
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యడు జోగినపల్లి సంతోష్ ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే అన్నయ్య. మరెన్నో ఏండ్లు ప్రజాసేవలో కొనసాగాలి. మరిన్ని పెద్ద పదవులను చేపట్టాలి. మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉండాలి. మీరొక ఐకాన్. సమకాలీన రాజకీయాల్లో రెండో స్థానానికి నా సోదరుడు తప్ప మరెవరూ సాటిరారని చెప్పడానికి గర్వంగా ఉంది. చిన్నప్పుడు నీతో గడిపిన రోజులు మధురమైన జ్ఞాపకాలు’ అని సంతోష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో దిగిన చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాతో పంచుకున్నారు.
అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం ‘జన్మదిన శుభాకాంక్షలు డియర్ తారక్. ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తితో ముందుకు సాగాలి’ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా కేటీఆర్ ఈరోజుతో 44వ ఏట అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అభిమానుల ట్వీట్లతో సామాజిక మాధ్యమాలు మారుమోగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment