యంతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా’అని మోదీ బుధవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్ ట్వీట్ చేశారు. తొలుత రాహుల్ యూపీఏ చైర్పర్సన్, తన తల్లి సోనియా గాంధీని ఆమె నివాసంలో కలుసుకున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో గడిపారు. రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు ఉన్నారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నేతలతో కలిసి ఉన్న ఫొటోలను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. బిహార్‌లో మెదడువాపు వ్యాధితో దాదాపు 120 మంది చిన్నారులు మరణించిన నేపథ్యంలో ఈసారి రాహుల్ పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయలేదని పార్టీ కార్యకర్తలు వెల్లడించారు. -
కార్యకర్త బర్త్ డే : సీఎం సర్ప్రైజ్
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి ఓ కార్యకర్త పుట్టిన రోజు వేడుకలకు హాజరుకావడమే చాలా గొప్ప విషయం. అలాంటిది.. సీఎం స్వయంగా దగ్గరుండి ఓ కార్యకర్త పుట్టిన రోజు సెలబ్రేట్ చేయడం నిజంగా గ్రేటే. ఈ అరుదైన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఓ కార్యకర్త పుట్టిన రోజు నాడు దగ్గరుండి కేట్ కట్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వివరాలు.. ఆప్ సోషల్ మీడియా టీం మెంబర్ వివేక్ పుట్టిన రోజు సందర్భంగా కేజ్రీవాల్ స్వయంగా దగ్గరుండి అతని చేత కేక్ కట్ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వివేక్ ట్విటర్లో షేర్ చేశాడు. దాంతో పాటు ‘ఓ సాధరణ కార్యకర్తకు ఓ ముఖ్యమంత్రి నుంచి లభించిన అరుదైన గౌరవం’ అనే మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశాడు. దాంతో ఈ విషయం గురించి అందరికి తెలిసింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ క్రమంలో కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేసే కార్యకర్తలే మాకున్న గొప్ప బలం. కార్యకర్తల సాయంతో మా పార్టీ దేశ సేవ చేస్తుంద’ని పేర్కొన్నారు. -
మహిళలు తలచుకుంటే...
ఆర్.కె. ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్, కావ్యారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహిళా కబడ్డీ’. శనివారం రామకృష్ణగౌడ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘మహిళా కబడ్డీ’ పోస్టర్‌ను తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘గౌడ్ నాకు చాలా కాలం నుంచి మిత్రుడు. ఆయన తీస్తున్న ‘మహిళా కబడ్డీ’ చిత్రంలోని పాటలను విన్నాను. ఎంతో బావున్నాయి. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని చాటి చెప్పే సినిమా ఇది’’ అన్నారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘పాటల రికార్డింగ్ పూర్తయింది. గీతా మాధురి, మంగ్లీ, మధుప్రియ లాంటి ప్రముఖ గాయనీ మణులు పాడిన ఆరు పాటలను రికార్డ్ చేసాం. దాంతోపాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయి కబడ్డీలో జాతీయ స్థాయిలో ఎలా నిలిచింది? ఆమె జర్నీలో ఉన్న సమస్యలు, మలుపులు ఏమిటి అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్. -
మా సెట్లో ఆడా మగా తేడా లేదు
‘నీ తోడు కావాలి’ అంటూ ఏ తోడూ లేకుండా హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. ఎవరి అండా లేకుండానే సక్సెస్ అయ్యారు. చార్మింగ్ బ్యూటీనే కాదు.. చాలా మంచి ఆర్టిస్ట్ అని కూడా అనిపించుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా పలు భాషల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన చార్మి ఇప్పుడు తనలోని నటిని సెకండ్ సీట్లో కూర్చోబెట్టారు. నిర్మాతను ఫ్రంట్ సీట్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రొమాంటిక్’ చిత్రాల నిర్మాణంతో బిజీగా ఉన్నారు. నేడు చార్మి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమెతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... ► బర్త్‌డేకు స్పెషల్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ప్లాన్స్ ఏం లేవు. గోవాలో ‘ఇస్మార్ట్ శంకర్’ సాంగ్ షూట్ జరుగుతోంది. మొన్న రామ్ బర్త్‌డేకు రిలీజ్ చేసిన టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే బర్త్‌డే సెలబ్రేషన్స్ అన్నట్టు. ► బర్త్‌డేకు కొత్త నిర్ణయాలేమైనా తీసుకుంటారా? అలాంటివి ఎప్పుడూ పెట్టుకోను. ప్రస్తుతం ఫోకస్ అంతా ‘ఇస్మార్ట్ శంకర్’ మీదే ఉంది. బోలెడు పనులున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి, బిజినెస్ చూసుకోవాలి. మైండ్ మొత్తం సినిమా చుట్టూనే తిరుగుతోంది. ► ప్రొడ్యూసర్‌గా ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు. ఫీమేల్ ప్రొడ్యూసర్స్‌కు షూటింగ్ స్పాట్లో ఉండే చాలెంజెస్ ఏంటి? మా సెట్లో స్త్రీలు, పురుషులు అనే తేడాని ఎప్పుడూ ఫీల్ అవలేదు. మా పీసీ (పూరీ కన్సెక్ట్స్) ఆఫీస్‌లో కూడా ఆ వ్యత్యాసాలేమీ ఉండవు. నేను మ్యాన్‌లా ఆలోచిస్తానని, మ్యాన్‌లా ఉంటానని అలానే వర్క్ చేస్తానని పూరీగారు చెబుతుంటారు– ఇక్కడ మొత్తం ఫ్రెండ్లీ వాతావరణమే ఉంటుంది. నేను బాస్, నువ్వు ఎంప్లాయ్.. అలా ఉండదు. ఇక్కడ అందరూ పనికోసమే వస్తారు, పని మాత్రమే చేస్తారు. ఫోకస్ పనిమీద మాత్రమే ఉన్నప్పుడు ఎక్కువ తక్కువలు ఉండవు. ► హీరోయిన్గా ఉన్నప్పుడు మీకు అన్నీ టైమ్‌కు ఏర్పాటు చేస్తుంటారు. మీరు ప్రొడ్యూసర్ అయిన తర్వాత మీ హీరోహీరోయిన్లను ఎలా చూసుకుంటున్నారు? నేను మా హీరోహీరోయిన్లను చాలా గారం చేస్తుంటాను. నాకు గారం చేయడం అంటే భలే ఇష్టం. హీరోగారు వస్తున్నారు.. అంతా రెడీ పెట్టండి. హీరోయిన్‌కి వ్యాన్ రెడీ ఉందా? ఇలా అన్నీ చూసుకుంటాను. యూనిట్ వాళ్లకు ఫుడ్ సెర్వ్ చేస్తుంటాను. అందరూ సరదాగా రావాలి, కలసి నవ్వుకుంటూ పని చేయాలి. ఇదే మా పాలసీ. ► గారం చేస్తే షూటింగ్ లేట్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది కదా? అస్సలు ఉండదు. వాళ్లు మార్నింగ్ నిద్ర లేవగానే వర్క్‌కి రావాలంటే ఒక ఉత్సాహంతో ఉండాలి. మనం ఇక్కడ బాగా చూసుకుంటే వాళ్లూ అలానే పని చేస్తారు. అబ్బా.. ఇవాళ షూటింగ్‌కి రావాలా? అని బాధపడుకుంటూ రారు. ఆ ఎనర్జీతో వస్తే చాలు.. జరగాల్సిన పనులు టైమ్‌కు జరిగిపోతుంటాయి. మేం డిఫరెంట్ కండీషన్స్‌లో షూట్ చేయాల్సి ఉంటుంది. వారణాసిలో షూట్ చేసినప్పుడు 47 డిగ్రీల ఎండ. డైరెక్ట్ సన్‌లైట్ కింద పనిచేశాం. అందరికీ సన్ ఎలర్జీతో బ్లాక్ ప్యాచ్‌లు వచ్చేశాయి. కానీ ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు. ఇదో చాలెంజ్ అన్నట్లు తీసుకొని పని చేశాం. ► హీరోయిన్గా ఉన్నప్పుడు సెట్లో ఏదైనా మార్పు వస్తే బావుండు అనుకున్నది నిర్మాతగా మారిన తర్వాత తీసుకొచ్చింది ఏదైనా ఉందా? ఏదో మార్పు తీసుకు రావడానికో, మార్చడానికో మనం ఇక్కడం లేం. మా లక్ష్యం సినిమాలు చేయడమే. మంచి సినిమాలు చేయాలి, హిట్స్ కొట్టాలి. ఈ జర్నీ జరిగేటప్పుడు అందరూ హ్యాపీగా, ఇబ్బంది లేకుండా ఉండాలి. అంతే. ► నిర్మాతగా మారిన తర్వాత ఎలా ఉంది? అమ్మలా మారినట్టు ఉంది. సినిమా చేయడం బేబీ క్యారీ చేయడంలానే. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటినుంచి డెలివరీ వరకూ జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్మాత అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం అందులో భాగం అయ్యుంటాం. హీరోయిన్గా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ మొత్తం సెట్ అయిన తర్వాత మధ్యలో ఎంటర్ అవుతాం. అప్పటికే టీమ్ అంతా ఫిక్స్ అయ్యుంటుంది. అలాగే రేపు రిలీజ్ ఉందంటే ఇవాళో నాలుగు, రేపో నాలుగు ఇంటర్వ్యూలు ఇస్తే చాలు. సినిమా ప్రమోషన్‌కు వారం రోజులు కేటాయిస్తే చాలు అని ఉంటుంది. హీరోయిన్గా ఉన్నప్పుడు 6–7 రిలీజ్లు ఉండేవి. ప్రతి సినిమా హిట్ అవ్వాలనుకుంటాం. ప్రతీ ప్రాజెక్ట్ మీద ప్రేమ ఉన్నా అది ఒక్కోదానికి షేర్ అవుతుంది. నిర్మాతగా ఉన్నప్పుడు మన ఎనర్జీ, రక్తం, చెమట అన్నీ ఇందులోనే పెడతాం. కొన్నిసార్లు టెన్షన్‌తో నిద్ర పట్టదు. రేపు ఏం చేయాలి? అనుకున్నవన్నీ సక్రమంగా జరుగుతాయా? వంటి ఆలోచనలతో సతమతమవుతుంటాం. టెన్షన్ అయితే కచ్చితంగా ఉంటుంది. ప్రతి నిమిషం ఉంటుంది. దానికి తోడు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా మీద అయితే చాలా నమ్మకంగా ఉన్నాం. ► పూరీగారు ఓ సాలిడ్ హిట్ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ అంతా చూస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఎలా ఉండబోతోంది? 100 పర్సంట్... రాసిపెట్టుకోండి. పూరీగారి దగ్గర నుంచి ఇన్నాళ్లూ ఏదైతే మిస్ అయ్యారో, ఏదైతే కోరుకుంటున్నారో ‘ఇస్మార్ట్ శంకర్’ దానికి మించి ఉండబోతోంది. కావాలంటే రాసిస్తాను. ► మళ్లీ మిమ్మల్ని స్క్రీన్ మీద ఎప్పుడు చూడొచ్చు? నెవ్వర్ సే నెవర్ అంటారు. నటిగా మళ్లీ స్క్రీన్ మీద కనిపించడానికి చాలా టైమ్ ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాలు మొత్తం పూరీ కనెక్ట్స్లోఎలాంటి సినిమాలు చేయాలి? అనే దానిమీదే దృష్టంతా. కొత్త కొత్త స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. అందుకే యాక్టింగ్ కొన్ని రోజులు సెకండ్ సీట్లోనే ఉండబోతోంది. ► హీరోయిన్గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారా? నిర్మాతగా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? నిర్మాతగా ఉండటం చాలా స్ట్రెస్ఫుల్. చాలా టఫ్. ఇందాక అన్నట్టు టెన్షన్, నిద్రలేని రాత్రులు. కానీ నిర్మాతగా ఉండటాన్నే ఎంజాయ్ చేస్తున్నాను. మనం ఏం చేసినా జీవితంలో సమస్యలు కామన్. వాటి పరిష్కారం మన చేతుల్లో ఉండటం కామన్. సమస్యలను ఎవరైనా పరిష్కరించుకోవాల్సిందే కదా. నేను అది బాగా చేసుకోగలను. -
అడవిలో ఓ రాత్రి!
పదిహేనేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ అగ్రకథానాయికల లిస్ట్‌లో కొనసాగుతూనే ఉన్నారు చెన్నై బ్యూటీ త్రిష. ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారామె. ఇన్నేళ్లయినా ఇంకా అదే అంకితభావంతో పని చేస్తున్నారామె. అందుకు తాజా ఉదాహరణ... పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి రెండుగంటలు ముందే షూటింగ్ లొకేషన్‌కి వెళ్లిపోయి, రిహార్సల్స్ చేశారట. త్రిష నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘పరమపదమ్ విళయాట్టు’. త్రిష కెరీర్లో ఇది 60 చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి కె. తిరుజ్ఞానమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ త్రిష పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల కానుంది. నటుడు విజయ్ సేతుపతి విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా జర్నీ గురించి తిరుజ్ఞానమ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో త్రిష డాక్టర్‌గా తల్లి పాత్ర చేశారు. త్రిషకు నటిగా చాలా అనుభవం ఉన్నప్పటికీ సెట్‌కు రెండుగంటలు ముందే వచ్చేవారు. షూట్‌కు ముందే సీన్లను ప్రాక్టీస్ చేసేవారు. ప్రతి సీన్ పర్ఫెక్ట్గా రావాలని కోరుకునేవారు. అడవుల్లో కొన్ని యాక్షన్ సీన్లు తీశాం. కొన్నింటిని డూప్ లేకుండా చేశారామె. సినిమాల పట్ల ఆమెకు ఉన్న అంకితభావం సూపర్’’ అన్నారు. ‘‘పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇలాంటి సినిమా చేయడం నాకు ఇది ఫస్ట్ టైమ్. డాక్టర్ వృత్తి చేస్తున్న ఓ తల్లి అడవిలో ఓ రాత్రి ఎదుర్కొనే భిన్నపరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని పేర్కొన్నారు త్రిష. -
ప్రేమ సందేశాలు
గత నెలలో శ్రుతీహాసన్ పుట్టిన రోజుకు లండన్ నుంచి ప్రేమ సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు శ్రుతీ బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే. సోమవారం మైఖేల్ పుట్టినరోజు. ఈసారి ప్రేమ సందేశాలను లండన్ పంపడం శ్రుతీ వంతైంది. ‘‘మైఖేల్.. ఈ ఏడాది నువ్వు ఇంకా అద్భుతంగా మారతావని, కెరీర్ మరింత కాంతివంతంగా మారుతుందని ఆశిస్తున్నాను. వీటితోపాటు నీ హృదయం మరింత విశాలంగా మారుతుందని (ఒకవేళ అవకాశముంటే). హ్యాపీ బర్త్‌డే బెస్ట్ ఫ్రెండ్. మై మ్యాన్.. మిస్ అవుతున్నాను’’ అని రాసుకొచ్చారు శ్రుతీ. ప్రేమ పంచుకుంటున్న వీళ్లు జీవితాన్ని ఎప్పుడు పంచుకుంటారో అని శ్రుతీ ఫ్యాన్స్ వెయిటింగ్. -
పారితోషికం కాదు.. పాత్ర ముఖ్యం
‘‘ఏ ఆర్టిస్ట్‌కైనా సక్సెస్, ఫెయిల్యూర్ కామన్. ఏడెనిమిదేళ్ల క్రితం మంచి హిట్ వస్తే బావుంటుంది అనుకున్నాను. గతేడాది వచ్చిన హిట్ సినిమాల్లో సుమారు 8 సినిమాల్లో నటించాను. నాపై దర్శకులు ఉంచిన నమ్మకంతోనే ఆ పాత్రలు వచ్చాయి. గతేడాది మన ఇండస్ట్రీ చాలా బావుంది. అలాగే నాకు కూడా. ఈ ఏడాదిని కూడా అలానే కొనసాగించాలనుంది. పాత్రల్లో ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నాను’’ అన్నారు నటుడు నరేశ్. ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ► ‘శతమానం భవతి’ నా కెరీర్లో టర్నింగ్ పాయింట్. 2018 మన తెలుగు సినిమాలకు హెల్తీయస్ట్ ఇయర్. ‘ఛలో, తొలిప్రేమ, రంగస్థలం, మహానటి, సమ్మోహనం, దేవదాస్, అరవింద సమేత.., శైలజారెడ్డి అల్లుడు’.. ఇలా చాలా సినిమాల్లో కనిపించాను. ‘సమ్మోహనం’ లో చేసిన పాత్ర నన్ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్కృష్ణగారికి థ్యాంక్స్ చెప్పాలి. సీనియర్ డైరెక్టర్స్‌తో పాటు యువ దర్శకులు కూడా ఆయా పాత్రలకు నన్ను ఎంచుకోవడం çహ్యాపీ. నాకు పారితోషికం ముఖ్యం కాదు.. పాత్ర ముఖ్యం. ► నటుడిగా 47 ఏళ్లు పూర్తి చేసుకొని 48లోకి వెళ్తున్నాను. మరో రెండేళ్లలో గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటాను. నా క్రమశిక్షణ, ఇండస్ట్రీలో పెంచుకున్న గుడ్‌విల్, వివాదాల్లోకి వెళ్లకపోవడం.. నా సుదీర్ఘ ప్రయాణానికి కారణం అయ్యాయనుకుంటాను. చిన్న బడ్జెట్ సినిమాలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నాను, ఉంటాను కూడా. కొత్త కాన్సెప్ట్‌లు, కొత్త ఐడియాలకు సిద్ధం. వెబ్ సిరీస్‌లకు కూడా అడుగుతున్నారు కానీ మంచి కాన్సెప్ట్‌తో డిజిటల్‌గా కూడా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను. ► గతేడాది మూడు షిఫ్ట్స్ పని చేశా. ఈ ఏడాది కూడా అలానే ఉండాలనుకుంటున్నాను. పాత్రల ఎంపికలో మంచి పాత్రలు ఎంచుకుంటున్నా. క్వాలిటీ, బ్యానర్లు ఇవన్నీ చూసుకొని ఎంచుకుంటాను. ప్రస్తుతం కార్తికేయతో అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా, ఫణిరాజా అని బుర్రాసాయి మాధవ్ అసోసియేట్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ‘పవనిజం 2’ సినిమాలో విలన్‌గానూ చేస్తున్నాను. ► రెండు బయోపిక్స్‌లో (మహానటి, ఎన్టీఆర్) మంచి పాత్రలు చేయడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో బీఏ సుబ్బారావు పాత్ర ఇచ్చినందుకు క్రిష్, బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పాలి. ► ఇంతకు ముందు తమిళ, మలయాళ రీమేక్స్ కోసం మనవాళ్లు వెళ్లేవారు. ఇప్పుడు వేరే భాషల వాళ్లే మన సినిమా రీమేక్స్ కోసం వస్తుండటం మంచి పరిణామం. మా అబ్బాయి నవీన్ ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమాతో రాబోతున్నాడు. -
ప్రభాస్ పెళ్లి అప్పుడే
‘‘నటుడిగా 50 ఏళ్లు ప్రయాణం చేశాను. ఇంకా ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాను. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేశాను. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలే పోషించాలనుకుంటున్నాను. అలాగే రాజకీయాల్లో కూడా పార్టీ ఎలా కోరుకుంటే అలా ప్రయాణం చేస్తాను’’ అని నటులు కృష్ణంరాజు అన్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా కృష్ణంరాజు సినిమా, రాజకీయాలకు సంబంధించిన పలు విశేషాలను ఇలా పంచుకున్నారు.. ► బర్త్‌డే ఫంక్షన్స్ అంటూ ప్రత్యేకంగా ఏం లేవు. ఫ్యాన్స్ వస్తారు. ఫ్రెండ్స్ విష్ చేస్తారు. మామూలుగానే ఉంటుంది. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సౌత్, నార్త్‌కు సంబంధించిన సెలబ్రిటీస్ అందర్నీ పిలిచి ఓ ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఈ ఫంక్షన్ ఎప్పుడో చేయాలనుకున్నా కుదర్లేదు. మాతో ప్రయాణం కొనసాగిస్తున్న అభిమానులనూ సన్మానించాలనుకుంటున్నాను. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తా. ► ఆ మధ్య కర్ణాటక ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశాను. ఆంధ్రా ఎన్నికలు ఇంకా హీట్ ఎక్కలేదు. పార్టీ అడిగితే ప్రచారం చేస్తాను. సంక్రాంతికి మా ఊరు వెళ్లి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. పార్టీ పనిమీద ఢిల్లీ వెళ్లి వచ్చాను. ఊరెళ్లడం కుదర్లేదు. ► నటుడిగా మంచి పాత్రలు ఎంపిక చేసుకోవాలి అనుకుంటున్నాను. అలా వచ్చి వెళ్లిపోయే పాత్రలు చేయాలని లేదు. మన పాత్ర కథకు, సినిమాకు కీలకంగా ఉండాలి. అందుకే పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నాను. ఓ 2 సినిమాలు డిస్కషన్లో ఉన్నాయి. త్వరలోనే ప్రకటిస్తాను. ► ‘మహానటి’ సినిమా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. డైరెక్టర్ నాగీ, కెమెరామేన్ డ్యానీ అద్భుతంగా చేశారు. కీర్తీ సురేశ్‌కి అయితే ఫుల్ మార్క్స్. సావిత్రి జీవితంలో ఎత్తుపల్లాలను చూపించారు కాబట్టి బావుంది. యస్వీఆర్గారి బయోపిక్ చూడాలనుంది. ఆ పాత్రని ప్రకాశ్‌రాజ్ చేయగలడేమో అని అనుకుంటున్నాను. ► గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద ప్రభాస్‌తో ఓ లవ్‌స్టోరీ చిత్రం నిర్మిస్తున్నాం. ఆ సినిమా ఓ షెడ్యూల్ పూర్తి అయింది. అందులో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. కథలు కుదిరితే కచ్చితంగా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మాణం కొనసాగిస్తాం. ► మన బిడ్డను ఐదేళ్ల వరకూ దేవుడిలా చూడాలి.. ఐదు నుంచి పద్దెనిమిదేళ్ల వరకూ సేవకుడిలా చూడాలి.. ఆ తర్వాత స్నేహితుడిలా చూడాలని మా నాన్నగారు నాకు చెబుతుండేవారు. నాకు, ప్రభాస్‌కి మధ్య అనుబంధం బావుంటుంది. ► యాక్టర్‌గా 50 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను.. ఇండస్ట్రీలో పెద్దగా మార్పులేం రాలేదు. అలానే కష్టపడుతున్నారు. అప్పటి హీరోస్ అందరం బాగానే ఉండేవాళ్లం. ఇప్పుడు యంగ్ హీరోస్ కూడా బావుంటున్నారు. మహేశ్, ఎన్టీఆర్, చరణ్ వీళ్లందర్నీ చూస్తూనే ఉన్నాం కదా. మా వాడు (ప్రభాస్) కూడా అందరితో బావుంటాడు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అని అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు. ‘సాహో’ సినిమా తర్వాత కచ్చితంగా ఉంటుంది. ► ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి జాతీయంగా కాదు అంతర్జాతీయంగా పెరిగింది. అందరూ మన సినిమాలవైపు చూస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ► ‘సాహో’ సినిమా చాలా భారీ లెవల్లో తీస్తున్నారు. మొన్నామధ్య దుబాయ్ వెళ్లి ఫైట్ సీన్స్ తీశారు. సినిమా చాలా బాగా వస్తోందట. ► కన్నడలో అంబరీష్ చనిపోవడం నాకు బాధ కలిగించింది. ఆరోగ్యం బాలేనప్పుడు కూడా చాలాసార్లు కలిశాను. వాణ్ని కన్నడలో రెబల్ స్టార్ అంటారు. నా పిక్చర్స్ కొన్ని రీమేక్ కూడా చేశాడు. ‘గురువుగారు’ అని పిలుస్తుంటాడు నన్ను. -
కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠమే: మాయావతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన 63వ జన్మదిన వేడుకలను మంగళవారం లక్నోలో జరుపుకున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. దేశంలో పేదరికం పెరుగుదలకు బీజేపీ, కాంగ్రెస్ పాలకులే కారణమని ఆమె మండిపడ్డారు. రానున్న లోక్‌సభ ఎన్నిలల్లో బీజేపీని ఓడించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమనీ, గతాన్ని మర్చిపోయి ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు విజయం కోసం శ్రమించాలని మాయావతి కోరారు. వచ్చే ఎన్నికల్లో యూపీ ప్రజలు బీజేపీకి పెద్ద గుణపాఠమే చెప్తారని మాయావతి హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగపరుస్తూ ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై జరిపిన సీబీఐ దాడులను రాజకీయ కక్ష్యసారింపు చర్యగా ఆమె వర్ణించారు. సంక్షేమ పథకాలను అమలు చేయ్యలేని మోదీ బహిరంగ సభలు నిర్వహించి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి దేశంలో మతం, కులం ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మోదీ, బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడిన మాయావతి కాంగ్రెస్‌ను సైతం వదలిపెట్టలేదు. ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేవలం బీజేపీకే కాకుండా కాంగ్రెస్‌కు కూడా గుణపాఠం నేర్పాయని గుర్తుచేశారు. దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పాలనతో దేశం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. కాగా కాంగ్రెస్‌ను పక్కన పెట్టి ఎస్పీ, బీఎస్పీలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. నేడు మాయావతి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు పలువరు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. -
పరిపాలనాదక్షుడు మర్రి చెన్నారెడ్డి
పరిపాలనపై సంపూర్ణ అవగాహన, పూర్తి పట్టు ఉన్న చెన్నారెడ్డి 33 ఏళ్లకే మంత్రి కాగలిగారు. సీఎంగా ఉన్నతాధికార వర్గంపై అదుపు, ప్రభుత్వ ఫైళ్లు, పాలనపై లోతైన అవగాహనతో మర్రి పాలన సాగించారు. అధికారులు చెప్పినట్టు సంతకాలు పెట్టకుండా ఫైళ్ళను క్షుణ్ణంగా చదివి, నోటింగ్‌లు రాసి మరీ సంతకం చేసేవారనీ, తనదైన నిర్ణయం తీసుకునేవారనీ ప్రతీతి. అలంకారపూరితమైన గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు సైతం మర్రి నిజమైన అధికారాలున్న నేతగా కనిపించడం, రాజకీయ నేతలా మాట్లాడడం చరిత్రలో భాగమే. ఇంతటి విలక్షణ వ్యక్తిత్వం ఉన్న చెన్నారెడ్డి శత జయంతి నేడు. ఆయన ఆనవాళ్లు తెలుగునాట ఇంకా సజీవంగా నిలిచే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జాడలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ చెక్కుచెదర లేదు. 1969–70 తెలంగాణ ఉద్యమ సారథిగానే మొదట ఆయన తెలుగువారికి పరిచయమయ్యారు. ఉద్యమానికి ముందు, తర్వాత ఆయన కాంగ్రెస్ నేతగా అనేక పదవులు నిర్వహించారు. ఆరో ముఖ్య మంత్రిగా రెండున్నరేళ్లకు పైగా పనిచేసిన పదేళ్ల తర్వాత ఏడాదిపాటు ఇదే పదవి చేపట్టారు. సీఎం పదవిలో కన్నా గవర్నర్ పదవిలోనే ఎక్కువ కాలం పనిచేశారు. పార్టీ నాయకత్వంతో విభేదించి సొంత పార్టీ పెట్టుకోవడానికి వెనుకాడలేదు. ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీతో రాజీపడి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి ఉన్నత పదవులు స్వీకరించడం కూడా చెన్నా రెడ్డి రాజకీయ జీవితంలో భాగమే. ఇందిర కేబి నెట్లో ఉక్కు, గనుల శాఖా సహాయ మంత్రిగా ఉన్న ఏడాది కాలంలో, సీఎంగా ఉమ్మడి ఏపీని పాలించిన రెండుసార్లూ పాలనాదక్షునిగా పేరు తెచ్చుకున్నారు. చెన్నారెడ్డిని మంత్రివర్గం వెలుపలా, వల్లూరి బసవ రాజుని మంత్రివర్గం లోపలా ఉంచితే చిక్కులు తప్ప వని కాంగ్రెస్‌పార్టీకి చెందిన సీనియర్ నేతలు చెప్పు కునేవారు. పరిపాలనపై సంపూర్ణ అవగాహన, పూర్తి పట్టు ఉన్న చెన్నారెడ్డి 33 ఏళ్లకే మంత్రి కాగలిగారు. అసమ్మతి రాజకీయాల కారణంగా సీఎం పదవిలో ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. తాండూరు ఎన్నికతో ఊహించని మలుపు! 