Abhay
-
సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకోకపోతే తిప్పలు తప్పవని బీజేపీ అధిష్టానం నాయకులకు హెచ్చరికలు జారీచేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యనేతలు మొదలు కిందిస్థాయి కార్యకర్తల దాకా అందరూ.. పూర్తిస్థాయిలో నిమగ్నం కావాల్సిందేనని జాతీయ నాయకత్వం స్పష్టంచేసింది. సభ్యత్వ నమోదులో నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించింది. పార్లమెంట్ ఎన్నికల్లో.. రాష్ట్రంలో పోటీచేసిన బీజేపీ అభ్యర్థులకు 77 లక్షల ఓట్లు పోలైనందున, వాటిలో 60 నుంచి 65 లక్షల దాకానైనా ఓటర్లను పార్టీ సభ్యులుగా చేర్చుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించని నాయకులను పార్టీ పదవుల్లో నుంచి తొలగిస్తామని తెలంగాణ సభ్యత్వ ఇన్చార్జి అభయ్ పాటిల్ స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సభ్యత్వ నమోదు సాగుతున్న తీరును పర్యవేక్షించారు. శని, ఆదివారాల్లోనూ ఆయన రాష్ట్రంలోని వివిధచోట్ల పర్యటించి సభ్యత్వ నమోదును పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా పాల్గొంటున్నారనే అంశంపై సమాచారాన్ని సేకరించి, నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో పారీ్టనేతలు అప్రమత్తం అయ్యారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. -
తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా అభయ్ పాటిల్
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా కర్ణాటక నేత అభయ్ పాటిల్‌ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. ఇంతకు మందు.. లోక్‌సభ ఎన్నికల టైంలోనూ తెలంగాణ బీజేపీ ఇంఛార్జిగా ఆయన వ్యవహరించారు. ఈయన పూర్తి పేరు అభయ్‌కుమార్ పాటిల్ దక్షిణ బెల్గాం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కార్యకర్తగా బీజేపీలో తన ప్రస్థానం ప్రారంభించిన అభయ్కు సోషల్ మీడియా ద్వారా యూత్‌తో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు సామాజిక కార్యక్రమాలతో పాటు మరోవైపు.. నియోజకవర్గానికి ఐటీ పార్క్ ఏర్పాటు లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు. బెలగావి అభివృద్ధి కోసం విజన్ 2040 పేరిట ఆయన ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కూడా లభించింది. -
నాలోనూ ఆ భయం ఉంది – ‘దిల్’ రాజు
‘‘రాక్షస కావ్యం’ ట్రైలర్ బాగుంది. శ్రీమాన్ మేకింగ్, టేకింగ్ బాగున్నాయి. కొత్తవాళ్లతో ప్రోడ్యూసర్ దాము మంచి ప్రయత్నం చేశాడు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకత్వంలో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ‘దిల్’ రాజు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘కరోనా తర్వాత ఓటీటీలో నెగిటివ్ కంటెంట్ బాగా పెరిగింది.. అదే సక్సెస్ అవుతోంది. నేను పాజిటివ్ కథతో ఓ మంచి సినిమా తీసినా చూడరేమో? అనే భయం కలుగుతోంది. ఎప్పుడూ హీరోలే గెలవాలా? విలన్లు గెలవొద్దా అనే పాయింట్‌తో ‘రాక్షస క్యావం’ చేశారు. నేటి ట్రెండ్‌కి, ప్రేక్షకులకు కావాల్సిన సినిమా ఇది’’ అన్నారు. -
అక్టోబర్ 6న ‘రాక్షస కావ్యం’
అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 6న “రాక్షస కావ్యం” సినిమాను గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే “రాక్షస కావ్యం” సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గత వారం విడుదల చేసిన విలన్స్ ఆంథెమ్ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయ్యింది. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమాగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. థియేటర్స్ లో ఈ సినిమాను చూడాలనే క్రేజ్ సినీప్రియుల్లో ఏర్పడుతోంది. -
సినిమా అనేది ఎంటర్టైన్ చేస్తూనే ఎడ్యుకేట్ చేయాలి
‘చాలామంది యువత రాజకీయాలు అంటూ సరైన నాయకుడిని ఎంచుకోకుండా గుడ్డిగా తిరిగి జీవితాలు పాడుచేసుకుంటున్నారు అనే బాధ నాకు ఎప్పుడూ ఉండేది. అలాంటి అంశాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి వినోదాన్ని జోడించి ఒక మంచి సినిమా చేశారు. ‘రామన్న యూత్’ సినిమా గురించి చెప్పగానే నాకు చాలా ఆనందమేసింది.ఇలాంటి సినిమాలని మనమందరం సపోర్ట్ చేయాలి’అని లోక్ సత్తా పార్టీ ఫౌండర్ డాజ జయప్రకాశ్ నారాయణ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ ను జయప్రకాష్ నారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా అనేది ఎంటర్టైన్ చేస్తూనే ఎడ్యుకేట్ చేయాలన్నారు. రామన్న యూత్ మూవీ టీజర్ చాలా బాగుందని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాక్షించారు. ‘విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయ నాయకుల కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు. ఆ యువతను కొందరు నేతలు ఎలా తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అనేది “రామన్న యూత్” సినిమాలో వినోదాత్మకంగా, ఆలోచింపజేసేలా తెరకెక్కించాం’ హీరో,దర్శకుడు అభయ్ నవీన్ అన్నారు. -
జాతీయ లక్ష్యానికి చేయూతనివ్వాలి..
సాక్షి, అమరావతి : ఇంధన పొదుపు, సామర్థ్యంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఏపీ.. జాతీయ లక్ష్యానికి మరింత చేయూతనివ్వాల్సిందిగా బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే కోరారు. మార్చి 1న న్యూఢిల్లీలోని ఇండియన్ హాబిటాట్ సెంటర్లో జరగనున్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) 21వ వ్యవస్థాపక దినోత్సవాలకు రాష్ట్రాన్ని ఆహ్వానించారు. ఈ మేరకు స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ(ఎస్డీఏ)గా ఉన్న ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఏపీఎస్ఈసీఎం)కు సమాచారం అందించడం కోసం బాక్రే ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. 2030 నాటికి ఏపీలో 6.68 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన(ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయాలనే లక్ష్యాన్ని చేరుకునే కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని బాక్రే కోరారు. -
హాసిని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్లో ‘యాక్షన్ డ్రామా- థ్రిల్లర్’
అభయ్, అస్మిత నర్వాల్, గిరిష్మ నేత్రిక హీరోహీరోయిన్లుగా హాసిని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్‌పై పాత్ లోథ్ శంకర్ గౌడ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్ సుమధుర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ పాత్ లోథ్ శంకర్ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు ఆర్ సుమధుర్ కృష్ణ మాట్లాడుతూ... యాక్షన్ డ్రామా, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో ఇంతవరకు ఏ చిత్రం రాలేదు. జనవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’ అని తెలిపారు. ‘డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను’అని హీరో అభయ్ అన్నారు. ఈ సినిమాలో నేను నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేయబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’అని అస్మిత నర్వాల్ అన్నారు. ‘ఒక మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’అని హీరోయిన్ గిరిష్మ అన్నారు. -
నిధుల వేటలో ధృవ స్పేస్
హైదరాబాద్: స్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ధృవ స్పేస్ ఒకట్రెండేళ్లలో రూ.204 కోట్ల వరకు నిధులను సమీకరించాలని భావిస్తోంది. 100 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీటీవో అభయ్ ఏగూర్ వెల్లడించారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అన్వేషిస్తున్నామని, ఔత్సాహికులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ‘ధృవ స్పేస్ ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టులకు ఎటువంటి నిధులు అవసరం లేదు. అయితే కంపెనీకి చెందిన ఇతర విభాగాలకు ఇది అవసరం కావచ్చు. పెద్ద శాటిలైట్ ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి వైపునకు కంపెనీ వెళుతోంది. ఇప్పటికే ప్రయోగించిన వాటి కంటే కొంచెం పెద్ద ఉపగ్రహాలను వచ్చే ఏడాది మధ్యలో లే దా చివరిలో కక్ష్యలో ప్రవేశపెట్టగలమని ఆశాభావంతో ఉన్నాం. ఇందుకు తగ్గ అభివృద్ధి పనులు సవ్యంగా జరుగుతున్నాయి. ధృవ స్పేస్ రూపొందించిన నానో ఉపగ్రహాలు తైబోల్ట్–1, తైబోల్ట్–2 శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ–సీ54 ఉపగ్రహ ప్రయోగనౌక ద్వారా ఇస్రో నవంబర్ 26న విజయవంతంగా ప్రయోగించింది. వీటి విజయం తర్వాత సంస్థ ప్రస్తుతం పీ30 ప్లాట్ఫామ్లో కమ్యూనికేషన్స్, సైంటిఫిక్ అప్లికేషన్స్‌ను విస్తృతంగా అందజేసే 30 కిలోల బరువున్న ఉపగ్రహంపై పని చేస్తోంది’ అని అభయ్ పేర్కొన్నారు. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుకోవడం మొదలైందని, ప్రస్తుతం కంపెనీ బృందం ఈ మిషన్‌ను కొనసాగించడంలో, ఉపగ్రహాలను నిర్వహించడంలో బిజీగా ఉందన్నారు. దశాబ్దకాలం పూర్తి చేసుకున్న ధృవ స్పేస్ ఇప్పటి వరకు రూ.65 కోట్ల నిధులను అందుకుంది. -
23న విశాఖలో ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సు
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్ట్మెంట్ బజార్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సమన్వయంతో 23న విశాఖలో నిర్వహించనున్నట్టు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ప్రకటించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఏపీఎస్ఈసీఎం అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య సాంకేతికతను అందుబాటులోకి తేవటం, దానిని వినియోగించుకోవడం కోసం పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించడమే లక్ష్యంగా ఆసక్తి గల పరిశ్రమలను, బ్యాంకులను, ఆర్థిక సంస్థలను ఒకే వేదిక పైకి తెచ్చేందుకు సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బజార్ వేదికగా పెట్టుబడులకు అవకాశమున్న ప్రాజెక్టులను గుర్తిస్తామని, సదస్సులో ఎంపికైన పరిశ్రమలకు ప్రాజెక్టులు అమలు చేసేందుకు ఆర్థిక సహకారం అందే ఏర్పాటు చేస్తామని అభయ్ బాక్రే చెప్పారు. గతేడాది మార్చిలో ఇదే విశాఖలో దేశంలో తొలిసారిగా ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సును నిర్వహించిన ఘనత ఏపీకి దక్కుతుందని, విద్యుత్ రంగంలో ప్రత్యేకించి ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఏపీ పనితీరును గుర్తించి మరోసారి విశాఖలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పరిశ్రమల నుంచి ఏపీఎస్ఈసీఎంకు ప్రతిపాదనలు వస్తే వాటికి అవసరమైన సాంకేతిక ప్రక్రియ నిర్వహించి, ఆర్థిక సంస్థలకు పంపుతామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సమావేశంలో ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ చర్యలు భేష్
