
గీత్ షా, అభయ్
అభయ్, గీత్ షా జంటగా నాగరాజు తలారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జిగేల్ జిగేల్’. శ్రీ నవ నారాయణ సినీ క్రియేషన్స్ పతాకంపై అంజనప్ప, నాగరాజ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సింగర్ నేహా మౌష్మి కెమెరా స్విచ్చాన్ చేయగా, పారిశ్రామికవేత్త పట్నం యాదగిరి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు టిన్. రాజు గౌరవ దర్శకత్వం వహించారు. నాగరాజు తలారి మాట్లాడతూ– ‘‘యాక్షన్, సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. వినోదం కూడా జోడించాం.
మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ కంప్లీట్ చేయనున్నాం. మూడు ఫైట్లు, ఐదు పాటలు ఉంటాయి’’ అన్నారు. ‘‘నా మొదటి చిత్రం ‘సుడిగాలి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘జిగేల్ జిగేల్’ రెండవ సినిమా’’ అన్నారు అభయ్. ‘‘ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమా నిర్మిస్తున్నాం. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. హీరోయిన్ గీత్‌షా, చిత్ర సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి బైపల్లి.
Comments
Please login to add a commentAdd a comment