1950 నుంచి సాఫీగా సాగిన ఆయన రాజకీయ జీవితం 1967 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త మలుపు తిరి గింది. తాండూరులో స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రామచంద్రరావును ఓడించి నాలుగో సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వెంటనే కాసు కేబినెట్లో మరోసారి మంత్రి పదవి చేపట్టాక మర్రి రాజకీయ జీవితంలో ఊహించని మార్పులు మొద లయ్యాయి. అప్పటి ప్రధాని ఇందిర చెన్నారెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని రాజ్యసభకు నామి నేట్ చేశారు. తాండూరు ఎన్నికల ప్రచారంలో చెన్నా రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయన ఎన్నికను సవాలు చేస్తూ రామచంద్రరావు హైకోర్టుకెక్కారు. హైకోర్టు మర్రి ఎన్నిక చెల్లదని తీర్పు ఇస్తూ ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించింది. సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్ధించడంతో 1968లో చెన్నారెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి చట్ట సభలకు దూరమయ్యారు. 1956లోనే ఆంధ్రరాష్ట్రంతో తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన నేప థ్యం చెన్నారెడ్డిది. తెలంగాణ ఉద్యమం నడపడానికి వచ్చిన అవకాశంతో ఆయన తన సామర్థ్యాన్ని నిరూ పించుకున్నారు. ఈ ఉద్యమకాలంలో హైదరాబా ద్లో స్థిరపడిన కోస్తా, రాయలసీమ జిల్లాలకు చెందిన వారిపై చెదరుమదురుగా మొదలైన దాడులు చెన్నారెడ్డి సకాల జోక్యంతో నిలిచిపోయాయని ఆయ నకు పేరొచ్చింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలం గాణ ప్రజా సమితి(టీపీఎస్) తెలంగాణలోని 14 సీట్లలో పది గెలుచుకోవడానికి చెన్నారెడ్డి నాయ కత్వం తోడ్పడింది. తెలంగాణ ప్రజల మనోభావా లను గమనించిన ఇందిర పిలుపు మేరకు టీపీఎస్‌ను మర్రి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1974లో అనర్హతా కాలం ముగిశాక ఇందిర సూచన మేరకు గవర్నర్ పదవి చేపట్టారు. ఇందిర పిలుపు మేరకు యూపీ గవ ర్నర్ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్(ఐ) అధ్యక్షుడయ్యారు. మళ్లీ పదేళ్ల తర్వాత మేడ్చల్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్–ఐ మెజారిటీ సాధించడంతో ఆయన తొలి సారి సీఎం పదవి సాధించారు. పాలనలో వినూత్న పోకడలు చెన్నారెడ్డి సీఎంగా ఉండగానే హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధి వేగం పెరిగింది. ఎవరూ ఊహించని రీతిలో 40 ఏళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల పనివారం ప్రవేశపెట్టారు. ఆచరణలో ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో పాత పద్ధతిని పునరుద్ధరించడానికి చెన్నారెడ్డి వెనుకా డలేదు. ఇందిరాగాంధీ ప్రధాని పదవిలో లేనప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం చెన్నారెడ్డికి ఎక్కువ అధికారం, స్వేచ్ఛ అనుభవించే అవకాశం కల్పిం చింది. దాంతోపాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యత కూడా మర్రిపైనే పడింది. ఈ నేపథ్యంలో ఆయన సర్కారుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. గన్నవరం నుంచి శాసన సభకు ఎన్నికైన సీపీఎం నేత పుచ్చలపల్లి సుందర య్యను రాష్ట్ర డ్రయినేజీ బోర్డు చైర్మన్ పదవి తీసు కునేలా మొదట మర్రి ఒప్పించగలిగారు. తెలుగు నాట వేళ్లూనుకున్న కాంగ్రెస్ వర్గ రాజకీయాలను అధికారం, తెలివితేటలతో ఆయన అదుపు చేయగలి గారు. 1980 జనవరి పార్లమెంటు మధ్యంతర ఎన్ని కల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి ఇందిర మరో సారి ప్రధాని అయ్యాక చెన్నారెడ్డికి ఇబ్బందులు ఎదు రయ్యాయి. రాష్ట్ర కేబినెట్లోని, కాంగ్రెస్‌లోని అస మ్మతి వర్గానికి అధిష్టానం అండ దొరికింది. అసమ్మ తివర్గంలో మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరిపో యారు. ఫలితంగా చెన్నారెడ్డి అదే ఏడాది అక్టోబర్‌లో పదవికి రాజీనామా చేశారు. మళ్లీ గవర్నర్ పదవి పంజాబ్‌లో ఉగ్రవాదం పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ పదవిని చేపట్టాలని ఇందిర ఆదేశించడంతో చెన్నారెడ్డి చండీగఢ్ వెళ్లిపోయారు. తర్వాత కొన్నా ళ్లకు కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి తన అనుచ రులతో నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు. 1984 డిసెంబర్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో అనూహ్యంగా కరీంనగర్ నుంచి పార్లమెంటుకు పోటీచేసి మర్రి చొక్కారావు చేతిలో ఓడిపోయారు. తర్వాత రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యాక కాంగ్రెస్‌లో మళ్లీ చేరిపోయారు. 1978లో మాదిరిగానే 1989 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమ యంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం చెన్నారెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అప్పగించగా ఆయన పార్టీని విజయ పథంలో నడిపించారు. 1989 డిసెం బర్లో సీఎం పదవిని రెండోసారి అధిష్టించిన మర్రి ఏడాదికే అసమ్మతి మంటల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత ఎన్నికల రాజకీయాలకు దూరమై మరణించే వరకూ ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ పదవిలోనే కొనసాగారు. సీఎంగా ఉన్నతాధికార వర్గంపై అదుపు, ప్రభుత్వ ఫైళ్లు, పాలనపై లోతైన అవగాహనతో మర్రి పాలన సాగించారు. అధికా రులు చెప్పినట్టు సంతకాలు పెట్టకుండా ఫైళ్ళను క్షుణ్ణంగా చదివి, నోటింగ్‌లు రాసి మరీ సంతకం చేసేవారనీ, తనదైన నిర్ణయం తీసుకునేవారనీ ప్రతీతి. అలంకారపూరితమైన గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు సైతం మర్రి నిజమైన అధికారాలున్న నేతగా కనిపిం చడం, రాజకీయ నేతలా మాట్లాడడం చరిత్రలో భాగమే. ఇంతటి విలక్షణ వ్యక్తిత్వం ఉన్న చెన్నారెడ్డి శత జయంతి నేడు. ఆయన ఆనవాళ్లు తెలుగునాట ఇంకా సజీవంగా నిలిచే ఉన్నాయి. (నేటి ఉదయం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో డాక్టర్ ఎం. చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్స్‌లో శత జయంతి ఉత్సవం) నాంచారయ్య మెరుగుమాల‘ 99121 99385 -
‘నా భార్య, కొడుకు ఇద్దరికి 16’
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుట్టిన రోజు నేడు. ఆమె ఈరోజు 32వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సానియా భర్త షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తన భార్య సానియా, ముద్దుల కుమారుడు ఇజహాన్‌తో కలసి ఉన్న ఫోటోను షేర్ చేశారు షోయబ్. Celebrations! My son turns 16 days old on the same day my wife turned 16 years young, and my mother in law too. Life set hey Alhumdulilah Alhumdulilah Alhumdulilah 🙏🏼 pic.twitter.com/jVxPdRk9KV — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) November 15, 2018 ‘ఈ రోజుతో నా కుమారునికి 16 రోజులు.. నా భార్యకు 16 ఏళ్లు నిండాయి. నా అత్తగారికి’ కూడా అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటో నెటిజన్లను ఫిదా చేస్తోంది. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోకు వేల కొద్ది లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. కాగా ఈ ఏడాది అక్టోబర్ 30 న సానియా - షోయబ్‌లకు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. Thank you to everyone who made my birthday soo sooo special ❤️ I had an awesome day with my loved ones and all your wishes made my day even better .. thank you and I love you all right back 💖 pic.twitter.com/bx6jQl6WCk — Sania Mirza (@MirzaSania) November 15, 2018 -
హ్యాపీ బర్త్‌డే రన్‌మెషీన్
సమకాలీన క్రికెట్లో బ్యాట్స్‌మెన్ అంతా ఒకవైపు.. విరాట్ కోహ్లి ఒక్కడే ఒక వైపు.. కొన్నెళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే ‘మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లి ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్ అనేంతా.. ఒకప్పుడు సచిన్.. ఇప్పుడు కోహ్లి అని అందరూ చెప్పుకునేంతా.. ఇరువై తొమ్మిదేళ్లకే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడుగా అవతరించాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రన్‌మెషిన్.. 30వ ఏట అడుగెడుతున్న సందర్భంగా అటు అభిమానులు.. ఇటు ప్రేక్షకులు విషెస్‌తో పోటీపడ్డారు. ‘ఈ రోజు దంతేరాస్.. ఈ ఏడాదంతా నీకు రన్‌తేరాస్ కావాలని ఆశిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే కోహ్లి’- వీరేంద్ర సెహ్వాగ్ (దంతేరాస్ పర్వదినం రోజు ఏదైనా వస్తువు కొంటే శుభం కలుగుతుందని నార్త్ ఇండియన్స్ నమ్మకం. ఈ పర్వదినం రోజే 30వ ఏట అడుగుపెడుతున్న కోహ్లి ఈ ఏడాది బ్యాట్‌తో పరుగులు సాధించాలని సెహ్వాగ్ ఆకాంక్షించాడు) ‘మరిన్నీ విజయాలందించే ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటూ పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి జన్మదిన శుభాకాంక్షలు’- బీసీసీఐ ( టీమిండియా ఆటగాళ్లు ధోని, జడేజా, బుమ్రాలు కోహ్లికి విషెస్ చెప్పిన ఓ వీడియోను సైతం బీసీసీఐ ట్వీట్ చేసింది.) ‘ఈ ఏడాది మరిన్ని విజయాలందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే విరాట్’- వీవీఎస్ లక్ష్మణ్ ‘చేతిలోని మ్యాజిక్ స్టిక్‌తో మనందరి దృష్టిని ఆకర్షిస్తూ.. స్థిరత్వానికే కొత్త అర్థం చెప్పిన రథ సారథి.. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా.. హ్యాపీ బర్త్‌డే కోహ్లి’- మహ్మద్ కైఫ్ ‘జన్మదిన శుభాకాంక్షలు బ్రదర్.. ఈ ఏడాది నీకు అంతా మంచే జరగాలనే కోరుకుంటున్నా’.- వృద్ధిమాన్ సాహా ‘బ్రో.. నీ జీవితంలో మరిన్నీ జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటున్నా’- మహ్మద్ షమీ On this Dhanteras, wish you a year that is again filled with Runteras. #HappyBirthdayVirat pic.twitter.com/f09gppLZON — Virender Sehwag (@virendersehwag) 5 November 2018 #HappyBirthdayVirat Wishes galore for the Indian captain from the team as he celebrates his 30th Birthday. Here's to many more match-winning moments and 🏆🏆 in the cabinet. Full video here - https://t.co/MCnjtfoIuD pic.twitter.com/Yr83r8LPyS — BCCI (@BCCI) 5 November 2018 Wishing @imVkohli lots of success and fulfilment in the coming year. #HappyBirthdayVirat pic.twitter.com/2zuTK0mpOz — VVS Laxman (@VVSLaxman281) 5 November 2018 -
పుట్టినరోజున ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు వద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయొద్దని మంత్రి కె.తారకరామారావు అభిమానులను కోరారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే నగరంలో అక్కడక్కడ పెట్టిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్లను కోరారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికలు, టీవీలకు ఇచ్చే ప్రకటనల ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేయాలని పిలుపునిచ్చారు. పూల బొకేలు, ఫ్లెక్సీలకు అయ్యే చిన్న మొత్తాలను సైతం సీఎం సహాయ నిధికి పంపించాలని కోరారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని కోరారు. -
చరణ్ అంకుల్.. ఉప్సీ ఆంటీ..!!
‘థ్యాంక్యూ చరణ్ అంకుల్ అన్డ్ ఉప్సీ ఆంటీ ఫర్ ది లిటిల్ బర్డ్స్! దే ఆర్ సో క్యూట్. హ్యాపీ బర్త్‌డే ఉప్సీ ఆంటీ!’. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారాల కూతురు సితార ముద్దుముద్దుగా పలికిన మాటలివి. జూలై 20న సితార పుట్టినరోజు. మొన్న తన ఆరవ పుట్టినరోజు జరుపుకున్న సితారకు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన చిన్న చిన్న పక్షులను బహుమతులుగా పంపించారట. వాళ్లకు థ్యాంక్స్ చెబుతూ సితార ఒక వీడియో చేసింది. ఆ వీడియోను మహేశ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సితారకు చాలా చిన్నప్పట్నుంచే సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉంది. సితార పుట్టినరోజు వచ్చిందంటే, మహేశ్ పుట్టినరోజు వచ్చినట్టుగానే ట్విట్టర్లో బర్త్‌డే ట్రెండ్ నడుస్తుంది. అలాగే ఈసారి కూడా సితార బర్త్‌డే ట్విట్టర్లో ట్రెండింగ్‌గా నిలిచింది. ముఖ్యంగా సితార వీడియోకు వేలల్లో రీట్వీట్స్ వచ్చాయి. సితార పుట్టినరోజునే ఉపాసన పుట్టినరోజు కూడా! వీడియో చివర్లో ‘హ్యాపీ బర్త్‌డే ఉప్సీ ఆంటీ!’ అని సితార పలకడం వీడియోకు మరింత క్యూట్‌నెస్ తెచ్చిపెట్టింది. మహేశ్, రామ్‌చరణ్‌ల ఫ్రెండ్షిప్కు అభిమానులు కూడా ముచ్చటపడిపోవడం విశేషంగా చెప్పుకోవాలి! -
ప్రియాంక చోప్రా వైట్ డ్రస్ ధర అక్షరాల...
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పాప్ సింగర్, హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌లు తమ ప్రేమ వ్యవహారంతో అందరి దృష్టిని ఆకర్షించారన్నది అక్షరసత్యం. గతకొద్ది కాలంగా పెళ్లిళ్లలో, పుట్టినరోజు వేడుకల్లో, రెస్టారెంట్లలో ఇలా తరచూ జంటగా దర్శనమిస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో వీరిద్దరికీ పెళ్లి జరగబోతోందని, ఇరుకుటుంబాలకు వీరి పెళ్లి సమ్మతమేననే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా దీనిపై ప్రియాంక కానీ జోనాస్ కానీ స్పందించకపోవటం గమనార్హం. అసలు విషయానికొస్తే ప్రియాంక ఇప్పుడు ఖరీదైన ఫ్యాషన్‌కు ఐకాన్‌గా మారింది. మొన్నామధ్య ఈ అమ్మడు రూ. 4లక్షలు విలువ చేసే బ్యాగ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. జూలై 18న ప్రియాంక తన పుట్టిన సందర్భంగా ఓ వైట్ స్కర్ట్‌లో ప్రియుడు నిక్‌తో దర్శనమిచ్చిన సంగతి విధితమే. కాగా ఇప్పుడు ఆ వైట్ డ్రస్ ధర దాదాపు 2లక్షలని తెలిసి నెటిజన్లు నోర్లు వెల్లబెడుతున్నారు. ‘‘ బాల్మెయిన్ బటన్డ్ మాక్సీ స్కర్ట్’’, ‘‘వైనస్ వైట్ ములస్’’ ఈ రెండింటి ధర 1850, 895 డాలర్లు అంటే మన కరెన్సీలో అయితే 1,86,660రూపాయలు. గ్లోబల్ స్టార్ కదా.. ఏది చేసినా ఖరీదుగానే ఉంటుంది.. అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
ధోని వల్లే నీ కెరీర్ ముగిసింది.. సెహ్వాగ్ కౌంటర్!
హైదరాబాద్ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు జట్టులోకి యువ ఆటగాళ్లను తీసుకోవాలని బీసీసీఐకి ఓ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు ధోని కొంతమంది సీనియర్ క్రికెటర్ల ప్రదర్శనను బహిరంగంగానే వ్యతిరేకించాడు. అయితే టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్ ధోని వల్లే ముగిసిందని అతని అభిమానులు బలంగా నమ్ముతారు. ఈ విషయంలో సెహ్వాగ్ ఎన్నోసార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. 2007 టీ20 ప్రపంచకప్ పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో సెహ్వాగ్‌ను పక్కనబెట్టి, యూసఫ్ పఠాన్ తీసుకోవడంతో మొదలైన ఈ ప్రచారం అతను జట్టులో చోటు కోల్పోయి.. రిటైర్మెంట్ ప్రకటించినా కూడా జరుగుతూనే ఉంది. ధోని నిర్ణయాల కారణంగానే సెహ్వాగ్ జట్టులో చోటు కోల్పోయాడని అతని అభిమానులు ఇప్పటికి బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. అయితే నేడు 37వ పుట్టినరోజు జరుపుకుంటున్న ధోనికి సెహ్వాగ్ తనదైన శైలిలో విషెస్ తెలియజేశాడు. ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జీవితం ఇప్పటి కంటే ఇంకా సంతోషంగా ఉండాలి. నీ స్టంపింగ్ కంటే జీవితంలో నువ్వు సాధించే విజయాలే వేగంగా ఉండాలి. ‘ఓం ఫినిషాయ నమః!’ అని ఫేస్బుక్, ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు ఫేస్బుక్లో ఓ సెహ్వాగ్ అభిమాని ‘సెహ్వాగ్ సర్ కెరీర్‌ను నాశనం చేసిన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని తెలిపాడు. దీనికి సెహ్వాగ్ వెంటనే స్పందించాడు. అది చాలా తప్పు కామెంట్ అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. -
ఓం ఫినిషాయ నమః : ధోని బర్త్‌డేపై సెహ్వాగ్
కార్డిఫ్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈరోజు తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇంగ్లండ్‌తో సుదీర్ఘ పర్యటనలో భాగంగా ప్రస్తుతం కుటుంబంతో సహా విదేశాల్లో ఉన్న ధోని పుట్టిన రోజును టీమిండియా క్రికెటర్లు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ధోని భార్య సాక్షితో సహా పలువురు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జీవితం ఇప్పటి కంటే ఇంకా సంతోషంగా ఉండాలి. నీ స్టంపింగ్ కంటే జీవితంలో నువ్వు సాధించే విజయాలే వేగంగా ఉండాలి. ‘ఓం ఫినిషాయ నమః!’- వీరేంద్ర సెహ్వాగ్ #HappyBirthdayMSDhoni . May your life be longer than this stretch and may you find happiness in everything, faster than your stumpings. Om Finishaya Namaha ! pic.twitter.com/zAHCX33n1y — Virender Sehwag (@virendersehwag) 6 July 2018 ‘హ్యాపీ బర్త్ డే టూ యూ! నువ్వెంత గొప్ప వ్యక్తివో చెప్పడానికి మాటలు సరిపోవు. గత పదేళ్లుగా నీ నుంచి నేనెంతో నేర్చుకుంటున్నాను. ఇదిలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో ప్రేమతో నా జీవితాన్ని ఆనందమయం చేసిన నీకు ధన్యవాదాలు.’ - సాక్షి (ధోని భార్య) ‘500అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రయాణం. నీలాంటి లెజెండ్ పుట్టినందుకు టీమిండియా గర్విస్తోంది. హ్యాపీ బర్త్‌డే బ్రదర్. నాకు స్ఫూర్తి నువ్వే . నీతో ఉన్న అన్ని సమయాలను నేనెప్పుడూ గుర్తు పెట్టుకుంటాను’ - సురేశ్ రైనా ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు ధోనీ. మాకు ఎన్నో ట్రోఫీలు తెచ్చిపెట్టినందుకు నీకు ధన్యవాదాలు’- రవీంద్ర జడేజా -
ధోని బర్త్‌డే స్పెషల్.. పదిలం నీ మెరుపులు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. నేటి(జూలై7)తో 37 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ధోని తన కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. భారత క్రికెట్ జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలు పంచుకున్న ధోని.. భారత జట్టు తరపును 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు సారథిగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఐసీసీ వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టీ 20, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను గెలిచి ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు. ఈ క్రమంలోనే ధోని మెరుపుల్ని ఒకసారి గుర్తు చేసుకుంది. 1. భారత్ తరపున ఆరు వరల్డ్ టీ 20 ఎడిషన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్ 2. అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్ ధోని. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్(664), రాహుల్ ద్రవిడ్(509)లు ఉన్నారు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 9వ ఆటగాడు ధోని. 3. 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 780 ఔట్లలో భాగస్వామ్యమైన ధోని.. ఈ రికార్డు సాధించిన ఓవరాల్ మూడో వికెట్ కీపర్. అతని కంటే ముందు మార్క్ బౌచర్(998), ఆడమ్ గిల్‌క్రిస్ట్(905)లు ఉన్నారు. 4. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంపింగ్‌లు వికెట్ కీపర్‌గా ధోని(178) అగ్రస్థానంలో ఉన్నాడు. 5. అంతర్జాతీయ టీ20ల్లో 82 మందిని ఔట్ చేసిన ధోని టాప్‌లో ఉన్నాడు. 6. తొలి టెస్టు, వన్డే సెంచరీలను పాకిస్తాన్‌పై ధోని సాధించగా, ఈ రెండు సందర్బాల్లోనూ 148 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేయడం మరో విశేషం. 7. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అత్యధిక సెంచరీలు చేసిన ఘనత ధోనిది. ఏడో స్థానంలో రెండు శతకాలు నమోదు చేసి ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ధోని ఉన్నాడు. 8. వికెట్ కీపర్‌గా ఉండికూడా అత్యధిక సార్లు బౌలింగ్ చేసిన ఘనత ధోని సొంతం. అతని కెరీర్లో 9సార్లు బౌలింగ్ చేయగా, తొలి వికెట్‌ను 2009లో వెస్టిండీస్‌పై సాధించాడు. 9. 2007లో ఆఫ్రో-ఆసియా కప్‌లో భాగంగా మహేల జయవర్ధనేతో కలిసి ఆరో వికెట్‌కు ధోని 218 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని సాధించాడు. ఇది వన్డేల్లో ఆరో వికెట్‌కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. 10. వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రెండుసార్లు గెలిచిన ఏకైక క్రికెటర్ ధోని. 11.మూడు ఐసీసీ మేజర్ టోర్నమెంట్లను గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్ (వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ). 12. ప్రతీ ఫార్మాట్లోనూ కనీసం 50 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్. 13. వన్డే ఫార్మాట్లో కెప్టెన్‌గా 110 విజయాలు సాధించిన ధోని.. 74 పరాజయాలను ఎదుర్కొన్నాడు. కనీసం 20 వన్డేలకు సారథ్యం వహించిన భారత ఆటగాళ్ల పరంగా చూస్తే గెలుపు-ఓటముల రికార్డులో ధోనినే అత్యుత్తమ గణాంకాలను కల్గి ఉన్నాడు. 14. ఐదు-అంతకంటే ఎక్కువ జట్లు ఆడిన నాలుగు టోర్నమెంట్లను గెలిచిన ఘనత ధోనిది. ఈ ఘనతను సాధించిన కెప్టెన్ల పరంగా చూస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి ధోని సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. 15. ఎనిమిది టెస్టు హోదా కల్గిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను ధోని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ తొమ్మిది టెస్టు హోదా కల్గిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలిచిన వారిలో కెప్టెన్‌గా రికీ పాంటింగ్ ముందున్నాడు. తొమ్మిది టెస్టు దేశాలపై పాంటింగ్ వన్డే సిరీస్‌లను గెలిచాడు. కాగా, బంగ్లాదేశ్‌పై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సాధించడంలో ధోని విఫలం కావడంతో పాంటింగ్ సరసన నిలవలేకపోయాడు. 16. 43 వన్డే సిరీస్లకుకు ధోని సారథిగా వ్యహరించాడు. ఇది భారత్ తరపున అత్యధికం కాగా, ఓవరాల్‌గా నాల్గోది. 17. భారత్ సాధించిన విజయాల్లో వన్డే కెప్టెన్‌గా ధోని యావరేజ్ 70.83గా ఉంది. కనీసం వెయ్యి పరుగుల సాధించిన ఓవరాల్ కెప్టెన్లలో ఇది మూడో అత్యుత్తమ యావరేజ్. ఇక్కడ దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, సచిన్ టెండూల్కర్లు ముందువరుసలో ఉన్నారు. 18. 72 ట్వంటీ 20లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్ ధోని 19. భారత జట్టు 110 వన్డే విజయాలకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. భారత్ తరపున ఇదే అత్యధికం కాగా, ఒక జాతీయ జట్టుకు అత్యధిక వన్డే విజయాలను అందించిన రెండో కెప్టెన్ గా ధోని నిలిచాడు. అగ్రస్థానంలో పాంటింగ్(165) ఉన్నాడు. 20. కెప్టెన్ గా ధోని కొట్టిన సిక్స్లులు 126. ఓవరాల్ కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత ధోనిది. 21. 199 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక భారత్ ఆటగాడు ధోని. ఓవరాల్‌గా మూడో స్థానంలో ఉన్నాడు. 22. అన్ని ఫార్మాట్లలో 331 మ్యాచ్‌లకు ధోని సారథిగా వ్యవహరించాడు. ఇదే ఓవరాల్‌గా అత్యధికం. -
‘సింహం కడుపున సింహమే పుట్టింది’
తండ్రికి తమ్ముడిగా, అన్న హరికృష్ణకు కొడుకుగా నటించారు నందమూరి నటసింహం బాలకృష్ణ. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు తమ్ముడిగా అన్నదమ్ముల అనుబంధం సినిమాలో నటించారు బాలకృష్ణ. ఈ సినిమాలో బాలకృష్ణ నటనను చూసి ‘సింహం కడుపున సింహమే పుట్టింది’ అని ఏఎన్నార్ అన్నారట. అవును నిజమే సింహం పేరు వింటే మనకు గుర్తొచ్చేది నందమూరి నటసింహమే. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సింహా ఇలా ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలతో తన నట విశ్వరూపాన్ని చూపారు. అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. బాలనటుడిగా తండ్రి ఆధ్వర్యంలోనే నటిస్తూ, నటనలోని మెలుకువలు తెలుసుకున్నారు బాలకృష్ణ. నందమూరి వంశాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ నిలబెడితే, ఇంతవరకు ఆ పేరును కాపాడుకుంటూ వచ్చారు బాలకృష్ణ. 1974లో తాతమ్మ కల సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఇప్పటి వరకు వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఈ శతాధిక నటుడు తన వందో సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేసి విజయాన్ని అందుకున్నారు. జానపదం, ఫ్యాక్షన్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు బాలయ్య. వారసత్వ హీరోగా వచ్చినా.. అతి కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారు. సగటు ప్రేక్షకుడు కూడా ఇష్టపడేది బాలయ్య డైలాగ్స్. ఇక బాలయ్య డైలాగ్‌లు చెపుతూ ఉంటే అభిమానులకైతే పూనకాలే. బాలయ్య మార్క్ డైలాగ్‌లకు బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. నేటి తరంలో పౌరాణిక పాత్రలు వేయాలంటే ఒక్క బాలయ్య బాబు మాత్రమే వేయగలరు, చేయగలరు అనేంతలా అలరించారు. అభిమన్యుడు, పాండురంగడు, నారదుడు, సిద్ద, కృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణ దేవరాయలు, రాముడు ఇలా ఎన్నో పాత్రల్లో నటించారు. బాలయ్య హీరోగా తన కెరీర్‌ను 1984లో ‘సాహసమే జీవితం’ అంటూ మొదలుపెట్టగా, ‘మంగమ్మగారి మనవడు’గా తిరుగులేని హిట్ కొట్టారు. బాలయ్య కెరీర్లో ఎన్నో మరుపురాని చిత్రాలు ఉన్నాయి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ సినిమాలు తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయే చిత్రాలు. ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహానాయడు’ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులకు దారిని చూపాయి. ‘సింహా’, ‘లెజెండ్’ సినినిమాలతో తన నటవిశ్వరూపాన్ని చూపారు. బాలయ్య కోసమే కొన్ని డైలాగ్‌లు పుట్టాయా అన్నట్లు ఉంటుంది. వాటిని ఆయన చెబితేనే అందం. వాటి కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు కోకొల్లలు. బాలయ్య సినిమా వస్తోందంటే బాలయ్యకు మాత్రమే సాధ్యమయ్యే డైలాగ్ డెలీవరిలో సంభాషణలు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండాల్సిందే. మళ్లీ బాలయ్య తన నటవిశ్వరూపాన్ని ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారు. నటసార్వభౌముడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ సినిమాలో బాలయ్య దాదాపు అరవై పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. రాముడిగా, కృష్ణుడిగా, కర్ణుడిగా, విశ్వామిత్రుడిగా, రావణాసురునిగా ఇలా ఎన్టీఆర్ చేసిన గొప్ప పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. సో.. ఈ పాత్రల్లో బాలయ్య మరోసారి తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకోబోతున్నారు. మరిన్ని విజయాలు రావాలని, ఇంకా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తూ... నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. -
‘ఇళయరాజా.. మణిరత్నా’ల్లాంటి పాటలు
దక్షిణాది సినీ ప్రపంచానికి ధృవతారలు వాళ్లు. ఒకరు దర్శకదిగ్గజమైతే, మరొకరు స్వరచక్రవర్తి. అందుకే వారి కాంబినేషన్లో వచ్చిన ప్రతీ సినిమా ఓ ఆణిముత్యంగా మిగిలిపోయింది. ప్రతీ సినిమా.. అందులోని పాటలు ‘మణిరత్నం’లా నిలిచిపోయాయి. ఈ తరానికి ఒకరు దర్శకత్వానికి మార్గదర్శకంగా మారారు. మరొకరు స్వరాల కొత్త అందాలు చూపారు. ఇద్దరూ ఇద్దరే. వీరిద్దరు ఒకే రోజు జన్మించడం వల్ల వీరిద్దరి భావాలు కలిసిపోయాయేమో. ఈ దర్శకుడి ఆలోచనలకు తన సంగీతంతో ప్రాణం పోశారు రాజా. సినీ ప్రపంచంలో వీరిద్దరు ఎప్పటికీ నిలిచిపోతారు. భారతీయ సినీ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్న లెజెండ్స్ మణిరత్నం, ఇళయారాజాల పుట్టినరోజు నేడు. సమాజాన్ని ప్రతిభింబించే సినిమాలను చేయడం మణిరత్నం వంతు. ఆ సమాజాన్ని సైతం తన సంగీతంతో మాయ చేయడం ఇళయరాజా వంతు. మణిరత్నం తీసిన ప్రతీ సినిమా ఈ తరానికి ఒక దిక్సూచి లాంటిదే. అంజలి, గీతాంజలి, నాయకుడు, బొంబాయి, రోజా, ఇద్దరు, సఖి ఇలా ఎన్నో మరుపు రాని చిత్రాలను అందించారు. రోజా సినిమాకు ముందుకు వరకు మణిరత్నం సినిమాలకు ఇళయరాజానే సంగీతం సమకూర్చేవారు. ఆ సినిమాలు ప్రేక్షకుల్లో గుర్తుండిపోవడానికి ఇళయరాజా సంగీతం కూడా ఓ కారణమే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలోని పాటలన్నీ సంగీత ప్రియులకు ప్రియమైనవే. ‘సింగారాల పైరుల్లోనా బంగారాలే పండించాలన్నా’.. ‘అరె చిలకమ్మా చిటికేయంటా... నువ్వు రాగాలే తీయాలంటా’ అంటూ హుషారెత్తించే పాటలను అందించాలన్నా... ‘ఆడజన్మకు ఎన్ని శోకాలో..’, ‘నీ గూడు చెదిరింది.. నీ గుండె పగిలింది.. ఓ చిట్టి పావురమా...’ అంటూ కంటతడిపెట్టించగలరు. వీరిద్దరు ఎన్నో మధుర గీతాలకు ప్రాణం పోశారు. ‘నిన్నుకోరి వర్ణం వర్ణం.. సరి సరి కలిసేనే నయనం నయనం’, ‘ఒక బృందావనం సోయగం’ అంటూ సంగీత ప్రియులు ఎన్నటికీ గుర్తుంచుకునే గీతాల్ని అందించారు. ఇలా ఎన్నెన్నో పాటలకు ప్రాణం పోశారు వీరిద్దరు. ఇవన్నీ కూడా శ్రవణానందానికే కాకుండా, దృశ్యకావ్యం గానూ మలిచారు మణిరత్నం. ఇక తెలుగులో నేరుగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఏకైక సినిమా గీతాంజలి. అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమాల్లో గీతాంజలిది ప్రత్యేకస్థానం. ఈ సినిమాలో ఇళయరాజా అందించిన ప్రతి పాట ఒక అద్భుతం. సినీ ప్రముఖులెందరో సోషల్ మీడియా ద్వారా ఈ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
‘తారాజువ్వ’లా.. తారక్ సినీ కెరీర్!
అసలు పేరు ‘నందమూరి తారక రామరావు జూనియర్’...కానీ అభిమానులు మాత్రం ‘యంగ్ టైగర్’గా పిలుచుకుంటారు. మాస్ ఇమేజ్‌కు నిలువెత్తు నిదర్శనంలా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్.. 35వ పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా శనివారం విడుదల చేసిన ‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. ఫస్లుక్లో ఎన్టీఆర్ కత్తి పట్టుకుని, సిక్స్‌పాక్ బాడీతో పవర్ బ్యాంక్‌లా, మాస్ హీరోకు నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తున్నాడు. అయితే ఈ కొత్త లుక్ కోసం తారక్ ఎంతో శ్రమించాడు. ఎంతోమంది బాలీవుడ్ టాప్ హీరోలకు ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేసిన లాయిడ్ స్టీవెన్స్ శిక్షణలో యంగ్‌టైగర్ రాటుదేలాడు. తారక్ ఫిజక్ గురించి మాట్లాడుకోవాలంటే యమదొంగకు ముందు...యమదొంగ తర్వాత అనే చెప్పాలి. ఎందుకంటే యమదొంగ ముందువరకూ ఈ హీరో దాదాపు 100 కేజీల బరువుతో ఉండేవాడు. ఆ తర్వాత 20 కేజీల బరువు తగ్గి చాలా స్టైలిష్‌గా తయారయ్యాడు. నేటితో 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ హీరో సినీ జీవితాన్ని ఓ సారి చూద్దామా.... భారీ సినీ నేపథ్యం.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు లేనటువంటి భారీ సినీ నేపథ్యం ఎన్టీఆర్‌కు సొంతం. తాతగారి పేరు పెట్టుకుని యాక్టింగ్, డాన్స్‌తో దూసుకుపోతున్న ఈ హీరో ప్రేక్షకుల హృదయాల్లో ‘జూనియర్ ఎన్టీఆర్’గా స్థానం సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే పరిశ్రమలోకి... బన్నీ, రామ్ చరణ్ కంటే ముందే పరిశ్రమకు వచ్చాడు తారక్. తొలిసారిగా 1996 ‘బాల రామాయణం’ చిత్రంలో రాముడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ ఐదేళ్లలోనే అంటే 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నం.1’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ‘ఆది’ సినిమా తారక్‌లోని మాస్ హీరోను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ యంగ్ టైగర్ కెరీర్ ఆశించినంత బాగా సాగలేదు. అల్లరి రాముడు, నాగ లాంటి రెండు డిజాస్టర్ల తరువాత ‘సింహాద్రి’ రూపంలో జక్కన్నే మరోసారి ఎన్టీఆర్‌కు భారీ విజయాన్ని ఇచ్చాడు. తరువాత అశోక్, సాంబ, నాగ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరోసారి గట్టెక్కించిన జక్కన్న... ఇలా ఆరేళ్లపాటు కొనసాగిన తారక్ సిని ప్రస్థానాన్ని ‘దర్శక ధీరుడు’ రాజమౌళి మరోసారి మలుపు తిప్పాడు. 2007లో రాజమౌళి తారక్‌తో ‘యమదొంగ’ సినిమాను తీసాడు. ఈ సినిమా కోసం జూనియర్ 20 కేజీల బరువు తగ్గి, కొత్త లుక్‌తో ఆకట్టుకోవడమే కాక నటనలో తాతకు తగ్గ మనవడిగా నిరుపించుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ యమగోలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపితే.. తాతకు తగ్గ మనవడిగా జూనియర్ యమదొంగతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాడు. ‘టెంపర్’ చూపించాడు.... యమదొంగ తర్వాత అదుర్స్, బృందావనం లాంటి సినిమాలతో ఘనవిజయాలు సాధించిన ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాతో మరోసారి సరికొత్తగా తనని తాను ఆవిష్కరించుకున్నాడు.. అవినీతి పోలీసు అధికారి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పూరీ, ఎన్టీఆర్లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఎన్టీఆర్ యాక్టింగ్, పూరి మార్క్ పంచ్ డైలాగ్‌లతో టెంపర్ మంచి విజయాన్ని అందుకుంది. జనతా గ్యారేజ్‌తో కొత్తగా... టెంపర్ తర్వాత సినిమాల ఎంపికలో తారక్‌లో చాలా మార్పు వచ్చింది. రొటిన్‌కు భిన్నంగా, కథాబలం ఉన్న చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే సమయంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇలా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ సినిమాలతో వరుస విజయాలందుకున్నాడు తారక్. ప్రస్తుతం ఈ యంగ్‌టైగర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. -
విజయ్ బర్త్‌డే స్పెషల్: ‘టాక్సీవాలా’ టీజర్
‘పెళ్లి చూపులు’తో హిట్ కొట్టి అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డిలో తన నటనకు టాలీవుడ్ మొత్తం ఫిదా అయ్యింది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో వచ్చిన స్టార్డమ్... విజయ్‌కు ఆఫర్స్‌ను తెచ్చిపెట్టాయి. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ప్రస్తుతం విజయ్ టాక్సీవాలా, నోటా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే టాక్సీవాలా సినిమా కాన్సెప్ట్ జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ‘ద డ్రీమ్బిహెండ్ ద టాక్సీవాలా’ అంటూ ఓ వీడియోను రిలీజ్చేశారు. జనాలు కూడా ఈ వీడియోను బాగానే రిసీవ్ చేసుకున్నారు. నేడు విజయ్పుట్టిన రోజు సందర్భంగా టాక్సీవాలా టీం ప్రత్యేకంగా టీజర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా2 సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. -
మే 4న డైరెక్టర్స్ డే
మే 4... దర్శకరత్న డా. దాసరి నారాయణరావు పుట్టినరోజు. నూట యాభైకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. దాసరి భౌతికంగా దూరమైనా తాను అందించిన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. మే 4న ఆయన జయంతిని పురస్కరించుకుని ఆ రోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించింది తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం. ‘‘స్వర్గీయ దాసరి నారాయణరావుగారి జయంతి సందర్భంగా మే 4న ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో వేడుక నిర్వహించనున్నాం. తెలుగు దర్శకుల సంఘం సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ తెలిపారు. -
పద కవితా పితామహుని పుట్టిన రోజు
తెలుగులో తొలి వాగ్గేయకారుడు, పదకవితా పితామహ బిరుదాంకితుడు, దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు అన్నమయ్య. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలం నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని వైష్ణవుల నమ్మకం. ‘చందమామ రావే జాబిల్లి రావే’ ‘జో అచ్యుతానంద జో జో ముకుందా’ అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రం హాయిగా నిద్ర పోతారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనంటూ ఆయన రచించిన తందనానా పురే తందనానా అనే కీర్తన ఎప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉంటుంది. అన్నమయ్య జయంతినాడు ఆయన రచించిన కొన్ని కీర్తనలనైనా మనసారా పాడుకోవడం, ఆయనను స్మరించుకోవడం శ్రేయోదాయకం. (వైశాఖ శుద్ధ పౌర్ణమి అన్నమయ్య జయంతి) -
నా సెంచరీ ఆమెకు అంకితం: గేల్
మొహాలి : క్రిస్ గేల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఐపీఎల్- 2018 లో మొదటి సెంచరీని గేల్ సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో గేల్ విధ్వంసం సృష్టించాడు. గేల్ 1 ఫోర్, 11 సిక్స్‌లతో 63బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో సెంచరీ అనంతరం తనదైన రీతిలో గేల్ బ్యాట్‌తో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ రోజు(శుక్రవారం) గేల్ కుమార్తె క్రిసాలినా పుట్టిన రోజు. నిన్న మ్యాచ్‌లో సాధించిన సెంచరీని గేల్ తన కుమార్తె క్రిసాలినాకు పుటినరోజు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గేల్‌ను వరించింది. అనంతరం క్రిస్ గేల్ మాట్లాడుతూ.. ‘నా సెంచరీని నా కుమార్తె క్రిసాలినాకు అంకితం ఇస్తున్నాను. శుక్రవారం(ఏఫ్రిల్ 20న) మా రెండో పాట పుట్టినరోజును జరుపుకుంటోంది. క్రిసాలినా ఇండియాకు రావడం రెండోసారి. పంజాబ్ టీమ్ హోమ్‌గ్రౌండ్‌లో సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంద’ని గేల్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 15 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన విషయం విదితమే. టి20లో గేల్ మొత్తం 21 సెంచరీలు చేశాడు. ఆ తర్వాత మెకల్లమ్, క్రింగర్, ల్యూక్ రైట్ 7 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డుని (6 సెంచరీలు) తన పేర లిఖించుకున్నాడు ఈ విండీస్ వీరుడు. -
ప్లీజ్ నన్ను విష్ చెయ్ నాగ్
ఒకప్పుడు తెలుగు సినిమాకు గాడ్‌ఫాదర్. ఇప్పుడు మాత్రం టాలీవుడ్ మీడియాకు టైంపాస్. అతడు మాట్లాడితే వివాదమే. సినిమాలు తీస్తే వివాదమే. అతడే రామ్ గోపాల్ వర్మ. సంచలనాలకు కేరాఫ్. వివాదాలకు మారు పేరు ఆర్జీవీ. ఎన్నో వివాదాల పుట్టుకకు కారణమైన ఆర్జీవీ పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 7). టాలీవుడ్లో అప్పటిదాక ఉన్న మూసధోరణిని పక్కన పెట్టి, తెలుగు తెరకు కొత్త కథనాన్ని నేర్పించిన వాడు ఆర్జీవీ. శివ సినిమాతో టాలీవుడ్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. తెలుగు సినిమా శివకు ముందు శివకు తరువాత అనే స్థాయిలో తన మార్క్ చూపించారు వర్మ. చాలా ఏళ్ల తర్వాత ఆర్జీవీ నాగార్జున కాంబినేషన్ మళ్లీ సెట్ అయింది. ‘ఆఫీసర్’ సినిమాతో మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత అఖిల్ అక్కినేని హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. ఆర్జీవీ బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమాకు సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం( ఏప్రిల్ 9) ఉదయం పది గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. తనకు బర్త్‌డే విషెస్ నచ్చవనీ, కానీ...ప్లీజ్ నాగ్ నన్ను విష్ చెయ్ అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ప్రతీ విషయంలో తనకు నచ్చిన విధంగా రియాక్ట్ అవ్వడం ఆర్జీవీ స్టైల్. మొన్నామధ్య జీఎస్టీ అంటూ సంచలనం సృష్టించి వేడి రగిల్చారు. కడప వెబ్ సిరీస్ అంటూ ఇంకో బాంబ్ పేల్చారు. ఇలా వివాదాలను ఇంటి పేరుగా మార్చుకుని ఒక ఐకాన్‌గా మారిపోయారు. సాధారణంగా వేడుకలకు దూరంగా ఉండే వర్మ, తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీ మేస్ట్రోకి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఆర్జీవీ జీఎస్టీని అభినందించిన హరిణి ఎలిజబెత్ లాంటి వారు ట్విటర్లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Here’s the teaser announcement of my most ambitious film #Officer with @iamnagarjuna 9th April 10 Am..Hey Nag I normally hate anyone wishing me Happy Birthday ..But please do wish me 🙏 pic.twitter.com/0z9o8xI5Gv — Ram Gopal Varma (@RGVzoomin) 7 April 2018 -
31 ఏళ్లు...31 మొక్కలు
బర్త్‌డే వస్తుందంటే చాలు! ఎప్పుడు? ఎక్కడ? ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలో ప్లాన్ చేసుకోవడం సహజం. కొంతమంది మాత్రం సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. వాళ్లలో కంగనా రనౌత్ ఒకరు. ఈవిడగారి రూటే సెపరేటు. ఎందుకంటే బర్త్‌డే సందర్భంగా ఆమె స్వయంగా గోతులు తవ్వారు. దేవుడా... ఏంటిది అనుకుంటున్నారా? ఆమె గోతులు తవ్వింది మంచి పనికే. మొక్కలు నాటడానికి. శుక్రవారం (మార్చి 23) కంగనా బర్త్‌డే. 31వ వసంతంలోకి అడుగుపెట్టారామె. అందుకే మనాలీలో ఉన్న తన ఇంటి చుట్టుపక్కల వారం రోజుల నుంచి 31 మొక్కలను నాటారు కంగనా. అంటే.. సంవత్సరానికో మొక్క అన్నట్లు లెక్క. విశేషం ఏంటంటే ప్రపంచ వాతావారణ శాస్త్ర దినోత్సవం కూడా మార్చి 23నే. సీన్ భలే కనెకై్టంది కదూ! బర్త్‌డే సందర్భంగా కంగనా మాట్లాడుతూ– ‘‘ఈ బర్త్‌డే సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నాను. పియానో నేర్చుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ట్రైనర్ దగ్గర పాఠాలు వింటున్నా. మా ఇంట్లో మా అమ్మ కూరగాయలు పెంచుతారు. అలా గార్డెనింగ్ పట్ల నాకు ఇంట్రెస్ట్ మొదలైంది. అందుకే ఈ ఏడాది మొక్కలు నాటాను. గొయ్యి తవ్వి ఒక్కో మొక్క నాటడానికి అరగంటకుపైగా టైమ్ పట్టింది. అఫ్కోర్స్ ఇదొక స్ట్రెస్‌బస్టర్‌లా కూడా అనిపించింది. నా బర్త్‌డే సందర్భంగా టెంపుల్‌కి వెళ్లాను. ఫ్యామిలీ అంతా కలిసి లంచ్ చేశాం’’ అన్నారు. కంగనా టైటిల్ రోల్లో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ షూటింగ్ కంప్లీటైందని సమాచారం. ఆగస్టులో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రకాశ్ కొవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మెంటల్ హై క్యా’ చిత్రంతో బిజీగా ఉన్నారు కంగనా రనౌత్. -
నాని ‘ఐ వాన్న ఫ్లై’ సాంగ్ రిలీజ్
-
‘ఐ వాన్న ఫ్లై’ అంటున్న నాని
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ రోజున తన పుట్టిన రోజు జరపుకుంటున్నారు. నాని ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకం.. హీరోగానే కాదు నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకున్న తరువాత నాని జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు ఇదే. అంతేకాదు నానితో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న, త్వరలో సినిమాలు చేయబోయే నిర్మాణ సంస్థలు కూడా నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాయి. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం చిత్రయూనిట్ పుట్టిన రోజు కానుకగా సినిమాలోని మరో పాటను రిలీజ్ చేసింది ఇప్పటికే ‘దారి చూడు’ పాటతో సంచలనం సృష్టించగా తాజాగా రెండు జంట నేపథ్యంలో వచ్చే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు. హిప్ హాప్ తమిళ సంగీత సారథ్యంలో రేవంత్, సంజిత్ హెగ్డే ఆలపించిన ఐ వాన్న ఫ్లై పాటకు శ్రీజో సాహిత్యమందించారు. -
'స్వింగ్ కింగ్'కు బర్త్ డే విషెస్
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో స్వింగ్ కింగ్‌గా పిలుచుకునే పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నేటితో (ఫిబ్రవరి 5)న 29వ ఒడిలోకి అడుగుపెడుతున్న భువనేశ్వర్‌కు పలువురు క్రికెటర్లు విషెస్ తెలియజేశారు. అందులో మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు ప్రస్తుత టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న మురళీ విజయ్, దేశవాళీ టోర్నీలతో బిజీగా ఉన్న కరుణ్ నాయర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. 'వెరీ హ్యాపీ బర్త్ డే మిస్టర్ 'డిపెండ్బుల్'. బంతితో వికెట్లు, బ్యాట్‌తో పరుగులు చేస్తూ క్రికెట్ కెరీర్లో ముందుకు సాగు' అని సచిన్ ట్వీట్ చేశాడు.' ఫీల్డ్‌లో ప్రతీసారి సత్తాచాటుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న భువీకి హ్యాపీ బర్త్ డే. ఇలాగే మరింతగా మెరవాలని ఆశిస్తున్నా' వీవీఎస్ తన ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నాడు.' హ్యాపీ బర్త్ డే బ్రదర్.. ఈ ఏడాది కూడా స్వింగ్‌తో మరిన్ని ఎక్కువ వికెట్లను సాధించు' అని మురళీ విజయ్ విషెస్ తెలియజేశాడు. ' భువీకి వెరీ హ్యాపీ బర్త్ డే. నీకు ఇదొక అద్భుతమైన రోజు.. రాబోవు కాలంలో మరిన్ని వికెట్లతో సత్తాచాటుతావని ఆశిస్తున్నా' అని కరుణ్ నాయర్ అభినందించాడు. 'మా స్వింగ్ కింగ్‌కు ఇవే మా పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. -
బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అదే!