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ప్రశంసించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) అధికారులతో బాక్రే ఆదివారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. తొలుత ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు అభయ్ బాక్రేకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 18.8 గిగావాట్లు ఉండగా, అందులో 40 శాతం (7.5 గిగా వాట్లు) పునరుత్పాదక ఇంధన ఉత్పత్తే అని తెలిపారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ఇతర రాష్ట్రాలకు కూడా పునరుత్పాదక ఇంధనాన్ని ఎగుమతి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం అభయ్ బాక్రే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య రంగాలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. ఏపీ, కేరళ తరహాలో అన్ని రాష్ట్రాలు ఇంధన సామర్థ్య విభాగాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన సామర్థ్యం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఏపీఎస్ఈసీఎం అధికారులకు బాక్రే సూచించారు. ఈ సమావేశంలో ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇంధన రంగంలో భారీ పెట్టుబడులకు ఆస్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సామర్థ్య రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తెలిపారు. అలాగే పెట్టుబడులకు ఏపీలో సానుకూల వాతావరణం కూడా ఉందన్నారు. జాతీయ స్థాయిలో 2031 నాటికి రూ.10.02 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముందని వెల్లడించారు. ఏపీ ఇంధన సంరక్షణ మిషన్ అధికారులతో బాక్రే ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన రంగంలో పెట్టుబడుల వల్ల పారిశ్రామిక, రవాణా, భవన నిర్మాణం, తదితర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దీనివల్ల ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన మెరుగవుతుందన్నారు. ఇంధన రంగంపై ప్రభుత్వం చేసే వ్యయం తగ్గుతుందని.. దీంతో పర్యావరణం కూడా మెరుగవుతుందని బాక్రే వివరించారు. ఇంధన సామర్థ్య రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ఆయన అభినందించారు. రోడ్ మ్యాప్‌ను రూపొందించాలి.. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు ద్వారా అన్ని రంగాల్లో 15,787 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేసేందుకు అవకాశం ఉందని అజయ్ బాక్రే తెలిపారు. 2030 నాటికల్లా 6.68 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్విలెంట్ (ఎంటీవోఈ) ఇంధనాన్ని పొదుపు చేయాలనే లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని ఏపీ ఇంధన సంరక్షణ మిషన్‌కు సూచించారు. జాతీయ స్థాయిలో 2030 నాటికి 150 ఎంటీవోఈ ఇంధనాన్ని పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పారిశ్రామిక రంగాల్లో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల్లో రాష్ట్రం కనబరుస్తున్న ఉత్తమ పనితీరుని చూసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)ని సహాయక ఏజెన్సీగా నియమించినట్లు తెలిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సాగర్ కాల్వలో ముగ్గురి గల్లంతు.. బాలుడిని కాపాడే కంగారులో ఈత రాకున్నా..
సాక్షి, ఖమ్మం: నగరంలోని సాగర్ ప్రధాన కాల్వ లో దానవాయిగూడెం వద్ద ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లోని అభయ్ ఆయుర్వేదిక్ ఆస్పత్రి శాఖల్లో పనిచేసే కేరళకు చెందిన ఏడుగురు వారాంతంలో భాగంగా ఖమ్మంలో కలుసుకున్నారు. సరదాగా సాగర్ కాల్వలో ఈతకు వెళ్లగా ముగ్గురు గల్లంతయ్యారు. కోదాడ నుంచి వచ్చిన ప్రదీప్, షాజీ, సూర్యాపేట నుంచి వచ్చిన అభయ్ సంతోష్, ఖమ్మంలో ఉన్న పరకాల సోను, వివేక్, షిబ్బు తోపాటు, ఖమ్మం మేనేజర్ సోను కుమారుడైన 11 సంవత్సరాల బాలుడు షారోన్ కలిసి అదివారం సరదాగా ఈతకు వెళ్లారు. ప్రదీప్, షాజీ, షిబ్బులు ఈతకోసం కాల్వలో దిగారు. మిగిలినవారు ఒడ్డున కూర్చున్నారు. బాలుడు షారోన్ ప్రమాదవశాత్తు కాల్వలో జారి పడ్డాడు. చదవండి: ('అమ్మ, నాన్నను కలపండి సారూ..’: శాన్విత) ఇది గమనించిన తండ్రి పరకాల సోను దూకగా..ఈత రాకున్నా కాపాడే కంగారులో వివేక్, అభయ్ సంతోష్‌లు కూడా కాల్వలోకి దూకారు. పిల్లాడిని ప్రదీప్ కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. తండ్రి సోనును ఈతరాని ఇద్దరు వ్యక్తులు గట్టిగా పట్టుకోవడంతో ముగ్గురూ నీటిలో గల్లంతయ్యారు. ఖానాపురం హవేలి ఎస్ఐ మౌలానా ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. -
