
‘పుట్టినే ప్రేమ పడగొట్టెనే ప్రేమ.. ఏం చేశావో ఏమో కదమ్మా, ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలాకుతలం అవుతున్నానమ్మా..’ అంటూ ప్రేయసిని చూసి పాడేస్తున్నాడు గల్లీరౌడీ. ఈ రౌడీ ప్రేమ కహానీ తెలుసుకోవాలంటే మా ‘గల్లీరౌడీ’ సినిమా చూడాల్సిందే అంటున్నారు ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’.
కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాలోని ‘పుట్టినే ప్రేమ..’ పాటను సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. రామ్ మిర్యాల సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న మా సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్.
Comments
Please login to add a commentAdd a comment