రీసెంట్ (జనవరి 5)గా బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు దీపికా పదుకోన్. ఆ రోజు ఆమెకు ఎన్నో గిప్ట్స్ వచ్చి ఉండొచ్చు. ఎందరో విషెస్ చెప్పి ఉండొచ్చు. ‘‘అయితే నా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అంటే దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ చెప్పిన ఒక మాట’’ అంటున్నారు దీపికా పదుకోన్. ‘పద్మావత్’ చిత్రం జనవరి 25న రిలీజైన విషయం తెలిసిందే. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య తారలుగా నటించారు. ఈ సినిమా సెన్సార్ జనవరి 5న కంప్లీట్ అయ్యింది. సెన్సార్ బోర్డ్ ఏమంటుందో? రివైజింగ్ కమిటీకి పంపడంటూ సర్టిఫికెట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందేమో అనే టెన్షన్ చిత్రబృందంలో ఉండేది. అయితే సెన్సార్ వైజ్‌గా యూనిట్ ఇబ్బందిపడలేదు. ఇక్కడ విశేషం ఏంటంటే.. దీపికా బర్త్‌డే నాడే ‘పద్మావత్’ సెన్సార్ కంప్లీట్ అయిన విషయాన్ని భన్సాలీ ఫోన్లో దీపికకు చెప్పారట. ‘‘ఫ్యామిలీ మెంబర్స్‌తో బర్త్‌డే పార్టీని ఎంజాయ్ చేస్తున్నాను. ఆ టైమ్‌లో సంజయ్‌లీలా భన్సాలీ ఫోన్ చేసి ‘పద్మావత్’ సెన్సార్ కంప్లీట్ అయిన విషయాన్ని చెప్పారు. మోస్ట్ ప్రిషియస్ అండ్ బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అదే’’ అని దీపికా పదుకోన్ పేర్కొన్నారు. -
సూపర్ హిట్ జర్నీ
పాత్రికేయుడిగా, ‘సూపర్‌హిట్’ పత్రికాధినేతగా, పీఆర్వోగా, నిర్మాతగా బీఏ రాజు జర్నీ సక్సెస్ఫుల్. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త సినిమా విశేషాలను తెలియజేశారు. ‘చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్లీ, వైశాఖం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ. బి దర్శకత్వంలో ఆర్జే సినిమాస్ పతాకంపై బీఏ రాజు మరో సినిమా నిర్మించనున్నారు. ఆయన మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. మా బేనర్లో వచ్చిన సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. గతేడాది నిర్మించిన ‘వైశాఖం’ మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్కు శ్రీకారం చుట్టాం. స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. జూన్‌లో ప్రారంభించాలనుకుంటున్నాం’’ అన్నారు. -
21న జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన పార్టీ శ్రేణులకు ఒక సర్క్యులర్‌ను జారీచేశారు. పోరాట యోధుడు, జననేత అయిన జగన్ స్ఫూర్తితో ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు, రక్తదాన శిబిరాల నిర్వహణతో పాటు ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. పార్టీ నాయకులు ఉదయాన్నే వారి పూజించే ప్రార్థనాలయాలను సందర్శించి ప్రార్థనలు చేయాలన్నారు. జిల్లా కేంద్రాలతో పాటుగా అవకాశమున్న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి శ్రేణులు రక్తదానం చేయాలని పేర్కొన్నారు. రక్తంలేని కారణంగా ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండేందుకు ఈ చర్య దోహదపడుతుందని విజయసాయిరెడ్డి వివరించారు. ఇక జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
'వాటిని కోహ్లి వదులుకున్నాడు'
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్లో ప్రస్తుతం అసాధారణ ఫామ్ లో ఉన్న ఆటగాడు విరాట్ కోహ్లి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులకు వారసుడిగా మన్ననలు అందుకుంటూ దూసుకుపోతున్న క్రికెటర్. బ్యాట్ పట్టుకుంటే చాలు రికార్డులు కొల్లగొట్టడమే లక్ష్యంగా కోహ్లి బ్యాటింగ్ సాగుతోంది. తన మెరుగైన ప్రదర్శన కోసం కొన్నేళ్లక్రితం ఫిట్ నెస్ పైనే ప్రధానంగా దృష్టి సారించిన కోహ్లి.. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈరోజు(నవంబర్ 5) 29వ పుట్టినరోజును కోహ్లి జరుపుకుంటున్న సందర్భంగా అతని గురించి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అనేక విషయాల్ని షేర్ చేసుకున్నాడు. ప్రధానంగా విరాట్ కోహ్లి తన డైట్ విషయంలో పాటించే నిబద్ధత ఏ స్థాయిలో ఉందో రాజ్ కుమార్ వెల్లడించాడు. 'కోహ్లి గురించి చెప్పాలంటే అతనొక భోజన ప్రియుడు. మితిమీరి తింటూ ఉండేవాడు. ముఖ్యంగా బట్టర్ చికెన్, మటన్ రోల్స్ అంటే అతనికి చాలా ఇష్టం. ప్రతీరోజూ అతని ఆహారంలో అవి తప్పకుండా ఉండాల్సిందే. ఇదంతా అతను ఫిట్ నెస్ పై పూర్తిస్థాయి దృష్టి పెట్టకముందు వరకే. ఎప్పుడైతే ఫిట్ నెస్ పై కోహ్లి సీరియస్ గా దృష్టి పెట్టాడో.. అప్పుడే వాటిని వదిలేశాడు. కోహ్లికి ఎంతో ఇష్టమైన బట్టర్ చికెన్, మటన్ రోల్స్ ను తినడం ఆపేశాడు.. ప్రస్తుతం అతని డైట్ లో వాటికి స్థానం లేదు. ప్రధానంగా వేగవంతమైన సింగిల్స్ తీయడానికే ఆ రెండింటిని కోహ్లి త్యాగం చేశాడు. ఒక కెప్టెన్ గా జట్టు సభ్యులుగా ఏమైనా మనం చెప్పాలంటే ముందు మనం పాటించాలనే తత్వం కోహ్లిది. ఇదే విషయాన్నిఒకానొక సందర్భంగో కోహ్లి నాకు చెప్పాడు కూడా' అని క్రికెట్ నెక్స్ట్ తో మాట్లాడిన రాజ్ కుమార్ శర్మ స్పష్టం చేశాడు. ఒక యువ క్రికెటర్ స్ధాయి నుంచి పరుగుల మెషీన్ గా కోహ్లి రూపాంతరం చెందడంలో ట్రైనర్స్ పాత్ర వెలకట్టలేనదన్నాడు. -
మా మామిడిచెట్టుకి డబ్బులు కాస్తే బాగుంటుంది!
‘‘ఈ అమ్మాయి (లక్ష్మీ మంచు) ఎవరు? ‘ఇంట్లో ట్రెడిషనల్‌గా, బయట మోడ్రన్‌గా ఉంటుంది. సడన్‌గా కైలాష్ మానస సరోవర్‡ యాత్రలకు వెళ్తుంది!’ అనే కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంది. మనకి మనుషులను ఓ కేటగిరీలో పెట్టడం అలవాటు. నన్నెవరైనా ఓ కేటగిరీలో పెడితే... దాన్ని బ్రేక్ చేయడం నా అలవాటు. నేను వాటర్ లాంటిదాన్ని. ఎందులోనైనా ఇమిడిపోగలను’’ అన్నారు లక్ష్మీ మంచు. నేడు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా శనివారం లక్ష్మీ మంచు మీడియాతో మాట్లాడారు. ► బర్త్‌డే స్పెషల్ ఏంటి? ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తున్నా. నాన్నగారి (మంచు మోహన్‌బాబు) దగ్గర్నుంచి బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడమనే కాన్సెప్ట్ నేర్చుకున్నా. ఈ రోజుకీ డాడీ బర్త్‌డే అంటే మాకు పెద్ద పండగ. అమెరికాలో కాలేజ్ డేస్‌లోనూ నా సొంత డబ్బులతో గ్రాండ్ పార్టీ ఇచ్చేదాన్ని. ఇప్పుడూ అంతే. ► లాస్ట్ బర్త్‌డేకి, ఈ బర్త్‌డేకి మీ లైఫ్‌లో మీరు గమనించిన స్పెషల్ థింగ్ ఏంటి? నేనింకా బతికున్నా. ఓ నటిగా, ఫిల్మ్ మేకర్‌గా మన చుట్టూ పాజిటివిటీ కంటే ఎక్కువ నెగిటివిటీ ఉంటోంది. ఓ మహిళగా, తెలుగమ్మాయిగా అందరూ నన్నో బాక్స్‌లో ఫిక్స్ చేశారు. నేను సర్కిల్‌లాంటి దాన్ని. బాక్స్‌లో ఎలా ఫిక్స్ అవుతాను? ఎన్ని కష్టా లొచ్చినా... సినిమా బాగున్నా లేకున్నా... నా కలను సాకారం చేసుకోవడానికి ఈరోజు నేను బతికున్నా. ► సినిమాల మధ్య గ్యాప్ వస్తున్నట్టుంది? లాస్ట్ సిన్మా విషయంలో బాధపడ్డా. నాకు చెప్పిన కథ వేరు, తీసిన సిన్మా వేరు. వాళ్ల వ్యక్తిగత రాజకీయాల కోసం నన్ను మోసం చేశారనే ఫీలింగ్. అందుకే, జాగ్రత్తపడి నచ్చిన సినిమాలు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం జెమిని టీవీ కోసం ‘ఫిదా’ అనే షో, యప్ టీవీ కోసం ‘బేబీస్ డే అవుట్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నా. స్టార్స్ లైఫ్‌లో ఒక రోజు ఎలా ఉంటుందనేది ‘ఫిదా’లో చూపించబోతున్నాం. భర్తపై కోపంతో ఓ వారం రోజులు భార్య అతన్ని వదిలేసి వెళ్తే ఏమవుతుంది? అతను పడే టెన్షన్స్ ఏంటి? అనేది క్లుప్తంగా ‘బేబీస్ డే అవుట్’ కాన్సెప్ట్. ‘దొంగాట’ ఫేమ్ వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ అనే కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తూ, పీపుల్స్ మీడియా గ్రూప్ సంస్థ నిర్మించనున్న థ్రిల్లర్ సిన్మా చేయబోతున్నా. ► మీరెప్పుడైనా మీ భర్త (ఆండీ)పై కోపం వచ్చి అలా వెళ్లిన సందర్భాలున్నాయా? కోపం రాని రోజు ఉండదేమో (నవ్వుతూ). భార్యకు భర్తపై కోపం రావడం వెరీ కామన్. ఆయన సాధు జంతువు కాబట్టి ఏదొచ్చినా కామ్‌గా ఉంటారు. కోపం అంటే ఏదో కాదు, పనులు సరిగ్గా జరగనప్పుడు వచ్చే చిన్న ఇరిటేషన్ అంతే. పక్కన ఉన్నోళ్లు నా స్పీడ్ అందుకోకపోతే కోపం వస్తుంది. మళ్లీ... నెక్ట్స్ సెకన్లో ఉండదది. ‘మేము సైతం’ తర్వాత మరింత కామ్‌గా మారా. ► ‘మేము సైతం’ తర్వాత సహాయం కోసం మీ తలుపు తట్టే ప్రజలు ఎక్కువయ్యారట? యస్. కానీ, మా ఇంట్లో మామిడిచెట్టుకి మామిడిపళ్లే కాస్తున్నాయి. డబ్బులు కాస్తే బాగుంటుంది. అందరికీ హెల్ప్ చేసేదాన్ని. ఇంటికి వచ్చినవాళ్లను ఆఫీసుకి పంపిస్తా. ఆఫీసులో మా టీమ్, మేం చేయగలిగిన సహాయాన్ని చేస్తున్నారు. ఒకసారి తిరుమల గర్భగుడిలో దేవుడి దగ్గర ఉన్నప్పుడు ‘అక్కడ దేవుణ్ణి చూశాం. ఇక్కడ దేవతను చూశాం’ అంటే ఎలా ఫీలవ్వాలో తెలీదు. ► అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో మీరు సమస్యలపై స్పందిస్తుంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా? నేనేది మాట్లాడినా పాలిటిక్స్ అంటున్నారు. హిందువులుగా మనం ప్రతి పండగను సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ, రోడ్డును తవ్వేసి పందిరిలు వేయడానికి అనుమతి ఎవరిచ్చారు? వాళ్లు మళ్లీ రోడ్లను బాగు చేస్తారా? నీళ్లలో కలిపే వినాయకుడి కోసం రోడ్లు పాడు చేస్తే, బైకర్స్ మెడలు నొప్పి పెడుతున్నాయి. సిటిజన్‌గా నేను బాధపడినప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తా. మొన్న హైటెక్ సిటీ దగ్గర మామూలుగా 20 నిమిషాల్లో వెళ్లే దూరానికి సుమారు రెండు గంటలు పట్టింది. రాజకీయ నాయకులకు అవగాహన లేదేమో? ఉంటే... ఆ టైమ్‌లో అటు ఎందుకొస్తారు? ప్రొటోకాల్ తప్పనడం లేదు. నాన్న ఎంపీగా ఉన్నప్పుడు ఎక్ట్స్రా సెక్యూరిటీ ఉండేది. కృష్ణదేవరాయులు వంటి రాజులందరూ మఫ్టీల్లో మామూలు మనుషులుగా తిరిగారు కదా! అలా మీరూ బైకుల్లో వెళితే ప్రజల కష్టాలు తెలుస్తాయని చెప్పా. కొందరు రాళ్లు వేయడానికి ప్రయత్నించారు. ఐ డోంట్ కేర్... మీకు నేను నచ్చినా? నచ్చకున్నా? నా మనసులో మాటల్ని చెప్పానంతే. అందరికీ నచ్చాలంటే ‘నాది తప్పు’ అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తూ మనం ఎన్ని అడుగులు ముందుకు వేయగలం? అందుకని, నా వెనక తిట్టినోళ్లను నేను పట్టించుకోను. ఆ కామెంట్స్ చూసి ఇరిటేట్ అవుతా. నన్ను ఇరిటేట్ చేసేవాళ్లను బ్లాక్ చేస్తా. -
ట్విట్టర్లో పవన్ ఫ్యాన్స్ దండయాత్ర
సాక్షి, హైదరాబాద్: పవన్ కల్యాణ్‌కు అభిమానులు ప్రపంచం నలుమూలలా ఉంటారనేది టాలీవుడ్ సత్యం. ఆయన పుట్టిన రోజున వచ్చిందంటే చాలు అభిమానులకు పండుగే. అన్నదానాలు, రక్తదానాలు, సేవా కార్యక్రమాలతో ఘనంగా జరుపుతారు. పవన్‌కల్యాణ్‌కు రికార్డులు సృష్టించడం కొత్తేం కాదు. ఆయన లాగే ఆయన అభిమానులు అంతే, బర్త్‌డే వచ్చింది అంటే చాలు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తారు. నేడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు ట్విట్టర్‌పై దండయాత్ర చేశారు. తమ అభిమాన నాయకుడి పేరు మీద రికార్డులు నమోదు చేశారు. నేడు పవన్ పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ 25గంటల్లో దాదాపు 30లక్షల పైగా ట్వీట్లు చేశారు. ఇప్పుడు ఇది ఒక రికార్డు. ఇందుకోసం అభిమానులందరూ ఒకే ట్వీట్ హాష్ టాగ్ తీసుకొని ట్వీట్లు చేశారు. ట్విట్లర్లో ఒక సెలబ్రిటీ, సినీ నటుడి పుట్టిన రోజున అత్యధిక ట్వీట్లు చేయడం ఓ రికార్డు. గతంలో తారక్, మహేష్ బాబుల పుట్టిన రోజున అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్లు చేసి రికార్డు సృష్టించారు. -
గ్రేట్ డే.. మిస్టర్ హెలికాప్టర్!
