
బాబు రావాలి... రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు..
‘బాబు రావాలి... రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు’, ‘ఎవరన్నా వాళ్ల మనవణ్ణి ఇంజనీర్ చేస్తాడు, డాక్టర్ చేస్తాడు... ఈ రౌడీ చేయడమేంట్రా?’, ‘నెపోటిజమ్ రా’.. వంటి డైలాగులు ‘గల్లీ రౌడీ’ టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
సోమవారం ‘గల్లీ రౌడీ’ టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ‘‘కోన వెంకట్ కథను ఫన్ రైడర్‌గా మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే నాగేశ్వరరెడ్డి తనదైన స్టైల్లో తెరకెక్కించాడు. వైవిధ్యమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నవ్వులు పంచుతారు’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ.