
కళ్లు మూసేసి..!
ఎన్టీఆర్‌కు ఈ ఏడాది అందరికంటే ముందుగా బర్త్‌డే విషెస్ చెప్పింది ఎవరో తెలుసా? ఎన్టీఆర్ తనయుడు అభయ్. విషెస్ చెబుతూ ఏం చేశాడో తెలుసా?
ఎన్టీఆర్‌కు ఈ ఏడాది అందరికంటే ముందుగా బర్త్‌డే విషెస్ చెప్పింది ఎవరో తెలుసా? ఎన్టీఆర్ తనయుడు అభయ్. విషెస్ చెబుతూ ఏం చేశాడో తెలుసా? ఎన్టీఆర్ కళ్లు మూసేశాడు! చిట్టి చిట్టి చేతులతో నాన్న కళ్లను మూసేయడమంటే... అభయ్‌కు ఇష్టమట. నిన్న (శనివారం) ఎన్టీఆర్ బర్త్‌డే. కుటుంబ సభ్యులతో కలసి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారాయన.
ఫ్యామిలీ ఫొటోలను ట్వీట్ చేస్తూ – ‘‘అభయ్ చెప్పిన ఈ ఏడాది ఫస్ట్ బర్త్‌డే విషెస్ నాకెంతో విలువైనవి. ఎందుకో తెలీదు... అభయ్ జస్ట్ లవ్స్ క్లోజింగ్ మై ఐస్’’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. సతీమణి లక్ష్మీప్రణతి ఫోన్‌లో ఎన్టీఆర్‌కు ఏదో చూపించడానికి ప్రయత్నిస్తుంటే బుల్లి అభయ్ తండ్రి కళ్లను ఎలా మూశాడో చూశారుగా... కొడుకు అల్లరికి ఎన్టీఆర్ భలే మురిసిపోతున్నారు కదూ.
గ్యారేజ్‌ను మించేలా...
ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో ఆయన మరో సినిమా చేయనున్నారు. యువసుధ ఆర్ట్స్ పతాకంపై కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవంతో నిర్మాతగా మారుతున్నా. ‘జనతా గ్యారేజ్’ను మించేలా, భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాం’’ అన్నారు సుధాకర్.