భారత క్రికెట్ కెప్టెన్‌గా ఎన్నో ఘనతలు సాధించి అరుదైన క్రికెటర్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోని బర్త్ డే సందర్భంగా అతనికి ట్విట్టర్ లో అభినందల వర్షం కురుస్తోంది. ఈ రోజు (జూలై7) ధోని 36వ ఒడిలోకి అడుగెడుతున్నసమయంలో అతనికి సహచర ఆటగాళ్లు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 'ధోని మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి. మిస్టర్ హెలికాప్టర్‌కు ఇవే నా శుభాకాంక్షలు. ఇది ధోనికి గ్రేట్ డే'అంటూ యువరాజ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు ధోనితో కలిసున్న ఫోటోను జత చేశాడు. క్రికెట్ దిగ్గజం ధోనికి హ్యాపీ బర్త్ డే' అని మాజీ క్రికెటర్ మొహ్మద్ కైఫ్ అభినందించగా, ఇది ధోనికి గ్రేట్ అని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది ధోనికి చిరస్మరణీయంగా మిగిలి పోవాలని ఆకాంక్షించాడు. 'ధోనికి వెరీ హ్యాపీ బర్త్ డే..నీ కోసం కేక్ రెడీ అవుతోంది'అంటూ హార్దిక్ పాండ్యా విషెస్ తెలిపాడు. ఇదిలా ఉంచితే, భారత్ క్రికెట్ లోకి ధోని ప్రవేశించి దాదాపు 13 ఏళ్లు కావొస్తొంది. అతను క్రికెట్ లో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. 2007లో భారత్ జట్టుకు ట్వంటీ 20 వరల్డ్ కప్ ను అందించిన ధోని.. ఆపై ఏనాడు వెనుతిరిగి చూడలేదు. తనదైన ముద్రతో చెలరేగిపోతూ భారత్ క్రికెట్ ప్రతిష్టను పెంచాడు. ఆ క్రమంలోనే వన్డే వరల్డ్ కప్‌లను, చాంపియన్స్ ట్రోఫీలను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఐసీసీ నిర్వహించే మూడు మెగా టోర్నీల టైటిల్స్ ను అందుకున్న ఏకైక భారత కెప్టెన్ గా ధోని నిలిచాడు. ఇక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గా కూడా ఎన్నో రికార్డులు ధోని సొంతం. వెస్టిండీస్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా పలు రికార్డుల్ని ధోని సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగుల్ని నమోదు చేసిన రెండో వికెట్ కీపర్ గా ధోని గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే ఆసీస్ దిగ్గజం గిల్ క్రిస్ట్ ను అధిగమించాడు. మరొకవైపు వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇక భారత్ నుంచి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాల్గో స్థానానికి చేరుకున్నాడు. -
తెలుగులో తనకు ఇష్టమైన హీరో నేనే
‘‘సక్సెస్ కోసం చేస్తా గానీ... ఇమేజ్ మారాలని నేనెప్పుడూ సినిమాలు చేయలేదు. నా సినిమాల్లో కొన్ని ఎందుకు ఆడాయి? కొన్ని ఎందుకు ఆడలేదు? అని విశ్లేషించుకున్నా. ‘సుడిగాడు’ తర్వాత ఎక్కువ నవ్వించాలనే తాపత్రయంతో సెంటిమెంట్‌ను కూడా కామెడీ చేసేశాం. సినిమా చూసినప్పుడు నవ్వుకున్నా... థియేటర్ బయటకొచ్చిన తర్వాత కథలోంచి కామెడీ వచ్చేలా, ఎమోషన్స్ మిస్ కాకుండా సినిమాలు చేయాలనుకున్నా’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. నేడు పుట్టినరోజు సందర్భంగా పలు విశేషాలను పంచుకున్నారీ కామెడీ హీరో. ♦ బర్త్ డే స్పెషల్ ఏంటి? ఈ రోజంతా మా పాపతోనే ఉంటాను. ఇప్పుడు తనకు తొమ్మిది నెలలు. నేను తండ్రైన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్ డే ఇది. నా వైఫ్ విరూప వన్ వీక్ సర్ప్రైజ్ హాలిడే ట్రిప్ ఏదో ప్లాన్ చేసింది. సో, బర్త్‌డేను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నా. ♦ అయానా ఈవిక... మీ పాప పేరు భలే ఉందే! అయానా అంటే ‘అందమైన పువ్వు’ (ఆఫ్రికన్ లాంగ్వేజ్) అని అర్థం. సంస్కృతంలో ‘లక్ష్యం, దిశ’ అనే అర్థాలు వస్తాయి. తిరుపతి వెళ్లినప్పుడు ఓ చోట ఆ పేరు చూశా. అప్పుడే నాకు అమ్మాయి పుడితే ‘అయానా’ అని పేరు పెట్టాలనుకున్నా. ‘ఈవిక’ అంటే హిబ్రూ భాషలో ‘జీవితం’ అని అర్థం. నాన్నగారి పేరు ‘ఈవీవీ’లో ఏదో ఒకటి కలసి రావాలని ‘ఈవిక’ అని పెట్టా. ♦ అన్నప్రాశన రోజున అయానా ఏం పట్టుకుంది? నాన్నగారు దర్శకుడు కాబట్టి, పిల్లల అన్నప్రాశన రోజున క్లాప్ బోర్డు పెట్టడం సెంటిమెంట్. అయానా పెన్ను, క్లాప్ బోర్డు పట్టుకుంది. పెళ్లి తర్వాత, ముఖ్యంగా పాప పుట్టిన తర్వాత లైఫ్ మారింది. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుందామా? అనిపిస్తుంది. పిల్లలకు రెండు మూడేళ్లు వచ్చేవరకు భలే ముద్దుగా ఉంటారు. వాళ్లను వదలాలనిపించదు. ♦ మీ వైఫ్‌కు ఇష్టమైన హీరో ఎవరు? అజిత్. చెన్నై అమ్మాయి కదా! మిగతా తమిళ హీరోలన్నా ఇష్టమే. కానీ, అజిత్‌కి పెద్ద ఫ్యాన్. మరి, తెలుగులో? ఇంకెవరూ? నేనే. ♦ ఫ్యామిలీ లైఫ్‌లో ఆల్ హ్యాపీస్. మరి, సినిమా లైఫ్ ఎలా ఉంది? ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టున్నారు? ఎక్కువ సినిమాలు చేయడం కన్నా మంచి సినిమాలు చేద్దామని! నరేశ్ బాగా నవ్విస్తాడంటారు. కానీ, నటుడిగా నాకు పేరొచ్చిన, గుర్తింపు తెచ్చిన సినిమాలు మాత్రం ‘గమ్యం’, శంభో శివ శంభో’ వంటివే. ‘ఇటీవల మీరు ఎక్కువగా కామెడీపై కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎమోషన్స్ మీద కూడా దృష్టి పెట్టండి’ అని చాలామంది అన్నారు. ఆల్రెడీ 52 సినిమాలు చేశా. ఓసారి చేసిన సినిమాలు రిపీట్ కాకుండా చూసుకుంటున్నా. ప్రేక్షకులు నా నుంచి ఆశించే వినోదం, భావోద్వేగాలకు ప్రాముఖ్యత ఉండే కథలపై దృష్టి పెట్టాను. ♦ ఈవీవీగారి తర్వాత నరేశ్‌తో అలా నవ్వించే సినిమాలను దర్శకులు తీయలేకపోతున్నారని కొందరు అంటున్నారు! ఒక్కోసారి కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. జంధ్యాలగారు, రాజేంద్రప్రసాద్ గారి కాంబినేషన్లా... నాన్నగారితో నా కాంబినేషన్ వర్కౌట్ అయింది. తెలుగులో ఎక్కువమంది కమెడియన్స్ ఉన్నారు. వాళ్లందర్నీ సినిమాలో నటింపజేసి, వాళ్లకంటూ ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్ క్రియేట్ చేయడం కష్టం. కానీ, నాన్నగారు క్రియేట్ చేశారు. ఆయన సినిమాల్లో ప్రతి పాత్రకూ ఓ ఫినిషింగ్ ఉంటుంది. నాన్న తర్వాత అలా చేసినోళ్లు ఉన్నారు. లేరని చెప్పడం లేదు. నాతో వాళ్ల కాంబినేషన్ కుదరాలి. ♦ ‘మేడ మీద అబ్బాయి’ ఎంతవరకు వచ్చాడు? షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇందులో కథతో పాటు మంచి కామెడీ పడింది. నిర్మాత బొప్పన చంద్రశేఖర్‌గారు నాతో మంచి ఎమోషన్స్, కామెడీ రెండూ ఉన్న సినిమా తీయాలనేవారు. ఈ సినిమాకి ఈ రెండూ బాగా కుదిరాయి. ♦ మహేశ్‌బాబు సినిమాలో చేస్తున్నారని టాక్? ఆ సినిమా గురించి వాళ్లు (మహేశ్ 25వ సినిమా టీమ్) కలిశారు. మా మధ్య డిస్కషన్ జరిగింది. త్వరలో అసలు సంగతి చెబుతా. -
కళ్లు మూసేసి..!
ఎన్టీఆర్‌కు ఈ ఏడాది అందరికంటే ముందుగా బర్త్‌డే విషెస్ చెప్పింది ఎవరో తెలుసా? ఎన్టీఆర్ తనయుడు అభయ్. విషెస్ చెబుతూ ఏం చేశాడో తెలుసా? ఎన్టీఆర్ కళ్లు మూసేశాడు! చిట్టి చిట్టి చేతులతో నాన్న కళ్లను మూసేయడమంటే... అభయ్కు ఇష్టమట. నిన్న (శనివారం) ఎన్టీఆర్ బర్త్‌డే. కుటుంబ సభ్యులతో కలసి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారాయన. ఫ్యామిలీ ఫొటోలను ట్వీట్ చేస్తూ – ‘‘అభయ్ చెప్పిన ఈ ఏడాది ఫస్ట్ బర్త్‌డే విషెస్ నాకెంతో విలువైనవి. ఎందుకో తెలీదు... అభయ్ జస్ట్ లవ్స్ క్లోజింగ్ మై ఐస్’’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. సతీమణి లక్ష్మీప్రణతి ఫోన్లో ఎన్టీఆర్‌కు ఏదో చూపించడానికి ప్రయత్నిస్తుంటే బుల్లి అభయ్ తండ్రి కళ్లను ఎలా మూశాడో చూశారుగా... కొడుకు అల్లరికి ఎన్టీఆర్ భలే మురిసిపోతున్నారు కదూ. గ్యారేజ్‌ను మించేలా... ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో ఆయన మరో సినిమా చేయనున్నారు. యువసుధ ఆర్ట్స్ పతాకంపై కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవంతో నిర్మాతగా మారుతున్నా. ‘జనతా గ్యారేజ్’ను మించేలా, భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాం’’ అన్నారు సుధాకర్. -
నయనానందకరం.. రాఘవుడి ఉత్సవం
- దేదీప్యమానంగా జగద్గురుడి జన్మదినం - ఆకట్టుకున్న కళార్చనలు - నవరత్న రథంపై ఊరేగిన రాఘవేంద్రుడు మంత్రాలయం: వేద పరిమళాలు.. సుస్వరనాద హారాలు.. కళాకారుల కళార్చనలు.. పుష్పశోభిత వెంకన్న పట్టువస్త్రధారణలో రాఘవేంద్రుల మూలబృందావన సుందరరూపాన్ని చూడ రెండు కన్నులు చాల లేదు. విశ్వమోహనుడు జగద్గురు శ్రీరాఘవేంద్రస్వామి జన్మదిన పర్వం ఆధ్యంతం మంగళకరంగా సాగింది. మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ఆదివారం రాఘవేంద్రుల 422వ జన్మదిన వేడుకలు దేదీప్యమానంగా నిర్వహించారు. పీఠాధిపతి మూలబృందావనం విశేష పంచామృతాభిషేకం, విశిష్టపూజలతో వేడుకలకు అంకురార్పణ పలికారు. పూలమందిరంలో మూలరాముల పూజలు చేపట్టారు. అంతకుముందు గ్రామ దేవత మంచాలమ్మకు పీఠాధిపతి పట్టువస్త్రాలు, బంగారు పతకం ధారణతో హారతులు పట్టారు. వెంకన్న పట్టువస్త్రాలంకరణలో రాఘవుడు జన్మదినాన్ని పురష్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి గురురాజారావు పట్టువస్త్రాలు సమర్పించారు. పీఠాధిపతి పట్టువస్త్రాలు శాస్త్రోక్తంగా స్వీకరించి డోలోత్సవ మండపం చేరుకుని ఊంజలపై కొలువుదీరిన తుంభర సహిత రాఘవేంద్రుల ప్రతిమతో పట్టువస్త్రాలను ఉంచారు. టీటీడీ అధికారులు పీఠాధిపతిని సాదరంగా సన్మానించారు. పీఠాధిపతి వేంకటనాథుడు, రాఘవేంద్రస్వామి అనుబంధాన్ని భక్తులకు ప్రవచించారు. అనంతరం పట్టువస్త్రాలను మూలబృందావనం దరిచేర్చి ప్రత్యేకపూజలు, మంగళహారతులు పట్టారు. బృందావనాన్ని బెంగళూరు నుంచి తెప్పించిన పుష్పాలు, తులసీమాల, వెంకన్న పట్టు వస్త్రాలతో విశేషంగా అలంకరించారు. భక్తులు మూలరూపాన్ని దర్శించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. జన్మదినం సందర్భంగా మధ్యాహ్నం శ్రీరాఘవేంద్రస్వామి విరాట్‌ను నవరత్న రథంపై ఊరేగించారు. ముందుగా రథంపై రాఘవేంద్రుల రచించిన పవిత్ర గ్రంథాలు, విరాట్‌ను కొలువుంచారు. పీఠాధిపతి పుష్పార్చన, మంత్రాంక్షితలు, దివిటీ సేవ, మంగళహారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. మంగళవాయిద్యాలు.. హరిదాస నృత్యాలు.. చిన్నారుల కోలాటాలు స్వాగతిస్తుండగా రథయాత్ర శ్రీమఠం మాడవీధుల్లో రమణీయంగా సాగింది. సుమధురం.. నాదహారం తమిళనాడుకు చెందిన శ్రీరాఘవేంద్ర నాదహార సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నాదహారం కానిచ్చారు. వేణువు.. డమరుకం.. గిటార్, వీణ, తుంబుర, మేళతాలాల మధ్య ఆలపించిన గోవిందుడి కీర్తనలు వీనుల విందు చేశాయి. 450 మంది సంగీత విద్వాంసులు చేసిన స్వరనాద అభిషేకం సుమధురంగా సాగింది. పీఠాధిపతి సైతం భక్తిగేయాలు ఆలపించి తన్మయత్వం పొందారు. ట్రస్టు ఆధ్వర్యంలో రూ.18.50 లక్షలు విలువ జేసే బంగారు కమండలం, బంగారు గొలుసును మఠానికి విరాళంగా అందజేశారు. అలాగే అమరావతికి చెందిన మహిళలు ఆలపించిన భక్తిసంకీర్తనలు భక్తులను అలరించాయి. శ్రీమఠంలో ప్రముఖులు: వేడుకను తిలకించేందుకు పలువురు ప్రముఖులు మంత్రాలయం విచ్చేశారు. తెలుగుసినీ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, నిర్మాతలు నాగిరెడ్డి, దేవేంద్రరెడ్డి, కన్నడ నటుడు జయరాం కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి, తమిళనాడు హౌసింగ్ మంత్రి రాధాకృష్ణన్ వచ్చారు. ముందుగా గ్రామదేవతను దర్శించుకుని మూలబృందావనం దర్శనం చేసుకున్నారు. వేడుకలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, దివాన్ వాదీరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
వచ్చే నెల 19న ‘గాడ్’ జన్మదిన వేడుకలు
వెదురుపాక (రాయవరం) : వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) 81వ జన్మదిన వేడుకలను వచ్చే నెల 19న పీఠంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబీ)లు పీఠంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. వచ్చే నెల 17వ తేదీ ఉదయం 11.05 గంటలకు జ్యోతి ప్రజ్వలన, గోపూజ, లక్షీ్మగణపతి హోమంతో జన్మదిన వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. గాడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భక్తజన సంక్షోభ నివారణార్థం పీఠంలో పలు ఆధ్మాతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. పూజల్లో భాగంగా 17న తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం పండితులతో శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి హోమం, సాయంత్రం ఆరు గంటలకు అన్నవరం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పండితులతో స్వామివారి దివ్యకళ్యాణం, 18 ఉదయం 9 గంటలకు తిరుమల వైఖానస పండితులచే శ్రీదేవి, భూదేవి సమేత విజయ వేంకటేశ్వరస్వామి దివ్యకళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. 19వ తేదీ ఉదయం గాడ్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తారన్నారు. విజయ వేంకటేశ్వరస్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వరసిద్ధి వినాయకుడు, భవానీ శంకరుడు, శ్రీరామచంద్రమూర్తి, శ్రీవిజయదుర్గాదేవి ఉత్సవమూర్తులకు పుష్పయాగం, హారతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జన్మదిన వేడుకలకు బ్రాహ్మణ, అర్చక సంక్షేమ సంఘం ఛైర్మ¯ŒS ఐవైఆర్ కృష్ణారావు, పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మ¯ŒS రావులపాటి సీతారామారావు, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర క్రీడలు, యువజన శాఖల ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. 20న శ్రీవారి శాంతికళ్యాణం నిర్వహిస్తామన్నారు. జన్మదిన వేడుకల ఆహ్వాన పత్రికలను పీఠాధిపతి గాడ్ సమక్షంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో విజయదుర్గా పీఠం భక్తజన సంఘం సభ్యుడు గాదె భాస్కరనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
డార్లింగ్ ప్రభాస్ పూర్తి పేరు ఏంటో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. ’బాహుబలి’ సినిమాతో జాతీయ స్టార్‌గా ఎదిగిన ఆయన ఆదివారం 37వ వసంతంలో అడుగుపెట్టారు. ఆయన జన్మదిన కానుకగా ఇప్పటికే ’బాహుబలి-2’ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ విడుదల సందర్భంగా 18వ ముంబై చిత్రోత్సవం సందర్భంగా ప్రభాస్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి గౌరవించారు. 14 ఏళ్ల నట ప్రస్థానంలో అసాధారణమైన అద్భుతాలను ఈ యంగ్ హీరో సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ ఖాతాలో పలు విజయవంతమైన సినిమాలు ఉన్నప్పటికీ ‘బాహుబలి’ ప్రాంచైజ్‌తో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయాడు. వంద కోట్లు వసూళ్లు సాధించడమే కష్టం అనుకునే టాలీవుడ్ రేంజ్ ను దాటి ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమా ఏకంగా రూ. 600 కోట్లు వసూలు చేసింది. ’బాహుబలి-2’ మీద అనేక అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన కబుర్లు ఇవి.. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. చెన్నైలో సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్‌కు పెద్దనాన్న. ’బాహుబలి’ సూపర్ సక్సెస్‌తో ఇక ప్రభాస్ బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తాడని వినిపిస్తోంది. కానీ, 2014లోనే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అజయ్ దేవగణ్ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన ‘యాక్షన్ జాక్సన్’ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు. ప్రభాస్‌కు ఓ ఇంజినీరింగ్ విద్యార్థినితో నిశ్చితార్థం అయింది. తల్లిదండ్రులు సెలెక్ట్ చేసిన అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయి గురించి పెద్దగా వివరాలు తెలియదు. గత ఏడాది డిసెంబర్లోనే ప్రభాస్ పెళ్లి జరగాల్సి ఉండగా.. ’బాహుబలి’ ప్రాజెక్టు కారణంగా వాయిదా వేసుకున్నాడు. అది ప్రభాస్‌కు పనిపట్ల అంకితభావమని సన్నిహితులు చెప్తారు. ప్రభాస్ బాగా నచ్చిన సినిమా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటించిన 'భక్తకన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమాలు అన్నా పడిచస్తాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రి ఇడియట్స్ సినిమాలను 20సార్లకుపైగా చూశాడట. ఇక హాలీవుడ్ విషయానికొస్తే రాబర్ట్ డీనీరో నటన అంటే ఇష్టం. ప్రభాస్‌కు వాలీబాల్ అంటే ఇష్టం. బాహుబలి సినిమా కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి ప్రత్యేకంగా దేహాదారుఢ్యంపై ప్రభాస్‌కు శిక్షణ ఇచ్చారు. కండలు తిరిగిన దేహసౌష్ఠవం కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా రూ. 1.5 కోట్లు విలువచేసే జిమ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. చాలామంది నటులు వరుసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా ప్రభాస్ మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. 'బాహుబలి' సముద్రం లాంటి సినిమా. ఒక్క బాహుబలి వంద సినిమాలతో సమానం. కాబట్టి మధ్యలో నదిలాంటి సినిమాలను ఇవ్వడం ఆయనకు ఇష్టంలేదు. -