గన్ను కాదు.. పెన్ను పట్టండి
మల్కన్‌గిరి: కుటుంబ సభ్యులకు శాంతియుత జీవనాన్ని అందించేందుకు మావోయిస్టులు జనజీవన శ్రవంతిలోకి రావాలని రాష్ట్ర డీజీపీ అభయ్ కోరారు. చిన్నారులకు బంగారు భవిష్యత్ కోసం గన్ను పట్టిన చేతులతో పెన్ను అందించాలని పిలుపునిచ్చారు. కొరాపుట్ జిల్లాలోని మత్తిలి సమితి తులసిపహడ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఎన్కౌంటార్లో భాగస్వామ్యమైన ఆంధ్రప్రదేశ్, ఛత్తిస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు పోలీసు అధికారులతో రహస్య సమావేశం నిర్వహించారు. మావోయిస్టులను ఎలా అణచి వేయాలనే కార్యచరణపై చర్చించారు. మల్కన్‌గిరి జిల్లా సరిహద్దులో ముడు రాష్ట్రాల పోలీసు బృందాలతో సంయుక్తంగా కూంబింగ్ జరపాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని స్పష్టంచేశారు. మల్కన్‌గిరి జిల్లా ప్రస్తుతం అధివృద్ధి పథంలో నడుస్తోందని, స్థానిక కటాఫ్ ఏరియాలో అమాయక గిరిజనులను తప్పదోవ పట్టించవద్దని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని, కుటుంబాలకు ప్రశాంతమైన జీవనాన్ని అందించేందుకు జనంలోకి రావాలని సూచించారు. అలాగే ఎన్కౌంటర్లో పాలుపంచుకున్న పోలీసు దళాలను డీజీపీ అభినందించారు. అనంతరం ఎన్కౌంటర్లో స్వా«దీనం చేసుకొన్న మృతదేహలు, ఇతర సామగ్రీని విలేకర్ల ముందు ప్రదర్శించారు. ముగ్గురివీ.. మూడు రాష్ట్రాలు ఎన్కౌంటర్లో పోలీసులు స్వా«దీనం చేసుకున్న ఆయుధాల్లో ఎస్ఎల్ఆర్ రైఫిల్(1), ఏకే–47(1), ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్లు(3), కిట్ బ్యాగ్‌లు, బుల్లెట్లు, వాకీటాకీలు, మావోయిస్టు సాహిత్యం, విద్యుత్ వైర్లు, రేడియో, కత్తులు, జిలిటెన్ స్టిక్‌లు, ఇతర సామగ్రీ ఉన్నాయి. మృతిచెందిన మావోయిస్టులలో... మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి సుదకొండ గ్రామానికి చెందిన అనీల్ అలియాస్ కిషోర్ అలియాస్ దాసరి అలియాస్ ముకసోడి. ఆంధ్ర–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీలో ఏసీఎంగా ఉన్నాడు. ఆయనపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సోనీపై రూ.4 లక్షలు రివార్డు ఉంది. ఆమె మావోయిస్టు అగ్రనేత అరుణక్క రక్షణ బృందంలో ఏసీఎంగా పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా పెదబాయిల్ గ్రామానికి చెందిన చిన్నారావు పార్టీ సభ్యుడు ఉన్నారు. అరుణక్క రక్షణ బృందంలోనే పని చేస్తున్నాడు. ఇతనిపై రూ.లక్ష రివార్డు ఉంది. పర్యటనలో ఐజీ ఆపరేషన్స్ అమితాబ్ ఠాకూర్, ఇంటిలిజెన్స్ డీఐజీ అనువృద్ధసింగ్, దక్షణాంచల్ డీఐజీ రాకేష్ పండిట్, మల్కన్‌గిరి ఎస్పీ ప్రహ్లాద్స్వొయి మిన్నా, ఇతర పోలీసుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాత్రివేళల్లో డ్రాపింగ్‌కు అభయ్ వాహనాలు
చిత్తూరు అర్బన్ : మహిళల భద్రత కోసం చిత్తూరు పోలీసులు వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో చోటుచేసుకున్న దిశ హత్యాచారం దేశ వ్యాప్తంగా చర్చలకు, నిరసనలను దారితీసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు.. మహిళల భద్రత కోసం గురువారం నుంచే పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ వివరాలను ఎస్పీ సెంథిల్‌కుమార్ వివరించారు. ఆయన మాటల్లోనే.. అభయ్ వాహనాలు.. జిల్లా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నిలయం కావడంతో జాతీయ రహదారులపై నిత్యం వాహనాల రాకపోకలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారిలో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. ఇక ఉన్నత విద్యను అభ్యసించే యువతులు కూడా ఉన్నారు. మహిళలు ఒంటరిగా వెళ్లాల్సినప్పుడు నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నా, రాత్రివేళ, రవాణా సౌకర్యం లేకున్నా, వాహనాలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా వెంటనే డయల్–100కు ఫోన్ చేయాలి. సహాయార్థులను గమ్యస్థానానికి చేర్చడానికి అభయ్ వాహనాలను ఏర్పాటు చేశాం. ఫోన్ చేసిన కొద్దిసేపట్లోనే పోలీసు వాహనాలు వచ్చి వారి వెళ్లాల్సిన చోటుకు చేరుస్తారు. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. మహిళా మిత్ర ఏర్పాటు.. మహిళలు, బాలికల సంరక్షణ కోసం మహిళామిత్ర పేరిట కొత్త కార్యక్రమాన్ని రూపొందించాం. రెండు మూడు రోజుల్లో దీన్ని ప్రారంభిస్తున్నాం. చిత్తూరు కేంద్రంగా పనిచేస్తున్న ఉమెన్–జువైనల్ వింగ్‌ను జిల్లా మొత్తం విస్తరిస్తాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళామిత్ర ఉంటారు. సర్కిల్ పరిధిలో కనీసం ఎనిమిది మంది పోలీసులతో ప్రత్యేక బృందాలను నియమిస్తున్నాం. ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ బృందాలు మహిళలకు అండగా నిలవడంతో పాటు కళాశాలలు, విద్యాసంస్థలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సంచరిస్తూ మహిళల భద్రతను పర్యవేక్షిస్తాయి. వీడియోల ప్రదర్శన.. పిల్లలకు మంచి ఏదో, చెడు ఏదో తెలియాల్సిన సమయం ఇది. ఎదుటి వ్యక్తి పైన చెయ్యి వేస్తే ఏ ఉద్దేశంతో వేస్తున్నాడో పిల్లలు పసిగట్టాలి. ఇందుకోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో గుడ్, బ్యాడ్ టచ్ పేరిట వీడియోలు రూపొందించాం. వీటిని పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శించనున్నాం. ఇబ్బందికర పరిస్థితుల్లో ఏం చేయాలి..? చాకచక్యంగా తప్పించుకోవడం ఎలా..? పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వాలి..? అనే దానిపై జిల్లా వ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్
