హ్యాపీ బర్త్‌డే రన్‌మెషీన్‌ | Virat Kohli Turns 30 Wishes Pour In For Run Machine | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 5 2018 10:22 AM | Last Updated on Mon, Nov 5 2018 10:33 AM

Virat Kohli Turns 30 Wishes Pour In For Run Machine - Sakshi

మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్‌ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రన్‌మెషిన్‌.. 30వ ఏట ..

సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అంతా ఒకవైపు.. విరాట్‌ కోహ్లి ఒక్కడే ఒక వైపు.. కొన్నెళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే  ‘మనం తప్పు  చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లి ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్‌ అనేంతా.. ఒకప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లి అని అందరూ చెప్పుకునేంతా.. ఇరువై తొమ్మిదేళ్లకే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడుగా అవతరించాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్‌ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రన్‌మెషిన్‌.. 30వ ఏట అడుగెడుతున్న సందర్భంగా అటు అభిమానులు.. ఇటు ప్రేక్షకులు విషెస్‌తో పోటీపడ్డారు.

‘ఈ రోజు దంతేరాస్‌.. ఈ ఏడాదంతా నీకు రన్‌తేరాస్‌ కావాలని ఆశిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే కోహ్లి’- వీరేంద్ర సెహ్వాగ్‌
(దంతేరాస్‌ పర్వదినం రోజు ఏదైనా వస్తువు కొంటే శుభం కలుగుతుందని నార్త్‌ ఇండియన్స్‌ నమ్మకం. ఈ పర్వదినం రోజే 30వ ఏట అడుగుపెడుతున్న కోహ్లి ఈ ఏడాది బ్యాట్‌తో పరుగులు సాధించాలని సెహ్వాగ్‌ ఆకాంక్షించాడు)


‘మరిన్నీ విజయాలందించే ఇన్నింగ్స్‌ ఆడాలని కోరుకుంటూ పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి జన్మదిన శుభాకాంక్షలు’- బీసీసీఐ ( టీమిండియా ఆటగాళ్లు ధోని, జడేజా, బుమ్రాలు కోహ్లికి విషెస్‌ చెప్పిన ఓ వీడియోను సైతం బీసీసీఐ ట్వీట్‌ చేసింది.)

‘ఈ ఏడాది మరిన్ని విజయాలందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే విరాట్‌’- వీవీఎస్‌ లక్ష్మణ్‌

‘చేతిలోని మ్యాజిక్‌ స్టిక్‌తో మనందరి దృష్టిని ఆకర్షిస్తూ.. స్థిరత్వానికే కొత్త అర్థం చెప్పిన రథ సారథి.. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా.. హ్యాపీ బర్త్‌డే కోహ్లి’- మహ్మద్‌ కైఫ్‌

‘జన్మదిన శుభాకాంక్షలు బ్రదర్‌.. ఈ ఏడాది నీకు అంతా మంచే జరగాలనే కోరుకుంటున్నా’.- వృద్ధిమాన్‌ సాహా

‘బ్రో.. నీ జీవితంలో మరిన్నీ జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటున్నా’- మహ్మద్‌ షమీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement