
కిరణ్ అబ్బవరం హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా విశ్వ కరుణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శివం సెల్యులాయిడ్స్‌పై రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాతలు డి. సురేష్‌బాబు, ఏఎమ్ రత్నం కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు.
‘‘సరికొత్త ప్రేమకథా చిత్రమిది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఉంటుంది’’ అన్నారు రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బి. సురేష్ రెడ్డి, సంతోష్, సంగీతం: సామ్ సీఎస్, కెమెరా: విశ్వాస్ డానియేల్.
Comments
Please login to add a commentAdd a comment