కొత్త హీరో అభయ్ హీరోగా, మేఘా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతూ పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్రలో నటించిన సినిమా ‘మార్షల్’.. ఏవీఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జయరాజ్ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సినిమా సక్సెస్ అవడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సంధర్భంగా దర్శకుడు జయరాజ్ సింగ్ మాట్లాడుతూ.. విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మార్షల్’ సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మార్షల్ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని శ్రీకాంత్ అన్న ఇంత మంచి క్యారెక్టర్ చేయడం వల్లే సినిమా హిట్ అయ్యిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కొత్త హీరో అభయ్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని జయరాజ్ సింగ్ అన్నారు. తన సినిమాని ఆదరించినందకు హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. హీరోయిన్ మేఘా చౌదరి మాట్లాడుతూ.. సినిమా విడుదలైన తర్వాత ప్రతీ ఒక్కరి నుంచి వస్తున్న అభినందనలు వింటుంటే చాలా సంతోషంగా ఉందని, సినిమాని ప్రతీ ఒక్కరూ చూసి బాగా చేశానని అంటున్నారని, ఇంకా చూడనివాళ్లు ఉంటే తప్పకుండా వెళ్లి సినిమా చూడాలన్నారు. హీరో అభయ్ మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అవ్వడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీడియా సోదరులకు థ్యాంక్స్ చెప్పిన అభయ్.. ఫస్ట్ రోజు చాలా డల్ గా ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయని, కానీ రెండోరోజు నుంచి మౌత్ టాక్ తో ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తున్నారని అన్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ ఇచ్చిన క్రిటిక్స్ అందరికీ పేరపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మౌత్ టాక్ తో పాటు ప్రేక్షకులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అందుకు కారణం శ్రీకాంత్ అని.. హీరోగా ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నానని అన్నారు. నిర్మాతగా కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అవడంతో చాలా సంతోషంగా ఉన్నానని, ప్రతీ ఒక్కరూ సినిమా చూసి ఫోన్ చేసి చెబుతున్నారని, డైరెక్టర్ గురించి అడుగుతున్నారని, ఈ మధ్య కాలంలో నా సినిమాల్లో ఇది ఒక మంచి సినిమాగా నిలిచిపోయిందని అన్నారు. క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి అప్లాజ్ వచ్చిందని అన్నారు. సినిమాకు అవార్డులు కూడా వస్తాయని అంటున్నారని, అందులో డైరెక్టర్ కష్టం చాలా ఉందని అన్నారు. జయరాజ్ కచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతారని అన్నారు. మహాత్మ, ఖడ్గం సినిమాల తర్వాత అంత వైవిద్యమైన క్యారెక్టర్ ఇదేనని కొత్త హీరో అయినా కూడా అభయ్ చాలా బాగా చేశాడని, ప్రొడ్యూసర్ గా కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడని అన్నారు. ఒక్కసారి సినిమా చూడండి. నచ్చితే నలుగురికి చెప్పండని కోరారు. -
నా సినిమాల్లో మార్షల్ బెస్ట్
‘‘మార్షల్’ సినిమాతో అభయ్ నటుడిగా, నిర్మాతగా తెలుగు తెరకు పరిచయం అవడం ఆనందంగా ఉంది. ఈ మధ్య కాలంలో నేను చేసిన సినిమాల్లో ఈ సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా’’ అని శ్రీకాంత్ అన్నారు. అభయ్, మేఘా చౌదరి జంటగా శ్రీకాంత్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్’. జై రాజాసింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్లో నిర్మించారు. ఈ సినిమా రేపు విడుదలవుతోంది.హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అభయ్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమిది. సాంగ్స్, ఫైట్స్, మదర్ సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. స్వామిగారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నేను బాగా నటించడానికి శ్రీకాంత్‌గారు సపోర్ట్ చేశారు. ఆయనకి, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి’’ అన్నారు. ‘‘మొదటి సినిమాతోనే అభయ్ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాడు. భవిష్యత్తులో అతను నటుడిగా మరో మెట్టు ఎక్కాలి’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘కథ విన్న వెంటనే ఈ సినిమా చేయడానికి అభయ్ ఒప్పుకున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శ్రీకాంత్‌గారికి థ్యాంక్స్. కొత్త పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.. ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు జై రాజాసింగ్. -