బాపూజీ అడుగు జాడల్లో నడుద్దాం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన బాపూజీ అడుగు జాడల్లో నడుద్దామని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ , లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలను ఆదివారం స్థానిక కష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన జరుపుకున్నారు. జాతిపిత చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ వంటి ఉద్యమాలు చేపట్టి దేశ ప్రజలను గాంధీజి ఏకతాటిపై నడిపించారన్నారు. మహాత్ముని సేవలు మరువలేనివన్నారు. అహింసా ఉద్యమంతో గాంధీజీ ప్రపంచ నేత అయ్యారని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ అన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు. -
మన్మోహన్ సింగ్‌కు మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మన్మోహన్ సింగ్ తన 83వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ.. మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే.. మోదీ స్వంయంగా మన్మోహన్‌తో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల ఘా అనే గ్రామంలో జన్మించిన మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. Warm birthday wishes to Dr. Manmohan Singh ji. May God bless him with a long and healthy life. — Narendra Modi (@narendramodi) September 26, 2016 -
అనీల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకులు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనీల్ కుమార్ యాదవ్ పుట్టిన రోజు వేడుక శుక్రవారం ఘనం గా జరిగింది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రొద్దుటూరి సంఘీరెడ్డి ఆధ్వర్యంలో కేట్ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నవ్నీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, అదిల్ పాషా, మహేష్, యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒగ్గు కథకు వన్నె తెచ్చిన మిద్దె
మిద్దె రాములు జయంతికి ఏర్పాట్లు వేములవాడలో సమావేశం అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు హాజరు వేములవాడ రూరల్: తెలంగాణ ఒగ్గుకళారూపానికి వన్నె తెచ్చిన ప్రముఖ ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు 76వ జయంతి బుధవారం జరగనుంది. జయంతికి రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన అభిమానులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు హాజరవుతున్నట్లు మిద్దె రాములు కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు మిద్దె పర్శరాములు తెలిపారు. మి§ð ్దరామలు 50 సంవత్సరాలకుపైగా ఒగ్గు కళాప్రదర్శనను ఇచ్చి గుర్తింపు తెచ్చారని, ఎన్నో అవార్డులు అందుకున్నారని వివరించారు. బుధవారం జరిగే జయంతి ఉత్సవాల్లో భాగంగా తిప్పాపురం తెలంగాణ విగ్రహం నుంచి కళాకారులతో ర్యాలీగా బయలుదేరి వేములవాడ గాంధీనగర్‌లోగల రవీంద్ర ఫంక్షన్‌హాల్ వరకు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం ఫంక్షన్హాల్లో కళాకారులతో కళాప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కళాప్రదర్శనలో పాల్గొన్న కళాకారులకు బహుమతులను అందించనున్నట్లు తెలిపారు. డీపీఆర్వో ప్రసాద్, ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, పత్తిపాక మోహన్, వేములవాడ ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఎంపీపీ రంగు వెంకటేశంగౌడ్, నగర పంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ, జెడ్పీటీసీ గుడిసె శ్రీకాంత్, తదితరులు హాజరవుతున్నట్లు చెప్పారు. -
నటకిరీటి పుట్టిన రోజు
'ఆఫ్టర్ వన్ ఇయర్.. ఐ విల్ బి కింగ్' ఆ ఒక్క డైలాగ్‌తోనే ఆడియన్స్ పెదాలపై నవ్వులు పూయిస్తూ థియేటర్లలో హల్చల్ చేసిన కామెడీ కింగ్ ఆయన. కథానాయకుడి పక్కన నిల్చుని.. ఒళ్లంతా విరుచుకుని నవ్వించేందుకు నానాపాట్లు పడాల్సిన పనే లేకుండా ఈ తెర విదూషకుడిని సోలో హీరోని చేసి సైడ్ ట్రాక్‌లో ఉన్న కామెడీని మెయిన్ ట్రాక్‌లోకి తెచ్చి.. పద్నాలుగు రీళ్ల సినిమా అంతా హాస్యానికి పట్టాభిషేకం చేసిన నవ్వుల రారాజు ఆయన. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఆఫ్టర్ వన్ఇయర్..ఐ విల్బీ కింగ్ అంటూనే.. రాజ్యాలు కనుమరుగైన ప్రస్తుత ప్రజాస్వామ్య రాజ్యంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ముద్దాడిన ప్రతిఒక్కడూ మకుటంలేని మహారాజే అన్న పచ్చి నిజాన్ని చాటి చెప్పిన హాస్య కిరీటి ఆయన. రీల్‌లైఫ్‌లో ఆ చిత్రంలో అన్న ఆ మాటనే రియల్‌లైఫ్‌లో అనుసరిస్తూ సుమారు నాలుగు దశాబ్ధాలు తెలుగుతెర రంగుల ప్రపంచాన్ని తనదైన హాస్య చతురతతో అలరించిన వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆయన. ఆయనే.. నటకిరీటి డాక్టర్ గద్దె బాబూ రాజేంద్రప్రసాద్. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన రాజేంద్ర ప్రసాద్. 1956 జూలై 19న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లామా పూర్తి చేసిన రాజేంద్ర ప్రసాద్ బాపు దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. నాలుగ దశాబ్దాలకు చేరువైన ఆయన సినీ ప్రస్తానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించారు రాజేంద్ర ప్రసాద్. 230కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన క్విక్‌గన్ మురుగన్ పేరుతో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రంలోనూ హీరోగా నటించారు. నటకిరీటిగా, కామెడీ కింగ్ గా తెలుగు ప్రేక్షకులు పిలుచుకునే రాజేంద్రుడిని ఆంధ్రా యూనివర్సిటీ గౌరమ డాక్టరేట్ తో సత్కరించింది. 1991లో రిలీజ్ అయిన ఎర్ర మందారం సినిమాకు తొలిసారిగా నంది అవార్డు అందుకున్న రాజేంద్ర ప్రసాద్. 1994లో రిలీజ్ అయిన మేడమ్ సినిమాకు స్పెషల్ జ్యూరి అవార్డ్ ను అందుకున్నారు. 2004లో మరోసారి ఆ నలుగురు చిత్రానికి ఉత్తమ నటుడిగా నందిని అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, మీ శ్రేయోభిలాషి చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా నంది పురస్కారాన్ని గెలుచుకున్నాయి. ప్రస్తుతం నటుడిగానే కా మా అధ్యక్షుడు తెలుగు కళామతల్లి సేవచేసుకుంటున్నారు రాజేంద్ర ప్రసాద్. -
హ్యాపీ బర్త్ డే ధోనీ..
టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ధోనీ ఫ్యాన్స్ బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియా మోతెక్కింది. బాలీవుడ్ హీరోలు, సహచర ఆటగాళ్లు మిస్టర్ కూల్‌కు ట్విట్టర్లో బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ధోనీతో తమకు అనుబంధం గురించి చెబుతూ.. ఆయన సేవలను కొనియాడారు. ఆ ట్వీట్లు కొన్ని మీ కోసం.. "Dhoni Is The Best Captain I Have Played Under.”- Sachin Tendulkar#HappyBirthdayCaptainCool — Sir Ravindra Jadeja (@SirJadeja) 6 July 2016 HappyBirthday Captain.A totally Selfless cricketer &a wonderfully amazing person..Respect. #HappyBirthdayCaptainCool pic.twitter.com/hhrKys9rbG — Sushant S Rajput (@itsSSR) 7 July 2016 Happy Birthday @msdhoni . May you keep doing Anhoni ko Honi.#NationalHelicopterDay pic.twitter.com/PGHp9M6gNT — Virender Sehwag (@virendersehwag) 7 July 2016 -
ప్రియుడి పుట్టిన రోజుకు వెళ్లి.. తెల్లవారే సరికి
బొమ్మనహళ్లి (బెంగళూరు): ప్రియుడి పుట్టిన రోజుకు వెళ్లిన ప్రియురాలు తెల్లవారె సరికి విగతజీవిగా మారింది. ఈ ఘటన ఆదివారం ఉదయం నగరంలోని కాడుగోడిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. సునంద (19), సైద్రా అనే యువతీయువకులు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం వారి పెద్దలకు తెలియడంతో వివాహానికి అంగీకరించారు. ఈ క్రమంలో సైద్రా శనివారం కొడిగేహళ్లిలోని తన అక్క, బావ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలను జరుపు కున్నాడు. ఈ వేడుకులకు సునంద కూడా హాజరైంది. వేడుకల అనంతరం సైద్రా అక్క, బావలు వెళ్లిపోగా ప్రియుడు, ప్రియురాలు ఇంట్లోనే ఉండిపోయారు. అదే రోజు రాత్రి ఎదో చిన్న విషయంలో ఇద్దరు గోడవ పడ్డారు. ఈవిషయాన్ని సునంద తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆదివారం ఉదయానికి సునంద ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది. అయితే సైద్రానే తన కుమార్తెను హత్య చేసినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా సైద్రా పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
రాణి విందుకు ఒబామా
లండన్: పదవి కాలం ముగుస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రథమ మహిళ మిషెల్లీ చరిత్రలో గుర్తుండిపోయే పర్యటనలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న క్యూబా వెళ్లిన ఆ జంట ఇప్పుడు బ్రిటన్‌లో అడుగుపెడుతున్నారు. విండ్సర్ భవనంలో బ్రిటన్ రాణి ఇచ్చే గౌరవ విందును స్వీకరించనున్నారు. ఆ తర్వాత బ్రిటన్ యువరాజు విలియమ్, యువరాణి కేథరిన్‌లను కలవనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ప్రకటించింది. ఈ వారంలో బ్రిటన్ పర్యటనకు అధ్యక్షుడు ఒబామా, మిషెల్లీ వెళుతున్నారు. శుక్రవారం జరిగే ఆమె 90వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కెన్సింగ్టన్ ప్యాలెస్ లో రాజు, రాణిలను ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్యాలెస్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేస్తూ వారి రాక కోసం తాము ఎంతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. వారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా అతిథి సేవలు చేయాలనుకుంటున్నామని ప్రకటించారు. -
సీఎం కేసీఆర్‌కు పలువురి విషెస్!
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం 63వ వసంతంలో అడుగుపెట్టారు. కేసీఆర్‌గా ప్రజల్లో పాపులర్ అయిన ఆయన 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న కేసీఆర్ కు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గవర్నర్ ఆకాంక్షించారు. అలాగే మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జుపల్లి కృష్ణారావు, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఎమ్మెల్యేలు రవీందర్ రెడ్డి, బాలారాజు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తదితరులు కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పుట్టినరోజు నాడే రాజ్‌భవన్‌లో సిబ్బంది కోసం రూ. 100 కోట్లతో నిర్మించనున్న క్వార్టర్స్‌కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, పలువురు తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. -
పుష్కరంలోకి ఫేస్బుక్
ప్రపంచం మొత్తాన్ని ఒకే గొడుగుకిందికి తీసుకొచ్చిన ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్. దీని గురించి చర్చించుకుంటుండగానే ఇప్పుడు పుష్కర కాలంలోకి అడుగుపెట్టింది. అవును ఫేస్ బుక్ కు ఇప్పుడు పన్నేండేళ్లు. 2004 ఫిబ్రవరి 4న మార్గ్ జుకర్ బర్గ్ దీనిని స్థాపించిన అనతి కాలంలోనే అనూహ్యంగా ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రస్తుతం ఫేస్బుక్ వినిమోగదారుల సంఖ్య చైనా జనాభా కంటే ఎక్కువ. ఇక భారత్‌లో దీని వినియోగదారులు నేటికి 125 మిలియన్లు. ఇది 2016 చివరినాటికి 161 మిలియన్లకు చేరొచ్చని ఒక అంచనా. 2010లో ఫేస్బుక్ పై ‘‘ ఏ సోషల్ నెట్వర్క్’’ అనే హాలివుడ్ సినిమా విడుదలవగా దీనికి మూడు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. ఇక, 2008లో ప్రపంచంలోనే ఎక్కువ మంది వాడే సోషల్ మీడియాగా ఫేస్బుక్ గుర్తింపు పొందింది. ఇందులో మొదట పెట్టుబడిపెట్టింది పేపాల్ కంపెని సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్. ఆయన పెట్టిన పెట్టుబడి మొత్తం 5 లక్షల డాలర్లు. ఇక ఐస్లాండ్ దేశమైతే ఏకంగా ఫేస్బుక్లో వచ్చిన సూచనలు, సలహాలతో తమ రాజ్యాంగంలో మార్పులు చేసుకొంది. ఇంకో ఆసక్తికరమైన అంశమేమిటంటే ఫేస్‌బుక్‌లోకి లాగిన్ కాకుండానే ఫెస్బుక్ యూఆర్‌ఎల్‌తోపాటు 4 అంకెను చేరిస్తే నేరుగా అది ఫేస్బుక్ సీఈవో జూకర్ బర్గ్ ప్రోఫైల్ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఫేస్బుక్ నీలి రంగులో ఉండటానికి కారణం గురించి జూకర్ చెబుతూ తనకు ఎరుపు, ఆకు పచ్చ రంగులు సరిగా కనపడవని, నీలి రంగు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుందని అందుకే దానిని ఎంచుకున్నట్లు గత ఇంటర్వ్యూలో చెప్పారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను ఈ సంస్థే కొనుగోలుచేసింది. -
ఇంటికి చేరిన విద్యాబాలన్
ముంబయి: బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. కిడ్నీ సంబంధింత సమస్యతో ఆమె ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం విద్యా బాలన్ 37వ పుట్టిన రోజు కూడా కావడంతో తన అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 'నా పుట్టిన రోజునాడే తిరిగి ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి 2016 సంవత్సర శుభాకాంక్షలు' అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా, విద్యాబాలన్ న్యూ ఇయర్ వేడుకలతో పాటు, తన పుట్టినరోజును భర్త సిద్ధార్థ రాయ్ కపూర్‌తో కలిసి అబ్రాడ్‌లో జరుపుకునేందుకు ప్లాన్ చేసింది. అయితే విద్యాబాలన్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ టూర్‌ను అర్థాంతరంగా క్యాన్సిల్ చేసుకున్నారు. Grateful to be back home in time to bring in my birthday ...Thank You for all your love,prayers and wishes🙏. Happy 2016 to each of you💃🏻🎁!! — vidya balan (@vidya_balan) December 31, 2015 -
ఘనంగా మిలాద్-ఉన్-నబీ
సిటీబ్యూరో: మహ్మద్ ప్రవక్త జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో గురువారం మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ధార్మిక, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వాడవాడలా మిలాద్ వేదికలను ఏర్పాటు చేశారు. పేదలకు అన్నదానం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యువకులు పచ్చజెండాలు పట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలతో హోరెత్తించారు. పాతబస్తీలో జరిగిన ప్రదర్శనలో వేలాది మంది యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు, ఇస్లామిక్ స్కాలర్స్ హాజరయ్యారు. ఆల్ ఇండియా మజ్లిస్ తామీర్-ఏ-మిల్లత్ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మిలాద్ ప్రదర్శన సందర్భంగా ఎలాంటి అవాంఛనీ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.