‘మార్షల్’ పెద్ద హిట్ అవుతుంది : శ్రీకాంత్
మార్షల్ సినిమా తనకు బాగా నచ్చిందని ప్రముఖ హీరో శ్రీకాంత్ అన్నారు. ఈ మూవీ పెద్ద హిట అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన మార్షల్ చిత్రంలో హీరో శ్రీకాంత్ ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హీరో అభయ్ తన సోంత బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీకాంత్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ... అభయ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవ్వడం ఆనందంగా ఉందన్నారు. తను మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నట్టు చెప్పారు. హీరోగానే కాకుండా ఈ సినిమాతో నిర్మాతగా ఒక అడుగు ముందుకు వెయ్యడం సంతోషంగా ఉందన్నారు. మార్షల్ సినిమా చూసానని.. తను ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో ఈ మూవీ బెస్ట్ అని తెలిపారు. అభయ్ మాట్లాడుతూ...‘మా మార్షల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. అన్నీ జాగ్రత్తలు తీసుకొని మేము ఈ సినిమా తీశాము. స్వామి గారు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా గ్రాండ్‌గా వచ్చింది. నేను బాగా నటించడానికి చేయడానికి శ్రీకాంత్ సపోర్ట్ చేశారు. సెట్లో ఆయన చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. సాంగ్స్, ఫైట్స్, మదర్ సెంటిమెంట్ ఇలా అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. శ్రీకాంత్‌కు నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ఎప్పుడు వచ్చినా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈ సినిమా అలాగే అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్న’ట్టు తెలిపారు. డైరెక్టర్ జయరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మా హీరో, నిర్మాత అభయ్ నేను ఈ కథ చెప్పినప్పుడు విన్న వెంటనే చెయ్యడానికి ఒప్పుకున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శ్రీకాంత్ గారికి థాంక్స్. కొత్త పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. సెప్టెంబర్ 13న విడుదల అవుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంద’ని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘అభయ్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం సంతోషం. మొదటి సినిమాతోనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. భవిష్యత్తులో అతను నటుడిగా మరో మెట్టు ఎక్కాలని కోరుకుంటున్నాన’ని తెలిపారు. వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ.. ‘నాకు ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన హీరో అభయ్కు థాంక్స్. నేను ఈ సినిమాలో రాసిన పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాన’ని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్సుర్ మాట్లాడుతూ...‘కేజీఎఫ్ సినిమా తరువాత నేను ఒప్పుకున్న సినిమా మార్షల్. కథ నచ్చి వెంటనే ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించాను. దర్శకుడు ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిర్మాత, హీరో అభయ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడు. సినిమా బాగా వచ్చింద’ని అన్నారు. హీరోయిన్ మేఘా చౌదరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్ర మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అభయ్ తో కలిసి నటించడం బెస్ట్ మెమోరీస్‌ను ఇచ్చింది. సెప్టెంబర్13న వస్తున్న మా సినిమాను చూసి ఆదరించండి. హీరో శ్రీకాంత్ సెట్స్ లో బాగా సపోర్ట్ చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు’ అని తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో రష్మి సమాంగ్, సుమన్, వినోద్‌కుమార్, శరణ్య, పృథ్వీరాజ్, రవిప్రకాష్, ప్రియదర్శిని రామ్, ప్రగతి, కల్పవల్లి, సుదర్శన్ తదిరులు నటిస్తున్నారు. వరికుప్పల యాదగిరి సంగీతం అందించగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్, మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల, ఫైట్స్ : నాభ, సుబ్బు, ఎడిటర్ : చోట కె ప్రసాద్, పాటలు : యాదగిరి వరికుప్పల, కళా దర్శకుడు : రఘు కులకర్ణి, డాన్స్ మాస్టర్ : గణేష్, ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్నరావు ధవళ, నిర్మాత : అభయ్ అడకా. -
‘మార్షల్’కు ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్
అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం సైంటిఫిక్ థ్రిల్లర్ ‘మార్షల్’.. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సినిమా విశేషాలను తెలియజేశారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ ‘మార్షల్’ సినిమా చూసి కంటెంట్ నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాకు రీ రికార్డింగ్, 2 పాటలను సమకూర్చారని తెలిపారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లకు పైగా రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత, హీరో అభయ్ తెలిపారు. ఈ సినిమాలో శ్రీకాంత్ పోషించిన పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తండిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
అట్టహాసంగా ‘మార్షల్’ ఆడియో ఆవిష్కరణ
అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 19న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో, టీజర్ అవిష్కరణ ఇటీవలే గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరై... ఆడియోను ఆవిష్కరించారు. ఆడియో సీడీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ‘హీరో అభయ్ కథానాయకుడిగా.. నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించి... తన జన్మస్థలమైన గుంటూరులోనే ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’నని అన్నారు. నిర్మాత, హీరో అభయ్ అడకా మాట్లాడుతూ ‘నేను పుట్టి పెరిగిన గుంటూరులో నా తొలిచిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఇంత మంది పెద్దల సమక్షంలో చేయడం ఆనందంగా వుంది. ఇదో వైవిద్యభరితమైన చిత్రం. మార్షల్‌తో ఓ మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంద’ని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమా అన్ని వర్గాల వారికి నచ్చేలా ఉంటుంది. నిర్మాత మరియు హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంటుందని వివరించారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశార’ని చెప్పారు. ‘కె జి ఎఫ్’ మ్యూజిక్ ఫేమ్ రవి బసురి తెలుగు సినిమా మార్షల్ సినిమా కంటెంట్ ప్రత్యేకంగా నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాలో రీ రికార్డింగ్ తో పాటు 2 పాటలను సమకూర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, ముస్తఫా మరియు మద్దాల గిరి, బోనబోయిన శ్రీనివాసయాదవ్, నిమ్మకాయల రాజా నారాయణ, హీరోయిన్ మేఘా చౌదరి పాల్గొన్నారు. -
నాడు సామాన్యులు.. నేడు అసామాన్యులు
సాక్షి, హైదరాబాద్ : ‘రెండేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు ఎంపికైన వారంతా సామాన్యులే. వారి పట్టుదలే వారిని ఈ రోజు అసామాన్యులుగా సమాజానికి పరిచయం చేస్తోంది’ అని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభయ్ అన్నారు. 24వ తేదీన ఐపీఎస్ 2017 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం బ్యాచ్ క్యాడెట్లను మీడియాకు పరిచయం చేశారు. ఈ బ్యాచ్‌లో ఎంపికైన వారంతా సామాన్య కుటుంబాలవారేనని, మారుమూల పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన వారేనని వెల్లడించారు. వీరంతా ఇప్పుడు సమాజసేవకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. మొత్తం 92 మందిలో 80 మంది పురుషులు, 12 మంది మహిళలు. అందులో ఆరుగురు రాయల్ భూటాన్ పోలీసు, ఐదుగురు నేపాల్ పోలీస్ విభాగానికి చెందిన విదేశీయులున్నారు. ట్రైనీలంతా చాలా కష్టపడి శిక్షణ పూర్తి చేశారని వివరించారు. వీరందరికీ కఠోర శిక్షణ ఇచ్చామని, 40 కి.మీ.ల దూరం మేర 10 కేజీల భారాన్ని మోస్తూ ఎండలో ఆగకుండా పరుగులు పెట్టించామన్నారు. దేశంలోని అత్యున్నత దర్యాప్తు, నిఘా సంస్థలతోనూ వీరికి దశలవారీగా శిక్షణ ఇచ్చామని వివరించారు. ఢిల్లీకి చెందిన గౌస్ ఆలం, యూపీకి చెందిన రిచా తోమర్, బెంగాల్‌కు చెందిన పలాష్ చంద్ర, నేపాల్‌కు చెందిన క్రిష్ణ కడ్కా, అను లామాలు ఈ బ్యాచ్‌లో వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచారని తెలిపారు. తెలంగాణకు ముగ్గురు, ఏపీకి ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేటాయించారు. 24వ తేదీన దీక్షంత్ పరేడ్ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు.. తెలంగాణకు చెందిన గరికపాటి బిందు మాధవ్, వాసన విద్యాసాగర్ నాయుడు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తుహిన్ సిన్హా ఏపీ కేడర్‌కు ఎంపికయ్యారు. ఢిల్లీకి చెందిన గౌస్ ఆలం, కర్ణాటకకు చెందిన డాక్టర్ వినీత్, డాక్టర్ శబరీశ్‌లను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. తెలంగాణకు చెందిన బీబీజీటీఎస్ మూర్తిని యూపీకి కేటాయించారు. ఏపీకి చెందిన కేవీ అశోక్‌ను యూపీ, బోగాటి జగదీశ్వర్‌రెడ్డిని త్రిపుర, మల్లాది కార్తీక్‌ని మణిపూర్ కేడర్‌కు కేటాయించారు. ఇంజనీర్లు, డాక్టర్లదే పైచేయి.. ఈసారి బ్యాచ్‌లో విద్యార్హతల పరంగా ఇంజనీర్లు, డాక్టర్లదే పైచేయిగా నిలిచింది. మొత్తం 92 మంది ఐపీఎస్ అధికారుల విద్యా నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఆర్ట్స్–7, సైన్స్–5, కామర్స్–02, ఇంజనీరింగ్–57, మెడిసిన్–11, ఎంబీఏ–7, ఇతరులు–3 మంది ఉన్నారు. -
నమ్మకంగా ఉన్నాం
శ్రీకాంత్ విభిన్న పాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్’. ఈ చిత్రంతో అభయ్ హీరోగా పరిచయమవుతున్నారు. జై రాజసింగ్ దర్శకత్వం వహించారు. మేఘాచౌదరి, రష్మి సమాంగ్ కథానాయికలు. ఏవీఎల్ ప్రొడక్షన్‌పై అభయ్ అడక నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. సమాజానికి మంచి సందేశం కూడా ఉంటుంది. ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. టీజర్ 20 లక్షల వ్యూస్ సాధించి, అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే 20 లక్షల వ్యూస్ రావడంతో ఈ చిత్రంపై ముందు నుంచి మాకు ఉన్న నమ్మకం మరింత పెరిగింది. ఇటీవల హిట్స్‌గా నిలిచిన చిత్రాల జాబితాలో మా ‘మార్షల్‘ కూడా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల, కెమెరా: స్వామి ఆర్. యమ్. -
‘మా నమ్మకాన్ని మరింత పెంచింది’
పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ కీలక పాత్రలో అభయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘మార్షల్’. ఏవీఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ ఈనెల 5న తలసాని గారి చేతులమీదగా విడుదలైంది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన గంటల్లో హాఫ్ మిలియన్ వ్యూస్ రాబట్టి ఈ టీజర్ అదే దూకుడుతో 2 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే 20 లక్షల వ్యూస్ రావడం.. ఈ చిత్రంపై ముందు నుంచి మాకు గల నమ్మకాన్ని మరింత పెంచింది. ఇటీవల కాలంలో ట్రెండ్ సిట్టింగ్ హిట్స్ గా నిలిచిన చిత్రాల జాబితాలో మా ‘మార్షల్’ కూడా కచ్చితంగా స్థానం పొందుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. -
చిన్న సినిమాలను ఆదరించాలి
‘‘కొత్తవాళ్లు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. ఇండస్ట్రీ కూడా ప్రాంతాల విభేదం లేకుండా ప్రతిఒక్కరినీ ఆదరించాలి. సినిమా ఇండస్ట్రీ అనేది లక్షలాదివాళ్లకి ఉపాధి కల్పిస్తు్తంది. చిన్న సినిమాలకు ప్రమోషన్ ఎంతో అవసరం. అందరం చిన్న చిత్రాలను ఆదరించాలి’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శ్రీకాంత్, మేఘాచౌదరి, అభయ్ ముఖ్య పాత్రల్లో జైరాజాసింఘ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మార్షల్’. ఏవీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభయ్ అదాక నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఇండస్ట్రీకి ఎంతమంది కొత్తవారు వస్తే అంత కొత్త కథలు వస్తాయి. అభయ్‌కి, జైరాజాసింఘ్కి ఈ సినిమా మొదటి చిత్రంలా లేదు. ఎంతో అనుభవం ఉన్నవారిలా తీశారు. ‘జెర్సీ’ సినిమా కూడా చాలా బావుంది. ‘మార్షల్’ చిత్రం మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. అభయ్ మాట్లాడుతూ– ‘‘ఒక నటుడిగా, నిర్మాతగా నా ప్రయత్నం వెనుక ముందునుంచి నా వెన్నంటే ఉన్న తలసానిగారికి కృతజ్ఞతలు. శ్రీకాంత్ అన్న కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన లేకుంటే ఈ సినిమా లేదు. జయ్‌రాజ్ తన సొంత సినిమాలాగా చేశారు’’ అన్నారు. ‘‘మెడికల్ యాక్షన్ మూవీ ఇది. ఒక మనిషి ఇంత ఈజీగా బతుకుతున్నాడంటే దానికి కారణం ఒక సైంటిస్ట్. అందులోంచి వచ్చిన కథే ‘మార్షల్’ అన్నారు జైరాజాసింఘ్. ‘‘నేను కథ విన్నాక రెండురోజులు టైం అడిగి ఓకే చెప్పాను. పైగా కొత్త దర్శకుడుకి అవకాశం ఇవ్వాలనుకున్నా. ఈ సినిమా చూశాక తప్పకుండా అందరూ మెచ్చుకుంటారు’’ అని శ్రీకాంత్ అన్నారు. మేఘాచౌదరి మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల, నేపథ్య సంగీతం: కె.జి.ఎఫ్.రవిబాసుర్, కెమెరా: స్వామీ ఆర్.ఎం. -
సమాజానికి సందేశం
అభయ్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మార్షల్’. జై రాజసింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషించారు. మేఘా చౌదరి కథానాయిక. ఏవీఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై అభయ్ అడకా నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. జై రాజసింగ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మార్షల్’. అభయ్ అడకా పాత్ర హుందాగా, కొత్తగా ఉంటుంది. శ్రీకాంత్ మంచి పాత్ర చేశారు. ఆర్.యం. స్వామి సినిమాటోగ్రఫీ, యాదగిరి వరికుప్పల సంగీతం, నాభ, సుబ్బుల ఫైట్స్ ఎసెట్స్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘వైవిధ్యభరితమైన చిత్రం ‘మార్షల్’. మంచి సందేశం కూడా ఉంటుంది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అని అభయ్ అడకా అన్నారు. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మార్షల్’
పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా అభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం ‘మార్షల్’. ఏ వి ఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు జై రాజ సింగ్ మాట్లాడుతూ 2019 లో విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, కొత్తగా ఉంటుందన్నారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారని తెలిపారు. ఆర్.యం.స్వామి సినిమాటోగ్రఫీ, యాదగిరి వరికుప్పల సంగీతం ఎసెట్స్ గా నిలుస్థాయన్నారు. నిర్మాత అభయ్ అడకా మాట్లాడుతూ మంచి మెసేజ్ ఉన్న వైవిద్యభరితమైన చిత్రం మార్షల్ అన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తామన్నారు.